25, ఆగస్టు 2021, బుధవారం

ఓం శ్రీరామ .. ఓం శ్రీ మాత్రేనమ:.. ఓం శ్రీ ఆంజనేయ :


తొలిగ పొద్దు మేలు తొలుత చూడు తల్లి రాత్రి హాయి గొలుపు  
తొలిగ కాంతి ఆశ తొలుత మెరుపు తల్లి  సద్దు మనసు తలపు 
తొలిగ సేవ నిత్య తొలుత మేలు తల్లి మాయ నందు  గెలుపు 
తొలిగ  పూజ భక్తి తొలుత తలపు తల్లి  మనసు ఆంజనేయ  ..1

తొలిగ వేళ వెచ్చ తొలుత ధనము తల్లి , నీడ చల్ల దనము 
తొలిగ గంధ పచ్చ  దనము ఇచ్చు తల్లి  మౌన సేవ తనము 
తొలిగ హంస పంచు దనము సేవ తల్లి  హంస ప్రేమ తనము      
తొలిగ వంట ఇచ్చు తనము వెచ్చ తనము పంచు ఆంజనేయ ..2

తొలిగ తృప్తి జరుగు తనము చూపు తల్లి  మాయ తొలుగు తనము 
తొలిగ ఆశ మనసు తనము తెల్పు తల్లి  పండు మెరుపు తనము 
తొలిగ రోజు కధలు తనము చెప్పు తల్లి , మోజు మరుపు తనము 
తోలిగ సుఖము తనము తలపు తీరు తనము  కళల ఆంజనేయ.3

 వరము పొందుటకై వసుధ యందు నేను నిత్యమూ పూజలే 
శరణ మని కోరితి శక్తి పొంద దలిచి నిగ్రహమ్ము గాను 
సిరుల పొందుటకే శ్రీని కోరుచుంటి నిష్ట తోడ నిన్ను 
కరువు చూడవయ్య కాల మాయనుండి రక్ష ఆంజనేయ....4

బలము గర్వ మవ్వు బాధ తోడు గుండు వక్ర బుద్ధి పెరిగె 
పలుక చున్న యెపుడు పరుష వాక్కు లన్ని బుద్ధి లేని బతుకు 
కలుగు చున్న బాధ కష్టములమీదనే జీవిగా ను ఉన్న 
బలము ధనము కొరకు బంధమును మరువను చెలిమిఆంజనేయ.5

మంచి మార్గమే మనసు తట్టి చెప్పు మనుషులలో శక్తి 
ఎంచు కొనేటిదే ఏది అయిన నన్ను మనసు చుట్టు తిప్పు 
పంచు కొను ప్రేమ పరవశింప చేయు జనుల కెపుడు 
మంచు లాగ కరుగు మనసు నాది భయము మాపు ఆంజనేయ ..6

చేసి నా మేలును చెప్ప లేను ఎపుడు చేత కాని వాడ్ని 
చేసెడి పనులన్ని చేత లన్ని చూపి జగతి తెలుపు పిలుపు 
వేసెడి అడుగులే వయసు బట్టి సాగి వరద నాపలేను
మోసెడి బరువులే మనసు మార్చుటనే తెల్పు ఆంజనేయ..7

వేల చూడె వేట వెలుగు లేని ఆట వరుస మారె బతుకె
ఏలు బడియు లేక ఏక మలుపు కాక తారు మారు లేకె
మలుపు ఆశ చిట్ట ఎవరి దశకు పట్టు కదలె కలల చిట్టె
గెలుపు ఓటమియే గాల మగుటయేన తెల్పు ఆంజనేయ..8

కనులు కనిపించే కమల నయన వేల్పు కనికరమ్ము గాను
చినుకు కర్తవ్యము కడుపు లోన ఉంచె పుడమి లక్ష్యమయ్యె
మినుకు మంటు వెలుగు మనసు మార్చు తీరు మాట నేర్పు పలుకు
కనివిని యెరుంగని కాల మాయలన్ని తెల్పు ఆంజనేయ..9

తరుణ ముంది తెరలు తెరలుగా ను కమ్మె చిన్ని చిట్కాలులె
కరుణ చూపదలచి  గాధలన్ని తెలిపి యదలొ ప్రణయ మొసగి
చరణములను తాకి చరిత నంత తెలిపి తెగువ చూపదలిచె
మారు పల్కలేను మేలు చేయు దిశయు తెల్పు ఆంజనేయ..10

ఏమహద్భాగ్యం ఏ కృపా కటాక్ష మ్ము నన్ను వెంటాడెనె
ఏమిపుణ్య ఫలము ఏది పూజ్య మగునొ తెలియ ని వాడినే
ఏది బంధమౌను ఏది భక్తి యౌను ఎవ్వరూ చెప్పరె
ఏపద సంపదో ఏకళల లీలయొ తెల్పు ఆంజనేయ.....11

ఎంత మాత్రమ్మే ఎవ్వరు తలచినా శక్తి నిచ్చు టయే

అంత మాత్రమ్మే అశలు తీర్చినా యుక్తి పెంచుటయే

సొంత మన్నాదే శాంతి నివ్వాదే రక్తి పెంచుటయే

వింత భావ మ్మే విశ్వ మందేనులె ఏల ఆంజనేయ....12


కర్మ సిద్ధాంతం కాలనిర్ణయమ్ము కదలేప్రాణికె

కర్మతో ఆగే కళల సాధ్యమ్మే కలసె బతుకు లీల

కర్మ అంటకయే కలలు తీర్చుటయే ఆత్మ సాధనయే

కర్మ భుక్తి ముక్తి కాల శక్తి యుక్తి తెల్పు ఆంజనేయ.....13


జీవితం పరిణత జీవ పోరాటం బట్టి యుండు చుండు

జీవ పరమానవు చింత చేరు చుండి సేతు సముద్రమ్మే

జీవ లక్ష్యమ్మే జపము జరుగుచునే జాతి భావ ముంచె

జీవ వైవిధ్య మె జాతి కేమి సబబు తెల్పు ఆంజనేయ....14


మరక మట్టి లోన మేను లోన లేదు మనసు లోన వుంది

తరక లాగ కదలి తారుమారు అగుట సహజ మల్లు చుండు

గురక నిద్ర లోన గాలి లాగ వచ్చు గళము కాదు అదియు

అరక పట్టి దున్నె ఆశ ఆరోగ్యము తెల్పు ఆంజనేయ.....15


వీలయి నంతయే వేదన చెందకయె మనిషి లోక మందు

మేలు సంఘర్షణ పుడమి ఆకర్షణ జరుగు లోక మిదియు

గాలి లాగచేరి గళము విప్పి తెలుపు జగతి నందు నీతి

జాలి జీవితమే చేరు వయ్యెజతకు తెల్పు ఆంజనేయ...16


 అక్షర సత్యమై ఆదుకొను లోకం ఉంది మనకు తోడు

అక్షరాలు బోని ఆశ పెంచి ఏలు అలుక తీర్చు కొలువు

అక్షరుడుగ మనసు అభిమతం తెలుపే జీవ సాంస్కృతిక యె

కక్ష సాధింపులు కలలు లేని జగతి నుంచు ఆంజనేయ..17


నిత్య చైతన్యము నన్ను కబలిస్తుంది దివ్య వెలుగు లాగ

సత్య ధర్మాలను సూత్ర మగుటయేను సర్వ రక్షణగా

తత్వ భావములే తురుము తమస్సునే నురగ లాగ కలుగు

మత్తు పెర్గేనులె మదినలిగేను లే విధియె ఆంజనేయ..18


స్థూల శరీరమే శాంతి పవిత్రమై పాప రహిత కొలుపు 

మూల పాపముయే పుడమి నందు పెరిగి గాఢ నిద్ర పెరుగు 

తెల్ల వారుజాము తేట తల్ల మగును బ్రహ్మ ముహూర్తమగు 

యెల్లఁ సుఖము నిచ్చు యదలొ హాయి గొలుపు నిత్య ఆంజనేయ.19


స్థూల శరీరమే సోమరితనమ్మే లేక బద్ధకమ్ము 

కాల సన్నద్ధము ఉత్సవంగ మారు పనులలో శ్రద్దా 

తాల లేక బతుకు దారి దొరక కుండు పెరుగు సన్నద్ధత 

వేళ ఉత్సాహం వాద సన్నద్ధం తెల్పు ఆంజనేయ..20


 జగతి లోన నిజము చేత కాని దగును, ధర్మ పధము లేదు  

ప్రగతి జీవితమ్ము పాప మగుచు మారు, చెప్పఁ నలవి కాదు  

సుగతి జూపుటమే సూత్ర మగును ఏల, మనిషి ఘనుడీశుడు

మూగ బతుకు మార్చి మమత పంచు, చెలిమి తెల్పు, ఆంజనేయ .21


లోకసేవకొరకు లోకులకు మేలుగ సర్వమును తెల్పే  

భీక రమ్ముగాను భయము పెరుగుచుండి జనుల కష్ట మొచ్చె 

స్వీక రించి చెప్పి సూత్ర ములను తెలిపి బుద్ధి వికసించే 

ఐక్య మత్యముగా ఐక్య తపెంచుటే తెల్పు ఆంజనేయ..22


పెద్ద చిన్న కలసి ప్రీతి గొలుపు పలుకు మేలు కలుగునెపుడు

వద్దని చెప్పినా వాదన చేసియే నిజము తెల్ప గలిగె 

విద్య నేర్చ గలిగి విధిని నమ్మి బతుకు సాగ గలిగి బుద్ధి 

గద్దె నెక్కె గలగి  గళము విప్పి చెప్పె పఠన ఆంజనేయ ...... 23


కరుణ రసము కొరకు కమ్మని రచన చేసి రామ గాధ తెలిపె  

మరల శక్తి కొరకు మరువ లేని బతుకు యుక్తి రామ తెలపె  

చెరకు కన్నతీపి చక్కనైన రామ నామ భజన మలుపె  

అరుణ ఉదయ మల్లె ఆర్తిగా రామా అనే ఆంజనేయ  . ...... 24


చెలిమి లోనవుంది చెలియ తలపు పిలుపు మనసు గెలుపు కొఱకు 

కలిమి నిచ్చి నిలుపు కాల మాయ గెలిచి సహన మంతె చూపు 

బలము నింపి నడుపు భాగ్య సీమ నంత శోభ నిచ్చె వెలుగు 

కాలము వ్రాతలు కధలు తెల్పు చున్న నేను ఆంజనేయ  ..... 25


భయము లన్ని తొలిగి బలము చేకూరియు భద్రత కలుగు టే 

గేయ రామ నామము గానముగా పాడు గమ్యము తెల్పుటే 

మాయ లెమియు చూపు మమత లందు నిలిపె మానవత్వముగా 

చేయగల పనులే చేయు బతుకు నేర్పు భక్త ఆంజనేయ  .... 26


మంచి చెడ్డ కలసి బెడ్డలతొ బియ్యము బ్రాంతి మనసు మార్చి  

ఉచిత అనుచితమై ఊరు ఏకమవు ట సఖ్యత తెలుపు టే 

యాచన ఫలితమే యోచన చక్రమై సర్వము రక్ష గా 

మచ్చిక వల్లనే మహిమ చూపగలుగు మహిమ ఆంజనేయ .... 27


గుండె నిండ భక్తి కళలు మాకు నింపు చిత్త గించగలను 

దండ మెట్టి చెప్పె కోరిక లన్నిటీ, తొందర గా తీర్చు

మొండె బతుకు లోను మనిషి పంతముండు, మాట నేర్పు బట్టి  

అండగాఉంటా ఆశ తీర్చి శక్తి నిచ్చు ఆంజనేయ  ...... .... . 28


అర్ధము అక్షరం అవ్వ నేర్పేనులె భావ పదాలుగా

పరువు చెప్పు కధలు కవిత కమ్మదనమె పూల సుగంధమై

తరువు లాగ చెలియ తరతమ భేధమే చూపని ప్రేమయె

భీరు చెందకయే భక్తి తోడు నీడ మనసె ఆంజనేయ  ... .... 29


విశ్వ మందు కళల విద్య విజ్ఞానం విజయ మూల్యమవ్వు

దృశ్యకాలు వెనుక ధర్మ చరిత ముండు అర్ధ మంత తెలుపు

లాశ్యమాడు మనిషి లలిత మర్గాల్లో లోకము పాలించు

విశ్వ మాత కరుణ వినయ విధేయతలు తెల్పు ఆంజనేయ ... .30


పూనకమ్ము వోలె భక్తి పొంగి పొర్లు జ్ఞాన జిజ్ఞాసి గ

ఆన తిచ్చి మనిషి అడుగు వేయు చుండు అర్ధసత్యముగా 

మాన మర్యాదలు మానవత్వమ్ము న నిలిపి చెలిమి పంచు 

గాన మాధుర్యము కాల మాయలందు  ఉండె ఆంజనేయ ... 31


 కోరికలు తీరుట కోసివేయుటయే దేహం భాగమే

కోరుకున్న ఫలము కరిగి పోవు టగును జీవ సమయ ముందు

వారు చేసారని వారిమనసు వుండి ఆత్మ తృప్తి చెందు

వీరును తెల్పినా వారు అన్న జీవి మార్చు ఆంజనేయ.....32


 బాధ్యత ఉందిలె భద్రత భారమై భాగ్యము నీడగా

సేద్యపు లక్ష్యము సకల రక్షణకే సమర సంతృప్తే

సాధ్యమైనంత యు సేవభావముగా నిత్య సత్య పలుకు

విద్య ఉద్యోగం ఉన్నవారి తృప్తి తీర్చు ఆంజనేయ.......33

5




దాఁచుకొనను నేను దండమునే చేయు పాదముల చెంతనె

దోచు కొను సర్వము తోడుగా ఉన్నా నీకు సేవకడ్ని

ఆచితూచి అడుగు అనకు దేహమ్మే నీది ఈజన్మకు 

పూఁచి నీకీరితి పొదుపు మారదయ్యె అయ్య ఆంజనేయ ...34


వొక్క సంకీర్తన  వొద్దికైమిమ్మును వేడు కొంటినిగా

తక్కినవి నామనసు దాఁచి  వుంచి నిత్య వేడుకలు చేసితి

వొెక్కనీనామం వేలుసులభముగా ఫలము మధికముగా

దిక్కై నీవుగాను తెలియచేస్తున్నాను మ్రోక్కె ఆంజనేయ ..35


నా మనసు గర్వము  నీ మహిమకొనియా డేను ఓప్పుకొనుము

నేమి స్వాతంత్ర్యము నిన్ను వేడు కొనుచు చెప్పినవాఁడఁ గను

నే మనబడేనులె నేరము లెంచకుము నామదితలపుయే

శ్రీమధవననునే  రామభక్తుడున్ని దాస ఆంజనేయ....36


భగవతే మునాయ ఫల్గుణప్రియాయ ధర్మ తత్వాయే

పింగకేశాయా  పుణ్యవీరాయే పుండరీకాక్షా

జగతి సూరాయే జగతి ఈశ్వరాయె జనుల భాగ్య దాయె

జాగృతి వీరాయె చతుర కపీంద్రాయె నమః ఆంజనేయ..37


వాయు పుత్ర రుద్ర వాక్య తెల్పు నేత్ర సర్వ రక్ష ధాత్రి   

జయము తో అనఘాయ చరితతో అజరాయ గ్రామ వాసాయే 

భయ జనాశ్రయాయ భద్ర వరదాయే భాగ్య సూరాయే

జయ సనాతనాయ జయమగు వాగ్మినే జయము ఆంజనేయ.38


రంగు రంగులలో రమ్యమైన రంగు తెలుపు నలుపు మలుపు

హంగు ఆర్భాటం హాస్య నట ప్రేమ రంగవల్లి రంగు

మెగ్గ అని తుంపకు పుడమి తల్లి భాధ పెట్టు టెందుకుయే

రంగరించి రాసి రంగు హోళిగాను జూడు ఆంజనేయ..30


 దేహ పదార్థమే తల్లిదండ్రులతో ఏర్పడగలిగేను 

మనసు పదార్థమే మనసమాజమ్మే దగ్గర నుండియే

 బుద్ధి పదార్థమే మా గత జన్మలే జీవ వైవిధ్యం

ఆత్మ పదార్థమే సృష్టికర్త దారి తెల్పె ఆంజనేయ...40


అకట కష్టా లే కడలి పొంగు గాను కోర్కలు గుట్టునే

సకల ఆశలన్ని అడుగు లల్లె కదిలి ఏక్కి దిగవలెను లె

ఒకటి అనుకొంటే ఒకటి పొందుటయే లోక సహజముగా

చీకటి బతుకలో జాతి కి వెల్గునే పంచు ఆంజనేయ..41


పట్టు బట్టకట్టి పుడమి పాదమ్మే మ్రొక్కె భరత భూమి జనులు

చెట్టు నీడ చేరి వినయ భక్తితో ను కొద్ది నిద్ర చేసె

గుట్టు విప్పి చెప్పి గొంతు గొంతు కలిపి పాటలే పాడెను

ఒట్టుతో ప్రేమే ఒడిసిపట్టి మాట తెల్పె ఆంజనేయ..42


కడలినె కడవలో కాలమాయ చేరి ఉంచె బుధ్ధి ఇదియె

వడిలిన వయసైన వేడి ఆశ కుమ్మి బతుకు బుధ్ధి ఇదియె

మడిమ తిప్పి గొప్ప మేలు చేయగలిగి చేయ లేని బుధ్ధి

అడుగు తున్నా నే ఆటకాదు బుధ్ధి మార్చు ఆంజనేయ....43


స్మరహరడవేగా సఖ్యత చూపుమా మామదిలో ఉండి

జ్వరహరుడువేగా జాతి లోజ్వరాన్ని మాపవేమయ్యా

స్ధిరకరుడవేగా సకల చంచలాన్ని మార్చ వేమయ్యా

భరహర శరహరుడె పరవర శురవర హరహర ఆంజనేయ...44

ప్రాంజలి ప్రభ 


సంకుచిత స్వార్ధం సంఘటిక శక్తులే చంపు నని అంటే 

చీకు చింత లేని జాతి ధనము కొరకు యువత దృష్టి మార్చి  

వికట అట్ట హాస వీధిన రాజ్యమై ఏలు అధికారము  

డొక్కలు ఎండినా డప్పు కొట్టు వారు చూడు ఆంజనేయ .... ... 45 


చీర గాజులతో చీడ పురుగు లాగ జనులను దోచినా 

వారు వీరు కలసి వరుస కలిపి దొంగ లాగ దోచారులె 

పేరు మార్చి ఊరుమార్చి దోచు గుణము పట్టు వారు లేరు 

పరువు అని చుండే ప్రజల ధనము దోచె చూడు ఆంజనేయ ..46


నేను నుండి మనసు నటన భావ మేలు నిత్య ఆలోచన 

మేను శుద్ధి కొఱకు మాయ వచ్చి చేరి మనసు పరశీలన యె  

భాను కిరణ వెలుగు బాధ్యతను తెలిపే కార్య నిర్ణయమ్ము 

మనములో ప్రేమే మనుగడ మార్గమే ప్రేమ ఆంజనేయ .... ... 47


సజ్జనులై మెలుగి సేవ గుణము కలిగి భక్తి భావ ముంచు  

మజ్జిగ లో వెన్న ముద్ద తిరుగు నట్లు బుద్ధి మార్చ కుంచు  

విజ్ఞత కలిగి యే వినయ ముంచి విద్య నేర్ప కలిగి వుంచు  

యజ్ఞము లక్ష్యమూ యోగ విద్య నేర్పు ధ్యాన ఆంజనేయ ... .. 48


పాల లోన నీరు కాని రుచిని మార్చు బిడ్డ బతక నేర్పు 

బాలసుఁడగు వాని పొందు వలదు ర జీవి బతుకు మార్చు  

తాళ లేని వాని తపన చేయ బుద్ధి బావి లొ కప్పరా 

మేళ తాళ భజన పడచు భార్య భక్తి  చూడు ఆంజనేయ   ... .. 49


నేను అనను ఎపుడు నాది అనేదేది లేదు భక్తి తప్ప   

నేను సంకల్పము నాది వికల్పమే చేయ కర్మ తప్ప 

నేను బుద్ధి శుద్ధి నాది విచక్షణా జ్ఞాన సేవ తప్ప 

నేను చిత్త వృత్తి నాది వినయస్థితి యోగ ఆంజనేయ   ... ... 50


నిర్గుణా శివాయ నిర్మల హృద్యా య నిర్వి కల్పాయే  

ధర్మ రక్ష కాయ దాన ధర్మ చరిత నిర్వి కల్ప పురుష 

సర్వ అర్ధ విపుల కార్య వర్ణ సిద్ధ సూక్ష్మ దైవ రూప 

సూర్య శిష్య నిత్య సేవ ధర్మ మూర్తి నీవె ఆంజనేయ    ... ... 51   


కన్నుల రెప్పలే కాపలాదారు లు జగతి నంత చూడు

కన్నులు చూచేను కాల నిర్ణయమ్ము ప్రకృతి అందాలను

కన్న కలలు తీరు కళ్లు అలసి పోక అందమును జుర్రూ

కన్నులే మనసుకు కావడి కుండలే దృశ్య ఆంజనేయ ... ... 52


పెరుగుతున్న పాప మంత ఏల పోవు ధరణి యందు

విరుగుడు సేవలే వినయ పూర్వకమే భక్తి భావముంచె

జరుగు శుభకార్యం జాతి రక్ష గానె చేయు విధానమ్ము

కరిగి పోవు మనసు మాది సర్వ వేళ లందు ఆంజనేయ ... .. 53


మనసు కలత కలిగి మమత కల భాధగా బతుకు తెరువు మారె

తనువు తపన విరుపు తుదకు అతని కలే చినుకు చినుకు లాగె

మనము అను కొనుటే మానవత్వమే ను జీవసాహిత్యం

చినుకు లాగ కలిసి చలన మగును మనసు చూడు ఆంజనేయ ..54


పాప ఫలము లోన భాగముగొను భరత జనుల తీర్పు

చాప కింద నీరు జేరి కానరాదు గుణము తీరు మార్పు

ఓపలేని బతుకు ఓడిపో వలెనే కలిసి బతుకు నేర్పు

చూపును ప్రేమే చెప్ప నలివికాదు చెలిమి ఆంజనేయ ... ... 55

0

ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమః


సుఖపడ దలఁచి యే, సర్వము అర్పించే, మానవత్వమ్మే 

మక్కువ సత్కర్మ  మానమర్యాదలు, శాంతి తత్త్వమ్మే 

చుక్కల వెలుగులే చిక్క నీయకుండె, ధర్మతత్వమ్మే

మ్రొక్కు కొను భక్తీ, శక్తి నియ్య వయ్య ధర్మ ఆంజనేయ ....56


తత్వ విచారం తొ ధర్మ బుద్ధితోను, వికసితమగు చుండు     

తత్వ బుద్దులతో దు:ఖ ము రాకుండ, బద్దుడైన జీవి    

తత్వమే జగతిలొ దారి జూప గలదు ,నిర్మల బుద్ధిగా 

తత్వము విపత్తునె రాక ఆపు చుండు, రామ ఆంజనేయ  57


ఏది యుక్తమైన ఏది అయుక్తమై తెలుపుటలో గొప్ప

ఏది అర్ధముయో ఏది వాంఛితార్థ, తెల్పి లేక ఉన్న    

ఏది మహోత్తరము ఏది స0సారము, ఏది సాగరమో 

ఏది యోగమాయ ఏది మోక్షమిచ్చు, భక్త ఆంజనేయ ..58


నీటికి నిప్పు కే నటన తెలియని స్థితి, శిశివు తెలియని దశ

ఏటికి మనసులో ఏర్పాటే సమయం, తెలుసు కొను బా ల్యం

మేటి యవ్వనమే వయసు మంచి చెడుల, నడక జీవితమే

నేటి వార్ధక్యం నడకలు ప్రశ్న గ, సాధు ఆంజనేయ.....59


దేవుడే దిగియే ధైర్యము అందించి, ఆశలను తీర్చే 

దేవుని సేవలో దానము ఇచ్చినా, జనులు సంతసమ్ము 

దైవ కర్మ యనుచు ధర్మమును వదలక, యుక్తి తెల్పు చుండు 

దైవ మాయ ఇదియు దయను చూప దళిచె, భక్త ఆంజనేయ  60 


పొరల తెర ఆగదు, పోరు వల్ల బాధలు, ఆగని కెరటాలు

తిరుగు ఊహలేలు, దూరములు మారవు,  వెంబడించు గుణము 

మాఱుపల్కులలో మమత కాన రాదు, మహిమ అసలు కాదు 

చేర్చు గమ్యాన్నీ చావ వున్నవరకు, భక్త ఆంజనేయ .....61


మనిషి ఆలోచన మనసు బీజాలతొ కర్మ మోలకెత్తు

మనిషి కర్మ వల్ల మమత అలవాటును, ఫలము పొందగలిగె

మనిషి భవిషత్తే మనుగడ శీలమై, సుఖము కష్ట మయ్యె

మనిషి నరకంలో మనసు న స్వర్గం, ఏల ఆంజనేయ.....62


సద్గుణాలు వల్ల చల్ల నైన పలుకు, మనసు శాంతి గొలుపు

దుర్గుణాలు వల్ల దూర మంత పెరుగు,సహజ ధనము కరుగు

మార్గ మేదైనను మనసు పంచు గుణము, ధరణియందు శుభము

స్వర్గమే ప్రేమ మనిషి ఆరోగ్యం, ఇవ్వు ఆంజనేయ.......63


మాయ మయ్యె మనసు, మంద బుద్ధి వలన విశ్వమున చీకటి 

కాయ మున్న ఫలము కళలు లాగ కదులు, చేదు తీపి పొందు 

చేయ కల్గు పనులు చింత వళ్ళ ఆగు, కధయు మళ్ళి మొదలు 

మోయ లేని బతుకు పుడమికి భారమే, భక్త ఆంజనేయ .64


మాటతొ ఎడారిని మంచి వనము మార్చి, మనుగడ చూపమా

ఆటతొ సోమరినె యదను మార్చి ,ధైర్య వంతునిగ చేయుము

వేట ఏల నీకు వేడుకలు జరిగే, శిష్ట శిక్షణ గా

తోటలోని వాడ కోరికను తీర్చే, ఘణపు ఆంజనేయ...65


సర్వ రోగహరా సర్వ పాప హరా, నిన్ను నమ్మితి రా

సర్వశక్తి ఇమ్ము సర్వ భక్తి యిమ్ము ,రామదూత వుగా

కార్య సిద్ధి కొరకు కర్మ చేయు వరుకు, కరుణజూపు మయ్య

రామ సుగ్రీవుని, సీత, సంధాత్రే, భక్త ఆంజనేయ........66


ఓం శ్రీరామ ... శ్రీ మాత్రే నమ:


కాల మెప్పుడు నా కర్మ పట్టి లేదు కరకర ల చక్రం 

గోల యేల నాకు గతము మరచి నాను కనుల కన్నీరే 

వేళ ఐనది నాకు వెన్నెల కవిత్వం చెప్పు హాయిగుంది 

సుమధురపరిమళం సుఖపు కలయికగా మెచ్చు ఆంజనేయ ..67


స్వార్ధము వదిలేసి సకల సంతోషం కొరకు సేవ చేసి     

సర్వలకు ప్రేమ సహజ సంపదలే అందచేయ దలచి  

పరమ పధానికే పాటు పడే బుద్ధి సహన సహకార మది      

పేరు నాకు వలదు కరుణ చూపు గుణము ఉంచు ఆంజనేయ ..68


అందరికి, అక్షర ఆశ్రయ మిచ్చియు, సంపద నందించి 

అందరి మేలు గా అర్చన పూజలే, మమత మందారం 

అందరిలో శక్తి, అద్భుత బుద్ధిగా, మార్చు లక్ష్యముగా 

అందని పల్లకీ, మోస్తు బతుకు బండి ఉంది, రక్ష ఆంజనేయ..69


శ్రీ రఘరాము డే శ్రీ కరుణాకరుడు శృతజన పోషకడు

శ్రీ మధు సూధనే శ్రీ మతి ప్రియుడే యుక్తి శక్తి పరుడు

శ్రీ కపిశ్రేష్టాయ శ్రీ రమావల్లభ వేడు కొను చుంటిని

శ్రీ నృపేంద్రుడుగా రామ నామమే ను రక్ష ఆంజనేయ... 70


మనసు తో కలుస్తా మంత్ర మల్లె వుండి జగతి తీర్పు కొరకు

మనసు ఊహలలో మనుగడే ఊపిరి ఇచ్చి ఓర్పు చూపి

మనసు విప్పారిన మన్నన కన్నులే చిత్ర మాయ నేర్పు

జ్ఞాన సముపార్జన జ్ణాపకపు కళ జ్యోతి ఆంజనేయ ..... ....71


నాకు సుఖదుఃఖము నీడ లాగ వుండి నన్ను మార్చేందుకు

నన్ను పాపమ్మే నగ్న సత్య మ్మై నిద్ర పోనియ్యదు

నాలొ లాభంతో నష్ట నాట్యంతో వేదన సహజమే

నాలొ ధైర్యమ్మే నీదు కర్తవ్యం తెలుపు ఆంజనేయ ..... ... 72


వెన్న ముద్ద తినెడి వెన్ను చూపనట్టి వెన్నెల మనిషిగా

వేకువజామున వేద పఠన చేసి తిన్న బుధ్ధి తెలిపె

కన్నవారి లోని కమ్మ దనము తెలిసి సేవ చేయు చుండి

మన్ను తిన్న పాము మత్తు ఉన్న మనిషి మార్చు ఆంజనేయ .73


మార్పు గమ్యంగా మనసు లక్ష్యంగా చెలిమి బంధంవలె

ఓర్పు జయమ్మే గ వేద పరంగాను ధర్మ చరిత మగుటె

నేర్పు విజయమ్మే నేటి విద్య వలన తృప్తి కల్గించుటె

తీర్పు మాత్రమ్మే తేజరిల్లె గుణము తెల్పు ఆంజనేయ.... ... 74


నేను ముందు కదిలె, నటన కాదు ఇదియు శబ్ధ తరంగమై

నా అడుగలన్నీ నియమ నిబంధనలు కెరటము పరుగు వలె

నా కళ పుస్తకం నన్ను నడిపించే హృదయ ధర్మాలగు

నిన్ను నేను నమ్మి  శరణముగానె కోరె ఆంజనేయ  .... .... 75


నిప్పుల యెడారికి, నీటి చుక్క ఆశ ఆవిరి తో నీడ

ఉప్పు వేయు రుచికి ఉడుకు కూర ఆశ ఉనికి కోల్పోవుటె

తప్పుచే ఊపిరి తారు మారగుటే ఆశ ధనము వుంటె

ఒప్పు తనంతోను గరిక మోక్క ఆశ ఓర్పు ఆంజనేయ .... ... 76


ఉన్న లేకు న్నా, ఊరు మంచి కోరి, ఉదయ కిరణ మల్లె 

అన్ని సుద్ద న్నా, ఆశ మరవ కున్న, అదరము చూపేను  

ఎన్ని వద్ద న్నా, ఎదను పంచు చున్న, జీవితం సున్నా 

తిన్న తినకున్నా, దయయె చాలన్న అన్న ఆంజనేయ ... ... 77


2 Com

ఓం శ్రీ రామ ... ఓం శ్రీ మాత్రే నమ:.


జీవిత ధర్మమే, జీతభత్యాలు గ, సర్వ రక్షణగా

జీవ వైవిధ్యం, జయము నిర్ణయమే, ధర్మ మార్గంగా

జీవ శాస్త్రముగా, జనన మరణాలులె,  శివుని ఆజ్ఞలుగా

జీవ సాహిత్యం, హృదయ వాంఛ లేల, తెల్పు ఆంజనేయ......78


గడచి పోవు కలల, కాల పరిమితి యే, తొలగు జక్కగాను

అడుగు లన్ని కళల, ఆట మల్లె సాగి, నియమ సరళి గాను

గొడుగు లాగ ఉండి, గతులు తీర్చు విధము, సేవ పదము గాను

అడుగ లేని మనసు, వయసు బాధ వల్ల,  ధీర ఆంజనేయ..79


ఉప్పెనలో మనిషి ఉబికి వచ్చె భయము తోనుయె జీవితం

తప్పుల తడకగా తరతమ భేధమే ఓటమి జీవితం

నిప్పు ఎగసిపడే నిజము దేవుడెరుగు జాతక జీవితం

ఒప్పు కొన్న బతుకు ఒరిగి పోవకుండ చూడు ఆంజనేయ..80


వదిలె ధనేషణమె వైరము వదిలించె విషయ సేకరణే

వదిలె దారేషణ వింత అనుభవమే జీవ వైవిధ్యం

వదిలె పుత్రేషణ వినయ విధేయతలు ధార్మికత భావం

వదిలె ఆహార్యం వదిలె ఆరోగ్యం మాయె ఆంజనేయ..82


చేరు కున్నానులె చరణముల సేవలె వదలలేను నిన్ను

మారు పల్కు లేల మనసు పంచ గలను మాయ కమ్మి ఉన్న

రారు ఎవరెవరు ను రంగుల వల ఇదే మంచులా కరిగే

కోరలేను ఏమి మూగ మనసు నాది  భక్త ఆంజనేయ...83


ప్రేమయే  నిజమ్ము  పేదకు పెన్నిధీ బ్రతుకులో ధనమ్ము 

ప్రేమయే విపంచి మానస ప్రీతిగఁ బలుకును వెతలలో 

ప్రేమయే సరస్సు   విరిసెడు తామరే  నింకని పూలతో 

ప్రేమయే తపస్సు  విరహము వెలుంగే  చూడు ఆంజనేయ.....84 


ప్రేమయే జ్వాల లు పేరునీరుకారు పెదవి చినుకులుగా 

ప్రేమయే సహనము పెనువేయు నీడ కళలలో చీకటి   

ప్రేమయే విరహం మదిలొ పులకరింత మహిమ లాగా కరుగు 

ప్రేమయే సరసం మేహము తో కలయు భక్త ఆంజనేయ ...... 85


మనసు వేదాంతం మనసు ఏకాంతం మానవుని తత్త్వం  

మనసు రాద్ధాంతం మనసు గర్జనలే మానవుని వైనం 

తనువు శిద్ధాంతం తనువు అంగాంగం ప్రేమ దాసోహం

అణువు పరమాణువు ఆరనిమంటలే కదా ఆంజనేయ   .....86


మనిషి సంపాదన మనుగడ చుట్టూను కమ్ముకుంటుందిలె  

మనిషికి దానమ్ము మోక్ష సుఖ యాత్రకు దివ్య ఔషధమ్ము    

మనిషిని ప్రేమతొ మాయ బలముతోను చెలిమి తోను పొందు 

మనిషికి మమతలతొ మనసు వేధించును కదా ఆంజనేయ  ...87


మనిషి పలకరింపు పులకరింతలగును అవును ఆహ్వానం

మనిషి కరచాలన కల్లమెరుపులేలు నిత్య  ఆనందం

మనిషి గ ప్రపంచం మనుగడ కు మార్గం  మానవుని తత్వం   

మనసున ప్రేమలు మారని కొలువులే అగును ఆంజనేయ ....88

0 Com

ఓం శ్రీ రామ .. శ్రీ మాత్రే నమ:


సహన వాసమ్ముయె సౌమ్య సాంగత్యము చక్కటి పూరణం

స్నేహ బంధాల లె సమయ నిర్ణయం విశ్వ విదితమ్మే

దేహ నిర్మాణం దాహతత్వమ్మే దారి వైవిధ్యం

అహము ఆహారము ఆత్రృత పెరిగేను భక్త ఆంజనేయ....89


గతము వర్తమాన గమ్యము తెలుసుకొని జీవ భవిష్యత్తు

గీత చైతన్య మె గురువు శుద్ధ సిధ్ధి విషయ వాంఛలు గా

మాతృ సంస్థ అయిన మనసు మాట లన్ని సహజ సిద్ధమైన

నీతులెన్ని ఉన్న నిజము తెల్పు చున్న భక్త ఆంజనేయ....90


 చూడు ఏదైనా చూచి పట్టుకొమ్ము వినియు ఆచరించు

చూడు లక్షణమ్ము చూడు లక్ష్యము నే జ్ణానమార్గముగా

చూడుము స్వరూప చూడు విశ్వ భావ శక్తి ఆనందం

చూడు విచారణను చూడు నిశ్శబ్ధం భక్త ఆంజనేయ....91


 నాదమే యోగికి వేదమే పఠనము శబ్ద మాహారం!

ఆది యేధ్యానం ఆదరం యోగి  శ్వాస ఆహరం!

సాధు విషయ ఆత్మ సహనము యోగి ఆనంద ఆహారం!

విద్య వినయ వాది విషయ సేకరణే ఇదియు ఆంజనేయ...92


పాప విముక్తికై పనిలొ నిజాయితీ సర్వ ధర్మముగను 

ఓపలేని బతుకు ఒడిసి పట్టు కుండ ఓడి పోవుటయే      

శాప మేదైనను సహన మాయుధమే సుఖము కొరుకు తెల్పు 

ధూపదీపముంచి దూరము గా లేక ఉన్న ఆంజనేయ   ...93 


జీవితం లోపల జీవితం వెలుపల సమము అని తెలుసుకో 

భావ పరంపరలు భయము వెంటాడిన బాధ్యత మారదే 

ఎవని అలవాటున ఏర్పడు ఘటనలే ఎంతయినా మార్చు  

అవని భారములే మానుషజన్మ లో భక్త ఆంజనేయ ....94


ఎవరు లాభపడును ఎవరికీ నష్టం ఎవరికీ తెలియదు 

ఎవరు ఎవరి ఋణము ఎందు వళ్ళ భయము ఏది తెల్పలేరు 

ఎవరి వాద నేది ఎవరి సొత్తు కాదు ఎంతవరకు కాదు 

ఎవరిలో ప్రేమ ఎంతవరకుండును రామ ఆంజనేయ ....95


చినుకుల సవ్వడే చలనము వేగమే వినయముగానులే 

వినిన నయ్యదీను వదన విహారమ్ము వివరము లొద్దులే 

స్వనములు చిటపట సరళము లగుటయే జలము కళలు కదిలె 

కనుగువకొక తెరలు కనులముందుననే భక్త ఆంజనేయ  ... 96   


కారుడు నీటిలో కళలు తీర్చు జలము, నిగ్రహించు బతుకు 

కోరిక చిన్నదే కారణములేనని నీడకలయక కే

నిరతము కొలుచుటే నియమ మందుననే వరుణ దేవనిన్ను  

సారస నేత్రుడా సాధనచూడుమా భక్త ఆంజనేయ   ....97


వానల వరదలే వరము చాలులే వలయ విధములేల 

హానిగా ప్రకృతియు హరులు నరులు గిరులు సర్వము హరించు 

ప్రాణము పోవునే భరించ లేనురా ప్రళయము ఆపురా 

ధీనులు చూడరా తరుణమిదేనురా భక్త ఆంజనేయ  ...98


దివ్య పానీయం దినదినవృద్ధిగా జరుప గలవు నీవు 

భవ్య వెలుగులన్ని భాగ్య సీమలోన చిందులగుటేలే

కావ్య జగతి వెలుగు కర్మ సిద్ధాంతం కళల వృద్ధి జరుగు 

నవ్య భావాలే నరుల ఆశయాలు భక్త ఆంజనేయ .... .. 99

0

ఓం శ్రీ రామ శ్రీ మాత్రే నమ:

నిర్ణ యించలేను, నటన మాత్ర మవదు, వీలు కానిదదియు 
నిర్మలమ్ముగాను, నిజము తెల్పలేను, నియమ మడ్డు వచ్చు 
కర్మ వల్ల నేమొ, కావడి కుండలుగ, బతుకు కధలు అయ్యె 
స్పర్శ లేని చినుకు, గాయమవుట, రామ భక్త ఆంజనేయ ...... 100

మనమున నీవెరా - మధురసుస్మితగా వేడు కొనుచుంటీ    
వనజ విహారుడా - వినయ బుద్ధి నీది - ప్రభల వెలుగు లాయె   
దినమున నేను నీ - తెరువు చూచు చుంటి నుంటి నాను నయ్య  
చినచిన యాశలే - చెలువు నింపు నయ్య జీవ ఆంజనేయ  ...101

మూఁగగ నైతిరా - ములుఁగులో వ్యధయే కథలు కావులే  
ఆఁగఁగ లేనురా - యనలమే రగిలెన్ మిగిలు శక్తి ఏది  
సాఁగుచు నుంటిరా - సమర మీ బ్రతుకే మెతుకు కొరకు గాను  
మ్రాఁగుచు నుండెరా - మఱువ నీ మొగమున్ నగవు ఆంజనేయ 102 

==
కాలము నదియెరా - కడలిలోఁ జేరును విధిగ  ధర్మ విధము  
తేలెడు పడవ దాఁ - దిరుగు నా సుడిలో వడిన బతుకు చుండు  
నేలెడు వానితో - నెటుల నే మాటా డుటయు జీవ నదియు   
లీలల మాయలోఁ - బ్రేమయే రేవా దేవ ఆంజనేయ  103
==

మనసున విరియు నా - మల్లెలా గ్రుచ్చెడు మనసు భావ మయ్యె   
స్వనమున మ్రోఁగు నా - పదములా విరసా స్వర ములుగ ఏల  
తనువున గంధమా - తాపపు మంటలే పొగల బతుకు నందు  
దినమున రాత్రియా - తెరువులో చీఁకటి వెలుఁగు ఆంజనేయ 104  
==   

సిరుల వల్ల మనసు చెలిమి చెడును తప్పు కాదు నిజము కాదు  
పరుల మాట ఎపుడు మెరుపు మెరవ లేదు మదిన మెచ్చు కోదు 
తరువు లాగ వున్న తారు మరు యగుట తెలుపు బతుకు కాదు 
పరువు కోస మనియు పక్కలో బల్లెం జీవి ఆంజనేయ   ..... 105

పాప విముక్తికై పనిలొ నిజాయితీ సర్వ ధర్మముగను 
ఓపలేని బతుకు ఒడిసి పట్టు కుండ ఓడి పోవుటయే      
శాప మేదైనను సహన మాయుధమే సుఖము కొరుకు తెల్పు 
ధూపదీపముంచి దూరము గా లేక ఉన్న ఆంజనేయ........ 106

కాదుగా ధ్యానం కళ్ళు మూసుకున్న బంధమేర్పడితే   
కాదుగా యోగం కళ్ళు తెరచియున్న శరణమన్న జీవి 
కాదుగా జ్ఞానం కాల మాయ వల్ల మేను సుఖము ఏది 
కాదుగా నిత్యం కమ్మని బతుకుగా చెప్పు ఆంజనేయ ... .... 107 

వేరు పరమాత్మా, వేరు జీవుడులే అనుట ఎంత నిజము  
వేరు సముద్రమే ,వేరు కెరటమ్మే అనుట ఎవరి కొరకు
గురువు చేయు బోధ గురువు చెప్పు నీతి జీవిత ధ్యేయం
పరిమితంలోనే పలురు జీవిస్తూ ఉండె ఆంజనేయ ..... ... 108  

9 రోజుల్లో 99 పద్యాలు పూర్తిచేయగలగాను ఇది ఆంజనేయ సంకల్పము మాత్రమే, నేను నిమిత్త మాత్రుడను 
ఆంజనేయ కృప అందరికీ అందాలని,  దేశం సర్వసౌభాగ్యాలతో విలసిలాల్లని, శ్రీ సీతా రామాంజనేయస్వామిని ప్రార్ధిసున్నాను. 
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు తెలియపరుస్తూ. నాకు సహకరిస్తున్న అభిమానులకు అభివందనాలు తెలియపరుస్తూ గూగుల్ వారికీ ఫేస్బుక్ వారికీ మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తప్పులు దొర్లినా క్షమించగలిగే హృదయం అందరిలో ఉన్నదని, తప్పులు తెలియ పరచ గలరని ఆసిస్తూ 
మీ 
విధేయుడు    
మల్లాప్రగడ రామకృష్ణ,

22, ఆగస్టు 2021, ఆదివారం

చంద్రిక

మంచు తెల్ల నదీ మల్లె మోగ్గవలే మాయ వెలుగు నిండె

మచ్చ లున్న చంద్ర మలపు వెన్నెలిచ్చె ముసుగు కమ్మె నీడ

స్వచ్ఛ మైన దియును శీతల మజ్జిగే తెల్ల శంఖంమ్మే

స్వేచ్ఛ కోరు పిల్ల స్వేతవర్ణ ముగను  పండు వెలగ పండె


వెలుగు నీడ భయము వెంట పడునేమో కంటి నలక లాగ

పిలుపు మేలుకొలుపు భయము పిచ్చి అనునె మనిషి వేట లాగ

అలుక హక్కుగాను ఆశ  ఆర్భాటం భయము నీడలాగ

 మలుపు కోసం మ్మే మూగ భక్తి తెలిపె భయపు పూజ లాగ


 చూసె దాని కన్న చూపు అర్ధమ్మును తెలుప, గలిగి వుండు

వ్రాసె దాని కన్న వినుట మేలు తెల్పి, సత్య వాది గవ్వు

ప్రాస చదువు కన్న పుడమి విద్య విజయమ్ము, ఉంచు జ్ణాపకాలు

ధ్యాస తోను చదువు ధైర్యము శ్రద్ధయే, మనిషి కి విజయమ్ము.......


వద్దు వృద్ధాప్యం వయసు పెరిగి వున్న  మంద మతియు పెరుగు

హద్దు లన్ని తెలుపు హాయి గొలుపు పెద్ద మాడు కాళ్ల మనిషి

వృధ్ధ ఆశ్రమాలు వేల సంఖ్యలలో వెలసి యున్న తీరు

వృద్ధుడైన తెలివి వృద్ధి జరుగు చుండు మంచి తెలియ జేయు 


అంతర్జాల సదస్సుకు వర్గం గురించి చంద్రిక పద్యాలు


వర్గ‌ సౌభాగ్యము  వరుస మార నంత లక్ష ణము సఖ్యతె

వర్గ కరుణకొరకు వంద మంది కలువు జనుల గోల తెలుపు

వర్గ సిద్ధి కొరకు విజయ వాంఛ తెల్పు బతుకు తెరువు తెలుపు

వర్గ నుపాసించు వలదు అన్న సేవ చేసి తరించుటే

                                   

వర్గ వరము లొంది వసుధ నిష్ట తోడ సేవ చేయు విధము

వర్గం శరణు అన్న ఓర్పు చూపి  శక్తి నంద చేయు 

వర్గ సిరుల పొంది వలస వెళ్ళు వారి కి దయ కృపను చూపు

వర్గ వైషమ్యం వర్గ వైపరీత్యం కొంత ఆశయమ్ము


వర్గ వర్ణసిరిని వంత పాడతారు  నదియె ఘనతయొప్పు

వర్గ ధనిక బీద భువిని చేరిపోతుంది రాజు కీయముగా

వర్గ రాజ్యలక్ష్మి  కనక వీణ పట్టి కాల మహిమ చూపె

వర్గ శ్రీమాతా వందనమ్ము పలికె కలి సుఖముయె

నేటి పద్యములు


శత్రువు వల్లనే వివర సక్యత మారును మిధ్య మవ్వుటన్ 

మిత్రుల భావమే వినయ మోకిక బుద్ధియె శాశ్వతమ్ముగన్ 

ఆత్రుత పెర్గుటే మదిలొ అర్ధము దుఃఖము ఆకలవ్వుటన్

పుత్రుని ప్రేమలే సహజ బంధము తీర్చుట పుష్పమవ్వుటన్


సంకట మొచ్చుటే సమయ సాధన చేర్పులు సంభమవ్వుటన్ 

మక్కువ పెర్గుటే వినయ మానస పాశము మన్ననవ్వుటన్ 

ఇంకొక ఆశయం అలలు  ఈశ్వర లీలలు ఇప్సితమ్ముగన్ 

దక్కని కోర్కలే మనసు దాచుట ఆశతొ తప్పుచేయుటన్


ఆపద వొచ్చినా మనసు ఆగదు  ఆశలు అప దాపుచున్

ఓపిక  ఓర్పుయే ఉదయ ఔషద వల్లనె వచ్చు చుండునన్ 

సంపద వచ్చినం బ్రతుకు సర్వము నాశన మౌను చూడగన్

పాపము శాపమే మనకు పావన మువ్వురు  పల్కువల్లనన్


 తెల్ల నగురేయీ తేట తెల్ల గానె తెలుగు వెలుగు లాగ

మల్లి  ఘభాలింపు మమత మోహరింపు మనుగడ హాయిగా

కొల్లలుగా హృదయ కమల వికాసమే కనుల పండుగాయె

చల్లగ చిరుగాలి చింత తీర్చిదిద్ది శోభ కలిగించే


కాల మొకనది గా కావ్య చరితము గా సాగి పోవు చుండు

ఏల అనకవిను ము ఏది యైన అదియు కర్మ ఫలము అగును

గాల మేసి పట్టి గాలి లాగ దూరి బతుకు మారు చుండు

గోల లేల నీకు గళము ఏల వాడు చుండు టేలఇపుడు


వెల్లువ వెన్నెలే వలపు ఊయలవ్వు ఊహలో చిక్కే

పల్లవి తో పాట పలుకు వెలుగు లాయే పదనిసలకు చిక్కి

నల్ల నగు రాత్రే నయన కలుపు వెలుగు నీడ లాగ చిక్కి

పిల్ల నైన నేను పడచు హాయి నివ్వ పెదవి వలన చిక్కి


మెల్ల మెల్లగాను మేను తాకి వేడి చల్ల బరుచు టయే

యల్లసము పరుగుని యెల్ల లన్ని పాకి ఆకలియే తీర్చి

నుల్లము అనుభూతి లయలు లయలు గాను హాయి గొలిపి చిందె

తల్లడిల్లి యైన తపన తీర్చి దిద్ది తనువు హాయి గొలిపె


మానసము మలుపేను మన్ననయు మరుపేను మోనముయు మరిచేనులే

మేనుయిది మధురమ్ము మాను యిది వినయమ్ము ఔను యిది సహనమ్ములే

మైనముయు కరిగేను గానముయు చెదిరేను వైనముయు మరిచేనులే

ఆనతియు పలుకేను వానలు గ చిలికేను మేనక గ కదిలేనులే


బాణము లీలగా మదిలొ పానము మానిని కోరు సంబరమ్ 

మానము బోవగా నొదవె మానిని  మోమున సంతసంబహో....

గానము చేయగా మనసు కాలము చుట్టును చేరు చుండుటన్ 

జానిని కోరగా సహజ జాడ్యము చూపెను తొంద రెందుకన్


 సమయ సుఖమే సందర్భోజ్యం సావధాన మవ్వుటే

సమర మదిలో సంతోషమ్మే శాసనమ్ము అవ్వుటే

విమల చరితం విశ్వంమ్మాయే విశ్వ వాహినవ్వుటే

గమన చరణం గమ్యంమయ్యే కావ్యనాయకవ్వుటే


అంగ వైకల్యం అన్న దెవరు ఇపుడు అందరి కోసమే

మూగ లాగ కాక మదిని తట్టి లేపి మధుర కవిత్వమే

యోగ అభ్యాసము యుగ యుగాల చరిత తెల్పగలగే నులె

ఆగదు ఎప్పుడూ ధైర్యమే నాకులె ఆయుధమ్ము కలము

ప్రకృతి పులకరించి పలకరించు చుండు సర్వ జగతి నందు

ప్రకృతి జలపాతం పుడమి వయ్యారము సొగసులతో నుండు

ప్రకృతి తళుకు బెళుకు పడగ విప్పి నాట్య మాడు చుండు

ప్రకృతి కనుల కింపు పాఠ మవ్వుచుండు సిద్ధి పొందు కొరకు


బలము తెలివి నీది బల్లెమై  నిలివుము భరత జాతి కొరకు

కలము చెలిమి లాగ కాల నిజము గాను తెల్పగలవు నీవు

వెలుగు నీడలన్ని వెంట వుండవచ్చు అదర బెదరవద్దు

గళము తెల్పి మంచి గాయ పడక చూడు సత్యమేవ జయతె


ఎక్కడుంది నీతి ఎక్కడి న్యాయం ఎవరె వరికి తెలుసు

మక్కు వన్నదేది ముందు కానరాదు మహిమ జరిగి నట్లు

ఎక్కువ తక్కువే ఎగబడియు చెప్పే లోక మిదియేలే

చక్క దనము వున్న చులకన భావమే వర్గ కుల భేదం


మోస మన్నదేను మనుగడప్రశ్నయె గుర్తు అడగ లేరు

వ్యసన ముకు బానిస వలదు అన్న మాట కోప మోచ్చి తిట్టు

శ్వాస వుంటే శివ శ్వాస లేక శవం ప్రాణికొచ్చె నిజము

త్రాసు లాగ కదలి ధర్మ మే జరిపే మానవులున్నారు


పాత రోత కాదు పదవి కొత్త కాదు పరి తపించుటేను

మాత చెప్పు టేను మమత పంచుటేను గుణము మార్చ లేదు

దాత అవుతాడా నేత అవుతాడా తెల్పలేరెవరే

భ్రాంతి కలుగుతుంది భజన జరుగుతుంది భాగ్యము కొరకులే



పలుకు శక్తి మనకు పదము తెలుపు గలము బాధ సంతసమ్ము

పలుకు మేధస్సు కు పరమ పావనమ్ము గాను కల్గి యుండు

పలుకు సృష్టి లోన ఫలము లిచ్చు చుండు మంచి చేయుట కే

పలుకు జీవ యుక్తి పుడమి తల్లి కరుణ ఆశ పాశమ్ము యే


ఎదిగిన కొద్దియు ఎదను పంచు చుండి ఒదిగి ఉండట యే

మదిలొ భావాల్నీ మనుగడ అనుభవము తెల్పి కదలుటయే

చెదిరిన హృదయాల్ని చేరువ చేసియే ధరణి తృప్తి పరచు

అదరకబెదరక యే ఆశయాలు తెల్పి జీవితము పంచు


చూడ లేని దాన్ని చూచి తరించాలి మనుగడే మార్చకు

ఆడి మనస్సు లో ఆశ పల్కు లేక ఆదరించ గలవు

ఓడినా అనుభవము ఓర్పు వహించు టే జగతికి మూల మే

దాడి చేయ వద్దు ధర్మము మరవద్దు ధైర్యము నీ హద్దు


నా రహస్య మ్మే  నన్ను బతికించే తెల్పలేకున్నా

నీ రహస్య మ్మే నిన్ను మార్చేను లె బాధ ఉందేమో

కారు చిచ్చి నైన కన్న వారి నైన మరచి బతుకు టేల

ఆరు నూరైనా ఆడిన మాటను చెప్ప లేను నాతి


ప్రియము యైన చెలిమి పిలుపు గాను చేరు జీవ వైవిధ్యం

ప్రియము అప్రియము పలుకు బట్టి మారు మహిళా పలుకు నందు

ప్రియము వల్లభునీ ప్రీతిని తెలిసియే ధన్య పరుచు చుండు

ప్రియుని వాక్కు లోన  ప్రెయసి మనసు దాగు జాగృతిగా చెలిమి


సక్కనైన రూపు సొక్క మైన చూపు ఉల్లి పొరల చీర

నిక్కమైన నడుము నీటు గుండు ఛాతి ఎత్తు పొంగు లేలు

పిక్క బలము వుంది తక్కువేమికాదు కిక్కు ఇచ్చు చుండె

దిక్కు లన్ని చూసి పక్కకు రమ్మనే చెక్క నైన చుక్క


 విరజాజే గది చెప్పదు అనుటే మూర్ఖత్వమె మాలికా

దరితో గూడిన ధర్మమ్మే మనుగడగా స్త్రీ శక్తి యు ఏలికా

దరితో గూడి సుఖింప న్యాయమటరా దర్వీకర ధ్వంసకా

సిరితో చేరి సుఖింప ధర్మమటరా సర్వోన్నత ధార్మికా


కాకులు మూగి అర్చుటయు కాలము మార్పు ను తెల్పుటే మన

స్వీకర శక్తి యే తెలుపు సాధన శోధన ధర్మ మే మన

వ్యాకుల యుక్తి యే సహజ వాదుల శక్తి యు సర్వ ముక్తి యే

నూకలు నాని పోవుటకు నూరు యుగమ్ముల కాల మయ్యెడిన్

18, ఆగస్టు 2021, బుధవారం

ఓం శ్రీ మాత్రే నమ:.. ఆర్యశతకము శ్రీ మూక పంచశతి


శ్రీ మూక పంచశతి .. ఆర్యశతకము - మధురిమల పధ్యములుగా వ్రాయటం జరిగింది " కామక్షి అమ్మవారిని "ఆరాధిస్తే సమస్త రోగాలు నిర్మూలించబడి మంచి ఆరోగ్యం లభిస్తుంది. రోజూ చదవండి ఆరోగ్యంగా ఉండండి 

(1)  కారణ పర చైతన్య రూపిణి

      కామ పీఠపు ఆశ్రమ వాసిణి
      కాంచీపురం కరుణ స్వరూపిణి   
      కోమలమైన దయ విహారిణి   ---- విహరించు చున్న అమ్మవారికి వందనాలు    
      
(2) కంచన కాంచి పుర తిలకమ్ము
     నిత్య ధనుర్భాణ కేశ పాశమ్ము  
     కఠిన పాలిండ్ల తోన భారమ్ము  
     కైవల్యా నందముకు కారణమ్ము ...... శ్రేష్ఠ మైన అమ్మవారికి వందనాలు 

(3) కాంచీ కామాక్షీచింతామణి గను  
     చింతింప ఫలము పోషణ గను     
     చైతణ్యామృత ప్రవాహిని గను
     చిత్తం చల్లబర్చు కామక్షి గను ..... .... పోషణ కల్పించే అమ్మవారికి వందనాలు 

(4) కామాక్షి మల్లెపువ్వువంటి నవ్వు    
     వంకర తిరిగి ముంగుర రివ్వు
     ముఖము ఎర్రని కుంకుమ పువ్వు    
     పర్వత చక్రవర్తి సర్వ మవ్వు ...... .... విహరించే అమ్మవారికి వందనాలు 

(5) కాంచీ పుర యవ్వనాల కుమారి
     కామ మోహయతి  శివ శంకరి  
     సర్వ దృష్టిని సంప్రోక్షణాసిరి     
     పంచ భూతాలపై అధికారిణి   .... .... . దాసుడనైతిని అమ్మవారికి వందనాలు

ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ 

(6) కమల నయనాల అధినేత్రి  
     కాంచీ పురాన కుచకుంభధాత్రి
     సర్వుల ప్రాణ రక్షణగా నేత్రి
    త్రినేత్రుని జయించే హిమపుత్రి ..... ...  మోహింప మొహినికి వందనాలు  

(7) జీవేశ్వరైక్య జ్ఞానమ్ము  హేతువు  
     ఈశ్వరుని ఐశ్వర్యము హేతువు
     వేదాన్ని వివరించేటి హేతువు
     శిరస్సున అర్ధ చంద్ర హేతువు  ... .... జ్ఞాన సరస్వతి అయిన అమ్మకు వందనాలు 

(8) ఆనందాడ్వైత వృక్షపు మొలక
     యవ్వన గర్వ పర్వ పు మొలక    
     శిరోభూషణ వేదాల మొలక   
     కామాక్షిరక్షణ కాంచీ మొలక ... ...... వృక్షంలా ఉన్న అమ్మకు వందనాలు

(9) శృంగారాద్వైత సాస్త్ర రక్షినిగా  
     మహా శివునికి విధేయత గా
     స్థనములతోను సుందరముగా
     నిత్య సిద్ధాంత సూత్ర ధారిణిగా  ... .. ఉన్న కాంచీ పుర మాతకు వందనాలు 

(10) భువన సమూహమునే చొక్కగా 
.       భూసీ మనాశ్రయించిన నదిగా
        పరమ శివున్కే ధైర్య మిచ్చేదిగా 
        ఒక ఎఱుపు శిధిల మాత గా ----- సమస్తలోకాలను పాలించే అమ్మకు వందనాలు  

   ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ 

(11) కాంచీ పురాణ రత్న భూషణగా
       శివ తొడపైన దర్శనమ్ముగా  
       మన్మధుని ప్రసూతి గృహముగా
       కటాక్షము లిచ్చేటి దేవతగా  .. ... ... శ్రేష్టమైన కళను చూపే అమ్మకు వందనాలు .

(12) మనస్సుఏ విహార ఉద్యానము
       చిద్విలాస సుందర మైన మోము   
       నివాసము కంపా నది తీరము  
       కరుణ తోను పంచు కటాక్షము  .. .... మనస్సు విహరింపచేసే అమ్మకు వందనములు 

(13) సర్వస్వ సంప్రదాయము తోకల్గి
       మనసు ఏకాగ్రత చూప కల్గి
       శివపీఠమే ఆధారము కల్గి
       కామాక్షి మనసునే పంచ కల్గి ....... ... వేదగ్రాహ్యము పంచే అమ్మకు వందనములు  

(14) నిత్య తరుణీయమైనట్టి బాల
       శివాలింగనమునే పొందు హేల
       మది ఉల్లాస భరితపు లీల
       నిత్యం కంచి నందు జరుగు గోల.... .. నిత్యతరుణి అయిన అమ్మకు వందనములు  

(!5) చతన్య శరీర కాంతి మెఱుపు
      చెఱకు విల్లు హృదయ మెఱపు
      బంధు జీవముల పుష్ప మెఱుపు
      గిరిపై శ్రీ కామాక్షిగ మెఱుపు ...... ....... ఆనదంపొందే అమ్మ చూపులకు వందనాలు 

(16) మధుర మైన చిరునవ్వులతో 
       మంద గమనపు స్థనములతో
       మన్మధ సామ్రాజ్య గర్వముతో
       శ్రీ కామాక్షి దేవి గ ఆటలతో   .... ...... మన్మధసామ్రాజ్యానికున్న తల్లి కి వందనాలు 

(17) భూమి ఆకాశం వాయవు వీక్షించే
       యజమాన అగ్ని భూమి వీక్షించే
       సూర్య చంద్రలు జలము వీక్షించే
       రూపాష్టమూర్తి  తల్లిని వీక్షించే .... .సమస్త లోకాలు చూసే తల్లికి వందనాలు 

(18) తెల తెల్లని మంద హాసముతో
       చల చల్లని సృష్టి చూపులతో  
       సన సన్నని నడుము వంపుతో
       నిర్గుణ తత్వముల పలుకుతో .... ..మనకందించిన అమ్మకు నమస్కారములు 

ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ 

(19) కాంచి పురాన్ని పవిత్ర ముగా
       శివ పులకిత శరీరముగా
       మన్మధ లీలల సరసముగా
       శ్రీ కామాక్షి దేవి సాక్షాత్కారంగా .... ... ప్రజలందరిని రక్షించే అమ్మకు వందనాలు  

(20) మన్మథునికే రెక్కలు తెప్పించి
       ఇసుక తిన్నెలలో విహారించి
       యవ్వన రూప శివుని మెప్పించి
       సంపదతో పుణ్యవతి దీవించి  .... .... సమస్త లోకాలను రక్షించే అమ్మకు వందనాలు .

(21) నిత్యమూ యౌవన సర్వస్వముతో
       దేహ తరుణారుణ రేఖలతో
       సమాన సాంప్రదాయ కళల తో
      శ్రీ కామాక్షి దేవి వెలుగులతో   .... ..... కంపానదీ తీరమున ఉన్న అమ్మకు వందనాలు 

(22) శివాభ్యుదయం తెలప గలిగి
       మన్మధుని శరీర పుష్టిమయం
       కంచి కామాక్షి దర్శించగలిగి  
       పరిణామమైన యోవనమయం  ..... తో ఉన్న అమ్మకు వందనాలు 

(23) జ్ఞానమయమైన సరస్వతిగా   
       పరిపూర్ణత గల్గి సహాయంగా
      చంద్రునినే  శిరోభాషణముగా
       కాంచీపురము  ఆశ్రయ వాసిగా .... .ఉన్న అమ్మ పరిపూర్ణత లీలలకు వందనాలు 

(24) పువ్వుల బాణాన్ని ధరించియు
       చెరుకు విల్లునే ధరించియు
       కాంచిపురమున ఆటలాడియు
       ఎరుపును విశేష౦గా ధ్యానించియు .....దర్శనమిచ్చే అమ్మకు వందనాలు 

(25) సంతోష శంభో ప్రవాహమందునా
       గర్భమధు ధార గతి యందునా
       వేదాంత కమల దివ్య వెల్గునా
       స్తనసౌందర్య ముచే తేజంబునా ..... విలసిల్లే అమ్మకు వందనాలు 

(26) ఏకామ్రనాధుని జీవిత లీల
       శ్రీ కామాక్షి దేవి ఆశ్రీయ లీల
      సర్వ పాపములు  పోగెట్టే లీల
      జింక పిల్ల కన్నుల దేవి లీల ..... .. చూసేవారికి ఆనందం ఇచ్చే తల్లికి వందనాలు 

(27) ఆనందామృత సాగరంలో తేలి
       అమ్మవారి నవ్వుముఖము హోళి
       దయ ప్రేమ లతో చూపెటి జాలి
       అనిర్వచన మైన దేవి లాలి   ..... ..అందరిపై ప్రేమ దయ చూపు తల్లికి వందనాలు 

ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ 

(28) హిమ వంతుని కుల మణిదీపం 
       ధరించె చంద్రుని శిరో భూషణం
       కాంచీ పురాణ రక్షణా కవచం
       అమ్మవారిపై మూక కవి పద్యం...... మూక కవి పద్యంతో అమ్మకు వందనాలు 

(29) పగడపు రంగు దేహము గల
       పెద్ద కలశము చనులు గల
        మనసు పరసింప చేయగల
       శ్రీ కామాక్షిదేవి సౌందర్య లీల ..... ..సౌందర్యానికి ప్రతిరూపమైన అమ్మకు వందనాలు 

(30) కురువింద మణుల గోత్ర కల్గి 
       కుండల వంటి కుచములు కల్గి
       మన్మధుని వీర్య సారము కల్గి
       వేగ రూపిణి శివుని తో కల్గి      .......  శివుని మెప్పించిన అమ్మకు వందనాలు 

(31) మొగ్గ తొడిగి నట్టి కుచములు
        కుంకుమ పూతలతొ మెఱుపులు
        శివుని పుణ్య అతిశయములు
        నిత్యమూ మంగళ మార్గములు  ....నిత్యమూ పూజలనుడుంటున్న అమ్మకు వందనాలు 

(32) శిరస్సు న చంద్రుని భూషణం గా
        పరమశివ అంతఃపురము గా
        కాంచీపుర అలంకారములు గా
       శ్రీ కంచి కామాక్షి వైభవమ్ము గా .......మహాద్భుతమంగా కనిపించే అమ్మకు వందనాలు  

(33) పర్వత వంశ సంపద వికాసం  
       కంపా నదీ తీరమున ఆనందం 
       మహాశివ లాలన నిరంతరం
       ఆవిరులు చిమ్మిన ఫాలనేత్రం ...... అమ్మ చూపులకు వందనాలు 

(34) ఏకామ్రేశ్వరుని అంకముపైన 
       సారసత్యమైన అమ్మవారిగా 
       అంకురించిన స్థనమొగ్గలైన
       వేదోపాసముగ ముహుర్తముగా  ........ఉన్న అమ్మవారికి వందనాలు 

(35) మూలధనము ఆస్తిగా కలదై
        పింజరవర్ణాల  కాంతి కలదై
        పూజ్యనీయ ధ్వని మణి కలదై
        ఘనీభ వించిన దయ కలదై  .... ....కాంచీపురము నావెలసిల్లినమ్మకు వందనాలు 

(36) ఆసక్తమైన హృదయము కల్గి 
       పరమశివుని భరించ కల్గి
       కళ్ళ కన్నీరును తుడవ కల్గి
      సౌందర్యామృతమును పంచ కల్గి  ...సమస్త ప్రజలను రక్షించే అమ్మకు వందనాలు 
ఓం శ్రీ మాత్రేనమ:.... ఓం నమ:శివాయ 

(37) తుమ్మెద పోలిక ముంగురుల తో
       మదన శాస్త్ర సిద్ధాంత  దీక్షతో
       మంగళములకు జన్మ లక్షంతో
       అమ్మవారి సారూప్య దాహముతో   .... ఉన్న తల్లికి వందనాలు 

(38) జ్ఞానామృత తరంగమునే పంచి
       మూడువిధాల రూపము ధరించి
       సంసార సాగరంలోన బంధించి
       కాంచీ పురముణ సంచరించించి  .... ముగ్గురు పురుషుల ముఖకమల మైన అమ్మకు వందనాలు 

(39) సంధ్యా సమయ కిరణములతో
       కాంతిగా సమయా దేవి బుద్దితో 
       నీవు నిత్యమూ ధ్యాన పరులతో 
       ఇష్టమైనట్టి కామాక్షి దేవితో 
       బేధ అభేదపు సమస్యలతో ..... .......నిత్యమూ సుఖాలు నందించే అమ్మకు వందనాలు 

(40) పాద పూజకు బంధము చూపావా 
        సముద్రములో రాయిలా తేల్చావా 
        నాగకన్యకా కోపము చూపావా 
        చరాచరముల తల్లి వైనవా
        గుహా అరణి రూపిణి వైనవా ....... ...ఓ కామాక్షి నీకు నమస్కారాలు 

(41) సర్వమును చైతన్య రూపిణిగా
       భేదమును చూపని దానివిగా 
       నీవు అహము లేని దానివిగా 
       విశ్వమున శాశ్వితమైనది గా 
       కామాక్షి భ్రమింపచేస్తున్నదిగా ...... లోకాల్ని భ్రమింపచేసే తల్లికినమస్కారాలు  

(42) అమ్మ కామాక్షి కటాక్ష కృపగా 
       అడవి ఇల్లు ఇళ్లే అడవిగా 
       శత్రువు మిత్ర మిత్ర శత్రువుగా 
       మట్టి పెడ్డ పడచు పెదవిగా 
       పడుచు పెదవి మట్టి పెడ్డగా...... అమ్మవారు చేయు పనులకు శివ శివ అంటూ వందనాలు 

(43) పరమేశ్వరునకు ప్రియురాలా
       కామ పీఠమున ఉన్నదానివి 
       కోట్లాది కామమలతోను లీల
       నిత్యమూ నికారస్వరూపిణివి
      భక్తుల కోరికలు తీర్చు లీల  ........మాలో ఉన్న కామాన్ని పితికే తలికి వందనాలు 

(44) హృదయ మధ్యమున కాంతులతో 
        ఫాల మధ్యముననె కాంతులతో
        శిరస్సు మధ్యమము కాంతులతో 
        సూర్యని చంద్రునీలో  కాంతులతో
       శ్రీ కామాక్షిదేవి గా కాంతులతో    .... సమస్త కాంతుల మూలమైన అమ్మకు వందనాలు 



(45) కాంచీపుర క్రీడలలో  ఆసక్తి
       మంత్ర యంత్రము లలోన ఆసక్తి
       శివుని జీవనో పాయ  ఆసక్తి
       అమ్మగా హృదయ చల్లని శక్తి
       అఖిలాగమనలో తంత్ర శక్తి   ..... .జీవనోపాయమైన శక్తులనిచ్చే అమ్మకు వందనాలు 

(46) ఎల్లవేళల కాంచీపురమ్ము గా
       సూర్య చంద్ర మండల స్తనాలుగా
       నిత్యమూ ఆకాశమే  నాదముగా
      తరుణీ హృదయము శాంతముగా
      సమస్త మానంద పరిచేదిగా .... .తరుణీ హృదయాలలో ఉన్న అమ్మకు వందనాలు 

(47) మెరుపు తీగవంటి వన్నెగల
       సంసార రోగము చికిత్స గల
       నిత్య ఔషధము అందించగల
       సిద్ధి అందరికీ కల్పించ గల
       బుద్ధి మనస్సును రక్షించగల.... సిద్ధి ఔషదము ఇచ్చే అమ్మకు వందనాలు 

(48) బ్రహ్మ తత్వ నాడి కలిగియున్న 
       స్థనములు  ఖఠినత తో యున్న
       మన్మధుని ప్రతిపాదించు చున్న
       ఆనందమును నొసగుతూ వున్న
       మహా శివుని ప్రీతి కల్పిస్తున్న  .... .అందరికీ ఆనందాన్ని అందిస్తున్న అమ్మకు వందనాలు 

(49) పాశము అంకుశము ధరించిన
       ముంజేతిలో పుష్పం ధరించిన
       వేదవాక్యాలన్నియు పఠించిన
       సిద్ధాంతంతో శివుని పూజించిన
       కాంతులతోను కాంచీ  పురమున .... .ఉన్న శివుని భార్యకు వందనాలు 

(50) పరమతాత్పర్యరూపిణి ఐన 
        నిత్య ధ్యాననిశ్చలత గల్గిన 
        మునులహృదయాలలో ఉండిన  
       ఆదివిద్య తంత్రములు నేర్పన -- అమ్మా కామాక్షి కి వందనాలు 

(51) వేద వాఖ్యములు సిద్ధాంతమైన
        ఒక చేతిలోన అంకుశ మైన
       మరోచేతిలోన పాశమ్ము యైన
       ఆశ్చర్యము కల్గించు సంఘటన--- తో శివుని భార్య చేసితిని 

(52) శిల్పం యొక్క కల్పన రూపము యే 
       విలాస రీతులు గా భంగిమయే   
      ఆశ్ర యించిన వార్కి మోక్షముయే 
      ప్రధమ విస్ఫుర మైన విధ్యయే  ---- అమ్మవారు అందించును 

(53) కామాక్షీ దేవి మూగడి నైనాను
       తీవ్రమైన క్లేశ ము పదశిల్పము 
      కల్గినాను దు:ఖము అనుభవించు చున్నాను 
      ఒక్కక్షణం స్మరించ కుండలేను --- నిన్ను స్మరించిన లోకోత్తర కీర్తి 

(54) పంచదశీ మంత్ర రూపిణిగా
       శివునీనే వంచింప విధముగా
      మన్మధుని కళ నైపుణ్యముగా
      కాంచీపురము విలసిల్లు చుండగా --- అమ్మవారిని ఆశ్రయించ వలెను

(55) యేబది వర్ణాల పదశిల్పాలు
       నాలుగు విధాల పరిణామాలు
        విద్వంసుల లో సుషుమ్నా నాడులు
       ఎన్నో ఎన్నెనో నిత్య  కల్పనలు ---- చూపిన ఆ కామాక్షి దేవిని మ్రొక్కెదను 

(56) ఆకారము నుండి క్షకారము గా 
       తెలుగు అక్షర స్వరూపముగా
      విద్యలకు విద్యాస్వరూపిణిగా
     పీఠమున చెరకును ధరించగా ------మాతృమూర్తి గురుసార్వభౌమిని కి మ్రొక్కెద

(57) కంపా నదియందు ప్రేమ గలది 
       యతుల లో స్థిరత్వము గలది  
       సామవేదము ఇష్టము గలది
      హిమవత్పర్వత పుత్రి కైనది ----- నిత్యమూ కామా క్షీ అమ్మవారిని మ్రొక్కెద 

(58) జలమందు ఆసనము ధరించి 
       సంతోషపు మన్మధుని శాసించి 
      సకల జగములు  ప్రకాశించి 
      కాంచీ పురము భక్తితో శాసించి -- సకలము సంతోష పెట్టు మాతను మ్రొక్కెద

(69) చికాట్లు మరలా రాకుండా చేయు 
        నిత్య మనస్సును మేల్కొల్ప చేయు
        దొండపండు  పెదవులు కల్గి యు 
       చిరునవ్వు మోముతో కామాక్షియు .... ఫలములందించే దేవతకు వందనాలు 

(70) శ్రీ చక్ర మధ్యమమున భాగ్యమై   
         పుష్పపర్యంకముగల మంచమై 
         పరమ శివునకు సుందరమై 
          ఉమామహేశ్వరుల దర్శనమై .... పరమశివునితో ఉన్న అమ్మకు నమస్కారాలు   

(71)   కామ పీఠముయే ఊయలుగాను 
          దయా జలము వర్షములు గాను
           పడచుల మణిహారమ్ము లోను
           హిమ పుత్రిక ఆనందము తోను ... ఉన్న మనల్ని రక్షించగలిగే అమ్మ  కు నమస్కారాలు    

(72) లే జిగురు వలే ఎర్రనైనది
        బాధను పోగొట్టగలిగినది 
        చంద్రుని శిరమున చేర్చినది 
        మాయ స్వరూపిణి గాను ఉన్నది ... అత్త అమ్మకు పాదాభివందనమ్ములు 

(73)  ముక్తి కారణమైన శిరముఁయే 
         చంద్ర పువ్వుని ధరించి నదియే
         కంపానదీ తీరమ్ము  ఉన్నది యే
         మనసు సంతోషం  కల్గించుటయే .. అమ్మ ఆరాధించువారికి సంతోషము కల్గును 

(74)   నిత్య వేద స్వరూపిణిగాను 
          నిత్య నాదస్వరూపిణిగాను 
          నిత్య బిందు స్వరూపిణిగాను 
          నిత్య విశ్వవికార రూపిణిగాను ... మంత్ర , తార శక్తులు గల అమ్ముకు వందనాలు 

 (75) శివుని పుణ్యముతో రూపమైన    
         కవి సూక్తులకు  నిలయమైన 
         దయ పరిణామము హస్తమైన 
         సంప్రదాయాపీఠపు రూపమైన ... అమ్మవారికి హృదయపూర్వకవందనాలు 

(76)  తెలియరాని ప్రమాణాల వల్ల 
         వక్రకేశములు చలనం  వల్ల  
         చంచల నేత్రములు  తిర్గు వల్ల
         విశాలమ్ము  జఘనములు వల్ల  .... మృదుచరణమూ గల తల్లికి వందనాలు 

(77) ఆత్మ సాక్షాత్కారమదృష్టముయే 
       పర శివోల్లసము సంభవమే   
       దృష్టిచేత సమస్తము తానుయే  
       అనుగ్రహ దీపపు మూలక మే ---- ఉన్న అమ్మవారి దర్శనము నకు వందనాలు 

(78) ఓ విద్యావతీ, కాళీ, కాత్యాయనీ
       ఓ కామకోటీశ్వరి, వాగ్రూపిణీ        
       ఓ భైరవ ఓ భద్రతా రూపిణీ 
       శాకినీ శంభుతత్వస్వరూపిణీ ---- మంగళస్వరూపురాలయినా అమ్మకు వందనాలు 

(79) మహేశ్వరుని కదిలించు దాన   
        మాలలతోను ఆడుకొను దాన 
        శత్రువులను సంహరించుదాన
        సురజనులను పాలించు దాన 

        కాపాలములను ధరించుదాన 
        పగడమాల ధరించుదాన  
        సూళము పాశము ధరించుదాన 
        ఓ దేవి నా శిరస్సును ఇచ్చేన ---- ఆ మహా తల్లికి వందనాలు 


(80) అమ్మ నీ యవ్వనమే మహిమగా  

       మహాశివుని తత్వ రూపిణిగా  
       ఆదివిద్యా సమయ తంత్రిణిగా
       దీక్షశివుని కీ గురుత్వణిగా ---- ఉన్నట్టి అమ్మకు వందనాలు   

(81) శివుని కన్నులు ఎర్రగా మారె 
        అమ్మ మొలసూలు చిక్కులో చేరె  
        మిక్కిలి పూజ్యనీయురాలై మారె  
        జనుల దయ చూడ కాంచీ చేరె----- కాంచన మణిని ధరించిన అమ్మకు వందనాలు

(82) పరమ గురిని కృపతో అమ్మ   
        హిమవంతుని పుత్రికయే అమ్మ 
        శివుని ఆభరణంగాను అమ్మ
        కన్నుల ఎఱ్ఱని అమృతమే అమ్మ  ---- శివ పత్నిగాఉన్న అమ్మకు వందనాలు

(84) శివ బ్రహ్మచర్య నిపుణతయే 
        మన్మధ ప్రేరణ అమ్మ శోభయే
        త్రినేత్ర చుపుతో దహనముయే 
        దేవతల కోరిక ప్రశ్నలాయే  ----- బ్రహ్మచర్య నిపుణత గమనించిన అమ్మకు వందనాలు 
  
(88) విద్వజనలకు అమ్మపాదాలు 
       సంతోషముతోనే పరాగములు  
       సరస మైన సంభాషణములు
       మనోహరమై అందెల శబ్దాలు  --- సంభాషణలతో అమ్మకు నమస్కారములు 
 
(89) రంగస్థములో చూపు నర్తనలు  
       మనస్సులోనా లాస్య కేరింతలు  
       శివునితో కల్సి  తాండవములు  
       సంసారలోన సుఖానందములు -- నిత్యా ఆనందము చూపే అమ్మకు నమస్కారములు 

(90) మృదువైన పాదయుగళములు
        బాధతెచ్చెటి మందగమనాలు 
        వాడి ఐన మునుల మనసులు
        అమ్మవారి హృదయ కంపనలు। --హృదయాన్ని కరిగించే అమ్మడు వందనాలు 
 
(91) విశ్వరహస్యాలు తెల్పగలిగి  
       నిత్య శాంతికి తోడ్పడ గలిగి 
       యధావిధి ఊపిరిగా మెలిగి 
       కుటుంబానికి వెలుగువుతున్న --- దేవతలచే పూజించే అమ్మ పాదాలకువందనాలు

 
 


నమశ్శివాయ గేయము

శ్రీ పార్వతీ i వల్లభా .. సంవిత్స్వ ... రూప మాయిక దుర్లభా 
పాపా బ్జ వనము దే భా  మోక్షప్ర ..దీపకర   నమశ్శివాయ    

నీపాదకమల సేవ - చే మన .. స్తాపములు..  చల్లారును
కాపాడి రక్షింప వే  .. భవదీయ ... కరుణ చే నమశ్శివాయ

శరణు  పరమేశ్వరాయా ...రుద్రాయ ... శరణు  విశ్వేశ్వరయా  
శరణు  భద్రప్రదాయా .. కావవే .. శరణ0టి  నమశ్శివాయ

త్వన్నామ పంచాక్షరీ .. మంత్రంబు ..దవిలి ... పఠియించువా రీ
భవపాశములు జిక్కకే .. మోక్షంబు .. బడయుదురు నమశ్శివాయ

పలుపాతకములు జేసి నరకభా..దల  నొంది కందనేలా?
తలప నీ చరణసేవం ..జేసి ని..ర్మలు డగును నమశ్శివాయ   ...... 5

కుజ న సంగతి చేతను నీ పాద భజన మించుక లేకయే 
వృజన మా ర్జించు  నట్లు సేయకో విశ్వేశ నమశ్శివాయ
 
వినగోరు వీను లోకరం జన ప్రాకృతోక్తు లందు
నెన యింప కే నీ కథల్ శ్రవణము లు వినిపిం పు నమశ్శివాయ 

తను వగరు మాల్యాంబర దుల దాల్ప జననీక  నీపదాబ్జ
మననంటు రజముభూతి నా మేన నునుఫవే నమశ్శివాయ

 

6, జూన్ 2021, ఆదివారం

pancha ravali

 పంచ రవళి 


వినయ మెపుడు విషయ వాంఛ యగును 

విధిగ బ్రతికు  వింత కష్ట  మిపుడు 

విశ్వ మందు విప్ల వముగ  మారును 

వీర వనిత విధిగ బ్రతుకు నిపుడు 

విజయ దశిమి విజయ మొసగు నెపుడు ---1


ధర్మ బోధ ధర్మ జగతి గనుము 

దాన మిచ్చి దయను చూపు నిపుడు  

ద్వేష భావ దారు తప్పె గనుము 

ధరణి బాధ దయతొ చూడు మిపుడు  

ధ్యాస మార్చ దైవ పూజ గనుము ---2


సకల సృష్టి సమ్మతి యగు ధరణి 

శోభ తగ్గి సమర బెరుకు చూడు 

సత్యముగను సేవ చేయు ధరణి 

సాగరముగను స్వేశ్చ గమన చూడు 

స్నేహ జగతి సర్వ మయము జూడు ---3 



1, జూన్ 2021, మంగళవారం

కవితా సాక్షి

 (ఛందస్సు ) సంక్రాంతి -- ర ర ర ర  

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ


తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే

నీటినీ చల్లెనే  - ముగ్గులే పెట్టెనే

రంగులే  దిద్దేనే - పువ్వులే చల్లెనే

ఓర్పుతో సంతసం - నిత్యధర్మాలునే 

కాలమే మార్చెనే - కావ్యమే చెప్పెనే ఈశ్వరా 


రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముయే 

నిమ్ము  ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ మయే    

తమ్మి నీమోము కెం - దమ్మి  నీ రూపయే  

చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండుయే  

కమ్ముకొచ్చేటిదే - కర్తవ్యం దీక్షగా ఈశ్వరా 


కళ్ళలో  వెల్తురూ - కాంతిలో సౌఖ్యమై 

చీకటే మెట్టుగా  - గుట్టుగా భావమై 

పద్యమే వేదమై  - భావమే  నాదమై

అందమే సొంతమై - శ్రీమతీ సౌక్యమై 

ధైర్యమే జ్ఞానమై - మౌనమై మోక్షమై ఈశ్వరా 


తామసం తగ్గెనే - తన్మయం చెందెనే

సుందరం కాంతలో - నోములే పండెనే

మన్మధా అంబరం  - ప్రుద్విలో ప్రేరణే  

చీకటే తీరెనే - వెల్తురే పంచెనే         

సంబరం లక్షణం - సంతసం సంభవం ఈశ్వరా  


పున్నమీ వెన్నెలే - వేకువే  మంజులం

మోహనం నిర్మలం - రామనీ రూపమే

ప్రుద్విలో సంగ్రహం - నింగితో సంభవం

దివ్యమై  సవ్యమై  - మాధవో మాధవం 

సాధనం శోధనం - సాహసం సంగమం ఈశ్వరా 


___(()))____



కవితా సాక్షి ... 1...17..08..2021


కాలానికి అతీతమై ప్రేమగా 

పలికి నలిగి చూస్తూనే ఉన్నా  

మొహమ్ము అతీతమై మనసుగా 

వెలుగులకు కరిగి పోతున్నా  


సహనాని కిది అతీతమ్ముగా   

దీపము వెలిగై చూస్తూనేఉన్నా 

హృదయాని కిది అతీతమ్ముగా   

నిలిచి మదిలోన చేరుతున్నా 


ప్రాణానికి అతీతమైనదిగా 

తకిలిగా తిరిగి వెంటేవున్నా 

స్నేహానికి అతీతమైనదిగా 

ఆకలి నేను తీర్చుతూనే ఉన్నా 


మౌనానికి అతీతమైనదిగా 

అరచి కఱచి ప్రేమగా ఉన్నా 

వేదానికి అతీతమైనదిగా 

చదువు తెలుపు ఆశగా ఉన్నా  


యుగయుగాల నుండియే ప్రేమగా 

తరాల భ్రమలను తొలుస్తున్నా 

కలి కాలం నిజమైన ప్రేమగా 

సాక్షిగా బతికి బతికిస్తున్నా 

--(())--

ఓం శ్రీ మాత్రే నమః...ఓం నమః శివాయ


ప్రాంజలి ప్రభ ... జీవితంలా ..17..08..2021


ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకో 

తెల్పి తెలప లేనట్టి జీవితంలా 

కధా కధలుగా కదులు టెందుకో

చిత్ర విచిత్రమైనట్టి జీవితంలా  


మనల్ని నడిపించేవాడు తెల్సు కో 

తల్లి తండ్రి గురువుల జీవితంలా 

చెడు మరచి మంచిని తెలుసుకో 

శివుడాజ్ఞతో కదిలే జీవితంలా 


బందాలలోని సంబంధం తెలుసుకో  

స్నేహం, ప్రేమ వంటి పేర్ల జీవితంలా 

జన్మ ఋణబంధమ్మును  తెలుసుకో  

త్యాగ బుద్ధితో  ఆనంద జీవితంలా 


వివాహ బంధంతో ఏకం తెలుసుకో 

సుఖదుఃఖం కలయిక జీవితంలా 

బంధంతోను బంధుత్వాలు తెలుసుకో 

బరువు భాద్యతలతో జీవితంలా    


స్నేహంలోని సంబంధాలు తెలుసుకో

మిత్ర బంధంతో మనసు జీవితంలా

కాలగర్భంలో కలిని తెలుసుకో 

పూర్వ జన్మ ఋణబంధ జీవితంలా


వాడి మాటలలో మర్మం తెలుసుకో

నిజ నిర్ధారణ తో అనుకరించు

పొడి తడి ముడి దడి తెలుసుకో

అర్ధం పరమార్ధాన్ని అనుకరించు


వేడిదో చల్లనిదేదో తెలుసుకో

బుధ్ధి కసలతను అనుసరించి

దాడి సక్రమం, అక్రమం, తెలుసుకో

నిశ్చలంగా శాంతిని అనుసరించి


ఓం శ్రీ మాత్రే నమః...ఓం నమఃశివాయ

0


ఘర్షణ ... సంఘర్షణ ..3 ప్రాంజలి ప్రభ...17--08--2021


నీ కంటిలో నలత వేలుగు నైనాను

నీ మాటలో మమత మాధవ నైనాను

నీ ఆటలో అలుపు ఆశగ నైనాను

నీ వేటలో అలుక  ఆకలి నైనాను ...........9


మినిగురు పురుగులు మెరియును క్షణం

వనితల నయనములు మెరియు క్షణం

కలతలు తొలగును వెలిగియు క్షణం

మనిషితొ ధనము నిలవదు ఎ క్షణం .... 10


ఉబలాటం, మెరుపూ  క్షణ కాలం

కలలాటం, కులుకూ  క్షణ కాలం

మదిలాటం తనువూ  క్షణ కాలం

మహిలాటం బరువు  క్షణ కాలం  ...... .. 11


ప్రపంచాన్ని చదవాలను కున్నా - ఊహల పరిధిలో ఉన్నా

మనోనీతి  తెలపాలని కున్నా - ఊయల తరువులో ఉన్నా

మనస్సే ఒక తపస్సని ఉన్నా - ఊపిరి వరదలో ఉన్నా

శిరోభార మవకుండగ అన్నా - ఊరు మనగడలో ఉన్నా .... 12


మన   సిచ్చిన మనసు తట్టే రాగాలను ఆలకించు

అనుబంధపు తనువు పెట్టే మొహాలను సంస్కరించు

బలవంతపు భ్రమలు పెట్టే వేషాలను బ్రతికించు

పరిబ్రమించు సెగలు పెట్టే మోసాలను ఊరడించు .... 13


చింతన చేయుచు బ్రతికే మనిషి క్షణ సుఖంకోసం

కాలము నమ్మక  వెతికే మనిషి క్షణ  మనో వాదం

ప్రేమయు పంచక మరిచే మనిషి క్షణ పెనూ భూతం

సౌఖ్యము పొందియు కలిసే మనిషి క్షణ లతా మయం .... 14

0


ప్రాంజలి ప్రభ....4...నేటి కవిత


గొప్పవాళ్ళు నిర్ణయాన్ని నమ్మడం నిజం          

వాళ్ళను అనుకరణ  చాలా కష్టం                                     

ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారం             

గుర్తింపు ఉన్నా చూసేది మంచి గుణం


మనమెంత మంచికులంలో పుట్టినా                           

అందరూ చూసేది మంచితనముయే                  

మన దేశ మందు గొప్ప మతమైనా

అందరూ చూసేది మానవత్వమ్ముయే


ధనముంటే  ధనవంతు డౌతాడులె           

అదే దానం చేస్తే భగవంతుడగు

మంచిగున్న మానవుడవుతాడులె

నిజః తెలిపితే భగవంతుడగు

0


ప్రతిభ హృదయంలొ కదిలెడి భావ చినుకు

మతిని చేరి రంజిల్లుటే

గతిని నిర్దేశించిన జీవి కాలమందు

శృతికి సాహిత్య వెల్లువే


ప్రగతిశీల ప్రభాత మే పగలు రేయి

జగతి ఏలు తెలుగు లీల

యుగము ‌‌‌‌లెన్ని మారిన కధ లేలు చుండు

ఆగదు తెలుగు సాహిత్యం


యువత మారండి మార్చండి యుగము నందు

జయము ఆధునిక ఆచరణ

మాయ గూడత్వాన్ని తొలచి మహిమ చూపి

భయము మనసు చేర్చకు


మనిషి నీళ్ళలో మునిగేను మగువ కొరకు

మనిషి చిత్రమైనది ప్రేమ

మనిషి చవటైన మేధావి పలుకు గట్టి

మనిషితో కలిసె మనసు


సిరులు జూసియు పలుకుల సరుకు మారు

పరులతోడపగను పెంచు 

కరుణ మేరకధలు చేరు కలలు లాగ

మార్పు లెపుడు కదలిరావు


0


పిన్న వయసులో పెరు గును ప్రేమలు గను

కన్న మనసును మరవరు

చిన్న మలుపులు తోమారి చింత తీర్చి

మన్నన కలలు తీర్చునే


యుక్త వయసులో ప్రేమలు రగులు చుండు

శక్తి వరుసైన ప్రేమతో

వ్యక్తిగత మును తెలిపియూ వలపు లిచ్చి

యుక్తి పెంచును ప్రేమలే


యవ్వనంలో నా ప్రేమ హాయి గొలుపు

నవ్వు లకు లొంగి చెడకుమా

యవ్వనపు లీల కొత్తగా అడుగు వేయు

నువ్వు నేనుఅనిపించునే


వృద్ధులు వికలాంగుల ప్రేమ విధిగ వుండు

వృద్ధులను నిరాశ వలదు 

వృధ్ధి కియె పెద్దల సలహా వలన మేలు

వృధ్ధ సంపదే రక్షగా

0


కాల మాయయే మనలోని కధలు కెలికె

కాల పాపమే మిగిలేను

కాల క్రమేణా పెరుగుతూ గళము తెలిపె

కాల బంధమే మిగిలేను


వేరు బలమును గమనించి వలయ వలదు

మారు తరువుని ప్రేమించు

వేరు చిన్నదే ఫలములు వచ్చు చేరు

మారు మలుపుని బతికించు


మాయ ఏమిటి అంటే ను మనసు మెరుగు

ఛాయ పడకున్న చాలును

రాయి నైనాను బతుకులో రవ్వ నిచ్చు

మాయ లేనట్టి ఓర్పుగా


రేయి మెల్లమెల్లగ సాగె రేడు లేక

రాయి కలుగు వెలుగు చేరె

మాయమవునురోగము లన్ని మందు పడగ

కాయమేమారి పోవును


మాయలోననే మునగకే మనసు నుంచు

కాయము సుఖము లను పొందు

జయము మనదే జీవిగా జాత రవ్వు

భయము వదిలి బతుకుకై

0



97... కంసాసారీ - య/మ/ల IUU UU UI 

7 ఉష్ణిక్కు 66 

++

వినంగా రావే యిందు - కనంగా లేవే ముందు 

మనంగా నీదే శక్తి  - యనంతా నీవే ముక్తి 

++

ముదమ్మే లేదే యా బు - ద్బుదమ్మా నాజీవమ్ము

పదాలం గొల్తున్ రమ్ము  - సదా నీపేరే సొమ్ము 

++

మురారీ రావా నన్ను - గరాలం బ్రోవం జెన్ను 

స్థిరమ్మీ నావేడ్కోలు  - భరించన్ నీవీడ్కోలు 

++

98....కాహీ - స/త/ల IIUU UII

7 ఉష్ణిక్కు 100

++

సమభావా తీతము - సమవేదం పాఠము 

సమరాగం తీరము  - సామవైనం మోహము 


మన దైవమ్మే హరి  - మనపూజల్పై గుఱి  

మన రాగమ్మే సిరి  -  మాన ఆహారం వరి  

మన కాతండే తరి = మన జీవాబ్ధిన్ దరి 

మన భావాలే మరి - మన వేదాలే  గుఱి


నవసేవాతత్వము - నవ మార్గమ్మే ఇది 

నవభావాతత్మము - నవ తత్వమ్మే ఇది  

విన రావా మాకత - కన రావా మావెత 

మన రావా మాజత - యినవంశోద్ధారక 

++

మన కారోగ్యమ్మును - మన కైశ్వర్యమ్మును 

మన కానందమ్మును - వనజాక్షుండే యిడు 

మన సాంఘీకమ్మును - మన ధైర్యమ్మే ఇది 

మనసామాన్యమును  - మన  కాలమ్మే ఇది  

*****

99...ఉలపా - భ/న/గ UIII IIU  గుణాలతో వ్రాసే చక్కటి పద్యకవిత 

7 ఉష్ణిక్కు 63

++

యీఋతువు విరులే - యీఋతువు మరులే 

యీఋతువు లతలే - యీఋతువు జతలే 

యీ కలము కధలే ... యీ కధల వెతలే 

యీ వెతల మెరుపే.. యీ మెరుపు కలలే 

++

భారతము మనదే - గీరతము మనదే 

భారతము చదువోయ్ - గీరతము వలదోయ్ 

దారుణము తలపే .. భారముయు మనదే  

కారణము వలపే - భాధ్యతయు మనదే 

++


యీధరకు వర మా  - మాధవుని వరమా 

బాధలకు బల మా  - శ్రీధరుని గళమా 

ప్రాణమును బలమా ... పోషణకు విలువే  

కాలమునకు సబబే .. మానమునకు మలుపే 

++  

******

100...  కాహీ - స/త/ల IIUU UII... అనే గుణాలు అంత్యానుప్రాస లో వ్రాస్తా చాలా బాగుంటుంది 

7 ఉష్ణిక్కు 100 8 వ  పదం యతి ప్రాస యతి .. 

++

మన దైవమ్మే హరి - ఘన రూపమ్మే గుఱి 

మన కాతండే తరి - మన జీవాబ్ధిన్ దరి 

మన ల్లక్ష్మమ్మే గురి .. మనదేహమ్మే  హరి   

మనదాహమ్మే సిరి  .. మనకాలమ్మే దరి 

 

విన రావా మాకత - కన రావా మావెత 

మన రావా మాజత - యినవంశోద్ధారక 

సమయమ్మే మాకత  .. వినయమ్మే మాజత

విషయమ్మే మావెత .. వివరమ్మే నాయక    

++

మన కారోగ్యమ్మును - మన కైశ్వర్యమ్మును 

మన కానందమ్మును - వనజాక్షుండే యిడు 

మనతత్వార్ధమ్మును  .. మానధర్మార్ధమ్మును 

మనమానాభ్యు మ్మును ... మన ప్రేమాభ్యమ్మును 

--(())--