1, జూన్ 2020, సోమవారం

స్టోరీస్

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

kazhiyur varadan's blog | DIVYADESAM …….. ..DIVYACHARITHAM……DIVYA ANUBHUTEE
* మంచి పెద్ద కథ.
* బ్రహ్మాండము అంతా నారసింహము
* పది చాలు పెరియవా


మంచి కథ................రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేశారు.  పెద్ద అధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు.  చివర్లో సుందరయ్యపిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు. 
తనకి జరిగిన సత్కారానికి  కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంత భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగా ఇష్టం లేకపొయినా సరే, పది మందికోసం ఒప్పుకోక తప్పలే దంటు” తన అనుభావాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుయిటి, వగైరా  అన్నింటికీ సంబంధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు.  సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాటు జరిగింది.  కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు.  రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే  సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది.
మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు  అన్నీ సెటిల్ చేసుకున్నాడు.  మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు.  అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు. 

అటు సుందరయ్య కొడుకూ, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్నారు. అందరి పిల్లల్లాగే వాళ్ళకీ తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. ఆ విషయంలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించడం కష్టం.  అందుకే పట్టువిడుపులు ఉండాలి. రోజులతోపాటూ మనం కూడా మారాలి.   అంతేకానీ సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలా అని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు.

 ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది. 
"వాళ్ళు ఏమైనా నీతో అన్నారా?" అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు.
"అబ్బే.. నన్నేం అడగలేదు.  ఆడిగినా నేనేం మాట్లడతాను?  ఆ విషయం వాళ్ళకి తెలుసు."
ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు.   ఈలోగా ఏదో ఒకటి తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్ఫురించటంతో నిద్ర పట్టేసింది.  ఉదయమే ఇంట్లో అందరిని పిలిచాడు సుందరయ్య.
"నేను,  అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం.  పుట్టి పెరిగిన ఊరు వదలి రావాటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది.    నా రిటైర్మెంటు  డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం  ఇవి! మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్థం కొంచెం డబ్బులు మాకు వుంచి  మిగతావి మీరిద్దరు తీసుకోండి.  ఇదిగో  బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలిగింది ఇదే!" అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెక్కలు రాసి, చెక్కులు  వాళ్ళ చేతిలో  పెట్టాడు.
వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది.  నిజమే..అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిది. అయితే  ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన, అంతా సూటిగానే చెప్పేస్తారు .
"వద్దు నాన్నా.   మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గానీ ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గానీ, అవసరాలు గానీ లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్న గారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి" అంటూ అబ్బాయి చెక్కుల్ని తిరిగి  తండ్రి చేతితో పెట్టేశాడు. 
అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపోయింది.  అందరి ఉహాలు ఓరకంగా ఊహలుగానే ఉండిపోయాయి .
"అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం.  మన పాతిల్లు, ఆ వీధి చూసి చాలా కాలమయింది" అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది. 
"నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాలా కాలమయింది " అంటూ అందరు బయలుదేరారు.
"అబ్బా! మన వీధి చాలా మారిపోయింది ."
"అవున్రా. ఈ  వీధిలో అందరి ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేసారు.  ఒక్క మనం అద్దెకున్న వాళ్ళ ఆ ఇల్లే అలాఉంది. ఈ మధ్య  ఆ ఇంటివాళ్ళు అమ్మెస్తే, ఎవరో కొనుక్కొని రీమోడల్ చేయించారట. మొక్కలు, చెట్లు పాడావకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళలా ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడుచేయకుండా, బాగుచేయించారు. బావుంది!" అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లూ తిరిగి, ఇంటికొచ్చేసారు. 
ఆ రోజు సాయంత్రమే పిల్లల ప్రయాణాలు. 
‘ఏవిటో! వారం రోజులు ఏడు క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రైల్వే స్టేషన్ కు వెళ్లి , వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ.   ఇంటిికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు. నాన్నగారికి  అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరు చింపి చదవసాగారు.
నాన్నగారికి,
మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక  ఈ ఉత్తరం రాస్తున్నా౦.  మరోలా భావించకండి.   మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు! దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయాం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం.  కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కానీ మేం చాలా కోల్పోయాం నాన్నగారుా!! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం,  కానీ నీళ్ల రుచి తెలియదు!  మీ తరంవాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు.  మేం పులిస్వారీ చేస్తున్నాం.  మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.  మీరు పెద్దలమాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం!! అమ్మ ఎప్పుడూ  అంటుందే.. అలా మేం గోరీలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారుా!! 
ఒక్క విషయం చెప్పగలంనాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు.  మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది!  మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కానీ ఆ మేధస్సుతో  గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!.  ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఈ రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నాలలో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించేరు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతో కూడా బంధాలున్నాయి. చెట్లూ, పశువులూ,పక్షులూ అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా  మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు!

అందుకే  మమ్మల్ని  మీవాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుభందాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా  ఓపని చెశాం!!  అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న  తాళంచెవి  ఆఇంటిదే!! మీరు ఆఇంటిలోకి మారి, స్వేచ్ఛగా, హాయిగా  ఉండాలనేదే  మాకోరిక!  

అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్నా!! త్వరలో మాకు పుట్టే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్లు కాకుండా,  మీరు పెరిగినట్లు పెంచి,  పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు  తీరిక లేక, పెంచలేక  కానేకాదు!!  మా స్వార్థం అంతకంటే కాదు!!  వాళ్ళు మేం పెరిగినట్లు పెరగకూడదు. మీరు పెరిగినట్లు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులలాగానే ఎదగాలి!  
ఓ విషయం చెప్పనా నాన్నా?  మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాలా అవసరం నాన్నా! కాదనరుగా!!
ఇట్లు
మీ అమ్మాయి, అబ్బాయి.

ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు  కోనేరుతో నిండిపోయింది!  ఆ కళ్ళతోనే వసంతమ్మ  కళ్ళల్లో వసంతాన్ని చూశాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు హడావిడిగా కనిపించేయి.
అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!!

కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే  ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చటానికి పనికొస్తాయి!

సూపర్ స్టోరీనే కదా?...........మరి మీకు నచ్చితే మీ మిత్రులకు పంపిస్తారు కదూ!!!

* బ్రహ్మాండము అంతా నారసింహము

క|| ఇందు గల డందు లేడని,
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం,
డెం దెందు వెదకి చూచిన,
నందందే కలడు, దానవాగ్రణి ! వింటే.
తండ్రీ ! శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా? ఎక్కడ ఎక్కడ వెతికి చూస్తే అక్కడ ఉంటాడు నారాయణుడు. వ్యాపకత్వము చేత అన్నిటి యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్నాడు. ఓహో! అలాగా ఈ స్తంభములో ఉంటాడా అన్నాడు? ఇప్పుడు వస్తున్నది నరసింహావతారము. పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు. హిరణ్యకశిపుడు మూడు వేళ్ళు ముడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడనుండి పైకి రావాలి. రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట వమ్ము అయిపోతుంది. రావడము అంటూ జరిగితే శంఖ , చక్ర ,గద , పద్మములు పట్టుకున్న శ్రీమన్నారాయణునిగా వచ్చి హిరణ్యకశిపుని సంహారము చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతి బంధకము .ఆయన ఎన్ని వరములు ఇచ్చాడో అన్ని వరములకు మినహాయింపుగా రావాలి. అన్ని వరములకు మినహాయింపుగా ఎక్కడనుండి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడనుండి రావాలి.

మ|| ' హరి సర్వాకృతులం గలం ' డనుచు బ్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ' యెందును లేడు లే ' డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానాజంగమస్థావరో
త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్

బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణు తత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా. అన్నిటా నిండిన నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు తిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో ఉన్నాడా? అన్నాడు. అంటే మళ్ళీ అదేమాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు . కొడుకు మాట కాదని నిరూపించాలి. కొడుకు మాట నిలపెట్టాలి అని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటు మాట్లాడుతున్నాడు. అతని మాట నిలపెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది. ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోనుండి అన్నాడు. అలా అనడముతోనే పెళపెళా శబ్దములు చేస్తూఆ స్తంభము బద్దలు అయి అందులో నుండి విస్ఫులింగములు పైకి వచ్చి పెద్ద కాంతిమండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటికి వచ్చింది. అందులోనుండి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైన గర్జన చేస్తు ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన వేగమును వత్తిడినీ తట్టుకోలేక వేయి పడగలు కల ఆదిశేషుడు సార్వభౌమము మొదలైన దిగ్గజములు కూడా భూమియొక్క బరువుని ఓర్చలేక తలలు వంచాయి. ఆయన పాదములలో శంఖ , చక్ర , పద్మ రేఖలు ,నాగలి , అమృతభాండము మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్ఠమైన మోకాళ్ళు, ఐరావతము యొక్క తొండము వంటి బలిష్ఠమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డాణము, చప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారము పైన సింహము యొక్క ముఖము పెద్ద దంష్ట్రలు భయంకరమైన వాటిని తెగకోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి. అదిరి పడిపోతున్న పెదవులు. మంధరపర్వత గుహలను పోలినటువంటి నాసికా రంధ్రములు. పుట్టలోనుండి పైకి వచ్చి కోపముతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక. కోటి సూర్యుల ప్రకాశముతో గురి చూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు. నిక్క పొడుచుకున్న వెంట్రుకలు. పెట్టుకున్న పెద్ద కిరీటము. అనంతమైన బాహువులయందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగుతీసి అడుగు వేస్తు వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇటు అటూ ఊపితే కేసరములు కదలి విమానములో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానములనుండి కిందపడిపోయి, ఆ మేఘములు అన్నీ కొట్టబడి, పర్వతములు అన్నీఘూర్ణిల్లి, సముద్రములన్నీ పొంగిపోయి, భూమండలము అంతా కలత చెంది స్వామి నరసిం హావతారము వచ్చింది ఇప్పటివరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వమును పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపముతో తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నృసింహావతారమై వచ్చాడని లోకము అంతా భీతిల్లిపోతే 33 కోట్లమంది దేవతలు ఆకాశములో నిలబడి స్థోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండముతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకుని వచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రము. ప్రాణము ఉన్నది ప్రాణము లేనిదీ కాదు గోళ్ళు, జంతువుకాదు, పాముకాదు, ఆయుధము కాదు, అస్త్రము శస్త్రము కాదు, రాక్షసులు దేవతలు కాదు, యక్షులు, గంధర్వుల, కిన్నెరలు,కింపురుషులు, నరుడు కాదు నరసింహమై గంగానది సుడితిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుండగా విశాలమైన వక్షస్థలముతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివితప్పి తల వాల్చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్ష:స్థలములో ఉన్న ఉర: పంజరములోని ఎముకలు అన్నిటినీ కోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోసిళ్ళతో పట్టి త్రాగి ఒళ్ళు, బట్ట , కేసరములు అన్నీ నెత్తుటితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షసగణములన్నిటినీ చంపి పెద్ద శబ్దము చేస్తూ డొల్ల బడిన హిరణ్య కశిపుని శరీరముని విసరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్థోత్రము చేసారు. ఏమి నారసింహ అద్భుత అవతారము? ఇంతమంది స్థోత్రము చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యానపాయినివి ఆయన వక్ష:స్థలములో ఉంటావు. నిన్ను చూస్తే ప్రసన్నుడౌతాడు తల్లీ దగ్గరకు వెళ్ళమని అన్నారు.

ఆమె నా భర్త ముఖము పూర్ణచంద్రబింబములా ఉంటుంది. ఇంత కోపముగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది. శ్రీమహావిష్ణువు అవతారములలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారము నరసింహావతారమే. అందరూ భయపడుతుంటే ప్రహ్లాదా! నీ గురించి వచ్చినదే ఈ అవతారము నీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని అన్నారు. చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదములను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి, పెద్దనోరుతో, గోళ్ళతో, గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది లోకములో ఉన్నది దాని పేరు సంసారము. దానికి భయపడతాము గాని నీకు భయపడతామా ? అన్నాడు. బ్రహ్మాది దేవతల తలమీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరమ భక్తుడిని అని పేరుపెట్టి ఏమీతెలియని అర్భకుడిని అయిన నాతల మీద చెయ్యిపెట్టి నాకోసము పరుగెత్తుకు వచ్చి నా మాట నిలపెట్టడానికి స్తంభమునుండి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయములో ఎంత కారుణ్యము ఉన్నదో నాకు తెలియదు అనుకుంటున్నావా? అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వరా నీకు నమోవాక్కములు అని స్థోత్రము చేసాడు.

పరవశించిననరసింహస్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరముకావాలో కోరుకోమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు? నాకు ఎందుకు కోరికలు? ఏకోరికా లేదు. నీపాదములయందు నిరతిశయ భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకముతో నీకు వ్యతిరేకముతో బతికాడు ఆయనకు ఉత్తమగతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నావంక చూసి స్తబ్దుడైనాడో నా గోళ్ళతో చీల్చి నెత్తురు తాగానో, ఆనాడు నీ తండ్రే కాదు అంతకుముందు 21 తరములు తరించాయి.

 ప్రహ్లాదా నీవు బెంగపెట్టుకోవద్దు. నీకు ఆశీర్వచనము చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడవై రాజ్యమును ధార్మికముగా పరి పాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీకధ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో, అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను. ఎంతో సంతోషిస్తాను. సభామంటపములోని వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దాని వలన రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానమునకు శ్రీ మహావిష్ణువే ఫలశృతి చెప్పారు.

--(())--


* పది చాలు పెరియవా
ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన అమాయక పల్లె ప్రజలను చూసి నాకు ఒక సంఘటన గుర్తువచ్చింది. ఇది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసే ఒక మాజీ ఉద్యోగి నాతో పంచుకున్న అనుభవం.

ఆయన ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మౌనంగా ఉన్నారు. ధ్యానంలో ఉన్నారని తలచి అక్కడున్నవారందరూ స్వామివారి అనుగ్రహ వీక్షణాల కోసం కింద కూర్చున్నారు. కొద్దిసేపటి తరువాత ఒక పేద రైతు ఏడుస్తూ వచ్చి, తన కుమార్తె వివాహానికి ధన సహాయం చెయ్యవలసిందిగా మహాస్వామి వారిని అర్థించాడు.
మహాస్వామి వారు కళ్ళు తెరిచి విషయం ఏమిటని అడుగగా, “నా కుమార్తె వివాహం నిశ్చయమైంది. పెళ్ళికొడుకు తరుపు వారు పది బంగారు సవర్లు కావాలని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని చెప్పాడు.

”నా దగ్గర బంగారం ఎక్కడిది? నేనెలా నీకు సహాయం చెయ్యగలను?” అని అడిగారు స్వామి. ”మీరు నా జీవితంలో ఎప్పుడూ నాకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. మరి ఇప్పుడెలా నాకు “లేద”ని చెప్పగలరు. మీరే నాకు సహాయం చెయ్యాలి” అని విన్నవించాడు.

అతనికి తనపై గల భక్తిని నమ్మకాన్ని చూసి స్వామివారు ఇలా అన్నారు. “నీకు తెలుసా మనమందరం అమ్మ కామాక్షి పిల్లలం. ఆమె సన్నిధికి వెళ్ళి ప్రార్థించు. ఆవిడే నిన్ను రక్షించగలదు”

“నాకు మీరు తప్ప ఏ దైవమూ లేదు. నేను మిమ్మల్నే ప్రార్థిస్తాను” అని అక్కడే నిలబడిపోయాడు. ”నేను చెప్తున్నాను, కామాక్షి అమ్మ దగ్గరకి వెళ్ళి మనఃస్ఫూర్తిగా అమ్మని ప్రార్థించు. వెళ్ళు”

అతను అయిష్టంగానే కళ్ళ నీరు కారుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని కల్మషం లేని భక్తి స్వామివారిని కదిలించింది. స్వామివారితో మాట్లాడాలని చాలా మంది ఆత్రుతగా వేచియున్నారు. చాలాసేపు అక్కడ నిశ్శబ్ధం తాండవించింది. దాదాపు ఒక గంట తరువాత, స్వామివారు అందరితో మాట్లాడటం మొదలుపెట్టారు.

మరో గంట తరువాత ఈ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగి వంతు వచ్చింది. అంతలోనే ఒక గుజరాతీ జంట స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఒక పళ్ళెంలో పళ్ళు, కొన్ని బంగారు సవర్లను సమర్పించారు. వాటిని చూసి స్వామివారు ఆ బహుమానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు.

“మీ ఆశీస్సులు మాకు కలిగితే, పదకొండు సవర్ల బంగారం సమర్పించుకుంటామని మేము మొక్కుకున్నాము. మీ ఆశీస్సులవల్ల మేము రక్షింపబడ్డాము కాబట్టి మేము మొక్కు తీర్చుకుంటున్నాము పెరియవా. దీన్ని మీరు స్వీకరించండి స్వామి. ఇది మీది కనుక మీరు ఏమైనా చేసుకోండి” అని పట్టుబట్టారు.

వాళ్ళను వేచి ఉండమని చెప్పి, అక్కడున్న వార్లో ఎవరిదగ్గరైనా కారు ఉందా అని విచారించారు. ఆ ఉద్యోగి తన వద్ద ఉందని ఎక్కడికి వెళ్ళాలో సెలవియ్యండని ప్రార్థించాడు. ”నువ్వు అతణ్ణి చూశావు కదా? కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి అతణ్ణీ తీసుకుని రా”

అరగంటలో అతణ్ణి తీసుకునివచ్చారు. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాగానే స్వామివారి పాదాలపై పడ్డాడు. “అమ్మను మనఃస్పూర్తిగా ప్రార్థించావా?” అని అడిగారు స్వామివారు. ”నాకు ఏ ప్రార్థనా తెలియదు. అమ్మ ముందుకు వెళ్ళి నా కష్టం చెప్పుకుని ఏడ్చాను అంతే!” 

“నీ ప్రార్థనకి అమ్మ కరుణించింది. ఇదిగో ఆవిడ ఇచ్చిన బహుమానం” అని ఆ పళ్ళెం చూపించారు. ఆనందంతో అతని ముఖం వెలిగిపోయింది. వాటిని చూసి, “నాకు పది చాలు పెరియవా. పదకొండు వద్దు” అని అమాయకంగా ఆనందంతో నీరు నిండిన కళ్ళతో అభ్యర్తనపూర్వకంగా స్వామివారి వేపు చూశాడు. చమ్మగిల్లని కళ్ళతో ఒక్కరు కూడా లేరు అక్కడ. వారందరికి కేవలం స్వామివారి అవ్యాజ కరుణే అతని సమస్యను పరిష్కరించిందని నమ్మకం. కాని కొందరికి అది ఒక అద్భుతంగానో, కాకతాళీయంగానో అనిపించవచ్చు.
--- ఎ. ప్రసన్న కుమార్, “ఎ సేజ అట్ పంధర్ పూర్” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

మధుర మీనాక్షి దేవియే నమః


చిత్రంలోని అంశాలు: లోపలి ప్రదేశం

మీ ఫేస్ బుక్ వారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రాంజలి  ప్రభ అభిమానులకు పంపే అవకాశం లేకుండా చేసారు. 10 పోస్టులు పెట్టినా ఒక్కరు కూడా చుడుట  లేదు దీని కర్ధం ఏమిటి ?  మీ నిర్లక్ష్యం వల్ల నాకష్టం బూడిదలో పోసిన పన్నీరవవుతున్నది . 10 బ్లాగుల్లో మరియు ఒక డొమైన్ ఉన్నా ఫలితం లేకుండా సెహెతున్నారు మీ వ్యవస్థాపకులు తెలుగువారికి ఫస్ బుక్ దేనికి ? నాది ట్విట్టర్ రద్దు చేసారు గతంతరం లేక ఇక్కడ పోస్టుచేస్తున్నాను  

* ఏ భార్య గొప్పది ?

ఒక వ్యక్తికి నలుగురు  భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి...
ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు...
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర
చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.......

రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా
అతని సమస్యను తీర్చి పంపేది.....

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే
వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద
ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా \
చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్....
మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు.

నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై
తన మూడవ భార్యను ఇదే కోరాడు........

మూడవ భార్య ఇలా అంది.

" ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు......

" నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను
బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా.......

మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.

" మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం
దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి "

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ.....
ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము.
అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

నాలుగవ భార్య......... మన శరీరం......

మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు......

రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు.......

మొదటి భార్య..............మన ఆత్మ..........

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి....
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా!

కథ కంచికి మనం ఇంటికి...



🌀 *పిత్రార్జితం*🌀
   

*‘‘అమ్మ ఎవరి దగ్గర ఉంటుంది?’’*

వినోద్‌ తన అన్నయ్యను అడుగుతున్న ప్రశ్న విని ఉలిక్కిపడింది సావిత్రి. అటువంటి సన్నివేశం ఎన్నో కథల్లో చదివింది, ఎన్నో సినిమాల్లో చూసింది. కానీ తన జీవితంలో మాత్రం అటువంటి సన్నివేశం రాకూడదనీ, భర్తకంటే ముందే పునిస్త్రీగా వెళ్ళిపోవాలనీ అందరు దేవుళ్ళనూ కోరుకుంది. అయితే తన ప్రార్థన ఫలించలేదు. భర్త గుండెపోటుతో తనకంటే ముందుగా భగవంతుణ్ణి చేరుకున్నాడు.

‘‘అమ్మ మన ఇద్దరిదగ్గరా ఉంటుంది. అలా అని ఏడాదికి ఆరునెలలంటూ మనం పంచుకోవలసిన అవసరంలేదు. ఆమెకు ఇష్టమైనన్ని రోజులు ఎవరి ఇంట్లోనైనా ఉండొచ్చు’’ అన్నాడు విజయ్‌.

విజయ్‌ సమాధానం విన్నాక ఆమె మనసు కాస్త స్థిమితపడింది. ‘అయినా తనకెందుకు లేనిపోని భయాలు, అనుమానాలు? తన బిడ్డల గురించి తనకు తెలియదా?’ అనుకుంది.

విజయ్, తండ్రి బీరువా తెరిచి అందులోంచి బ్యాంకు పాస్‌బుక్‌ తీశాడు. తండ్రి పోయినరోజు నుంచి వైకుంఠ సమారాధన వరకూ అయిన ఖర్చులు ఇద్దరూ కలసి లెక్కలు వేశారు. బ్యాంకులో ఉన్న డబ్బు తాము ఖర్చుపెట్టిన మొత్తంకంటే ఎక్కువగానే ఉండటం చూసి సంతోషించారు.

భర్త అకౌంటులో ఉన్న డబ్బు గురించి తనతో సంప్రదించకుండానే కొడుకులు నిర్ణయాలు తీసుకోవడం సావిత్రిని బాధించింది. ‘అయినా తండ్రి అంతిమయాత్రకూ కార్యాలకూ అయ్యే ఖర్చులు ఆమాత్రం భరించలేరా... ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు’ అనుకుంది.

తర్వాత ఇంటి ప్రస్తావన వచ్చింది.
‘‘మేమిద్దరం ఇళ్ళు కట్టుకున్నాం. అందుకు బ్యాంకు లోనుతోపాటు బయట కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ ఇల్లు అమ్మితే పదిలక్షలదాకా వస్తుంది. మేము చెరో అయిదు లక్షలు తీసుకుంటాం. ఎటూ నువ్వు మాతోనే ఉంటావు కాబట్టి ఇక ఈ ఇంటి అవసరం ఉండదు’’ అన్నాడు విజయ్‌ తల్లితో.

‘‘మీ నాన్నగారు ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లురా ఇది. కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఇల్లు కాదు. ఎంతో శ్రమతో, శ్రద్ధతో, ఆయన కష్టార్జితంతో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు జరిగాయి. మీ చదువులూ ఆటలూ మీ భార్యల సీమంతాలూ మీ పిల్లల బారసాలలూ... అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. ఎంతోమంది బంధువులూ స్నేహితులూ ఈ ఇంటికి వచ్చి, మన ఆతిథ్యాన్ని స్వీకరించి, మనసారా దీవించి వెశ్ళారు. మనకెన్నో తీయని అనుభూతుల్నీ మీ నాన్నగారికి తృప్తినీ ఆనందాన్నీ ఇచ్చిన ఈ ఇంటిని అమ్మడం నాకిష్టంలేదురా’’ అంది సావిత్రి.

‘‘మనిషే పోయాక ఇక ఇల్లెందుకమ్మా?

మా ఇళ్ళకీ బంధువులూ మిత్రులూ వస్తారు. అక్కడ కొత్త అనుభూతులకు స్వాగతం పలుకుదాం. పైగా ఆర్థికంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం. ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుల్తో మా సమస్యలు తీరితే నాన్న ఆత్మ కూడా సంతోషిస్తుంది’’ అన్నాడు వినోద్‌.

‘‘లేదురా, ఆయనకు ఈ ఇల్లంటే ప్రాణం. కనీసం నేను ఉన్నంతవరకైనా ఇల్లు అమ్మకండి. కావాలంటే నా నగలన్నీ ఇస్తాను. అవి అమ్ముకుని మీ అప్పులు తీర్చుకోండి’’.

‘‘నీ నగలు ఎన్ని ఉన్నాయమ్మా? అన్నీ అమ్మినా యాభైవేలు రావు’’ అన్నాడు విజయ్‌ విసుగ్గా.

‘‘అమ్మా, ఇంటి డాక్యుమెంట్లు కనబడటంలేదు. బ్యాంకు లాకర్లో పెట్టారా నాన్న?’’ బీరువా వెతుకుతున్న వినోద్‌ అడిగాడు.

‘‘లాకర్లో కాదు. నాన్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టారు. నేనూ ఆ విషయం మరచిపోయాను. ఇప్పుడు నువ్వడిగితే గుర్తొచ్చింది’’.

‘‘తాకట్టు పెట్టారా? అంత అవసరం ఏం వచ్చింది?’’ కొడుకులిద్దరూ ఒకేసారి అడిగారు.

‘‘మీ చదువుల కోసం’’.

‘‘మా చదువుల కోసమా? మా చదువులు పూర్తయి అయిదేళ్ళు కావస్తూంది’’ అన్నాడు విజయ్‌ అసహనంగా. బ్యాంకులోను వల్ల ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో తన వాటా మరింత తగ్గిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అతను.

‘‘కావచ్చు. ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసినా జీతం తప్ప మరో ఆదాయం ఆశించలేదు. మీకు ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోతే లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేటు కాలేజీల్లో మిమ్మల్ని ఇంజినీరింగ్‌ చదివించారు. మరి అంత డబ్బు ఆయనకు ఎక్కణ్ణుంచి వచ్చిందనుకున్నారు? మీకు ఉద్యోగాలొచ్చాక ఆయన అప్పుల గురించి మీరు అడుగుతారనీ మీ వంతు సాయం చేస్తారనీ అనుకున్నాం. కానీ మీకా ఆలోచన లేకపోయింది. మీముందు చేయిచాచడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆ అప్పు అలాగే నిలిచిపోయింది.

అప్పటికీ తన పెన్షను నుంచి కొంత, పైపోర్షను బాడుగ నుంచి కొంత బ్యాంకు లోనుకు కడుతూనే ఉన్నారు’’.

‘‘ఇంకా ఎంత కట్టాలట?’’

విజయ్‌ అడిగాడు.

‘‘అయిదు లక్షలు కట్టాలి’’ బీరువా నుంచి తీసిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను టీపాయ్‌మీదకి గిరాటేసి అన్నాడు వినోద్‌.

‘‘హు, ఏడ్చినట్లే ఉంది. ఈమాత్రం దానికి ప్రపంచంలో తానొక్కడే ఇల్లు కట్టినట్లూ పిల్లల్ని చదివించినట్లూ ఫోజులు’’ అన్నాడు విజయ్‌.

పిల్లలు భర్తను తేలికచేసి మాట్లాడుతూంటే సావిత్రికి ఎంతో బాధేసింది.

‘‘లోను తీసుకున్న ఆయన ఇప్పుడు లేరు కదరా. అయినా ఆ అప్పు మీరు తీర్చాలా?’’ అని తన అనుమానం వ్యక్తంచేసింది.

‘‘ఆయన లేకపోతేనేం? మేం బతికున్నాం కదా. ఆయన ఇంటికి ఎలా వారసులమో ఆయన అప్పుకూ వారసులమే. అయినా అవన్నీ నీకు చెప్పినా అర్థంకాదు. ఇక మమ్మల్ని వదిలెయ్‌’’ రెండుచేతులూ జోడించి విసుగ్గా అన్నాడు వినోద్‌. సావిత్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ‘తను చదువుకోలేదు. ఉద్యోగం చెయ్యలేదు. కానీ చెబితే అర్థం చేసుకోలేనిదేంకాదు. భర్త ప్రతి విషయం ఎంతో ఓపికతో తనతో చెప్పేవాడు. అర్థంకాకపోతే వివరించేవాడు. వీళ్ళకు అంత ఓపిక లేదు. అందుకే ఇలా విసుక్కుంటున్నారు. వీళ్ళకోసం, వీళ్ళ ఆరోగ్యం కోసం తను ఎన్ని పూజలు చేసింది? ఎన్ని రోజులు ఉపవాసాలుంది? ఎంత ఓపికతో అన్నీ అమర్చిపెట్టింది? అవన్నీ వాళ్ళకు ఇప్పుడు గుర్తులేదు. గుర్తుచేసుకోరు కూడా’ అనుకుంది.

ముఖ్యంగా కోడళ్ళముందు కొడుకులు తనను అలా విసుక్కోవడం ఆమెను మరింత బాధించింది. ‘కోడళ్ళను కన్నకూతుళ్ళలా చూసుకున్నారు తనూ భర్తా. వాళ్ళు కల్పించుకుని భర్తల్ని వారించకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంది. ఆర్థిక అవసరాలు అభిమానాల్ని ఇంతగా చంపేస్తాయా?’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

*   *   *

ఉదయం నిద్రలేచిన సావిత్రి గడియారం వంక చూసింది. ఏడు గంటలు చూపిస్తూంది. ‘అబ్బ, ఇంతసేపు ఎలా నిద్రపోయాను?’ అనుకుంటూ పిల్లల గదిలోకి నడవబోయింది. ఇంతలో కొడుకులు తమ కుటుంబాలతో ఉదయమే ఊరికి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది ఆమెకు.

‘రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయేసరికి పన్నెండు దాటింది. తెల్లవారుజామునే పిల్లల ప్రయాణం. నిద్రలేమి వల్ల తల పగిలిపోతూంది. కాఫీ గొంతులోపడితేగానీ అది తగ్గదు’ అనుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళి పాలబ్యాగులో చెయ్యిపెట్టి చూసింది. అది ఖాళీగా ఉంది.

తల్లిని తనతో తీసుకెళుతున్నాననీ మరుసటిరోజు నుంచి పాలప్యాకెట్‌ అవసరంలేదనీ పాలవాడితో విజయ్‌ ముందురోజు చెప్పడం గుర్తుకొచ్చింది. ‘ఇంటిపై లోను ఉందని తెలిసి, ఆ నిరుత్సాహంతో నన్ను పిలుచుకుని వెళ్ళడం మరచిపోయారు ఇద్దరూ’ అనుకుని నవ్వుకుంది.

షాపు నుంచి పాలప్యాకెట్‌ తెచ్చుకోవడానికి చిల్లరకోసం ఇల్లంతా వెదికింది. ఎక్కడా చిల్లరగానీ కరెన్సీ నోట్లుగానీ కనిపించలేదు. తలనొప్పి క్షణక్షణానికి అధికం కాసాగింది. ఏంచేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడిపోయిన ఆమెకు ఎదురుగా కొక్కేనికి తగిలించి ఉన్న భర్త చొక్కా కనిపించింది. ఆశగా వెళ్ళి జేబులో చెయ్యి పెట్టింది. కొన్ని పదిరూపాయల నోట్లు ఆమె చేతికి తగిలాయి. ఆమెకు ప్రాణం లేచివచ్చింది.

‘నీకు నేనున్నాను’ అని భర్త తనతో అన్న భావన కలిగింది ఆమెకు. ‘ఎప్పుడూ వందరూపాయలకు సరిపడా పదిరూపాయల నోట్లు జేబులో ఉంచుకోవడం ఆయనకు అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు తన అక్కర తీర్చింది’ అనుకుంది. కాసేపు భర్త ప్రేమను తలచుకుని ఏడ్చింది. తర్వాత చెప్పులేసుకుని షాపుకు బయలుదేరబోతూంటే రామయ్య వచ్చాడు. అతను ఆమె భర్త పనిచేసిన ఆఫీసులో అటెండరు.

అతను చేతిలోని ఫ్లాస్కు ఆమె చేతికిస్తూ ‘‘పిల్లలు ఊళ్ళకు వెళ్ళిపోయారని విన్నాను. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయిగా మరి. మరో నాలుగురోజులు మీరు వంట జోలికి పోకండి. కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ నేను తెచ్చిస్తాను. మంచి శాకాహార హోటల్‌నుంచే తెస్తానులెండి. పదిరోజులుగా మనిషి పోయిన బాధతో, వచ్చేపోయే జనంతో బాగా అలసిపోయి ఉంటారు. నాలుగురోజులు విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ ఎటూ మనుషుల్లో పడిపోవాలి. తప్పదు’’ అన్నాడు.

సావిత్రి కాఫీ రెండు కప్పుల్లో పోసి, అతనికొకటి ఇచ్చి తనొకటి తీసుకుంది.

‘‘అమ్మా, నా కూతురి పెళ్ళికి అయ్యగారిని పదివేలు అప్పడిగాను. ఆయన తన పి.ఎఫ్‌. నుంచి లోను తీసుకుని నాకిచ్చారు. ప్రతినెలా అయ్యగారి జీతంనుంచి ఆ లోన్‌కు అయ్యే కటింగ్‌ మొత్తం ఆయనకు నా జీతంనుంచి ఇచ్చేసేవాణ్ణి. ఆయన రిటైర్‌ అయ్యేలోపు ఆ అప్పు తీర్చేయాలనుకున్నానుగానీ సాధ్యంకాలేదు. ఆయన రిటైర్‌ అయినప్పుడు ఆ డబ్బుల్ని ఆయనకు ఇవ్వాల్సిన పి.ఎఫ్‌. నుంచి పట్టుకున్నారు. నేను ఈ నెల రిటైర్‌ అవుతున్నాను. నాకొచ్చే డబ్బుల్లోంచి మిగిలిన బాకీ మీకిచ్చేస్తాను. అటువంటి గొప్పవ్యక్తి అప్పు ఎగ్గొడ్తే నాకు మంచి జరగదమ్మా. ఆయన దేవుడమ్మా. అటువంటి మనుషుల్ని మళ్ళీ మనం చూడలేం’’ అంటూ రామయ్య ఏడవసాగాడు. సావిత్రి కళ్ళనిండా నీరు నిండింది.

‘‘అమ్మా, మీ పెన్షన్‌ పేపర్లన్నీ నేనే తెచ్చి మీ సంతకం తీసుకుంటాను. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మా ఆఫీసులో అందరూ సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పి రామయ్య శెలవు తీసుకున్నాడు. ఆమెకు మళ్ళీ భర్త తనతో ‘నేనున్నాను’ అన్న భావన కలిగింది.

రామయ్య వెళ్ళిపోయాక ‘రామయ్య తీసుకున్న అప్పు గురించి ఆయన నాకు చెప్పారు. కానీ పదివేలు అప్పు తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపనపడుతున్నాడే. మరి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి, పెద్దచేసి చదివించామే. వాళ్ళకు తండ్రి బాధ్యత పంచుకోవాలనిగానీ తల్లి ఒంటరిగా ఉంటుందన్న ఆలోచనగానీ ఎందుకు రావడంలేదు? ఎందుకు పిల్లలు ఇలా మారిపోయారు? పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారికీ తల్లిదండ్రులకీ మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇంకే బంధాలూ ఉండవా?

ఆయన పిల్లల్ని ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచారు. మంచితనం, మానవత్వం, నిజాయతీ, క్రమశిక్షణ లాంటి సుగుణాలను నూరిపోశారు. ఆయన వాటిని పాటించి చూపించారు కూడా. తన తల్లిదండ్రుల్ని చివరి శ్వాస వదిలేవరకూ తనవద్దనే ఉంచుకుని చూసుకున్నారు. తన తల్లి చివరి మూడురోజులూ మంచంమీదే ఉండిపోతే విసుగూ అసహ్యం లేకుండా అన్నిరకాల సేవలూ చేశారు. అవన్నీ పిల్లలు గమనించారు కూడా. మరి ఈరోజు వాళ్ళు తమ తల్లిపట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అనుకుంది.

వెంటనే తన ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది ఆమెకు.

‘ఆ కాలంలో టీవీలూ ఫ్రిజ్జులూ లేవు. సంపాదించిన డబ్బు కుటుంబంకోసం, పిల్లల చదువులకోసం ఖర్చుపెట్టేవారు. దుబారా ఖర్చులు చేసేవారు కారు. రాబడి, ఖర్చు దాదాపు సమానం కావడంతో పెద్దగా అప్పులుచేసే అవసరం ఉండేదికాదు. తృప్తిగా మనశ్శాంతితో బతికేవారు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. పెళ్ళైన వెంటనే టీవీ, ఫ్రిజ్, ఏసీ, కంప్యూటర్, కారు అన్నీ కొనేయాలి. వీటిలో చాలా వస్తువులు స్టేటస్‌ సింబల్‌గా మారిపొయ్యాయి. అవసరాలకూ విలాసాలకూ తేడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంటికి నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుందామన్న ఆలోచన, ఓపిక లేదు. పైగా ఫ్లాట్ల రేట్లు పెరుగుతున్నాయనీ ఇన్‌కమ్‌టాక్స్‌ తగ్గుతుందనీ చేతిలో డబ్బులు లేకపోయినా ఇళ్ళు కూడా కొనేస్తున్నారు. కంపెనీలూ బ్యాంకులూ లోన్లు ధారాళంగా ఇస్తూండటంతో అన్ని లోన్లూ తీసుకోవడం, జీతంలో ఇన్‌స్టాల్‌మెంట్లకు పోగా మిగిలింది చాలకపోవడం, దీంతో ఇబ్బందులు, విసుగు, అసహనం మొదలు. వీటన్నిటితోపాటు ఉద్యోగంలో ఒత్తిడులు, అభద్రతాభావం పెరుగుతున్నాయి. ఇన్ని ఒత్తిడులమధ్య పాపం తల్లిప్రేమ, ఆమె సేవలు వీళ్ళకు గుర్తురావడంలేదు. ఉన్నంతలో తృప్తిగా బతకడం వీళ్ళకు ఎప్పుడు అలవాటవుతుందో’ అనుకుని బాధగా నిట్టూర్చింది.

*     *     *

వారంరోజులు గడచిపోయాయి. సావిత్రికి పిల్లల నుంచి ఫోన్‌కాల్స్‌ లేవు. ఫోన్‌ మోగితే ‘పిల్లలనుంచేమో’ అని ఆశగా ఫోను దగ్గరికి పరిగెడుతూంది.

ఓరోజు తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి.

‘‘నా పేరు శ్రావణ్‌. బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్ని’’ అంటూ తన వివరాలు చెప్పాడతను.

‘‘రండి, కూర్చోండి’’ అంటూ కుర్చీ చూపించింది.

‘‘రామనాథంగారు నేను క్లర్క్‌గా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. ఆయన ఇల్లు కట్టడంకోసం, పిల్లల చదువులకోసం, వాళ్ళ పెళ్ళిళ్ళకోసం, ఎన్నోసార్లు లోన్లు తీసుకున్నారు. అయితే ఆయన ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకపోవడం అన్నది ఇంతవరకూ జరగలేదు. మొదటిసారిగా ఆయన మార్ట్‌గేజ్‌ లోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ బాకీ పడింది. నాకు అనుమానమొచ్చి విచారిస్తే ఆయన చనిపోయారని తెలిసింది. మా బ్యాంకు క్రమశిక్షణ కలిగిన ఓ కస్టమర్‌ను కోల్పోయింది’’ అన్నాడు బాధగా.

‘‘నాకు ఫ్యామిలీ పెన్షన్‌ మొన్న శాంక్షన్‌ అయింది. ఈనెల పెన్షన్‌ తీసుకోగానే బ్యాంకుకు వచ్చి కట్టేస్తాను’’ అంది సావిత్రి నొచ్చుకుంటూ.

‘‘అవసరంలేదమ్మా. ఆయన ఇంటిపై తీసుకున్న లోనుపై దాదాపు ఏడులక్షలు బాకీ ఉంది. అయితే చాలా ఏళ్ళకిందటే మా బ్యాంకు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్సు స్కీములో మీవారి లోను కూడా కవర్‌ అయ్యేందుకు ఆయనచేత సంతకాలు పెట్టించుకుని ప్రీమియం కట్టించుకున్నాం. రామనాథంగారు మరణించారు కనుక ఆ రుణం మొత్తం ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుంది. మీరు నయాపైసా కూడా కట్టక్కరలేదు. నేను అప్లికేషన్‌ మీకు పంపిస్తాను సంతకాలు చేసి పంపండి. ఉంటానండీ’’ అతను నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.


సావిత్రి భర్త ఫొటో వైపు చూసింది. రామనాథం నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు.

*   *   *

సావిత్రి కొడుకులకు ఫోన్‌చేసి రుణం మాఫీ అయిన విషయం చెప్పి ‘ఇల్లు అమ్మకానికి పెట్టాననీ ఎవరైనా వస్తే కబురు చేస్తాననీ వచ్చి మాట్లాడుకొమ్మనీ’ చెప్పింది. కొడుకులు ఆమె ఊహించినదానికంటే ఎక్కువగానే సంతోషించారు. ఆ రోజు సాయంత్రం ఊళ్లోఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి ఆశ్రమం మేనేజరుతో మాట్లాడింది. త్వరలోనే తను ఆశ్రమంలో చేరతానని చెప్పింది.

సావిత్రి వివరాలు తెలుసుకున్న మేనేజరు ‘‘రామనాథంగారు చనిపోయారా? నాకా విషయమే తెలియలేదే’’ అంటూ విచారం వెలిబుచ్చారు.

‘‘ఆయన మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగింది సావిత్రి.

‘‘తెలియకపోవడం ఏమిటమ్మా? ఈ ఆశ్రమం స్థలం కోసం గవర్నమెంటుకు అర్జీ పెట్టినప్పుడు కలెక్టరాఫీసులో ఆ సీట్లో ఉన్న మీవారిని కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించారు. మంచి కార్యం తలపెట్టినందుకు మమ్మల్నెంతో అభినందించారు. కలెక్టరుగారికి చెప్పి ఈ స్థలం మాకిప్పించారు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనకున్న మంచిపేరు వల్ల కలెక్టరుగారు వెంటనే ఒప్పుకున్నారు. ఇంతచేసిన ఆయన మా నుంచి ఒక్క పైసా కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తి భార్య అయిన మీరు ఓ అనాథలా మా ఆశ్రమంలో చేరడం నాకు బాధగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళతాను. మాతోపాటు ఉండిపొండి. మిమ్మల్ని మా అమ్మలా చూసుకుంటాను’’.

సావిత్రికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘భర్త మంచితనం గురించి తెలుసుగానీ అది ఇంతమంది మనసుల్ని గెలుస్తుందని తను ఊహించలేదు’ అనుకుంది. ‘మరణించి కూడా బతికి ఉండటం’ అంటే ఏమిటో ఆమెకు అర్థమైంది.

‘‘వద్దండీ. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే పిల్లల్ని కూడా కాదనుకుని ఇక్కడికి వస్తున్నాను. పైగా ఇక్కడ ఉంటే నాకు కాలక్షేపం కూడా అవుతుంది. మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలి. నేను ఇల్లు అమ్మకం పనులు పూర్తయ్యాక వస్తాను’’ అంటూ అతని దగ్గర శెలవు తీసుకుంది.

*   *   *

ఒకరిద్దరు సావిత్రికి ఫోన్‌చేసి ఇల్లు కొనడానికి తమ ఆసక్తిని వెలిబుచ్చారు. ఓ ఆదివారం కొడుకుల్ని రమ్మంటాననీ ఆరోజు వచ్చి మాట్లాడమనీ వాళ్ళతో చెప్పింది సావిత్రి. మరుసటి ఆదివారమే కొడుకులు భార్యలతో వచ్చారు.

ఆ ఆదివారం ఉదయం ఇంటి గురించి మాట్లాడటానికి వచ్చిన వ్యక్తిని చూసి ‘‘మీరు మా ఎదురింటి మేడపైన ఉండేవారు కదా?’’ అని అడిగాడు వినోద్‌.

అతను ‘‘అవును. నా పేరు రామారావు’’ అంటూ తన వివరాలు చెప్పసాగాడు.

తర్వాత ‘‘మేము చాలా ఏళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాం. ఏడాదిక్రితమే ఇల్లు చాలక వేరే ఇంట్లోకి మారాం. మీ ఇంటి మండువా మా గది కిటికీ నుంచి బాగా కనబడేది. మీ కుటుంబం మమతానురాగాలకూ తీపి అనుభవాలకూ ప్రతీకలా అనిపించేది నాకు.
ఉదయాన్నే మీ అమ్మగారు ఇంటిముందు ముగ్గులేస్తూంటే మీ తండ్రీకొడుకులు కబుర్లు చెబుతూ కంపెనీ ఇవ్వడం, భోగి పండుగరోజు ప్రాతఃకాలాన మీరు భోగిమంట వేస్తూంటే మీ అమ్మగారు కాఫీ తెస్తే అందరూ కలసి తాగడం, దీపావళిరోజు మీ నాన్నగారు మీతో టపాకాయలు జాగ్రత్తగా కాల్పించడం, ఉదయం నాలుగు గంటలకు లేచి మీరు చదువుకుంటూంటే మీకు తోడుగా మీ నాన్నగారు కూర్చోవడం, మీ ఇంటికి తరచుగా బంధువులు, మిత్రులు రావడం, రాత్రిపూట అందరూ మండువాలో కూర్చుని పాటలు పాడటం మాకు కనిపించేది.

ఓసారి విజయ్‌కి ఆటల్లో చేయి విరిగితే ప్రమోషన్‌ పరీక్ష రాయడానికి వెళ్ళిన మీ నాన్నగారు పరీక్ష రాయకుండానే తిరిగొచ్చి పుత్తూరు తీసుకెళ్ళి కట్టు కట్టించడం, నొప్పి తెలియకుండా రాత్రంతా కథలు చెబుతూ జాగారం చెయ్యడం, తన తల్లి వేసుకోవాల్సిన మాత్రల్ని ఏ పూటకాపూట గుర్తుగా ఆమెకివ్వడం, ఆవిడ మంచానపడితే సేవలు చేయడం నా మనసును కదిలించేది. ఆయన చేసిన ఉద్యోగానికి కావాలనుకుంటే ఈ ఊళ్లో పది ఇళ్ళు కట్టించి ఉండేవారు. కానీ ఆయన తీరే వేరు. ‘పైసంపాదన ఆశించని వ్యక్తి’ అని ఊళ్లో మంచిపేరు తెచ్చుకున్నారు. కళ్ళముందు నోట్లకట్టలు కనబడుతున్నా అవసరాలు ఇబ్బందిపెడుతున్నా చలించక నీతికి కట్టుబడి వాటికి దూరంగా ఉండటం చాలా గొప్ప విషయం.

ఇక మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. మా నాన్న గెజిటెడ్‌ ఆఫీసరు. లంచాలు బాగా తినేవాడు. ప్రతిరోజూ తాగొచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడు. మాకు చదువు తలకెక్కేది కాదు. ఆయన చనిపోతే ఆ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు నా తమ్ముళ్ళతో నాకు మనస్పర్థలు పెరుగుతున్నాయి. వాళ్ళింకా జీవితంలో స్థిరపడలేదు. నాన్న ఉద్యోగం నాకొచ్చింది కాబట్టి వాళ్ళను నేను పోషించాలంటారు. ఈ విషయంలో నాకూ నా భార్యకూ మధ్య గొడవలు.

మనిషికి డబ్బు పుష్కలంగా లేకపోయినా ఉన్నంతలో జీవితాన్ని ఎంత ఆనందంగా అనుభవించవచ్చో మీ నాన్నగారిని చూశాక నాకు తెలిసింది. అందుకే మీ ఇల్లు కొని ఇందులో చేరితే ఆ అదృష్టం మాకూ తగిలి మా సమస్యలు తగ్గుతాయని మా ఆశ. చదువుకునే రోజుల్నించీ ఈ ఇల్లు నా ‘డ్రీమ్‌ హౌస్‌’. ‘ఇటువంటి మనుషుల మధ్య నేను లేనే’ అని బాధపడేవాణ్ణి. కనీసం ఈ ఇంట్లో నివసించే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను’’ అన్నాడు రామారావు.

*    *   *

రామారావు వెళ్ళిపోయాక విజయ్, వినోద్‌లు మౌనంగా కూర్చుండిపోయారు. రామారావు చెప్పిన విషయాలే పదేపదే గుర్తుకు రాసాగాయి. తమ గుండెలో ఎంతో అపురూపంగా దాచుకోవలసిన జ్ఞాపకాల్ని పరాయివ్యక్తి వచ్చి చెపితే తప్ప గుర్తుచేసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డారు. వాళ్ళ మనసులో తప్పుచేసిన భావన కలిగింది. పశ్చాత్తాపం మొదలైంది.

రాత్రి భోజనాల సమయంలో సావిత్రి - కొడుకు, కోడళ్ళతో వాళ్ళు ఊరు వదిలివెశ్ళాక జరిగిన విషయాలన్నీ చెప్పింది. రామయ్య, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసరు, ఆశ్రమం మేనేజరు అన్న మాటల్ని చెప్పింది. అది విన్న కొడుకుల మనసుల్లో పశ్చాత్తాపం మరింత పెరిగింది.

వినోద్‌కు తండ్రి తమతో తరచుగా చెప్పే కొటేషన్‌ ‘గుడ్‌నెస్‌ ఈజ్‌ ద ఓన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ విచ్‌ నెవర్‌ ఫెయిల్స్‌ టు ఎర్న్‌ డివిడెండ్స్‌’ గుర్తొచ్చింది.

‘నిజం నాన్నా, మీ మంచితనం డివిడెండ్లను సంపాదించడమే కాదు, ఎంతోమంది హృదయాల్ని కూడా గెలుచుకుంది. మాలాంటి పాపాత్ముల హృదయాలు తప్ప’ అనుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.


విజయ్‌ తల్లితో ‘‘అమ్మా, మమ్మల్ని క్షమించు. నాన్న మంచితనాన్ని ఇంతమంది గుర్తించినా మేము కొడుకులమై ఉండీ గుర్తించలేకపోయాం. గొప్పలకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లోపడి, బయటి వ్యక్తులు వచ్చి మన ఇంట్లో జరిగిన మధురమైన దృశ్యాల్ని గుర్తుచేస్తే తప్ప గుర్తుకురాని పరిస్థితిలో ఉండిపోయాం. మనం ఇల్లు అమ్మవద్దు. కింది పోర్షను రామారావుగారికి అద్దెకిద్దాం. పై పోర్షను మాత్రం ఖాళీగా ఉంచుదాం. నువ్వు మాతో వచ్చేసెయ్‌. ప్రతి సంవత్సరం వేసవిలో ఇక్కడకు వచ్చి ఓ వారంరోజులు హాయిగా గడుపుదాం. పాత రోజుల్ని గుర్తుచేసుకుని ఆనందిద్దాం’’ అన్నాడు.

‘‘అవునమ్మా, నిన్ను ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాం. నువ్వు మాతో వచ్చెయ్‌. ఈ ఇంటి గురించీ నాన్నగారి మంచితనం, వ్యక్తిత్వం గురించీ మా పిల్లలకు కూడా చెబుదాం. ఈ ఇంటితోపాటు ఆయన పాటించిన విలువలు కూడా వాళ్ళకు వారసత్వంగా లభించనీ’’ అన్నాడు.


సావిత్రి భర్త ఫొటోవైపు చూసింది. ఆయన ఆనందంతో నవ్వుతున్నట్లు కనిపించింది ఆమెకు. ‘అవును మరి, మానవత్వపు విలువల్ని పిల్లలకు ఆస్తిగా ఇచ్చారు ఆయన. వాళ్ళు వాటిని నిలుపుకుంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది’ అనుకుంది తృప్తిగా.
 _...సి.ఎన్‌.చంద్రశేఖర్‌_   

     💦🐬🐥🐋💦

ఒక్క సారి చదివాక అర్ధం అవుతుంది ?

ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది
మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది
తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది
బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది
పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది

చింతకాయ చింతించినా చూడరు
ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు
కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు
నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం  పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు
వంకాయ బండపచ్చడి బాధపడినా

నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా
దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా
కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా
క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా
బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా
వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా
చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు
మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే

అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ
ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు
మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

అమ్మలా ఎప్పుడయినా ఆదరించేదావకాయే అని నొక్కి వక్కాణించేదే కామేశ్వరి ఉవాచ
    ----((() ) ) ---


భగవత్కథా శ్రవణము, భగవన్నామస్మరణము ఎప్పుడో అని వాయిదా వేయకండి. నేడే శ్రీమద్భాగవతం చదవండి చదివించండి.  శ్రీమద్భాగవత సప్తాహ ఫలితాన్ని పొందండి. కలిదోషం తొలగుతుంది., పున్నామనరకాది వివిధ నరకములనుండి (పంచమస్కంధం, 26వ అధ్యాయం) విముక్తి కలుగుతుంది.

ముగ్గురు కవులు ,ముగ్గురూ భక్తి సామ్రాట్టులే ,ముగ్గురూ భగవంతుని పరి పరి విధాలుగా స్తొత్రం చేసినవారే.ముగ్గురూ మూడు శతాబ్దాలకు చెందినవారు .కానీ ముగ్గురూ భక్తి భగవన్నామస్మరణ విషయం లో ఒకేలా స్పందించారు.

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాన్త మద్వైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణసమయే కఫవాత పిత్తైః కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే

ఇది ముకుందమాల లో కులశేఖరులు  శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి  చెప్పుకున్న శ్లోకం. 

ఇక ఈ శ్లోక భావం ఇది .
ఓ కృష్ణా!నా మనస్సనెడి రాజహంస యిపుడే నీపాదపద్మములనెడి పంజరమును ప్రవేశించుగాక. ఎప్పుడో ఆఖరిదశయందు నీనామస్మరణ చేయుదమనుకొనుట భ్రమగదా!ఏలనన మరణసమయమందు కఫవాతపిత్తములచే గొంతు నిరోధించబడి యున్నపుడు నిన్ను స్మరించుట యెట్లు సాధ్యమగును?
అంతే కాదు, ప్రాణప్రయాణ సమయం అందరకూ ముందుగా తెలియదు కదా!అందుచేత ఇప్పుడే ఈ క్షణమందే నా మనస్సును నీయందు లగ్నమయ్యేలా చేయి ప్రభూ!

దీనినే భక్త రామదాసు గారు  తన దాశరథీ శతకం లో చెప్పారు

ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!

ఇదే భావాన్ని  నరసింహ శతక కర్త కూడా తన పద్యం లో చెప్పారు 

బ్రతికినన్నాళ్ళు  నీ భజన తప్పను గాని,మరణకాలమునందు మఱతు నేమో ?
య వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్  కప్పగా భ్రమ చేత గంప ముద్భవమంది ,కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు పిలుతునో శ్రమ చేత పిలవలేనో ?
నాటికిపుడే  చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ! ధైర్యముగను !
భూషణ వికాస ! శ్రీధర్మపురి నివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

ఈ రెండు పద్యాల భావం కూడా ఇదే.  స్వామీ  చివరి రోజులలో నీ నామస్మరణ చేసుకోగలమో  లేమో!ఆ రోజున ఎన్ని అడ్డంకులు వస్తాయో ! ఆరోగ్యం సహకరించదు అందుకు  ఈ రొజే నీ నమస్మరణ చెసుకుంటాము .చెవినొడ్డి వినవయ్యా అని.

భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి.వాళ్ళ భక్తి ని ఏమని చెప్పేది
--(())--

🌞 *మనస్సు కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల?*


 *వ్యాఖ్యానం : సూక్ష్మంగా* 

ఉపనిషత్తులోని ప్రథమ మంత్రము శిష్యుని ప్రశ్నతో ప్రారంభమవుతున్నది. భారతీయ వేదాంతం అంతా ప్రశ్నోత్తరాల రూపంలోనే ఉంటుంది. ఇందులో శిష్యుడు వేసిన ప్రశ్నను బాగా అర్థం చేసుకుంటే ఈ శిష్యుడు సామాన్యుడు కాదని, తీవ్ర ముముక్షువని, ఆత్మకన్న అన్యమైన దానిని అభిలషించనివాడని, తీవ్ర వైరాగ్యవంతుడని, ప్రశ్నించి తెలుసుకొనే జిజ్ఞాస గల బుద్ధిశాలియని మనకు అవగతమవుతుంది. 

శిష్యుని ప్రశ్న చాలా గాఢమైనదీ గూఢమైనదీ కూడా. *ఈ ప్రపంచం ఎలా ఉన్నదీ అని విశ్లేషణ చేసినంతకాలం మన దృష్టి బాహ్యంగా ఉన్నట్లే. అలాగాక ఈ ప్రపంచాన్ని చూసే నేనెవరిని? అని ప్రశ్నించుకున్నామా? ఇక మనం అంతర్ముఖమైనట్లే*. 

*కేనేషితం ప్రేషితం మనః పతతి* :- *దేనిచేత కోరబడి, ప్రేరేపించబడి మనస్సు విషయవస్తువుల పైన, విషయభోగాలపైన పడుతున్నది? అని సూటిగా ఆత్మవిషయాన్ని అడుగుతున్నాడు శిష్యుడు*.

అనేక వస్తువులతో, విషయాలతో, భోగాలతో కూడిన ప్రపంచం మన ముందు నిలిచి ఉన్నది. అలా నిలిచి ఉన్న ప్రపంచాన్ని, అందులోని వస్తువులను, విషయాలను, భోగాలను మనం తెలుసుకుంటున్నాం. *ఎలా తెలుసుకుంటున్నాం? ఇంద్రియాల ద్వారా - జ్ఞానేంద్రియాల ద్వారా. కన్ను చూస్తున్నది. ముక్కు వాసన చూస్తున్నది. చెవి వింటున్నది. చర్మం స్పర్శించి తెలుసుకుంటున్నది. నాలుక రుచి చూసి తెలుసుకుంటున్నది. నిజంగా ఈ ఇంద్రియాలను నిరోధిస్తే ఈ విషయాల గురించిన సమాచారం మనస్సుకు చేరదు. దానితో ఈ ప్రపంచం మనను ఏమీ చేయలేదు. కాని ఎల్లవేళలా ఇంద్రియాలను నిరోధించటం - అంటే కళ్ళు, చెవులు, ముక్కు మూసుకొని ఉండటం సాధ్యమయ్యే పనికాదు. అంతేకాదు బాహ్యంలో అనేక వస్తువులున్నాయి. అయినా మనదృష్టి కొన్నింటి మీదనే పడుతుంది. కొన్నింటినే ఇష్టపడుతున్నది. కొన్నింటినే కోరుకుంటున్నది. ఎందువల్ల? వాటికి మనకు ఏదో సంబంధం ఉంది. మనకు అంటే - మన మనస్సుకు ఆ వస్తువులకు మధ్య ఏదో సంబంధం ఉంది. మనస్సులో ఒక రకమైన భోగాసక్తి, కోరికలు ఉన్నాయి. ఆ కోరికలకు అనుగుణంగా ఉన్న వస్తువుల పైకి, విషయాల పైకి, భోగాల పైకి మనస్సు పరుగులు తీస్తుంది. ఐతే స్వయంగా పరుగులు తీస్తుందా? లేదు. ఇంద్రియాల ద్వారా పరుగులు తీస్తుంది. ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. కోరుతుంది. అంటే మనస్సు చేత కోరబడి, ప్రేరేపించబడి ఇంద్రియాలు ప్రపంచంలోనికి పరుగులు తీస్తున్నాయి. మరి మనస్సును ఎవరు కోరుతున్నారు అలా పరిగెత్తమని? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇదీ ప్రశ్న*. 

ఇక్కడ ఈషితం ప్రేషితం అని రెండు పదాలను ప్రయోగించారు. *ఎవనిచేత కోరబడి ఎవనిచేత ప్రేరేపించబడి మనస్సు ప్రపంచంపై పడుతున్నది? అని ప్రశ్న*. మనస్సు తనకు తానుగానే విషయ ప్రపంచంలోకి వెళుతున్నదా? అలా తనకు తానుగానే వెళ్ళటం లేదు. ఎవరో వెనుకనుండి నెడుతున్నారు. ప్రేరేపిస్తున్నారు. 

మనస్సుకు స్వతంత్రం లేదు. స్వేచ్ఛ లేదు. ఉన్నట్లైతే ఇష్టం లేని విషయాలలో చిక్కుకోదు. తప్పులు చేయటం, దుఃఖాన్ని అనుభవించటం స్వేచ్ఛ ఉంటే ఎలా జరుగుతుంది? కనుక ఎవరో వెనుక నుండి నెడుతున్నారు. ఎవరు? 

పంచభూతాలతో తయారైన ఈ శరీరం జడమైనది. జడమైన ఈ శరీరం కదలాలన్నా పనిచేయాలన్నా, ఇంద్రియాలు వాటి వాటి విధులను నెరవేర్చాలన్నా వీటిని కదిలించే శక్తి ఒకటి కావాలి. *అదే ప్రాణశక్తి. ప్రాణం ఉన్నంతకాలమే కన్ను చూస్తుంది. చెవి వింటుంది. కాలు తిరుగుతుంది. వాక్కు పలుకుతుంది, మనస్సు ఆలోచిస్తుంది. ప్రాణం పోయిన తర్వాత ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అన్నట్లు అన్నీ ఆగిపోతున్నాయి. జడమై పోతున్నాయి. మరి ఈ జడమైన దేహం లోనికి ఈ ప్రాణాన్ని ఎవరు పంపారు? ఎవరి వల్ల ఇది వచ్చి చేరింది? తల్లి గర్భంలో శరీరం రూపుదిద్దుకొనే ముందే ఈ ప్రాణం వచ్చి చేరింది. ప్రప్రధమంగా ఇది ఎవరి వల్ల వచ్చి చేరింది? అని ప్రశ్న*.

అన్నింటిలోకి సున్నితమైన అవయవం నాలుక. కాని దానికి కత్తి కన్న పదునెక్కువ. కత్తితో శరీరాన్ని కోస్తే కలిగే బాధకన్నా నాలుకతో పలికే పలుకు లక్షరెట్లు పదునైంది. *లోకంలో మనకొచ్చే బాధల్లో సగానికి పైగా నోటి దురుసుతనం వల్ల వచ్చేవే. నోటిని నిరోధిస్తే చాలా బాధలు తగ్గుతాయి*. కాని మనం ఎంత ప్రయత్నించినా అది ఏదో వాగుతూనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఎవరు దానిని ఆడిస్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? 

కన్ను రూపాలను చూస్తుంది. వెంటనే అది ఏమిటో, దాని పేరేమిటో, అది ఎందుకు పనికి వస్తుందో మనకు స్ఫురిస్తుంది. ఇక చెవి శబ్దాలను వింటుంది. అవి మంచి మాటలో, చెడు మాటలో బుద్ధి విశ్లేషణ చేస్తుంది. అంతేగాదు, చెవితో వినగానే ఆ వస్తువుల రూపాన్ని, ఆ విషయాల స్వరూపాన్ని కన్ను దర్శించగలుగుతుంది. తాజ్ మహల్ అని వినగానే దాని రూపం కంటి ముందు నిలుస్తుంది. చెవిని కంటినీ ఏ దేవుడు నిజంగా జోడిస్తున్నాడు? ఇదీ శిష్యుని లోతైన ప్రశ్న. 

ఈ ప్రశ్నలను బట్టి శిష్యుడు సామాన్యుడు కాదని, ఎంతో ప్రయత్నము చేసినవాడని, ఆత్మను తెలుసుకోవాలనే తపన గలిగిన వాడని తెలుస్తుంది. ఈ ఉపనిషత్ కేన తో ప్రారంభమైంది గనుక ఈ ఉపనిషత్తుకు ఈ పేరు స్థిరపడిపోయింది. 

నిజంగా కేన అనే పదంలో ప్రశ్నే కాదు. సమాధానం కూడా ఉన్నది. విష్ణు సహస్రనామాలలో కః అంటే పరమాత్మ అని అర్థం ఉన్నది. అందువల్ల ఎవరిచేత అనే ప్రశ్నతో బాటు పరమాత్మ చేతనే అనే సమాధానం కూడా ఈ రెండక్షరాల పదంలో ఇమిడి ఉన్నది. 

ఈ ప్రశ్నకు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు ఇచ్చిన సమాధానమే ఈ కేనోపనిషత్తు అంతా - 
##################

*సేకరణ :* : కేనోపనిషత్తు


ఆరా (aura) - కిర్లియన్ ఫోటోగ్రఫీ - వైజ్ఞానిక విశ్లేషణ :

ఒక వ్యక్తి యొక్క ఆరా ఆ వ్యక్తి స్వంతం. అది అతని ఆధ్యాత్మిక సంతకము అని చెప్పవచ్చు. ఎందువల్ల అంటే  మనము ఒక వ్యక్తి యొక్క ఆరాను(aura) చూసినప్పుడు... అదే ఈ ప్రకాశవంతముగా శుద్ధముగా ఉంటే ఆ వ్యక్తి చాలా  ఉత్తముడని తెలుసుకో వచ్చును. అట్టి వారు మంచి ఆధ్యాత్మికత, నమ్రత, సాత్వికత కలవారై ఉంటారు. ఆ వ్యక్తి యొక్క ఆ రా (aura)...  బూడిద లేక నలుపు రంగు కలిగి  కాంతి హీనంగా ఉంటే.... అతడు ఎంత అందగాడైనా, మంచి వస్త్రములు ధరించినా, మంచి చతురతతో మాట్లాడినా... ఆ వ్యక్తి కౄరత్వము, దుష్టస్వభావము... చెడ్డ ఆలోచనలు  కలవాడని తెలుసుకోవాలి. ఈ ఆరా శక్తి యొక్క నివాసము,  ప్రాణ మయ కోశము అందే ఉంటుంది. కానీ మనోమయ, విజ్ఞానమయ కోశమందు ఉండదు. దీని యొక్క జాగృతి శరీరమంతా విద్యుత్ కాంతి వలె ప్రచోదనము చేస్తుంది. ఈ ఆరా యొక్క ప్రచోదనము లేక స్వరూపాన్ని... కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఫోటో తీయడం సాధ్యమైంది.
 ఒకప్పుడు ఒకప్పుడు తరగవచ్చు. మరొకప్పుడు పెరగవచ్చు. మనము మనము గొప్ప పుణ్యక్షేత్రములకో, దేవాలయములకో, యోగి జనుల దర్శనాలకో వెళ్ళినపుడు మన ఆరా (aura) పెరుగవచ్చును. అచట నుండి వెలుపలికి వచ్చినప్పుడు క్రమంగా క్షీణిస్తుంది. కారణం ఏమంటే  ఆ పవిత్ర ప్రదేశంలో ఉన్నది  manifested aura.   మనలో  ఉన్నది unmanifested aura.  మన ఆరా అభివ్యక్తమగునట్లు గా ప్రయత్నించాలి.  ఆరా కాంతివంతముగా ఉన్నంతసేపు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ఆరా కాంతి హీనంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఈ ఆరా కాంతి హీనంగా ఉంటుంది. శారీరక అనారోగ్యము లేక రుగ్మతలు, ప్రాణశక్తి సీమలలోని... మార్పులను బట్టి వస్తాయని కిర్లియన్ పరిశోధన ద్వారా తేలింది.  ఉదయ సమయంలో మన ఆరా కాంతివంతంగా ఉంటుంది. రోజంతా పని చేసినందున,  సాయంత్రం ఆరా  నిస్తేజంగా ఉంటుంది. బలహీనంగా ఉంటుంది.  అయితే  అయితే అరగంట నుండి గంట  వరకు  యోగాభ్యాసము చేసినట్లయితే ఆరా మరల తిరిగి ప్రకాశవంతమవుతుంది. కృశించి నశించినవి  అని చెప్పబడ్డ పదార్థము ( ఉదాహరణకు మట్టిలో పడి ఉన్న ఎముక) కూడా ప్రాణ శక్తి కలిగి ఉంటుందని  శక్తి సీమలను పరిశీలించిన శాస్త్రవేత్తల అభిప్రాయం.

సంకలనం.....భట్టాచార్య

కధలు









No automatic alt text available.

తల్లి తండ్రుల పాఠాలు ( 1 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )

అది ఒక కుటుంబం  

కళ్ళజోడు సర్దుకుంటూ చెప్పులు మూల వదలి చేతి కర్రను గట్టిగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు తాతగారు.  

నాన్న ఇప్పుడేనా రావటం అంటూ ఎదురు వచ్చాడు కొడుకు  

ముందు కబురు చెయ్యబోయ్యావా నేను స్టేషన్కు వచ్చేవాడ్ని కదా అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు. 

నీకు ఇబ్బంది ఏమోనని స్టేషన్ దగ్గరదగా వుంది నీ ఇల్లు అందుకే  నేనే వచ్చాను

అమ్మకెలాఉంది నాన్న 

ఎలావుంటుంది అలా నే వుంది "చెట్టంత మొగుణ్ణి ప్రక్కన ఉన్నా కొడుకు ఎలా ఉన్నాడు మనవుళ్లు ఎలా ఉన్నారు అని ఒకటే కలవరింత.

నీతోపాటు తీసుకు వస్తా బాగుండేది, అమ్మ కూడా 2  రోజులు ఉండి పొయ్యేది కదా 

అంటే నన్ను 2 రోజులు ఉండి పొమ్మంటావా ఏంటి ?

అదికాదు నాన్న నేను ఏది మాట్లాడినా " తప్పు పట్టుకుంటావు " ఇంకా మారలేదు మీరు. 

మేమెందుకు మారాలి మీకేమన్న తక్కువ చేశామా, చక్కగా చదువు చెప్పించాము 
కదా 

అవును చెప్పించారు ఎం లాభం ఆ చదువు బతకటానికి కూడా పనికి రాలేదు ఇక బతికించుకోవటం ఎట్లా ?

నీకో విషయం చెపుతా విను " పక్షులు రెక్కలు వచ్చేదాకా పోషిస్తాయి, " తర్వాత స్వేశ్చగా తిరగమంటాయి.   

పక్షులకు మనకు తేడా వుంది కదా నాన్న

వుంది లేదనను 

"మనం జంతువులనుండి పుట్టామని తెలుసుకో కలిగిన వాడే నిజమైన మానవుడు"  

 అంటే ఏమిటి అర్ధం కాలేదు 

ఎందుకు అర్ధం అవుతుంది మాతృభాష వదలి "ఇంగ్లీషు " నేర్చుకోవటం వళ్ళ 

బతికించు కోవాటానికి ఉపయోగ పడుతుందేమో కానీ జ్ఞాన సంపద పెరుగు తుందంటే నేను నమ్మను.

నాన్న  మీరు భాషను తక్కువ చేసి మాట్లాడు తున్నారు 

అవునురా చేతకాని ప్రభుత్వాలు ఉన్నంత వరకు ఇట్లా గే మాట్లాడుతాను 

"ఎక్కువ జనాభా ఉన్నప్రాంతాలో మెదడు ఉపయోగించుకొని వారి పోషణకు ఆధారపడాలి కానీ వారి పొట్టలు కొట్టి విదేశీ "కంప్యూటర్ " వ్యవస్థను కొన్ని కోట్లు పెట్టి తెస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కును పట్టుకొచ్చారు. ఎప్పుడు కరంటు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో తెలియదు.   

అర్ధం కాలేదు నాన్న 

ఎందుకు అర్ధం కాదు నేను తెలుగులో నే కదా మాట్లాడింది 

అందుకే అర్ధం కాలేదంటున్నాను. 

మాతృభాష వదలి పరభాష నేర్పించి నేనే మోసపోయాను, కనీసం మన భాష సంస్కృతి తెలుసు కోలేని కొడుకుని కన్నందుకు మేమె భాధ పడాలి. 

  2 4 -11-2 0 1 8     (ఇది ఎవ్వరి నీ ఉద్దేశించింది కాదు, సమాజంలో జరుగుతున్న సంఘనల ఆధారముగా కవి కల్పనా మాత్రమే )                                                                
మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ    
మిగతా భాగం రేపు  

తల్లి తండ్రుల పాఠాలు ( 2 ) (Telugu daily serial)   
ప్రాంజలిప్రభ  (నిత్య సంతోషం )
అది ఒక కుటుంబం  
  
          నాన్న ఆధునిక పద్ధతులు, నేర్చుకోవాలి, కొత్త విధానాలతో ముందుకు పోవాలి, ఎంత సేపటికి  పాత చింతకాయ పచ్చడే  గొప్ప అంటే ఎట్లాగు నాన్న, నీకా పెద్ద వయసు వచ్చింది, ఒక మూల కూర్చొని కృష్ణ రామ అంటూ మనవళ్లుతో  ఆడుకోవచ్చుకదా. ఎదన్నా మాట్లాడితే చాలు  రోషం వచ్చేస్తుంది,  రాకెట్టులో చంద్రమండ లానికి పోయే రోజులు వచ్చాయి, అక్కడే కొత్త నగరాలను సృష్టించటానికి మన శాస్త్రజ్ఞులు విశ్వ  ప్రయత్నాలు చేస్తున్నారు.  

           గుడ్డొచ్చి పిల్ల నెక్కి రించినట్లు లాగా ఉన్నాయరా నీ మాటలు, అయినా నీవు చెప్పిన దానిలో కొంత నిజం దాగి ఉన్నది.  పాత చింతకాయ పచ్చడిని చులకన చేయవద్దు అది మన ఆరోగ్యానికి ఏంతో  అవసరం, ఎండు మిరపకాయలు వేయించి, ఇంగువవేసి నూనెతో తిరగమోత పెట్టి చింత తొక్కును కలిపి రోలు యందు వేసి రోకలితో దంచి పచ్చడి చేస్తే దాని వాసన  పది గ్రామాల దాకా వ్యాపించేది అనేవారు. అన్నంలో పచ్చడి కలుపుకొని నూనె వేసుకొని తింటే దాని రుచి  ఇంత అని చెప్పలేము, మరియు దానికి తోడు తల్లి కూడా చేయలేని ఉల్లిపాయను కోరొక్కొని తింటే  అబ్బా అబ్బా  ఉంటుంది తిన్నవాడికే తెలుస్తుంది. ఎంతసేపటికి ఆధునికమని "పిజ్జాలు, గప్ చిప్పులు, చాక్ లేట్లు " తింటే అనారోగ్యము మరియు జీర్ణము కాకా ఏంతో భాధ పడాలి. తిండి విషయంలో ఆధునికమా పాత అని ఆలోచించటం తప్పు, శుభ్రంగా చేసింది ఏది, శరీరానికి హానికలుగా కుండ శక్తి వంతుడుగా మార్చే పౌష్టిక ఆహరం తీసుకోవాలి. 

             మరో విషయం పెద్ద వయసు వచ్చింది మూల కూర్చో అనే హక్కు నీకు లేదు, ఎవరి కష్టార్జితం వారిది, ఎవరి శక్తి వారిది, పెద్ద వయసులో జ్ఞానం పెరుగుతుంది, హితబోధ చేయుటకు సహకరిస్తుంది, శరీరము కూడా మందులపై ఆధార పడుతుంది. తండ్రిగా చేయవలసినది చేసాం,  మాలో ఉన్న శక్తిని 90% మీకే  దారపోసామ్, నేను ఉన్నాను, నేను చదివిన రామాయణ భారత భాగవతాలలో ఉన్న   అంతర్గత సూక్తులను రోజుకు ఒక స్కూలుకు వెళ్లి చెపుతున్నాను,  అట్లా చేయుట వళ్ళ నాకు మీ అమ్మకు ఏంతో  తృప్తిగా ఉన్నది. నీవు అనవచ్చు  నీవు చెప్పే కధలు ఇంగ్లీషు మీడియంలో చదివే వారికి ఏమి అర్ధం అవతాయని, నా ప్రయత్నం శుద్ధ దండగా అని అనవచ్చు. ఏది ఏమైనా మన సంస్కృతి, సంప్ర దాయాలని కాపాడాలని నా ప్రయత్నం మాత్రం ఆపను, నా వయసులో ఉన్న వారికీ మన: శాంతి కల్పించి చేతనైన సహాయము చేయాలని అను కుంటున్నాను. తెలుగు భాష బతకాలనీ నా ప్రయత్నం మానను, అందర్నీ తెలుగు నేర్చుకోమని ప్రాధేయ పడతాను.                        
   
              రోషం వస్తుందంటావు, కష్టపడ్డ వాడికి తెలుస్తుంది సుఖ విలువ, సుఖ పడే వానికి ఎం తెలుస్తుంది కష్టం విలువ.  మంచి చెడు ఆలోచించ కుండా, చిన్న పెద్ద ఆలోచించ కుండా, మిడి మిడి జ్ఞానముతో దేవుడు సహకరించిన ధనాన్ని చూసుకొని, ఇది నా కష్టార్జితమ్  మూర్ఖుడుగా మారి నోటికి ఏది వస్తే అది అంటే పడేవారు కాదు పెద్దవారు. పేద వయసులో పిల్లల  సంపాదన కన్నా తక్కువ ఉండవచ్చు సంపాదన, అంత  మాత్రాన చేతకాని వారిలాగా చూస్తే ఎవ్వరూ ఊరుకోరు కొడుకులందరు అది గుర్తించు కోవాలి.        

  25 -11-2 0 1 8                                                                 

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                                                   
మిగతా భాగం రేపు  
(ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 

తల్లి తండ్రుల పాఠాలు ( 3 ) (Telugu daily serial)   
ప్రాంజలి ప్రభ.  (నిత్య సంతోషం )
అందరూ ఒకే కుటుంబం  
  
చూడు బాబు ఎదో నా మనసు ఒప్పక కొన్ని విషయాలు నీకు తెలపాలనుకున్నా ఎందుకంటే మానవ ప్రయత్నమూ ఎంత ఉన్న భగవంతుని ప్రయత్నము తప్పక ఉండ వలెను. ఉపయోగము, నిరుపయోగము గూర్చి వివరిస్తాను. ఎందు కంటే మనిషన్న తర్వాత కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆవిషయాల వళ్ళ మనకు జ్ఞానము పెరగాలి.      
చెట్టుపై అందని ఫలాలున్నా ఎంత నిరుపయోగమో
 - భక్తి పుత్తడి పూతలా ఉంటే అంతే నిరుపయోగమూ  

నీటి మీద, గాలి మీద రాత ఎంత నిరుపయోగమో
 - శ్రీవత్స మొక్కక అన్య మొక్కు అంతే నిరుపయోగమూ

చదువు  లేని మూర్ఖుడు ఉన్నా ఎంత నిరుపయోగమో
 - తల్లి తండ్రుల్ని చూడని బిడ్డ అంతే నిరుపయోగమూ

 శ్రీ పద్మావతీ అమ్మవారిని ప్రార్థిస్తే ఉపయోగమే 
- శ్రీ వెంకటాపతి కరుణ కలిగితే జీవి యోగమే   

ఏమిటిరా అల్లా బిత్తర చూపులు చూస్తున్నావు, నువు చెప్పేవి ఏమి అర్థకాని మొహంలా  ఉన్నది. అసలు దేవుడు భక్తి అనేది ఎదో తెలియకుండా పెరిగావ్, ఎదో నీ  అదృష్టమో, మా అదృష్టమో, తక్కువ మార్కులు వచ్చినా  ఉద్యోగం సంపాదించి కాలర్ ఎగరేస్తున్నావు అది నీ  గొప్పతనం కాదు, అది దేవుని సహకారము వళ్ళ వచ్చిందని గమనిస్తే నీకు మాకు ధర్మము. 

"మృదు స్వభావం కలవాడు ఎల్లప్పుడూ అవమానాలకు గురి అవుతాడు. కోపిష్టికి ఎప్పుడూ విరోధాలు ఎదురవుతాయి. ఈ రెండింటినీ వదలి మధ్యేమార్గాన్ని ఆశ్ర యించాలి "       


నాన్న నన్ను క్షమించు నేను ఎమన్నా తప్పు చేస్తే మన్నించు అన్న మాటలకూ తండ్రి వెంబడి కళ్ళు నీరుకారాయి. 

చూడు బాబు   ఎండిన ఆకు రాలక తప్పదు, లేత ఆకు పండి ఎండేదాకా ఆగక తప్పదు.            
 26-11-2 0 1 8                                                                 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ     
 (ఈ కధ  ఎవ్వరిని ఉద్దేశించినది కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారం) 



                                                                                                         మిగతా భాగం రేపు   






ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు (31-08-2020)

 ఓణం"

ఓణం" 'దక్షిణ భారతదేశ రాష్ట్రమైన 'కేరళ' లో అతిపెద్ద పండుగ... ఇది 'మలయాళీ' క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) లలో వస్తుంది... 'మహాబలి' ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. 'శ్రవణా నక్షత్రము' ను మళయాళమున "తిరువోణము" అంటారు... సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు !!!!!
                                                                    ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. ఇది 'కేరళ' యొక్క ఆచారములు, సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు, ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా, ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారుపై ఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ, రవికె ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ !!!!!

💢💢💢 ^^ ప్రాముఖ్యత^^ 💢💢💢                                                                👇👇👇👇👇👇👇👇👇👇👇
                                                         👉 'ఓణం' ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ.  మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ. వర్షపు పువ్వుల పండుగ. 'పాతాళం' నుండి "మావెలి రాజు" యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు "మవేలి చక్రవర్తి" ని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది !!!!!

👉 చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకు 'స్వర్ణ యుగం'. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా, సిరిసంపదలతో ఉన్నారు.ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము 'ఓణం' పండుగగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు, తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు. కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో, ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే 'ఓణసద్య' (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది, ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు. ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం 'వల్లంకలి' అనబడే సర్పాకారపు పడవల పందెము. ఇది 'పంపానది' లో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది, ఈ ఆటలన్నింటినీ కలిపి 'ఓణకలికల్' అని పిలుస్తారు. పురుషులు 'తలప్పంతుకలి' (బంతితో ఆడేది),'అంబెయ్యల్' (విలువిద్య),'కుటుకుటు' వంటి కష్టతరమైన ఆటలు, కయ్యంకలి, అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. 'కైకొట్టికలి', 'తుంబి తుల్లాల్' అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. 'కుమ్మట్టికలి', 'పులికలి' వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి !!!!!

!!! 'మహాబలి' యొక్క పరిపాలన కేరళలో స్వర్ణ యుగం గా భావించబడుతుంది !!!       🙏🌺🌼🌹🍃🌸🍁🌷🥀💐


చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక కధలు
సేకరణ : రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మన చిన్నతనం లో ......30-08-2020

చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి' అనేవాళ్ళం

4 రంగుల్లో ఒక పెన్  ఉంటే, అన్నీ బటన్స్ ఒకేసారి నొక్కేసేవాళ్ళం  ఏం జరుగుతుందో చూసేందుకు

భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాళ్ళం లోపలకి వచ్చేవారిని *#భౌ అని భయపెట్టే వాళ్ళం* నిద్రపోయినట్టు నటించేవాళ్ళం ,అమ్మ నాన్న ఎవరో ఒకరు మంచం వరకు ఎత్తుకొని తీసుకు వెళ్తారు కదా అని.

బస్సులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.
రెండు చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వర్షంలో తడిచేవాళ్ళం
పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడేవాళ్ళం
రూమ్ బయటకు పరుగెత్తుకువచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తేవాళ్ళం

గుర్తుందా ! మనం చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహల పడేవాళ్ళం పెరిగి పెద్దయిన తరువాత, చిన్నతనం ఎంత బావుండేది అని బాధ !!

బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం.

ఎందుకంటే మనం ఈ మెసేజ్ చదువుతున్నపుడు తప్పనిసరిగా మన మోహం పై చిరునవ్వు విరిసి ఉంటుంది.

దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి మన బాల్యం లోకి పంపు అని కోరుకుంటాము

స్కూల్ జీవితం !!

కేరింతలు కొట్టే స్నేహ సమూహం !!
రంగు రంగుల యూనిఫామ్ !!
చిన్న చిన్న ఫైటింగ్ లు !!
ఆప్యాయంగా చూసే టీచర్లు !!

మొదట  అనుభవాలు ...!!
స్నేహితులు  పుట్టించే పుకార్లు!

గ్రూప్ ఫోటోలు !!

కలసి చదువుకోటం  !!

ఎప్పటికి తరగని Boring పీరియడ్స్
తొందరగా అయిపోయే drill పీరియడ్!!

రోజూ ఉదయం 7-8 అయినా గానీ నిద్ర లేవని నేను, జెండా పండుగ రోజు మాత్రం ఉదయం 4 గంటలకే నిద్ర లేవడం!!

ఎడతెగని వాదోపవాదాలు !!

మిత్రులతోనే చిలిపి తగాదాలు!!

మరిచిపోలేని మార్కుల కాగితాలు !!

భయపెట్టే  progress report లు !!

సొంతంగా చేసిన "నాన్న సంతకం"

తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !!

అబ్బో.... అదొక గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!!
ప్రతి మనసులో కరిగి, కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం !!

మీ స్నేహితుల మొహంలో చిన్ని నవ్వు కోసం... మీ స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి ..
మా మనవుడు గీసిన బొమ్మను చుసేటప్పటికల్లా నా చిన్ననాడు నేను బొమ్మలు గీసేవాణ్ని మీరు మీభాల్యం ఎలాజరిగిందో ఒక్కసారి ఆలోచించండి 
😊😊😊😊


పరివర్తన ఏకాదశి 29-08-2020
           వామన జయంతి
భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు...
పరివర్తన ఏకాదశి కి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినది గ పరిగణిస్తారు,
       కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు...
ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలి ని పాతాల లోకానికి పంపిస్తాడు.
పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుంది అని పురాణాలూ చెబుతున్నాయి..
పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే వామన జయంతి

ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకము...
శ్రీ మహా విష్ణువు అది శేషు ని పైన శయనించి విశ్రాంతి లోకి వెళ్ళిపోతాడు, తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శయనిస్తాడు అని అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు...
పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి..
ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను,
కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను.
దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు.
ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో ...."దేవీ - చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను...
భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు.
భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి, వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు...
ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను, ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయా మయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను...
ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు.
అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను, కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను, దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను...
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను, మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.🙏


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: 
Hare Krishna ॐ — Much Love 🍃💖

*ॐ పురుషాయ నమః* బీబీనాచ్చియారు కధ 
*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*
* మనిషి బలహీనత!


*ॐ పురుషాయ నమః*

_(ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_

ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు.  *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు.

ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది  *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు..

“సుల్తాను వారికి ఒక విన్నపం, తమ సేనలు దక్షిణాపథ దండయాత్రలో సాధించిన విజయ పరంపరలలో దేవాలయాలలోని ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసికొనివచ్చాయి. మేల్కోట దేవళంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు ఇప్పించాలని మా వేడికోలు.  నేడు మేల్కోటదేవళం ప్రాణరహితమైన శవప్రాయంగా పాడుపడి ఉంది,” అన్నారు రామానుజులు.

“సుల్తాను, యతిరాజుల వారి మాటలు సావధానంగా విని, అయ్యా, మీ చిరుకోరిక మన్నించటానికి మాకు అభ్యంతరం లేదు. అసలు ఆ విగ్రహం ఎలా వుంటుందో, మా వద్ద ఉన్నదో లేదో, కరిగించేసేమో నాకు తెలియదు.. అల్లా అనుగ్రహం వలన మీరు కోరిన విగ్రహం దొరకుతుందేమో చూద్దాం, దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరకు పోయి చూద్దాము,” అని అన్నాడు.

ఉభయులు నడచి వెళ్లుతూ వుండగా, సుల్తాను,  *“స్వామీ, మీరు వేయి మైళ్ళు నడిచి వచ్చారు, వ్యయప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా?.. ఈ విగ్రహంలో విశేషం ఏమిటి?”* అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా రామానుజులు తాము గానీ, తమ శిష్యులు గానీ ఆ విగ్రహాన్ని ఇంతకు ముందు చూడలేదనీ, తమది తమిళనాడనీ, విధివిలాసం వల్ల కర్ణాటక దేశానికి పోయినపుడు ఈ విషయం విని వచ్చామని చెబుతారు..

సుల్తాను అచ్చెరువంది,  “స్వామీజీ – అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎట్లా గుర్తించదలచారో దయచేసి చెప్పండి” అని అడిగాడు.

అప్పటికే ఉభయులూ పెద్ద దొడ్డిలోకి ప్రవేశించారు.. రామానుజులు అక్కడ పడివున్న విగ్రహాలవైపు చూస్తూ, “మేల్కోట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం, ఆయన విగ్రహం ఇక్కడే వుండి వుంటే తప్పకుండా వస్తాడు.. తండ్రీ *సంపత్కుమారా,*  రా! నా తండ్రీరా” అని బిగ్గరగా పిలచారు.. ఒక్క విగ్రహం కదలలేదు.. సుల్తానుకు విగ్రహాలు కదలవు, మెదలవు, మాట్లాడవు అని మాత్రమే తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలుగలేదు.

రామానుజులు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహం కదలలేదు, మారు పలకలేదు, రామానుజుల వారు ఆశా భంగం కలిగింది.. సుల్తాను జాలితో,  _*“స్వామీజి మీరు ఆశాభంగం చెందవద్దు, మీకు నచ్చిన మరో విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు”*_ అని అంటాడు.

_“మాకు కావాల్సిన విగ్రహం ఒక్క మేల్కోట సంపత్కుమార విగ్రహమే, తెచ్చిన అన్ని విగ్రహాలు ఇక్కడే వున్నాయా లేక ఒకటి రెండు వేరే చోట పెట్టారా దయచేసి సెలవిస్తారా?”_ అని రామానుజులు గంభీర స్వరంతో ప్రశ్నిస్తారు..

“అన్నీ ఇక్కడే వున్నాయి. కొన్నింటిని కరగించి వేశారు..  *అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం చాలా అందంగా వుందని మా అమ్మాయి ముచ్చటపడి ఆడుకోడానికి దాచుకున్నట్లు వుంది*..” అన్నాడు సుల్తాను.

రామానుజల మెదడులో ఒక మెరుపు తీగ మెరసినట్లని పించింది. _“ప్రభూ!ఆ విగ్రహాన్ని మేము చూడవచ్చా..”_ అన్నారు రామానుజలవారు.

“మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం, రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని చూపిస్తాను లెండి, సాధారణంగా మా అంతఃపురంలోకి పర పురుషులు ప్రవేశించరాదు, మీరు సన్యాసులు, మహానుభావులు కాబట్టి మా జనానాలోకి రానిస్తున్నాం.. ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్కుమారుడే అయితే మీరు పలిస్తే పలుకుతాడేమో చూడాలని కోరికగా వుంది.” అంటూ అంతఃపురం వైపు నడిచాడు సుల్తాను.

సుల్తాను వెంట భగవద్రామానుజుల వారు *విష్ణుసహస్ర నామ* పారాయణ చేస్తూ అంతఃపురములోకి వెళ్ళారు. పదునాలుగవ నామం దగ్గరకు వచ్చి *ॐ పురుషాయ నమః* అని జపిస్తూండగా రాజకుమారి గదికి చేరుకున్నారు.. శిష్యులందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండగా, _“తండ్రీ సంపత్కుమారా! నా దగ్గరకు రావా తండ్రీ, నీవు సంపత్ప్రదాతవు, స్వప్రదాతవు,  ఓ పరమపురుషా, నీవే సంపత్కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తోంది,”_ అంటూ బిగ్గరగా భక్తి తన్మయత్వంతో పిలిచారు రామానుజులు.

*ఇక తన కన్నుల యెదుట జరిగిన అత్యద్భుత సన్నివేశం చూచి సుల్తాను మతి పోయింది.. మందమత్తేభ గమనంతో సంపత్కుమార విగ్రహం చకచకా ముందునకు నడచి రామానుజల వారి సన్నిధికి తరలి వచ్చింది..*

సుల్తానుకు అది కన్నుల పండుగ మాత్రమే కాదు. సంపత్కుమార దేవుని మొలత్రాడు చిరుగజ్జెల సవ్వడి సుల్తానుకు వీనుల విందు చేసినది.. *సంపత్కుమార దేవుడు రామానుజలవారికి తనను తాను దానం చేసుకున్నాడు..* రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కోట తీసికొనివచ్చి, సంప్రోక్షణతో తిరిగి కోవెలలో ప్రతిష్ఠించారు..

అయితే, సంపత్కుమారుని కనుగొల్కలనుండి  *వేడి కన్నీటి* బిందువులు కారటం ఒక శిష్యుడు చూచాడు.. ఆ శిష్యునికి సంపత్కుమార దేవుడు అంతరంగికంగా చెప్పాడు.. _“భగవద్రామానుజులు  సంపత్ప్రదాత అయిన పరమపురుషుడవని కీర్తించడంతో నేను భక్త పరాధీనుడనై లొంగి పోయి వచ్చాను.. కానీ సుల్తాను కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి.. ఆమె మహా భక్తురాలు.. ఆమెను విడిచిపెడితే నేను ఎట్లా భక్త పరాధీనుడను కాగలను?”_

ఆ విషయం భగవద్రామానుజుల వారికి తెలిసి సుల్తాను కూతురును మేల్కోటకు ఆహ్వనించారు..  రాకుమారి బీబీనాచ్చియారుగా మేల్కోటలో స్థిరపడింది.. ఈ నాటికి కూడా బీబీనాచ్చియారు విగ్రహం మేల్కోటలో వుంది. అందరూ చూడవచ్చు..

వైకుంఠనాథుడైన పరమపురుషుడు రామానుజులవారికి, ముస్లిము రాకుమారికి *స్వప్రదాత* అయినాడు. అట్లే ముక్తులైన భక్తులందరికీ అతడు వివశుడే.. అందుచేతనే శ్రీమన్నారాయణమూర్తిని *ॐ పురుషాయ నమః*  అని విష్ణు సహస్రనామం అర్చిస్తుంది..

*ॐ పురుషాయ నమః*
🙏🙏🌷👌🌷🙏🙏
--(())--

*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*

రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెళ్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...

మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???

నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేవుడి పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...

ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...

శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !
      ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!
( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం )

తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...

మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....

మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.....

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

--(())--
* మనిషి బలహీనత!

తనను ఏ ఒక్కరూ గమనించని వేళల్లో తప్పుడు పనులకు తెగించడం మనిషి బలహీనత!
‘నేను ఒక్కణ్నే ఉన్నాను. నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు- అంటుంది ‘మహాభారతం’. *మనిషి ఏ పని చేస్తున్నా, నిశితంగా పరిశీలించేవి ఒకటీ రెండూ కాదు, పద్దెనిమిది ఉన్నాయని ‘ఆదిపర్వం’ హెచ్చరిస్తుంది*. వాటిని *మహా పదార్థాలు*’ అంటారు. *నాలుగు వేదాలు, పంచభూతాలు, ధర్మం, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి... *ఇలా మొత్తం *పద్దెనిమిది మహాపదార్థాలు మనిషిని అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి*. వీటి ‘గమనిక’ నుంచి అతడు తప్పించుకోవడం అసాధ్యం. దీన్ని గుర్తించలేని కారణంగానే- ఇవన్నీ జడపదార్థాలని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు పొరబడుతుంటాడు.                                                                                      

                                                                  భారతం పేర్కొన్న మహాపదార్థాలు ఆ రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతీ చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని ‘విధి’కి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచివైతే సత్కర్మగా, చెడు పనుల్ని దుష్కర్మగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం.

మహాపదార్థాల్ని చైతన్య స్వరూపాలుగా గుర్తించినవారు వివేకవంతులు. వాటికి సంబంధించిన అవగాహననే ‘జ్ఞానం’గా భావించవచ్చు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్ముడు పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడంటే- వాటి ఉనికిని ఆయన గుర్తించినట్లే, వాటికి సంబంధించిన జ్ఞానం ఆయనకు ఉండబట్టే!
కీచకుడి మందిరానికి పయనమైన ద్రౌపది, తనకు రక్షణగా ఉండాలని సూర్యుణ్ని ప్రార్థిస్తుంది. ఆమె అభ్యర్థనను ఆయన మన్నించి, సహాయం చేస్తాడు.

కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలనుదుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకుంటాడు. తీరా కొడుకుతో సహా ఆమె రాజదర్బారుకు వెళితే ‘నువ్వు గుర్తులేవు’ అంటాడు. ఆమె మనసును చిక్కబట్టుకొంటుంది. పద్దెనిమిది చైతన్య స్వరూపాల గురించీ  వివరించి, చివరకు విజయం సాధిస్తుంది.

తక్కినవాటి మాట ఎలా ఉన్నా, అంతరాత్మ అనేది ఒకటుందని మనిషికి తెలుసు. అది అప్పుడప్పుడూ నిలదీయడం, తాను సిగ్గుపడటం ప్రతి మనిషికీ అలవాటే! అంతరాత్మ నిజమైనప్పుడు, తక్కిన పదిహేడూ వాస్తవమేనని అతడు గ్రహించడమే వివేకం. గుప్తదాతలు వివేకవంతులు. నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, పూజాదికాలు నిర్వహించాలన్న ఉబలాటం అవివేకం.

మహాపదార్థాలు గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వారే చూస్తున్నారని అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు, ఏ మనిషీ చెడ్డపనులకు తెగించడు. ఎవరు చూసినా చూడకున్నా మంచిగా బతకడం అలవరచుకొంటాడు, సుఖశాంతులకు నోచుకుంటాడు!

--(())--


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

Post anything (from anywhere!), customize everything, and find and follow what you love. Create your own Tumblr blog today.
ముచ్చటగా మూడు కధలు 
* బ్రాహ్మణ జన్మ - గొప్పదనం
* తిరుమల జోలికి వెళ్లొద్దు
* ప్రకృతిలో మనిషి

తిరుమల జోలికి వెళ్లొద్దు

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రిగారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేలఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వేంకటేశ్వర స్వామివారి పవిత్రత, శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దిన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేదిలేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటినుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువేక్కగా అక్కడినుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించాగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామివారు వేళ్ళను నుదుటిపై మూడు నామాలవలె చూపిస్తూ, “అక్కడి(తిరుమల) నుండే వస్తున్నావా?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమకంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామీ వారి కరుణ మాత్రమె. ఎందుకంటే ఆ తల్లిప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠసేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపునిండా ఆహారం పెట్టించు” అని స్థపతితో పాటు పంపారు. ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామీ వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని,, “అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?” అని అడిగారు.

“తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కాని ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు” అని పరమాచార్య స్వామీ వారిని ప్రార్థించాడు.

మానవజాతినే ఉద్ధరించడానికి ఈ భువిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడినుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్రలేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది.

భయంతో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తిరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమితని అడిగాడు. వెంటనే తానూ ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు, వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో, స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే?” అని అడిగి, లోపలి రమ్మన్నారు.

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమలలో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.
ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమె?” ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,
“ముందు నేను చెప్పేది విను. వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామీవారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థాపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి. తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంట పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారు ఆశీస్సుల వలన మాత్రమె అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
--(())--

* ప్రకృతిలో మనిషి 
1 . మనిషి ఈ భూమ్మీద తానొక్కడినే మగాడిని అనుకొన్నాడు. నాకు ఎదురు లేదు అనుకొన్నాడు. ఏ జీవి గురించి ప్రకృతి గురించి అస్సలు పట్టించుకోలేదు. ప్రకృతిలో వున్నాము అన్న విషయాన్నీ దాదాపుగా మర్చిపోయాడు. పులిని చంపాడు , అంత పెద్ద ఏనుగును భయపెట్టాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంచు మించుగా అడవిని ఖాళీ చేశాడు ప్రకృతిని విద్వంసము చేసాడు. భూమి మీద గీతలు గేసాడు. ఇది మాదేశము అన్నాడు. రక్షణగా దేశము చుట్టూ కంచె వేసాడు. కర్మాగారాలలో తుపాకులు, యుద్ధ విమానాలు తయారుచేసాడు. ఇక్కడ కాకుండా అంతరిక్షంలో కాలు పెట్టాడు. అక్కడ యంత్రాలు పెట్టాడు. శత్రుదేశము దాడిచేస్తే క్షణాలలో విరుచుకు పడడానికి సైన్యాన్ని సిద్దము చేసాడు. రాకెట్లను తయారు చేసాడు దేనికీ భయపడలేదు.

ఇప్పుడు జరుగుతున్న కరోనా యుద్దములో ఒక్క తుపాకీ పేలలేదు. ఒక్క జవాను చనిపోలేదు. ఒక చుక్క ఇంధనం వాడలేదు. ఒక్క విమానము గాలిలో ఎగరలేదు. కానీ శత్రువు 200 దేశాలలో కబళించాడు. దేశాధిపతులు కంట నీరు కారుస్తున్నారు చేసేది ఏమీలేక. ఆ తుపాకీతో గురి పెడదాము అంటే కంటికి కనిపించదు. కంటికి కనిపించని జీవికి భయపడి పోయాడు. ఇప్పుడు అర్ధమైనదా ఇక్కడ నీ పాత్ర ఏంటో ? ఇన్ని రోజులూ లాక్ డౌన్ లో నువ్వు ... ఎక్కడి కి అక్కడ ఆగిపోతే ... అన్ని జీవరాశులూ, చెట్లూ సంతోషముగా ఉన్నాయి. చక్కగా ఊపిరి తీసికొంటున్నాయి. ఓజోన్ పోరా కొలు కొంటున్నది. గంగ సంతోషముగా ఉన్నది.

నీవు ఒకటి గమనించావా? ఈ కరోనా వైరస్ ఒక కీటకానికి, పక్షికి, జంతువుకి రాలేదు. నీకు మాత్రమే వచ్చింది. ఎవరు ప్రకృతిని పాడు చేశారో వాడినే పగ పట్టింది.

2 . ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకో. ఈ జీవ రాశులలో నీవు ఒక్కడివి మాత్రమే. గొప్పవాడివి కాదు. అన్ని జీవ రాసులూ గొప్పవే. అదే జీవ వైవిధ్యము. నీ అవసరము ఏ జీవికీ లేదు. ఈ జీవుల వసరము నీకు వుంది. ఈ భూమి మీద నీది ఒక అన్న పాత్ర. బాధ్యతతో మెలగడము నేర్చుకో.

3 . నా కేంటి , నాకు ఏమీ కాదు అని మందుల కంపెనీలు చాలా నిర్మాణము చేసావు. కరోనాకి మందు లేదు. నీవు కనిపెట్టినవి దేనికి పనికి వచ్చాయి. నీది మాయ... ప్రకృతిది వాస్తవము , నిజాము.... ఇప్పుడు WHO ఏమి చెబుతుంది. పౌష్ఠిక ఆహారము తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని చెబుతున్నారు. అది సూపర్ మార్కెట్ లో MNC కంపెనీలలో దొరికేది కాదు. అది భూమి నుండి పంట ద్వారా రావలసినదే ఖచ్చితముగా ప్రక్రుతి వ్యవసాయము ( గో ఆధారితము ) , దేశీ విత్తనము తోనే పౌష్ఠిక ఆహారము అందుతుంది.

4 . గాలి ప్రయాణాలు ఆపి కాలు క్రింద పెట్టు. ఇక చాలు నీవు ఎక్కడ పుట్టావో అక్కడికి వచ్చేయి. తినడానికి బతకవద్దు. బతకడానికి తిను. . చస్తూ బతక వద్దు. బతుకుతూ చచ్చిపోదాము. ఒకటి చెప్పు ... అసలు నీకు కావలసినది ఏమిటి ? ఎక్కువ డబ్బులా ? ఎక్కువ ఆరోగ్యమా ?

నేల తల్లి అంటున్నది పరుగులు ఆపాల్సిందే. ముందు నడవడము , నిలబడడము . కుదురుగా కూర్చోవడము నేర్చుకో. ఇవి నేర్పడానికి కరోనా వచ్చింది. ఇక్కడ నీవు బాగుండాలని విశ్వములో నేను మాస్కును ( ఓజోన్ పొరను ) వేసుకున్నా. దాన్ని నిలువునా చీల్చావు. అందుకే ఇప్పుడు నీకు మాస్క్ వేసాను.

5 నేల తల్లి అంటున్నది. ఇప్పుడు మనిషి ముందు వున్నా అతి పెద్ద సమస్యలు రెండు. ఒకటి భూతాపము తగ్గించడము. రెండవది పౌష్ఠిక ఆహారము. ఈ రెండింటికి పరిష్కారము సుభాష్ పాలేకర్ ప్రక్రుతి వ్యవసాయ విధానము.

ఇంకా ఒక్క విషయము. ఈ భూమ్మీద వర్షాలు పడాలంటే తేనెటీగ పాత్ర ఏంటో కీలకమైనది. తేనే నీ ఆహారము కాదు. దాని ఆహారము. నీకు వర్షము కావాలా? తేనే కావాలా?

భూ తాపాన్ని తగ్గించండి. మితాహారులు కండి. పాలిథిన్ కవర్లు వాడకండి. చేతి వృత్తులు కాపాడండి.


నేల తల్లి పరిరక్షణలో మనుషులు అందరూ భాగస్వాములం కావాలి

--(())--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

* చెట్టుతో ప్రేమ
* ఎవరైతే
* మీరు పేరెంట్స్ అయితే ఇవి పాటించండి..!


* చెట్టుతో ప్రేమ

🙏 దయచేసి అందరూ ఇది ఓ సారి పూర్తిగా చదవండి..ఇంతవరకు నేను చదివిన అద్భుతమైన మెసేజ్ లలో ఇది ఒకటి 

🌳 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  

🌴 ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. 

🏝 కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు

🌿 కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 

👦 బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 

🌳 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. 

🍎 బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 

🌴 క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది 

🏕 "నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. 

🌿 "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 

🌴 అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. 

🌴 బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు

🌴 నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 

🌴 అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 

🌴 చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. 
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. 

🌴 చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. 

🌴 నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. 

🌴 నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. 

🌴 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. 

🌴 ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 

🌴 కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. 

🌴 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.

👥 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. 

💘 ఈ కథలోని నీతి.. 

💗 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. 

💖 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. 
మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది

🙏 ఈ విషయాలు అందరికీ తెలియచెప్పడం కోసం మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే

* ఎవరైతే 


                    1. ఎవరైతే dp ని స్థిరంగా ఉంచుతారో వారు శాంత స్వభావం కలవారు
2. ఎవరైతే చీటికి మాటికి dp మారుస్తారో వారు చంచల మనస్తత్వం కలవారు

3. చిన్న status పెట్టుకున్న వారు చిన్నవాటికి కూడా సంతోషంగా ఉంటారు🤩

4.అస్తమానం status మార్చేవాళ్లు కొద్దిగా పైత్యo కలవారు🤪🤓

5. ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉండేవాళ్లు పెద్ద మనసు కలవారు  

6. ఎప్పుడూ ఏదీ like చెయ్యని వాళ్లు అహంకారం కలవారు 🤥🙄 లేదా ముటముటలాడుతూ ఉండేవారు

7.ప్రత్యేకమైన పోస్టులకు జవాబు ఇచ్చేవారు ఎదుటివారి భావనలు గౌరవించేవారు మరియు రసికులు🤠🤝

8. ఇక్కడి పోస్టులు అక్కడికి,  అక్కడి పోస్టులు ఇక్కడికి విసిరే వాళ్లు రాజనీతజ్ఞత కలవారు🧐🤔

9.ఏదైనా పోస్టు చూడగానే వెంటనే open చేసేవాళ్లు restless గా ఉంటారు🙇‍♂🙇‍♀

10. పాత పోస్టులు మళ్లీ మళ్లీ పెట్టేవాళ్లు ఉద్దండులు లేదా విసిగించే వారు🤤

11. ప్రక్క వారి పోస్టులకు ఇంకా response ప్రవాహం కొనసాగుతూ ఉండగానే తన పోస్టులతో dominate చెయ్యాలని చూసేవారు కొద్దిగా స్వార్థ స్వభావం కలవారు లేదా కీర్తికాంక్ష కలవారు 

12. మెసేజ్ లు చదివి కూడా జవాబు చేసే అలవాటు లేనివారు సంకుచితమైన స్వభావం కలవారు

13. ఎప్పుడూ ఏదీ షేర్ చెయ్యని వాళ్లు పిసినారులు

14. పెద్ద పెద్ద పోస్టులు మరియు వీడియోలు చూడని వాళ్లు చాలా బద్దకం కలవారు

15. చాలా వాట్సాప్groups తయారుచేసి ఆనందించే వాళ్లు పేరు ప్రఖ్యాతులు ఆశించే వాళ్లు అయి ఉంటారు

16. నొప్పించక, తానొవ్వక వాట్సాప్ ను నేర్పుగా వాడేవారు యశశ్వులు🤫👍

 మీరు ఎక్కడ ఫిట్ అవుతున్నారో చూసుకున్నారా మరి‼
                             --(())--

* మీరు పేరెంట్స్ అయితే ఇవి పాటించండి..!

1. మీ పిల్లలను రాజకీయాలకు, కులాలకూ, మతాలకూ, ప్రాంతీయ విద్వేషాలకూ దూరంగా పెంచండి. వీలైతే విశ్వ మానవులుగా తయారు చేయండి.

2. మంచి ఆలోచనలు కలిగిన సర్కిల్ ఉండేలా జాగ్రత్త వహించండి. దారితప్పిన ఆలోచనలు కలిగిన వారు మీ పిల్లల ఫ్రెండ్స్ లో ఉన్నా, అలాగే వారి సోషల్ మీడియాలో ఉన్న ఖచ్చితంగా వారి ఆలోచనలు కలుషితమవుతాయి. ఉన్నతమైన భావజాలం కలిగి ఉండి, నిరంతరం తమ మానసిక, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ఫోకస్డ్‌గా తమ ఎనర్జీస్ వినియోగించుకునేలా పిల్లలను తయారు చేయండి.

3. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, జీవితాన్ని డైనమిక్‌గా జీవించే స్వభావం నేర్పండి.

4. అలాగే కష్టం విలువ చెప్పండి, డబ్బు విలువ చెప్పండి. రాత్రికి రాత్రి జాక్‌పాక్ కొట్టి ఈజీ మనీ కోసం బ్రతికే సోమరి బతుకులు బతకొద్దని నూరిపోయండి.

5. పార్టీలనీ, పబ్బులనీ, అమ్మాయిలనీ, ఎంజాయ్‌మెంట్ అనీ వ్యసనపరులుగా తయారయ్యేలా చేయకండి. యువతరాన్ని నిర్వీర్యం చేసే అలవాట్లు అవి.

6. కనీసం తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేవిధంగా, వారి ఆరోగ్యం పట్ల వారు జాగ్రత్త తీసుకునే విధంగా చిన్నతనం నుండి అలవాటు చేయండి.

7. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా సరిగ్గా టైం కి వెళ్లే విధంగా, ఒక నిమిషం కూడా ఆలస్యం కాకుండా టైమ్ ఫాలో అయే విధంగా డిసిప్లెయిన్ నేర్పండి.

8. అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఎవడూ ఒక్కడు ఉండడు, కాబట్టి తమని తాము నమ్ముకునేలా ఒక బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండేలా తీర్చిదిద్దండి.

9. పోరాడాల్సి వస్తే పోరాట యోధులుగా ఉండే వారిని, అవసరం లేనప్పుడు తమను తాము సంస్కరించుకునే యోగులను తయారు చేయండి.

10. చివరగా ఒకటే చెబుతాను.. ఈ సమాజం చాలా కలుషితమైపోయింది. సమాజ మొత్తాన్ని రాజకీయ నాయకులు కులాలుగా, మతాలుగా చీల్చేశారు. ఈ సమాజంలో మీ పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి ఎవరూ ఆలోచించరు, నాలుగు మంచి మాటలు కూడా చెప్పరు. సమాజం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకండి. మీకు మీరే బాధ్యతగా వారిని అన్ని బలహీనతలకు దూరంగా గొప్పవాళ్లుగా తయారు చేయండి.
--(())++

*పండ్లబుట్ట కథ*
*ఆయుర్దాయం

*పండ్లబుట్ట కథ*


జస్ట్ 5 నిమిషాలకంటే ఎక్కువ టైం పట్టదు చదివి అర్థం చేసుకోడానికి..!!

🍌 *అరటిపండును తొక్క తీసేసిల తింటాం*.

*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం*.

*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని...పై తొక్కతో పాటు*
*లోపలి గింజలు కూడా వదిలేస్తాం*

🍎 *ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.*

*🍏జామ పళ్ళని మొత్తం తినేస్తాం.*

*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం*.

*ఒక్కోటి ఒక్కో రుచి*.
*తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు.*
*అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.*

*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు*
*మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.*

*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు*.

*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు*...
*ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే.*..
*అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది*

*పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?*
*కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..వాటి జోలికి పోకుండా వదిలేస్తాం* *తప్ప..చిరాకుపడo కదా!!?*

*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం*..
*ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.*.

*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!*
*కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ* *ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ*..
*శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!


ఆయుర్దాయం

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో

 “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” 

అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే. ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||

అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం. ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న. 

“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” 

నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం. కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది. అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.
(ఈ వ్యాసం అరణ్యస్పందన నుండి గ్రహించబడినది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో డా|| అన్నదానం చిదంబర శాస్త్రి గారు వ్రాసారు)

--(())--
--(())--