10, జనవరి 2014, శుక్రవారం

102. *Comedy Love Story-6 ( పూజా ఫలం ) ***

                                                                 



 పూజా ఫలం                                                                            మోహేశుడు ఆరడుగుల అందగాడు, మాటలతో మనుష్యు లను మభ్య పెట్టి మనసును దోచే మహావీరుడు, స్త్రీలను చూసి వలలో వేసుకోవాలనే తాపత్రయం  గలవాడు, అట్టి మోహేశుకు అందము తక్కువ వున్న వయస్సు లో వున్న ఓ అమ్మాయితో పరిచయ మైనది. ఇద్దరి అభి ప్రాయాలు  కలసినవి, మాట మాట కలసి  పరిణయము నకు  సిద్ధమైనారు.

తక్కువరంగు, తక్కువ చదువు, చురికైన యవ్వనవతి, అదృష్టం కొద్ది పెళ్ళికి సిద్ధమైన రూపవతి, స్నేహితు లందరికీ  తను ప్రేమించిన మోహేశును చూపి నా అంత అదృష్ట వంతురాలు లేదు అని గర్వంగా  అందరికి చెప్పు కుంది.

ఒక శుభముహుర్తాన పెద్దల సమక్షమున ప్రభ మోహేశుకు వివాహము జరిగింది. పెద్దలు ప్రతి ఒక్కరూ నూతన వధూ వరులను ఆశీర్వదిమ్చి పెళ్లి భోజనాలతో సంతోషపడి పసందైన జంట అంటు, అందులో అబ్బాయి చాలా బాగున్నాడు అమ్మాయి కన్నా అని కొందరు అనటం కూడా జరిగింది. మొత్తము మీద వివాహ వేడుకల ఘనముగా జరిగినవి.

పెళ్లికి వచ్చిన ఆడవారు అందమైన భర్త వచ్చాడని ప్రభను ఆట పట్టించారు. నవ్వులాటగా మోహేశుతో మా ఇంటికి  రండి, మీ అందానికి లొంగి పోతానని అన్నది ఒక పడచు, మావారు లేనప్పుడు రండి మనసంతా రంగరిచి, పంచాలని వుంది అని మరొక పడచు, ఓ అందగాడా మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అన్న పడచుల మాటలు అన్నీ విన్న"ప్రభ" ఇక చాల్లే మీ మాటలు మా ఆయనను ఆట పట్టించు చున్నారు నాకు కోపమొస్తుంది అన్నది ప్రభ.

స్నేహితులమాటలకు తన భర్తను లొంగ దీసుకుంటారని భయ మేర్పడినది,  ప్రతి ఆడదాని చూపు మావారిపై పడితే  మావారు మారితే నా గతెం కావాలి, ఆడవాళ్ళ మాటలకు భయపడి తన కాపురాన్ని పాడు చేసుకొనే మూర్ఖురాలను నేను కాను, నా భర్తను నా చెప్పు చేతలలోకి తీసుకుంటాను.

మోహేశు అన్నాడు  అసూయ నీలో పెరిగింది " ప్రభ " అది తొలగించు, అనుమానం రానీయక మనస్సును బిగించు,  పరుల మాటలు విని పరవశాన్ని పాడు చేసుకోకు, మనువాడిన వాడ్ని ఉడికించి కౌగిట్లో భందించు ఆ మాటలకు సిగ్గుతో తల వంచింది ప్రభ.              

పున్నమి రాత్రికి ఏకాంతము కుదిరింది, తన్మయత్వముతో తనువూ తనువూ కలసి యవ్వన ఫలితము పొందే సమయము వచ్చింది, వెన్నెలలలో అందం వికసించి, ముద్దులలలో మునిగి పారవశ్యముతో మనసు మనసు కలసి అనుకోని ఆనందాన్ని పంచుకొని,  జన్మ జన్మల భంధముగా భావించి సుఖాల అంచులలో తేలి నిద్రలో మునిగి పోయారు నవ దంపతులు.

ఒక రోజు ప్రభ మొహేశు ఇద్దరుకలసి బస్సులో ప్రయాణము చేస్తున్నారు ఆ బస్సులో మోహేశు యొక్క కాలేజీలో  చదివిన విద్యార్ధులు ఉన్నారు.

మోహేశుపెళ్లి చేసుకోన్నావుటా,  మమ్మల్ని వదిలించుకొని ఎ అమ్మాయి బుట్టలో పడ్డావు, చదువుకొనే టప్పుడు ప్రేమకోసం మా వెంట పడ్డావు, మాకు పెళ్లి అయిందని తెలిసి తొకముడిచావు, ఇప్పుడు నీకు కూడ పెళ్ళైమ్దిగా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు.

అమెమాటలకు ప్రభకు బాగా కోపం వచ్చింది. ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడు తున్నావు, ఆ ఏమిలేదు మీరు కోపగించు కోకండి సరదాగా మాట్లాడాను అంతే. 

ఇది లక్జరి బస్సు ముగ్గురు కూర్చొవాలి కొద్దిగా జరగండి, ఇదేమీ  ఇల్లు కాదు అన్న మాటలకు ప్రభ జరిగింది. కూర్చుంటునే " హలో మోహేశ్ నువ్వా నేను గుర్తుపట్టలేదు చాలా మారిపోయావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మమ్మల్ని పిలిచేది లేదా మరచిపోతే  ఎట్లా మీ కాలెజీ గరల్సను మరచి పోకోడదు, ఇంతకు మాకు స్పెషల్ పార్టీ  ఎప్పుడిస్తావు, అంటు మోహేశ్ చేయి పట్టుకొని నడుందాకా లాగటం గమనించింది ప్రభ, అంతలో ఏమిటి ఇది ఎవరైనా చూస్తారు అంటు చేయి లాక్కొని ,ముందు  ప్రక్కకు జరుగు అని గట్టిగా అరిచాడు మోహేశ్ అందరూ ఎదో జరిగిందని చూస్తున్నారు.

అంతే బస్ స్టాపులో గబగబా దిగింది ప్రభ, వెనకాల మోహేశ్ ఇంటిదాకా నడక ప్రారంభించారు. ఆరోజు పస్తు మరుసటి రోజు యదా ప్రకారముగా కాఫీ త్రాగండి అంటు కాఫీ అందించింది. నేనె తప్పు చేయలేదు నిన్న బస్సులో  " నేనడిగాన" నేనేమి చిన్నపిల్లను కాను అర్ధం చేసు కోగలను. 

అంటు ప్రక్కన చేరి నాకుమీరు పార్టీ ఇవ్వాలి ఎందుకు మీ వంశాంకురాన్ని మోస్తున్నందుకు, ఇది నిజమా మరి చెప్పవే, ఇంత ఆలస్యముగా చెప్పేది, అందరిని పిలిచి పెద్దపార్టీ ఇస్తాను అంటు ఒక్కసారిపైకి ఎత్తాడు,  మహానుభావా దించు దించు ఒక్కటే నవ్వులు.                              

ఏమండి నేనడి గానని ఏమను కోకండి నేను మా అమ్మగారి దగ్గర ఉండి పండంటి మగపిల్లవాడిని కని ఇవ్వాలని  ఉందండి మీరు అనుమతిస్తే ఈ రోజే బయలు దేరుదామను కుంటున్నాను. ఎందుకు అంత తొందర నేను వచ్చి మీ ఇంట్లో దించుతాను. మా అమ్మను నాన్నను చూడాలని ఉంది. మీ ఉద్యోగము సెలవు పెట్టి ఇప్పుడే రా నవసరము లేదు, నేను కబురు చేస్తా మీ సెల్ ఫోన్ మీ జేబులోనే ఉంచు కోండి ఇప్పటికి చాలా ఫోన్స్ పారేశారు.

నీ మాటను ఎప్పుడు కాదన్నాను, ఈ రోజే నేను బస్సు ఎక్కించి పంపుతాను. ఈ పైకము చేతి ఖర్చు క్రింద ఉంచు , వేళకు పాలు పండ్లు తీసుకో, నా మనసంతా నీ మీదె ఉంటుంది అని మరువకు, దిగిన వెంటనే ఫోన్చేయి, ఆరోగ్యం జాగర్త అంటు బస్సు కదిలేదాకా ఉండి,  వెను దిరిగాడు మోహేశ్. ఏదో అలోచిస్తూ ఇంటికి చేరాడు.


నిద్రలేస్తూ పాపరు చదివాడు, ఒక్క సారిగా కుప్ప కూలిపొయాడు, పేపరులో బస్సు బెంగులూరు చేరే ముంది గోడకు కొట్టుకొని ఆయిల్టాకర్ పగిలి బస్సు భస్మమైనది,  బస్సులో ఉన్న వారందరూ చనిపోయి నట్లు చదివాడు. ఒకటికి రెండు సార్లు చూసాడు ప్రభ ఎక్కిన బస్సు ఏ నా అనితెలుసుకొని  అంతే  డ్రస్సు మార్చుకొని అద్దె టాక్సీ తీసుకొని యాక్సిడెంటు జరిగిన స్పాటుకు చేరాడు మోహేస్.                         

ఎటు చూసిన చనిపోయిన శెవాలు గుర్తు పట్టలేని విధముగా నల్లగా మాడిపోయి ఉన్నాయ్, టికెట్టు రెసిడెన్సియల్  ప్రూఫ్లు చూపిస్తె శెవాలు అందిస్తామని అక్కడ ఉన్న అధికారులు చెపుతున్నారు. నోటమాట రాలేదు బస్సులో ఉన్నవారి పేర్ల లిష్టులో "ప్రభ" ఉండటం చూసి మరీ ద:ఖం ఆగలేదు. అధికారులను అడిగితె మార్చరీకి పంపాము వచ్చాక మీరు తీసుకొనిపోవచ్చు అనిచెప్పగా కొయ్యగా మారి అట్లాగే నిల్చుమ్డి పోయాడు అప్పుడే జేబులో ఉన్న సెల్ అక్కడే పడి పోయింది.

మొహెశ్ మనసు మనసులో లేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎంతో ప్రేమగా ప్రేమించిన ప్రభ నాకు దూరమైనది. దీనికి కారణము నేనేనా, నేను కూడా ప్రభ తో పొతే ఎంత బాగుండునూ దేవుడున్నాడు మరి నా యందు   దయలేకున్నాడు, కాదు నన్ను పరీక్షిస్తున్నాడు, నాహృదయము చెపుతున్నది నాభార్య కు ఏమీ జరుగలేదు "యిది నిజము"  ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది తెలుసుకుంటే నాభార్య ఉన్నదని తెలుస్తుంది అంటూ ఆఫీసుకు కూడ పోకుండా అత్తగారికి ఫోన్ చేసిన ఎవ్వరూ తీయక పోవుటవలన చేసేది లేక ఊరుకున్నాడు.


మోహెశ్ కు రోజువారి కార్యక్రమాలు తారుమారైనాయి ఏమి తింటున్నాడో ,  ఏమి చేస్తున్నాడో  ఎవ్వరికి అర్ధం కాక పోవుటవలన ఉన్న ఉద్యోగము పొయినది, ఉన్న ఆప్రాంతము మారినాడు, తన భావాలను కవితలుగా వ్రాసు కుం టున్నాడు.

పరిస్తుతుల చేతుల్లో నలిగి పోయిన నిస్సహాయతవు నీవు
జ్ఞాన భోధ చేసి వద్దు వద్దని భోధించ లేని నిస్సహాయతను నేను
నాకీరోజు గుర్తుకు వస్తుంది మనది వీడలేని భందమన్నావు నీవు
ఆవేశానికి లోనై ఆలోచనలేకుండా నిన్ను ఎన్నో సార్లు తిట్టినానునేను

ఆకలలు నన్ను, మనస్సును, గుచ్చుతూ వెధిస్తున్నాయి
నీ కళ్ళలో అనాడు కలిగిన ఆత్రుత నాకు గుర్తుకొస్తున్నాయి
నానుంచి దూరమైన నీ కళ్ళు నా కాళ్ళలో మెరుస్తున్నాయి               
పోగొట్టుకొన్న హృదయం నాకు దొరికినట్టు అనిపిస్తున్నది

కొన్ని గాయాలు తగ్గినట్లు ఉన్నా,కాని మచ్చ ఎక్కిరిస్తుంది
ఇది కల, నిజమా అని తెలిసే లోపు మాయ కమ్ముకుంటుంది 
పగిలిన అద్దంలో క్షణంలో జీవితము ముగిసి పోతుంది
నీవు వస్తావని నాప్రతిబిమ్బాన్ని చూస్తానని నమ్మకముంది

జీవిత శిఖరాన్ని అందుకోవటానికి నీకోసం వేచి ఉంటా
ఏదైనా అద్బుతము జరిగి మనల్ని కలపాలని ఆశగా ఉంది  
ప్రేమను పొందలేని వ్యక్తి జీవిమ్చుట వ్యర్ధమని నేనంటా
నీ కోర్కలు తీర్చు కోవటానికి వస్తావని నామనసు చెపుతుంది.

ప్రేయసి నీవు వస్తే మల్లి నాకు వెలు గొస్తుంది 
నీకు చేసిన వాగ్దానము నాకు ఇంకా గుర్తుంది      
మనిషి మనిషిగా గుర్తుకు స్త్రీ సహాయము కావాలంది 
మనజీవితము సుఖము చేయాలని దేవుడ్ని కోరాలని ఉంది

రక్తాన్ని మరగిస్తున్నాయి చేసిన బాసలెన్నో 
మీటిన వీణ మరుగాయి అయిన అనురాగాలెన్నో 

వసంతము కరువాయి అయిన కోయిల కూతలెన్నో 
భయము వేమ్బడిస్తుంది అయిన అనుభూతులెన్నో 

చిక్కని చీకట్లో చిక్కి కళ్ళు కాన రాకున్నాను      
మందు టెమ్డలొ మాడి నీడనేది లేకున్నాను
హృదయమే పాషాణముగా మర్చి బ్రతుకుతున్నాను
ఈచీకటి ప్రాణము వెలుగును చూడ లేకుమ్డా ఉన్నది

ఎకాంతము కోసం పొతే వినబడు తుంది గత ధ్వని
చేసిన  తప్పు పదే  పదే గుర్తు  చేస్తుంది ప్రతి ధ్వని
భూమి ఆకాశం ఎప్పుడూ కలవాలని గాలి ధ్వని
తప్పు చేసినవారిలో జ్వలిస్తుంది  శంఖ ధ్వని

గంప క్రింద కోడి అరచి మేలుకో మంది
గొంగళి ప్రక్కకు జరిగింది చలి లేదంది
కొవ్వొత్తి కరిగి వెలుగుని విరజిమ్మిది
ఎండిన చెట్టు వికసించి పూలు కాయలు కాసింది 

మోహేస్ నిరాశ నిస్పృహలో పడి పోయాడు, గడ్డాలు పెంచి పిచ్చోడుగా తిరుగుతున్నాడు, ఎవరు ఏదడిగినా పరద్యానంగా ఉంటున్నాడు, మనస్సుని నిగ్రహించుకొని హనుమంతుని ప్రార్ధించు తున్నాడు.
ఆఫీసు బయట ప్లాట్ ఫాంపై నడుస్తున్నాడు, మంచి హోదాలో ఉండి  దర్జాగా తిరిగేవాడు ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టలేని స్తితిలో తిరుగు తున్నాడు, ఆ సమయానా ఎవరో వెనుకనుండి మోహేశ్ అనే పిలుపు విని వెనుతిరిగాడు.

ఎవరవు నీవు అని అడిగాడు మోహేశ్ నన్ను గుర్తు పట్టలేదా నేను మీ పాత అద్దె ఇంటి ప్రక్కవాడిని, ఆ గుర్తుకొచ్చింది బాగున్నావా సుబ్బారావ్ అమ్మయ్య గుర్తుకొచ్చాను దేవుడా నీకు  వంద నమస్కారాలు అంటు మీ ఆవిడ నుండి ఉత్తరాలు వచ్చాయి.

" మా ఆవిడ ఎక్కడుంది ఆత్మగా మారిందిగా, నాలో ఆశలు లేపి అనందం పంచి ఆహుతై పోయి0దిగా , అనురాగం ఆత్మీయత పంచిన "ప్రభ"  ఇక నాకు లేదుగా, ఈ జీవితము ఎ మలుపు తిరుగు తుందో ఎవరూ  చెప్ప లేరుగా "

" నేను అభద్ధం చెప్పటం లేదు, నీవు ఇల్లు మారిన తర్వాత వచ్చాయి ఈ ఉత్తరాలు, నీకు చాలా సార్లు అందించాలని ప్రయత్నించాను చివరకు నాకు ఇక్కడ కనిపించావు, నీకు నమ్మకము లేకపోతే ఈ ఉత్తరాలు చూడు నీకె అర్ధమవుతుంది అంటు చేతిలో పెట్టి వెళ్తూ " పెళ్ళాం మోసం చేసిందేమో,  ప్రేమ పిచ్చోడుగా మారాడు " అంటు వెళ్లి పోయాడు.

 సుబ్బారావు పెట్టిన ఉత్తరాలు గాలిలోకి ఎగిరి పోయాయి, అవి అన్నీ  ఆకాసంలో పావురాలలా మారి చెట్టుపైకి చేరాయి కొన్ని, గడ్డిపై పడ్డాయి కొన్ని,  అక్కడ దగ్గరగా  ఉన్న రామాలయము దగ్గర  మోహేశ్ కూర్చున్నాడు పరద్యానంగా.

" ప్రసాదం అంటు ప్రత్యక్షమయ్యాడు బాల భీముడు, ప్రసాదం గబగబా తింటూ ఉత్తరంలో "ప్రభ" అనే రెండక్షరాలు కనబడగానే కళ్ళు చెమ్మగిల్లాయి, ఈ ఉత్తరం నీకు ఎట్లా వచ్చింది ఎవరు పంపించారు ఈ ప్రసాదమును, అని అడుగగా ఏమో బాబుగారు నాకేం తెలుసు ఆ రామయ్యగారు ప్రసాదం పెట్ట మన్నారు నేను పెట్టాను అంతే,  అన్నాడు బాల భీముడు."

" అంజనేయ నీవు నాతో ఉన్నావయ్య నిన్ను గుర్తించ లేక పోయాను నన్ను క్షమించు తండ్రి "

ఉత్తరం  చదివాడు గబగబా, సర్దాడు బ్యాగును గబగబా, ఎరో డ్రో ముకు పరిగెత్తాడు గబగబా, ప్లేన్ ఎక్కి బెంగులూరు దిగాడు గబగబా, టాక్సీ మాట్లాడుకున్నాడు. చెప్పిన గమ్యానికి చేర్చాడు టాక్సీ వాడు, నెమ్మదిగా నడుస్తూ వెళ్లి అత్తగారి ఇంటి తలుపు గొట్టాడు.

కిటికిలోంచి చూసి "ప్రభ "  ఎవరో గడ్డ మున్న వ్యక్తి తలుపు 
కొడుతున్నాడు అమ్మా తీయవే అన్న మాటలు వినబడుతున్నాయి, తలుపుతీస్తె అల్లుడుగారు మీరా ఎంత మారి పోయారు, లోపలకి రండి లోపలకి రండి, నిదానంగా తడబడు నోటి మాటతో "ప్రభ" ",ప్రభ" ఉన్నదా ..............
ఏమండి ఈ ఆరు నెలల్లో ఇలా చిక్కి పోయారెంటి అంటు వచ్చి గట్టిగ కౌగలిమ్చుకుంది  "ప్రభావతి " ఎంత అందముగా ఉండే వారు ఎట్లా మారిపోయారు, వేలకు తిండి తినమని చెప్పాగా, తినుట లేదా ప్రశ్నల వర్షం కురిపించింది.
"నేను - నీవు"  చేసిన పూజా ఫలం వళ్ళ ఇద్దరం కలవగలిగాము అంటు దగ్గారగా హత్తుకున్నాడు  "మోహేశ్".
అసలు నిన్ను చూస్తాననుకోలేదు. మంచి వారికెప్పుడూ దేవుడు సహాయము చేస్తాడని నాకు నమ్మకము పెరిగింది.
మీరు బస్సు ఎక్కించిన తర్వాత బస్సు కదిలింది. అప్పుడే నాన్న  సెల్ మోగింది.  " అమ్మాయి మేము నీదగ్గరకు వ స్తున్నాము నీవు ఇంట్లో నే ఉన్నావా. నేను బెంగులూర్ బస్సు ఎక్కి పది నిముషాలు అయింది. ఐతే మేము మేడ్చల్ స్టాపు దగ్గర ఉన్నాము . అక్కడ దిగి నీవు ఫోన్ చేయ్,  అక్కడ నుండి మేము కారులో తీసి కెల్తాము అనటం జరిగింది అట్లాగే దిగటం జరిగింది. అక్కడే  ఒక పెళ్లిని చూసుకొని తరువాత బయలు దేరాము అందరం బెంగుళూర్ .
ప్రొద్దున్నే పేపరు చూస్తే  నేను ఎక్కిన బస్సు తగలబడి నట్లు అందరూ  చనిపోయినట్లు తెలుసుకొని చాలా భాదపడినాను,  మిమ్మల్ని కలవాటానికి ఎంతో ప్రయత్నించాను, మానాన్న గారు కూడా మీ ఆఫీసుకు వెళ్లి మీ గురించి సమాచారము అడిగినా తెలియదన్నారు.  నేను ఉట్టి మనిషిని కాదుగదా అని ఇక్కడే ఉండి పోయాను అంతే, అత్తయ్యగారు వచ్చి అంతే జరిగింది , మావయ్యగారుకూడా వచ్చి అన్నారు అంతే జరిగింది . ఇది అంతా ఆ బాల భీముని లీలా , ఎవరండీ ఆ భీముడు పదా చూపిస్తా అంటూ  హనుమంతుని పఠం చూపించాడు మోహేష్  తో పాటు అందరూ నమస్కరించారు అలా ముగిసింది ఈ కధ .

--((***))--


4, జనవరి 2014, శనివారం

101. Love Story-5 (సంక్రాంతి పండగ)

                                                       


సావిత్రి నామాటలో ఉన్న అర్ధంను అర్ధం చేసుకోవాలి
మా అమ్మకు అనా రోగ్యముగా ఉందిట ఇక్కడకు తెచ్చి  చూపిమ్చాలి
మా తమ్ముడు జీతమ్ తక్కువ నేనే ఈ పని చేయాలి
నా కర్తవ్యావే నికి నీ వంతు కూడ సహకరించి సేవచేయాలి. 

అత్తగారి ఆరోగ్యం గురించి చూపిస్తానంటే నేనొద్దంటానా
కాని ఆసుపత్రికి పోవాలి అని అంటే కుదర దంటున్నా
తోడుగా ఒక పని పనిమనిషిని పెట్టుకుందామని అంటున్నా డబ్బు ఖర్చు అవుతుంది అని పదే పదే అనవద్దంటున్నా. 

మానాన్న నన్నే ఎక్కువ చదివించారు, మీరే ఆదుకో వాలన్నారు. ఒకరికి సహాయం చేస్తే మనల్ని ఆపదలో ఆదుకుంటుం దనేవారు. ఈ వయసులో కూడ తన వంతు కష్ట పడుతూనే ఉంటున్నారు. అమ్మ నాన్నలు కలసి వస్తారు ఇక్కడ ఎక్కువ రోజు లుండరు. 

మా నాన్నగారు ఎంతో కొంత పైకము వద్దన్న నాకిస్తారు
వాళ్లకు అయ్యే మందులు కర్చు వాళ్ళే పెట్టు కుంటారు
నిన్ను ఇబ్బంది పెట్టి వేదించే వారు మాత్రము కారు
నీవు ఏది వండితే అది తిని సంతృప్తి  పడే వారు

మీ రంతగా  పదే పదే నాకు చెప్పా నక్కరలేదు
సేవ చేయ్యలేదని సతోష పెట్టలేదని  అనవలదు  
పిల్లలు హైస్కూలుకు వచ్చారు వారి చదివించాలి
మీకు తెలుసు నా ఆరోగ్యము అంతగా బాగుండటం లేదు

కాలాన్ని మార్చలేను, వచ్చిన వారిబట్టి మారటానికి ప్రయత్నించు. 
పెద్దల్ని మార్చలేను,  నీవు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. 
నావంతు నేను చేస్తాను నీవంతు సేవలు చేయటానికి ప్రయత్నించు.
పెద్దలకు చేసే సేవ అదృష్టం జన్మ జన్మ ల భంధం అని భావించు. 

నేను అమ్మా నాన్నలను తేవటానికి స్టేషన్కు వెళ్తున్నా
నీవు కూడా అంత సర్ది శుబ్రంగా ఉండా  లంటున్నా  
పిల్లకు కూడా మంచి దుస్తులు వేసి రడీగా ఉండా లంటున్నా
అవసరమైతే అందరం కలసి హాస్పటల్కు పోయే అవకాశముంది

కాలాన్ని ఎదురీది వేల్లగల వారవ్వారు లేరు
మమతలు పంచు కుంటు తిరుగుట వేరు
ప్రతి విషయములో సర్దుకు పోవడం వేరు
దంపతులన్నాక సుఖ దుఖాలు పంచుకోవటం తప్పదు
 
ఉండండి పిల్లలు వచ్చే లోపు నేను కూడా మీతోపాటు స్టేషన్ కు వస్తా అని బయలు దేరారు ఇద్దరు

పిల్లలు వచ్చి తాళాలు తీసి ఇంట్లో కూర్చున్నారు
సంక్రాంతి పండగ గురించి వ్యాసం రాయలనుకుమ్తున్నారు
ఎవరు చేపతారా అంటు సీత గీత కూర్చున్నారు
ఆటలో బామ్మ తాతయ్య రావడంతో కొండంత సంతోషం వచ్చింది వారికి

అమ్మానాన్నలు మీకొసమె స్టేషన్కు వెళ్ళారు
తాతగారు బాగున్నారా అంటు సీత గీత అడుగుతున్నారు
పిల్లలను చూసి అప్పుడె పెద్ద వారయ్యారే అన్నారు
తాతగారు టిఫిన్ కాఫీ తీసుకోండి అమ్మ చేసి వెళ్ళింది

అమ్మ నాన్న వాళ్ళు వచ్చే లోపు సంక్రాంతి గురించి చెపుతారా .
మీరు సంతోషముగా అడుగుతుంటే చెప్తాను పాపలు కూర్చోండి.   


సంక్రాంతి ఆంద్రుల అతి పెద్ద పండుగ రోజు !
శ్రీ మహావిష్ణువు అసురలను మంధరపర్వతం క్రింద మట్టుపెట్టిన  రోజు !
భగిరధుడు శివుని ప్రార్ధించి  గంగను భూమిపై ప్రవహింప చేసినరోజు  !
కాలము విలువ తెలిసుకొని ప్రతిఒక్కరు జీవితము సుఖమయం చేసికొనేరోజు !

చిక్కని చీకటిలో, వెలుగు చిమ్మే వెన్నలలో గజ గజ వణికించే చలి !

వాకిళ్ళు సుబ్రముచేసి ఆవు పేడతో కల్లాపు చల్లె తెలుగింట ముంగిలి !
కుటుంబ సభ్యులు అందరు కలసి ముగ్గులు పెట్టి సంతోషపు లోగిలి !
సూర్యోదయం కాకమునుపే స్త్రీలు ఓపికతో శ్రద్ధగా వేసే ముగ్గుల కూడలి !

సింధు లోయలలోని శిధిలాల్లో, హరప్పాలో, మెలిక ముగ్గుల చిత్రాలు !

తమిళనాడులోని పసుపతీశ్వరాలయ శిల్పాలపై ముగ్గుల చిత్రాలు !
తమిళనాడులోని ఔషధీశ్వరాలయలో  మూడు త్రిభుజాలలో మెలిక ముగ్గులు !
ఆముక్తమాల్యద, విజయ విలాసం, మరియు అనేక గ్రంధాలలో ముగ్గుల వివరణలు !    


ముగ్గులమధ్య  ఉంచుతారు పసుప,కుంకుమ అద్దిన గొబ్బెమ్మలు !
నాలుగు  గొబ్బెమ్మల మధ్య ఒక పెద్ద గొబ్బెమ్మ ఉంచి పూల అలంకరణలు !
హరి కీర్తనలు చేస్తున్న హరిదాసుకు తలపై ఉన్న పాత్రలో పోస్తారు ధాన్యపు గింజలు !
గంగిరెద్దు సహిత శంకర పరివారంకు ఇస్తారు వస్త్రాలు, ధాన్యపు గింజలు, పైసలు !

గగనసేమలో పగటిపూట నక్షత్రాల వలె ఎగరవేస్తారు గాలిపటాలు !

సంబరముగా అల్లుడు అత్తగారింటికి వచ్చి మరదల్లతో ఎకసక్కాలు !
ఊరు అంతా ఒకచోటచేరి కాస్తారు కోడిపందేములు,ఎడ్ల బండి పందెములు !
రైతులు చెమటోట్చి పండించిన ధాన్య్యమును కొందరు చేస్తారు దానములు !

ఇంట్లో ఉన్న పాత టేకు వస్తువులను ఒక చోట చేర్చి వేస్తారు భోగిమంటలు !

ధనుర్మాసమున రొజూ తెల్లవారుజామున భక్తులు చేస్తారు  నగర కీర్తనలు !
భోగిసాయంత్రమున, ముత్తైదువులను పిలిచి బొమ్మలకోలువుకు పారంటములు !
రేగిపళ్ళు,సనగలు,పూలు,పైసలు కలసిన వాటిని పిల్లలపై  కుమ్మరించి ద్రిష్టి తీస్తారు ! 


సంక్రాంతి రోజున పాలుపొంగించి దానితో తయ్యారు చేస్తారు తీపిపదార్ధాలు !
కబుర్లతో అరెసలు,బొబ్బట్లు,పులిహొర,పొంగలి చేస్తారు పిండి వంటకాలు !
సంక్రాంతి నాడు పితృ దేవతలకు వదులుతారు తర్పణాలు, చేస్తారు దాణాలు !
సంక్రాంతి నాడు వైష్ణవ భక్తులు ధనుర్మ్సవ్రతమును ఆచరించి గోదా కళ్యాణం చేస్తారు !

సూర్యుడు తనకుమారుని శని ఇంటికి వెళతాడని చెపుతున్నాయి పురాణాలు !

ఉత్తరాయనమునందు మరణించినవారు పుణ్యలోకాలకు పోతారని నమ్మకాలు !
భారతీయ సాంప్రదాయము ప్రకారం చాంద్రమానాన్ని  నను సరించి వస్థాయి పండుగలు !
ఆది శంకరా చార్యులు సన్యా సము పుచ్చుకొన్నది  సంక్రాంతి పర్వదినము నాడు !  


మామయ్య్యగారు ఆత్తయ్యగారు ఎట్లా వచ్చారు మీరు
హాస్పటల్ లో చూపిమ్చుకొని మందులు తీసుకొని వచ్చాము
నీన్ను పిల్లలను చూసి పోదామను కుంటున్నాము
సంక్రాంతి పండగ ఐనతర్వాత పోదామను కుంటున్నాము. 

ఒక్క మాట చెపితే మేమే హాస్పటల్కు వచ్చే వాళ్లము కదా
మీ అబ్బాయి నేను మీగురిమ్చి ఆలోచిస్తున్నాము కదా
మీకు సేవలు చేసి తరిమ్చటమె  మాకు విధి ధర్మం
ఇప్పుడె పిల్లలు సంక్రాంతి గురించి అడిగితె తెలిసినవి చెప్పాము

చూడమ్మాయి జరిగిపొఇన దాని గురిమ్చి అలూచిమ్చకు 
ప్రతిపని మనమంచికి జరిగిందని భావించి జరుగు ముందుకు
కాలమే సత్యం,  ధనం,   ప్రాణం,   అని ఎప్పటికి మరువకు
మావగారు నేను తప్పుగా మాట్లాడితే 
క్షెమించండి.    


పెద్దవాడిగా చెపుతున్నా మీకు పిల్లలకు బట్టలు తెచ్చాము
మా అమ్మాయిని అల్లుడ్ని  కూడా ఇక్కడకు రమ్మన్నాము 
మీరెమి కొనవద్దు  వారికి బట్టలు మేమే తీసుకొచ్చాము 
సరదాగా పండగ మూడు రోజులు గడుపుదామను కుంటున్నాము.

నాన్న నేను పెట్టాల్సింది పోయి మీరు కొనుక్కు రావడమేమిటి
పెద్దవాళ్ళగా మేము చెపుతున్నాము ఈ సంక్రాంతికి వప్పుకోండి    
మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కపెట్టకుండా ఇంత ఖర్చు ఎందుకు అని
అందరూ సుఖముగా ఉంటే లోకమంతా సుఖముగా ఉంటుంది

జీవితమనేది  ఈశ్వర ప్రసాదముగా స్వీకరించాలి
హనుమంతుని ఆరాధిస్తూ ధైర్యముగా బ్రతకాలి
జీవితము ఆటవంటిది గెలుపు ఒటమి భరించాలి
జీవిత లక్ష్యాన్ని అందుకోవటానికి ప్రయత్నించాలి

జీవితమ్ అందమైనది పువ్వులా వికసిస్తూ ఉండాలి
జీవితమ్ ఒక స్నేహ సాగారం, స్నేహం సాగించాలి
జీవితమ్ ఒక ప్రతిజ్ఞ ఎప్పుడు నిలబెట్టుకుంటుఉండాలి
జీవితమ్ ఒక యుద్ధం గెలవటానికి ప్రయత్నించాలి


మావయ్యగారు అత్తయ్యగారు కాస్త విశ్రాంతి తీసుకొండి
అన్నయ్యగారు కూడా వస్తారుగదా అమ్దరూ సరదాగా ఉందాం
పిల్లలు వారిని వేదిమ్చక మీ స్కూళ్ళు పని ఉంటే చక చక చేసుకోండి
పండుగకు అందరూ వచ్చారు సంతోషంతో ఇల్లంతా సందడి

ఈ మూడు రోజుల ఖర్చు మేమే భరించాలని అనుకున్నాం   
మీ ఇద్దరి అమ్మాయిల పెరుమీద, నాకూతురు బిడ్డ పెరు మీద
ఫిక్సుడు బాండ్ తెచ్చాము వారికి సంక్రాంతినాడు ఇస్తున్నాము 
ప్రతిపమ్డుగకు అందరు కలసి మెలసి ఉండాలనేది మా ఆకాంక్ష

పిమ్దివంటలు చేస్తూ, ఇల్లు అలమ్కరిస్తూ కొత్త బట్టలు వేసుకొని
అమ్దరూ చేస్తున్నారు సందడే సందడే
ప్రతిఒక్కరికి నూతన సంవత్చర, సంక్రాంతి సుభా కాంక్షలు
ఇందు మూలముగా తెలియ పరుస్తున్నాను

సంతోషమే సగముబలం అన్నారు   

జీవమ్ ఒక్కటే జీవితమ్  వేరు
రూపమ్ ఒక్కటే గుణం వేరు
కాలం ఒక్కటే గమ్యం   వేరు
పండుగ ఒక్కటే పద్ధతులే వేరు 

                                                    


 

........................................................................................................................................................................
.........................................................................................................................................................................

100.Children Love Story -4( పిల్లల కోసం )

                                                                    
                                      
పిల్లల కోసం

కారులో నుండి దిగి  ఇంట్లోకి వచ్చారు సీతా రాములు 
సాఫ్టు వేర్ కమ్పెనీలొ పనిచేస్తున్న  నవ దంపతులు
పిల్లల రక్షణకు ఆయాను ఉంచి చేస్తున్నారు ఉద్యోగాలు
ప్రొద్దున పోయి రాత్రికి ఇంటికి చేరే ఉద్యోగస్తులు

పిల్లల జాగర్త తగ్గింది, ఆయాకు ఇచ్చే ఖర్చు పెరిగింది
పిల్లలు ఎప్పుడు అనా  రోగ్యముతో ఉండుట  జరిగింది    
పిల్లల పెంపకము, జాగర్తలు ఆయాకు భారమైనది
బొమ్మలు ఇచ్చిన పిల్లలను కొట్టడంతిట్టడం జరుగుతుంది

సీతారాములు అఫీసుకు పోయాక పిల్లలను నిద్రపుచ్చింది
ఇంట్లో ఉన్న డీవీడీ ప్లేయర్, కొంత డబ్బుతో పారిపొఇమ్ది
నమ్మకంగా ఉండి నమ్మక ద్రోహము చేసి పోతున్నాను అన్నది
పొలీస్ రిపోర్టు ఇచ్చిన ఫలితం లేకుండా ఉన్నది

పిల్లలు మత్తుగా పడుకోవటం వళ్ళ అనుమానం పెరిగింది
పిల్లలు ఏడుపు మానుటకు మత్తు మాత్రలు వేయుట జరిగింది
డాక్టర్ పిల్లల తల్లి తండ్రులను పిలిచి పిల్లల రక్షణ పెరగాలంది
పిల్లలకోసం సీత తన ఉద్యగం మానేస్తానని గెట్టిగా చెప్పింది


భర్త తో నెమ్మదిగా ఉద్యోగానికి సెలవు పిల్లలకోసం
పిల్లల భవిషత్,ఆరోగ్యం నాకుఆలనా పాలన ముఖ్యం   
మనీ ఉన్నంత మాత్రాన పిల్లలకు తెప్పియలేము సంతోషం
వేలకు పాలు పండ్లు పెట్టి పాటలుపాడి నిద్రపుచ్చుటే ముఖ్యం

రెండు రోజులు తర్వాత క్యాంపు నుమ్డి వచ్చాడు రాము
పిల్లలు సరదాగా ఆడుకోవటం చూసి ముచ్చటపడ్డాడు రాము
వారిని ఎత్తుకొని సరదాగా తిప్పి ఆడించాడు రాము
పిల్లల సంతోషము చూసి సీతారాములకు కలిగే ఉత్యాహం

సీతా పిల్లల నెపంతో నీవు ఉద్యోగం మానుట నాకు ఇష్టం లేదు
నాఒక్క జీతము ఇంటి ఖర్చుకు, పిల్లల పోషణకు సరిపోదు
పిల్లల కోర్కలు నీ కోర్కలు తూర్చుట నా వళ్ళ కాదు
మరోమార్గం చూసి, నీవు ఉద్యోగం చేయుట తప్పదు

పిల్లలు పెరుగుతున్నారు, ఇంటి అద్దె కూడా పెంచుతున్నారు
గ్యాసు, పెట్రోలు, లక్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు పెంచారు
మందులు, పాలడబ్బాలు, పాలు పండ్లు అన్ని పెంచారు
ఖర్చులు దృష్టిలో పెట్టుకొని నీవు మరలా ఉద్యోగంలో చేరు 


మీరు తెచ్చే 50,000/- రూపాయలు ఇంటికి సరిపోతాయి
అప్పులకు పోకుండా సర్దుకొని పిల్లలతో ఉమ్డ గలుగుతాము 
పిల్లల సుఖము, మీ ఆరోగ్యము,  నాకు రెండు అవసరము
మీ ఆలోచనలు ప్రక్కన పెట్టి బుద్ధిగా ఉద్యోగము చేస్తీ చాలు

పిల్లల కోసమేకదా మీ అమ్మ గారిని రమ్మనోచ్చుగా
పెద్దవాళ్ళు పిల్లలకు పైన  కాపలా ఉంటారుగా
వారికి తెలిసిన నీతి కధలు, రామాయణం చెపుతారుగా
రమ్మని చెప్పు వారికి కాలక్షెపముగా ఉమ్టుందిగా

మీకు కోపం వచ్చినా ఎవ్వరిని నేను పిలువను
నాకు ఇష్టంలేదు ఒకరిని ఇబ్బంది పెట్టడమును
చదివిన చదువు వ్యర్ధమవుతుమ్ది అన్న ఏమనను
కొన్నేళ్ళు పిల్లల కోసం ఉద్యోగం మానుకుంటున్నాను

మీ సంపాదన సరిపోలేదని ఎప్పుదూ వేదించను
ఎవ్వరిని పిలువను, తెలిసిన వారినెవ్వరిని పెట్టుకోను       
ఆశలకు పోకుండా జీవితమును గడుపుతు ఉంటాను
నన్ను వత్తిడి చేయద్దు  మరొక్కసారి చెపుతున్నాను


మావయ్యగారు అత్తయ్యగారు అనుకోకుండా ఇంటికి రావడం
సీతకు అర్ధం అయ్యింది తనకు నచ్చ చెప్పడానికి వఛరనుకొవడం
మీరు బాగా చిక్కి పోయారు పెద్ద వయసు,  ఓపిక తగ్గడం
ఇక్కడె ఉండండి ఎందుకు ఈ వయస్సులో అటు ఇటు తిరగడం 

అత్తయ్యగారు వేడి కాఫీ తీసుకొండి
మావయ్యగారు వేడి టి  తీసుకొండి
పిల్లలు గొడవచెయక పాలు త్రాగండి
నేను కాఫీ టి లు మానే సానండి

మేమోచ్చాముగా పిల్లలను గురించి ఆలోచిమ్చకు
మేమిద్దరం పిల్లలతో ఆడుకుంటు చూసుకుంటాము
మాకేం కొత్త కాదు పిల్లలను పెంచడము
తాతయ్య బామ్మ అంటు పిల్లలు చేరారు దగ్గరికి

దేవుడే దిగివచ్చి చెప్పిన  ఉద్యోగము చేయను    
మీరు హితభోధచేపిన నా మనసుమర్చు కొను
మీరు ఉండండి పిల్లలతో మీకు సేవ చేస్తాను
మీ చేత పనిచెఇమ్చి ఈ వయస్సులో కష్టపెట్టను

ఫోన్ చేస్తే నేను మీకోడలు కలసి స్టేషన్కు వచ్చేవాల్లముగా
పిల్లలను నిన్నుకోడలని చూడాలని పించింది వచ్చేసాముగా 
మీరుపొమ్మన్న పోకుండా ఇక్కడ ఉందామను కుంటున్నాముగా
మీరు ఇక్కడ  ఎన్నాలైనా హాయిగా ఉండండి నేను కోరేది అదేగా 

అమ్మానాన్న వచ్చారుగా నీవు ఇక ఉద్యొగములో చేరచ్చు
వారు వచ్చింది ఇప్పుడేగా మీ తమ్ముడు పిలిచినా పోవచ్చు
నాకు తెలియదా మీ మాట తీసి పోలేక వారు ఇక్కడకు రావచ్చు 
మీరు కొట్టినా తిట్టినా నామాట మారదని గమనించవచ్చు 


నీ మాటే నాకు వేద మంటావు నవ్వుతూ పలకరిస్తావు
పట్టుదల ఎందుకో  నా అవసరాలు అన్ని తీరుస్తావు
సంపాదన పెరిగితే సుఖం వుంటుందని అర్ధం చేసుకోవు
తను పట్టిన కుందేలుకు మూడె కాళ్ళని  వాదిస్తావు

తల్లి తండ్రులకు చెప్పి పిల్లలకు ముద్దులిచ్చి ఆఫీసుకు పోయాడు రాము

రాత్రి 10 గంటలకు రాము స్వీట్ ప్యాకెట్తో వచ్చాడు సంతోషంగా
అమ్మనాన్నలను పలకరించి పిల్లలు నిద్రపోయారా అని అడగగా
గీజరు వేసి ఉంచా స్నానం చేసి రండి కాస్త అన్నం తినవచ్చుగా
ఉద్యోగము గురించి ఆలోచించకు నిన్నుఇబ్బమ్ది పెట్టనుగా  

స్నానం చెస్తూ పా
ట పాడుతున్నాడు రాము
                                        


నీవె నాకు అందాల ప్రేయసివి, శ్రీ మతివి
పిల్లలకోసం ఉద్యోగం త్యాగం చేసిన త్యాగశీలివి
పిల్లలే రేపటి భావి  పౌరులని గమనిమ్చితివి
నీ మనసును నొప్పించిన నన్ను క్షమిమ్చితివి

అబ్బ ఎంత సేపు నండి స్నానం అన్నం చల్లారిపోతుంది   
నాకు నిద్రోస్తుమ్ది కాస్త తిని మాటలతో ముచ్చటించు కుందాం
గబా గబా నలుగు మెతుకులు తిని బెడ్ రూమ్ చేరుదాం
నీమాటను ఎప్పుడు కాదన్నాను ఇదిగో వస్తున్నా తిందాం

ఈ రోజు వంటలు చాలా బాగున్నాయి, కిల్లి ఇస్తావా
పైకి వెళ్లి బుద్ధిమంతుడుగా పడుకొంది వచ్చి కిల్లి ఇస్తా
పెద్దవాళ్ళకు మందులు ఇచ్చి పిల్లలగురించి చిప్పిమ్ది
అన్ని సర్దుకొని పాల గ్లాసుతో బెడె రూమ్ నడిచింది

సీత హృదయం పరవశిమ్చిమ్ది
మనసంతా మహా సాగరమైమ్ది
పున్నమి వెన్నెల సంతోషం వచ్చింది  
ఆత్రుతగా ఆనందంగా సీత రాము పక్క చేరింది

నిద్రలో రాము ఒకటే కలవరింపు నీమనసు భాదపెట్టాను అంటు 


నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణివి నీవు  !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణివి నీవు  !
కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యసశ్విణివి నీవు  ! 
మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణివి నీవు  ! 

ధర్మశాస్త్రములు తెలిపి, ఆదు కొనే అంతర్వా ణివి నీవు  ! 
కొన్ని విషయాలు తెలిసుకోనుటకు,  సహాయపడే అన్వేషిణివి నీవు  !
మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణివి నీవు  !
అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణివి నీవు  !
 

ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అన్దిమ్చ్, అన్నప్రదాయిణివి నీవు  ! 
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణివి నీవు  !  
ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణివి నీవు  !
కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణివి నీవు  !

 

పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణివి నీవు  !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణివి నీవు  !
 మనోభిష్టమునునెరవేర్చి,
ఉచ్చాహమునుపెంచే,ఉజ్వలరాణివినీవు                                         తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణివి నీవు  !

ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణివి నీవు  !
భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణివి నీవు  !
ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణివి నీవు  !
బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణివి నీవు  !
 

అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణివి నీవు  !                                                                                                                                        నయన మనోహర కలువల కళల  అపరంజి  మణివి నీవు  !
నా మన్మధ  శృంగార  రాజ్యంకి శృంగార దెవతా మణివి నీవు  !
పిల్లలు ఉన్న నాకు నీవు నిత్య యవ్వన కుసుమానివి నీవు ! 


మహానుభావా ఎవరా ప్రియసి ఇది కలవరింత పులకరింత
నీవు నా ప్రక్కన ఉంటే స్వర్గాన్నే జ ఇంచి నీకు రాసిస్తా అంటు

సీత నడుముపై రాము చెయ్వేసి సుతారంగా కదిలించి
అరచేతితో సున్నితంగా బలంగా  అప్రయత్నంగా బిగించి
ముఖారవిందాన్ని చూస్తూ ముక్కును అతిసమీపమ్గా ఆనించి
లేతపెదవులు కొద్దిగా తెరుచుకున్నాయి కంపనంతో పరవశిమ్చి    

మొదటిరాత్రులు గుర్తుకొచ్చినాయి మా వారికి
సంతోషము దు: మువచ్చిన ఆగదు మగావారికి
మగవారి మనస్సు అర్ధం కాదు ఆడవారికి
క్షణం కోపం క్షణం ఆవేశం క్షణం శృంగారం
మావారికీ  


సీత తలారా స్నానం చేసి పెద్ద కుంకుమ బోటు పెట్టి భర్తను లేపింది
వద్దు వద్దండి పెద్దలున్నారు బ్రష్ తోముఖం కడుక్కొని త్వరగా రండి
కన్నుల్లో తేజస్సు తగ్గించుకొండి,టిఫిన్ తిని   కాఫి  త్రాగుదాం రండి
లుమ్గీ సర్దుకుంటు,నవ్వుకుంటూ అమ్మన్నాన్నలు టిఫిన్ తిన్నారా 

మనస్సు చంచలము కాదు అనుకుంటే స్తిరము
కెరటములు ఎన్ని వచ్చిన సముద్రము స్తిరము
వేడికిరణాలు ఎన్నివున్న సూర్యబిమ్బమ్ స్తిరము
భార్య భర్త లు ఒకటైతే ఇల్లంతా ప్రసామ్తితో స్తిరము

ఏదో మీలో మీరె మాట్లాడుకుంటున్నారు త్వరగా తయారవండి

మీతొ మేము మాట్లాడలేం మీరు మగ మహారాజు
మాయమాటలతో మనస్సును లొమ్గతీసుకొనెరాజు
ఇంటిలో ప్రశామ్తత బయట అందరి దృష్టిలో మృగరాజు
నాకు మాత్రం నాతొ సర్డుకోపోయే మన్మధ  రాజు 

బాబు ఇదిగో పాపారు చదువుతావా
వద్దు నాన్నగారు అంతా రాజకీయ గొడవా
గ్యాసు,పెట్రోలు పెరగటం బందులు గొడవా
మంత్రులు సభలలో కుమ్ములాటల గొడవా

ఇవేగా నాన్నగారు, అవుననుకో అయినా పాపారు చదవాలికదా
మీరు చదవండి మీకు కాలక్షేపం అవుతుంది అంటు తల్లి తండ్రులను
ఒకచోట కూర్చొబెట్టి భార్య్యను పిలిచి పాదాలకు దండంపెట్టి ఆశీర్వాదమ్
పొందాడు

మీ కోడలు ఉద్యోగం మానేసి ఇంటిలోనే ఉంటుంది
మీరు ఏమ్తకాలమైన హాయిగా ఇక్కడే  ఉండండి
తమ్ముడు దగ్గరకు పోవాలనుకుంటే  వెలండి
నాకు అఫీసు పనిమీద ఆడిట్ కంపు ఉన్నది

సరే అబ్బాయి నీవొచ్చేదాక ఇక్కడె ఉంటాము
నీ వోచ్చేక తమ్ముడు పీల్లలను చూసి వస్తాము 
అమ్మాయి నీకు కూడ చెపుతున్నాము ఉమ్డమంటే ఉండలేము    
మీ ఇష్టానికి ఎప్పుడైనా ఎదురు చెప్పానా మావగారు

బెడె రూమ్ సర్దుతుంటే రిబ్బంతో చుట్టిన కొత్త కవరు ఉంది
ఆన్ లైన్లో  ఇంట్లో ఉండి చేయమని ఆర్డరు అది
ఉద్యోగం చేస్తావని నామాట కాదనవని నమ్మకముంది
పెద్దల ముందు చెప్పటం రాక ఉత్తరంతో ఆర్డరుమ్చా

నవ్వుకుమ్టూ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంటూ మగవారు మగవారే 

అమ్మాయి ల్యాండ్ ఫోన్ మ్రోగుతుంది తీస్తావా
హలో హలో అంటు ఆగు ఆగు నీ ముద్దుల మొగుడ్ని
పెద్దలున్నారా చూసావుగా ఆర్డరు నీకు సంతోషమేగా
తప్పదు మహానుభావా మీకు పిల్లకు సేవచేస్తూ పనిచేస్తా

అమ్మాయి ఎవరూ ఫోన్ లో అంతసేపు మాట్లాడుతున్నావు
మీ అబ్బాయి మీరు అన్నం తిన్నారా అని ఫోన్ చేసారు
మల్లి ఉద్యోగం చేయాలని మొరాఇమ్చాదని భయమేసిమ్దమ్మ
అబ్బే అదేం లేదు ఇంట్లోనే ఉమ్డ మన్నారు మీ అబ్బాయి

మావగారు నవ్వుతుంటే అత్తయ్యగారు ఎమిటి విశేషం
మన పెళ్లి తతంగం శోభనం గుర్తుకొచ్చింది అందుకని
అమ్మ బాబో వెళాపాలా లేదు ఈ ముశలొడుకి
అంటే అమ్దరూ ఒక్కటే నవ్వులు, పిల్లలు వచ్చి అమ్మ ఏమైమ్దమ్మ

నవ్వులే నవ్వుల్ నవ్వులే నవ్వుల్ నవ్వులే నవ్వుల్   
                .................................................................................................................................

25, డిసెంబర్ 2013, బుధవారం

*99.Love Story-3 ( అనుభందం )***

                                             

అనుభందం 

దేవాలయములో ఉపన్యాసం వినటానికి రోజు పరందామయ్య్యగారు 

భార్యతో వచ్చి వినేవారు అదే రోజు స్త్రీ పురుషులు గురించి చెపుతున్నారు 

ఆదిపరాశక్తి దృష్టిలొ స్త్రీ పురుషులు సమానమే 
స్త్రీ పురుషుల వివక్షత సృష్టించినది కలియుగమే 
ఆశయాల కోశమ్ ఇరువురు శ్రమించడం సహజమే 
ఆధిపత్యం కోసం ఇరువురి మద్యపోరాటం సహజమే

కృత్రిమ సృష్టి అనేది కుల మత, జాతి, మాత్రమే   
లైంగిక హింసలు స్త్రీ పురుషుల మద్య ఉండటమే 
స్త్రీ పురుషుల హక్కుల కోసం నిరంతరం పోరాటమే 
స్త్రీ పురుషులు ప్రేమను పంచుకుంటే జీవితమ్ సుఖమే




మహావిష్ణు నాభినుండి బ్రహ్మ పుట్టడం పురాణం

నేను సగం నీవు సగం అనటం అర్ధనారీశ్వర తత్త్వం
దాపత్యం అంటేఇష్ట పూర్వకంగా స్త్రీ పురుషులు సంగమం 
పిల్లలు పుట్టడం, పెంచడం భార్య భర్తల కనీస  ధర్మం



భారతీయ ఔవ్నత్యాన్ని గుర్తిస్తూ కలసి మెలసి జీవిమ్చడమే 

సమభావాన్ని గ్రహించి గొప్పలకు పోక సర్దుకొని జీవిమ్చడమే
సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఒకరి నొకరు సహకరించడమే
ప్రక్రుతి ననుసరించి హేచ్చు తగ్గులు లేకుండా బ్రతకటమే



పురాణం ఒకవైపు స్నేహితులు మాటలు మరోవైపు




పంతులుగారు బాగున్నారా, నన్ను గుర్తు పట్టారా

మీతో బాటు చదువుకున్న ఐ.యమ్.పి.సత్యం ను
జ్ఞాపక శక్తి తగ్గింది గుంటూరులో సత్యానివి కదూ  
హమ్మయ్య ఇప్పుడు గుర్తు పట్టారు చాలా సంతోషం



నా భాదలు ఎవరికి చెప్పిన ఫలితము లేదు   

నేనున్న పరిస్తితి ఎవరికి చెప్పిన అర్ధం కాదు
ఓదార్చే స్నేహితులు నాకు గుర్తింపు  లేదు
అందరికి దూరంగా ఇక్కడ జీవితము గడుపుతున్న



ఎం చెప్పేది నేను చేసిన కంపేనీ దివాళా తీసింది

చాలా మందికి డబ్బు ఎగ్గొట్టి కంపేనీ బోర్డు తిప్పేసింది 
దాచుకున్న పైకము రాక చివరకు బాధ మిగిలింది
ఆప్పులు తీర్చుటకు ఉన్న కొంత అమ్మటం జరిగింది



ఏదో కొంత డబ్బుతో అద్దె కొంపలో ఉంటున్నా

కూరలు పెంచి బజారులో అమ్మి బ్రతుకు తున్నా
వృద్ధులకు మూగజీవులకు ఆశ్రమం కల్పిస్తున్నా
ప్రకృతి ప్రశాంత వాతావరణములో బ్రతుకుతున్న



నా విషయం అట్లా ఉంచు మీ  విషయం తెలియపరుచు

పిల్లలెందరు  వారి వివరాలు వివరముగా తెలియ పరుచు
నీ భార్య ఆరోగ్యం, నీపిల్లల విద్యాభివృద్ధి గురించి వివరించు 
కుటుంబ గౌరవ సంపాదన ఉన్నత స్తితి గురించి వివరించు



నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు  

వారు చదివిన చదువుకు వచ్చెను, ఉద్యోగాలు
వారందరికి పెద్దలమై చేసాను, వివాహ వేడుకలు
పిల్లలకు ఊడిగం చెయ్యుటకు పనికొస్తారు పెద్దలు



ఏదయినా అడిగితే  నాకు ఏమి చేసావు నాన్న

పైచదువు చదివిమ్చమంటే చదివిమ్చలేదు నాన్న 
ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి ఇల్లు జరుగును నాన్న
ఒకరివద్ద ఉండ మంటే ఉండరెందుకు సలహాలు ఇవ్వాలని చూస్తారు



మనమిక్కడ కలవడం ఆదేవుడు కల్పించాడు

వొకరి భాద ఒకరు చెప్పుకోవటానికి వీలు కల్పించాడు 
వయస్సుకు తగ్గ ముచ్చట్లుకు అవకాశ మిచ్చాడు
జీవిత మజలీలు ఇంకా ఎన్ని ఎదురుచూస్తూ బ్రతకాలి  



కృష్ణాష్టకం చదువుతూ ఉపన్యాసం ముగించారు  


వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం!
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం!!(1)

అతపీపుష్పసంకాశం, హారమాపురశోభితం!
రత్నకక్కణకేయూరం, కృష్ణం వందే జగద్గురం!!(2)


కుటిలాలకసమ్యుక్తం, పూర్ణ్చంద్రనిభాననం!
విలసత్ కుండలధరం, కృష్ణం వందే జగద్గురం!!(3)

మందారగంధసమ్యుక్తం, చారుహాసం చతుర్భుజం!
బర్హి పించానచూడాక్గం, కృష్ణం వందే జగద్గురం!!(4)

ఉత్పల్ల పద్మపత్రాక్షం, నీలజీమీతపన్నిభం!
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురం!!(5)

రుక్మిణీ కేళిసమ్యుక్తం, పీతాంబరసుశోభితం!
అవాస్తతు తులసీగంధం, కృష్ణం  వందే జగద్గురం!!(6)

గోపీకానాం కుచద్వంద్వకుంకుమాంకితఫక్షసం!
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురం!!(7)

శ్రీ ఫత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం!
శంఖ చక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురం!!(8)

కృ ష్ణా షటక మిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్!
కోటీజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి!!.(9) 




శ్రీ కృష్ణ భగావాన్ని ధ్యానం చేయందే మేము నిద్రపోం 
గీతా సారాంశాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు సాగిస్తాం    
మూగజీవులను, పెద్దలను గురువులను ఆరాధిస్తాం 
మమ్మల్ని నడిపించేది ఆదెవదేవుడని మేము భావిస్తాం 

మా ఇంటిదాకా పోదాం పదా ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి 
నా భార్య పూజ పునస్కారాలమ్టూ పిల్లలకు సేవ చేస్తుంది 
పిల్లలు పుట్టరని తెలుసుకొని భాద లేకుండా ప్రవర్తిస్తుంది 
చిలుకలను, కుక్కలను, కుందేల్లను పెంచుతుంది  

ఇంట్లో అడుగుపెట్టగానే నమస్తే అంటుంది చిలుక 
తోకాడిస్తూ మనష్యుల చుట్టూ తిరుగుతుంది శునకం 
గంతులు వెస్తూ సందడి చేస్తుంది కుందేలు 
కిలకిల శబ్దాలతో సందడి చేస్తాయి చెట్లపై పక్షులు 

ఇంతకీ నీవిషయమ్ చెప్పుతూ  మద్యలో ఆపావు 
ఇదిగో ఈ కాఫీ త్రాగుతూ చెప్పు నీ వెక్కడ ఉంటావో చెప్పుము  
ఒక్కసారి మేమిద్దరం మీపిల్లలను వచ్చి చూస్తాము 
చిరునామా తెలియపరిస్తే వీలు చూసుకొని వస్తాము   

పిల్లలు ఉన్న సుఖం అనేది లేకుండా నేను బ్రతుకుతున్నాను 
నేను చేసిన పెద్ద పొరపాటు మొగపిల్లలని ఎక్కువచదివించాను   
తక్కువ చదువులతో కూతుర్లకు వివాహము చేసాను
ఈ వయసులో చేతిలో డబ్బుల్లేక భాద వ్యక్త పరుస్తున్నాను 




ఎందుకులే నీకు శ్రమ నేను మావిడ కలసి వస్తాం 
మీరంతగా చూడాలని పిస్తే పిల్లలను కూడా తెస్తాం 
మా ఫామ్లికి సంభందించిన ఫోటోలు కూడా తెస్తాం 
కానీ మీరు రావద్దు, మరీ మరీ కోరుకొనే మీ నేస్తం  

చిన్న  పిల్లలంటే నాకెంతో ఇష్టం అని నీకు తెలుసు కదా 
మనవళ్ళతో సరదాగా ఆడు కోవాలని మాకు ఉంది కదా 
ఇక్కడ పిల్లలను చూసి సరదా మీరు  పడవచ్చు కదా 
నీ పిల్లలపై స్వతంత్రం ఉంటుంది పరాయి పిల్లలపై ఉంటుందా 

మా అడ్రస్సు మీకు చెప్పి మిమ్మల్ని భాధపెట్టలేము 
సందుల్లో విశాలమైన మైదానములో  ఉన్న భవనము 
దానిని పెద్దలకు బంగారు భవిషత్ చూపె వృద్ధా శ్రమము 
దేవుని కృపవల్ల కొడుకులు కూతుర్లు ఉన్నా ఇక్కడే ఉన్నాము 

కొన్నాళ్ళు నేను మాఆవిడ కొడుకులు ఇళ్ళల్లో ఉన్నాము 
మరి కోన్నాళ్ళు కూతుర్ల వద్ద కాలం వెల్ల బుచ్చాము   
పనిచేసి నంతకాలం ఎవరూ వేలెత్తి చూపలేదు మమ్ము 
వయస్సు పెరగడం వళ్ళ కొంత వచ్చింది అనారోగ్యము 

మేము స్వేచ్చగా జీవిమ్చాలని తలంచి బయటకొచ్చాము 
మాకున్న దానిలో మేము కొడుకులకు కూతుర్లకు పంచాము 
ధనం ఉంటే వృద్ధాశ్రమములో కట్టి దేవున్ని వెడుకుంటున్నాము 
నా భాధలు నా కొడుకులకు కూతుర్లకు రాకూడదని అంటున్నా 

నోరున్న జీవులైన నాకు ఆత్మీయులు కారు 
ఎ విషయములో సహాయము చేయుటకు రారు   
మేము వద్దంటే మీరు చేరారు అందరూ అన్నారు 
వేలకు తిండి కంటి నిండా నిద్ర దొరుకుతుంది ఆశ్రమంలో  

నేనొకటి నీకు చెప్పదలచు కున్నా 
నేను అనాధనే నా అన్నవారు ఉన్నా
నా దగ్గరకు రావద్దని వేడు కుంటున్నా
ఒకరి భాధను పంచుకొనే శక్తి నాకు లేదన్న    

నోరులేని మూగజీవులే నీకు అనుభంధాలు 
ప్రకృతి ఇచ్చే  చల్ల గాలులే మీ సొంతాలు 
ఫలించు పుష్పాలు కాయగూరలు మీనేస్తాలు 
ఇతరులకు సహాయ పడటమే మీకున్న ధైర్యాలు 




సత్యం చెప్పిన కధ విని కల్లవెంబడి  నీరు వచ్చింది ఆదంపతులకు 
అన్నయ్యగారు మీ భార్యను తీసుకొని ఎప్పుడైనా రావచ్చు, ఇది మీ 
పుట్టిల్లు అనుకోండి మాకు ఎవరూ తోడూ లేరు మీరు ఎప్పుడైనా రావచ్చు   
ఆ శ్రీ కృష్ణ భగవానుణ్ణి ఆరాధిస్తూ మాధవసేవే మానవసేవే అని జీవిద్దామ్                                                     




 .............................

22, డిసెంబర్ 2013, ఆదివారం

98. Love Story-2 ( మెసేజ్ పెళ్లి ) ***

ఓంశ్రీరాం శ్రీ మాత్రేనమ:- చిన్న కధలు 
(ఆనందం - అనారోగ్యం - ఆధ్యాత్మికం ) 

మెసేజ్ పెళ్లి

మాష్టర్ డిగ్రి తర్వాత పి. హెచ్. డి. పొందిన మనిపూస,
యాడాదిగా సైన్స్ లేక్చిరర్గా పని చేస్తున్నా శ్రీనివాస
తల్లితండ్రులు పోగొట్టుకున్న పిన్నిదగ్గర పెరిగిన పూస
శ్రీనివాసుకు పెళ్లి చేయాలని బాబాయి కలిగింది ఆశ 

 

అమ్మాయి బాగుండటంవల్ల నీ సరి జోడని భావించా
నా మాట కాదనవని అమ్మాయ ఫోటో ఇందు  ఉంచా   
మీ అమ్మకు నచ్చిందని వివాహము నిశ్చ ఇంచా
నా మాట కాదన వని పెళ్లి లగ్నం కూడా  పెట్టించా

అమ్మాయి ఫోటో చూసి మెసేజ్ ద్వారా అభిప్రాయాలు
తెలుసుకోవాలని ఉంటే తెలుసుకో, పెళ్ళంటే నూరెళ్ళ పంట

ఫోటోను చూసి పెల్లిచూపులు లేకుండా వప్పుకున్నావా
పెద్దలు అన్నారని మనసు చంపుకొని   తల వంచావా
నా రంగు కాకి కన్నా నలుపు నీకు తెలిసి వప్పుకున్నావా
 నీఇష్టానికి వ్యతరేకంగా వత్తిడిచేయను వద్దంటే పెళ్లి ఆపుతా

 

మీవ్యక్తిత్వమ్,నిజాఇతీ మెచ్చి మోసగిమ్చక నిజం చెపుతున్నా
నా రంగు కూడ నలుపు, రమ్గులుదీద్దిన ఫోటోను పంపారనివిన్నా      
నాశరీరఛాయ ఇష్టపడక పొతే రంగున్న అమ్మాయిని చేసుకోమన్నా
ఉద్యగం ఉంది అని తలవంచా మీకు ఇష్టం లేకపోతె వద్దని చెప్పండి


అందమైన భార్య కావాలని అనుకున్న,అది తెలివి తక్కువ పనిఅని గ్రహించా 
నలుపు అనేది కాదు,  భర్త ప్రతిష్టను పెంచేదిగా ఉంటే  చాలని ఊహిమ్చా
నేను అధికముగా దూమపానము చేస్తా నీకు ముద్దు ఇవ్వవచ్చా
వాసనను భరిమ్చలేకపొతె, మానమంటేమానలేను పెళ్లి వద్దనిచెప్పొచ్చు 


తామ్బూలమ్ వేసుకున్న ఏమనను పొగాకు వాసనకు అలవాఅటుపడ్డ వాణ్ని 
ఖర్చులకు వెనుకాడను ఆధునిక అభిప్రాయా లూన్న స్త్రీని గౌరవిమ్చేవాడ్ని
నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నా ప్రేమను తిరస్కరించిన ప్రేమికున్ని
 నిద్రపట్టక క్లబ్బులవెమ్ట తిరుగుతాను, నీకు ఇష్టం లేకపోతె పెళ్లి వద్దని చెప్పు

 

మీరు క్లబ్బులవెమ్ట తిరిగిన మీశీలమ్ చేడదని తెలుసు, కాని నేనోకర్ని ప్రేమించా
డబ్బు, హోదా ఉన్న అందగాడు వినయ్ నాచుట్టు తిరిగి పెళ్లి అంటే ఆలోచించా  
పార్కులవెమ్ట, సినామాలకు వద్దన్నా ఇంట్లో వారికి తెలియకుండా సంచారిమ్చా 
వినయ్ పెద్దలకు భయపడి పెళ్లి ఇప్పుడొద్దమ్టె మీ సంభందం  కుదిరింది పెళ్లి వద్దని చెప్పు

మనమధ్య ఎ రహస్యాలు లేవు అందుకే నేను నిన్ను పద్మా అని పిలుస్తున్నా
ముక్యముగా నేనొక చదువు కున్న తీవ్ర వాదిని ప్రజలకొరకు పనిచేస్తున్నా
నలుగురిలో తిరిగినపుడు మందు త్రాగటం నా బలహీనత అని చెపుతున్నా
త్రాగు బోతు భర్త అని ఎవరన్నా  భాధ పడకూడదని ముందే చెపుతున్న

శ్రీను అని ఏకవచనముగా మాట్లాడినందుకు కోపంతెచ్చుకోకు
వినయ్ వచ్చి లేచి పోదామని చెప్పగా వప్పు కున్నాను
మన పెళ్లి కి ముందుగా మా పెళ్లి నిర్ణ ఇంచు కున్నాము          
న మెసేజ్ లద్వారా మిమ్ము ఇబ్బంది పెట్టితే క్షమించుము

 

మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు
నెతిబీరకాయలొ నేయి లేదనిఅమ్దరికీ తెలుసు
చెప్పిన నీ మాటలలో నిజము లేదని తెలుసు
అందుకే నేను ముందుగా  వస్తాను మరువకు 


ఆడవాళ్ళ మాటాలకు అర్ధాలే వేరు అని ఎవరో చెప్పారు
గంటకు తగ్గ బొంత అని సర్దుకు పోవాలని ఎవరో చెప్పారు
నిజా నిజాలు తెలుసుకొని మాటలాడాలని ఎవరో అన్నారు
ప్రత్యక్షముగా చూసి తెలుసుకుంటే మంచిది అని అన్నారు

బాబాయి పిన్ని చూసి ఎంతో సంతోష పడ్డాడు
పెళ్లి కూతురుని చూడాలని బయలు దేరాడు
ఒక వేపు పెళ్లి హడావిడి చూసి భయపడ్డాడు
పద్దుకు పెళ్లి అని అమ్దరూ అంటుంటే నమ్మాడు

బాబాయికి కబురు పంపాడు పెళ్లి కూతురుని చూడాలని
పిల్ల తండ్రి బాబాయితొ నిర్భయముగా మాట్లాడ వచ్చని
పెళ్లి కూతురును చూస్తు అనుమానంగా మీరు పద్మేనా
మెసేజి ఇచ్చిమ్దినేనే,ఉడికిమ్చడానికి నల్ల పిల్లన్నది నేనే





మీ ప్రేమ పెళ్లి ఎక్కడకోచ్చిమ్ది గాలిలో కలిసింది
మీ ప్రేమ ఎక్కడదాక వచ్చింది గంగలో కలిసింది
మీకు అలవాట్లు ఉన్నయోయని భయమేసింది       
డబ్బు పొదుపుగా ఖర్చు పెడతారని తెలిసింది 

నీవు  కొంటే పిల్ల లాగున్నావు అల్లరి పెట్టావు
మీరెమన్న తక్కువతిన్నారా నన్ను భయపెట్టావు
ఏది ఏమైనా ఇరువురి అభిప్రాయలు ఎకమైనాఇ
పెద్దల దీవనలతొ పెల్లి జరుగుట తరువాయి

నేను చదువు కోవాలని ఉంది చది విస్తారా
ఈ రోజే క్రొత్త పాఠాలు ఏమైనా చెప్పమంటావా
అంతపని చేయకు మహాప్రభు చూట్టాల ముందు
ఐతే పెళ్లి అయ్య్యాక  చెపుతానులే ప్రత్యక పాఠాలు

కాబోయే సహధర్మచారిణి చూసి వర్నిమ్చుకుమ్టు
అమ్రుతవర్షినివి నీవు, ఆనంద నిర్ఘరిణివి నీవు
దివ్యలోక సుమ్దరివినీవు, నా జన్మ తరిఇంపవచ్చావు

చిరుసిగ్గు మెలకల సుహాసిణివి నీవు
మరుమల్లె సువాసన సుఘంధణివి నీవు
చారు శీతల సుధా సౌదమణివి నీవు          
మన్నస్సులో ఉన్న హ్రుదయ్యెస్వ
రివి నీవు                                                           


పాటపాడు కుమ్టూ ఒక్క సారి మంచం మీదనుంచి క్రిందకు పడ్డాడు 
ఇదంతా కల నిజాము కాదా అంటు దులుపుకుమ్టూ లేచాడు
బయట శబ్దం విని లేచి తలుపు తీయగా బాబాయి వచ్చి ఏమిటిరా
పగటి కళలు కంటున్నావా అదేంటి బాబాయి అలా అంటావు,

మీ వయస్సులో ఉన్నవారు కలలు కంటారు
నీకు నచ్చుతుందని ఈ అమ్మాయితో నీకు పెళ్లి నిశ్చఇంచా
ఒక్కసారి ఫోటో చూసి మెసేజి పెట్టి వివరాలు కనుక్కో
ఫోటో ను చూసి నవ్వులే నవ్వులు నాకలల  సుందరి  


                                         

    ........................................................................................................................................................................

21, డిసెంబర్ 2013, శనివారం

97. Romantic Love Story-1(ఆకర్షణ )

                          
ఆకర్షణ

ప్రకృతి  దృశ్యాలు చూడనెంచి కాళ్ళు కదిపే  
చినుకులు రాలగ జలదరించి వళ్ళు  తడిసే
జలాశయమున కమలము మనసు కుదిపే
కమలాన్ని  అందు కోవాలని ఆరాటం పెరిగే

కడు  విశాల   నేత్రములు  కలిగి  నట్టి     
కను విందు  చెస్తూ కదులు తున్నట్టి 
జలక మాడుతున్న జలకన్య కాబట్టి
కన్య సౌందర్యం చూసి నామతి చెడింది 

కన్య  సౌందర్యం  వర్ణింప  నా   తరమా 
సుందర  ప్రభ వలే  ఉన్న చెందమామా 
బరువైన పిరుదులపైఉన్న కేశజాలమా   
బరువుతో కదులుతున్న వక్షోజాలము 

కవ్వించే హృదయం గాలిలో  తేలగా 
బంగారు వర్ణం  మదిలో    నిలువగా
ఆకర్షించే నేత్రములు త్రిప్పు చుండగా 
బ్రహ్మకైన భామను చూస్తే తిక్కరేగుతుంది 

ఒడ్డున చేరిన జవరాలు వంగి వంగి చీర కట్టి 
పాలిండ్లపై   పావడాను  ఊపి ఊపి  ఆర బెట్టి
వయ్యారంగా నడుంపెట్టి ముఖంపై బొట్టు పెట్టి
జలములో ముఖం చూసుకొని నవ్వు కుంది 

చెట్టు చాటున  అంతా  చూసి  ఉండ  బట్ట   లేక
వంపుసొంపు నడకచూసి తపనకు తట్టుకోలేక
భువి  నుండి  దివికి   వచ్చిన నవరత్న మాలిక 
దరిచేరి   ఆమెను   పలకరించే మనసు నిలవక   
        
హే   లావాన్య  ఎవరి బిడ్డవు ఎచ్చట  ఉందువు 
నా  కంటికి నీవు సుకమార   సుందర వనితవు
ఇది స్వప్నము కాదు ప్రత్యక్ష శృంగార దేవతవు   
యవ్వనంలో ఉన్న బ్రాహ్మణ పుత్రిక ఐ ఉందువు 

తాపసి   గారాల   ముద్దు   బిడ్డవను   కున్నాను
దేహకాంతి చూసి ఆగలేక నీముందుకు వచ్చాను
మనసులో ఉన్న కోరికను తెలియ పరుస్తున్నాను
చిరునవ్వుతో   మాట్లాడితే   ముత్యాలు   రాలునా

మందహాసపు మాటలు వినాలని ఉంది
విశ్వమంత విశాల హ్రుదయము ఉంది
కోకిల గానంతో వరుస కలపాలని ఉంది
చిలుక పలుకుల చిన్నారి మాటలు రావా

సుధలు   చిందు   నధరాలు కదలాడ
బిడియ   మేళ    విన్న  వించు జాడ
మదిని శాంత పరుచు నివసించు వాడ
మాటలాడక నా హృదయంలో పెంచకు దడ

మౌనమేల వహింతువు  మనసు చెప్పు మాలినీ
వచ్చి నాను నీవెంట,  పలకవు అందాల భామినీ
నన్ను గానక, వేగంగా నడుస్తున్నావు సునయనీ
వేడుకొందును,  మనసు తెలుపవా కామిని

నా మీద నీకు  జాలి   కలుగుట లేదా
అలుక మానుటకు నీకు ఏమి చెప్పేదా
నా మదిలో మెదిలిన   కోరిక తెలిపెదా
కన్య వైనచో నీతొడు నేనే ఉండాలి సదా

పుడమి   పై   ఇంద్ర  భవనము    నిర్మించేదను
వజ్ర   వైఢూర్యముల  తొ  నగలు  చేయించేదను
సుందర ప్రాంతములు నిత్యమూ చూపించెదను
లలనా కష్ట పెట్టకుండా నిన్ను  సుఖ పెట్టగలను


నీ మదిలో మెదిలిన  కాంక్షను  తీర్చెదను 
నీ   అడుగు  జాడలలో నడుచు కొందును 
నీ హృదయమును సంతసింప చేయుదును       
నీవు నామనసు అర్ధం చేసుకొని పలుకుము 

                                                               



కుటీరము చేరిన వనిత కను సైగ చేసి లోనికి రమ్మనె
అందున్నవి సర్ది ఉచితాసనము ఏర్పాటు చేసి కూర్చొమనె  
మంచములో  ఉన్న  మనుజుని  చూపి  నా భర్తని  చెప్పె
చల్లార్చిన పాలు  చేతపట్టి  అతనికి  ఆమె  తాగిమ్చె

ఆమె నాసీనురాలయ్యె   అతని చెంతన 
మగధీరుడతడు  నామది మెచ్చి దోచిన
బ్రహ్మాన కుటుంబములో  పుట్టినందున 
ప్రతిరోజూ ఉల్లాసముగా తిరిగేవారము జగాన 

మా అయన పేరుఆంజనేయ అందరూ పిలుస్తారు అంజి 
పట్టణానికి పోయి బ్రతకాలని చేరే గంజి 
మాఆయనకు యాక్సిడెంటు జరిగింది అబ్దుల్ గంజి 
హాస్పటల్లో చేర్చగా నడుము మాత్రము లేవదు అని చెప్పె 

డాక్టర్ మాత్రము పరీక్ష చేసి ప్రాణగండం తప్పిందని 
అందరూ అన్నారు పసుపు కుంకుమ నిలబడ్డాయని    
మాగళ్యం ముందు మరణం  కనుచూపులొ  లేదని
ఆరోగ్యము కొరకు అనేక మందులు వాడుతున్నానని   

ఆనాటి    నుండి  మ్రోక్కని  దేవత  లేదు 
పసరు మందు నూనె వ్రాయని రోజు లేదు 
అన్నా నీవు డాక్టర్ ఐతే చెప్పు మంచి మందు 
ఆశతొ బ్రతుకుతున్న భర్తరోగం నయం చేయాలని 

పల్లె పడచు కాదు ఈమె జీవిత వినత శీల 
మాంగల్య  బలంతో బ్రతుకుతుంది ఈవెళ 
తప్పుతెలుసుకున్నాను వర్నిమ్చకూడదు శృంగార కళ 
వ్యామోహం అనేది నాకు ఒక పీడ కళ



పతిని   వీడక  కాలం వెల్ల పుచ్చు చుంటిని 
జన్మాంతర  పాపమని  భావించు  చుంటిని
పాపముచేయక బ్రతకోసం బ్రతుకుచుంటిని   
దేవుడు కరుణిస్తాడని ఆశతొజీవిమ్చు చుంటిని 

పొమ్మనక భర్త కధ చెప్పి కళ్ళు   తెరిపించే
స్త్రీని చూసి కోరికపెమ్చుకోవటం నాదే తప్పు 
మంచివైద్యునికి చూపమని  సలహా  ఇచ్చే 
తనవద్ద ఉన్న కొంత పైకము ఇచ్చి వెనుతిరిగె

నాధుని   ప్రాణము  కాపాడుట  ధర్మమని తలచె
ప్రాణముంన్నంతవరకు పతిసేవ పరమార్ధమని భావించే    
శరీరసుఖముకన్న ప్రేమ భంధము ముఖ్యమని తలచె  
నా ప్రవర్తన నీ మనస్సును నొప్పిస్తే శిక్షకు భాద్యురాలను 

సావిత్రి పతి ప్రాణములు యమునితో పోరాడి సాధించలేదా 
సుమతి పతి శాపవిముక్తి కల్పించి పంతము నేరవేర్చుకోలేదా 
సుకన్య పతి అంధత్వం తొలగించి   సుమ్దరునిగా చేయలేదా 
అనసూయ త్రిమూర్తులను పిల్లలుగా మార్చి ఆడిమ్చలేదా

చెల్లి నా తప్పు తెలుసు కున్నాను అన్నగా సహాయపడతాను 
పర స్త్రీలను తల్లిగా, అక్కగా,  చెల్లిగా,  గోరవిమ్చి  ఆదరిస్తాను
నీభర్త క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను కూడా ప్రార్ధిస్తాను 
నేను చేసిన వెకిల చేష్టలన్నీ క్షేమిమ్చుము చెల్లి 



పడక కూర్చీలొ పడుకొని సువర్చల పగటి కల కంటుంది 
అమ్మా అని శిరీష  పిలుపుకు  ఒక్కసారి నిద్రలేచింది   
నిద్రలోకూడా  గతస్మృతులు గుర్తుకు తెచ్చుకొని భాదెమ్దుకుభాదెమ్దుకు ఈ ఆంజనేయులు ఒక్క గంతు వేసాడంటే 
 

ఒక్కటే నవ్వులు, నవ్వులు మీద నవ్వులు  
     " ఆకర్షణ కన్నా - ప్రేమ భంధం మిన్నా "