10, నవంబర్ 2016, గురువారం

స్నేహమంటే ఇదేనా ? (Story)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
సర్వేజనా సుఖినోభవంతు

స్నేహమంటే ఇదేనా ?


అది ఒక 10 అంతస్తులు గల భవనం, ఆ భవనమునకు నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి, నాలుగు వైపులా లిఫ్టులు ఉన్నాయి, నాలుగు వైపుల నడుచుటకు వీలుగా  కలిగిన భవనము. అందులో 301  నెంబరు గల మూడు బెడఁరూం లు గలగి ఒక పెద్ద హాలు కలిగిన ప్లాట్ లో ఉన్నాడు సీతా రామయ్య గారు వీరికి ఒక కూతురు (రేఖా ) ఒక కొడుకు ( రేవంత్ ) కలిగి ఉన్నారు. ఈయన రిటైర్ టీచర్ పెన్షన్ తీసుకుంటూ కొడుకు దగ్గర ఉన్నాడు,  భార్య అనారోగ్యముతో పరమ పదించింది. కొడుకుకు కూతురుకు పెళ్లిచేసి తన నైతిక ధర్మాన్ని పాటించాలని అక్కడే ఉన్నాడు.

అమ్మాయి " రేఖా" నీ పెళ్లి విషయంలో, ఉద్యోగం విషయంలో మంచి సలహా ఇచ్చేవాడమ్మా, నా స్నేహితుడు రాధాకృష్ణ.  ప్రస్తుతం వాడు కాంటాక్టులో లేడు, వాడు ఇదే ఊరిలో ఉన్నట్లు మాత్రం తెలిసింది.

అప్పుడే డోర్ బెల్ మోగింది, వెంటనే రేఖ తలుపు తీసింది, తీసుకోండి  కొరియర్ లెటర్ వచ్చంది, దీని నిమిత్తం 1000 రూపాయలు కట్టండి అని చెప్పాడు.
అప్పుడే సీతారామయ్య గారు వచ్చి నీవు వచ్చింది కరక్ట్ అడ్రస్సేనా అని అడిగాడు, ప్లాట్ నెం. 301 ఉన్నదండి అది నిజమే ఎవరి పేరుతో "రేవంత్"
అమ్మాయి తొందర పడి పార్సిల్ తీసుకోకు అందులో  ఏమున్నాయో గమనించాలి, ఏవైనా చట్ట వ్యతిరేకమైనవి వచ్చాయంటే అందరికీ కష్టం అయినా ఎక్కడ నుంచి వచ్చిందో చూడమ్మా నాన్న దీనిమీద హైదరాబాద్ అని ఉంది, అవునా మనం ఉంది హైదరాబాదే కదా, అవును అవును నాన్న ఇది ఎదో ఇతర దేశం నుంచి వచ్చిన లెటర్ లావున్నది.

నిజమా అక్కడ ఫోన్ నెం ఉందేమో చూడు అన్న మాటలకు ఫోన్ నెం చూస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్  నెం. లకు టాలీ కాలేదు, అవును నాన్న ఇది మన ఫోన్ నెం కాదు.  అయితే ఒక పని చేయమ్మా నీవు సెల్  ద్వారా ఆ కవరు ఫోటో తియమ్మా తీసాక నీవు ఏమి చెప్పకు వచ్చినతనితో ఇప్పుడు రేవంత్ లేడని రేపు తీసుకు రమ్మనమను చెప్పు  అప్పుడు డబ్బులు కట్టి తీసు కుంటామని చెప్పు అట్లాగే చెప్పింది రేఖా. 

చూడమ్మా రేఖా తలుపు లేసుకో బిల్లు కొట్టేంగానే గభాలన తీయకు, తెలిసిన వారైతేనే తీయి అంటూ నేను మందులు తీసుకోని వస్తాను అంటూ బయటకు నడిచాడు తండ్రి. 
మందులు తీసుకోని రసీదు తీసుకోని , మందులు తప్పు ఇచ్చాడని గట్టిగా అడిగి మరీ కొనుకొచ్చాడు. 

అంతలో బెల్ మ్రోగింది వెంటనే తీసాడు ఏమండి మీ ఇంట్లో వారు గ్యాస్ బుక్ చేశారు తీసుకోండి అని సిలెండర్ రసీదు చేతికిచ్చాడు, ఎంబాబు ఈ రశీదు మీద అడ్రస్ చూసావా ఇది 301, దీనిమీద 801 అని ఉంది సారి అండి అని నేను  చూడలేదు వెళ్ళొస్తాను అని బయలుదేరాడు వచ్చినవాడు. 

 ఈ      భవనంలో సరిఅయిన వసతులు కరువైనట్లు ఉన్నాయి, క్రింద వాచమెన్ కు అన్నీ వివారాలు తెలిసి ఉండాలి, నాలుగయిదు బాషలు వచ్చి యుండాలి, కొత్తవారు వచ్చినట్లు గమనించాలి. ప్రతి విషయమున అసోసియషన్ కు చెప్పటం కమిటీ నిర్ధారించటం అన్నీ పూర్తి అయ్యేటప్పటికల్లా ఒక నెల పడుతుంది. అందుకే అపార్టుమెంట్స్ లో జీవించటం ఒకరకంగా జైల్లో ఉన్నట్లే ఇదే నా అనుభవంతో చెపుతున్నాను. ఇందులో ప్రక్కన ఎవరు ఉంటారు కూడా తెలుసు కోలేరు, తెలుసుకున్నా ముక్కుకు సూటిగా మాట్లాడుతారు. 

రేఖా మా  రాధాకృష్ణ ఉంటే అపార్టుమెంట్సులోని ప్లాట్ లో ఉండటానికి అస్సలు ఇష్ట పడడు
పరిస్తుల ద్వారా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇదిగో నాన్న కాఫీ త్రాగు ప్రతిసారి మీస్నేహితుణ్ణి గొప్పగా చెప్పుకుంటావు ఎందుకు నాన్న. 

ఎం చెప్పేదమ్మా నీకు నాస్నేహితుడు మీ అమ్మను నన్ను కలిపాడమ్మా , మానాన్న గారు అమ్మగారు వప్పుకోకపోతే రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెట్టడం కాదు, అప్పటికి  నాకు ఉద్యోగములేదు, కొత్త జంట బ్రతుకుటకు తను చెప్పే కొన్ని ట్యూషన్లు నన్ను చెప్పుకోమని నాకు సహకరించిన మహానుభావుడు.  తరువాత అను కోకుండా ఎపుడో వ్రాసిన గవర్నమెంటు ఉద్యోగం రావటం నేను నా తల్లి తండ్రుల వద్దకు చేరటం, నాస్నేహితుడు ట్రాన్సఫర్  వెళ్ళాడు. 

కళ్ళంబడి నీల్లు తుడుచుకుంటూ ఉండగా నాన్న మళ్ళీ కలవలేదా, ఎందుకు కలువలేదమ్మా 16 ఎల్ల తర్వాత కలిసాను  నీకు తెలుసా అన్నయ్య బ్యాన్కు ఉద్యోగం ఎలా వచ్చిందనుకున్నావో కొంత డిపాజిట్ చేయమన్నారు ఆసమయంలో నా దగ్గిర  డబ్బు   లేక వదులు కుందామని అనుకున్నాను, అనుకోని విధముగా ఆ బ్యాంకి నాస్నేహితుడు వచ్చాడు నా పరిస్తి గమనించి నాకు డబ్బు సహాయం చేసాడు, నీవు రిటైరైన తర్వాత ఇవ్వవచ్చు అని చెప్పి తన అడ్రస్సు ఫోన్ నెంబరు ఇచ్చాడు. 
నేను కనీసము తీసుకున్న డబ్బు ఇవ్వకుండా ఈ లోకం నుండి పరలోకం పొయ్యేలోపు సహాయం తీర్చాలని ఉందమ్మా ఆ డబ్బు దాచి ఉంచా, మరో వైపు నీకు, అన్నయ్యకు పెళ్లి చేయాలి 
అని చెప్పుతూ కళ్ళంబడి నిల్లు తెచ్చుకున్నాడు, అది చూసి రేఖ కూడా కళ్ళంబడి నిల్లు తెచ్చుకున్నది. 

అప్పుడే బెల్ మ్రోగింది తీసి చూసాడు ఏమండీ నాకు భయంగా ఉన్నదండి మానాన్న కు అనారోగ్యముగా ఉన్నది, ఒక్కరవ్ హాస్పటల్ దాకా తోడుగా వస్తారా అని అడిగింది ఒక యువతి   

నాన్న వెళ్లి రానా అని అడిగింది, అమ్మా నీవు వద్దమ్మా ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మే పరిస్థితి లేదమ్మా నేను వెళ్ళొస్తాను అనిచెప్పి లిఫ్టులో క్రిందకు దిగాము, అక్కడ ఒకవ్యాను రెడీగా ఉన్నది దానిలో ఆడపిల్లలను ఎక్కిస్తున్నారు, నాకు ఎదో అనుమానం వచ్చి ఎక్కడకు పోతున్నారు అని అడిగా ఒకతను నా కళ్లజోడు లాక్కొని ఒక్కతోపుతోసి వ్యాన్ కదిలించాడు, చేసేది లేక సెల్ ద్వారా అతి కష్టం మీద వ్యాన్ ని ఫోటో తీసి, నెమ్మదిగా కళ్ళజోడు సర్దుకొని ఆ వీధిలో నడుస్తున్నాడు.

అన్యమనస్తుతో నడుస్తూ వెళ్తుంటే వెనుకనుండి ఎదో శబ్దం వచ్చింది అప్పుడు ఏమి జరిగిందో తెలియదు నేలపై పడి పడిపోయాను, చుట్టు మూగినవారు ఏమయ్యా కళ్లు కనబడ పోకుంటే ఎవరన్నా తోడు తెచ్చు కోవచ్చు కదా, నిన్ను ప్రక్కకు తోసి ఒక పెద్దమనిషి కారు క్రిందపడ్డాడు అన్నారు, అప్పుడే కొంత ఓపిక తెచ్చుకొని అడ్రస్సు కనుక్కోని హాస్పటల్ వద్దకు పోయాను. అక్కడ చార్ట్ మీద రాధా కృష్ణ అన్న పేరు చూసాను, వెంటనే అక్కడకు  చేరాను అప్పుడు తెలిసింది అక్కడ ఉన్నది నన్ను రక్షించింది నా స్నేహితుడు రాధాకృష్ణ అని డాక్టర్ ను కలిసాను వివరాలు తెలుసుకున్నాను, యాక్సుడెంట్లో   ఒక కాలుమీద కారు పోవటం వల్ల ఒక కాలు సగం వరకు తీయ్యవలసిన స్థితిని కూతురితో కొడుకుతో చెప్పినట్లు తెలుసుకున్నాడు. 
వారు డబ్బు గురించి ఆలోచిస్తున్నట్లు గమనించి అప్పటికప్పుడు ఏ.టి.ఎం లో కొంత తీసి హాస్పటల్ ల్లో కట్టాడు. రాధాకృష్ణ  భార్య పిల్లలకు ధైర్యం చెప్పి అక్కడే ఉన్నాడు సీతారామయ్య, ఇంటిలో ఉన్న రేఖకు ఫోన్ చేసి తాను ఎక్కడున్నదో తెలిపి రమ్మన్నాడు. 

తన స్నేహితుని ఆర్ధిక పరిస్థితి తెలుసు కున్నాడు,   ఆర్థికంగా ఆదుకొని తను ఇవ్వ వ ల సి న  పై కాము తీసు కోమని కోరాడు, నాప్రాణాన్ని రక్షించబోయి నీకాలు పోగొట్టు కున్నావు నీకు ఏమి ఇచ్చిన నాకు ఇంకా ఋణము తీరదు అన్నాడు. 
నీకు నేను చేయగలిగినది ఒక్కటే కనిపిస్తున్నది నాకొడుకుని సంప్రదించి నీకూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటుంటే స్నేహానికి స్నేహమా, కాదురా నీవడిగితే నాప్రాణాన్నే ఇస్తాను. 

అదికాదురా మనం వేరు మన పిల్లలు వేరు వాళ్ళు ఇష్టపడితే సంతోషించేవాళ్ళము మనమే కదా అన్నాడు 

అప్పుడే పాపర్లో చదివాడు రాధాకృష్ణ ఏమిట్రా సీతారామయ్య నీవు పాపర్లో కూడా కనిపిస్తున్నావు ఏమిటి విశేషం నాకేం తెలుసురా అన్నాడు సరే చూడు దీనిలో ఉన్నది "చదివాడు గంజాయి అమ్మే వారిని, దొంగ మందులు అమ్మేవారిని, అమ్మాయిలను అమ్మేవాళ్ళను పట్టు కొనుటకు సహకరించిన సీతారామయ్య కు బహుమతి ఇవ్వటం జరుగుతున్నది అని చదివాడు. 

 గవర్నర్ ముందు బహుమతి తీసుకోని, అందరి ముందు ఆ బహుమతి తన స్నేహితుడైన రాధాకృష్ణ కు  ఇవ్వటం జరిగింది సీతారామయ్య . ఇరువురిని అభినందనలతో ముంచేశారు, కన్న బిడ్డలు సంతోషంతో మునిగి పోయారు. 
             

9, నవంబర్ 2016, బుధవారం

తాత మనవుడి ఆట. (story)

 ఓం శ్రీరామ్  -  శ్రీ మాత్రే నమ
సర్వేజనా సుఖినోభవంతు

తాత మనవుడి ఆట. (story)

తాతా నీవు అంత ఆదుర్దా పడతా వెందుకు, నేను ఆ కుక్కను కొట్టి నందుకా లేదా అది  కరుస్తుందేమో నని భయమా,  లేదురాబాబు లేదు, ఎంతైనా కుక్కలతో ఆడుట  మంచిది కాదు, తోకాడిస్తూ తిరుగుతుందని తోక పట్టుకున్నావో అది కరుస్తుంది కదా అందుకే ఆదుర్దా, లేదు తాత నాకేదైనా ఆయిందనుకో నాన్న నిన్ను తిడతాడని కదా ఆదుర్దా .  ఓరి బడుద్దాయి అన్నీ తెలిసి నన్నే   ఆట పట్టిస్తున్నావు అంటూ తాతగారు కఱ్ఱ పట్టుకొని వెంబడి పడ్డాడు, నీకు చిక్కను అంటూ పరిగెత్తాడు మనవుడు. ఆమ్మో వీడిదగ్గర చాలా జాగర్తగా ఉండాలి అని అను కున్నాడు తాత. 

  తాత తాత విండోస్ ఓపెన్ కవాటం లేదు, ఎలా ఓపెన్ చేస్తారో తెలుపు అనగా బాబు కొబ్బరినూనె వ్రాయి అవి ఓపెన్ అవుతాయి అని చెప్పాడు మనవుడితో .
కొడుకు అడుగు పెడుతూ నాన్న ఈ లాబ్ టాబ్ కు కొబ్బరినూనె వ్రాసిందెవరు, అది పాడై పోయింది,  అసలు మన చిన్నా గాడేడి, ఇది అంతా వాడిపనే అయ్యింటుంది, అని గట్టిగా అరిచాడు కొడుకు కోదండం.
ఆలా అరవకు ఎదో కొబ్బరినూనె సీసా జారి పడి యుంటుంది, పొనీలేరా అది పాడయితే బాగు చేయిద్దాము, లేదా కొత్తది కొనుక్కో, చిన్న తప్పును పెద్దదిగా చేసి ఆరవకురా,

నాన్న నీవు  చిన్నాను వెనకేసు కొస్తున్నావు, అంటూ లోపలకు వెళ్ళాడు కోపంగా .
 అబ్బా వస్తూనే ఆ అరుపు ఎందుకు, కూల్ అవ్వండి డ్రింక్ తీసుకోని వస్తా, నీకు కుడా లోకువై పోతున్నా రానురాను, ఎదో ఎవరు అన్నారు " అత్తమీద కోపమ్ దుత్తమీద చూపారుట "
ఏమిటే గొణుగుతున్నావ్ మనబ్బాయ్ ఎంచేశాడో తెలుసా "ఏమీ తెలియని వాడ్ని అరిస్తే, కొడితే పాడైన వస్తువు రాదుకదా, మీరు కోపిష్ఠుతండ్రి గా పిల్లవాని ముందు ప్రవర్తించ కండి, వీలు చూసుకొని నచ్చ చెప్పుదాం. ఏమిటో నా మాటలు అటు నాన్న అర్ధం చేసుకోరు, నీవు అర్ధం చేసుకోవు కదా.
అట్లా అనకండి అంతా  మనమంచికే జరిగిందనుకోండి, సరే అట్లాగే, అబ్బా నవ్వండి మీరు నవ్వుతుంటే ఏంతో  ముచ్చటగా ఉన్నదండి, ఆ ఆ ఆగు ఇప్పుడేం టెండర్ పెట్టకు అసలే ఖర్చులో పడ్డా .. నవ్వు కుంటూ లోపలకు వెళ్ళింది భార్య భారతి. పాపరును చూస్తూ కూర్చున్నాడు కోదండం. 
 
          తాతా ఎవరిని అరుస్తున్నాడు నాన్న, నిన్నేరా
నేనెంతప్పు చేసాను, లాబ్ టాబ్ ను పాడుచేసావుట అందుకని
అవును తాతయ్య నేను నిన్ను అడిగాగా విండోస్ ఓపెన్   కావాలంటే నూనె వ్రాయమన్నావుగా
నేను కిటికీ తలుఫులనుకున్నా, లాబ్ ట్యాబ్  అను కోలేదురా చిన్నా. 
నాకేం తెలుసు నీవు చెప్పావు నేను చేసాను, అది నాతప్పు కాదు, అంతా నీదే తప్పు కదా తాత.
అవునురా అంతా నాదే తప్పు, నీతో మాట్లాడం కష్టంగా ఉందిరా.   

సరే మీనాన్న కోపం తగ్గేదాకా అలా మార్కెట్ కు పోయి కూరలు, పళ్ళు, తెద్దాము వస్తావా, ఎందుకు రాను తాతయ్య పోదాం పదా అంటూ మరిచా,  అమ్మొమ్మ వద్దకు పోయి కూరలకు పోతున్నాము అని చెప్పి సంచి తీసుకొనిరా, ఎందుకంటే ప్లాష్టిక్ కవర్లు వాడొద్దన్నారు కదా, కాదు తాతయ్య పలుచనవి మాత్రమే వాడొద్దన్నారు, నీకు తెలియదా అన్నమాటాలకు "గుడ్డొచ్చి పిల్ల నెక్కిరిచ్చించి నట్లు ఉంది నా పరిస్థితి "అని గొనుకున్నాడు తాతయ్యా.

కూరలు కొన్నాడు తాతగారు, అప్పుడే మనవుడు ప్రక్కనుండి ఒకటమాటా తీసి నోట్లో పెట్టు కున్నాడు, అది చూసి తాతయ్య తప్పు కదా నీవు చేసేపని అన్నప్పుడు, ఎం తప్పుకాదు దీనికి కూడా డబ్బులు తీసుకోమను, నేనేమి దొంగను కాదు కొద్దిగా రుచి చూసా అంతే, అన్నమాటలకు షాపువాడు, తాతయ్య ఆశ్చర్యపోయారు "వేలుడంత లేడు, పెద్ద పెద్ద మాటలు పలుకు తున్నాడు".అని మనసులో అనుకున్నాడు.

వెంటనే తాను తీసుకున్న కూరలకు 500 రూపాయల నోటు ఇచ్చాడు తాతయ్య.
సార్ 30 ముపై రూపాయల కూరలకోసం 500 ఇస్తే ఎట్లాసార్, నేను ఇప్పుడే వచ్చాను, మీరు ఏమన్నా కొన్న తర్వాత డబ్బులు ఇవ్వండి మీరు రోజు వచ్చే వారే కదా అన్నాడు షాపువాడు. పళ్ళు , పూలు కొని తాత మానవుడు ఇంటి దారి పట్టారు.

       మనవుడికి హఠాత్తుగా గుర్తుకువచ్చి తాత నీవిక్కడే ఉండు అంటూ తాత దగ్గర పర్సులో డబ్బులు తీసి ఇప్పుడే వస్తా అంటూ పరిగెత్తాడు, కూరల వ్యాపారునికి ఇవ్వటానికి పోతున్నా అన్నాడు.

ఎందుకురా అంత తొందర రేపు ఇవ్వచ్చుగా తెలిసిన వాడేగా, అసలు అతనికి గురుతుందో లేదో   పోదాం పదా అసలే చాలా సమయము అయినది కదా

తాత " కష్టంతో పొట్ట పోసు కొనే వాళ్ళ సొమ్ము మన కెందుకు" ?  ఎప్పుడూ నమ్మకం ముఖ్యం అంటారు కదా, అందుకే కూరలమ్మే వాని నమ్మకము వమ్ము చేసి పోవటం మంచిది కాదు కదా తాతయ్య, మనం ఇవ్వలేదనుకో డబ్బు లివ్వ కుండా ఎగ్గొట్టి వెళ్లారని అంటాడు, అందుకే వెళ్లి ఇచ్చివస్తా, మనవుడు పరిగెడుతుంటే నోరప్పగించి చూస్తూ ఉన్నాడు.   

తాత నాకేమయిన కధ చెపుతావా, కొన్ని నీతివాక్యాలు చెపుతాను విను 

మనుష్యులకు రోగాలు వేగంగా వెంబడిస్తాయి కుందేలుగా, నెమ్మదిగా తొలగి పోతాయి. 
తాబేలుగా మనుష్యులకు నెమ్మదిగా డబ్బు చేరుతుంది, స్వార్ధానికి చిక్కి ఉండ లేనని కుందేలుగా వేగంగా వెళ్ళిపోతుంది. 
 
అపజయం వచ్చిందని నిరాశచెందకు, ప్రాణాలున్నంత వరకు దేశం కోసం పోరాడుతూ ఉండాలి.
నేను వ్రాసిన కవితలు కధలు చివరిదాకా చదివిన వారికి దానిలో ఉన్న నీతి కనిపించి  మంచి మార్గంలో దేశం కోసం పోరాడ గలరు.   

నేనొక్కడినే ఏమి చేయగలను ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు సంకల్ప బలముతో దేశానికి నీ శక్తి చూపి అందరి కీ  సహాయకుడిగా ఉండవచ్చు. 
సూర్య భగవానుడు ఒక్కడే ప్రాంచానికి వెలుగు నందిస్తు న్నాడు గమనించు. 
చదువు రాని వాణ్ణి తక్కువ చేయ వద్దు, అతని తెలివిని బట్టి ఉపయోగించు కోవటం నేర్చుకోవాలి. 
మురికనీరు దప్పిక తీర్చలేక పోయిన మంటను ఆర్పుటకు ఉపయోగపడును, ఉపయోగించుకొనే తెలివి మనకుండాలి ఉపయోగము లేని వస్తువు లేదు అని తెలుసుకో . 

మనిషిగా మాట్లాడలేకపోయిన పశువులా మౌనంగా  ఉండుట వళ్లు కొన్నికార్యములు నెరవేరుతాయ్. 
కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండేవాని వాక్కు ఖచ్చిత ముగా నిజ మవుతున్నదని లోకమే తెలుపు తున్నది. 

ఏమిటి మీ పురాణాలు  మనవుడికి చెపుతున్నారా, వాడు ఇంగ్లీషు మీడియం చదువు తున్నాడు, మీరు చెప్పిన మాట ఒక్కటి కూడా వాడికి  అర్ధము కాదు ఎందుకు వృద్దాశ్రమ అని అంటూ లోపల నుంచి వచ్చింది కోడలు. 

ఎందుకమ్మా తాతగారిని అంటావు, మనభాష వదలి పరభాషా నేర్చు కోమని వత్తిడి చేసినందుకు నిన్ను నాన్నను అనాలి, నేను మాతృభాషను వదలను, అన్నీ  భాషలు నేర్చుకొనుటకు నాకు సహకరించండి అన్న మాటలకు అందరూ అలా శిలలుగా మారిపోయారు 
అప్పుడే గుడి గంట మ్రోగింది శుభసూచన అంటూ ఉపన్యాసము ముగించారు తాతగారు .


8, నవంబర్ 2016, మంగళవారం

సమయం వ్యర్థం చేయకు (Telugu Story)

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:

సర్వేజనాసుఖినోభవంతు

ఇది కథ కాదు - నిజమో  కాదో మీరే చదివి చెప్పండి ?
 
బాబు సమయానుకూలముగా పోవుటము కాదు, సమయము వ్యర్ధము కాకుండా సద్వినియోగము చేసుకోవటం మంచిది, వయసులో ఉన్నప్పుడు కష్టపడి నలుగురికి సహాయము చేసి నట్లయితే అదే నీకు అక్కరకు వచ్చును కన్నా.

అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా   అంటూ  పాదాలకు నమస్కరించాడు,  చెపుతున్నానీ  ఏమీ అనుకోకు,  ఆ పరమేశ్వరుని నమస్కరించి, నీ భార్యకు క్షేమ సమాచారములు చెప్పి, బయలుదేరటం ఒక అలవాటుగా మార్చుకోవాలి, ఇక ముందున్నదంతా నీ తరమూ, నీ బిడ్డల తరము ఆధునిక పద్దతులలో ఆధునిక విద్యను నేర్పాలి, నీవు కూడా దేశ సేవచేస్తూ, మాద్వారా నేర్చుకున్న విద్యతో, నికష్టంతో నేర్చుకున్న విద్యతో  అందర్నీ బ్రతికించే విధముగా మార్చు కోవాలి, సమయం వ్యర్థం చేయకుండా జీవితము గడపాలి.

అమ్మా నీ మాటలు అక్షరాలా పాటిస్తాను,  అని చెప్పి బయలుదేరాడు.
అప్పుడే హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై బయలు దేరాడు "రామకృష్ణ "
వీధులన్నీ జన సమూహముతో పాటు వాహన పొల్యూషన్  ఎక్కువ ఉంది, నెమ్మదిగా పోతున్న నన్ను ఒక్కసారి పొగకమ్ముకున్నది, హెల్మెట్లో  పొగచూరి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది, అప్పుడు స్కూటర్ ఆపాను, నాముందే ఒక పోలీసు వ్యాను ఆగింది, లైసన్సు , ఆర్ సి బుక్  చూపినా, హెల్మెట్ పెట్టుకోలేదని ఫెన్ కట్టమన్నారు, నేనొక భారత పౌరుడుగా వారితో వాదన చేయక వారికి  నేను పైకము కట్టి రసీదు తీసుకున్నా, వారితో  ఒకటే అడిగాను, నా ముందు 30 సంవత్సరాల పైన కొన్న లారీ పొగవల్ల మా ఆరోగ్యము చెడకొడుతుంది దాన్ని ముందు సీల్ చేయండి, అని లారీ నెంబర్ చెప్పగా, ఇది మేము ఏమీ చేయలేము, ప్రభుత్వము వ్వారి దృష్టిలో ఉన్నది, నీవు మాకు చెప్పనవసరము లేదు అని చెప్పి వెళ్లి  పోయారు, అప్పుడు నేను అనుకున్నా ఈ  లోకం ఎప్పుడు మారుతుంది, ధర్మం ఎక్కడ బ్రతుకుతుంది.
నేను ఒక లెక్చరర్ గా పనిచేస్తూ విద్యార్ధులకు నీతి పాఠాలు భోధిస్తున్నాను.

కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను, అప్పుడే నాముందుగా ఒక  నీళ్ల ట్యాన్కి నీళ్లు రోడ్డుమీద  పోసుకుంటూ వెళుతున్నది, దాన్ని అడిగే వారు లేరు, నేను లారీ ఆపి డ్రైవర్ను అడిగితే మాకష్టాల్నీ మీకెలాచెప్పాలి,  ఆఫీసు వచ్చి రేపోర్టు చేయండి అన్నాడు, అప్పుడే లారీ వెళ్ళగానే అక్కడ తడినీరు ఉండటం వల్ల కొత్తగా నేర్చుకున్న ఒక విద్యార్థి రెండుకాళ్లు నేలపై పెట్టుకుంటూ అక్కడకు వేగంగా రావటం, ఒక్కసారి బ్రేక్ వెయ్యటం, వెనుకచక్రం జారటం క్షణంలో కాలుమీద స్కూటర్ వేసుకొని  పడింది. పెద్దగా రోదన వినబడింది, జనం అందరూ చుట్టుమూగారు, వింతగా చూసారు.

అప్పుడే నేను మానవతా దృక్పధముతో ఆవిద్యార్ధికి ధైర్యము చెప్పి, స్కూటర్ ను ప్రక్క షాపు దగ్గర ఉంచి ప్రక్కనే ఉన్న హాస్పటల్ లో చేర్చగా కాలికి ఫ్యాక్చర్ ఆయినదని చెప్పారు,  వెంటనే నా దగ్గర ఉన్న పైకము కట్టి, విద్యార్థి చెప్పిన ఫోన్ చేసి వారిని పిలిచి కొంత ఆలస్యముగా ఇంటికి  చేరాను.
జరిగిన విషయాలన్నీ తల్లికి,  భార్యకు చెప్పగా ఇద్దరూ ఒక్కసారిగా మంచిపని చేసావు, ఇదిగో ఈ ప్లాస్కోలో టీ త్రాగి కాస్త రెష్టు తీసుకో, మేము ఇప్పుడే హాస్పటల్ దాకా పోయి ఆవిద్యార్ధిని చూసి  మంచిమందులు ఇవ్వమని డాక్టర్ను కోరి, మార్కెట్కు పోయి కూరలు తీసుకొని వస్తాము. అని చెప్పి బయటకు నడిచారు అత్తా కోడలు, అప్పుడే టి.వి లో చూడఁగా పొగ కాలుష్యం వళ్ళ ఊపిరి తిత్తులలో పొగచేరి వంద మంది అనారోగ్యులుగా మారినట్లు చెప్పారు, నాయకులు ఇదే అవకాశం గా చూసి ఆర్ధిక సహాయం ప్రకటించారు, అది రోగులకో పార్టీ కార్యకర్తలకో ప్రకటించ లేదు ఇదేమిలోకం,  మారేదెప్పుడో అనుకోవటం తప్ప నేను ఏమీ చేయలేక పోయాను.
    
తల్లికోసం, భార్యకోసం ఎదురుచూసున్నాడు"రామకృష్ణ  ", ఇంటిముందు ఆటోలో దిగటం చూసాడు, అమ్మా కూరలు తెలీదా , చాలాసేపు ఉన్నారే అని అడిగాడు . చూడు బాబు ని భార్య చాలా గట్టిగా మాట్లాడింది  అనుకూ కొంత ఆలస్యమైనది అని చెప్పింది . 
సరే లోపలకు రండి మనం భోజనం చేసాకా మాట్లాడుకుందాం అని చెప్పి టి. వి. చూస్తూకూర్చున్నాడు . 
బోజనం కు రండి అని భార్య పిలుపుకు వచ్చి కూర్చొని చాలా బాగున్నాయి వంట ఎవరు చేశారు నువ్వా అమ్మ అని భార్యను అడిగాడు, నేనే చేసానండి నేను మీ అమ్మగారి సలహా తీసుకోని నేనే చేసాను అన్నది . 
అందరి భోజనాలు పూర్తయినాయి. 

ఆ ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడికెళ్లారు అని అడుగగా తల్లి కలగచేసుకొని మేము నీవు చెప్పిన హస్పటల్ వెళ్ళాము ఆ విద్యార్థి పలకరించాము, ఒక్కసారి డాక్టర్ ను కాలిసాము, డాక్టర్ తో కోడలు చక్కగా మాట్లాడింది. 

ఏమ్మాట్లాడావో చెప్పవే భారతి అని అడిగాడు.  హాస్పటల్స్ ఏదోవిధముగా రోగులను ఏడిపించి డబ్బు గుంజే మనస్వ భావములో ఉన్నారండి, చిన్న దెబ్బకు అన్ని టెష్టులు చేస్తే గాని ఏమిచెప్పలేమని బెదిరించారు విద్యార్థి తల్లిని ఆమె భాదపడుతూ మాతో చప్పింది, డాక్టర్ తో ఆవిషయమే గట్టిగా అడిగాను,  వారు చెప్పింది ఒకటే మా హై కమాండ్లను పాటించటం తప్ప మేము ఏమి చేయలేము, అన్నీ  టెష్టులు చేయగలిగితేనే మేము మందు వాడగలము, మామీద నమ్మకము లేకపోతె మీ పేషేంట్ ను వేరే హాస్పటల్ ల్లోకి మార్చుకోండి, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, మీకు విద్యార్థికి సంభంధం ఎక్కడున్నది అని గట్టిగా అన్నాడు డాక్టర్ . అప్పుడు నేను కోపం ప్రవర్తించకుండా నాకు తెలిసిన డాక్టర్ ను పిలిపించాను ఆమె వచ్చి, పెద్ద దెబ్బ తగళ్లేదు,అంటూ అక్కడ డాక్టర్ ను కలిసింది. 

ఎం జరిగిందో నాకు  తెలియలేదు, కొన్ని మందులు వ్రాయగా అవినేను తీసికొనివచ్చి, ఇచ్చి ఆ విద్యార్థిని ఇంటిదాకా దించి, స్కూటర్ ను రేపెర్కి ఇచ్చి వచ్చాము. 
ఏమిటో ఈలోకము అర్ధం పర్ధం లేకుండా ప్రజల బలహీనతలను డబ్బు చేసుకుంటున్నారు , ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందో అని నెమ్మదిగా  చెప్పింది. 

నిజమేనే నీవుచెప్పింది, ఈ మార్పుకు మనసహాయము, మనకు తెలిసిన విషయాలను తప్పక ప్రభుత్వము ముందు ఉంచుదాం, పరిష్కారం కోసం భారతీయులుగా పోరాడదాం 
అవునురా బాబు నీవు చెప్పింది ఖచ్చితము, అన్యాయాన్ని చూసినప్పుడు తప్పక న్యాయం జరిగేదాకా పోరాడదాం, మనదేశ ప్రగతిని కాపాడుదాం, ఈ తల్లి సహాయము తప్పక ఉంటుంది, భయపడి వెనుకడుగు వేయకు  దేశం కోసం ప్రాణాలర్పిందం .  అట్లాగే  ........ అట్లాగే .......
         --((*))--   
       

5, నవంబర్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 11/2016/42

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు

*ఓ ప్రేమ సాక్షి

నీ  పేరు ఏమిటో 
నీకు ఏపేరున్న నాకు సాక్షి 
నీకు నేనంటే చాలా ఇష్టం 
నీ చూపే నాకు సాక్షి 

నీకు నేనంటే ప్రాణమే 
నీ పరుగులే నాకు సాక్షి
నీకు నేను అభిమానినే 
నీ నిరీక్షణే నాకు సాక్షి 

నీకు నేనంటే అనురాగమే 
నీ ఆతురతే నాకు సాక్షి 
నీకు నేనంటే ప్రేమే 
నీ హృదయస్పందనే నాకు సాక్షి 

ప్రియా నీ పరువము చూస్తే
నా మదిలో పులకరింతలు   
నీ వాలు చూపులను చూస్తే
నా హృదయంలో దడ దడలు 

నీ స్పర్శ నన్ను తాకితే 
నా మనసులో ప్రేమ జ్వరం 
నీవు నవ్వుతూ నన్ను పిలిస్తే 
నా హృదయం నీకే అర్పిస్తాను     
 --((*))--

  తృప్తి - సంతృప్తి 

ఓ మనిషి ఇది  గమనించు   

బ్రతికే విద్యను నేర్పిన గురువులా 
బ్రతుకు మార్గం చూపే తరువులా
బ్రతుకంతా వెలుగు నింపే సూర్యుడు లా 
కుటుంబాన్ని బ్రతికించు కునే శక్తి లా 

చీకటిని తరిమే కాంతి పుంజము లా 
       సకల దుర్మార్గాన్ని తరిమే సునామిలా  
మదాందులకు బుద్ధి చెప్పే ధీరుడిలా
మన మనస్సును ఆకర్షించే ప్రేమలా 

    మృగాసురులను వేటాడే నర సింహం లా 

భయాన్ని తొలగించే హనుమాన్ కవచం లా 
నవ ప్రగతి వీక్షింక్షే పుణ్య మూర్తి లా 
           ప్రజల ఉన్నతిని కాంక్షించే రచయిత లా 

మహా వృక్షాన్ని సృష్టించే విత్తులా 
      శ్రమతో కష్టించి రక్తాన్ని పంచే కార్మికుడిలా
 హృదయాన్ని ఓదార్చే సంగీతం లా 
మనసును అర్ధం చేసుకొనే మహా మనిషిలా ఉండు
--((*))--

 
ఇదేమి లోకం 

గంగ ఒడ్డున నీటి పొట్లాలు అమ్మటం 
కాశ్మిరులో కొబ్బరి బొండాలు అమ్మటం 
రోహిణీ కార్తిలో వేడిపాలు అమ్మటం 
జనసంచారం లేచోట చల్ల అమ్మటం 

గాలి, నీరు, నిప్పు కొనుక్కోవటం 
అతివృష్టి, అనావృష్టితో వ్యాపారం 
బలహీనులపై బలాఢ్యుల దౌర్జన్యం 
భుక్తి కోసం ప్రజా హక్కుల పోరాటం 

సేల్సులు వాడటం నేర్పి డబ్బు దోచుకోవటం 
ఆధునిక సౌకర్యాలు కోసం మనుషులే మారటం 
స్త్రీ అంటే అగ్ని లేదా ఓ మంచు పర్వతం 
సంక్షేమాలంటూ ధనం దుర్వినియోగం 

బ్యాలెట్ కోసం బుల్లెట్ వాడటం 
ఆకలి కోసం మూగజీవులను చంపటం 
సజీవులను వేటాడి చంపటం 
విరోధలనూ వేటాడి చంపటం 
--((*))--   




మనిషిని ప్రేమతో ఉంచేవి ?
మధుర భావా లెన్నో
మరువ లేని జ్ఞాపకా లెన్నో
మాసిపోని గుర్తు లెన్నో
మరువ లేని గాయా లెన్నో

మనసుని దోచిన నేస్తా లెన్నో
మనసుని వేధించిన భందా లెన్నో
మరపురాని సంఘటన లెన్నో
మన నీయని ఆశల వలయా లెన్నో

మాటలతో చెప్పలేని రహస్యా లెన్నో
మన మార్గం లో అఘాతా లెన్నో
మనల్ని కవ్వించే కబుర్లె న్నో
మనుగడ నే ప్రశ్నించే ప్రశ్న లెన్నో

మంచు లా కరిగే కోరిక లెన్నో
మంట ల్లా వెంటపడే రాబందు లెన్నో
ముత్యం లా వెలుగు నిచ్చే స్నేహా లెన్నో
మ్యాజిక్ తో మదిని దోచే ప్రయత్నా లెన్నో

మాయని చేధించ లేని డు:ఖా లెన్నో
మమతను మరువ లేని పరిస్థితు లెన్నో
మతాచారం లో మనకు చిక్కు లెన్నో
మెతుకు కోసం మనిషి చేసే మాయ లెన్నో

--((*))--



 *డబ్బు జబ్బు 

మనిషికి  తోడు ఉండేది డబ్బు 
 డబ్బు తెప్పిస్తుంది కొందరికి జబ్బు 
అది అసలు వడ్డీరాక వచ్చేది 
రోగం, నిద్ద్రపోనియ్యక చేసేది 
 
పేదోడి పెనుభారం  సంపాదన 
కొద్ది సంపాదనతో వడ్డీ జలగల్తో యాతన
బ్రతుకు బండి లాగలేక మత్తుకు
బానిసకాగా మారి చేరు అనారోగ్య పంచకు

తెలుగు ప్రజల జీవనంలో చీకటిని తరిమి 
వెన్నెల నింపి, చెరగని ముద్రగా కలిమి
కళ్ళుమూసుకున్న ధర్మ దేవత వెలుగై 
తెలుగు ప్రజల ఆశా జ్యోతి వజ్రంగా మారే  

ప్రకృతిని మురిపించి నమ్మిన వారికి ఆశలు చూపి 
జీవకళను ఉట్టిపడే విధంగా ధనాన్ని దుర్వినియోగం చేసి 
 అతివృష్టి అనావృష్టి అంటూ మాటలు చెప్తూ 
ప్రజలను నమ్మించే నాయకుల డబ్బు జబ్బు    
 --((*))--

ఏ తెలివి ఎవరిదో ?

అవినీతిని ధర్మమని వాదించే తెలివి
ఆరోగ్యాన్ని అనారోగ్యమనే చెప్పే తెలివి
ఇంట్లో ఆచరణ లేనిది వీధిలో చెప్పే తెలివి
ఈశ్వరుడు లేడని అరిచి గొంతు పోగొట్టుకొనే తెలివి


ఉన్న ఊరులో బ్రతకలేక వేరేచోట గొప్పలు చెప్పే తెలివి
ఊయలలా కదిలే మనసును అదుపున్నదని చెప్పే తెలివి
ఋతువుల బట్టి గాలిపిలుస్తా, నీళ్లు త్రాగుట అన్న తెలివి
ఎన్నికల్లో అవినీతి, మందుఖర్చు, డబ్బుపంచుట  తెలివి

    
ఏది ఏమైనా నేను స్త్రీ అందానికి లొంగనని చెప్పే  తెలివి
ఐరావతము ఎక్కాలని సర్కస్ లో చేరి చదువుని దాచి తెలివి
ఒకటి నీడలా నీవెంట ఉంటాను నమ్మించి మోసం  చేసే  తెలివి 
ఓనామాలు రానివాడు వేదికలో ఉపన్యాసము చెప్పే తెలివి

     
ఔషదములు దోచుకొని అమ్మి రోగము తెచ్చుకొని ఏడ్చే తెలివి
అందరూ వెళ్లి పోయేవారే, దేహములో ఉన్న చీకటిని చీల్చి తెలివి
అంతః:పురంలాంటి ఇంటిలోఉన్న ఇల్లాలిని వదిలి వేశ్యలతో కలసే తెలివి   : 
--((*))--
         


*మనసు  తాకు

మల్లెల పరిమళం మనసు  తాకు
కాగితపు పూలు అందాన్ని  తాకు
వెన్నెల చల్లదనం జంటను తాకు
సూర్యుడు వెలుగు జగతిని  తాకు

సజ్జనుని  సద్గుణం  ప్రేమను తాకు
దుర్జనుని  సద్గుణం  ఆశను  తాకు
దీపం క్రిందనే చీకట్లు తాకు
భూమి పొరల్లో జలరాసులు తాకు

దుమ్ము, ధూలి అద్దాన్ని తాకు
మనుషుల జీవితం భ్రమలను తాకు
ఆవేశం, అహంకారం పరగుండెను తాకు
సద్గున శీలునకు  జనోద్ధరణ తాకు

నీతి నియమాలకు దుర్వసనమ్ తాకు
జనన  మరణాలు ప్రాణులను తాకు
నిశ్చల స్థితునకు చపల చిత్తుడు తాకు
కపట ప్రేమకు ఆశల దొంతరలు తాకు

మేఘాన్ని మెరుపు తాకు
 వర్షం  పృథ్విని తాకు
పూచిన పువ్వు కాయను తాకు
స్వచ్చంద మనసుకి మాలిన్యం తాకు

 --((*))--


ఏకాత్మ పంచకం.!.........– భగవాన్ రమణ మహర్షి.!
.
1. తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కొనుట కను
.
(Forgetting the Self, mistaking the body for the Self, going through innumerable births and finally finding and being the Self — this is justlike waking up from a dream of wandering all over the world.)
2. తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?
యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యాడు పలుకు
.
(He who asks ‘Who am I?’ although existing as the Self, is like a drunken man who asks about his own identity and whereabouts.)
౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు
.
(When in fact the body is in the Self, to think that the Self is within the insentient body is like thinking that the cinema screen on which a figure is projected is inside the figure.)
.
4. పొన్నుకు వేరుగ భూషణ ముండునే
తన్ను విడిచి తనువేది -తన్ను
దను వను వాడజ్ఞుడు తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు .
,
.
(Has the ornament any existence apart from the gold (of which it is made)? Where is the body apart from the Self? The ignorant mistake the body for the Self, but the Jnani, knower of the Self, perceives the Self as the Self.)
.
5. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు నాది -గురు చెప్పక
చెప్పి తెలియగ జేసినారే , ఎవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .
.
.(That one Self, the Reality, alone exists for ever. If even the Primal Guru (Adi Guru, Dakshinamurti) revealed it in silence, who can convey it in speech?)
.
ఏకాత్మ తత్వము నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు ..
– భగవాన్ రమణ మహర్షి




*నా కలల కవిత్వం
 
ఒక  సాయంత్రం నదివద్ద ఉన్న చెట్టును చేరా 
చల్లని గాలిలో ఎగిరే పక్షులను చూసా 
కొమ్మల మాటున మొగ్గల గుసగుసలు చూసా
అస్తమించు చున్న సూర్య బింబం చూసా 

      నన్ను వెంటాడుతున్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి 
ఎక్కడో గుడిగంటలు మారు మ్రోగి నన్ను పిలిచాయి
నీటిలోని చేపలు నన్ను చూసి ఎగిరెగిరి పడుతున్నాయి 
నీటిలో పడవలు  పురిటినెప్పుల స్త్రీవలే నడుస్తున్నాయి 

నీటిలో  చూసిన కొనమెరుపుతో మనస్సు ప్రశాంతం 
 నాలో ఉడుకుతున్న రక్తం చల్లబడి ప్రశాంతం 
 ప్రకృతి కౌగిలిలో నా కలల కవిత్వం ప్రశాంతం 
నిశ్శబ్దంలో మనో నిగ్రహశక్తి  నాలో  ప్రశాంతం

--((*))--
      

2, నవంబర్ 2016, బుధవారం

Interent telugu magazine for month of 11/2016/41

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు


*ఈ  నాటి నా పాట "ఈ కళ్ళు"

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

నిశబ్ద విశ్రాంతి ఇంకా ఎన్నాళ్ళు  
చీకటిని తరిమి వెలుగును చూసే
ఈ ఆనందభాష్పాలు ఇంకా ఎన్నాళ్ళు

నా మౌనమే నాకు నేస్తమై
నా హృదయ వేదనకు నాదమై
నా ఆక్రందనకు శబ్దమై 
నా ఆలోచనకు విషాదమే నాకు తోడై

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

నిరాశ నిస్పృహల మద్య
నలిగి, మరువలేని జ్ఞాపకాల మధ్య
ఓటమిని భరించలేని క్షణాల మధ్య
అలుపెరగని నింగి నేల మధ్య

చీకటిలో మెరిసి మిణుగురు పురుగులా
దేవుడి  గుడిలో కొడికట్టే దీపంలా
వయసు ఉడికిన ప్రాణిలా
క్షణమొక యుగముగా కాలా
తీతముగా వేచిఉన్నా నీకోసం

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి

గతాన్నిమరువలేక
గుండెలో కోరిక ఎవరికీ చెప్పుకోలేక
ఇక వెలుగును చూడ లేక
ఈ కళ్లు శాశ్వితముగా మూత బడ లేక
చీకటిలో వెతుకు తున్న ఈ  కళ్ళు 

ఈ కళ్ళు ఎన్నాళ్ళు ఎదురు చూడాలి
అనుభూతి స్పర్సకై ఎలా వేచి ఉండాలి
  --((*))--

 ఓం శ్రీ రామ్   -  శ్రీ మాత్రేనమ:

 సర్వే జానా సుఖినోభవంతు

సత్య పలుకు ధీమ - పున్నమీ వెన్నెలే 
నిత్య మలుపు - వలపు విరహ మేగ
పత్యము వలదే - నిదానమే  సన్నిదే
వ్యత్యాసమును చూపకే 

రాజు వలచినాడు - రాజనీతీ ఇదీ 
రాజి అనక - తనువు తపన సేవ 
జాజి మగువ నవ్వు - ఆర్పనే తప్పదే 
భాజ మోతలు సందడీ  

ముద్దు నళిని దేహ - మాధురీ గంధమే 
వద్దు అనక  సద్దు -చేయుటే కోమలం 
హద్దు సబబు కాదు - చల్లగా  మెల్లగా 
సద్దు కొనుట జీవితం 

కళ్ళు తెరిచినాను -  పాటలే మాటలే 
వళ్ళు మరచి నాను - సందడే సందడే 
కుళ్ళు తరిమి నాను - అప్పుడే అప్పుడే
పళ్ళ రుచిని పొందటం   

 సందె వెలుగులోనే - జిల్లాగా మెల్లగా 
మంద పవన - మందు మనసు నిండా
కుండా కుసుమరాశి - కోమల్ గంధమే 
ముందు యోగము తమ్మి జూపు 

రేయి కడుపు చీకటీ - మొహాన్ని సుధా 
మయి మధుర వలపు- తలపు రేయి
రేయి పగలు రాగ -రంజనీ రాగిణీ    
 స్థాయి మనసు సంతసం  
    
 

ఉత్పలమాల (తనువు )

చల్లని గాలికే మనసు విచ్చి సువాసన పంచి రాగమే
మెల్లగ మత్తుగా వలపుగా మదిలో రసజల్లు ఊరినే
తాళము తీయగా తనువు నిప్పుగ ఆకలి సంతసం కదా
మాలను వెయ్యటం మనసు విప్పిన పుష్పము కోరె ప్రేమతో        

ఒక్కటి కాదులే పరుగులాంటి వసంతము వచ్చెఇప్పుడే
చిక్కటి చీకటి తెరచి చూసినా కళ్ళకు వెల్గులే కదా
మక్కువ కొద్దిగా ప్రకృతి నీ సమతుల్యముగానె ఉంచునే
ఎక్కస చూపకా ప్రేమలు పంచుకొ నీ మనసైన వానితో          

భర్తకు  ప్రేమలో మనుగడె పరువం అణువంత పంచునే 
భార్యకు సంతసం వనములో సుముఖం మధురం ససేవయే
ప్రేరణ ఇద్దరూ మనసుతో అనురాగ మయంగ ఉండునే 
 తరణి హత్తుకొ సుఖమయం నవరాగముగానె ప్రేమలూ                 
2. ఆద్యాత్మికం 

విశ్వము నందునే చరిత గాంచిన భారతి ముద్దు బిడ్డడే 
 భార్యను కాళిగా పరమహంసయు కొల్చిన కర్మ భూమియే 
భావము రాగమై మనసు మందిరమై నవపారి జాతమే 
 వాసి కెక్కిన మేరునగరం పులకించగ కంజలింతునా 

హైందవ సంకృతి విభవ వైభవ గూర్చిన వేద విశ్వమై
నిశ్చల యోగమై సమయ భావము తేజము నిష్ఠయున్ సుమా 
విద్యయు ప్రాణమై వినయ తల్లిని వేడుకొనే అనంతుడై 
లోకము కోసమే చరిత్ర చెప్పిన మానవ నేత్రుడే కదా 

పుట్టుక సత్యమే కనికరం దయ జూపుట సర్వ ప్రజ్ఞయే 
బుద్ధియే   సర్వమై శరణు కోరిన వారిని ఆదు కోవటం 
 శాంతము ఉండుటే మనసు  నిబ్బరమే మమతానురాగమే
స్పర్శల ప్రేమలే మనకు ఆశలు మార్గము తెల్పలేవులే 

పచ్చని పంటలే మనకు సంపద పుత్తడి ప్రాణమే కదా 
దేహము శ్రమకే లయను భాష్యము భాద్యత తెల్పునే కదా 
వర్షపు జల్లులే నదుల నీటిని త్రాగుట సత్యమే కదా
        అంతట నిండిన ప్రధమ గాలులు ప్రాణుల జీవితం కదా 

ఇది నా మొదటి ప్రయత్నము తప్పులు తెలుపగలరు 


నన్నెచోడుని పద్యశిల్పం.!..
(శ్రీ.కామేశ్వర రావు భైరవభట్ల )
నన్నెచోడుడు అనే రాజకవి వ్రాసిన "కుమారసంభవం"ఈ కావ్యంలో
నన్ను బాగా ఆకట్టుకొన్న ఒక మంచి పద్యాన్ని గురించి యిప్పుడు ముచ్చటించుకుందాం.
.
"పవడంపులతమీద ప్రాలేయపటలంబు
బర్వెనా మెయినిండ భస్మమలది
లాలితంబగు కల్పలత పల్లవించెనా
గమనీయ ధాతువస్త్రములు గట్టి
మాధవీలత కళిమాలికల్ ముసరెనా
రమణ రుద్రాక్షహారములు వెట్టి
వర హేమలతికపై బురినెమ్మి యూగెనా
సన్నుతమగు నెఱిజడలు బూని"
.
తపస్సు చేస్తున్న పార్వతీదేవి వర్ణన యిది. ప్రాలేయము అంటే మంచు. మంచు బిందువులతో మెరిసే పగడపుతీగవలె ఉన్నదామె. ఎందుకు?
ఆమె మేను సహజమైన కెంపుదనంతో పగడపుతీగలా ఉంది. దానిమీద తెల్లని బూడిద పూసుకుంది. అందుకు. అలాగే లలితమైన కల్పలత
(పారిజాతపు తీగ) చిగురించినట్లుగా ఉంది
, ఆమె అందమైన కాషాయి వస్త్రాలను కట్టుకొంటే. మాధవీలత చుట్టూ నల్లని తేనెటీగలు మూగినట్లుగా ఉన్నాయామె ఒంటిపై చుట్టుకున్న రుద్రాక్షహారాలు.
జడలుగట్టిన ఆమె నెఱికుఱులను చూస్తే అందమైన బంగారు సంపెంగ తీగపై, విప్పారిన నెమలి పురి ఊగుతున్నట్లుంది. మామూలుగా అయితే జడ నల్లని కాంతులతో నిగనిగలాడుతూ ఉంటుంది. కాని తపోదీక్షలో, సంరక్షణ లేక ఆమె కురులు బిరుసెక్కి ఎఱ్ఱెఱ్ఱని రంగులోకి మారాయి. అందుకూ నెమలి పురితో పోలిక. ఇవన్నీ చాలా అందమైన పోలికలు. అన్నీ ప్రకృతినుంచి తీసుకున్నవే. పార్వతి ప్రకృతి స్వరూపమే కదా మరి!
పైగా నాలుగుపోలికలలోనూ మనకి కనిపించేది తీగే. ఆమె శరీరం తపస్సుకి ఎంతగా కృశించిపోయిందో, అయినా తన సహజ సౌందర్యంతో ఎలా శోభిస్తోందో, ఈ పోలిక వల్ల చాలా చక్కగా ధ్వనిస్తోంది. ఇంతటితో ఆగిపోతే ఇదేమంత పెద్ద గోప్ప వర్ణన అని చెప్పలేం.
ఎత్తుగీతితో యీ వర్ణన స్థాయిని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళాడు నన్నెచోడుడు.
--((*))--

"శివానంద లహరి" లో అంకోలం / అయస్కాంత చెట్టు ప్రస్తావన ;-

అంకోలం తరువు ను తెలుగులో ఊడుగ చెట్టు అని పిలుస్తున్నారు.
అంకోల పాదపం గురించిన ప్రస్తావన "శివానంద లహరి" లో వక్కాణం ఐనది.

అంకోలం నిజ బీజ సంతతిః – అయస్కాంతో ఫలం సూచికా |
సాధ్వీ నైజ విభుం, లతాక్షతిరూహం, సింధుస్సరి ద్వల్లభమ్|
ప్రాప్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయమ్|
చేతోవృత్తిః రూప్యేత్యతిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే||
;
అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని
61 వ శ్లోకం ఇది. అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ- పాదపము యొక్క మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.
నది సముద్రములో కలుస్తుంది.
పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు
భక్తి భావనలు లీనమౌతాయి.” అంటూ
శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.
--((*))--

ఇది ఒక భోజుడి కలం లో జరిగిన పాతకధ చదవండి (ఈ కధ సేకరణ అంతర్ జాలం )
ఒకనాడు భోజుడి ఆస్థానానికి కవిశేఖరుడు అనే కవి వచ్చాడు.రాజు కవిజన పక్షపాతి అయినా,ద్వారపాలకులు
కావాలని లేదు గదా! రాజ దర్శనం చెయ్యటానికి వీల్లేదు పొమ్మని గెంటి వేశారు. కొంతసేపు ఘర్షణ
జరిగిన తర్వాత,రాజసభలోకి వెళుతున్న మరో పండితుడి సహాయంతో రాజాస్థానం లోకి చేరుకోగలిగాడు.
అందుకే వస్తూనే నవ్వుతూ యిలా అన్నాడు.
రాజన్! దౌవారికా దేవ ప్రాప్తవానస్మి వారణం
మదవారణం మిచ్చామి త్వత్తోహం జగతీ పతే

దౌవారికాత్ ఏవ = రాజా! నీ ద్వారపాలకుడి చేత, ప్రాప్తవానస్మి వారణం = గెంటివేయబడి వున్నాను.
వారణం(వారింప బడటం ) అంటే గెంటివేత,ఏనుగు అనే రెండు అర్థాలున్నాయి.త్వత్తః అహం =నీ వల్ల నేను మదవారణం =మదించిన ఏనుగు ను బహుమతిగా కోరుతున్నాను.జగత్పతీ!రెండర్థాలు వచ్చేలా చెప్పాడు.
ఈ చక్కని శ్లోకం విని రాజు అతనికి తన రాజ్యం లో తూర్పుభాగం యివ్వటానికి నిశ్చయించాడు.అది
సూచించడానికి,సింహాసనం మీదే తూర్పుముఖంగా కూర్చున్నవాడు కాస్త దక్షిణం వైపుకు తిరిగి కూర్చున్నాడు.కవి శేఖరుడికి రాజుగారి భావం అర్థం కాలేదు.
రాజును పొగుడుతూ యింకో చక్కని శ్లేషతో శ్లోకం చెప్పాడు.
.
అపూర్వేయం ధనుర్విద్యా శిక్షితా కథమ్?
మార్గణౌఘః సమాయాతి గుణో యాతి దిగంతరం

ఈ అపూర్వమైన ధనుర్విద్య నీ చేత ఎలా నేర్చుకో బడింది?అందరి విలుకాళ్ళకూ బాణం వేసేటప్పుడు
అల్లెత్రాడు వాళ్ళ వైపు వస్తుంది,బాణాలు దూరంగా ఎక్కడో పడతాయి.నీకయితే మార్గణ-ఓఘం=(బాణాల
సమూహం అని ఒక అర్థం), సంచార యాచకుల సమూహం అని యింకో అర్థం నీ దగ్గరకు వస్తున్నది.
గుణం =(అల్లెత్రాడు అని ఒక అర్థం),నీ సుగుణాల గురించిన సమాచారం అని మరో అర్థం. నీ కీర్తి దేశ దేశాంతరాలకు పాకుతున్నది.
ఈ అద్భుత శ్లేషను మెచ్చి రాజు తాన దక్షిణభాగం కూడా ఆయనకు యివ్వాలని నిర్ణయించుకున్నాడు.పడమరదిక్కుకు తిరిగి కూర్చున్నాడు.శ్లోకాలు విని రాజు దిక్కులు మార్చి ఎందుకు
కూర్చుంటూ ఉన్నాడో ఎవరికీ అర్థ కాలేదు.ఆయనకు తన కవిత్వం నచ్చలేదేమో నని కవి శేఖరుడు మరో
మంచి శ్లోకం చెప్పాడు.
సర్వజ్ఞః - ఇతి లోకోయం భవంతం భాషతే మృషా
పదమేకం న జానీషే,వక్తుం నాస్తీతి యాచకే

రాజా! ఈ లోకం తమరిని సర్వజ్ఞుడు అని అసత్యం చెప్తున్నది.మీకు తెలియని మాట ఒకటున్నది 'లేదు'
అని యాచకుడికి చెప్పటం.మరి మీరు సర్వజ్ఞు లెలా అవుతారు?
కవి చమత్కారానికి మెచ్చుకొని రాజు ఆయనకు తనరాజ్య పడమర భాగాన్ని కూడా యిచ్చేయాలని
నిశ్చయించి ఉత్తరానికి తిరిగి కూర్చున్నాడు.

కవి శేఖరుడు యింకో శ్లోకం చెప్పాడు.
సర్వదా సర్వ దోసీతి మిథ్యా త్వం కథ్యసే బుధై:
నారయో లేఖిరే పృష్టం న వక్షః పర యోషితః 

సర్వదా,సర్వమూ దానం చేస్తావని పండితుల చేత నీవు అసత్యంగా వర్ణించ బడు తుంటావు.నీ శత్రువులకు
నీ వీపు లభించదు,(యుద్ధం లో వెన్ను తిప్పవు కాబట్టి) నీ వక్షస్థలం,పర స్త్రీలకూ లభించదు.(వాళ్ళని నీవు దగ్గరకు చేర్చవు కాబట్టి)
ఇది విన్న తర్వాత రాజు తన రాజ్యం అంతా కవికి ధారబోసినట్లు భావించి సింహాసనం వదిలి లేచాడు.కవికి
రాజు భావం అర్థం కాలేదు.ఆయన్ని మెప్పించేందుకు మరొక ప్రయత్నంగా యింకో శ్లోకం చెప్పాడు.
రాజన్ ! కనక దారాభి: త్వయి సర్వత్ర వర్షతి
అభాగ్య ఛత్ర సంఛన్నే మయి నాయాంతి బిందవః

రాజా!నువ్వు సర్వత్రా కనకధారలతొ వర్షిస్తుండగా,అభాగ్యమనే గొడుగు కప్పుకున్న నా మీద కొన్నిచుక్కలు కూడా పడడం లేదు..
రాజు సభ వదిలి అంతః పురానికి వెళ్లి,భార్య లీలావతి తో చెప్పాడు.రాజ్యం అంతా దానం చేసేశాను.పద మనం అడవులకు పోదాం అన్నాడు.
అదే సమయం లో ప్రధానమంత్రి బుద్ధిసాగరుడు రాజసభ నుంచి వెళ్ళిపోతున్న కవి శేఖరుడిని ఆపి రాజుగారు నీకేమి దానం చేశాడు?అని అడిగాడు.బుద్ధిగల, రాజు గారి మనసు తెలిసిన మంత్రి కనుక ఆయనకు రాజు గారి భావం అర్థమైంది.ఏమీ యివ్వలేదు అన్నాడు కవి నిరుత్సాహంగా. అయితే ఒక పని చెయ్యి నీకు కోటి బంగారు నాణాలు యిస్తాను రాజు ఏమిచ్చినా నువ్వు ఈ కోటి నాణాలకు అమ్మేయ్యాలి.అని అతనికి ఒక కోటి బంగారు నాణాలు యిచ్చి పంపేసి రాజు దగ్గరికి వెళ్ళాడు.
బుద్ధి సాగరా!నేను రాజ్యమంతా కవి శేఖరుడికి ఇచ్చేశాను.సకుటుంబంగా అడవులకు పోతున్నాను.
రాదలుచుకుంటే నువ్వూ వచ్చేయ వచ్చు.అన్నాడు రాజు.మంత్రి తో
రాజా! అక్కరలేదు.మీరు కవి శేఖరుడికి యిచ్చిన రాజ్యం అంతా తిరిగి అతని దగ్గరనుంచి నీ ధనం తోనే కొనేశాను.ఈ రాజ్యం యింక నీదే హాయిగా పాలించుకో.అన్నాడు.రాజు మరీ గద్దె నెక్కాడు..అలా కోటి బంగారు నాణాలు కవి శేఖరుడికి దక్కాయి.రాజ్యం భోజరాజుకే దక్కింది.