18, మే 2017, గురువారం

Mallapragada ramakrishna Telugu Stories- 17

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

ప్రేమంటే ఇదేనా ?

అప్పుడే అడుగు పెట్టింది కొత్తకాపురానికి, కోటి ఆశలతో,ఆశయాలతో ఒకవైపు ఉద్యోగం చేయాలి, మరోవైపు కాపురాన్ని సరిదిద్దు కోవాలి, అదే ఈనాటి స్త్రీకి, భర్త కూడా  అవకాశవాదిగా మారి పోతున్నాడు, ఈ  తప్పు ఎవరిదో  మీరే ఈ కధబట్టి మిరే చెప్పగలరు కథానాయికి ఆనందీ, కథానాయకుడు  ఆనందరావు . ఇక చదవండి. 

కంటికి కునుకు రాదు, ఎంతసేపు వేచి చూసిన గడియారం కదులుతుంది తప్ప, మనసులో వేధిస్తున్న ఆలోచనలకు దారి దొరకక, నోరు విప్పి చెప్పుకోలేక, సన్మార్గంలో నడుస్తున్న అనుమానం బీజంతో ఉన్నవానికి అంతా దుర్మార్గంగా కనిపిస్తున్నది, ఎప్పుడో చేసిన తప్పును పదే పదే వల్లిస్తూ,  ఎప్పుడూ  వెకిలి చేష్టలతో, మానసికంగా హింసించి సంతోష పడేవారు మావారు, అని తలుస్తూ వాకిటముందు కూర్చొని ఉన్నది ఆనందీ, ఆనందం అంటే ఏమిటో తెలియదు, పెళ్లయిన ఒక్కసిన్మాకు పోవటం, హోటల్ కు పోవటం అనేదిలేదు, చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగి, పెళ్ళైన సుఖపడాలని ఆశతో జీవిస్తూ ఉన్న మహిళ.

నెమ్మదిగా పాడుకుంటున్నది, నీలి కన్నుల కృష్ణా, వాలు చూపులతో ఉడికిస్తున్నావా కృష్ణా, నీ నవ్వులో రాలు రత్నాలు, నీ కాలి  మువ్వల శబ్దం నన్ను ఒక్క నిముషము  కూడా  నిలవ నీయుటలేదు, నా మేని సొగసులు, అమాయకపు నడకలు, హొయలు పోయే నీకోసం, ఈ పండు వెన్నెల, ఆ పూల గంధాలు వేచి వున్నాయి మనకోసమే, అందుకొని అల్లుకోగా రారా..నా మనసే నీదిరా, నీవంటే నేనురా వెన్నెల స్నానాలు చేద్దాం.......రారా, ఇద్దరమూ ఒకటయ్యి, ఏలుదాము ఈ రస జగతిని., ..

రోజూ జరిగే భారతమే ఈరోజు మరీ ఎక్కువ అయింది, బాగుగా త్రాగి,  పచ్చి బూతులు పలుకుతూ, ఇంట్లోనించి బయటకుపో, నా కళ్ళ ఏదుట కనబడ వద్దు, నేను మారను, ఉండ గలిగితే ఉండు, లేకపోతె తక్షణం, బయటకు నడువు అన్న మాటలకు ఓర్పు నశించి, దుర్మా ర్గుని ఆశ్రయించి  ఉండే బదులు అనాధలకు,  సేవ చేయదలచి  కట్టు బట్టలతో నడిచింది బయటకు ఆనందీ. మత్తులో ఉండుట వల్ల  సోఫాలో పడుకున్నాడు ఆనందరావు .

నిద్రలేవంగానే కాఫీ రాలేదు , చక్కటి పలకరింతలేదు, తనతప్పు గ్రహించాడు, వెంటనే ఫోన్ తీసుకోని తెలిసిన వారందరికీ ఫోన్ చేసాడు, భార్యవివరాలు తెలియలేదు, భార్య  ఆఫీసుకు బయలు దేరాడు రాలేదని తెలుసుకున్నాడు, తను ఆఫీసుకు చేరాడు, ఆఫీసులో డబ్బు పోయ్యిందని దానికి కారణం  తనే కారణమని భావించి పోలీసులకు దొరకకుండా తిరిగాడు ఆనందరావు,  మారి, భార్య చేసిన సేవలు గుర్తు తెచ్చుకొని ఏడ్వసాగాడు, స్నేహితులెవరూ సహకరించలేదు, పలకరింపులు లేక, ఆఫీసుకు పోక, రోడ్డువెంట తిరుగుతున్నాడు, మనసు మనసులో లేదు, భార్యను మరువలేక త్రాగుటకు బానిస అయినాడు, ఒక వైపు పోలీసువోల్లు, మరోవైపు అప్పులవాళ్ళు వెంబడిస్తున్నారు, అనారోగ్యముతో బాధను భరించ లేక రోడ్డుమీద పడిపోయాడు.

కళ్లుతెరచి చూడగా ఒక ఆశ్రమంలో ఉన్నట్లు గ్రహించాడు, గురువుగాను చెప్పిన మాటలు విన్నాడు ఆనందరావు   
   ఆశ్రమంలో   ఈవిధముగా గురువుగారు నీతి  బోధ చెప్పటం మొదలు పెట్టారు, మనిషికి అహంకారమే పరమ శత్రువు, చెడుస్నేహము మనిషిని కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కొన్ని అలవాట్లకు కొందరు బానిసగా మారుతారు,  చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటారు, అట్టివారు ఎవరైనా పశ్చాత్తాపముతో తప్పు వప్పుకుంటే వారిని ఆదేవుడు క్షేమించి మంచి మార్గము చూపిస్తాడు.
అక్కడి వాతావరణ, అలవాట్లు ఆనందరావుకు కొత్తఆశలు వేళ్ళు విరిశాయి, అక్కడ దేవుని ముందు కూర్చొని తనతప్పులు చెప్పుకున్నాడు, అక్కడ  వున్న  వారికి  సేవచేస్తూ ఉన్నాడు. 

అప్పుడే అక్కడకు ఒక ఉత్తరము వచ్చింది, మీ అప్పులు తీర్చటం జరిగినది, ఆఫీసు డబ్బు కట్టడం జరిగింది, ఇక మీరు స్వేశ్చా జీవి . 
   
దుర్జన స్నేహమ్ము - దూరమ్ము సేయుమా - వర్జించు 

వారలన్ నీవు 

అప్పులన్ జేయకుమ - ఆర్జనల్ చాలుగా - ముప్పులన్ 


దేబోకు నీవు 

గర్వమున్ వీడుమా - కల్లలన్ వీడుమా - సర్వ మా దైవమే 


నీకు 

అమ్మయే దైవ మా - అబ్బయే దైవమ్ము - బమ్మయే 


సృష్టించె నిన్ను


నీ ప్రేమ ఓప్పులో భాగము పంచుకున్నాను, ఆ చిరుకానుక 

నీకు అందిస్తున్నాను, నా గురించి వెదక వద్దు నీవు 

మారావని గమనించాను, నన్ను కలవాలను కుంటే  

రావచ్చు, క్షమించే గుణం ఒక్క స్త్రీ   కే ఉన్నది,  ఓర్పుతో 

నీకోసం వేచి ఉన్నాను.   

ఆశ్రమంలో  గురువు గారికి తన గురించి పూర్తిగా చెప్పటం 

వళ్ళ ఆయన సలహా ప్రకారము భార్యను కలవటానికి 

తిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు .
 


17, మే 2017, బుధవారం

Mallapragada Ramakrishna Telugu stories-16

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:


కలసిన హృదయాలు
నాన్న నాకప్పుడే పెళ్ళికి తొందరెందుకు, నాకు మంచి ఉద్యోగము రాలేదు, ఈ ట్యూషన్సు వల్ల పెళ్లి చేసుకుంటే కష్టం కదా.
అట్లా నేను అనుకుంటే నాకు అసలు పెళ్లి అయ్యేదే కాదు, ఎందుకంటే నా పెళ్లప్పుడు మునిసి పాలిటీ అత్తర్, చెత్త వ్యాన్ డ్రైవర్  పనిచేసేవాడ్ని, అందరు పెళైన కొత్తలో చెత్తబాబాయి అనేవాళ్ళు, వాళ్ళు అలా అన్నారని మీఅమ్మను ఎప్పుడూ భాద పెట్టలేదు.
నీవేమి భయపడకు ఆ దేవుడు వ్రాసి నట్లే జరుగుతుంది అంతా మనకోసం జరిగిందను కోవాలి ఎంత చెట్టుకు  అంతే గాలి అయిన మానవ ప్రయత్నం చేయాలి కదా, నీవేమి ఆశలకు పోవటం లేదు కదా, కంతకు తగ్గ బొంతకోసం వెతుకుంటున్నావు, ఏమో నాన్న నీవు చెప్పావు కాబట్టి అమ్మాయిని చూసి వస్తా, నాకు నచ్చకపోతే నచ్చలేదని చెపుతా అంతకు ఇష్ట మైతేనే పిల్లని చూస్తా, సరే నీతోపాటు పక్క ఇంటి గోపాలం గారిని తీసుకొనివెళ్ళు అన్నాడు.
ఆలా పిల్లను చూడటం నచ్చలేదని  నాన్నకు చెప్పఁటం జరిగింది.  
ఎందుకు నచ్చలేదో చెప్పాలి, అమ్మాయి వాళ్లు నీచేత కంప్యూటర్ళ్లు కొని ఇంటర్ నెట్ సెంటర్ పెడుతారుట, స్వతంత్రంగా బ్రతకవచ్చు ఇలా ట్యూషన్సు చెప్పేబదులు అది తెలిక కదా. 
అది కాదు నాన్న పిల్లే నాకు నచ్చలా, పిల్ల కళ్ళు గాజుకళ్ళు, పగలు చూడాలంటే నాకు భయమేసింది, ఇక రాత్రి విషయం తలుచు కుంటే భయమేస్తుంది.
సరేరా మన గోపాలం గారి చుట్టలేవరో ఉన్నారట చూసి వస్తావా.
నాన్న నేను మాత్రం ముందు చూడను, నీవు చూసి నచ్చింది, చూడరా అంటే చూస్తాను అంతే
చివరికి మానాన్న గారు చూసిన సంభంధము కుదిరింది.    
పెళ్లి రంగ రంగ వైభవముగా జరిగింది, పార్వతి పరమేశ్వరులు అని దీవించారు, నాకు గవర్నమెంటు ఉద్యోగమూ వచ్చింది, నాన్న గారిని వదలి వేరొక ఊరులో ఉద్యోగ నిమిత్తము కాపురం పెట్ట వలసి వచ్చినది. (నాన్న గారు గుడిలో పూజారిగా ఉంటాను, ఈ వయసులో మీ మధ్య నేనెందుకు అని మమ్ము భాగ్య నగరానికి  పం పించారు.
ఇంతకీ నాపేరు చెప్పలేదు కదా, నాపేరు మాధవ్  భార్యపేరు రాధ 
ఇక సంసారంలో సరిగమలు వినండి
నన్ను పొద్దున్నే రాధ నిద్రలేపుతుంది వాకింగ్ పొమ్మంటుంది, తనేమో పాలు ఆలస్యముగా వస్తే వాడితో    గొడవ పెట్టుకుంటుంది, పని అమ్మాయి ముందు వస్తే నా నిద్ర చెడ గొట్టావ్ అని ఎగిరి పడుతుంది, నేను   తిరిగి వచ్చాక కూడా రుస రుస లాడుతూ ఉంటుంది,   పే పరు బాయ్ ఇంటిలోకి విసిరేశాడని వానితో గొడవ పెట్టుకున్నది, నేను ఎన్ని సార్లు చెప్పిన వాళ్ళతో తగాదా పడకూడ దన్న విని పించుకోదు, నన్నే ఉరిమి  ఉరిమి  చూస్తుంది, అప్పుడను కూనే వాణ్ని ఇలాంటి వాళ్ళను కాలమే బాగుచేయాలి,   నోటితో న్యాయం చెప్పఁటం కన్నా మౌనం గా ఉండుట మేలు అని తలచి కాపురము చేస్తున్నాను. టివి అదేపనిగా చూస్తుంది, సీరియల్సస్ లో లీనమై పోతుంది, వంటకాలు చూసి రోజుకొక  వంటకం తయారు చేస్తుంది . 
ఏదన్నా అంటే ఈ వయసులో కాక ఈవయసులో సుఖపడతాం అంటుంది, పిల్లలు మాత్రం ఇపుడే వద్దంటుంది, మీ సంపాదన పిల్లలు ఉంటే సరి పోదంటుంది. ఎవరు ఏమి చెప్పిన ఇట్టేనమ్మేస్తుంది, ఆఫీసులో ఆలస్యమైనదనుకో ఆరోజు నాకు పస్తే నోరు చేసుకొని కాపురం చేస్తుంది. 
        
ఒక రోజు నాన్నగారు మా ఇంటికి వచ్చారు, ఎరా ఆలా ఉన్నావు, కోడల పిల్ల లేవ లేదా, వంట్లో      నలతగా ఉన్నది. అందుకని నేనే గ్రైండర్ లో పప్పు రుబ్బి దోశలు వేయుటకు నేను రడీగా ఉన్నా నాన్న, నీవు కాళ్ళు చేతులు కడుక్కొని రా, నీకు దోశలు పెడతాను, నాకు తొందర లేదురా, ఇప్పుడే రైల్లో దిగి ప్రక్కనే ఉన్న హోటల్లో టిఫిన్  తిని వచ్చానురా, నీవు ఆఫీసుకు పోతావేమోనని తొందరగా వచ్చాను, నీవు అమ్మాయి తినండి,  నీ పరిస్థితి చూస్తుంటే నాకు దిగులుగా ఉందిరా, నాన్న నేను ఆఫీసుకు పోయి  వచ్చాక అన్నీ మాట్లాడు కుందాం, నేను  కూడా నా స్నేహితుని కొడుకు మ్యారేజ్ చూసి వస్తాను . అమ్మాయికి ఒకేమారు చెప్పి పోతాను పిలుస్తావా. 
రాధా అని పిలిచాడు. 
         మావయ్యగారు ఎప్పుడు వచ్చారు, ఏమిటి  చెప్పకుండా వచ్ఛారు, సరేలేండి భోజనం చేసి మరి వెళ్ళండి.
ఏమిటే ఆ  మాటలు నాన్నతో
నేనేం తప్పు మాట్లాడ లేదు ఉన్న నిజం చెప్పా అంతేకదా
బాబు మీ సంసారం చూసాక మీకు కొన్ని విషయాలు చెప్పి వెళతాను అన్నాడు అట్లాగే నాన్న.    
ఏమిటండి మీనాన్న నాకు చెప్పేది అన్నది
 మా నాన్నగారు వెళ్ళేదాకా అన్న నీ నోరు కంట్రోల్లో  పెట్టుకో, లేదా నేను చేయి చేసు కోవాల్సి ఉంటుంది,
ఏమిటి మీ చేయి లేస్తుంది, మీ నాన్న కోసం మీరు చెప్పినట్లుగా బుద్ధిమంతు రాలుగా ఉంటాను నోరు ఎత్తను అన్నది. 
చూడు బాబు మారాలి మారాలి భార్య అని ఆమె చెప్పిన వన్నీ కోపంతోగాని ప్రేమతో గాని చేయటం తప్పు కాదు,    కాని నేను ఉద్యోగం చేస్తున్నాను అని అహంకారము భార్య ముందు ప్రదర్శించ కూడదు, భార్య భర్తలలో ఎవరికి   ఎవరు ఎక్కువకాదు .. తక్కువ కాదు ... సమానమే
 మనస్పర్థలు రాకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రతి విషయము  సాల్వు చేసు కోవాలి, పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆయన ఒకరి కొకరు ప్రేమను పంచుకొని సంసారాన్ని స్వర్గమయం చేసుకోండి, ఇంతకు ముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం నాముందు కీచులాటలు మాత్రం ప్రవర్తించ కండి.
మీ సంతోషానికి నేను అడ్డురాను, మీరు ఏ తిండి పెడితే అదే తింటాను, నాకు   పెన్షన్ వస్తుంది అది కూడా మీకే నేను ఇక్కడ ఉన్నంత కాలము మీకే ఇస్తాను.

మీరు చేయాల్సిందల్లా ఒక్కటే నాకు మనవుడో  మనవరాలో ఇవ్వండి వాళ్ళతో ఆడు కుంటూ ఇక్కడే ఉంటా .
అప్పుడే మావయ్యగారు నన్ను  క్షమించండి  తప్పుగా మాట్లాడితే మన్నించండి, మీరు ఇష్టమున్న రోజులు ఇక్కడ ఉండవచ్చు
నాన్న మీరు ఎక్కడికీ పోనక్కరల్లేదు ఇక్కడే ఉండండి.
మీరు కీచులాట లాడితే మాత్రము ఇక్కడ ఉండలేను ముందే చెపుతున్నాను.        
చీకటి పడింది, మావయ్యగారు పడుకొనే  గది చూపించి, మంచి నీళ్లు పెట్టి ఏ అవసరము వచ్చిన మీ అబ్బాయి నా సెల్లు నెంబర్లు ఇవి ఫోన్ చేయండి అనిచెప్పి పడక గది చేరి భర్తతో ఇంటి పనులు అన్నీ నే చూసు కుంటా, ఆఫీసు పనులు మీరు చూసుకోండి
అబ్బా ఈ రోజు పండు వెన్నలుగా ఉన్నది మంచం పై ఒకరికొకరు తన్మయత్వంలో మునిగి తేలారు, ఏవండీ నేను కూడా ఉద్యోగం చేయనా, మీ నాన్నగారు కూడా ఉన్నారుగా, ఇప్పుడు మనకు డబ్బుని గూర్చి ఆలోచించ వద్దు పిల్లలగురించి ఆలోచిద్దాం, అవునండి మనకు పిల్లలు కావాలి, మీ నాన్నగారు కూడా ఉండాలి,   (శంకరం మనసులో   అను కున్నాడు  ఇంట్లో పెద్దలు ఉంటె ఆ యిల్లు సుఖశాంతితో ఉంటుంది)   అంటూ    వారిరువురి హృదయాలు ఆనందంతో నిండినాయి.    
  --((*))--
  

16, మే 2017, మంగళవారం

Mallapragada ramakrishna Telugu Stories -15

ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:
తాతయ్య కోచింగ్ - క్రికెట్ ఆట 
తాతయ్య నీకు క్రికెట్ గురించి తెలుసా అని అడిగాడు మాధవ్, నా చిన్నప్పుడు గవాస్కర్ ఆడుతున్నప్పుడు చూసినట్లు గుర్తు, ఆ తర్వాత ఈ పల్లెటూరుకు వచ్చి వ్యవసాయము చేస్తూ కాలక్షేపము చేస్తున్నాను, అయినా ఆ ఆటలు మనకు అచ్చిరావు, ఏంతో కష్ట పడ్డ గుర్తించటం చాలా కష్టం.

సాధనతో ఎటువంటి దైనా సాధించవచ్చు అన్నారు కదా, అవును అన్నాను, ఓర్పుతో పట్టుదలతో పొలాన్ని దున్ని, నీరుపెట్టి, నారుపోసి, కలుపుదీసి, మందు కొట్టి చిన్న పిల్లవాడ్ని రక్షించినట్లు పొలాన్ని రక్షించు కుంటూ ఉన్నా ప్రకృతి కని కరించక పోతే, పంట చేతి కందదు.

అంటే సాధన చేస్తే ఫలితం ఉండ దంటారా, ఆవిషయం చెప్పేలేదే, అందరు సహకరించాలి, ప్రకృతి సహకరించాలి  అప్పుడే అనుకున్నది సాధించగలరు అని చెప్పాడు తాతయ్య.

తాతయ్య  నేను క్రికెట్ నేర్చుకోవాలి, నాకు నేర్పు నీకు తెలిసినది నీ దగ్గర కొంత, మాస్కూల్ మాష్టర్ వద్ద కొంత పట్టుదలతో నేర్చుకుంటాను. అయితే నేను చెప్పిన వన్నీ ఎదురు చెప్పకుండా నీవే చెయ్యాలి, అట్లా చేస్తానని నాకు మాటయివ్వు అన్నాడు తాతయ్య. నీవు చెప్పినట్లు నేను చేస్తాను అన్నాడు.

అయితే ఈ రోజే నీకు ప్రాక్టీసుగా నేను చెప్పినట్లు చెయ్య్ అన్నాడు, అట్లాగే అన్నాడు మాధవ్
గంప ఎత్తి కోడి పిల్లలను వదిలాడు అవి పట్టు కొచ్చి గంప క్రింద పెట్టు అన్నాడు. ఏంతో అతి కష్టం తో కోడి పిల్లలను పట్టి పెట్టాడు. మరలా బుట్ట తీసి వదిలాడు అలా మూడు సార్లు వదలి మరలా బుట్టకింద పెట్టడంతో మాధవ్ అలసి నట్లు గమనించి ఈరోజుకు ఇది చాలు, ఇదిగో ఈ చెంబుడు పాలు త్రాగు అని చేతికి ఇచ్చడు.

ఈ ఆటకు ముఖ్యంగా పరిశుభ్రమైన ఆహారము తీసుకుంటూ ఆరోగ్యము జాగర్త చేసుకోవాలి, ఎటువంటి దుర్వసనాలకు బానిస కాకూడదు అన్నాడు తాతయ్య.

నీకు నిండా 14 సంవత్సారాలు రాలేదు ముందుగా మన ఊరు స్కూలు తరపున ఆడి గెలవాలి అది మొదటి స్టెప్ అన్నాడు. అట్లాగే తాతయ్య. రేపు మరలా వస్తా నాకు ట్రైనింగ్ ఇవ్వు అన్నాడు

మరునాడు మాధవ్ తాతయ్య దగ్గరకు వచ్చాడు మాధవ్ అప్పుడే కుక్కను పురమా యించాడు మాధవ్ పై కుక్క వెంబడి పడటం దాన్ని తప్పించు కోవటానికి ఇంటి చుట్టూ తిరిగాడు రెండుసార్లు, ఎం తాత కుక్కను పురమా యించావు, వేగంగా పరుగెత్తావో, క్రిందపడ్డావో, భయంతో వణికి పోయావో  చూద్దామని అట్లా చేశా, నా టెష్టులో గెలిచావ్ ఈ రోజు ఇదిగో ఈ రాగి సంకటి ముద్ద పళ్లెంలో పెట్టాడు, ఈ రోజుకు తిను అన్నాడు, ఏంతో బాగుందని అంటూ గబగబా తిన్నాడు.

తాతా మీ మనవారులు లేదా, ఉన్నదిరా పిలుస్తావుండు అంటూ రాధా అని పిలిచాడు, ఎం బావా బాగున్నావా అని అడిగింది, ఏమిటే బావా అంటావ్ నీకన్నా 5ఏళ్ళు చిన్న అలా పిలవకూడదు, ఆయితే మాధవ్ అనిపిలుస్తా, నేను రాధా అని పిలుస్తాను. మాధవ్ నాకు మామిడి పండు కోసి ఇవ్వవూ, నేను నిన్ను ఎత్తుతా అంటూ పైకి ఎత్తాడు, కాయ పట్టుకొని ఒక్క లాగు లాగింది అంతే ఇద్దరూ క్రిందపడ్డారు ఏమిటిరా అక్కడ మీరు చేసేది తప్పుకాదా అని అరుస్తున్నాడు, ఏమీ లేదు ఏమిలేదు అంటూ దులుపుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లి పోయారు.

మరునాడు చెరువు గట్టుకు తీసుకెళ్లాడు మాధవ్ ని, పైనుంచి దూకి చెరువులో ఈదుతూ చాపలు పట్టాలి అన్నాడు. ఓసి ఇంతేనా అని దూకాడు, ఎంత కష్టపడ్డా చేపలు చిక్కినట్లు చిక్కి జారిపోతున్నాయి, చెప్పటం ఇష్టం లేక చొక్కా విప్పి చేపలపై వేసి కొన్ని పట్ట గలిగాడు. తరువాత తాతయ్య పైకి తెచ్చిన చేపలను మరలా నీటిలోకి వదలి ఈ రోజుకు చాలు, ఇదిగో ఈ జీడిపప్పు , బాదాం పప్పు తిని నెమ్మదిగా ఇంటికి చేరు, నేను ఒక్కసారి మీ మాష్టర్ ను కలసి వస్తాను నీకు క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వమని చెపుతాను అన్నాడు.                                  

తాతయ్య మాష్టారును కలవడం 15మంది కుర్రాళ్లను సేకరించటం, గుడి స్థలంలో ఆడుటకు అనుమతి తీసుకోవటం అంతా క్షణాల్లో జరిగి పోయింది .

తాతయ్య వెళ్లిన పని కాయ పండా అని అడిగాడు మాధవ్ . గుడి స్థలాన్ని సుబ్రం చేసుకొని ఆడుకో మన్నారు వారం రోజుల్లో శుభ్రం చేస్తారుట తర్వాత నేర్పు తానని మాష్టారు చెప్పారు అన్నాడు.
మంచిది వారం రోజులు దాకా నే నాగను ఈ రోజు ఏం చేయాలో చెప్పు అన్నాడు.

రాధా అక్కడ ఉన్న తాడు పట్టుకురా ఈ వేప చెట్టుకు ఊల వేద్దాము అన్నాడు, ఆ చెక్క కూడా తీసుకురా, తాతాయ్య ఈరోజు అట్లతద్దా ఉయ్యాల వేస్తున్నావు అని అడిగింది. ఈ రోజు టుంగు టుయ్యాల ఊగించుట ప్రాక్టీస్ చేయిద్దాం అన్నాడు, నేను ఊగొచ్చా ఆడవాళ్ళకు వద్దు లేమ్మా చెక్క మీద కాళ్ళు కదల కుండా తాళ్లను పట్టుకొని ఊగాలి, తాత నేను కూడా ఊగతా సరే ముందు మాధవ్ ప్రాక్టీస్ చెయ్యని అన్నాడు సరే అన్నది రాధ.

చెక్క పట్టుకొని మాధవుని ఒక్కసారి గట్టిగా లాగి వదిలింది అంతే కాళ్ళు ముడుస్తూ లేస్తూ పైపై దాక ఊగాడు, తాకు కూడా భయం వేసేంది జాగర్త ఇక చాలు అన్నాడు, లేదు తాతయ్య ఈ రోజు ఆట చాలా బాగుంది గాలిలో తేలి నట్టుంది అన్నాడు, చాలురా చాలు ఇక ఆపు అన్నాడు, నెమ్మదిగా ఆపాడు,  ఆపెంగానే రాధ చెక్క పట్టుకుంది, దిగాడు మాధవ్.

నీవు మాములుగా చెక్క మీద కూర్చో నెమ్మదిగా చిన్న ఊపులు వేస్తాడు మాధవ్
నెమ్మదిగా లాగి ఊయల వదిలాడు అంతే లంగా పైకి ఎగరటం, దాన్ని అదుముకుని కూర్చోవటం, ఇకచాలు అనటం అంతా చూసాడు మాధవ్. నెమ్మదిగా దిగుతూనే అంతా చూసావా అంతా ఏంచూసావురా, పిరికితనం, భయం, అన్నాడు రాధతో, నవ్వుతూ చేతిని గిల్లి మరి వెళ్ళింది.

ఎందుకు గిల్లింది అని ఆలోచిస్తున్నాడు మాధవ్. ఇదుగోరా ఈ రోజుకు పెరుగన్నం అల్లం ముక్కలు పచ్చిమిరప కాయలు ఉప్పు కలిపి తిరగ మోత పెట్టి మరీ తయారు చేసింది రాధ.

రాధా చేసిందా అంటూ గబగబా తిన్నాడు. ఎమన్నా చదువుతున్నావా చదువుతున్నా తాత ఇప్పుడు 10వ తరగతి నేనే క్లాస్ ఫస్టు.

రాధ 10వతరగతి పాసై మూడేళ్లు పైనయింది కాలేజీలో చేర్పించ బోయావా అన్నాడు మాధవ్.
నేనా పెద్దవాడి నయినాను వాళ్ళమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, దాన్ని పెళ్ళిచేస్తే భాగింటుంది అన్నాడు. ఎప్పుడేం పెళ్లి తాత చిన్నపిల్ల అన్నాడు. నీవు చిన్నవాడవని అందరు చిన్న పిల్లలను కుంటే ఎట్లా అన్నాడు.
అప్పుడే మాష్టారు తాతగారి దగ్గరకు వచ్చి రెండురోజుల్లో ప్రాక్టీస్ చేయిస్తా అన్నాడు అట్లాగే మాష్టారు అన్నాడు తాతయ్య.

రాధా ఆ నులక ఉండ ఇటు తీసుకురా అన్నాడు తాతయ్య తెచ్చింది దాన్ని చిన్నదిగా మార్చి బంతిలాగా చేసాడు, ఈరోజు ఇంకా మాధవ్ రాలేదా, అదిగో వస్తున్నాడు తాతయ్య ఎందుకురా ఈరోజు లేటు ఏమీ లేదు తాతయ్య కారు పంచరైతే చక్రం  పీకి చక్రం పెట్టివచ్చా అందుకే ఆలస్యము అయిందా, డబ్బు లేవన్నా తీసుకున్నావా వాళ్ళు ఇస్తామన్న వద్దని అసలే ఆలస్యమైనది అని పరుగేతుకుంటూ వచ్చా.

ఈరోజు రాధ నీవు కలసి అడాలిరా నాకు ఓపిక లేదు అన్నాడు తాతయ్య, ఏ ఆట తాతయ్యే ఈబంతి లాగుందే ఉండ విసిరేసుకుంటూ పట్టుకోవాలి ఆ మొదలు పెట్టండి నేను చూస్తూ ఉంటా అన్నాడు.

నెమ్మదిగా విసిరేసుకుంటున్నారు, ఇదేమన్నా బంతిపూల ఆట అనుకున్నారా వేగం పెంచండి అన్నాడు తాతయ్య రాధ విసిరేయడం మాధవ్ పట్టుకోవటం, ఒక్కోసారి పట్టుకోలేక ఛాతికి తగలటం జరుగుతున్నది, అదేవిధముగా రాధకు కూడా తగులుతున్నది, ఎదో అనుకోని హాయ్ అనిపిస్తున్నది రాధకు, మాధవ్ మాత్రం అంత వేగంగా విసురు తావెందుకు అన్నాడు, పట్టుకోవటం చేతకాక పోతే సరి అన్ని వొంకలు పెడతారు, సరే వేయి అన్నాడు, రకరకాల పద్దతులలో వంగి దగ్గరికి దూరంగాను విసిరింది, అంతే మాధవ్ పరుగెత్తే జింకపిళ్లను పులి పట్టినట్లు బంతిని పెట్టుకుంటున్నాడు పట్టుదలతో.

ఇక చాలు ఈరోజుకు ఇదిగో ఈ పళ్లిపప్పు చెక్క తినండి అని చేతిలో పెట్టాడు తాతయ్య.     
రాధ కూర్చొని రొప్పుతుంటే వక్షోజాలు ఎగిరినట్లు కనిపిన్చాయి మాధవ్ కు అవి చూసి ఎదో తెలియని అనుభూతి కలిగింది, ఏమిటిరా అదేపనిగా అట్లాచూస్తున్నావు ఎం కనిపించాయి అన్నాడు తాతయ్య.
ఆ చెట్టు మీద రెండు మామిడి కాయలు కనిపిస్తే చూసాను అంతే అన్నాడు.

తొందర పడకు మంచి ఆటగాడిగా మారు అప్పడు మామిడి పండు రసమే త్రాగొచ్చు అన్నాడు.

మాష్టర్ రావటం రేపటినించి క్రికెట్ ప్రాక్టీస్ చేయిస్తాను అని చెప్పఁటం జరిగింది.

తాతయ్య మరి ఈరోజు నాకు ఎక్సరసైజ్ ఏది అని అడిగాడు. అప్పుడే రాధా అని స్కిప్పింగ్ తెమ్మన్నాడు తెచ్చింది.
నాకు రాదు తాతయ్య, నేర్చుకుంటే అదే వస్తుంది, రాధా ఒక్కసారి ఆది చూపించమ్మ అన్నాడు తాతయ్య
రాధ ఆడి స్కిప్పింగ్  తాడులు మాధవ్ కు ఇచ్చింది. కొద్ది సేపు కష్ట పడ్డ ఆడగలిగాడు, ఇద్దరూ కలసి ఆడండి అన్నాడు తాతయ్య ఇద్దురూ  కలసి ఆడితే చమటకు వస్త్రాలు తడిసినవి. ఒకరి మొఖం  ఒకరు చూసు కుంటూ తుడుచు కుంటూ ఆగిపోయారు.

స్కూల్ తరుఫున బ్యాటింగ్, బోలింగ్ నెట్ ప్రాక్టీస్ చేసి అన్ని స్కూళ్ళ విజయం సాధించి, స్టేట్ వైడ్ లో మొదటి బ్యాట్స్ మెన్ గా సెలెక్టయ్, ఏకధాటిగా 300 రన్సు కొట్టిన బ్యాట్సమెన్ గా స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా బహుమతి పొంది అంతర్జాతీయములో ఆడుటకు భారతీయునిగా సెలెక్ట్ అయి ఇతర దేశాలలో ఆడుటకు బయలు దేరాడు మాధవ్.
చదువు 10వ తరగతితో ఆగిపొయిన్ది, తాతా పెద్దవాడగుట వల్ల రాధ భాద్యత మాధవ్ తీసుకొని తనతో తీసుకెళ్లటం జరిగింది. రాధా మాధవ్ ల ప్రేమ చెప్పలేనిది .

భారత దేశం తరుఫున అత్యధిక పరుగులు తీసిన వారిలో ఒకటిగా ప్రశంసా పత్రము, బహుమతి పొందాడు, క్యాప్టెన్  మారి దేశ  ప్రగతికి తోడ్పడుతున్నాడు.
ఎవరన్నా అడిగిన తాత చెప్పిన మాటలు చెపుతున్నాడు " అంచనాలు తారుమారు చేసి మహాశక్తిగా మారాలంటే ఓర్పు, పట్టుదల, సహకారం ఉంటే జయం తథ్యం, ఆటగాడిగా ఎదగాలంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి, ఎటువంటి భావాలకు లొంగ కుండా జీవించాలి, తనదైన పద్దతిలో గమ్యం ఏర్పడుచుకుంటే ఆజీవితానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది.
అప్పుడే తాతయ్యను ప్లేన్ లో దిగుతూ కని పించాడు తాత నీవిక్కడికి ఎలా వచ్చారు, నేను మీ మాష్టర్ కూడా వచ్చారు, ఇద్దరికీ పాదాభి వందనం చేసాడు మాధవ్.

తాత నేను మన ఊరు కోసం ఏదన్నా చేద్దామనుకున్నా 100 ఎకరాలు కొని ఆటస్థలములుగా మార్చాలనుకున్నా దానికి రాధ తల్లి తండ్రుల పేర్లు పెడదామనుకున్నా అన్న మాటలకు తాతయ్యకు కళ్ళవెంబడి నీళ్లు తిరిగి నేను చెయ్యాలను కున్న పని నీవు చేస్తుతున్నావు అని ఆలింగనం చేసుకొని ఇంత కన్నా నేను ఏమి ఇవ్వలేనురా మాధవ్, రాధ పలకరిస్తూ తాత నీవుకూడా మాతో ఉండాలి అన్నమాటలకు మీరు నాబిడ్డలురా మిమ్మల్నోదిలి ఎక్కడకు పోలేను  తా అన్నాడు.   
   


       
                                    
        

Mallapragada ramakrishna elugu stories -14

ఓం  శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
డాక్టరమ్మా
http://vocaroo.com/i/s17RBCkPKMOW

సీతారామయ్య గారికి ఒక్కడే కొడుకు అతని పేరు మాధవ్, ఎంబీఏ దాకా చదివించాడు, తనతో పాటు బిజినెస్లో పార్ట్నర్ గా మార్చేడు. సబ్బులు ఫ్యాక్టరీ పెట్టి ఇండియా మొత్తం సప్లై చేస్తూ  దినాదినా భి వృద్ధిగా మార్చారు తండ్రీకొడుకులు. 

అప్పుడే రాధ తల్లి తండ్రులు మాకు ఆస్తి లేదు, మీరు ఇష్టపడితే అమ్మాయినిచ్చి పెళ్ళిచేస్తాము, కట్నము మాత్రము  ఇవ్వలేము అని చెప్పగా వొప్పుకొని సంప్రదాయముగా పెళ్లి జరిగింది. కంపెనీ కార్మీకు లందరు చిన్న సంబరం చేశారు.

పెళ్లి ఆయిన తర్వాత కంపెనినీ చూపించాడు మాధవ్ రాధకు.  

అపుడే కొందరు దండాలయ్యా, దండాలమ్మా అంటూ వంగి వంగి దండాలు పెట్టారు, వాళ్ళు ఎందుకు పెట్టారో అర్ధం కావటం లేదు మాధవకు. అప్పుడే నెమ్మదిగా నోరు విప్పి మీరు బిజినెస్ మాన్ కదండీ, మీకృషిని గమనించి దండాలు పెడుతున్నారు అన్నది రాధ .       

కంపెనీ నుంచి ఇంట్లో అడుగు పెట్టారు అమ్మగారు అమ్మగారు అని ఏడవడం మొదలు పెట్టింది పనిమనిషి .

అప్పుడే మాధవ్ అన్నాడు మొగుడు కొట్టాడని, చదువుకు డబ్బులు కావాలని అడుగుతారు, వాళ్ళ ఏడుపుకు లొంగకు అంటూ బెడ్ రూం లోకి వెళ్ళాడు మాధవ్.

రాధ వెంటనే తెల్ల కాగితము తీసి చెకచెకా ఎదో వ్రాసి ఇచ్చి, నీవు మాత్రం పని మానేయకు, ఇరోజు వరకు నేను చేసు కుంటాలే వేళ్ళు అన్నాది రాధ.

ఏమిటే ఇంత లేటు పనిమనిషి ఏమన్నదీ, ఈరోజు రావటము కుదరదు రేపు వస్తానని చెప్పింది, వప్పుకున్నావా ఏమిటి, ఈ  పనివాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు, ఈ  ఆమ్మాయిని తీసి వేసి కొత్తవాళ్లను పెట్టుకో అన్నాడు మాధవ్.

మనది లంకంత ఇల్లైనా, నేను ఇంటిపని ఒకరోజు సర్దు కుంటాను లేండి, మీకు మన పిల్లలకు ఎటు వంటి కష్టము కల్గించ నండి యన్నది రాధా.

అవునురాధ నీవు నన్ను అర్ధం చేసుకున్నావు నీవల్లే నేను ఇంత  సంపాదించ కలిగాను, అప్పుడే నవ్వుతూ అన్నది అంతా మీ నమ్మకం, మీకు సుఖం అందించ గలుగు తున్నాను అంతకన్నా నాకు ఇంకే ముందండి, ఇదిగో ఒకచెక్కు వ్రాసి ఇస్తున్నాను నీ పుట్టినరోజు సందర్భముగా ఏదైనా కొనుక్కో అని ఇచ్చాడు, ఇప్పుడొద్దు లేండి అవసరానికి ఉపయోగించు కుంటా అని కౌగిలి చేరింది రాధ.

ఏమండీ వ్యాపారము అంటూ తిరుగుతున్నారు, వేలకు భోజనం చేయండి, వేలకు నిద్రపోండి, డబ్బు పిచ్చిలో పడి నన్ను పిల్లలను మర్చిపోకండి అన్నది. అప్పుడే ఫోన్ వచ్చింది మీరు అర్జన్టుగా రావాలని మాత్రం విన్నాడు మాధవ్ .

రాధ మాధవ్ తో చెప్పింది నా  స్నేహితురాలికి యాక్సిడెంట్ ఆయిందట అది ఫోన్, మరి చూడటానికి పోదాం పదా మీరు వ్యాపార నిమిత్తం బయలు దేరారుగా  మీరు వెళ్ళండి కారులో, నేను ఆటో చేసుకొని వెళ్లి చూసి వస్తా అన్నది.

అయితే మీరు కోటి సర్కిల్లో దించండి అక్కడ ప్రక్కనే ఎదో నర్సింగ్ హోమ్ టా, అట్లయితే  పదా రాధ కోటి చేరారు

రాధ ఇంటికి చేరేటప్పటికల్లా చీకటి పడింది అప్పటికే భర్త ఇంటిలో ఉన్నాడు, బిజినెస్ కాన్ఫరెన్సు రద్దైనది వెంటనే వచ్చాను నీవు ఇంత  లేటు చేశావేంటి అని అడిగాడు, 5, 6 ఆపరేషన్లు చేయాల్సివచ్చింది ఆగాను, ఆపరేషన్లు ఏమిటి నీవు చేయట మేమిటి నాకేం అర్ధం కావటం లేదు, అదేనండి యాక్సిడెంటు అయినవారికి ఆపరేషన్లు చేయాల్సొచ్చిందట, పేషంటు బయటకు వచ్చేదాకా ఉండాల్సి వచ్చింది అన్నది. మంచి పని చేసావ్ అసలే డాక్టర్లు మోసకారులు ఒకసారి మా అమ్మకు బాగోలేదని ఆసుపత్రికి వెళితే మత్తులో ఒక ఇంజక్షన్ చేయ బోయి వేరొకటి చేసాడు అంతే అప్పుడే ప్రాణాలు విడిచింది.ఆరోజు డాక్టర్ మీద కేసు పెట్టి మరీ సస్పెండ్ చేయిమ్చాను.

ఆమాటలకు రాధ భర్తను ఒడిలోకి తీసుకొని బ్రహ్మ వ్రాసిన రాత ఎవ్వరు తప్పించ లేరండి, జరిగిన దానిని గురించి విచారించ కండి, మనం బాధ పడితే మన పిల్లలు బాధ పడతారు. నాదొక సలహా అంది  మన పాపను, బాబును, హాస్టల్ ల్లో ఉంచి చది విద్దామండి అన్నది. అదే నేను నీకు చెపు దామనే అనుకున్నా నీవే అన్నావు, అట్లాగే రేపే చెరిపిస్తాను అన్నాడు మాధవ్

  

మాధవ్ ఆఫీసుకు చేరాడు, గుమాస్తా గుర్నాధం స్వీట్ బాక్స్ తెచ్చి ఇచ్చి డాక్టరును మెచ్చుకున్నాడు, మా అమ్మాయికి ఆపరేషన్ లేకుండా మామూలు కాన్పు చేయిన్చింది, ఆమె హస్తవాచి చాలా మంచిది అన్నాడు  మాధవకు ఎక్కడలేని కోపమొచ్చింది ఉచితంగా ఎవ్వరూ చేయరు, అని గట్టిగా అరిచాడు గుండె పట్టుకొని బల్లపై తల వాల్చాడు మాధవ్.

వెంటనే గుర్నాధం డాక్టర్కు ఫోన్ చేయగా బుర్ఖాలో ఒక స్త్రీ వచ్చి పరీక్షచేసి మందులు తెమ్మని చెప్పి ఉప సమనముగా ఇంజక్షన్ చేసి తగు జాగర్తలు చెప్పి వెళ్ళి పోయింది. ఫీజు తీసుకోండి అని అడిగాడు, ఫీజ్ ఇచ్చేటట్లైతే నాకు ఫోన్ చేయకండి, సేవ చేయుట నావృత్తి ధర్మం అని చెప్పి వెళ్లి పొయిన్ది డాక్టర్.

గుర్నాధం ఎవరు నాకు ఉపచర్యలు చేసారు ఎవరు వచ్చారు అని అడిగాడు మాధవ్ , జరిగిన విషయం తెలియ పరిచాడు, డాక్టర్లో కూడా మంచి వారున్నారా, ఆవిడ ఎక్కడ కనబడితే అక్కడ డబ్బు లిచ్చెయ్ అని చెక్కు వ్రాసి ఇచ్చాడు.

కాలచక్రం గిర్రని తిరిగింది, ఆరోగ్య సహ కరించక పోవటంవల్ల, అందరిని నమ్మటం వళ్ళ, బిజినెస్ తల్ల క్రింద లైనది, వ్యా పారంలో వడు దుడుకులకు తట్టు కోలేక కంపెనీలు అన్ని అమ్మేసి కొంత ధనముతో ఇంటి వద్దే ఆలోచనలో మునిగి పోయాడు మాధవ్.

ఏమండి మీకు డాక్టర్ అంటే ఎందుకు కోపమండి, మానాన్న గారు కోమా లో మారటానికి డాక్టరే కారణం,

అది ఎట్లా జరిగిందండి. ఒకరోజు నాన్న కారులో వస్తూ ఉంటే వెనుక నుండి లారీ కోట్టే సింది, కారు ప్రక్కన ఉన్న లోయలో పడింది. లారీలో వాళ్ళే హాస్పటల్ కు తీసు కెళ్లారు, సమయానికి డాక్టర్లు లేరు, నేను అక్కడకు చేరాఎంతో ఆదుర్దా పడ్డా సమయానికి ఒక్క డాక్టర్ రాలేదు, నాన్న కోమాలో ఉన్నారని డాక్టర్ చెప్పాడు, ఎంత ఖర్చయినా పర్వాలేదు మాన్నను బ్రతి కించమని చెప్పండి అన్నాను ఫారెన్ నుండి డాక్టరని తెప్పిస్తున్నాము, నాదగ్గర డబ్బు తీసుకోలేదు, ఆడాక్టరెవరో చెప్పలేదు. మానాన్నకు ట్రీట్మెంటు చేస్తున్నారు, ఎప్పుడు కోలుకుంటారో నాకు తెలీదు అన్నాడు. 

అప్పుడే ఫోన్ వచ్చింది మీ నాన్నగారు కోమాలో నుండి బయట పడ్డారు మీరు చూడవచ్చు అన్న పిలుపుకు,

 "రాధా" మానాన్న బ్రతికారు ఆడాక్టర్ కు దండం పెట్టాలి, పదా పోదాం అన్నాడు ఇద్దరూ కలసి నర్సింహుమ్ కు చేరారు, నేను ఇప్పుడే వస్తాను మీరు నడుస్తూ ఉండండి అని ఆగింది రాధ.

హాస్పటల్ ల్లో కూతురి ని డాక్టరుగా చూసి తాతయ్యను నీవే బ్రతి కించావమ్మా, నేను కాదు డాక్టారమ్మా అన్నది.

ఇలా కూర్చో నేను నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలు అయింది, కోడలును కూడా తావచ్చుకదా, మనవుడు మనవు రాలిని చూసాను. అన్నాడు.

అప్పుడే డాక్టర్ వచ్చి మీనాన్నగారిని డిస్చార్చి చేస్తున్నాము. డబ్బులు కట్టాలి కదా ఎవరు కట్టారు, ఒక డాక్టరమ్మ కట్టిందండి అని చెప్పి వెళ్లారు.

అందరూ బయటకు వచ్చి పెద్ద భవనము ముందు ఆగారు, లోపలకు నడుస్తూనే ఫోటోను చూసి, మీ అమ్మను మరిచా వను కున్నాను, గుర్తు పెట్టు కున్నందుకు సంతోషముగా ఉందిరా. మాతా నర్సింగ్ హుమ్ అని ఉన్నది.(క్రింద పూర్తిగా ఉచితము - ఎటువంటి పైకము తీసుకొనబడదు)

మావయ్యగారు నమస్కారమండి అంటూ పాదాలుకు  దండం పెట్టింది రాధ, డాక్టరమ్మా నువ్వా ఆపిలుపుకి మాధవ్ అర్ధం కాలేదు, నన్ను క్షమించండి నేను డాక్టర్ నండి ఫారెన్ లో చదివువాను, మీకు డాక్టర్లంటే పడదని గమనించి నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పక తప్పలేదు.

నన్నే క్షమించాలి రాధ డబ్బులు తీసు కోకుండా సేవలు చేస్తున్నా వంటే నాకు గర్వంగా ఉన్నది, నవ్వుతూ భార్యను దగ్గరకు తీసుకొని నాతప్పు తెలుసుకున్నాను, నాకు ఏమన్నా గుమాస్తా ఉద్యోగం ఇస్తే చేస్తాను అన్నాడు. ఏమిటి నాన్న అట్లా అంటావ్ మీ అమ్మకోసం నీవే కట్టించావ్ ఆనాడు చెక్కు ఇచ్ఛవుట అమ్మకు అదే ఇది, అదే ఇదా, అని అప్పడే ఫోన్ మ్రోగింది అమ్మా ఫోన్ నీవే ఆపరేషన్ చేసి బ్రతికంచాలిట, హైదరాబాద్ నుండి ఫోన్ ప్లైన్ టిక్కెట్లు కూడా ఏర్పాటు చేసురు, ఏమండి ఇప్పుడే ఒక పేషంట్ బ్రతికించి వస్తానండి. అట్లాగేనమ్మా అంటూ మావగారు అనటం మాధవ్ కు ఎనలేని సంతోషం కమ్ముకున్నది.

        --((*))--

15, మే 2017, సోమవారం

Mallapragada Ramakrishna telugu stories -13

ఓం శ్రీ రామ్   - శ్రీ మాత్రే నమ:
ఖీ - ప్రియా (ప్రేమ కధ )

సూర్యుడు అస్తమించే దిశగా బయలు దేరాడు, చీకటి ఆవరించింది, గుంటూరు లో ఉన్న సొంత ఇంటి   పెరటిలో పెంచిన ఉసిరిక చెట్టుకు దగ్గరగా అప్పుడే శ్రీతారామయ్య గారి భార్య దీపారాధన చేసి పూజ చేసి ప్రసాదం తన ఇద్దారి కొడుకులకు భర్తకు  పెట్టింది.
పెద్దకొడుకు  రామా రావు   గుంటూరు లో స్కూలు   టీచర్ గా  పనిచేస్తున్నాడు, పెద్దలు కుదిరించిన వివాహము చేసుకున్నాడు, తండ్రి రిటైర్ గుమాస్తా, ప్రస్తుతం పెన్షన్ పొందుతూ ఉన్నాడు,
 ఇక రెండవ కుమారుడు తను కాలేజీలో చదువు తున్నప్పుడు రాధ ని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామనుకున్నాడు, విధి ఎప్పుడు అనుకున్నవి జరగనీయదు అని కొందరు అంటారు అది మాత్రం ఇతనికి అక్షరాలా నిజం జరిగింది.

ఎం . బి . ఏ . చదివిన ఉద్యోగము లేదు,  కాని   పెళ్లిచేసు కుంటానని తండ్రిని అడిగాడు.
తండ్రి ఒక్కటే చెప్పాడు నేను నిన్ను నీ భార్యను పోషించే శక్తి నాకులేదు, నీవు వేరేగా వెళ్లి బ్రతకమని చెప్పను, నేను చెప్పేది ఒక్కటే నీప్రేమ నిజమైతే నీకే శక్తి  నిస్తుంది, నీ  బ్రతుకుకు మార్గం చూపుతుంది, నీ  స్వేశ్చకు మేము ఎవ్వరమూ అడ్డురాము, నీవు ఉద్యోగము సంపాయించి ప్రేమించిన రాధ ని పెళ్లి   చేసుకో, రిజిస్టర్ మ్యారేజ్ ఐతే మేము సంతకము పెడతాము, రాధ పెద్దలని సంప్రదించి పెళ్లి చేయమంటే చేస్తాను.
ఒక్కసారి నీవు పేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకునిరా ఆమె అభిప్రాయము కూడా తెలుసు కుంటాను, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, నీ అంత నేను చదువుకోలేదు

అట్లాగే నాన్న రేపు తీసుకొస్తాను ఇంట్లో అందరికి చూపి స్తాను, అని చెప్పి బయటకు నడిచాడు మాధవ్ .

తను ప్రేమించిన రాధ ఇంటికి బయలు దేరాడు మాధవ్ , ఇంటికి తాళం ఉంది, ప్రక్క వారిని అడుగగా తన బావను పెళ్లి చేసుకుంటున్నది అని మాత్రం తెలుసు కున్నాడు, వెంటనే స్నేహితురాలు సురేఖ ఇంటికి బయలు దేరాడు ఇది నిజమో కాదో తెలుసుకొనేందుకు, సురేఖ చెప్పింది నీతో ప్రేమ జరిపి, తల్లి తండ్రులను ఎదిరించలేక పెళ్ళికి ఒప్పుకున్నది అని తెలుసుకున్నాడు.

ఇక్కడేదో పొరపాటు జరిగింది, పెళ్లి  చేసున్నారో తెలుసుకోలేక ఇంట్లో తల్లి తండ్రులకు మొఖం చూపలేక స్నేహితుని రూంలో ఉండిపోయాడు. అప్పుడే  ఒక డైరీలో  ఈ విధముగా వ్రాసుకున్నాడు
      
"నిన్ను వీక్షించనిదే ఉండలేను, నిన్ను ఆశ్రయించి నీతోనూ ఉండలేను, నిన్ను విడిచి  అంతకన్నా ఉండలేను,  పున్నమి వెన్నెల ఎలా ఉంటుందో తెలియదు, నీ కళ్ళ మెరుపు నాకు గుర్తు ఉన్నాది, ఎంత దూరము పోయినా, ఎక్కడ ఉన్నా నీ హృదయ స్పన్దన నాకోసమే అని, నీ ఆలోచనలు నన్ను దాటి పోలేవని, నా  ఆశల దీపానివి, నా ఆలోచనా రూపానివి, నన్ను ఆకర్షించిన దేవతవి, నాహృదయాంతరములో  ఎక్కడో కదిలించి, ఏమి తెలియని అమాయకురాలిగా, నన్ను మోసగించి,  నీలోఉన్న నా ప్రేమను అణగతొక్కి,  పెళ్లి  అనే నెపముతో నన్ను విడిచి దూరముగా వెళ్లిన, నీకోసం, నీ ప్రేమ కోసాం నీవు వచ్చి నాప్రేమ పొందే దాకా ఇక్కడే ఉంటా ...
విరిదండ -
రమ్ము నను జూడ సకీ - రాగములఁ బాడ సకీ
చిమ్ము మిఁక ప్రేమ సకీ - చిత్త మిటఁ జింద సకీ
యిమ్ము సుధ పాత్ర సకీ - యీప్సితము దీరు సకీ
కొమ్ము విరిదండ సకీ - కోమలము గుండె సకీ 

నాలో ప్రేమను పెంచావు, మమతను  పంచావు, కరుణతో కనికరించావు, చివరకు నన్నే మరిచావు, అయినా నీమీద ప్రేమ మరువ లేను, నిన్ను విడిచి ఉండలేను. 

తలపులు తల్లకిందు లవలేదు, కోరికలు మరచి ఉండలేదు, జ్ఞాపకాలను వదలి ఉండలేదు, 
తాను నన్ను వదలి వెళ్లినా నేను ఆమెను మరువలేను. 

మనసుని తొలచిన ప్రేమ కొరకు ఆశలతో ఉండుట తప్పు కాదు, ఈ ప్రేమకోసం నాలో బి.పి, షుగర్ పెరిగినా, నాలో  అను కోని రోగం వెంబడించిన, ప్రేమ    సఫలమయ్యేదాకా కొన ఊపిరితో బ్రతుక గలను    

తన  స్నేహితుని ద్వారా అదే డైరీలో తండ్రికి లేఖ ఈ క్రింది విధముగా  వ్రాసి ఇచ్చాడు. 
 నాన్న గారు మీరు చెప్పినట్లుగా నేను ఉద్యోగము సంపాదించేవరకు వివాహము చేసుకోను, మీకు భారముకాను అందుకే ఉద్యోగము వేటకు బయలు దేరుతున్నాను, మీ ఆశీర్వాదము నాకు పంపగలరు, త్వరలో ప్రయోజకునిగా మారి మీవద్దకు రాగాలను, అమ్మ భాదపడవద్దను, అన్నయ్యను వదినను అడిగినట్లు చెప్పగలవు
అందరికి  నమస్కారములు 

అలా డైరీని పంపి  తల్లి తండ్రులకు మొఖం చూపించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఊరుకాని  ఊరు పయన మయ్యాడు మాధవ్
కాల చక్రం 2 సంవత్సరాలు అనుకోకుండా జరిగి పోయిన్ది
                               
సముద్రపు కెరటం గట్టు దాటాలను ఉవ్విళ్లూరుతు వస్తుంది, తర్వాత దాటలేక వెనక్కు తగ్గు తుంది. అట్లాగే మన మాధవ్ మంచి సాఫ్ట్వెర్ కంపెనీలో ఉద్యోగం సాంపాదించాడు, తల్లి తండ్రులు ఎంత కోరినా వివాహము చేసుకోమన్న చేసుకోను, నేను రాముని భక్తుణ్ణి, నాప్రేమ ఫలిం చేదాకా ఇట్లాగే ఉంటా, నాకు చేతనయినంత సాహాయము చేస్తా అని ఇంట్లో వాళ్ళందరి తెలియపరిచాడు, ఎవరు ఏమి మాట్లాడలేక ఊరుకున్నారు. 

అప్పుడే టి.వి. లో ఒక పాట వస్తున్నది 

పున్నమి వెన్నెలలో నీవునేను ఒకటవుదాం 
మురిసిపోయి మైమరిచి పోయి ఆనందంగా విహరిద్దాం 
గగనాన తరాలన్నీ మనల్ని చూసి సిగ్గుపడతాయి 
సంద్రంలో ఉన్న అలలన్నీ మనల్ని చూసి నవ్వు కుంటాయి 

అడవి జింకలు మన చుట్టు చేరి కేరింతలు కొడతాయి 
మనల్ని చూసి నెమలి నాట్యమాడుతుంది 
చిరు కొమ్మలు మనల్ని చూసి కొమ్మ కొమ్మ రాచుకొని పూలు కురిపిస్తాయి 
కొమ్మ ముద్ద కోయల మనల్ని చూసి ఓర్వలేక కూత కూస్తూనే ఉంటుంది 

తుమ్మెద ఝుంకారం   మనకు శ్రవణానందము కలిగిస్తాయి 
సలయేరుల గలగలలు మనస్సును ఉల్లాస పరుస్తాయి 
సెలయేరులో  హంసలు శబ్దము చేస్తూ మనల్ని చూస్తాయి 
మధువును వెదజల్లే పారిజాతాలు, సంపెంగలు మనచుట్టు ఉన్నాయి 

నాకు నీవు నీకు నేను ఒకరి కొకరమై పెనవేసుకొని లతల్లా అల్లుకొని 
వేణు గానంతో రవళి నాదంతో పరవశించి ఏకమవుదాం 

అన్న పాట చక్కగా పాడుతున్నారు ఇరువురు 

వెంటనే చలపతి కి గుర్తుకు వచ్చింది ఇది నేను శ్రావణికి వ్రాసి ఇచ్చిన పాట, కొద్ది మార్పులలో ఉన్నది తప్పా ఇది నేను వ్రాసిన పాట తెలుసుకున్నాడు. 

వెంటనే టి.వి. స్టేషన్ కు వెళ్ళాడు, పాట ఎవరు రచించారు, ఆ చిరునామా తీసుకోని ఇంటికి వెళ్ళాడు. 
ఆ ఇంటిలో రాధ కనబడటం తో తన సంతోషాన్ని ఆపుకోలేక పోయాడు మాధవ్

చాలా రోజుల కు నేను గుర్తుకు వచ్చానా, రా కూర్చో ముందు కాఫీ తెస్తా ఉండు అని  చెప్పి లోపలకు వెళ్ళింది 
ఇల్లు అంతా చూసాడు నిశ్శబ్దముగా ఉన్నది 
కాఫీ త్రాగుతూ మీవారు లేరా, ఇంట్లో ఎక్కడా మీ పెళ్లి ఫోటో కనిపించ లేదు అని అడిగాడు. 

నాకు ఇంకా పెళ్లి కాలేదను కున్నావా మాధవ్ , నా విషయము అట్లా ఉంచు, నీకు పెళ్లైందా, ఏదన్న ఉద్యోగము చేస్తున్నావా, ఒక్కసారిగా ప్రేమకు ఉన్న గుర్తులన్నీ చక చక అడిగింది. 
అయ్యో నిన్ను ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నాను నన్ను క్షమించు, నిన్ను చూసేటప్పటికల్లా నా మనసు మనసులో లేదు అయ్యో ఉండు టిఫిన్ చేస్తా ఎప్పుడు తిన్నావో అంటూ లేవబో యింది, వద్దు వద్దు నీవు మాట్లాడుతుంటే నా మనసు  హాయిగా   ఉన్నది. 
నాగురించి విను నేను పెళ్లి చేసుకోలేదు నీకోసమే వేచిఉన్నాను, మంచి ఉద్యోగము సంపాదించాను. 
మరి నీ విషయము చెప్పు 
నీకు ఉద్యోగము లేదని మా బావకు మంచి ఉద్యోగం ఉందని నేను ఎంత బతిమి లాడిన వప్పుకొనలేదు, ఈ పెళ్ళికి వప్పుకోకపోతే మేము చనిపోతామని బెదిరించారు   , నేను నమ్మిన దేవుడు  రామ చంద్రుడు కాపాడుతాడని  చదువుకున్నా ఏమీ చాతకాని దానిగా మారాను, అప్పటికప్పుడే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరిగింది. 
తిరుగు ప్రయాణంలో తిరిగి వస్తున్నాము కారులో ఉండి  నాన్న అక్కడ ముసలమ్మ సంపెంగ పూలు అమ్ముతుంది ఒక నిముషము కారు ఆపితే కొనుక్కొ స్తాను అని నేను దిగాను కొనుక్కొని తిరిగి వస్తున్నాను లేదో పెద్ద శబ్దం చేస్తూ ఒక లారీ మాకారును డాష్ ఇచ్చింది 
ఆ విషాద సంఘటన నేను నీకు చెప్పలేను, అప్పుడే అందరూ చనిపోయారు. 
నాకు  నచ్చిన కధలు వ్రాస్తూ ఎడిటర్ గా భుక్తి కోసం పనిచేస్తున్నాను ఇదే నా కధ 

మీ ఇంట్లో వారందరూ బాగున్నారా అందరూ బాగున్నారు 

నిన్ను నేను పెళ్లి చేసుకుందా మనుకున్నాను, అదియు నీకు ఇష్టమైతేనే 
ఇష్టం కాక పొతే నీప్రేమనే తలుచుకుంటూ జీవితాంతమూ బ్రహ్మ చారిగా ఉంది పోతాను అంతే తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను 

నీవు  ఒక  సారి వ్రాసిన పాట గుర్తుందా, ఆపాటేగా నన్ను నిన్ను కలిపింది అని లేచి దగ్గరకు వచ్చి కౌగిల్లో బంధించాడు, ఆగు ఆగు వేదమంత్రాల మధ్య పెళ్లి జరగనీ ఈ తనువంతా నీ సొంతమే అని ఒకటే నవ్వులు వేళ్ళు విరిసెను  

Photo   
   









13, మే 2017, శనివారం

Mallapragada Ramakrishna Telugu Stories -12

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రేమతో - ప్రేమ లేఖ (2)


నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా                  

  
  

Mallapragada Ramakrishna Telugu Stories -11

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ప్రేమతో - ప్రేమ లేఖ (2)


నీ మెసేజ్ అందింది, నాలో కలవరం మొదలైనది, నీకు మెసేజ్ పంపాలని తాపత్రయం పెరిగింది, ల్యాబ్ టాప్ తీసాను, నాకు తెలిసిన విధముగా ప్రేమ లేఖను వ్రాస్తున్న, నీకు నచ్చుతుందని నేను ఆశిస్తా, నీ రూపు రేఖలు నా కాంతిలో చిక్కి ఉన్నాయి. నాప్రేమ నంతా రంగరించి, నిన్ను మరువ లేక, నేను ఉండలేక వ్రాస్తున్నాను, ఇదే నాకు కొంత మన:శాంతి.

పరిమళించే పరువపు రెమ్మవు, ఎమన్నా పట్టించుకోక తనువును అర్పించిన బొమ్మవు, రతిని మించిన రసరూపమ్ము చూపించి తన్మయ పరిచే అతిలోక దివ్య సుందరివి, పలుక నేర్చిన చిలుకవు, నడక నేర్చి, నాట్య మాడే, పలకరించి నాట్య మయూరివి, కనులతో కవ్వించి, పెదాలతో పలకరించి, నడకను వయ్యారంగా చూపించి, జడ తిప్పుతూ కదిలే వయ్యారివి.

నిన్ను అర్ధం చేసు కోవటానికి చాలదు నాజీవితం, త్రిగుణాల సమ్మేళనమే నీ గుణం, మొగవాడ్ని గుప్పెట్లో పెట్టుకొనే బ్రహ్మాస్త్రం ఉన్నదానివి, అలసి వచ్చిన వానికి సేద తీర్చే నీలో ఉంది కరుణాస్త్రం,  గాలిద్వారా మనసును ఆకర్షించి చిరు నవ్వును చూపి మనసును దోచే పవనాస్త్రం ఉన్నదానివి, ఎన్ని కష్టాల్లో ఉన్న మనసును రంగ రించి, మొహాన్ని పంచే సమ్మోహనాస్త్రం ఉన్నదానివి, అన్ని సమయములలో ఓర్పు వహించి ఓదార్పు చూపించే సహనాస్త్రం గలదానివి, ఇట్లా ఎన్నో అస్త్రాలు నీలో నిండి ఉన్నాయి. అందుకే నేను నిన్నుఅంటాను  సర్వాస్త్ర సుందరివి.

చీకట్లో కూడా కనిపించే తెల్లని మంచు తెరగల దేహంగా, తళ తళా మెరుస్తూ నిలకడగా ఉన్న నదిగా, వెచ్చని వేడి నందించి చల్లని మనసుకు హాయిగా , ఆహ్లదంగా, ఊరట కల్పించే దిశగా, నిశ్చలముగా, నిర్మలంగా, నిలకడగా స్వశ్చంగా సుఖాన్ని అందించే నా కలల సుందరివి.

అంటూ ప్రేమ లేఖను (మెసేజ్)  రాధకు వ్రాసాడు మాధవ్

ఆ మెసేజ్ చూసి రాధ మాధవ్ కు మెసేజ్ పెట్టింది.
నవమన్మధాకారా రూపంతో, ధ్రుడకాయముతో, ఆరడుగుల ఎత్తుతో తెల్లని పంచ లాల్చీ ధరించి, చేతులకు ఉంగరాలతో, మేడలో బంగారు గొలుసుతో నా మనసునుని దోచిన నటనాగ్రేసుడవు నీవు, నా ఊహలన్నీ నీమీదే
నీమాటలకు చిక్కి నీవు ఆడమన్నట్లుగా ఆడి, నీకు ఉల్లాసము కల్పించి ఉత్సాహము పెంచి, సమయాన్ని సద్వినియోగము గా శకలం అర్పించాను ఆనాడు, ఆతీపి గుర్తులే నాకు బంధువులు.

నన్ను అస్త్రాలతో పోల్చి మూలగచెట్టు ఎక్కించావు ఎందుకు, నేను ఎప్పుడు నీమాట జవదాట లేదు, నేనెప్పుడూ నీ నీడగా వెనకాలే ఉండేదాన్ని, ఒక చెట్టులాగా ఎదిగి చెట్టు చేసిన ఉపయోగాలన్నీ నేను నీకు చేసాను. కాలంతో మారకుండా నాకోసం వేచిఉన్నావని సంతోషముగా ఉన్నది. నిన్ను తలవని రోజు లేదు, నీకోసం ఎదురు చూడని రోజులేదు, నీవు చేసే సమాజ సేవకు నీ చేదోడుగా ఉండి సహాయము చేసిన రోజులు ఇంకా గుర్తు ఉన్నాయ్.

రాగాలన్నింటిలో అనురాగము గొప్పది, బంధాలన్నింటిలో అనుబంధం గొప్పది, స్వేశ్చవాయువుల్లో వెలుగుబాట గొప్పది, పున్నమి వెన్నెలలో పూల పరిమళాలు గొప్పవి, నువ్వు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవటం అన్నింటికన్నా గొప్పది. మగవానికి సహజంగా ఉండే అహంకారము లేకుండా ప్రేమను పంచే తత్వం నీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషము మరియు నిత్యం ధరిత్రియందు నాకోసం ఎదురు చూపులతో ఉన్నందుకు నేనే నీకు సర్వం అర్పించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాను.

కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, క్షమయా ధరిత్రిగా, కులధృమ పత్నిగా, మన కుటుంబానికి నేనొక ఆశాకిరణంగా నీకోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను
నిమెసేజ్ కోసం ఎదురు చూస్తుంటాను మాధవా