15, ఫిబ్రవరి 2016, సోమవారం

Annamaacharya Kiirtaanalu - Listen Magazine -2


ఓంశ్రీ  రాం   ఓం శ్రీ  రాం ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - సంకీర్తనా ప్రభ

సర్వేజనా సుఖినోభవంతు   
*1.నిండు మనసే నీ పూజ  అండ కొరకుండు టదియు నీ పూజ(15. 03)

* 2.నినను తలచి నీ పేరు తలచి (12. 19)
http://vocaroo.com/i/s1Iat4ZOVGcn

*3.దేవా దేవం భజే దివ్య ప్రభావం (13.06)

http://vocaroo.com/i/s1PrlKXd44L9 

*4.నానాటి బతుకు నాటకము -కానక కన్నది కైవల్యము(13.21 )

http://vocaroo.com/i/s09wKxmroGbV 

*5.పొడగంటిమయ్య పురుషోత్తమా(12.00)
http://vocaroo.com/i/s1MRKMTYAds1 

6. వినోదకాడవు విటలేస్వరా ...(12.02)
http://vocaroo.com/i/s1ADuofhBleC 

* .7 అన్నమయ్య కీర్తన - అదే చూడరయ్య పెద్ద హనుమంతుని(12.09)
http://vocaroo.com/i/s1Ztv2uqbO5p


*8అలరులు కురియగ ఆడేనదే (13. 9)
http://vocaroo.com/i/s1fRDiSVAZIf 

*.9 నాటికి నాడే నా చదువు ..... (13.30)
http://vocaroo.com/i/s0YiCivj3ce1 

 *10జో  అఛుఆనన్ద ... జో జో ముకుంద ...
http://vocaroo.com/i/s1njmRY8isIi

*4ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు ......... అన్నమాచార్యుల కీర్తన 
(శ్రీ వేంకటేశ్వరుని వైభవమంతా వీక్షించిన తర్వాత భక్తి  భావం - 
11.(వినండి -వినమని చెప్పండి) (16.22)

http://vocaroo.com/i/s07mJg2despB

*12.నిను తలచి నీ పేరు అలచి ----- కీర్తన

13. చూడ  చూడ  మాణిక్యాలు .....  అన్నమాచార్యుల కీర్తన 
(శ్రీ వేంకటేశ్వరుని వైభవమంతా వీక్షించిన తర్వాత భక్తి  భావం - 
(వినండి -వినమని చెప్పండి) (13.30)


http://vocaroo.com/i/s1FVJkLpYGX9

*.14.  అన్నమాచార్య కీర్తనలో  ఉన్న  ఆద్యాత్మిక అమృత వాహిని
( చదివినవారు మల్లాప్రగడ రామకృష్ణ గారు
కీర్తన: ఎన్నడు విజ్ఞానమిక నాకు .........(16.05)


12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ప్రాంజలి ప్రభ - భగవద్గీత - కర్మ యోగం - మూడవ అధ్యాయం (Telugu Listen Magazine)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


సర్వేజనాసుఖినోభవంతు


కర్మయోగం గురించి ముందు మంచి మాట
వేదాలలోని కర్మ కాండ,ఉపాసనా కాండ, జ్ఞాన కాండలను - కర్మషట్కం,భక్తిషట్కం , జ్ఞానషట్కం  - అనేవి 18 అ ద్యాయాలుగా భగవత్ గీతలో వివరించటం జరిగింది . ఇది ఒక "సమగ్ర ఆధ్యాత్మిక గ్రంధం "

1,2శ్లోకాల భాష్యం (కర్మకన్న జ్ఞానమే గొప్పదని చెప్పి యుద్ధం ఎందుకు చేయమంటావు అని అర్జునుడు అడిగిన నీతి    )

3వ శ్లోకం భాష్యం (సాంఖ్యులకు  జ్ఞాన యోగం, యోగులకు కర్మయోగం వివరించారు పరమాత్ముడు ఈశ్లోకంలో  వినండి )

4,5 శ్లోకాల భాష్యం  (10.23) (కర్మలు చేయనివానికి శాంతి ఉండదు, గుణాలను బట్టి కర్మలుచేయటం తప్పదు అనిభోదించాడు పరమాత్ముడు )

6వ శ్లోకం భాష్యం (5. 06)( ఇంద్రియవిషయాలను స్మరించేవాడు పరమ  మూర్ఖుడు అని తెలిపాడు పరమాత్ముడు )

7వ శ్లోకం భాష్యం (5. 43) (మనస్సు ద్వార కర్మలు చేస్తారో వారే శ్రేష్ఠులు)

 8వ శ్లోకం భాష్యం (5. 59)(శరీర యాత్ర జరగాలంటే కర్తవ్య కర్మనునిర్వహించు అని భోదించాడు)

9వ శ్లోకం భాష్యం ( )(విద్యుక్త ధర్మాలను ఆచరిస్తే - బంధములనుండి  విముక్తుడవు కాగలవు అని భోదించాడు)

10,11 శ్లోకాల భాష్యం  (    ) (యజ్ఞ కర్మలు చేత దేవతలను తృప్తి పరచండి - గొప్ప శ్రేయస్సును పొందండి  అనిభోదించాడు పరమాత్ముడు ) 
http://vocaroo.com/i/s0kqAC73yZMo

12వ శ్లోకం భాష్యం ( )(దేవతలు ఇచ్చిన భోగాలు దేవతలకు సమర్పించకుండా పొందితే - దొంగతో సమానము అని భోదించాడు) 
http://vocaroo.com/i/s03bU01k40iy


13వ శ్లోకం భాష్యం ( )(దేవతలుకు నైవేద్యం పెట్టకుండా భోన్చేసేవారు  - పాపులతో సమానము అని భోదించాడు) 
http://vocaroo.com/i/s132kZQjQuJ4

14,15 శ్లోకాల భాష్యం  (    ) (ప్రాణులన్నీ అన్నం వళ్ళ పుడుతున్నా యి, అన్నం మేఘం వళ్ళ పుడుతున్నది, మేఘం యజ్ఞం వళ్ళ పుడుతున్నది, యజ్ఞం కర్మవళ్ళ పుడుతున్నది అనిభోదించాడు పరమాత్ముడు ) 

http://vocaroo.com/i/s1O64YJgmmn1

16వ శ్లోకం భాష్యం ( )(మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వార్ధ బుద్ధి పెరిగితే వాడు పాపాత్ముడు - సమానము అని భోదించాడు) 




17,18 శ్లోకాల భాష్యం  (    ) (ఏ  మానవుడు ఆత్మలోనే రమిస్తూ,తృప్తి చెందుతూ ఉండే వాడు దేనిని ఆశ్ర యించ కుండ ఉండిన చేయదగిన కార్యముఅంటూ ఎమీలేదు  అనిభోదించాడు పరమాత్ముడు )

19. వ శ్లోకం భాష్యం ( )(ఫలాసక్తిని విడిచి కర్మ చేయాలి అట్టి వాడు  మోక్షాన్ని పొందు తున్నాడు.  అని భోదించాడు) 

20. వ శ్లోకం భాష్యం ( )( నిష్కామ కర్మ ఆచరించినవాడు మోక్షాన్ని పొందు తున్నాడు.  అని భోదించాడు) 
21. వ శ్లోకం భాష్యం ( )( శ్రేష్టులైన వారు ఏది ఆచరించిన అది ప్రజలకు మంచే జరుగును .  అని భోదించాడు)
22,23,24 శ్లోకాల భాష్యం  (    ) (నేను కర్మలు చేస్తున్నాను , అందరుకర్మలు చేయమని చెపుతున్నాను  అనిభోదించాడు పరమాత్ముడు )
25, 26 శ్లోకాల భాష్యం  (    ) (అజ్ఞానులు కూడ  కర్మలు చేయాలి, చేయని వారిని కూడా చేయమని చెప్పాలి.    అనిభోదించాడు పరమాత్ముడు )

27, 28 శ్లోకాల భాష్యం  (    ) (అహంకారము చేత వివేకము కోల్పోయిన వాడు మూర్ఖుడు  జరిగే కర్మలకు నేనే భాద్యతను వహిస్తానంటాడు .    అనిభోదించాడు పరమాత్ముడు )

29. వ శ్లోకం భాష్యం ( )( మంద బుద్ధులైన వారిని జ్ఞానులు చలింప చేయరాదు అని భావానుడు  భోదించాడు)

30వ శ్లోకం భాష్యం (భవిష్యత్  భయాలు, భూతకాలపు  జ్ఞాపకాలు, వర్తమాన ఆందోళనలు వదలి కర్మలు చేయాలి అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 


31,32 శ్లోకాల భాష్యం (భగవత్ గీతపై శ్రద్ధకలవారు కర్మలనుండి  విముక్తి పొందు తారు, దీనిని అనుసరించని వారు జ్ఞానములేని వారుగా మిగిలిపోతారు అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1DWMf6sJRKZ

 
33వ శ్లోకం భాష్యం (ప్రకృతిని అనుసరించి జ్ఞాని అయిన ప్రవర్తించాలి ఎంత శాకిని ప్రయోగించిన ఫలితముండదు అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1FloBflL01A 


34వ శ్లోకం భాష్యం (రాగ ద్వేషాలకు వశుడవు కావద్దు అవి మనిషికి శత్రువులు  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1AoUMjge5N8 

*35వ శ్లోకం భాష్యం (చక్కగా ఆచరించిన పరధర్మముకన్న స్వధర్మమే మిన్నా అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

 http://vocaroo.com/i/s0pKBvxS4Lxn

*36వ శ్లోకం భాష్యం ( ఇతరులచేత ప్రోస్చహించినట్లు పాపాలు చేయుట ఎందుకు ?    అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1tkYUwIfiTK

*37వ శ్లోకం భాష్యం ( కామ, క్రోధాలు, నీశత్రువులు వాటిని ప్రవేసింప చేయ నీయకండి అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 


http://vocaroo.com/i/s0Sk43H6pVg5 


*38వ శ్లోకం భాష్యం (  పొగ చేత అగ్ని, దుమ్ము చేత అద్దం, మావి చేత గర్భం,అలాగే కామం చేత జ్ఞానం కప్పు బడి ఉంటున్నది అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s10Y8SZGdipV

39వ శ్లోకం భాష్యం ( ఆశ కు అంతులేదు, ఎన్ని నదులు చేరినా సముద్రానికి తృప్తి లేదు, ఎన్ని కట్టెలు వేసిన అగ్ని చల్లారదు జ్ఞానానికి కప్పబడిన కామాన్ని జ్ఞాని తొలగించుటకు ప్రయత్నం చేయాలి  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1i7HpbqkGsk  

40వ శ్లోకం భాష్యం ( ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి అశ్రయాలు  అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s0PQfxoQvz6V


41వ శ్లోకం భాష్యం ( ఇంద్రియాలను, నిగ్రహించి జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామాన్ని విడిచిపెట్టు   అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 
http://vocaroo.com/i/s1X9yiXCmpj6 

42,43 శ్లోకాల భాష్యం (జడ పదార్ధము కంటెను ఇంద్ర్రియములు ఉత్తముములు, ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము, మనస్సు కంటెను కూడా బుద్ధి మరింత ఉత్తమము బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమము, ఆద్యాత్మిక శక్తి తో కామ మనేడి శత్రువును జయించ వలెను అని భగవత్ గీత క్లుప్త సారాంశం) 

http://vocaroo.com/i/s1vitpDZZHXy

   
శ్రీ మద్భగవద్గీత  యందలి కర్మయోగము నందు విధ్యుక్త ధర్మ నిర్వహానము అను త్రుతీయాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము  

http://vocaroo.com/i/s1iYJH4aKB7K 

ఓం శాంతి:  ఓం శాంతి: ఓం శాంతి:

10, ఫిబ్రవరి 2016, బుధవారం

Internet Telugu Learn Magazine for the month of 2/2016-7

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  



(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (7) (date 15-2-2016 to 21-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

దశకంఠ రావణ కృత శివ తాండవ స్తోత్రము.
( పంచ చామర వృత్తము)

జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ
విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ।
ధగధ్ధగధ్ధగ జ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ।।

అర్థ ములు:- జటకటాహ= జడలనెడి గోలెమున ( గోళాకారమున నున్నఆకాశమున)
సంభ్రమ భ్రమత్= భయంకరముగా సుళ్ళు తిరుగుచున్న, నిలింపనిర్ఝరీ= దేవనదియైన గంగయొక్క, విలోలవీచివల్లరీ= చంచలమైన యలలనెడి తీవలచే, విరాజమానమూర్ధని= ప్రకాశించుచున్న శిరస్సు గలిగి నట్టియు, ధగత్ ధగత్ ధగత్= ధగధగధగమని, జ్వలత్= మండుతున్న, లలాట పట్ట పావకే= విశాల ఫాల భాగమునందు త్రినేత్రాగ్నికలిగినట్టియు, కిశోర చంద్ర= బాలచంద్రుడు, శేఖరే= శిరోభూషణము గాగల శివునియందు, మమ= నాకు, ప్రతిక్షణమును, ( ఎడతెగకుండ)
రతిః= ఆసక్తి, అస్తు= వుండుగాక.

జడలనెడి గోలెమున భయంకరముగా సుళ్ళు తిరుగుచున్న, దేవనదియైన గంగయొక్క, చంచలమైన యలలనెడి తీవలచే,  ప్రకాశించుచున్న శిరస్సు గలిగి నట్టియు,  ధగధగధగమని,  మండుతున్న,  విశాల ఫాల భాగమునందు త్రినేత్రాగ్నికలిగినట్టియు,  బాలచంద్రుడు, శిరోభూషణము గాగల శివునియందు,  నాకు, ప్రతిక్షణమును, ( ఎడతెగకుండ)
 ఆసక్తి,  వుండుగాక.
2) ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర
స్ఫుర దృగంత సంతతి ప్రమోదమాన మానసే।
కృపాకటాక్ష ధోరణీ నిరుధ్ధ దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని॥

అర్థములు:-- ధరాధరేంద్ర నందినీ= పర్వతరాజైన హిమవంతునికూతురగు పార్వతియొక్క, విలాసబంధు= సమస్త శృంగార విలాసములకు బంధువుగా, బంధుర= దట్టముగా(బంధించివేయు స్వభావము గలుగు నట్లుగా) , స్ఫురత్= చెక్కుమనిమెరయు, దృగంతసంతతి= కడగంటి చూపులసమూహముచే, ప్రమోదమానమానసే= సంతసించు చున్న మనస్సు కలిగినట్టియు, కృపాకటాక్ష = దయతోగూడిన కడగంటి చూపులయొక్క, ధోరణీ= వరుసలచే, నిరుధ్ధ్ధ= అరికట్టబడిన, దుర్ధరాపది = భరింపరాని యాపదలు గలిగినట్టియు, దిగంబరే= నగ్నమైన, క్వచిద్వస్తుని= ఒకానొక అనిర్వచనీయమైన వస్తువునందు( శివపరతత్వమునందు), మనః= సందిగ్ధస్వభావముతో చంచలమైన నా మనస్సు, వినోదం= సచ్చిదానందమును, ఏతు= నిశ్చలనిశ్చితమై పొందుగాక.
 
పర్వతరాజైన హిమవంతునికూతురగు పార్వతియొక్క,  సమస్త శృంగార విలాసములకు బంధువుగా,  దట్టముగా(బంధించివేయు స్వభావము గలుగు నట్లుగా) ,  చెక్కుమనిమెరయు,  కడగంటి చూపులసమూహముచే,  సంతసించు చున్న మనస్సు కలిగినట్టియు,  దయతోగూడిన కడగంటి చూపులయొక్క,  వరుసలచే,  అరికట్టబడిన,  భరింపరాని యాపదలు గలిగినట్టియు,  నగ్నమైన,  ఒకానొక అనిర్వచనీయమైన వస్తువునందు( శివపరతత్వమునందు),  సందిగ్ధస్వభావముతో చంచలమైన నా మనస్సు,  సచ్చిదానందమును,  నిశ్చలనిశ్చితమై పొందుగాక.
--((*))--


ప్రస్థానం(ప్రేమ)

నీ చిరునవ్వే నన్ను ఉడికించినది
నీ నడకే నన్ను కలవర  పెట్టింది
తిప్పలు పడి  నిన్ను చేరితే 
కనుల ముందున్నా కరగవా 

ఓ చెలియా నా హృదినే
దోచితివని చెప్పి నీ చెంత చేరి
నాచెలిమిని యాశించుచు
నాచెంతకు జేరినావు న్యాయమే కదా 

ఓ సఖియా నిన్ను నేను
మనసుతో ప్రేమిద్దామనుకున్నా
వయసు అడ్డువచ్చి నీతో
చెప్పలేక మౌన ముని నైనాను

వదలని పిచ్చి వయసునే పట్టి
నువ్వుకరిగితే తప్ప అది వెళ్ళదే
దొరవుగా వచ్చి చనువేదో ఇచ్చి
నా వలపు వెలుగు నీవే మరి

తొందర వద్దు రంగు బయట పడు
మనసు గోతిలో పడితే లేవలేవు
మెప్పిద్దామని తిప్పలు పడుతుంటే
తొందర పెట్టి నా మతినే పోగోడుతున్నావు       
--((*))--

ప్రస్థానం (ఓటు)


కత్తి వేటు - దుర్మార్గునకు చేటు
కలం తో పోటు -  రాజకీయునకు చేటు
పలకపై గీటు - విద్యకే చేటు
ముఖం పై గాటు - అనుమానానికి గీటు

రోడ్డు దాటు  - గ్రహించలేక చేటు
పప్పు రేటు  - తినేవారికి లోటు
పోపు ఘాటు - అజాగార్తకు చేటు
వార్తల ఘాటు - జాగార్తలకు చేటు

వీపు  పై వేటు - తొందర పాటుకు చేటు
పిప్పి పన్ను పోటు - క్రిములకు చోటు
పుస్తకముపై గీటు - చదవాల్సిన రూటు
చార్జీల రేటు  - ప్రభుత్వానికి రూటు

ఏలోటు లేకుండా సాగాలంటే - కర్తవ్య దీక్షపరులకే ఓటు

--((*))--


ప్రస్థానం (పిడికిలి )

బిగి యించిన పిడికిలిలో దాగిన దేమున్నదో
అధ్రుష్టపు రేఖలే,  బాటలనుకో వచ్చునా 

లేదా దురదృష్టపు రేఖలే, అనుకో వచ్చునా 
వాణీ పతి వాచస్పతి వ్రాతలను కోవచ్చునా   

సమాధర్మంతో నడుస్తానని అనవచ్చునా 
సమ దృష్టి తో జీవిన్చాగలనని అనవచ్చునా 

సమేక్యతతో ముందుకు సాగాలని అనవచ్చునా 
దుష్ట శక్తులను పిడికలి బిగించి హింసించ వచ్చును       

--((*))--

నీతులు చెప్పే వారు

రసజ్ఞుల ఆలోచనలే వేరు
అభిరుచులుపై, ఆభరణాలపై పోరు
సంస్కా ర ఔనత్యం అడ్డులేని జోరు
గుండెలోని తపన తీరు వేరు 

సూక్తులు ఆచరిన్చేవారెవరు
కుయుక్తుల వారే ఉన్నారు
మాయలో ఉంచి దోచేవారు
సిరితో తపనలు తగ్గించు కొనేవారు

వైద్యులున్నారని తిరిగేవారు
దుర్మార్గానికి అడ్డు లేదనే వారు
అడ్డు చెప్పేవారు లేదనే వారు
మొండి పట్టుతో బ్రతికేవారున్నారు

పక్కన ఉన్నవారిని పట్టించు కోరు
మంచి మనుషులతో స్నేహం చేయరు
విషం కక్కే వారిని చెరదీస్తారు
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరిస్తారు 

పాపమని తెలిసినా చేస్తారు
జిహ్వ చాపల్యాన్ని వదలకోలేరు
అద్దంలో మోఖమే చూడరు
నీతులే పెద్దగా చెపుతారు వారు  
--((*))--



ప్రస్థానం (ఇది నా పాట)

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -1

నకసక పర్యంతము దోచుకో మన్నది
చక చక నడిచి దరిచేరి సుఖపడ మన్నది
భువిలోని స్వర్గ సుఖాలు పొంద మన్నది
తనువు తపనలను  తగ్గించు కోమన్నది 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -2

 వేడికి నవనీతంలా కరుగుతా నన్నది

 వేడికి కర్పూరం వెలుగు నందిస్తానన్నది
 తపనకు తరుణోపాయము చేపుతానన్నది
 వయసుకు తగ్గ సరి జోడై సై సై అంటున్నది  

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -3

చల్లని మనసును పంచి సుఖపడ మన్నది
తల్ల డిల్లకు తరుణము ఇదే రా రమ్మన్నది
కళ్ళ బొల్లి మాటలకు నమ్మక రా రమ్మన్నది
కళ్ళు కళ్ళు కలిపి తన్మయం చెంద మన్నది

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
--((*))-

రామ చిలుక!
.
చిలుక చిలుక రామ చిలుక - పలక నంటుందీ
అత్త తెచ్చిన కొత్తకోక - కట్టనంటుంది
మామ తెచ్చిన సన్న బియ్యం - దంచ నంటుంది
అవ్వ తెచ్చిన ఆది రసం - తినా నంటుంది
మొగుడు తెచ్చిన మల్లెపూలు - ముడవ నంటుంది
కటారి కోకమీద - కన్ను వేసిందీ.
మామ కొడుకుమీద - మనసు ఉంచిందీ.

(ప్ఫాంజలి ప్రభకు పంపిన వింజమూరి అప్పరావుగారికి ధన్యవాదములు)








ప్రాంజలి ప్రభ - చిన్న కధ -(ప్రేమ భావ తరంగం )


యధాభరితమై, బాధాతప్తమై, భావాల భావమై,  ఎడారిగా మారిన, నా ఎదపై  పన్నీరువై, నా ఊహల పల్లకివై, నా మనసులో ప్రవేశించి, ప్రేమ పారవశ్యం తో ప్రవసింప చేసినావు.  వ్యధలను సమాధి చేసి, కరుణతో  వర్షంలా కనికరించి,
నిర్భాగ్యుడైన నన్ను భాగ్యవంతుడుగా మర్చి,  నాలో ఉన్న  ఎడారినే అనంత భావాల ప్రేమారస సాగరంగా మార్చావు.
ఘనీభవించి, నిశ్చలమైన భావపాషాణాన్ని నీ అమృత వాక్కులతో కరిగించి ద్రవీకరింప జేసావు.........

భావవాహినీ తరంగాలు ఎగసిపడుతున్న నా హృదయ సాగరంలో ప్రేమ సునామీనే సృష్టించావు, మరచి పోలేని స్వర్గ సీమగా మార్చావు, నా ఊహలలోనే కాదు, నా హృదయంలో స్త్రనివాసివై యున్నావు.....

ఎగసిపడే ఆ ప్రేమతరంగాలలో తడిసీ ముద్దయ్యాను, మరచి పోలేని ఆనందం అనుభవించాను. ఓ సఖీ!!

జీవచ్ఛవాన్ని స్పృషించి, పునరుజ్జీవితున్ని జేసి, కనపడకుండా, అందుకోలేని దూరనికి చేరి  పోయావు.

అనంత వాహినీ కెరటాల ఝరులకి తట్టుకోలేక, కొట్టుకు పోతున్న నేను, నీ ఆసరాకై చేయి జాపుతున్నా.......
నిర్దయగా చూస్తున్నావే తప్ప,  నాచేయి నందుకొని నన్ను కాపాడవెందుకు ఎప్పుడు కనబడతావు సఖి ....

కుల మత జాతీ వివక్షలే, నను నీ నుండి వేరుచేస్తే, ఈ అనంతాంతరాలున్న అనంత విశ్వాన్నే నేను బహిష్కరిస్తున్నా....
ఈ వివక్షలే లేని లోకాలకు పయనమౌతున్నా, ఉన్నదో లేదో తెలియని మరోజన్మలో నీకై వేచివుంటా

ఓ ప్రియతమా!
అందాల మందారమా ! చేతికందేలా కనిపిస్తావ్ కాని, చేరరాని సుదూర తీరాలలో ఉంది నన్ను మరిచావు 

కంటికందేంత దూరాన్నే వున్నా, అందుకోవటానికి సాధ్యం లో ఉన్నావు , అందానికి పర్యాయమందామా?
అందంలోనూ రెక్కలు విప్పి పరవసించి ముడుచుకు పోయావు

దయావర్షాన్ని కురిపిస్తున్నట్లు విచ్చుకుంటావు, మురిపిస్తావ్ మమ్మలని ఊరిస్తావు, మధ్య మధ్యలో అలకబూని, కవ్విస్తూ, ఊగుతూ కనబడతావు , ఆకుల మద్య అంతర్ధాన మవుతావ్ .....

భావజాల పరిపుష్ఠుల కవ్విస్తావ్ , కావ్య సృష్టికి ప్రేరణనిస్తావ్ .........., పసిపాపల మదినే దొచేస్తావ్, రోదనలోనూ నవ్విస్తావ్ అలరిస్తావ్



-




ప్రాంజలి ప్రభ - చిన్న కధ -( నాయకుడు)

ఏమండి మీరు అలా కలవరిస్తున్నా రెంటి, అవునే "నా బతుకంతా కలవరింపులు జీవితముగా మారింది", నాకున్నదంతా ఎలాక్షాన్లో ఖర్చు చేయటం జరిగింది, కానీ ఫలితం రాలేదు. అవునండి మానాన్న గారు చెప్పేవారు, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు అదే దొరుకుతుందని, అవునే అదినిజము. కాని నేను మోదటి సారి పోటి చేసినప్పుడు గుర్తుందా, ఎందుకు గుర్తు లేదు, అంతా గుర్తు ఉన్నది, ":కప్పు  సాసర్ గుర్తు' అందుకని చాలామందికి కప్పు సాసర్లు పంచావు, కాని ఎన్ని పంచావో అన్ని ఓట్లు కూడా రాలేదు

అవును మరోసారి మీ పవర్తన గుర్తుకొచ్చింది ఆరోజు మైకు పట్టుకొని " ఈ నగరంలో హడావిడి గమనించారా మీరు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండి నాలాంటి రాజకీయ నాయకునికి ఒక్క అవకాసం ఇవ్వండి నేను చేప్పే విషయాలు, సేను చసే పనులన్నీ మీకు విశదీకరిస్తాను అంటూ మైకును మేడలో పెట్టుకొని చెట్టు క్రింద కుక్కలా (విశ్వాస పాత్రుడుగా) అరుస్తూ ఎలక్షన్ కాన్వాస్ చేసావు, అందినవాడికి అందినంత త్రాగమని డబ్బు ఖర్చు చేసావు,  కాని ఫలితములేదు అప్పుడు   ఓడి పోయావు.

అవునే నేను ఇప్పుడు పోటి  చేస్తున్నాను మల్లా,  ఈ సారి నేను తప్పక గెలుస్తాను, అని ఎట్లా చెప్పా గలుగుతావు, ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతారు, నిజాయితీని గుర్తించరు మీ ప్రయత్నం వెనకాల నేను ఎప్పుడు ఉంటాను, మీ ధైర్యానికి కారణాలు చెపుతారా, చెపుతా విను  మన వీధులకు సిమెంటు రోడ్లు కోసం తిరిగి తిరిగి వేయించాను, మన వీధుల్లో అన్నీ ట్యూబ్లైట్లు వేయించాను, కన్సల్టేషన్ ఏర్పాటు చేసి చిన్న చిన్న సమస్యలను తీర్చాను, అదే నా నమ్మకం. మంచిదండి  మీనమ్మకంతో  మీరు ప్రయత్నం చేయండి, గెలుపు మనదే. వెనకడుగు వేయకండి. ముందడుగు వేయండి.   .
                .
పోటి చేస్తూ, పతిఒక్కరి ఇంటికి పోయి, కలసి వచ్చి ఓటు వేయమని అర్ధించాడు చలపతిరావు.  
అప్పుడే స్నేహితునితో మాట్లాడాలని అకున్నాడు చలపతిరావు ,  ఫోన్ లో మాట్లాడుతూ  " హలో మీ డాడి కి ఫోన్ ఇవ్వు ", మా డాడి  ఇంట్లో లేరండి, ఎక్కడికి వెళ్ళారు "మహిళా కార్యకర్తల వెంబడి పోయారు, ఎ పార్టి తరుఫున తిరుగు
తున్నరో  చెప్పారా, మీరు నాయకులైతే మీ పేరు చెప్పండి, మీ రెంతిస్తారో చెప్పండి, అయితే మీ మమ్మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ ఇవ్వు, మా మమ్మీ  కూడా లేరండి, ఎక్కడికి పోయారో చెప్పారా, ఆ చెప్పారు ఎక్కడికి, ఎవరితో చెప్పద్దన్నారండి ఆయినా మీతో చెపుతున్నా, చెప్పమ్మా త్వరాగా చెప్పు, అసలే ఫోన్ ఖర్చు పెరిగి పోతున్నది, అయితే నేను చెప్పను లేండి, మా డాడి వచ్చినప్పుడు రండి, ఆగాగు ఫోన్ కట్ చేయకు ఆ చెపుతున్ననండి ఆ చెప్పు " మా మమ్మీ  ఏదో పార్టి మీటింగ్ కు బిర్యాని ప్యాకెట్లు పంచటానికి వెళ్ళారు" మరి ఇంట్లో ఎవరున్నారు నేను మా చెల్లెలు ఉన్నారు,అట్లయితే మీ చెల్లెలుకు ఫోన్ ఇవ్వు అన్నాడు "ఉయ్యాలలోంచి లేపితే ఏడుస్తుంది ... ఇమ్మంటారా " ఆ  ఆఅ ఆఅ  ఆ .....

ఓట్లు వేసే రోజు వచ్చింది

చలపతిరావుకు  స్నేహితుడు ఫోన్ చేసి మాట్లాడాడు  " మాట్లాడక పోవటం మౌనం వహించడం ద్రోహం అది నీకు తెలుసా అని ఫోన్ లో అరుస్తున్నాడు, అది తెలుసండి నేను చెప్పేది వినండి  " రాజ్యాంగానికి సమాజానికి పొంతన లేదు, మనిషి  మనిషికి ఓర్చుకునే గుణం లేదు, మంచి చేయాలన్న రాజకీయమ్ బ్రతక నీయదు, శాసన సభలో కప్పల్లా అరిచే వారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు, కన్నీళ్ళకు, కడుపు కోతలకు , నిరసనలకు, డబ్బు సంచీలకు, ప్రతిఒక్కరు లొంగుతారనుకోవటం పొరబాటు, నువ్వు నేను మనమందరం ఓట్లు వేయక తప్పదు, వెయ్యలేదనుకో లారీలమీద ప్రక్క జిల్లాలనుండి మను ష్యులను తెప్పిస్తారు, వారుమన ఓట్లు వేసేస్తారు, త్వరపడి  ఓట్లు వేయడానికి త్వరగా రండి "

చివరి ప్రయత్నంగా ఓట్లు వేసే రోజు, కౌంటింగ్ చేసే రోజు అందరికి బిర్యాని ప్యాకెట్లు పంచాడు. చివరికి ఒక్క ఓటు తేడాతో గిలిచాడు చలపతిరావు, "తిరుపతికి వెళ్లి దేవుని హుండిలో కానుకలు వేసి తిరిగి వచ్చాడు",
భార్య ప్రోద్బలంతో అధికార పార్టిలో చేరి మంత్రి పదవి సంపాదించి నిజాయితీ పరుడుగా, సొంత ఇల్లు లేని రాజకీయ నాయకుడుగా, అడిగిన పని వెంటనే చేసే నాయకుడుగా ప్రజలలో గుర్తింపు తెచ్చు కున్నాడు, సైకిల్ మీదవెల్లె మంత్రిగా పేర తెచ్చుకున్నాడు     .                       
--((*))--


ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ - (సజ్జన సాంగత్యము)

ఓ బజారుకు చిలకల్ని అమ్మేవాడు వచ్చాడు. వాడి దగ్గర రెండు పంజరాలున్నాయి. ఒక్కొక్క పంజరంలో ఒక్కొక్క చిలక ఉంది.ఆ బోయవాడు ఓ చిలుక విలువ ఐదువందలరూపాయలు, మరో చిలుక విలువ ఐదు రూపాయలూ చెబుతున్నాడు. ఎవరైనా ఐదురూపాయల విలువ గల చిలుకను కోనదలిస్తే ముందుగా కొనుక్కోవచ్చు.కానీ ఎవరైనా ఐదువందల రూపాయల విలువ గల చిలుకను కొంటే మాత్రం ఐదురూపాయల విలువ గల చిలుకను కూడా కొనితీరాలి. 


అక్కడి రాజుగారు ఆనాడు బజారుకు వచ్చాడు. ఆ బోయవాని కేకలు విని ఆయన ఏనుగు దిగి అడిగాడు _ " ఈ రెండింటి విలువ లో ఇంత తేడా ఎందుకు ?.
బోయవాడు " వీటిని మీరు తీసుకువెడితే ఆ తేడా తమకే తెలుస్తుంది." అన్నాడు. 


రాజు గారు ఆ రెంటినీ కొనుక్కువెళ్ళారు. రాత్రి పరుండబోయే ముందు ఆయన సేవకులను పిలిచి ఐదు వందల రూపాయల విలువ గల చిలుకను తన పడక కి దగ్గరగా పంజరంలో ఉంచండన్నాడు.ప్రాతఁకాలంలో నాలుగు గంటల సమయమందు చిలుక పలకసాగింది. " రామ్ రామ్ సీతారామ్ " అంటూ చక్కగా సంకీర్తన చేసింది.మనోహరమైన శ్లోకాలను గానం చేసింది.రాజు మహానంద పరవశుడయ్యాడు.
మరునాడు ఆ మహారాజు రెండవచిలుక పంజరాన్ని తన శయ్య దగ్గర పెట్టించాడు.తూర్పు తెల్లవారక ముందే ఆ చిలుక దుర్భాశలు, కఠోరవచనాలు పలకసాగింది.మహారాజు కు మహాకోపం వచ్చింది.సేవకులను పిలిచి, " ఈ పక్షిని అంతం చెయ్యండి" అన్నాడు.
మొదటి చిలుక దగ్గరనే ఉంది.అది వినయంగా పలికింది, "రాజా దీనిని చంపకండి. ఇది నా సోదరుడు. మేమిద్దరం ఒక్కసారే వలలో చిక్కుకున్నాము. నన్ను ఓ సాధువు తీసుకున్నాడు.అతని దగ్గర నేను భగవన్నామం నేర్చుకున్నాను. దీనిని ఓ మ్లేచ్ఛుడు పెంచాడు. వాని దగ్గర ఇది దుర్భాషలు నేర్చుకుంది. ఇందులో దీని దోషమేదీ లేదు.ఇది దుస్సాంగత్య ఫలితం మాత్రమే ". ఆ చిలుక పలుకులు విని మహారాజు ఆ చిలుకను చంపలేదు కానీ విడిచిపెట్టేశాడు.

నా మెయిల్ పంపిన జా.  జి.  శర్మగారికి, ధన్య వాదములు

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం,
 .
ప్రతివారు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు.
పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం,
బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. 


అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి,
ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు క్యూ కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్యపోనక్కర లేదు.ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి.
వరకట్నమెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం.
దారి తప్పేం. 


ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ,దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు. 


ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడనుకోవలసినది, ఈ వ్యతిరేక ఫలితం కూడా మన మంచికోసమే జరిగిఉండచ్చు, మనకి తెలియని ఆపద గడవబెట్టడానికి, భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకుపోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి. 




లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది,
 

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే,
రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩
అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును. 


చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.


28, జనవరి 2016, గురువారం

Internet Telugu Magazine for the month of 2/2016-5

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  

(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (5) (date 1-2-2016 to 7-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................



: శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:

అనంతంలో  ఆణువణువూ  ఆవరించి
అరుణోదయంతో, జాబిల్లితో  సంచరించి
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
  


మాయ మంత్ర, తంత్రాలు, మదిలోకి చేరకుండా  
మనసులోని ఆలోచనలు వక్రమార్గం పోకుండా 
మదిలో తలపులు మమేకంగ ఉండి అనేకం కాకుండా 
మాయాలోకంలో మనస్సు మారకుండా ఏకాగ్రతతో ఉంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
   


పక్రియ ప్రకంపనలకు తట్టు కొనేవిధముగ 
ప్రకృతిని అనుసరించి బ్రతికే విధంగ 
కోప ప్రకోపాల మద్య నలిగి పోకుండగ
ప్రపంచాన్ని అర్ధం చేసుకొని బ్రతకాలంటున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


జ్ఞానము, అజ్ఞానము, ఇదేనని తెలియపరుస్తున్న 
శూణ్య అనంతాలను ఆవరించిన గాలి నందిస్తున్న
క్షణం క్షణం ప్రవర్తనను మార్చుకోక ఉంచుతున్న
నిరీక్షనను తొలగించి వీక్షన శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


లౌకిక వెలుగును  లౌక్యం గా తెలుపుతున్న 
లాలి, లోలక, లోకం తలపులను వివరిస్తున్న 
లయకార లాలనలో, లాస్యం అర్ధం తెలుపుతున్న 
లంగరులా, నిలిచి లాంతరులా, శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వజీవులు, ఆద్యాత్మిక విస్పులింగాలు గాను
గర్వాన్ని అనగ త్రొక్కే  దివ్య  ప్రభోదాలు గాను
నిర్విర్యులను ఉత్తేజులుగా మార్చుటకు  గాను
మాకు ప్రార్ధించు శక్తి, ఆరాధించే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


విద్యను భోదించే విధంలో మంచి చెడు తెలుపుతు 
నిత్య సత్యాలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తు 
ధర్మాన్ని రక్షించే తేజోవంతులను సృష్టిస్తు 
సర్వం తెలిపి,  నీధామాన్ని చేరే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


మొహానికి, శోకానికి, లొంగి కష్టాలు అనుభవించమని 
ఆశా పాశాలకు చిక్కక అతీతులుగా ఉండాలని 
అర్ధాంగి, అర్ధం, అర్ధం  చేసుకొని జీవించాలని 
లోకంలో ఆద్యాత్మిక శక్తిని పెంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


కలల కళ్ళకు కమ్ముకున్న చికట్ల తొలగిస్తు 
వయసు ప్రేమలను, ఇక్కట్లను అనుభవించాలంటు  
గుణాలకు చిక్కి అను భందాలను పంచుకోవాలంటు 
అన్నీ సమస్యల తరుణోపాయము చెప్పుతున్న   
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వ సమగ్రం ఉదాత్తమైన విజ్ఞానాన్ని విస్తరిస్తు

విశ్వవ్యాపిత స్వీయ పరిసీలన జ్ఞానాన్ని పంచుతు

వేదాలు పురాణాలు ఇతిహాసల  ధర్మాల్ని తెలుపుతు 
చర్మచక్షువులైన ప్రతిఒక్కరికి దృడ శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


శ్రీలక్ష్మి శ్రీ శ్రీనివాసా  శ్రీ కర శుభకరంగా
శ్రీ సుబ్రభాత, ప్రార్ధనా, అర్చనల పరంగా
శ్రీ పాద పుష్పాల పూజల,సేవా పరంగా
          శ్రీ పరందామా, మా మనస్సుతో ప్రార్ధించు తున్నాము           
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
--((*))--

ప్రస్థానం (సంతృప్తి)

చక్కగా నేర్చిన విద్య
చుక్కలెన్నో అంతమందికి చేయాలి భోధ
మక్కువతో చేయు పని
ఎక్కువ పరిపూర్ణత చెంది కలుగు సంతృప్తి

భేద దృష్టి వదలి సమ
బాధ దృష్టితో దరిచేరి సంతృప్తి పరచు
ఖేదము వదలి నిజం గ్రహించి
ముదముతో చెలిమికి సుఖం పంచుటే తృప్తి


కొందరి మనసు నిండా ఉన్న కాలుష్యాన్ని 
మరికొందరి దురాశా తలుపుల్ని 
ఇంకొందరి స్వార్ధపు ఆలోచల్ని 
తరిమే మనిషి నిజమైన దేవుడు
--((*))--

ప్రస్థానం (ప్రయాణం)

ఆట పాటల జీవితం
బాల్య దశ  ప్రయాణం
విద్యా, ప్రేమల జీవితం
యవ్వన దశ ప్రయాణం

గాను గెద్దుల జీవితం
ఉద్యోగ ప్రయత్న ప్రయాణం
శ్రమతో కూడిన జీవితం
ఫలితాల కోసం ప్రయాణం

ప్రేమ ఫలిత జీవితం
సుఖ శాంతుల ప్రయాణం  
సంసారం సుఖ జీవితం
అడుగులో అడుగు ప్రయాణం

అరమరికలు లేని జీవితం
అలుపెరగని ప్రయాణం
ఆటు పోట్ల  జీవితం
ఆనందం లేని ప్రయాణం

అవస్థలు లేని జీవితం
అనురాగపు ప్రయాణం
అందరూ కొరిఉకొనె జీవితం
మనసు ప్రశాంత ప్రయాణం

పిల్లల ఉండే జీవితం
మౌన సలహాతో ప్రయాణం
ఉప్పు కారం లేని జీవితం
యోగుల జీవితం

ఒంటరి బ్రతుకు జీవితం
ఎండమావుల ప్రయాణం
పండుటాకుల జీవితం
దేవదేవుని కోసం ప్రయాణం

అనారోగ్యంగా ఉన్న జీతం
గమ్యం లేని ప్రయాణం
ఆశ, నిరాశలతో ఉన్న జీవితం
తుఫాన్ లో పడవ ప్రయాణం

శాంతి, సుఖ నిద్ర జీవితం
ప్రశాంతత లో ఉన్న ప్రయాణం
గాఢ నిద్ర జీవితం
శివసానిత్యానికి ప్రయాణం

--((*))--

ప్రస్థానం -(రాజీ )

హృదయ వేదన గమనించ లేరు
స్పర్శ మధురనుభూతి తెలుపలేరు
కళ్ళవెంట వచ్చే కన్నీరు ఆపలేరు
వయసుని బట్టి బుద్ధిని మార్చుకోలేరు

జాబిల్లిలోని మచ్చను మార్చ లేరు
నింగిలో తారాలు రాకుండా ఆపలేరు
మేఘాల కదలికలు గుర్తించ లేరు
ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేరు
 
నేల నుండి నింగిని వెతుకుట మానరు
చావుని బ్రతికించే పయత్నం మానరు
భూమిలోని ఖనిజాలను తీయక మానరు
 కాంక్షరగిలి స్త్రీని చేరినవారు నిలువలేరు

ఎడారి తుఫాన్ ఆపలేరు
ఏరువాక పొంగును ఆపలేరు
పున్నమి వెన్నెలను ఆపలేరు
అమావాస్య చీకటిని మార్చలేరు

కళ్ళకు రక్ష కను రెప్పలు
పళ్లకు రక్ష పెదాలు
కాళ్ళకు రక్ష పాదాలు
వళ్ళుకు రక్ష సిగ్గులు 

దేహ చికిచ్చ కు ఉంది మందు
మోహ చికిచ్చకు స్త్రీ యే మందు
స్నేహ చికిచ్చకు ప్రేమే మందు
స్వాహ చికిచ్చకు రాజీ మందు
 
 
Jatoli Temple, Solan, Himachal Pradesh, India


ప్రస్థానం - వసంతమా

 ఓహో ఓహో వసంతమా
ఆహా వనసౌరభాన్ని విస్తరింప చేసినావా
మహా ఋషులు మౌనమూ
మహిలో విస్తరించే మహోన్నత వసంతమా

నీ స్మృతి విహంగమై
మా మతి మధురాతి మదురమై
మా ప్రతి కదలిక స్వప్నమై
మా ఊహల పరవసానికి మార్గామైన వసంతమా
 
లేలేత చిగురుల మాధుర్యం
మనసు మమేకమైన వన వసంతమా
స్త్రీ పరవశించి తన్మయత్వంతో
పతి సానిద్యం చేరి శృంగార భావం పెంచే వసంతమా
ప్రస్థానం- (మలుపులు)

జీవితంలో ఉంటాయి మలుపులు
స్థిరంగా ఉండవు స్థితిగతులు
చేయి పట్టి పెంచిన అనురాగాలు
వయసు పెరిగిన కొద్ది తగ్గు మమకారాలు

తండ్రి కూతురు ప్రక్క ప్రక్క నడకలు
చూసి ఓర్వలేని కందిరీగల శబ్దాలు
తల్లి పిల్లలను పెంచిన, కొన్ని నయనాలు
ఆశలు చూపి, పిల్లలకు నేర్పే వక్రబుద్ధులు

నిక్కరు నుండి ప్యాంటుకు మారిణ యువకులు
కొత్త ఆలోచనలతో  పెరిగే విద్యా ప్రమాణాలు
గౌను నుండి చీర చేరిన యువతులు
కొత్త ఆలోచనలతో చేసే ప్రేమ కలాపాలు
--((*))--

 ప్రస్థానం - స్త్రీల హృదయం

స్త్రీలు  సుకుమార కుసుమాలు, ప్రతి పలకరింపు లోను పులకరింప చేసి  పరిమళాలను వెదజల్లే పారిజాతాలు, చెప్పలేనంత అనుభూతులను, ఆకర్షనలను, చీకటిని తరిమి వెన్నలను పంచి , మనస్సును ఉల్లాసపరిచే ప్రేమ సౌహార్దాల చిలకరింత లతో,  మృదు మధుర భాష్యాలతో, కిల కిల నవ్వించి, తళ తళ  మెరుపునుచూపి, మిస మిస లాడుతూ, గుస గుస లాడుతూ, భందాలను, అనుభందాలను అనేకం హృదయంలో దాచుకొని, ఓర్పుతో ఓదార్పు కల్పించి, మనస్సులోని వేడిని చల్ల పరిచి ప్రశాంతత కల్పించేది "స్త్రీ  హృదయం ".

స్త్రీ మాటలు ఇలా ఉంటా యి

ఆప్యాయతల తెనె లోలికే అప్తవాక్యం
           అనురాగాల ఆనందం పంచె వాక్యం             
ప్రేమ వరాలకు  పరవసం పొందే వాక్యం
పరిమళాల ఆకర్షణ తో చెప్పే వాక్యం

తలపుల చూపే పిలుపు
మంద హాస్య పలుకే వలపు
కను సైగతోనే  పలకరింపు
ఆలింగనంతో మై మరుపు

మనసుకు నచ్చిన మణి
ఎంత గానో చక్కని  పాణి 
ఎంత గానో  చల్లని  వాణి
మరువ లేకున్నా  రాణి

బతుకంతా పులకించి పోయే  రస రమ్య శ్రవంతి
వయసంతా సింగారంతో శ్రుంగారాల ముద్ద చామంతి
నిర్మలత్వం, జారుతనం, కలబోసిన కావ్య  కళావతి
సరళ సొగసులతో దివినుంచి భువికి వచ్చిన శాంతి


కనుల కన్నిటిలో కలువవు
కనుల వెలుగుల్లో మెరుపువు
రెప్పల పందిరిలో ప్రమిదవు
రెప్పల మాటున ఒదిగి ఉంటావు

అడుగులో అడుగేసి అనుకరిస్తావు
అడుగుల్లో చుట్టుకొనే గాలి ఔతావు
అడుగడుగునా  ప్రేమను పంచావు
తడబడ కుండా నాలో ఓదిగిపోయావు

కరముల కౌగిల్లో చిక్కావు
కరతాలముకే కరిగి పోయావు
మరువలేని భంధంగా మారావు
మరవకుండా నాలో ఒదిగి పోయావు


రాధా కృష్ణుల పలకరింపు తీరే వేరు 

యమునా తీరాన రాధ మదిలోని స్పందన
గోపాల కృష్ణుడు కొలువై పులకరించి పల్కెన
ప్రణయణీ హృదయమున పరవసించి ఉండెన
చల్లచల్ల గా రసగీతాలలో కరిగి ఉండే రాధా మోహన 

రాధిక మధుర గీతలను, మనసు పరవిసించే మమేకంతో, అమృతంపంచే అదారాలతో, ఆలపించి అనురాగాల పంచుట కొరకు, తలలో ఉన్న అపూవ్వులు పొట్టలు విచ్చి పరిమళాలు వెదజల్లుతూ తన్మయత్వంలో మునిగే  

ప్రతి రేయి కలలు కంటా
ప్రతి క్షణం నీ కోసం విరహవేదనతో
ప్రతి రాత్రి వెన్నెల వర్షం
ప్రతి నిదుర లేని రాత్రిలో తలుస్తున్నా

నాకళ్ళు కనే ప్రతి కల
నావాళ్ళు తలచే ప్రతి నిముషము
లోగిళ్ళు అంతా సంబరమ్
నావళ్ళు సిరి వెంట పోక ఉండే నీకోసం

నీకు సాటి ఎవరులేరు
నాకు నచ్చావు నన్ను వదలి పోలేవు
ఏకులా ఉండి మేకైనా ననకు
సుకుమారి నా మనసుకి నచ్చావు       

ప్రాంజలి ప్రభ -చిన్న కధ -(బాల్యంలో ప్రేమ )
ఇది ఒకనాటి సాయంకాల సమయం, చిరుజల్లు వానగా మారి, తుఫాన్ గా మారి, కుండపోత వర్షం ఏకధాటిగా కురుస్తున్నది, వీధులన్ని నిర్మానుషంగా ఉన్నాయి, కాలవులన్నీ నిండి పొంగు తున్నాయి, రోడ్లపై నీరు ప్రవహిస్తున్నది, లోతట్టుప్రాంతాలు మునిగి పోయినాయి, అక్కడక్కడ ఆగిన స్కూటర్లు, కార్లు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం, స్కూళ్లు, కళాశాలకు వెళ్ళిన వారు వేగంగా తిరిగి వస్తున్నారు, వాల్లకోసం ఇల్లయందు  ఉన్నవారు ఎదురుచూస్తున్నరు. కొంచము వర్షము తగ్గినది.

మంగమ్మగారి మానవుడు, గారాల బాలుడు అగు “ అశోక్ “ భయంగా తడిసిన బట్టలతో ఇంటికి చేరిన వాడ్ని చూసి,  బామ్మ హృదయం భయంతో నిండి, మనస్సు, చివుక్కు మన్నది. ఎందుకురా బాబు ఇలా తడిసి వచ్చావు. మన ఇంటి ప్రక్కన ఉన్న గుడిసెలు మునిగినాయి, అక్కడ మునిగిన వారిని ఈది పడవలోకి చేర్చాను బామ్మ, వాల్ల బాధ చూస్తే నా కళ్ళు తిరిగినాయి, రెండు రోజులనుంచి తిండి లేక మిద్దెలపై ఉన్నారు, కొందరి కన్నా సహాయం చేద్దామని నాదగ్గరున్న పైకముతో రొట్టెలు కొని పంచాను బామ్మ, మరయు బాలుర మందరము కలసి వారి సహాయార్ధం పాత దుస్తులు సేకరించి వారికి పంచాము, నేను తిరిగి వస్తుంటే కరెంటు వైరుతేగి క్రిందపడి ఉన్నది, దాని త్రొక్క కుండా ఉండేందుకు అక్కడే ఉండి నా సేల్లునుండి  పోన్ చేసి వాళ్ళు వచ్చాక, నేను వచ్చాను అందుకే ఆలస్యమైనది.      రామునికి ఉడత సహాయము చేసినట్లు నేను చేసాను అంతే,   మానవసేవే మాధవ సేవ అని నీవే కదా చెప్పావు. నేను తడిస్తేనే తళ్ళ డిల్లి పోతున్నావు నీవు, వాళ్ళను  చూసి నేను సహాయము చేయుట తప్పు కాదుకదా బామ్మా.
గొప్ప వాళ్ళంటే డబ్బు సంపా దించటం కాదు కదా బామ్మ, తోటివారికి సహాయం చేయటం కదా బామ్మ. ఎంత ఎదిగి పోయావురా మనవడా అంటూ కళ్ళంబడి నీళ్లు కార్చింది బామ్మ.   అప్పుడే T .V లో వరదలో మునిగిన వారిని అశోక్ అనే విద్యార్ధి రక్షించినందుకు బాలురకు ఇచ్చే ప్రత్యేక అవార్డు ఇస్తున్నట్లు అప్పుడే తెలిపారు, బామ్మ కళ్ళంబడి నీల్లు కారుస్తూ రారా మనవాడా అని హత్తుకున్నది                        



                                         --((*))--


"ప్రేమను బ్రతికించండి పెద్దలారా"
 
కోర్టు ఆవరణ లోపల కూర్చున్నవారు మాట్లాడకుండా ఉన్నారు,  బయట ఉన్నవారు కోలాహలముగా మాట్లాడుతున్నారు. లాయర్లు హడావిడిగా లోపల కూర్చున్నారు, పొలీసులు నేరస్తులను కోర్టులో హాజరు పరుస్తున్నారు, వాది తరుఫున లాయర్ విశ్వనాద్, ప్రతివాది తరుఫున లాయర్ భారతి వాద ప్రతివాదనలు జరుపుటకు వేచి యున్నారు.

అప్పుడే రాజకీయ నాయకుడు దుర్యోధన రావు (శ్రేయోభిలాషి) ఒకరిని హత్య చేసినట్లు అభియోగం, వారు  నేరము చేసారా లేదా నిర్ధారణకు కోర్టులో హాజరు పరిచారు రక్షక భటులు. ఖచ్చితమైన సమయానికి జడ్జిగారు వచ్చిన తర్వాత కోర్టులో ఉన్న వారందరూ నుంచోవటం జరిగింది, జడ్జి గారు ఆసనమునందు కూర్చున్నాక. తరువాత అందరు కూర్చున్నారు.    కోర్టులో ఉండే గుమాస్తా ఆరోజు వివరించే కేసు వివరాలు తెలియ పరిచాడు.
దుర్యోధన రావు గారు,   దుర్యోధన రావు గారు  దుర్యోధన రావు గారు అని ఆఫీస్ గుమాస్తా పిలిచాడు.
 పొలీసులద్వారా తేబడిన ,   దుర్యోధన రావు గారు  కోర్టులో ఉన్న బోనులా ఉన్న బల్లపైకి వచ్చి నుంచోవటం జరిగింది.   అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
లాయర్ భారతి భగవత్ గీత తీసుకోనివచ్చి, దానిపై దుర్యోధనరావు చేత చేతిని పెట్టించి,  భగవత్ గీత సాక్షి గా అంతా నిజమే చెపుతాను అబద్దము చెప్పను అని పలికించెను.
భారతి : మీకు, సుబ్బారావుగారికి లోగడ తగాదాలు జరిగినట్లుగా రోజువారి పత్రికలన్నీ తెలియపరిచాయి, అది నిజమే గదా. 
విశ్వనాధ్ : లాయర్ గారు అవసరం కాని ప్రశ్నలు వేస్తున్నారు, వెయ్యకూడదని ఆజ్ఞలు ఇవ్వగలరు.
భారతి : సుబ్బారావుగారి కుమారుడే చనిపోవటం జరిగింది, అందులో దుర్యోధనరావుగారి ఇంట్లోనే  జరిగింది.
జడ్జి : మీ అభ్యంతరం తొలగించటం జరిగింది
భారతి : ఆర్ధిక వ్యవహారాలలో మా యిద్దరిమద్య తగాదాలు వచ్చిన మాట వాస్తవము కదా,  రాజకీయములో  వ్యతరేకులు అవునా కాదా.
దుర్యోధన్ రావు: మాఐద్దరిమద్య తగాదాఉన్న మాట నిజము, రజకీయములో వ్యతరేకులము. 
భారతి : ఐతే మీరు పాత కక్షలు పెట్టుకొని వారి కొడుకుని హాత్యచేసారు, నిజమా కాదా చెప్పండి
దుర్యోధన్ రావు: హత్య మాయింట్లో జరుగటం మా దురదృష్టం, నేను హత్య చేసానని అభివాదము మాత్రమే, ఈ హత్యకు నాకు ఎటు వంటి సంభందము లేదు.
భారతి : నిజం చెప్పండి, మా దగ్గర ఆధారులున్నాయి మీరే హత్య చేసినట్లు
విశ్వనాద్ : మా క్లైన్టును ఆధారాలు లేకుండా వత్తిడి చేస్తున్నారు.
భారతి : అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇవిగో జడ్జి గారికి సమర్పిస్తున్నాను, (వేలిముద్రలు రిపోర్ట్ ఇచ్చిన సర్టిఫికేట్, హత్యకు ఉపయోగించిన పరికరము ) .
జడ్జి : మీరు చెప్పుకోవలసిన విషయమేమైనా ఉన్నదా
దుర్యోధన్ రావు: మేము హత్య చేయలేదు, అది మాత్రం నిజం, హత్య చేయుటకు కారకు లెవరో నిర్దారించి శిక్ష వేయగలరు.
భారతి : మీరు ఇచ్చిన డ్రింక్ త్రాగుట వల్ల చనిపోయినారాని మాదగ్గర ఉన్నా ఆధారాలు తెలుపుతున్నాయి. ఇంతకీ మీరు రఘురాం కు డ్రింక్ ఇచ్చారా లేదా
దుర్యోధన్ రావు: డ్రింక్ ఇంచ్చింది నేనే, నేను ఇచ్చిన తర్వాత గుండె నెప్పి వచ్చిందనగా మేమే హాస్పటల్లో చేర్పించాము, ఆ తర్వాత చనిపోయారు. నేను మాత్రము తప్పు చేయలేదు.
భారతి : నేరాన్ని వప్పుకున్నారు కనుక శిక్ష విధించగలరు.
విశ్వనాధ్ ; మా క్లైంటు ను ప్రశ్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను
జడ్జి : అనుమతి మంజూరుచేయుట మైనది. 
విశ్వనాధ్ : దుర్యోధన రావు గారు మీరు స్వయముగా డ్రింక్ త్రాగమని ఇచ్చారా అవి ఎక్కడనుండి తీసి ఇచ్చారు. 
దుర్యోధన రావు :  ఎప్పుడుకలిపి ప్రిజులో పెట్టుకుంటూ ఉంటాము, అది అంతా నా శ్రీమతి చేస్తుంది. లేదా వంట మనిషి చేస్తున్నది. 
విశ్వనాధ్ : :వాళ్ళు ఏమైనా విషం కల్పి ఉండవచ్చు కదా, మరి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి, వారిని కూడా కోర్టులో ప్రస్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను. 
 జడ్జి : అనుమతి మంజూరు చేయుట మైనది.
దుర్యోధన రావుగారి భార్య భాగ్యం : ముందుగా తయారు చేసినది ఇచ్చాము మరిమీరు త్రాగారా 
తర్వాత మేము త్రాగము మాకు ఏమికాలేదు, కేవలము రఘునాద్ త్రాగిన గ్లాసులో మాత్రమె పాయిజన్ కల్పినట్లు  గుర్తించారు. కదా, మీరు కల్పి ఉండొచ్చు కదా. 
మా యింటికి అనేకమంది వస్తున్నారు , మేము అందరికి అట్లాగే ఇస్తాము, ఎప్పుడు ఈ విధముగా జరగలేదు. 
మరి ఇప్పుడు జరిగింది కదా మీ సమాధానము
నేను చెప్పేది ఒక్కటే ఈ మరణానికి మాకు ఎట్టి సంబందము లేదు, పూర్తి వివరాలు పొలీసువారు సేకరించి మేము నిరపరాదులమని గుర్తించగలరు అని మేము జడ్జి గారిని కోరుచున్నాము. 
పనిమనిషి కూడా ఇదేవిధముగా చెప్పటము వలన చావుకు కారణము త్రాగుట వలన మాత్రమే  అని తెలుసున్నది. ఎందుకు ఇచ్చారో మాత్రం తెలియుట లేదు కనుక
విశ్వనాద్ : మా క్లైంట్ కు మీరు జామిన్ ఇచ్చి, పూర్తి వివారాలు సేకరించుటకు తగిన సమయము ఇవ్వవలెనని కోరుచున్నాను. మరియు పొలీస్ అధికారిని ప్రశ్నలు అడుగుటకు అనుమతి కోరుచున్నాను.

పోలీస్ అధికారి:మీరు ధుర్యోదన రావు గారిని అరెష్టు చేయుటకు కారణాలు చూపారా అని అడిగాడు విశ్వనాద్. 
సమాచారము అందగానే మేము హాస్పెటల్ కు పోయాము అక్కడ రఘురామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.  నేను డ్రింకు త్రాగుటవల్ల నా ఆరోగ్యము చెడినది అని చెప్పి మరీ చనిపోయాడు కనుక  మేము అరెష్టు చేసి కోర్టులో ప్రేవేశ పెట్టితిమి, డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇందు పొందుపరిచాము. 
విశ్వనాధ్ : జడ్జి గారు తమరు ఈకేసు నిమిత్తము  పూర్తి సమాచారము అందలేదు, కనుక పూర్తి సమాచారము  అంద  చేయ మని పోలిసువారిని కోరవలెనని విజ్ఞప్తి చేయుచున్నాను. ఈకేసు వాయిదా వేయవలెను కోరుచున్నాను 
జడ్జి : ఈకెసు పూర్తి వివరాలు పొలీసువారు పరిసీలించి తదుపరి వాయిదా వచ్చేనెల ఒకటవతారీఖునకు మార్చటమైనది. కోర్టు సమయమైనది అని జడ్జి గారు లేచారు , అందరూ లేచారు. 

పోలీస్ ఆఫీసర్ దుర్యోధన ఇంటికి చేరి అంట పరిసీలించుట మొదలు పెట్టారు, అక్కడ ఉన్న ప్రతి వస్తువును కదిలించి, ఏదైనా ఆధారము దొరుకుతుందేమోనని వెతికారు, గోడలన్నీ తెల్లగా రంగు వేసి ఉన్నాయి, ఇల్లు చాలా పరిశుబ్రముగా ఉన్నది, అక్కడ ఒక కుక్క కూడా ఉన్నది, అది పోలీసులను చూసి తోక ఆడిస్తూ వెనక వచ్చింది, అందరి సెల్లులు తీసుకున్నారు. డ్రాయర్ సొరుగులో కొన్ని పనికిరాని సెల్లులుకూడా చూసారు వారు, వాటినికూడా తీసుకొని వెళ్ళారు . 
పనికిరాని సెల్లులను తసి ఓపెన్ చేయగా, ఒక సెల్లులో రఘురాం చనిపోకముందు రండు రోజులు క్రింద, ఒక మెడికల్ షాపుకు ఫోన్ చేసినట్లు గమనించారు. వెంటనే మెడికల్ షాప్ గుర్తించి గట్టిగా అడుగగా, ఒక స్త్రీకి పాయాజన్ అమ్మినట్లు తెలిపారు వారు . ఆస్త్రీ  ఎవరో గుర్తుపడతార అని అడగగా, గుర్తు పట్టలేమని చెప్పారు. మరల వచ్చి దుర్యోదన్ రావు గారి ఇంట్లో కొత్తవారు ఎవరోచ్చారని విచారించగా దుర్యోదన్ రావు గారి కూతురు స్నేహితురాలు  వచ్చినట్లు గమనించారు. ఆమె అడ్రస్ తీసుకొని వివరాలు వేతకగా ఆమె చనిపోయిన రఘురామ్  కాలేజీలొ బీటెక్ చదువు తున్నట్లు గమనించారు, వెంటనే కాలేజికి వెళ్ళగా, ఆమె కలెజీకి రావటము లేదని గ్రహించారు. ఆమె బెంగళూర్ వెళ్లినట్లు గుర్తించారు. బెంగళూర్ వెల్లి  తెలుసుకొనగ తండ్రికి సిరియన్ గా ఉండుటవల్ల అక్కడే ఉన్నట్లుగా గమనించారు. 

పోలీస్ లు అడిగిన ప్రశ్నలకు ముక్తిసరిగా సమాధానము చెప్పగా ఎమీ ఫలితము లేదని గ్రహించి పోలీసులు వెనక్కి తిరిగి వచ్చారు. 
పోలీసులు చివరాగా చనిపోయిన రఘురాం ఇంటికి వెళ్లి సుబ్బారావు గారిని వివరాలు అడిగారు. రఘురాంకు పెళ్లి నిశ్చయమై, నిశ్చయ తాంబూలములు కూడా తీసుకునట్లు తెలిపారు. 
పోలీసుల అన్నివివరాలు గ్రహించి కోర్టులో వాయిదా సమయానికి వారు తెలుసుకున్న వివరాలు కోర్టులో హాజరు పరిచారు. 

కోర్టులో దుర్యోధన రావుగారు హత్య చేసినట్లు పెద్ద ప్రకటన పాపర్లో ప్రకటించారు, ఈ రోజే శిక్షి పడుతుందని వ్రాసి ఉన్నది. 
కోర్టులో జడ్జిగారు కూర్చొన్నారు. 
జడ్జిగారు తీర్పు చదువుతున్నారు. అందిన ఆధారాలు ప్రకారముగా నేరము చేసినవారు అంటున్నప్పుడు, అప్పుడే ఒక లెటర్ జడ్జి గారికి అందినది అది రాష్ట్ర గవర్నర్ నుండి వచ్చినది. 

ఈ హత్య కేసులో ముఖ్య సాక్షి ఈలెటర్ తెచ్చినవారు వారి అభిప్రాయలు తెలుసుకొని తీర్పు చెప్పగలరు అని వ్రాసిఉన్నది. 
ఈఉత్తరము తెచ్చినవారు ఎవరు అని తెలుసుకొని, సాక్షిగా పిలిచారు. 
అప్పుదే భారతి లాయర్ లేచి వచ్చిన వ్యక్తి మీకు తెలిసిన వివరాలు  చెప్పమని కోరారు. 
" నేను భగవత్ గీత మీద ప్రమాణము చేసి అంతా నిజమే చెపుతాను,. అబద్ధము చేప్పను". నాపేరు జానకి అందరూ జానీ అని పిలుస్తారు, ముఖ్యముగా నేను చెప్పునది, నేను రఘురాం ప్రేమించుకున్నాం, మేమిద్దరం రిజిష్టర్  మ్యారేజ్ చేసుకుందాంమనుకున్నాం దానికి కారాణం రఘురాం తండ్రిగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, మా నాన్న కూడా ఒప్పుకోకుండా వారికి ఆస్తి బాగా ఉంది, మనం మద్యతరగతి వాళ్ళం మనకి వాళ్లకు తగదమ్మా అని హెచ్చరించారు, మా అమ్మగారు పోయినప్పటి నుండి మానాన్నగారు చాలా చితికి పోయారు, ఒకరోజు నేను మానాన్నను వెంట పెట్టుకొని సుబ్బారావుగారి ఇంటికి వెళ్ళగా, ఆయన మా అబ్బాయికి వేరే పెళ్లి  చేస్తున్నాము మీరు గొడవ పెట్టకండి అని గట్టిగా అని మమ్ము ఇంట్లోనుండి బయటకు పనివానితో నెట్టించాడు. దానితో మానాన్నగారు మనస్తా పానికి గురియ్యారు, ఆ పరిస్తితిలో ఏం చేయాలో తోచక రఘురాం కలిసాను, అప్పుడే నన్ను మర్చిపో, నీ దారినీవు చూసుకో అని గట్టిగా చెప్పాడు. వెంటనే నేను మానాన్నను ఇంటిదాకాదించి, (నా స్నేహితురాలు జయశ్రీ దుర్యోధన రావుగారి కూతురు) వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడూ వెల్తూ ఉంటాను.  ఆరోజు అనగా రఘురాం చనిపోయే ముందు రోజు, సుబ్బారావు గారి ఇంటి నుండి ఫోన్ చేసినా రఘురాం అన్న మాటలకు (నా వ్యక్తిత్వాన్నే అనుమానించాడు) మగవాళ్ళందరూ ఇలాంటి వారేనని  భరించలేక నేను ప్రాణాలు తీసుకోదలచి విషం తెచ్చి గ్లాసులో కలిపి త్రాగుదామని అనుకునప్పుడే మా నాన్నకు సీరియస్ గా ఉన్నది ఫోన్ వచ్చింది, ఆ గ్లాసును అక్కడ ఫ్రిజులో పెట్టి వెళ్ళాను, మరలా వచ్చి త్రాగుదామని. మానాన్న గారి పరిస్థితి బాగుగా లేనందువల్ల రాలేక పోయాను, ఆ గ్లాసునే తెలియక దుర్యోధన రావుగారు నేను ప్రేమించిన రఘురాంకు ఇవ్వటం జరిగింది, నేను చావాలనుకున్న ఆతను చనిపోయాడు

మనం దేవుడు ఆడిస్తున్నట్లు ఆడటమేతప్ప మనమందరం నిమిత్త మాత్రులం.                       
లాయర్ : విషం కలిపింది ఎవరో నిర్దారణ అయినది ఈ పాయింటు నొట్ చేసుకోండి, కాబట్టి దుర్యోధన రావుగారికి ఎటువంటి సంభందము లేదని నిర్ధారణ అయినది. 
జడ్జి : మీరు చావాలనుకోటానికి కారణం ప్రేమ అని అనుకోవచ్చా, మరిఎదైన కారణమా అన్న మాటలకు
జానకి నా ప్రేమ నలుగురు వేలెత్తి చూపకముందే నేను బ్రతక దలుచుకోలేదు అంటూ, ప్రేమను బ్రతికించండి పెద్దలారా అని ఒక్కసారి బోనులో వరిగి పోయింది, అందరూ నుంచొని చూస్తున్నారు జానకి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
ప్రేమ పక్షులు నేలకోరిగినాయి నేరస్తులు ఎవరు ?
 అతి ప్రేమ, ఆవేశం ప్రాణానికి చేటు – ఆలోచించి అందరూ సహకారం అందిస్తే చావు దగ్గర పడ్డ వాన్నికూడా బ్రతికించవచ్చు             
--((*))--