10, డిసెంబర్ 2014, బుధవారం

198.Family comedy story 101 - (చిరు దివ్వె వెలుగులు -3)



.......  ఓం శ్రీ రాం     ......  ఓం శ్రీ  రాం      .....  ఓం శ్రీ రాం
                                                          
నా మనసుకు తోచినవి ఫోటోలను బట్టి (1-1-2014 to 10- 12/2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు
1. బతుకు అర్ధం
ఒదిగి ఉన్నది కదా అని  చులకన చేయకు
ఓర్పును పరిక్ష చేయుటకు ప్రయత్నించకు
మనసు అర్ధం చేసు కొక అలుక వహించకు
అనురాగం, ఆత్మీయత, ఎప్పుడు మరువకు


జీవిత సత్యాన్ని తెలుసి బ్రతికించి బతుకు 
కాలాన్ని సద్వినియోగ పరచే బతికే బతుకు
 ప్రేమించి ప్రేమను పొందే బతికే బతుకు
నవ్వుతో చింతను తొలగించే బతికే బతుకు

ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ మరచి బతుకకు
ఆరాద్య దేవతను  ఎప్పుడూ వదలి బతుకకు
ఆద మరిచి  నిద్రలో కుడా సత్యాన్ని మరువకు 
ఆద్యాత్మికమనస్సు సాత్విక లక్షనమే బతుకు
 --((***))--
  2.నీవు నాకు
నీవు నాకు తోడు వుంటే, నీకు నేను నీడనవుతా
మనసు  విప్పి మాట్లాడు తుంటే,  మౌని నవుతా
మకరందాన్ని  పంచు తుంటే,  మన్మధు డవుతా
మనసు నొప్పింపక నిగ్రహంగా మనుగడ జరుపతా 




 

3. సమయం

గుర్తించుకో  నిముషానికి  కలిగే మార్పే కాల గమనం
సమయం వ్యర్ధం చేయక  జీవించటమ్  ఒక  లక్ష్యం
సమయాన్ని సద్వినియోగమ్ చేసుకోవటం ఆదర్శం
సమయాన్ని బట్టి ప్రవర్తిమ్చటమే నిండు కుటుంబం



4.గీతా  జయంతి (2-12-2014)

భగవత్ గీత సాయంత్రం గుడిలో చేసే కాలక్షేపం  కాదు
సర్వ సంగ పరిత్యాగి పాడు కొనే  నిత్య  శ్లోకాలు  కాదు
ఋషులు శిష్యులకు భోధించే భొదలు  అనుట   కాదు
మౌనంగా చేతులు కట్టుకొనివినే ఘంటసాలపాట కాదు 

విజ్ఞానాన్ని పంచి, మనో  వికాసాన్ని పెంచేది
అందరు ఆచరించె  జ్ఞాన  తత్వ   జ్ఞాన  మిది  
మానవులమౌళిక ప్రశ్నలకు సమాధాన మిది
భగవంతుడు స్వయముగా గానం చేసిన గీతఇది
 

4. నిజాయతీ
విశ్వాసాన్ని నిజాయతీ బట్టి   తెలుసు  కోవచ్చు
ఆత్మీయతను నిష్కపటం నుండి గ్రహించ వచ్చు
అభిమానాన్ని  వినయం  నుండి  పొంద  వచ్చు
పట్టుదల ఉంటె  విజయానికి మర్గ మన  వచ్చు

శ్రమ ఉంటె  అభివృద్ధిని  సాధించ  వచ్చు
కృషి ఉంటె మనుష్యులు రుషు లవ్వచ్చు 
దయ ఉంటె సమన్వయాన్ని పొందవచ్చు
మనస్సు గొప్పదైతే మనిషి గోప్ప వాడవచ్చు


5.ధర్మాత్ముడు 
"మమ  ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యా0, వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ!
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి!!"  

ప్రతిజ్ఞ సత్య మైనదని  తెలుసుకో! అమృతం కంటే, జీవితం కంటే  ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను.   రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, ధనం గాని సత్యంలో పదహారోవంతుకు కూడా  సరితూగవని స్పష్టం చెశాడు.అందుకే  ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు  

6. ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు  మరువకు
ఆరాద్య దేవతను  ఎప్పుడు   వదలకు
ఆద మరిచి  నిద్రలో  కుడా    ఉండకు 
ఆద్యాత్మికమనస్సు సాత్విక లక్షనంకు  

8. అతనొక రైతు !

సంతాన, సంతోష,  సౌభాగ్యాలు, రైతు గుండె చప్పుళ్ళు !
శ్రీమతి మృదు మధుర పలుకులు,  రైతు  పెదవుల ముచ్చట్లు !
మనవుడుచేసే ఆకతాయి పనులు,  రైతు తెలియని ఇక్కట్లు !
చివరి రక్తపుబొట్టు వరకు శ్రమించిన, రైతుకు తరగని కన్నీళ్ళు !

సంతానము కోసం రైతు సర్వెన్ద్రియములు ఖర్చు చేసినట్లు !
తల్లి తండ్రులకోసం,మమకారం పంచలేక రైతు  మనోవేదన చెందినట్లు !
అత్తమామలకోసం రైతు  జీవితాంతం అణిగి మణిగి ఉండినట్లు  !
స్నేహితులకోసం, ప్రేమను పంచలేక  రైతు  మౌనం వహించినట్లు !


9. ఆశయాల కిరణం 
నవంబర్ 2014 నెలలో మొట్టమొదటిసారిగా " సాహితీ కిరణం " పత్రికకు మొదటిసారిగా 3 కవితలు పంపినాను
వాటిలో మొదటిగా డిసెంబర్ నెలలో ప్రచురించినది ఇందు పొందు పరుచు చున్నాను
 

చీకటిని తరిమి వెలుగును నింపేది కిరణం 
అష్టదిక్కులను ఆవరించె ఆశయాల కిరణం 
మత్తును వదిల్చి జ్ఞానాన్ని పంచె ఉషోదయ కిరణం      
సాహిత్య పరులను సంతోష పరచే సాహితీ కిరణం

ప్రకృతి పరవశించినట్టు మనసును ఆనందపరచేది 
నవసమాజ నిర్మాణానికి సాహిత్యపరుల కిరణం యిది 
సకుటుంబ సమేతంగా చదివిన మనసు ప్రశాంత పరిచేది
పత్రికలు ఎన్నిఉన్నాతక్కువ ధరలో విజ్ఞానాన్నిపంచె కిరణంయిది

నయన మనోహరమైన చిత్రాలను పుస్తకం పై ముద్రిస్తూ
సంపాదకీయంలో, వ్యంజకాలతో మనస్సు రంజిల్ల పరుస్తూ
బహుముఖ ప్రజ్ఞావంతులను ప్రత్యేకంగా ఆహ్యానించి గౌరవిస్తూ
స్పందనలు,కథలు,కావ్య పరిచయాలు, పత్రికలో ఉదహరిస్తూ

ప్రక్రుతి వైపరీత్యాలకు సహాయ సహకారాలు అందించటంలో 
జరుగుతున్నా సంఘటనలను కవితల రూపంలో అందించుటలో
హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాలను ప్రజలకు అందిమ్చుటలో
-పత్రిక నిర్వహణలో సంక్షిప్తీకరిమ్చుటలో ఉన్నది మొదటి వరుసలో 

అందుకే సాహితీ కిరణం చదవాలి, చదివించాలి, చదవమని చెప్పాలి

10. ప్రేమ

చూసిన ప్రతి అమ్మాయి ప్రేమతో నవ్వదు
నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు 
ప్రేమించిన ప్రేతి అమ్మాయి పెల్లాడదు
పెళ్ళాడిన అమ్మాయి వేధిమ్చక మానదు 

మల్లె పూల వాసనలతో తెలుపుతుంది 
మత్తులోకి దించి కోరికలు తీర్చమంటుంది 
మనసు ఊగిపొగ రమ్మనగా కాసులు పెరెత్తుతుంది
కోరికతిరుస్తానంటే జోలపాడి నిద్ర పుచ్చుతుంది    

ప్రేయసిగా చూపించ లేదు కేరు 
కేర్ నన్ను తెరవనీయదు నోరు  
నోరుతెరుద్దమంటే చేస్తావు తారుమారు 
కోర్కలకోసం తిప్పుతుంటావు ఊరు ఊరు  

మాటలు దగ్గరవు తుంటాయి
శరీరాలు దూరమవు తుంటాయి 
పరిష్కారం దొరకని ప్రశ్నలవుతాయి
పుట్టడి కోసం ఆలింగనాలు కరువవుతాయి   

11. ప్రతిరూపమ్
స్నెహానికి ప్రతిరూపమ్ ఒక నవ్వే
మాటకి ప్రతి రూపమ్ అఫ్ జీవితమె
చూపుకి ప్రతి రూపమ్ ఒక భంధమే
మనిషికి ప్రతిరూపమ్  ఒక  మనసే 


12. డాలర్ రేటు
స్వదేశి   వస్తువులను  కొనడం   మన  లక్షం
విదేశి  వస్తువులను తిరస్కరించటం మన ఉద్దేశ్యం
స్వచ్చత, ఎక్కడున్నదో అక్కడకు పోవడం మనధ్యేయం
డాలర్ రేటుతగ్గితే నిత్యావసరవస్తువులను తగ్గించాలి పభుత్వం  


13.నిగ్రహశక్తి
సత్యాన్ని చెప్పేవారు దేని గురించి ఆలోచించనవసరం లేదు
న్యాయంగా బ్రతికేవారు దేనిగురించి భయపడనవసరం లేదు
అధర్మపరులని తెలిసిన మార్చుటకు ప్రయత్నము వదలొద్దు
నిగ్రహశక్తిని పెంచుకొని ఎట్టి పరిస్తితులలో ధర్మాన్నివదలొద్దు 


 14. అడగందే   
అడగందే  అమ్మైనా  అన్నం పట్టదు
ప్రశ్నవేయనిదే సమాధానం దొరకదు 
ప్రయత్నిమ్చనిదే   ఫలితం  దక్కదు
అడుగుముందు వెయ్యనిదే పని కాదు 
 

15.తోమల పాకు

ఆకే  అది  సుతి  మెత్తని  తోమల పాకు
పళ్ళక్రిందనవిలి  పెదాలు  ఎరుపు తాకు
సుఘంధం  వెద  జల్లుతూ  సొంగ పాకు
నాలుక, పెదాలు,కదిలిస్తూ కళ్ళతో తాకు    

ఆకు పై జల బిందువులు ఒక   మైమరుపు
కదలికలతో మనసుకు వచ్చు మతిమరుపు
చేతి స్పర్సతో ఆకుకదిమి ఉప్పొంగే కుదుపు
ఆకును నలిపి పెదాలలోచేర్చి నాలుక ఊపు 


16నిగ్రహశక్తి 
 
  నవ్వుతూ నవ్విస్తూ పలకరించు
ద్వేషించిన వాడ్ని కూడా క్షమించు
అందరూ సమానమని ఆదరించు
వాదనకు దిగకుండా సంచరించు 

సమస్యకు పరిష్కారం ఉందని గమనించు 
    నీదె తప్పు అని తెలిస్తే ఒప్పుకొని జీవించు
వాస్తవాలను సేకరించి అనుకరించు 
 మెరుగైనది ఎంత చిన్నదైన అభినందించు

నిన్నునువ్వు తెలుసుకున్నది భోధించు 
ఇతరుల కోసం సంతోషాన్ని సృష్టించు 
ఎదుటివారు నిన్ను గుర్తించేవిధముగ పవర్తించు 
మన:పూర్వకముగా ఆసక్తిని చూపించు 
  
నిజాయతీగా ప్రశం సించు
నిజాన్ని నిర్భయముగా తెలియపరచు
 నిను కన్న తల్లితండ్రులను పూజించు
హనుమంతుని ప్రర్ధిమ్చుతూ నిగ్రహశక్తి పెంచు
--(())--  

జీవించు
  అనుభవజ్ఞలమాటను ఆచరించు
ఎవరు ఎమన్నామాటవిని తలవంచు 
పనిలో విశ్రాంతి తీసుకొని శ్రమించు 
కష్టాలు ఉన్న సహాయం చేస్తు జీవించు

 జోకు 
రాధ: ఎవరండి మీరు
మొగుడు : నన్నే మర్చి పోయావా, నన్ను ఎప్పుడు చూడలేదా
రాధ: చూడ లేదే
మొగుడు :  నాతొ కాపురం చేసావు కదే
రాధ : ఎప్పుడు
మొగుడు : నిజం చెప్పవే
రాధా::  చెపితే  నీవు తట్టుకోలేవు
మెగుడు : చెప్పు  నేను చేసిన తప్పేమిటి
రాధా: నువ్వతే అమ్మాయిలతొ తిరగొచ్చు  :   
మొగుడు : ఏమిటే నీ మాటలు
రాదా: అసలు నీ వెవరు, ఏమండి ఎవరో వచ్చారు చూదన్ది పిచ్చోడులా గున్నాడు
మొగుడు ఆ....ఆఅ..ఆ....     

3, డిసెంబర్ 2014, బుధవారం

197.Family comedy story -100 (ప్రేమ ఎవరిపై ఉండాలి ?-6)

ఓం శ్రీ రామ్                                                     ఓం శ్రీ రామ్                                         ఓం శ్రీ రామ్
                                                                                                                                        
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-6


అన్నయ్యగారు మీరు చెపుతున్న కధలు, కవితలు చాలా బాగున్నాయి, మా యింటికి వచ్చేటప్పుడు మీకు రైల్లో  జరిగిన అనుభవాళ గురించి మాకు చెపుతారా.
అట్లాగే నాకు  వచ్చేటప్పుడు నాకు కధ  లాంటి అనుభవాలను మీకు చెపుతాను వినండి.
నాతోపాటు  ఒక మనిషి ఓక  మూటతొ ఎక్కాడు, అందులో తోసుకుంటూ మరీ ఎక్కాడు, అపుడు నాకనిపించింది ఎట్లాగైనా ముందు  పోవాలను కుంటే ఎవరు ఎదురైనా పట్టించు కోకుండా ముందుకు తోసుకుంటూ పోతారు, ఎవరన్న మాట్లాడినా  వారితో వాదన దిగుతారు.

నా అమనసు ఊరుకోక  రైలు ఎక్కడికి పోదులే ఆగి ఉంటుంది, ఎందుకు అంత తొందర, నా కెందుకు చెపుతారు మీరు నన్ను మీరు తోయటం లేదుకదా,  నే నేమన్న మిమ్మల్ని అడిగానా, మీ పని మీరు చూసుకోండి అన్న మాటలకు నోరు ఎత్త లేక పొయాను. 

అన్నయ్య గారు మూటలో ఏమి ఉన్నాయి అని అడిగింది ప్రకాశరవుగారి భార్య సుభద్ర.
అడుగు పెడుతు ప్రొద్దున్నే మొదలు పెట్టావా నీ కధలను అని అన్నా న్నడు ప్రకాశరావు రామకృష్ణ తొ .
ఏదో అడిగిందని నా రైలు ప్రయాణం గురించి చెపుతున్నాను, ఆ చెప్పురా  ఈరోజు ఆదివారము కదా, నేను వింటాను.

ఎంతవరకు వచ్చారు కధలో, ఇప్పుడే మొదలు పెట్టాను రైలు ఎక్కాను అన్నాడు.
అన్నయ్యగారు మీరు రైల్లో "టి" త్రాగలేదా అని నవ్వుతూ అన్నది, చాలావరకు నేను రైల్లో అమ్మే ఎ వస్తువులు కొనను,. ముందు జాగర్తగా, మా ఆవిడా ఇచ్చే దిబ్బరోట్టేను, మంచి నీళ్ళబాటిల్సు తీసుకెల్తు ఉంటాను, ఎప్పటిలాగే ఇప్పుడూ తెచ్చు కున్నాను. అవి తిని, మంచినీల్లు త్రాగి కొంత ఆకలి తీర్చు కున్నాను.
అయితే ఇప్పుడు, ఈ అల్లం " టి " త్రాగి కధ చెప్పండి.
ఏమిటే చెట్టంత మేగుడ్ని ప్రక్కన పెట్టుకొని నాకు ఇచ్చేదమన్న ఉన్నదా అని అడిగాడు ప్రకాశరావు. 
అవునండి ఈరోజు ఆదివారము కదా, సెలవు దినం కదా, మీ ఆకలికి కూడా  సెలవు కదా,  అందుకని మరిచా అన్న మాటలకు ఆందరు నవ్వు కున్నారు.
ఇన్తకీ ఆ మూటలో ఏమున్నది అని అడిగాను,
ఆ మూటలో ఏమి ఉన్నదో అని అడిగాను మనిషితో,   తీసి స్చూపించ మంటవా, అది కరచిన, మొరిగినా నా భాద్యత కాదు అప్పుడే ముడి తీస్తాను అని ఖచ్చితముగా చెప్పాడు

ధైర్యముగా గోతాం ముడి విప్పు అన్నాను,  అందు లో నుంచి " కుక్క పిల్ల " నా మీదకు దూకింది. 
ఉలిక్కిపడి ప్రక్కన ఉన్నా అమ్మాయి మీద పడ్డాను,  కళ్ళు నెత్తి మీద కొచ్చాయ మీద పడ్డావు, సారి చెప్పి ప్రక్కకు జరిగి రైల్లో జంతువులను తా కూడదని తెలియదా  నీకు అని గట్టిగా అరిచాను, ఆ వచ్చినతను కుక్కను పట్టుకొని గొలుసు తగిలించి కట్టేశాడు . ఎందయ్య గారు మీరు మాట్లాడేది, పిల్లలంటే మీకు ప్రేమ, నాకు కుక్క పిల్లలంటే  ప్రేమ, మీరు పిల్లలను తెచ్చినట్లు, నేను కుక్క పిల్లను చ్చాను, తెప్పెముంది అన్నాడు గట్టిగా.  అసలు మీకు తెలుసో తెలియదో సినమా ఆక్టర్ సల్మాన్ ఖాన్ కుక్కలంటే తెగ ఇష్టం.  ఎ కాస్త  ఖాలీ సమయం దొరికినా వాటితో గడపటానికి ప్రాధాన్య మిస్తాడుట,  అంతే కాదు కుక్కలతో గడపటం, వాటితో ఆడుకోవటం, సరదాగా ఉండటం ఏంతో  హాయి నిస్తుందట, అందుకనే రకరకాల కుక్కలను పెంచుతుంటాడు అని ఉపన్యాసం ఇచ్చాడు.

బుద్ధి తక్కువై కదిలించానను కొని నొరు మూసుకొని కూర్చున్నాను.
రైల్లో అందరు ఆ కుక్కపిల్లతో బంతి ఆట ఆడు కుంటున్నారు, అందరు అదొక వింతగా చూస్తున్నారు, నవ్వు కుంటున్నారు, అప్పుడే ఒక వింత జరిగింది బాలు ఎమర్జన్సీ కిటికినుండి బయటకు పడింది, ఆ వెంటనే కుక్కపిల్ల కుడా బయటకు దూకిన్ది, నా కుక్క పిల్ల అంటూ చైన్ లాగాడు ఆ వచ్చిన అమాయకుడు. అక్కడే ఒక పిల్ల బంతి కోసం ఒక్కటే ఏడుపు మొదలు పెట్టింది, అందరు ఏడుపు మాన్చుటకు ఏంతో  ప్రయత్నం చేస్తున్నారు, నాకు కుక్క, బంతి కావాలి అని ఒక్కటే ఏడుపు. అప్పుడే రైల్వే పొలీసులు వచ్చారు, వారి వద్ద ఉన్న విజల్ ఇచ్చి ఏడుపు మాన్పించారు, ఏడుపు తగ్గింది కాని ఒక్కటే వీల ఊదటమ్ మార్చలేదు ఆ పాప. 
 అప్పుడెమైంది" ఒరే  రామకృష్ణ " కధను మరీ టెన్షన్ లో పెట్టి మరీ అపుతావురా ఎమయిం దొ చెప్పు అని అడిగాడు ప్రకాశరావు.
కుక్కను పెంచు కొనేవాడు కుక్కకోసం చిన్ లాగి మరీ పరుగెత్తాడు, చైన్ లాగింది ఎవరని రైల్వ వారు అడిగితె లాగినోడు దిగిపోయాడు, ఇప్పటిదాకా ఇతనితో మాట్లాడినాడు  అని నన్ను చూపారు అక్కడ ఉన్న వారు.
ఇన్తకీ ఫైన్ మీరు కట్టారా అని అడిగింది సుభద్ర, మరి మావారు కట్టక మరి ఎవరు కడతారు, తగదమ్మ అని అందరిని పలక రించందే మనసు ఊరుకోదు శిక్ష పడాల్సిందె  మావారికి అన్నది భార్య శ్రీ దేవి.
ఒక్కటే నవ్వు కున్నారు ఆ మాటలకు.     

తరువాతెమైంది అన్నయ్య గారు అని అడిగింది సుభద్ర.   
పేపర్ పేపర్ అని అరుస్తున్న రైల్లో అమ్మే అతన్ని చూసి నేను పిలిచాను, నా ప్రక్కన ఉన్న అతను ఉన్న ఒక్క తెలుగు పేపర్ తీసెసుకున్నాడు.
మాష్టర్ మీ పాపర్ ఒక్కసారి ఇస్తారా అని అడిగాను, పేపర్ కొనే స్తోమత లేదు, మరీ ఒక  స్టైలు అని అన్నాడు నన్ను.
నొరుమూసుకొని కూర్చున్న ప్రక్కన.
 సామాను పెట్టె బల్లపై, ఉన్న సామాను ప్రక్కకు సర్ది కొన్న పేపరు పరుచుకొని గురక పెట్టి మరీ నిద్ర పోయాడు, అతన్ని చూస్తె నాకు పిచ్చకోపము వచ్చింది, ఎటువంటి మనుష్యులు చదువుకొనే పేపర్ను వేసుకొని పడుకున్నాడు అనుకోని, ఎమీ చేయ లేక పోయాను.
నానోరు ఊరుకొకుండ  కూర్చున్న ఒక మద్య వయస్సులో ఉన్న స్త్రీ చేతిని కిటికీ లోపల పెట్టి కూర్చోండి అని అన్నాను, నా ఇష్టం , నీవు  ఎవరవాయ అడిగేది అన్నాది.
అంతలోనే కిటికీ పైన ఉన్న రెక్క జారి చెతిమీద పడింది,  ఒక్కటే కెవ్వుమని కేక పెట్టింది,  వాచి పోయింది, వెంటనే నా దగ్గర ఉన్న ఆఇంటుమెంటు వ్రాసాను,
సారి అంది మీ మాటలు వినలేదు  మీరు ఏమనుకోకండి అన్న మాటలు వినబడినాయి.  అంతే  నేను ప్రక్కన ఉన్నవారిని కూడా లెమ్మని కాసేపు పడు కోమని చెప్పాను, అలా నడుం వాల్చింది ఆ బల్ల పైన

అప్పుడే ప్రక్కన ఉన్న వే రొకరు, మీరు మంచి పని చేసారండి, ఒక మనిషిని ఆదుకున్నారు, కొంత భాద తొలగించారు అన్నాడు .
అప్పుడే నాదగ్గర ఉన్న భగవత్ గీత తీసుకొని చదవటం మొదలు పెట్టాను,  అప్పటిదాకా పైన పడుకున్న ఆతను క్రిందకు దిగివచ్చి ఏమిటండి ముసలివారు చదివే భగవత్ గీత మీరు చదువు తున్నారు అని అన్నాడు.
నాకు అప్పుడు కొంత  అతనికి గీత గురించి చెప్పాలనుకున్నాను.


భగవత్ గీత సాయంత్రం గుడిలో చేసే కాలక్షేపం  కాదు
సర్వ సంగ పరిత్యాగి పాడు కొనే  నిత్య  శ్లోకాలు  కాదు
ఋషులు శిష్యులకు భోధించే భొదలు  అనుట   కాదు
మౌనంగా చేతులు కట్టుకొనివినే ఘంటసాలపాట కాదు 

విజ్ఞానాన్ని పెంచి, మనో  వికాసాన్ని పెంచేది
అందరు ఆచరించె  జ్ఞాన  తత్వ   జ్ఞాన  మిది  
మానవులమౌళిక ప్రశ్నలకు సమాధాన మిది
భగవంతుడు స్వయముగా గానం చేసిన గీతఇది
               

మానవుల వ్యక్తిత్వ వికాస మార్గ సూచక మిది 
వికల మనస్కుడైన  యోధునకు  ప్రేరణ   ఇది 
ప్రజలందరి మనస్సుకి కర్తవ్య ధర్మోపదేసమిది  
ఉత్తేజ భార్దితున్ని  చేసే  శ్రీ భగవత్  గీత  ఇది

దీపస్తంభ మై వెలుగు చూపె శ్రీ భగవత్  గీత  ఇది
అన్తర్లీనముగా   ప్రవహించే   అఖండ  జ్యోతి   ఇది
లక్ష్యాలను తేలిగ్గా సాధించే బలమైన ఆయుధమిది 
మానవుల  మనుగడకు  అమృత  సంజీవని  ఇది 

ఉడుకు  రక్తాన్ని  ఉరకలు  వేయించేది 
నిద్రాణ చైతన్యాన్ని  ఉద్రేకభారితం చేసేది 
శాస్త్ర వేక్తలు  చేపట్టిన  మార్గ   నిర్దేసమిది
నిత్యజీవన ధర్మనిర్వాహన భగవత్గీతఇది

ఆకాశం చిల్లు పడేలా ఎలుగెత్తి పాడె గీత ఇది
దశ దిశలు మారుమ్రోగే జ్ఞాన విజ్ఞాన నిధి ఇది 
శాస్వితమైన వెలుగును పంచి ఉత్తేజ పరిచేది 
సుఖసౌఖ్యాలు అందించి మనస్సుకు శాంతి కల్గించేది

అర్జునుడు యుద్ధ భూమిలొ తన కర్తవాన్ని మరచి ఏంతో  కరుణా స్వరూ పిడిలా, విరాగిలా, జ్ఞానవంతునిలా ప్రవర్తిమ్చాడు. " నా సోదరులు, నా భంధువులు, నా గురువులు ..... ఇలా నా వారు అనుకున్న వారంతా యుద్ధం లో చనిపోతారు " అనే భయ్యం అర్జునుణ్ణి ఆవరించింది  .  ప్రేమ, దయ, కరుణ ఆయి నట్లయితే  యుద్ధం లో పాల్గొన్న మిగతా సైనికుల కోసం కూడా  విలపించి ఉండే వాడు. కానీ అలా జరగలేదు. అర్జునుడి దు:ఖానికి కారణం - " నావాల్లనే మమకారమే" 

ఈ మమకారపు సంకెళ్ళ నుండి విడి పించడానికే శ్రీ కృష్ణుడు దేహ పరిణామ క్రమాన్ని, అశాశ్వతత్త్వాన్నీ, పరమార్ధతత్వజ్ఞానాన్ని భొదిస్తూ 

... దేహినో స్మిన్ యథా దేహే కౌమారం యౌ వనం జరా !  
తథా దేహన్తరప్రాప్తి: ధీర స్తత్ర న ముహ్యతి !! (గీ 2-13)

"మానవుడికి ఈ దేహంలో బాల్యం, యౌ వనం , ముసలితనం ఎలా కలుగుతున్నాయో, మరణం తరువాత మరొక దేహాన్ని పొందడం కుడా అల్లాంటిదే! ఈ విషయంలో జ్ఞానులు మోహవశులు కారు, అర్జునుడి  మౌహాపాశాన్ని త్రుంచి వేసాడు శ్రీ కృష్ణుడు.
ఆనాడు మౌహాపాశాన్ని తప్పించా టానికి శ్రీ కృష్ణుడు ఉన్నాడు, ఈనాడు మానవులందరికీ ఆ భగవంతుడు అందించిన శ్రీ భగవత్ గీత ఉన్నది, ధర్మం, సత్యం,న్యాయం అనుకరించి జీవించాలని శ్రీ కృష్ణ పరమాత్ముడు భోదించాడు   
గీత జయంతి (2-12-2014)  
                                                                                                        విశ్వాసాన్ని నిజాయతీ బట్టి   తెలుసు  కోవచ్చు
ఆత్మీయతను నిష్కపటం నుండి గ్రహించ వచ్చు
అభిమానాన్ని  వినయం  నుండి  పొంద  వచ్చు
పట్టుదల ఉంటె  విజయానికి మార్గం దొరక వచ్చు

శ్రమ ఉంటె  అభివృద్ధిని  సాధించ  వచ్చు
కృషి ఉంటె మనుష్యులు రుషు లవ్వచ్చు 
దయ ఉంటె సమన్వయాన్ని పొందవచ్చు
మనస్సు గొప్పదైతే మనిషి గోప్ప వాడవచ్చు
    

తర్వాత ఏమైంది అన్నయ్య గారు అన్న సుభద్ర మాటలకు నేను చెపుతాను తర్వాత కధ అని శ్రీ దేవి అన్నది. 
సరే నువ్వే చెప్పు అన్నాడు రామకృష్ణ 
ఈయన కొట్టే సుత్తి దెబ్బలకు తట్టుకోలేక రైలు పెట్టెలో ఉన్నవారందరు  పారిపోయారు. 
అంతా అబద్ధం, స్టేషన్ వచ్చింది దిగారు నవ్వుతూ అన్నాడు అందరు ఒకటే నవ్వులు. 
ఇంకా రైలు మీకధ ఉంటె రేపు చెప్పండి ముందు ఈ టిఫిన్ తినండి అని సుభద్ర అన్నది. 
అమ్మే నేను టిఫిన్సు, స్పూన్సు తినలేను అన్నాడు రామకృష్ణ అందరు నవ్వుకుంటూ నేతి గారెలు చాలా బాగున్నాయి, ఒక్క నాలుగేయ వమ్మ అన్న మాటలకు సైగలతో అన్నది శ్రీదేవి యేమిటి  ఆ తిండి తినటం  ఎప్పుడు తినని వాడులా, అవును నీవు ఎప్పుడు చేసినట్లు లేదే అన్న మాటలకు అందరు నవ్వులే నవ్వులు. 
       
                                                                        ఇంకా ఉంది      



1, డిసెంబర్ 2014, సోమవారం

196. Daily spl. kavitalu -99 (చిరు దివ్వె వెలుగులు -2)

ఓం శ్రీ రామ్                                                    ఓం శ్రీ రామ్                                    ఓం శ్రీ రామ్
                                                                       

నా మనసుకు తోచినవి ఫోటోలను బట్టి ఒక నెలలో ( 11/2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు
మాతాసమం నాస్తి శరీరపోషణం!
చింతాసమం నాస్తి శరీరశోషణం!
భార్యాసమం నాస్తి శరీరతోషణం!
విద్యాసమం నాస్తి శరీరభూషణం!!

తల్లి వలె శరీరమును పోషించు వారెవ్వరూ ఉండరు.అట్లే శరీరమును శుష్కింపజేయుటలో చింతవంటి దింకొకటిన్నీ లేదు.శరీరమునకు సుఖసంతుష్టుల నొసగుటలో భార్యకు మరెవ్వరూ దీటు గాజాలరు.శరీరమునకు యింక ఏ అలంకారమున్నూ విద్యవంటి మేల్తొడవు కానేరదు.

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం

శ్రీ మహా లక్ష్మి అమ్మ వారి బీజాక్షర మంత్రం!

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్!

రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః స్వాహా!

.
మహా లక్ష్మి కరుణా - రాగం మాధవ మనోహరి - తాళం ఆది , ముత్తుస్వామి దీక్షితార్!

పల్లవి
మహా లక్ష్మి కరుణా రస లహరి
మామవ మాధవ మనోహరి శ్రీ

అనుపల్లవి
మహా విష్ణు వక్ష స్థల వాసిని
మహా దేవ గురు గుహ విశ్వాసిని
(మధ్యమ కాల సాహిత్యమ్)
మహా పాప ప్రశమని మనోన్మని
మార జనని మంగళ ప్రదాయిని

చరణమ్
క్షీర సాగర సుతే వేద నుతే
క్షితీశాది మహితే శివ సహితే
భారతీ రతి శచీ పూజితే
భక్తి యుత మానస విరాజితే
(మధ్యమ కాల సాహిత్యమ్)
వారిజాసనాద్యమర వందితే
నారదాది ముని బృంద నందితే
నీరజాసనస్థే సుమనస్థే
సారస హస్తే సదా నమస్తే

 
1. చిరుదివ్వె వెలుగులు
చిగురు  టాకుల  చిగుర్లు  రెపరెపలు
చిన్నదాని సొగసు ఘుమ ఘుమలు
చిమ్మ చీకటిలొ చిరుదివ్వె వెలుగులు
నేనున్నానని అర్ధ చంద్రుని పకపకలు     

హద్దులు

అనుభవించే వయస్సు మార్పులు
ఆకర్షించే అందాల నయనాలు
అణువణువులో పొంగే  అందాలు
తేనెలొలికే అందాల సొగసులు

ఆవేశం వస్తే ఉండవు పగ్గాలు
ఆనందం వస్తే ఆగవు ఆలోచనలు
ఆరాటం పెరిగితే ఆగవు ఆధారాలు
ఆనందానికి ఉండవు హద్దులు 

కాల చక్రంలా మనస్సు పరుగులు
మనసుకు తగ్గ జోడి తోరికితే గుస గుసలు
ప్రకృతిలో కలిస్తే చిలిపి కోరికలు
సూర్యుడు చూస్తు ఉంటాడు ప్రేమికుల్ని 


2. ప్రకృతి
ప్రకృతిని బట్టి  ప్రవరిమ్చటం మానవుని  ధర్మం
మరువ  లేని అను  భవాలు చూసి నది బాల్యం
వర్ధమానంలో వెలుగు పంచుట అందరి  కర్తవ్యం
ఉషోదయ వెలుగులతో  అందరికి   శుభోదయం       

3. చందమామ
చందమామ  అందాలు  వికసించిన  పువ్వులాగున్నాయి 
రాత్రిళ్ళు  వెన్నెల  విరజిమ్మగా  సూర్యుడు లాగున్నాయి
మబ్బులు నందివర్ధన పువ్వులా తెల్లగా మెరుస్తున్నాయి
మనసుకు నచ్చిన దాని  నవ్వు నవరత్నాల్లాగున్నా యి

 4. గాన  గంధర్వ

             గాన  గంధర్వ సంగీత స్వర కర్తకు మా  సుస్వాగతం ,                         సర్వ భాషా సంగీత స్వర కర్తకునా అభినన్దనీయం  ,                       విశ్వ స్వవిఖ్యాత విశ్వేస్వరునకు నా  వందనం ,                  పురస్కారాన్ని అందుకున్న బాలసుబ్రమణ్యునకు నమస్కారం

5. దానం
అన్ని దానముల కన్నా  అమ్మ  పంచె క్షిరామృతం గొప్ప
అన్నిదానములలో హృదయామ్రుతము పంచెగుణం గొప్ప
భాధలో ఉన్నరోగస్తులను కన్న బిడ్డలా ఆదుకోవటం గొప్ప
తల్లి రక్తం పంచు కున్న బిడ్డకు అవయవదానం మరీగొప్ప 

                                       6. దేవాలయము                                                  దేవాలయమునకు  వెళ్ళేది   మనస్సాంతి కొరకు
మనం చేసిన తప్పులేమి   ఉన్న  ప్రక్షాళన కొరకు
అందరు సుఖ జీవితము  గడపాలని  ప్రార్ధన కొరకు

          తీర్ధప్రసాదాలు తీసుకొని భక్తులను కలియుట కొరకు           

7.రామాయణము
  మేమురామ దూతలము  మీరుచెప్పె రామాయణము వినాల  వున్నది
మీరుచెప్పేరామాయణమువింటుంటేఇంకాఇంకావినాలనిఉన్నాది                                                                         రామాయణము వింటుంటే మనసు  రామచంద్రున్ని   చూస్తున్నట్టున్నది
రామాయణము తరగనిది, చెరగనిది,  మారుతిహృదయంలో   ఉన్నది     


8.చిన్నారులు
చిన్నారులు   దేశ పురోగతికి  పునాదులు
ఎవరి  ఉహల  కందని అనురాగ  దేవతలు
ఆత్మీయులనుకలుపుకొనే ఆదర్శమూర్తులు  
ఏదడిగినా  చెప్పలేని  తల్లి  చాటు  బిడ్డలు  

9.శ్వేతవర్ణం

కీర్తనతొ  పాషాణ   హృదయాన్ని  కరిగించవచ్చు
స్వేతవర్ణముగా ఉన్న  మంచును కరగించవచ్చు
పాల మీగడను   పాల  నుండి  వేరు చేయవచ్చు
గుణాన్ని బట్టి మనిషి తెల్లదానాన్ని బయటపడవచ్చు


10.సత్యము
సత్యము పలుకుము,ధర్మము ననుష్ఠించుము.  స్వాధ్యాయము నేమరకుము.గురువునకు ప్రియమగునట్లు ధనమార్జించి యిచ్చిన పిమ్మట వంశము నిలుపుటకై సత్సంతానమును బడయుము.సత్యము నేమరకుము.ధర్మమార్గమునుండి వైదొలగుకుము;కుశలము నుండి,కల్యాణకర్మలనుండి,సమృద్ధినుండి,స్వాధ్యాయప్రవచనములనుండి ప్రమాదము నొందకుము.దేవ పితృకర్మలను విడువకుము. తల్లియే దైవము.తండ్రియే దైవము.ఆచార్యుడే దైవము.అతిథియే దైవము అని వర్తింపుము.అనింద్యకర్మ లేవిగలవో వానినే గావింపుము. నింద్య కర్మలను చేయకుము.మాయందు ఏవి సుకర్మములో అవియే నీకు ఉపాస్యములు.ఇతరములు నీకు వర్జ్యములు. సత్పురుషులు ఎవరు మనకు శ్రేయస్కాములో వారిని సుఖాసీనులను చేసి సేదదీర్చి వారి బోధనల సారమును గ్రహింపుము.వారికి శ్రద్ధతో నీయదగును.అశ్రద్ధతో నీయకుము.హెచ్చుగా నియ్యలేదను సిగ్గుతో నిమ్ము.భయపడుతూ ఇమ్ము. సంపదకు తగినట్లు ఇమ్ము.నీకు ధర్మకర్మ సంశయము కలిగినచో పిలువబడినవారిలో ధర్మాధర్మ నిర్ణయసమర్ధులు,ఆచార్య పురుషులు, కర్మ స్వతంత్రులు, పరమసౌమ్యులు, ధర్మకాములు అగు బ్రాహ్మణు లెట్లాచరించిరో ఆ సందర్భములలో అట్లే ఆచరించదగినది సుమా. ఇది నీకు ఆదేశము,ఉపదేశము, ఇదే వేదరహస్యము. ఈశ్వరానుశాసనము.దీనిని ఆచరింపుము. ఇదియే ఆచరణీయము. 


11.సమ్మేళనం
స్వర సంగీత సమ్మేళనం అందరికి ఆనందనిలయం
శారదా కృపా  కాటాక్షము అందరికి ఆనందపరవశం
శ్రీ గణపతిసచ్చిదానంద స్వరం మధురాతి మధురం
అందరికి ఒక్కటే మార్గం కలసి ఉంటే కలదు సుఖం      
                                            
12. నందనవనమ్
                    
పిల్లల  ఆరోగ్యానికి ఉత్చాహం కల్పించాలి
పెద్దల    ఆరోగ్యానికి   భరోసా  కల్పించాలి
పేదల  ఆరోగాన్ని గమనిస్తూ ఆదుకోవాలి
జీవితమె  నందనవనమని  గమనించాలి  

13. శ్రీ కారం
శ్రీ కారం చుట్టితే మనసు ఎప్పుడు శుభకరం
ఓంకారం జపిస్తే పోతుంది మనిషిలోని అహంకారం
మమకారం చూపితె మనిషికి ఏర్పడుతుంది మానవత్వం 
వ్యవహారం మనసుకు తట్టితే మనసు ఉంటుంది  అల్ల కల్లోలం 


14. వసంతాల పంట
నవ్వుల పాపకు నవవసంతాల పంట
మనస్సుకు చేరువలో అందరుఉంటారంట
అందరితో మమతల మల్లెలతో మాలనంట
అందరు కొంగ్రొత్త ఆశలతో జీవించాలంట   


15.వేణి
వేణి  కవితామృతం  ఆనంద  పరవశం
వయ్యారాల వేణి వలపుల రాణికి అందం 
సొగసుచూడ తరమా అని వేణి త్రిప్పే నమనోహారం
స్త్రీ  ఉల్లాసం,  జడమాలిక  కదలికలో ఉంది మకరందం 


   ఈ నెల 16-11-14  వ తారీఖున డాక్టర్ సి.యస్ రావ్ గారి
స్టాంప్ కవర్ విడుదల చేస్తున్నందుకు మా అందరి తరుఫున నివాళి
కేంద్ర  మంత్రులు దత్తాత్రేయగారు, వెంకయ్యనాయుడు
గారు రావటం ఒక డాక్టర్  గారిని మరల తలుచుకోవటం
గొప్ప విశేషం 

డాక్టర్ సి.యస్ రావ్ గారు చేసిన మంచి పనికి ఇది సత్కారం
అందరి హృదయాలలో ఉన్న వ్యక్తికి  చేస్తున్నారు పురస్కారం 
వారుచేసిన ఎనలేనికృషికి మా అందరి తరుఫున నమస్కారం 
ప్రభుత్వం వారు గుర్తించి స్టాంప్ విడుదల చేయటం ఆనందదాయకం 


16. మార్పు
ప్రతిఒక్కరు ఒక చెట్టు నాటితే నందన వనం గా  మారవచ్చు
ఒక నవ్వు ప్రతిఒక్కరిలొ ఒక స్నేహభావం పెంచవచ్చు
శ్రద్ధ తో చేసిన స్పర్స ప్రతి ఒక్కరి జీవితమ్లొ మార్పు రావచ్చు  
ఈ దేశం కోసం ప్రతిఒక్కరు స్నేహాన్ని పెంచుకుంటూ బ్రతకవచ్చు 


17.తెలుసుకుంటే చాలు
చీకటి తత్వాన్ని తొలగించటానికి ఒకే నేతి తీపమ్ వెలుగు చాలు
బాధల తత్వాన్ని ఒక చిరునవ్వుతో  అందరు  పలక రిస్తే  చాలు
ప్రతికూల  తత్వాన్ని   అందరు  ఒకే  దేవున్ని  ప్రార్ధన చేస్తే చాలు
ఉషోదయవెలుగులు ఇంట్లో ప్రవేశిస్తే అంతా శుభమ్ అనుకుంటేచాలు    

18. దీపోస్చవం
స్వర్గ  లోకాన్ని  మరిపించే  కార్తీక  దీపోస్చవం
ఆనంద పరవశంలో ఉంచిన చిన్నారుల నృత్యం
భక్తి టి.వి వారు ఏర్పాటు చేసిన దీప  మండపం
భారతదేశ సంస్కృతిని తెలిపిన వారికి వందనం  


19.గీత
ప్రపంచ  దేశాల వారు  మెచ్చుకున్నారు  భగవత్   గీత
ధర్మమను తెలుసుకోలేనివారు ఎప్పటికి అర్ధంగాదు గీత
సత్య ధర్మాన్ని వివరించే పండితుల భోధ కుడా  గీత
మూర్ఖుల మాటలకు చర్చించటం సభకు వస్తుంది రోత    


20.కాలభైరవుడు     

కాలభైరవాష్టకం పటంతి యై మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్ర పున్య  వర్ధనం
శోక మొహ దైన్య లోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం దృవం    


21.మనుష్యులు
మనుష్యులు ఇది కష్టార్జితామని భవనం నిర్మిమ్చు కుంటారు
ప్రక్కనే ప్రభుత్వమువారు కళ్ళు దుకాణానికి  అనుమ తిస్తారు
కొన్తదూరములొ చెత్త కుప్ప, ప్రక్కనేబస్సుస్టేషన్ ఏర్పడుస్తారు
భవనం బాగున్నా ప్రక్కవారు బాగో లేక  పోతే ఎలా  జీవిస్తారు 


ప్రేమ,  ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయత, సుసీల పాటలో కనబడుతుంది
సుసీల పాటలు వింటుంటే నిజంగా కష్టాలు, కన్నీళ్ళు, కానరావన్నది 
సుసీల మధురగానం వింటుంటే మనస్సు ప్రశాంతముగా మారుతుంది      
గానంతో మైమరిపించే సుసీలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని ఉన్నది  


22.(14-11-2014 ) నాడు  బాలల దినోత్చవం సందర్బముగా
బాల బాలిక   లందరికి ఇవే నా శుభాకాంక్షలు

అ చిరకాలంలో బాల  కార్మిక  వ్యవస్తను రూపు మాపాలి
సంపదన  కోసం పంపే  తల్లి తండ్రులలో మార్పు  రావాలి
తల్లితండ్రులే కన్నపిల్లలను ఉత్తమ పౌరులుగా  మార్చాలి 
ప్రభుత్వపు స్కూలల్లొ తెలుగు భాషను విధిగా భోదించాలి

బాల్యాన్ని బంగారు భవిషత్తుగా మార్చుటకు కృషి చేయాలి
పిల్లల భవిషత్తుకు  తల్లి తండ్రులే  మార్గదర్సకు    లవ్వాలి 
బాలకార్మికులను బడికి పంపించి చదువుల పండగ చేయాలి
బాలల దినోత్చవం సందర్బముగా పిల్ల లందరు ఎకంకావాలి
   

23.బాలల దినోత్చవం
ఈ ఉత్చవం, మన ఉత్చవం, అందుకే బాలల దినోత్చవం 
మొదటి ప్రధాన మంత్రి చాచ నెహ్రూజీ పుట్టినదినోత్చవం
భాగ్యనగర్లో ఏర్పాటు చేస్తారు అన్నిదేశాల బాలచిత్రోత్చవం
నవ భారత నిర్మాతలైన  బాలలు  జరుపు  కొనే ఉత్చవం 


24.బాలలకు శుభా కాంక్షలు

మీరు నిజాయితీ ట్రస్ట్ నడుపు  తుంటే,  మీరు  ట్రస్ట్  ఫలితాన్ని  పొందుతారు
మీరు మంచితనం స్నేహితులపై చూపిస్తె ,స్నేహితులు ఫలితాన్ని పొందుతారు
మీరు వినయంగాఅన్నిచోట్ల  ఉంటే, మీరు గొప్పతనాన్ని ఫలితాన్ని పొందుతారు
మీరు పిల్లలను చక్కగా పెంచితే, పిల్లలు వృద్దిలోకి రావటానికి కారకులవుతారు 


25.తల్లితండ్రులు
సూర్య  బింబంలా అనుక్షణం సత్యం వెలుగుతూ ఉండాలి
కడిగిన ముత్యం లా  ఎప్పుడు  నీతి    ప్రకాశిస్తూ ఉండాలి
చీకటి  రాత్రిలో మెరిసే వజ్రంలా న్యాయం మెరుస్తు ఉండాలి
తల్లితండ్రులు పిల్లలందర్ని సమానంగా ప్రేమతో పోషించాలి  


26. దంపతుల మద్య
దంపతుల మద్య పూల తీగ అల్లుకొన్న మానులా ఉండాలి వలపు
ఆత్మీయులతొ,  అనురాగమ్తో, అందరితో ఎప్పుడు ఉండాలి  తలపు
సాఫీగా జరిగిపోతున్న  జీవితమ్లొ ఇది ఒక తెలిసి  కోలేని మలుపు 
నిగ్రహించుకొని పరిష్కారంచేసుకోపోతే కుటుంబలోవస్తుంది కుదుపు        27.  యవ్వనం
బాల్యానికి యవ్వనం ఒక రంగుల కలవ రింత
యవ్వనానికి బాల్యం ఓ గడచి పోయిన వింత 
యవ్వనంలో కలవరిస్తూ కలలుకంటారు అంత
సంబరంలో కలుస్తారు యువతీ యువకులంత 


28. కోవెల
మనసు మత్తెక్కించే మమతల కోవెల
ఊహల కందని మనోహర  మైన  లీల
వచ్చిన వారు పొందారు ఆనంద హెల
అందుకే అక్కడఉంటుంది ఫోటోలగోల


29.సలహా

కార్యకర్తలు ఉత్తేజ పరిచే విధముగా తెలుగుదేశం ముందుకు రావాలి
తెలంగాణాలో తెలుగుదేశం పార్టి ప్రజలకు భాధలను తొలగించాలి   
సర్వే అని, పెన్షన్ కార్డుస్ అని, ప్రజల్లో కలిగే భయందోలననువినాలి
తెలుగు  దేశం పార్టి బలం పెంచు కోవటానికి సర్వం కృషి చేయాలి    
 

30.నా రూపు
నా రూపు  సుందర స్వరూపం
నా పెదవులు  మధురామృతం
నా పొందు స్వర్గ  సుఖమయం
నా ఆనందమే నీకుతృప్తిమయం   


నా మాట కాదన్నావో నీకు ఎప్పుడు చాపే గతి
నా మాట అవునన్న వో  సీకు సుఖమైన రతి
నీ మాట కాదనను,  నిన్ను  మరువను  సతి
నిన్ను సుఖపెట్టి సు ఖ ప డు ట మే నా మతి  


31.నూరుగురువారు
లో లోపల విషం తో ఉండి  పైన తేన పలుకులు పలికేవారు
మేకలను, జింకలను పోషించేవారు, ఆకలికి నరకమనేవారు
నీరు అడిగిగితే నెత్తురు తీసుకొని  నీరు అందరికి ఇచ్చేవారు
రాజ్యాదికారము కొరకు ప్రయత్నముచేసిన నూరుగురువారు 


32.అందం
ఇల్లు అందం, ఇల్లాలు అందం, ఇల్లలు  వడిలో ఉన్న హంసలు అందం
గాజు గిన్నె అందం, గిన్నెలో విచ్చుకున్నా పూలు చిమ్మెను మకరందం
పూలమకరందం కోసం తిరిగే తుమ్మెదలు జుమ్కారం మరి మరీ అందం
నింగిఅందం,నెలఅందం, పిల్లల నవ్వులందం,ఉదయ భానుడు మరీ అందం   


33.హోరు
సముద్రాల తరంగాల హోరు,  మానవుల మమతల జోరు
సంగీత సప్త స్వరాల హోరు , మనస్సుకు ఉల్లాసాల  జోరు
మధురాతి  స్ర్ముతుల హోరు, ఆనంద      పరవంతో  జోరు
గాజులో ప్రతిబింబాల  హోరు, గాజు నవరత్నరంగుల జోరు


34.బహుమతి
సంగీత స్వరాల మధ్య నయన మనోహర నృతం
నవ  బాలికల ఆనంద  పారవశ్య    అభినయం
ప్రేక్షకులు కరతల  ధ్వనులతో చేసే  పోస్చాహం  
ప్రోసచ్చాహ కమిటి  చేసే బహుమతి  ప్రధానం 


35.జీవిస్తావు
ప్రకృతిని చూసి ఆనందిమ్చాలే తప్ప,  నీ  ఇష్టం వచ్చినట్లు మార్చ లేవు
స్నేహితుడు అవసరానికి ఆడుకోనేవాడే తప్ప, ఎప్పుడు నీవు అడగ లేవు
ప్రేమ అనేది హ్రుదయం లోంచి వచ్చేదే తప్ప, కాసులుకు అమ్మడు పోవు
మానవులగా  ప్రకృతి సహకరించి, ప్రేమ, స్నేహాన్ని గౌరవిస్తేనే  జీవిస్తావు   


36.సముద్రం
సముద్ర   కెరటాలు  గట్టు  దాటాలని  ప్రయత్నం  మానవు
తనలొఉన్న కలేబరాలన్ని బయటకు నేడితె  గాని నిద్రపోవు
నదులు, కాలవలు నుండివచ్చే నీటిని నీలొకలుపు కుంటావు
నీలొ అగ్ని పుట్టి తుఫాన్ గా మారినా మంచినీల్లగా పనికిరావు


37.అందాలు
ప్రక్రుతి  అందాలు  నీలొ కని   పిస్తూ ఉన్నాయి
వయస్సుకు తగ్గ అందాలు పెరుగు తున్నా యి
కుందేలు చెవుల్లా కురులు అందమొస్తున్నా యి
తెల్లని వస్త్రము ఆడతనానికి వన్నె తెస్తున్నాయి 



38.రూపం
చిరు నవ్వుల చిన్మయ చిన్న రూపం
చిరుదివ్వె వెలుగుతో చీకటి  మాయం 
ఇప్పుడు కష్టాలు జయించటం ఖాయం
చిరునవ్వే కష్టాల కడతేర్చే  ఆయుధం  


39.గోమాత
గోమాతను పూజిస్తామని సంకల్పం
గో మాత ముఖం  పై  దివ్య   తేజం
ముఖ వర్చస్సు అంతా బ్రహ్మతేజం
ప్రదక్షణలు చేస్తే కలుగును మోక్షం
                                  

23, నవంబర్ 2014, ఆదివారం

195.Family love story 98-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-5

 ఓం రామ్                                           ఓం రామ్                                         ఓం రామ్
                                                         
      

అన్నయగారు యక్ష ప్రశ్నలు గురించి నాకు తెలుపగలరా? అని అడిగింది సుభద్ర , కొత్తగా వచ్చిన స్నేహితుడైన రామకృష్ణతో నాకు గుర్తున్నవి తెలిసినవి తెలియపరుస్తాను 

ఇదిగో వాడిని నీవు యక్ష ప్రశ్నలు వేసి వేదిమ్చకు 
నేను ఎందుకు వేదిస్తానండి , ఆయన కవి కదా ఏదో కొంత తెలుసు కదా అందుకనే అడిగాను 
జ్యోతిర్లింగాలను  తలచుకొని మీరడి గిన ప్రశ్నకు ఆ శివ స్వరూపము నాలో పలికించిన పదాలను అక్షరూపంలో ఇందు  ఉదహరిస్తాను
సోమవారం శివదర్శనం సర్వ పాప హరణం ...
 

ఓం సౌరాష్ర్టే సోమ నాథం చ శ్రీ శైలే మల్లిఖార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమరేశ్వరమ్
ప్రజ్జ్వల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారాణస్యాంతు విశ్వేశం త్య్రంబకం గౌతీమీ తటే
హిమాలయేతు కేదారం ఘృశ్మేశంచ విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రాతః పఠేన్నర
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి..


వ్యక్తిగతంగా ఎదగటానికి 10 సూత్రములుఅందరు గమనించండి
1.అందరినీ మనసుతో స్వీకరించండి
2.నిరాశావాదులకు,మోసకారులకు దూరంగా ఉండండి
3.మీపై మీరూ నమ్మకంతో ఉండండి
4.'అవును/కాదు' అని చెప్పేందుకు భయపడకూడదు
5.మీ కలను సాధించేంతవరకు వదలకూడదు
6.మీ గురించి మీరూ తక్కువ చేసుకోకండి
7.ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి
8.ఏదైనా మీ మనసుకు తప్పు అనిపిస్తే అది చెయ్యకండి
9.మీ మనసును గట్టిగా నమ్మండి
10.నలుగురిలో మిమ్మల్ని మీరూ తక్కువ చేసుకోకండి
 

యక్ష ప్రశ్నలు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.
నాకు దొరకినవి తెలిసినవి ఇందు పొందు పరిచాను
   
1.సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
   బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
   దేవతలు

3.సూర్యుని అస్తమింపచేయునది ఏది?
   ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
   సత్యం

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
     వేదం

6. దేనివలన మహత్తును పొందును?
   తపస్సు

7. మానవునికి సహయపడునది ఏది?
    ధైర్యం

8.మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
  పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
    అధ్యయనము వలన

10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
     తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
      మౄత్యు భయమువలన

12. జీవన్మౄతుడెవరు?
     దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమికంటె భారమైనది ఏది?
      జనని

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
      తండ్రి

15 గాలికంటె వేగమైనది ఏది?
     మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
      ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ
      మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది

17. తౄణం కంటె దట్టమైనది ఏది?
      చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
      చేప

19.రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
     అస్త్రవిద్యచే

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
      యజ్ణ్జం చేయుటవలన

21. జన్మించియు ప్రాణంలేనిది
      గుడ్డు

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
      రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
      శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన

24.ఎల్లప్పుడూ వేగం గలదేది?
     నది

25. రైతుకు ఏది ముఖ్యం?
     వాన

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు?
      సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

   
27. ధర్మానికి ఆధారమేది?
      దయ దాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది?
      దానం

29. దేవలోకానికి దారి ఏది?
      సత్యం

30. సుఖానికి ఆధారం ఏది?
      శీలం

31. మనిషికి దైవిక బంధువులెవరు?
      భార్య/భర్త

32.మనిషికి ఆత్మ ఎవరు?
     కూమారుడు

33. మానవునకు జీవనాధారమేది?
      మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును?
    దానం

35. లాభాల్లో గొప్పది ఏది?
      ఆరోగ్యం
 యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు తెలియ పరచగా  యక్షుడు ధర్మరాజుతో చనిపోయిన నీతమ్ములలొ ఎవరిని బ్రతికించ మంటావు అని అడిగాడు, పినతల్లి మాద్రి కొడుకైన నకులిడి  ప్రాణాలు కొరుకున్నాడు. నీ ధర్మ నిరతిని మెచ్చుకొని అందరిని నేను బ్రతికిస్తున్నాను, నీకు ఒక వరము కుడా ఇస్తున్నాను అజ్ఞాత వాసములో మిమ్ములను ఎవ్వరు గుర్తు పట్టకుండా మీకు వరమిస్తున్నాను అని అన్నాడు యక్షుడు. 
ధర్మ రాజు ధర్మం గురించి తెలియా పరిచాడు 
"మమ  ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యా0, వృణే ధర్మమృతాజ్జీవితాచ్చ!
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ సర్వం న సత్యస్య కలాముపైతి!!"  

ప్రతిజ్ఞ సత్య మైనదని  తెలుసుకో! అమృతం కంటే, జీవితం కంటే  ధర్మాన్నే నేను అధికంగా కోరుకుంటాను.   రాజ్యం గాని, పుత్రులు గాని, యశస్సు గాని, ధనం గాని సత్యంలో పదహారోవంతుకు కూడా  సరితూగవని స్పష్టం చెశాడు.అందుకే  ఆ ధర్మాత్ముడు ధన్యాత్ముడయ్యాడు  

                                ఇంకా ఉంది  

194.Family love story 97-ప్రేమ ఎవరిపై ఉండాలి ?-4

ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్                       ఓం శ్రీ రామ్
ప్రేమ ఎవరిపై ఉండాలి ?-4
నేను కూడా పుస్తకాల షాపుకు వెళ్లి కాసేపు కూర్చొని వస్తాను.
రాత్రికి ఇంటికి చేరారు ఇద్దరు స్నేహితులు, మాటలతో ఒకరికొకరు అర్ధం చేసుకున్నారు
అన్నయ గారు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానము చెపుతారా, నాకు తలుస్తే చెపుతాను అన్నడు రామకృష్ణ
    
1.ఈ మద్య  కాలంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకో చెప్పగలరా  కవితా దృష్టితో?

మనుష్యులు (రైతులు ) చనిపోవటానికి ఒక కారణమని చెప్పటం కష్టం,  అనేక కారణాలు ఉండవచ్చు
ప్రభుత్వము  వారు పొలమునకు అప్పు ఇస్తున్నారు కదా అని డబ్బు తీసుకుంటున్నారు, తీర్చగలమని నమ్మకముతో తీసుకుంటున్నారు, ఒక సంవస్చరం పంట పండక పోయిన, మరల దున్ని కొండంత ఆశతో పంట పండుతుందని పంట వేస్తాడు, వర్షములు పడక పోయిన, కరంటు లేక పోయిన, మన అదృష్టం లేక పోయిన రైతులలో నిరుస్చాహము కలుగు  తున్నది. తన కష్టాలు వేరొకరి చెప్పుకుంటే కష్టాలు తీర్చెవారా ఆర్చేవారా అని భావించి కుటుంబ సమేతముగా పురుగులు మందు త్రాగి మరణిస్తున్నారు,
దయ చేసి రైతులారా మీరు ఎవరు చావకండి, కష్టాలు వచ్చి నన్తమాత్రమునా చావే కారణమని భావించకండి, ఆదికవి వ్రాసిన సుందరా కాండలో తెలియ పరిచారు కష్టాలు వచ్చినంత మాత్రమున చావకూడదు, ఓపిక వహించి ఉన్నట్లయితే ఖచ్చితముగా కష్టాలు తొలగి పోతాయని తెలియ పరిచారు, కొత్త ప్రభుత్వమును ఎన్నుకుంటే బాకీలు మాఫీ చేస్తారని నమ్ము కోవటం కూడా తప్పే, మన మనసును నమ్ముకోవాలి, కొండంత అండగా ఉన్న కుటుంబాన్ని నమ్ముకోవాలి , ప్రక్క వాడి పంట పండినదని, నా పంట పండలేదని అని భాద మనసుకు రాకూడదు .
దయచేసి ఎవ్వరు ఆత్మ చేసుకోకండి, జీవించటానికి ప్రయత్నించండి, అప్పులు తీర్చలేదని భాద పడకండి, పంటను మారుస్తూ, సరిఐన సమయానా  ఎరువులు వాడుతూ , నీరు అన్దిస్తూ,  కలుపు మొక్కలు పీకుతు జీవితమ్ గడప గలరని ఇందు మూలముగా ఒక వక్తిగా, రచయతగా  తెలియ పరుస్తున్నాను.. 
                                                                                                
అందరు గుర్తుంచుకోవాలి

మహోన్నత వ్యక్తిత్వానికి  కారణం వినయమే
మానసిక  అభ్యుదయానికి  కారణం   మనసే
సహచరులు సహకారానికి కారణం   వినమ్రతే
అందరు సమాన మవటానికి కారణం మానవత్వమే

కర్షకులారా నిగ్రహిమ్చుకోండి, బ్రతికి బ్రతికించటానికి ప్రయత్నించండి


లక్ష్యం  కోసం ఎప్పుడు   తాపత్రయ  పడతా వోయి
మండు టెండలో పొలంలో చమట చిమ్ముతావోయి
ఎవరే మన్నా నీవు పొలం పని చేసే  తాపసి వోయి
నలుగురి కోసం పొలంలో  కష్ట పడే  కర్షకుడ వోయి

భూమాతను ప్రార్ధింమ్చి దున్నే రైతువోయి
పొలంలో ఉంటె  పనికి  బానిస   వోయి
బయట ఉంటె అందరికి రక్షకుడ వోయి
కంటికి, చేతికి, వంటికి విశ్రాంతి లేదోయి

విత్తనాలు నాటి వరుని దేవునికోసం వేచి ఉంటా వోయి
చిన్న గాయానికి మట్టి కప్పి మట్టిలో బ్రతుకుతా వోయి
పంట పండేదాక కుటుంబానికి కంటి నిండా నిద్రలేదోయి
పవిత్ర హృదయాన్ని పొలానికి అంకిత పరుస్తా  వోయి

ఎ జంతువు రాకుండా పొలానికి కాపలాగా ఉంటా వోయి
పొలానికి పురుగు పట్టకుండా మందులు కొడతా   వోయి
మంచపై  ఉండి అరుస్తూ పక్షులను తరుముతా    వోయి
పంట ఇంటికి చేరితే ఆనందానికి  అవధులు లే      వోయి

బ్యాంకు అప్పు తీర   లేదని  భాద పడ కోయి
పంట పండలేదని ఆత్మహత్య చేసుకో  కోయి
భార్యపిల్లల బ్రతుకుకోసం నీవు బ్రతకాలోయి
అందరికి ఆకలి తీర్చె అన్నదాతవు నీవెనొయి

కన్నీరు కల కాలం  కల్లల్లో ఉండ లేవోయి
కనికరం చూపెవారు లేరను అను కోకోయి
ఈ కలి యుగంలో మానవత్వం ఉన్నదోయి
ఆశకు పోయి నమ్మి అభాసుపాలు కాకోయి

"
నీ జాతివారాలు రాజులై యుండియు కనజాలరైరి నీకష్టమెల్ల
నీ కొలమందు జన్మించిన యా జమిందారులు గనరు నీ తపమెల్ల
నీ శాఖలో ధన నిలయులౌ కొందరు పరికింప లేరు నీ భాధలెల్ల
నీ తెగలో విద్య నేర్చిన బియ్యేలు లిఖించరైరి నీ లెములెల్ల

గీ !! న్యాయ వాదులు నీవార లడుగ రైరి
      న్యాయ మూర్తులు నీవార లరయరైరి
      ఇంక పెరవారి ముచ్చట లెందుకయ్య
      కర్షకా! నీదు కష్టముల్ గాంతురెవారు ?

రైతు కులానికి చెందిన వారు పెద్ద పెద్ద జమిందారులుగా ఉంటారు                రైతాంగం ఇబ్బందుల్ని వారు సరిగణనలోకి తీసుకోని వారైనారు
రైతాంగం లో ధనికులైన వారున్నారు, సాటి రైతుని ఆదుకో లెకున్నారు
రైతుకుటుంబములో బాగుగా చదువుకున్న వారున్నారు,పట్టించుకోరు

నీ వారైన న్యాయవాదులు అడుగరు
నీ వారైన న్యాయ మూర్తులు తెలుసు కోరు
ఆయినవాల్లె ఇలా ఉంటె పరాయి వాల్లెల ఉంటారు
మరి రైతు కష్టం పట్టిమ్చుకొనేవారెవరు " ప్రభుత్వమా ప్రజలా"


అలనాటి "గోలకొండ కవుల సంచిక" లో కర్షకా అన్న శీర్షికన ప్రచురితమైన పద్యాన్ని గుర్తుకు వచ్చి ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని రచించినది గంగుల సాయి రెడ్డి, జీడి కల్లు గ్రామం, నల్గొండ జిల్లా.
మానవజాతి మనుగడకు జీవమ్ పోసే రైతు అకాల మరణాలు ఎ ప్రమాణాల తొనూ క్షంతవ్యం కాదు, కర్షకుని చెమట బిందువులకు కన్నీటి చుక్కలు తోడై నిరంతరం మట్టిని తడుపుతూ ఉండటం ఎ జాతికి శ్రేయస్కరం కాదు "

మీరు రైతుల చాలా చెప్పారు చివరగా మీ సందేసమేమిటి అని అడిగింది ప్రకాశరావు గారి భార్య సుభద్ర
ఏమిటో మీరు అడిగినదానికి నాకు తెలిసినవి తెలియ పరుచు తున్నాను.


ప్రకృతి ననుసరించి కష్టాన్ని నమ్ముకొని రైతుగా జీవించడం
రైతు పొలంకు మందు కొట్టి, కలుపు మెక్కలు ఏరివేయటం
రైతు విధిగా దున్ని నీరు పెట్టి,కాపు కాస్తే పంట పండటం ఖాయం
రైతుకు అప్పులుతీరి, కష్టాలుపోయి సుఖాలురావటం ఖాయం

 2. కుదరనివి ఏవి ?

పట్టు పరుపులున్న , ఆకలి  తీరక పొతే ఎప్పటికి నిద్ర  రాదు
ఎన్ని పుస్తకాలున్న, మనసు  పెట్టి  చదవకపోతే జ్ఞానం రాదు
ఎన్నినగలున్న, అవసరానికి ఉపయోగించకపోతే విలువలేదు
ఎన్ని మందులున్న, మనసుతో మందువాడకపోతే రోగం తగ్గదు

ఆహార పదార్ధాలు ఉన్న, ఎప్పటికి ఆకలిని కొనటం కుదరదు
సుఖాలు ఎన్ని ఉన్న , మనిషికి శాంతిని కల్పించటం కుదరదు
సౌకర్యాలు ఎన్ని ఉన్న, ఆనందాన్ని కల్పించటం కుదరదు
ధనం ఎంత ఉన్న, అడవిలో, ఎడారిలో, దానికి విలువలేదు

చెడులో మంచిని చూడక పొతే, మనిషిగా బ్రతకటం కుదరదు
విషాదంలో సంతోషాన్ని చూదక పొతే,  మనుగడ కుదరదు
నష్టంలో లాభం  చూడక పొతే, వ్యాపార  మనేది కుదరదు
హ్రుదయం లో ప్రేమ లేక పోతే, సుఖ సంసారము సాగదు

3.  తేడా అంటే ఒక్క వాక్యము లో చెప్పండి ?
     నాలుగుపంతులలో చెపుతాను

మనిషి  మనిషికి మద్య  ఉన్న తేడ  శ్రద్దలో వ్యత్యాసమే
పెద్దలకు, పిల్లలకు  మద్య  ఉన్న తేడ   ఆత్మ విశ్వాసమే
భార్య భర్తల మద్య  ఉన్న తేడ  సంసార సుఖం లోపించుటయే  
గురు శిష్యుల మద్య ఉన్న తేడ నమ్మకం వమ్ము  చేయడమే  

నన్ను స్పందింప జేసిన, నాలో ఆలోచనలను రేకెత్తించిన , నన్ను ప్రభావితం  చేసి కొన్ని ముఖ్యమైన అంశాలను పదిమందికి అందించటం ఒక మంచి పనిగా భావించి, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒకనాటి లెక్కల అద్యాపకుడిగా నేను నేర్చుకున్న విషయాలు, తల్లితండ్రులు గురువులు, స్నేహితులు , ఎందరో మహానుభావులు చెప్పిన విషయాలను
ఇందు పొందు పరుస్తున్నాను, చదివి మీ అభిప్రాయాలు కామెంట్స్ వ్రాయటం ద్వారా షేర్ చేయటం ద్వారా తెలుపగలరు .
                                                                  ఇంకాఉంది