24, ఆగస్టు 2018, శుక్రవారం

ఆరాధ్య ప్రేమ లీల -1




ఆరాధ్య ప్రేమ లీల

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ



కోపము మనిషిని ఊయలుగా ఊపేస్తుంది 

- గొడవ మనిషిని బొంగరంగా తిప్పేస్తుంది

పేచీలు మనిషిని మౌనముగా మార్చేస్తుంది

- నవ్వులు మనిషిని ఆలోచింప చేయిస్తుంది

ఏడ్పులు మనిషిని అయ్యోమయ్యం గాచేస్తుంది

- ముచ్చట్లు మనిషిని మార్చేట్లు ప్రయత్నిస్తుంది

చెలిమి మనిషిని ప్రేమించేటట్లు చేస్తుంది

- ఆనందం మనిషిని ప్రేమమయాన్ని చేస్తుంది

కోపము ఉత్తముని యందు క్షణం

మధ్యముని యందు రెండు ఘడియలు

అధముని యందు రోజంతా

మూర్ఖునియందు చచ్చేంతవరకు

ఇది వేణు గోపాల ప్రేమ సుమా



--((**))--


ఆరాధ్య ప్రేమ లిల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

రామ జపం తరంగాలుగా విస్తరించి - దుర్మార్గుల మనస్సున చేరి
రామ జపం కిరణాలుగా విస్తరించి - పుడమితల్లి హృదయం చేరి
రామ జపం కెరటాలుగా విస్తరించి - సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి
రామ జపం మనుష్యులను ఆవరించి - హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి
రామ జపం మనో బుద్ధులను కల్పించి - మానవాభ్యుదయానికి నిత్యం చేరి
రామ జపం ప్రతి ఒక్కరునూ ఉచ్ఛరించి - మన:శాంతికి మనుగడగా చేరి
రామ జపం కు హనుమ ఇంట నివసించి - ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి
రామ జపం కు దేహబలం శక్తి ఆవహించి - ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి

అందుకే నిత్యం జపించు
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !!
శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి.

--((**))--


ఆరాధ్య ప్రేమ లీల

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ



అల్లరి చెలుల అలకలు తీర్చిన వాడే వీడు 

- వేణు గానందతో మనసును మార్చిన వాడే వీడు



తల్లితండ్రులకు మోక్షాన్నికల్పించిన వాడేవిడు

- నోటిలో సకల లోకాలు చూపించిన వాడే వీడు

ఆడబడుచుల శీలాన్ని రక్షించిన వాడే వీడు

- మూర్ఖుల గర్వాన్ని మాయతో అణచిన వాడే వీడు

ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేసిన వాడే వీడు

- జీవితంలో శాంతి సౌభాగ్యం కల్పించిన వాడే వీడు

స్వామిరారా అనుకో

మనసును తేలికపరుచుకో

జీవితాన్ని రక్షించుకో

ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మనుష్యుల మనస్సును మార్చాలని తపనేందుకు
- ధర్మ మార్గంపై శోధన చెయ్యాలని తపనెందుకు
పాపాలను అరికట్టాలని నీకు తపనెందుకు
- సముద్రాన్ని కొలవాలని నీకు తపనెందుకు
సూర్యకిరణాలు ఆపాలని నీకు తపనెందుకు
- కాలగమనాన్ని మార్చాలని నీకు తపనెందుకు
బ్రహ్మచారులను మార్చుటకు నీకు తపనెందుకు
- గోవిందుని ' చరణాలను , తాకాలని తపనెందుకు
శాంతి కోసం తపనఉండాలి
ఆరోగ్యం కోసం తపన ఉండాలి
ప్రేమ కోసం తపన ఉండాలి
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--
ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
పెదాలకు తాళాలు పెట్టి నట్లు ఉంటాయి
- ఆకలనే చెవి తిప్పీతె తెరవకుండా ఉంటుందా
ఆకాశము పుడమి అందనట్లు ఉంటాయి
- వర్ష మనే చెవి తిప్పితే కలవకుండా ఉంటుందా
శృంగారము అలక తాకనట్లు ఉంటాయి
- జిహ్వ చాపం చెవి తిప్పితే కరగకుండా ఉంటుందా
మోహమనే చూపులు తాకనట్లు ఉంటాయి
- అగంగం ఆదమరిస్తే ఆశ తీరకుండా ఉటుందా
పెదాల కదలికలు తాకనట్లు ఉంటాయి
- అధరామృతం తోడైతే ఆశ మారకుండా ఉంటుందా
లతలు పరిమలించ లేనట్లు ఉంటాయి
- నీ మనసు తోడైతే తపన తీరకుండా ఉంటుందా
అణువణువు ఆవేశం ఉన్నట్లు ఉంటాయి
- నింగి తార చీకటిలో మెరవకుండా ఉంటుందా
మనసు మమతా చుట్టూ ఉన్నటు ఉంటాయి
- నీ ధర్మ కీర్తి, న్యాయస్ఫూర్తి మెరవకుండా ఉంటుందా
అగ్నికి ఆజ్యం వెలుగు - నదికి సంద్రం వెలుగు
రాత్రికి పగలు వెలుగు - గాలికి ప్రకృతి వెలుగు
భార్యకి భర్తయు వెలుగు - నేర్పుకి ఓర్పుయు వెలుగు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా
--((**))--


ఆరాధ్య ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రామ జపం తరంగాలుగా విస్తరించి
- దుర్మార్గుల మనస్సున చేరి
- రామ జపం కిరణాలుగా విస్తరించి
- పుడమితల్లి హృదయం చేరి
రామ జపం కెరటాలుగా విస్తరించి
- సముద్ర ఘర్బాన ఖనిజాల్లా చేరి
- రామ జపం మనుష్యులను ఆవరించి
- హృదయప్రక్షాలంగా మార్పుకు చేరి
రామ జపం మనో బుద్ధులను కల్పించి
- మానవాభ్యుదయానికి నిత్యం చేరి
- రామ జపం ప్రతి ఒక్కరునూ ఉచ్ఛరించి
- మన:శాంతికి మనుగడగా చేరి
రామ జపం కు హనుమ ఇంట నివసించి
- ప్రేతాత్మల నుండి రక్షణగా చేరి
- రామ జపం కు దేహబలం శక్తి ఆవహించి
- ఇల్లాలి కోర్కలు తిర్చుటకు చేరి
అందుకే నిత్యం జపించు
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే !! శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి.
--((**))--

రాధాకృష్ణ మనసు పులకరింతలు  
ఆరాధ్య ప్రేమ లీల - 10 ప్రాంజలి ప్రభ. కం   
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వుల నెలవంకలు పరిమళించే 
- మల్లెపువ్వుల సువాసనలు గుబాళించే 

కలహంసల ఎదలోయలు పులకరించే  
- మౌన గంటల మదిభావాలు వ్యక్తీకరించే   

ఎండావాన మెరుపు లతలు పరవశించే 
- సమయానికి సంతోష కధలు అంతరించే 

చెలి మౌనము తనవలపుతో మేళవించే
- వయారమే మత్తుగొలుపు మధువు అందించే
  
నవ స్వర్గం అవతరించే   
మౌన భావాలు వికసించే 
పిలుపుతో మనసు తరించే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా


--((**))--

తరుణ - స/న/న/భ/న/జ/న/స IIU IIII IIU IIII IIU IIII IIU 
శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా 
ఆరాధ్య ప్రేమ లీల -9 Pranjali Prabha.com   
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

మనువాడు మనసు మమతాను జపము ఎగసే నయనము గదరా    
వనజాక్షుని గన మనసే కరిగెను   ప్రణయస్వరములు కదిలెన్  
తనువంత పులకిత సుతామధురము ఎగసే పయనము గదరా 
మనసాయె మగువ పిలుపే మదిపులకితమయ్యెమరులు గొలిపెన్      

వినవేల మనసు దినమంత కరుణ ఎగసే తరుణము గదరా   
కనులందు వెదకె సిరులందు వెదకె తనువే తమకము గదరా
కనులార పిలుపు కనువిందు తలపు కలకాదు జపము గదరా 
వినుమిప్పుడెహరి ననుజేరుమువడి కనిచెప్పుము పలుకధలన్        

వెదికే కన్నులకు చూపుఉండదు  
ప్రేమించే మనసుకు దారితెల్వదు 
ప్రేమకు చీకటి వెల్తురు అనేది లేదు 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


శ్రీ కృష్ణాష్టమి సంధర్భముగా  
ఆరాధ్య ప్రేమ లీల - 8  
రచయిత: మల్లపరగడ రామ కృష్ణ

అందు కోలేని స్వప్నాలు కోసం ఆదుర్దా పడకు   
- ఆరాటంతో ఆదర్శం చూపి పోరాటం చేయకు 

ఇలలో అలలే ఆపలేవు ఆశలు ఎందుకు   
- ఈతరంకి భక్తి పారవశ్యం నింపియు బ్రతుకు

ఉషోదయ కిరణాలవలె మేల్కొల్పి బ్రతుకు  
- ఊహలు నిజం చేసి ఊపిరి అందించి బ్రతుకు

ఎదలోతులో ఉన్న భాద తొలగించి బ్రతుకు
- ఏకాంతవేళలో నా నామ జపముతో బతుకు

ఐకమత్యంతో సహకారం అందచేస్తూ బ్రతుకు
- ఒకే ప్రాణమై కలిసుందాం  కలవర పడకు 

ఓదార్పు అనునిత్యం పొందలేని ప్రేమనుకోకు
- ఔదార్యముతో నిన్ను కనికరించ లేదనకు

అమృతాన్ని అందించి ఆదమరుచుట ఎందుకు           
- అహంకారాన్ని వదలి ఆత్మజ్ఞానంతో  బ్రతుకు 

జ్ఞాపకాల మైదానంలో వేచి ఉన్న నీకొరకు
- నిరంతరం హృదయం  తపిస్తున్నది నీకొరకు    

అంటూ రాదనే ఓదార్పుతో 
ప్రేమేనిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే త్యాగం 
ప్రేమే శాశ్వితం, ప్రేమే హృదయానందం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


రాధకు శ్రీకృష్ణుడు ఈ విధముగా తెలియ పరిచారు 
శ్రీ కృష్ణ అష్టమి సందర్భముగా 
ఆరాధ్య ప్రేమ లీల - 7 Pranjali pabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

రాధా చిత్తం స్థిరంగా ఉంచుకుంటే  
మనసు మమైకం లో ఉంటుంది 
చిత్తం నీ చేతుల్లో ఉంటే,
పది కాలాలు పదిలంగా ఉంటుంది! 
నీ చేతలే చిత్తం అనుకుంటే,  నశిస్తావు! 
ప్రేమ కోసం పది కాలాలు బతుకుతావో? 
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా  !

ప్రేమ ఉప్పుగల్లు జావలా పంచితే , పోయే ప్రాణం నిలుస్తుంది, 
ప్రేమ కల్తీ కల్లు ధారలైతే, ఉన్న ప్రాణం గాల్లో కలుస్తుంది! 
హరివై పోషిస్తావో? హరుడై హరిస్తావో? 
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా  ! 

ఉపవాసములు ఉంది ఆరోగ్య చెడగొట్టుకుంటావో  
సాత్విక ఆహారం తిని ఆరోగ్యం నిలబెట్టుకుంటావో  
ఆరోగ్యం పాడు చేసుకుంటావో ? బాగు చేసుకుంటావో ? 
అంతా నీ చిత్తం లోనే ఉంది రా ధా  ! 

ఎంతసేపూ పూలూపండ్ల మీదే ఉంటే ఆసక్తి, 
పాతుకు పోయిన భక్తి అనే వేళ్ళ శక్తి? 
అన్నీ తెలుసునను కోవటం భ్రమ, 
అన్నీ తెలియాలంటే అవసరం శ్రమ! 
ఒట్టి భ్రమలో బతికేస్తావో? గట్టి నిజంలో జీవిస్తావో? 
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా ! 

మనసు నిగ్రహించు కుంటే 
ఇంద్రియాలు మన ఆధీనంలోకి వస్తాయి 
ప్రేమ భక్తి భావం ఉంటె 
మన: శాంతి ఉంటె సర్వం స్వర్గం
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా ! 

తనకు తానే తెలియని దేవుణ్ణి ఎలా గుర్తిస్తావో? 
కనిపించేదాన్నే విస్మరించితే  శూన్యంలో సూక్ష్మం ఎలా గ్రహిస్తావో ? 
ఉనికిలోనే ఉంది పరమాత్మ దర్శనం! ఉబికే చైతన్యమే దానికి నిదర్శనం! 
అంతా నీ చిత్తం లోనే ఉంది రాధా !

--((**))--

శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల - 6 Pranjali Prbha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
రాధ ఇటు చూడు
కలువలు రెండు
కల్లప్పగించి చూస్తున్నాయి మనల్ని 
కనికరము చూపుట కొరకా
కార్యసాధనం కొరకా
కాలంతో కలవ లేకా
కోపానికి చెదిరాయ,  చెప్పు రాధా 
"సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
చామంతి పువ్వులు రెండు
బుగ్గలు రాసుకుంటూ ఉన్నాయి
చెప్పుకున్న కధల కా
చెలిమి సంభాషణల కా
తన్మయత్వం చెందుట కా
జలచరాల సవ్వాడి కా చెప్పు మాధవా
"తన్మయత్వ తపనలతో తపిస్తున్నాయి రాధా "

రాధ ఇటు చూడు
మల్లెలు మరువం రెండు
పెన వేసుకొని ఉన్నాయి
మనసుని పరవసింప చేయుట కా
మది తలపులను తెలుపుట కా
మృదు మాధుర్యాన్ని అందు కొనుట కా
మాయను చేదించుటకా, చెప్పు రాధా 
"తడి పొడి తపనలతో తపిస్తున్నాయి మాధవా"

మాధవా ఇటు చూడు
గులాబీలు గుభాలిస్తున్నాయి
స్త్రీల కొప్పులో చేరటాని కా
కోపానికి నలిగి పోవటాని కా
కోరుకున్నవాడి కోరిక తీర్చటాని కా
బంతుల్లా ఆడుకోవటాని కా, చెప్పు మాధవా
"పవలింపులో నలిగి పోవాలని ఉన్నాయి రాధా "

"రాధా పోదామా గూటికి చలికాచు కుందాము
అట్లాగే మాధవా వెచ్చని కబుర్లు చెప్పుకుందాము" 


--((*))--

శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా
ఆరాధ్య ప్రేమ లీల - 5 ప్రాంజలి ప్రభ.com 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  

కృష్ణా జలపాతాల శబ్దం ఒక నాదాలుగా   
- కృష్ణా కెరటముల శబ్దం ఒక అలజడిగా    

నదీ తరంగాల లాస్యం ఒక స్పందనలుగా 
- చినుకుల విన్యాసాలు ఒక వందనాలుగా 

ఆకులు ప్రుద్విని తాకే శబ్దం ఒక కలగా
- ఊగే కొమ్మల పూలు రాలి చూపులు గాలిగా 

స్వర విహారాలు మనసుకు ఒక జాలిగా
- మబ్బు గర్జనలు మధురమైన స్వరాలుగా

మన ప్రేమ భావాలు జన్మ జన్మ చిహ్నాలుగా
- మాట మది  కలయకలు ఒక ఆందాలుగా 

మనసు మంగళమై నవ తుంబుర నాదంగా 
- శ్వాస సప్త స్వరమై ద్యాస దివ్య ధ్యానముగా 

నీ కోసం కళ్ళు విప్పారి ఎదురు చూస్తానుగా  
- నీ కోసం ఆటు పోట్లతో చిక్కి ఉన్నానుగా

కృష్ణా తనువు నీకే అర్పించాలని ఉందిగా 
- కృష్ణా ఈ రాధ నీ ప్రేమకోసం వేచి ఉందిగా 

స్త్రీ మనస్సు ఒక నవనీతం 
వేడికి కరిగిణ ఉపయోగం ఖాయం 
అధరం మధురం అని చెప్పేది 
వేణుగోపాల ప్రేమ సుమా  
--((**))--


Image may contain: 1 person

శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా   
ఆరాధ్య ప్రేమ లీల -4  Pranjali prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఓ రాధికా, నా ప్రియభామినీ, అలక చూపించకు
- జాబిల్లిని రప్పించి కంఠాభరణం చేయిస్తా నీకు 

వద్దులే గోపాలా నీవు మాత్రం నాకోసం అలుగకు 
- నీలో చంద్రుని మించిన అందంఉంది చాలునునాకు

ఓ రాధికా, నా ప్రియసఖీ నిరాదరణ చూపకు
- నీలాకాశం తెచ్చి వస్త్రంగా చుట్టాలని ఉంది నాకు     

వద్దులే గోపాలా ఉన్న వస్త్రం ఉంచితే చాలు నాకు    
- నీ ఆకాశమంతా హృదయాన్ని పంచావు చాలు నాకు

ఓ రాధికా, సఖీనన్ను దూరం ఉంచి ఉడికించకు  
- చుక్కలను తెచ్చి సిగపువ్వులగా మారుస్తా నీకు

వద్దులే గోపాలా సిగపువ్వులను అందిస్తా నీకు  
- ప్రక్కన నీవేఉంటె వేరేపరిమళాలు ఎందుకు    

ఓ రాధికా, నన్ను చూసి చూడక నవ్వుతు ఉండకు 
- నీ మనసు అరిషడ్వర్గాలను తొలగిస్తా నీకు 

వద్దు గోపాలా ప్రేమ నీపై ఉంటే పని ఏమి నాకు
- నా మనసంతా నీపై మారకుండా ఉంటె చాలు నాకు    

ప్రేమకు ఆశలు ఉండవు 
ఆశకు లొంగదు మనసు 
ప్రేమను మార్చే శక్తి లేదు ఎవ్వరికి 
ఇది వేణుగోపాల ఆరాధ్య ప్రేమ సుమా 
--((**))--



శ్రీ కృష్ణాష్టమి సందర్భముగా   
ఆరాధ్య ప్రేమ లీల -3 Pranjali prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

శ్రీ కృష్ణా  నీవు నాకు కనబడవు 

- నామనసు నీకు ఎలా అర్పించేది
  
నీ మనసు నాకు తెలపి దాచావు,
-  నా మనసు నీకెలా నేను తెల్పేది  

నా మనస్సు ఓదార్చే సలహా ఇవ్వవు 

- నా మనసు నిన్నే కలవ మన్నది   

నీ ఆలాపనలే కలలో నింపావు 

- నాకు ప్రాణంగా నినామమే ఉన్నది  

ఆకుల సవ్వడితో ఉండికించావు 

- ప్రేమ కోసం తాంబూలం పిలుస్తున్నది 

పూల పరిమళాలను అందించావు
- నా హృదయాన్ని తాకి తపిస్తున్నది  

మమత పిలవని సుఖాలిచ్చావు

-  మనో ధైర్యం తో ప్రేమే మనసన్నది 

నీ ప్రణయ చూపు నిద్రపోనియ్యవు  

- ప్రేమ కొరకు రాధ వేచి ఉన్నది

సంద్రమునకు లేవు హద్దులు 

ప్రేమించుటకు లేవు హద్దులు 
నింగి నేలకు లేవు హద్దులు 
ఇది వేణుగోపాలని పై ప్రేమ సుమా

--((**))-- 




ప్రపంచ విపత్తుకు సహాయం చేద్దాం 
ఆరాధ్య ప్రేమ లీల -2  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

వరుణదేవుని అనుగ్రహం ఆగ్రహంగా మారే 
- జలమయమై వికటాట్టహాసం బాధగా మారే 

పాంచభౌతిక శరీరలెన్నో శవాలుగా మారే
- చల్లదనాన్నిచ్చే జలమే కలుషితంగామారే

జన జీవన గమ్యాలన్నీ క్షణక్షణము మారే  
- ఆర్తనాదాల భయ తరుణంలో అందరూ చేరి  

తారతమ్యం మరచి సేవాతత్పరంగా జనం చేరి 
- బ్రతుకుకు ధనము, ఆశ్రయము ఏర్పరిచిరి   

రండి రండి కదలిరండి 
బాధితులకు రక్షణ కల్పించండి 
మానవతా దృక్పదాన్ని చాటండి 

--((**))--

వరలక్ష్మీ పూజ సందర్భముగా ఆరాధన ఆరాధ్య ప్రేమ లీల -1 Pranjali Prabha.com రచయత: మల్లాప్రగడ రామకృష్ణ ఆర్తితో ఆరాధిస్తున్నా ఆది లక్ష్మీ - చేదుకోవమ్మా శ్రీ మాతా భాగ్యలక్ష్మీ రాగప్రేమమ్మూ తొ ఆరాధ్యాది లక్ష్మీ - ఆదుకోవమ్మా శ్రీ రామా రాజ్య లక్ష్మీ మాటమాదుర్యం తొ పూజా పూజ్య లక్ష్మీ - ఆలపించానమ్మ సౌభాగ్యాది లక్ష్మీ తల్లివై మామాట మెచ్చే దివ్య లక్ష్మీ - కష్ట నష్టాల్నీభరించే అష్ట లక్ష్మీ కరుణించి మాపూజలందు కోవమ్మా మన:శాంతి నిచ్చి మమ్మాదుకోవమ్మా వేణుగోపాల సహితంగా రావమ్మా ఇది అధిక్షేప భక్తి కాదమ్మా ఇది ఆరాధ్య భక్తి, అమ్మా అమ్మ అమ్మా ముగ్గురమ్మలమూలపుటమ్మా రావమ్మా --((**))--


19, ఆగస్టు 2018, ఆదివారం

ఆదిక్షేప ప్రేమ లీల-4*



ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

నవ నాగరికము నాంది, మనసే మగువకు నాంది 
- తనువే తమకము నాంది, వలపే వరుసకు నాంది 

రంగువే మమతకు నాంది, వరుసే వలపుకు నాంది 
- మెరుపే చినుకుకు నాంది, జిగురే అతుకుకు నాంది

వికసించు లతకు నాంది, పరికించు వయసు నాంది 
- అరుపే అలకుకు నాంది, రగిలే సెగలు పగ నాంది      

విరహం పరువము నాంది, వయసే వలపుకు నాంది   
- తపనే కలతకు నాంది, పలుకే మనసుకు నాంది 

నాంది అనగా ప్రారంభం 
నాంది అనగా పునాది 
నాంది అనగా మొదలు
ఇది వేణుగోపాల ప్రేమ సుమా 
--((**))--


అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ .కం
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఆలోచన ముందు ఆవేశం అధికం 
- అయినా ఆలోచింపచేసేదే శాశ్వితం  

నిరుత్సాహము ముందు ఉత్సాహం అధికం 
- అయినా నిరుత్సాహమే శాశ్వితం   

చిరునవ్వుల ముందు ప్రేమానందం అధికం 
- అయినా చిరునవ్వులే శాశ్వితం  

స్త్రీ చూపుల ముందు పరిమళం అధికం 
- అయినా చూపుల్లో చిక్కే  శాశ్వితం  

శృంగారము  ముందు మధువు అధికం 
- అయినా స్త్రీ శృంగారమే శాశ్వితం 

పరిమళం  ముందు స్నేహమే అధికం 
- అయినా పరిమళమే శాశ్వితం 

ఆశయము ముందు మౌనమే అధికం 
- అయినా ఆశయమే శాశ్వితం

సంసారము ముందు సంపదే అధికం 
- అయినా సంసారమే శాశ్వితం     

ఏది ఏమైనా కాలాన్ని వ్యర్థం 
చేయక నడిచే వాడే శాశ్వితం  
ప్రేమించి ప్రేమింపబడేవాడే శాశ్వితం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా  
--((**))--


అధిక్షేప ప్రేమ లీల - Prnjali prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

విద్య బోధించే ముందు గణపతిని మర్చిపోతున్నాను  
- అభ్యసించుట ముందు అద్దుకోవటం మర్చి పోతున్నాను

ముద్దలు తినే ముందు ఆత్మారాముణ్ణి మర్చి పోతున్నాను
- ఉద్యోగం చేసే ముందు అధికారాన్ని మర్చి పోతున్నాను 

మంత్రం చదివే ముందు అమ్మవారిని మర్చి పోతున్నాను
- ప్రార్ధన చేసే ముందు ఆలోచనను మర్చి పోతున్నాను      

ప్రేమను పంచె ముందు అనుభూతిని మర్చి పోతున్నాను  
- సుఖాన్ని పొందే ముందు గుండెచప్పుడు మర్చి పోతున్నాను 

మెప్పుని పొందే  ముందు శ్రమ ఫలితం మర్చి పోతున్నాను 
- శ్రమను పంచే ముందు  కష్టసమయం  మర్చి పోతున్నాను

స్నేహాన్ని పొందే ముందు అభిపాయాన్ని మర్చిపోతున్నాను 
- ద్వేషాన్ని చూపే ముందు మౌన నీడల్ని మర్చి పోతున్నాను  

దైవ ప్రార్ధన ముందు ఆత్మ ధైర్యాన్ని మర్చిపోతున్నాను 
- తల్లి తండ్రుల ముందు ప్రేమ భావాన్ని మర్చి పోతున్నాను  

దేశ సేవల ముందు ఆశాగుణాన్ని మర్చి పోతున్నాను
- ప్రేమత్యాగాల ముందు దేహ ఆరోగ్యం మర్చి పోతున్నాను

తల్లి తండ్రుల ప్రేమను 
అర్ధనారీశ్వర తత్వమును
సత్య ధర్మ న్యాయాన్ని
మాత్రం మరువకు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


ఆధిక్షేప ప్రేమ లీల- Pranjali Prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరునవ్వుకు సరితూగే, మల్లెపువ్వు శాశ్వితమా 
- మతి భ్రమకు సరితూగే, సంపెంగము శాశ్వితమా 

గుండె కోతకు సరితూగే, జీవనము శాశ్వితమా 
- మది చురుకు సరితూగే, ప్రణయము శాశ్వితమా

క్షణ సుఖంకు సరితూగే. సంసారము శాశ్వితమా
- నిత్య శోకంకు సరితూగే, కుటుంబము శాశ్వితమా 

దాహం మధువు సరితూగే, అనుభందం శాశ్వితమా
- వయసు ప్రేమ సరితూగే, స్వర్గమైన శాశ్వితమా

మౌనం కుదుపు సరితూగే, సంద్రమైన శాశ్వితమా 
- తల్లీ తండ్రికి  సరితూగే,    దైవమైన శాశ్వితమా
  
శీలం బాధకు సరితూగే, కొడుకైనా శాశ్వితమా 
- ప్రేమ శృతికి సరితూగే, భర్త ఐనా శాశ్వితమా 

చెలి ప్రేమకు సరితూగే, సుఖమైనా శాశ్వితమా
- గీత బోధకు సరితూగే, ఆచరణ శాశ్వి తమా                  
   
గాణ విద్యకు సరితూగే, సంగీతము శాశ్వి తమా
- విద్య భోదకు సరితూగే, సహాయము శాశ్వితమా 

దాసదాసీ జనము, నౌకర్లు, 
కొడుకు, బంధువు, వస్తువులు, 
వాహనములు, ధనసమృద్ది ధాన్య సమృద్ది యను 
శాశ్వితము కావు ఒక్క దైవ ప్రార్ధనే  శాశ్వితం 
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
-((**))--
            



అధిక్షేప ప్రేమ లీల - Pranjali Prabha. com   
రచయత: మాప్రగడ రామకృష్ణ 

ప్రపంచ సౌలభ్య ఉన్నతికి సలహాలు ఇచ్చేవారెవరు  
- ప్రపంచ కర్మల ప్రారబ్దాన్ని అనుభవించేటి వారెవరు  

ప్రపంచ ప్రమాదాల నుండి ప్రజలను రక్షించే వారెవరు    
- ప్రపంచ ప్రజల ఆకలిని తీర్చి ఆదుకొనే వారెవరు  

ప్రపంచ అనారోగ్యులకు మందులిచ్చి కాపాడే వారెవరు  
- ప్రపంచ మేధావులను గుర్తించియు గౌరవించే వారెవరు 

ప్రపంచ విద్యా సేవా బోధకులను సన్మానించే వారెవరు
- ప్రపంచలో ధర్మం, న్యాయం, సత్యంగా సంపాదించే వారెవరు

ఎవరు ఎసరు అనకు 
మంచి చెడు గమనించి మనిషిగా 
నీవే ఎందుకు కాకూడదు     
ఇది వేణు గోపాల ప్రేమ సుమా     
--((**))--

 ప్రేమ లీల చిత్ర పద్యాలు  - ప్రాంజలి ప్రభ. (5)*
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 

చిరు హాస పల్కులకు భయ భీతియు పెరిగే 
మణి పూస వెల్గులకు నిజ శాంతియు పెరిగే 
నయనాల చూపులకు నవనీతము కరిగే 
సోయగాల మెరుపుకు అభిమానము పెరిగే 

పరువాల వెన్నెలకు పరిమళము కరిగే 
మద లీల వేషముకు మనసు జత కరిగే 
మదిలీల మగువకు చమత్కారము పెరిగే   
చలిగోల మగనికి బలత్కారము పెరిగే 

వింత గోల వయసుకు విపరీతము కలిగే
కాంత హేల సమయము అపరాధము కలిగే  
సంత గోల వనితకు ఉపోద్ఘాతము పెరిగే 
వింత మాట మగనిలొ ఉపోద్ఘాతము పెరిగే  

విధి లీల మనసుకు భయమోహము కలిగే 
నిధి గోల వయసున పరుగెత్తుట జరిగే  
ప్రేమ లీల మహిళకు సుఖభారము పెరిగే 
ప్రేమ గోల మగనికి ముఖభారము కలిగే 

శుభము యో భారము గనుయో  భయ్య మొవ్వు 
భయము లే ద్వేష మోహ  దాహమ్ము అవ్వు 
మోహ తాపమో జాప్యము  కలిగి ఉండు   
సతిపతియు గాను పతిసతి  గాను లీల
   
అదియే వేణు గోపాల ప్రేమ సుమా   
   --((**))--

తాత మానవుడి - (చిన్న కధలు)

తాత మాకధ నవుడి చిన్న కధలు -13 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాతా దేవుడున్నాడా?  లేడా ? నాకు చెప్పు తాతా   
ఒరే మనవుడా నా చిన్నప్పుడు విన్న కథను మరలా చెపుతా విను, విన్న తర్వాత నీవు ఉన్నాడంటే ఉన్నాడు .......   లేడంటే లేడు ... అంత  తొందరెందుకు ఒక్క సంఘటన చెపుతా విను  అన్నాడు తాతయ్య మనవుడితో   
  
కొత్తగా లెక్కల మాష్టారు గారు క్లాసురూం లో అడుగు పెట్టారు, నల్ల బల్ల మీద వినాయకుని బొమ్మ వేసారు పిల్లలు, అది చూసి దేవుడున్నాడని మీరు నమ్ముతారా ? అని గాట్టిగా అన్నారు మాష్టార్, అంటే గట్టిగా మీరు నమ్మరా అని సమాధానముగా చెప్పారు పిల్లలు.

 " భగవంతున్ని ఎవరైనా తాకారా, మాట్లాడారా, చూసారా "  లేదు కనుక దేవుడు లేడని నమ్మవచ్చా  అన్న మాష్టార్  మాటలకు" ఒక విద్యార్ధి లేచి దేవుడు లేడన్న వారు ఎందుకు తలిచారు,  ఇప్పుడు. ఉన్నారని మేము నిరూ పిస్తాము,  మాకు మీరు ఏమి ఇస్తారు మాష్టార్. నిరూపించండి చూద్దామ్, మీ అందరి ఫీజులు నేను కడతాను అన్నాడు మాష్టార్.

కుక్క క్లాసురూం లోకి వస్తున్నది,  వెంటనే తరమండి అన్నాడు మాష్టార్, "ఆకలేస్తే అన్నం పెట్టేవాడని ఏమంటారు మాష్టార్ అని అడిగాడు ఒక విద్యార్ధి" ,  దేవుడుతో  సమానము.అన్నాడు మాష్టార్,  ఆ కుక్క నోటిలో "నా అన్నం కారేజ్ ఉన్నది నా ఆకలి తీర్చటానికి ఆహారం తెచ్చింది" అది దేవుడితో సమానము కదా మాష్టార్. మాష్టార్ కు అవుననక తప్పలేదు.

         ఎవరు క్లాసులో టపాసులు కాలుస్తున్నారు, పిల్లలు టపాసులు కాల్చుట కాదు మాష్టార్,  కరంట్ వైర్ తగల బడుతున్నది, త్వరలో ఈ భవనపు కప్పు కూల బోతున్నది, దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు, దేవుడు లేడన్నవారు ఉండండి, ఉన్నాడు అన్నవారు బయటకు రండి, మాష్టార్ అందరూ వెళ్ళాక నెమ్మదిగా బయటకు వస్తూనే భవణం పెద్ద శబ్దంతో నేలకు ఒరిగింది. దేవుడున్నాడు కదా మాష్టార్ గారు అన్నారు పిల్లలు.

పిల్లలందరూ అక్కడ ఉన్న ప్రయోగశాల వద్దకు చేరారు, అందరూ వెంటనే నవ్వటం మొదలు పెట్టారు, విద్యారుల వద్దకు మాష్టారు వచ్చి ఎందుకు నవ్వుతారు, దేవుణ్ణి చూసి మేము నవ్వు తున్నాము, మాష్టర్ కూడా నవ్వుతున్నాడు, మాష్టార్ మీరు కూడా దేవుడ్ని చూసారు కదూ నవ్వు తున్నారు, ఆ చూసాను నవ్వు అపుకో లేక పోతున్నను. మీ అందరి ఫీజులు నేనే కడతాను దేవుడున్నాడు నమ్ముతున్నాను అన్నాడు గట్టిగా మాష్టార్ (వెంటనే ఒక విద్యార్ధి నైట్రోజన్ గ్యాసు బిగించి  వచ్చాడు అందరి నవ్వులు ఆగినాయి).

మాష్టర్ ఒకే సారి నశించే వస్తువులు ఏవో చెప్పగలరా అని అడిగాడు ఒక విద్యార్థి?, పిల్లలముందు మాష్టార్  నోరు ఎత్తలేక పోయారు. ఒక విద్యార్ధి తెలియ పరిచాడు "మనకు వెలుగు నిచ్చి ఆరిపోయే అగ్గి పుల్లను, మన ఆకలి తీర్చే పండ్లను సృష్టించినది దేవుడే కదండి", సమస్త లోకల్ని రక్షించేది దేవుడే గదండి. అవును పిల్లలారా దేవుడున్నాడు.
మనవుడా దేవుడున్నాడని నమ్ముతావా 
అప్పటి లెక్కల మాష్టర్ మీరే కదా తాత, అవునురా నీ తెలివి అమోఘం, మనుషుల్లో ఉన్న దేవుణ్ణి గమనించి బతకటమే జీవితం అది తెలుసుకో
నిజమే తాత నీవు చెప్పినవి అక్షరాలా పాటిస్తున్నాను కదా ? 
ఏమిటి ఇప్పుడు చెప్పినది విని మరలాచెప్పమనటమా ?    
అవును తాత నేను చిన్న పిల్లవాడిని కదా ? అంటూ లేచాడు 
--((**))--


తాత మనవుడి  చిన్న కధలు -12
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

"ఎందుకు నిజం చెప్పాలి, ఎందుకు అబద్ద మాడకూడదు " నాకు కొంచం వివరంగా చెపుతారా అని మనవుడు అడిగాడు తాతగారిని.    

ఒరే మనవుడా నీమాటలు చూస్తే పెద్దవిగా ఉన్నాయి, వయస్సు చిన్నదిగా ఉన్నది. కనీసం నిజం ఎదో, అబద్దమేదో తెలుసుకొనే వయసు కాదు నీది అన్నాడు తాతగారు.

నాది చిన్న వయస్సైనా, మీమాటలు నేను ఒక్కడినే విన్నా, అందరికి కధలు కధలుగా  చెపుతాను తాతయ్యా అన్నాడు మనవుడు. 

నీవు బలే మాట్లాడు తావురా అయినా నాకు తెలిసిన విషయాన్ని నీకు చెపుతా విను. 


బలిచక్రవర్తి వామన మూర్తిని ఆహ్వానించి ఏదైనా వరము కోరు కోమని అడుగగా అదేసమయమున రాక్షస మంత్రి శుక్రాచార్యులు వచ్చినది విష్ణుమూర్తి అని తెలుసుకొని, మీరు అబద్ధమాడుట తప్పు లేదు, మనం రాక్షసులం, నేను చెప్పేది వక్కసారి ఆలోచించండి అని "వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవితా మానభంగమందు బొంకవచ్చు " అని చెప్పాడు. అప్పుడు ఏ పరిస్తుతులలో కుడా అబద్ధమాడ కూడదు అని  బలిచక్త్రవర్తి తలచి, మూడడుగుల నేల వామన మూర్తి అడుగగా ఇస్తానన్నాడు.  ఇవ్వగా వామనమూర్తి విశ్వరూపం దాల్చి, ఒక అడుగు ఆకాశం, రెండవ అడుగు భూమి, మూడోవ  అడుగు తన శిరస్సు అని చూపగా, పాతాళ  లోకం నొక్కబడ్డాడు.


మనవుడా ఎన్ని కష్టాలొచ్చినా, ఏ పరిస్థితిలో కూడా అబద్ధ మాడ కూడదు.  తెలిసిందా అని అన్నాడు తాతగారు.                       

అట్లాగే తాత సత్యం గూర్చి కూడా తెలియపరుచు తాత.  

శకుంతల తన భర్త దుష్యన్తుడికి సత్యం గురించి హితభోద చేసింది.
అది ఏమిటి తాతగారు 
అంట తొందర వద్దు 
సరే చెప్పు తాత. 

మంచినీల్లున్న నూతులు కన్నా ఒక బావి, వంద బావులకన్నా ఒక యజ్ఞం, వంద యజ్ఞాలకన్నా ఒక సుతుడు, వంద సుతుల కన్నా ఒక సత్య వాక్యం మంచిది. దాంపత్య బంధంలో సత్య వాక్కు లున్నంత వరకు ఎటువంటి సమస్యలురావు, వచ్చిన ఆక్షణంలో తీరిపోతాయి. 

ఇప్పుడు కాలం మారుతున్నది, అనుమానాలు, అపార్ధాలు, అనర్ధాలు పెరిగి పోతున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి,  ఇటువంటి పరిస్థితిలో నిజం చెప్పినా నమ్మరు , అబద్ధం చెప్పినా నమ్మరు. 

ఇతరులకు పనికిరాని నిజాన్ని నిదానంగా చెప్పాలి, మనసు విప్పి మాట్లాడు కుంటే  ఏది నిజమో,  ఏది అబద్దమో తెలుసుకొనే శక్తి మానవులుగా ఉపయోగపడుతుంది. 
కళ్ళతో చూసేవి అన్నీ  నిజాలు కావు, చూడని అన్నీ అభద్దాలు కావు. 

తాత మీరు చెప్పే విషయాలు, కొన్ని అర్ధమైనట్లు, కొన్ని అర్ధం కానట్లు ఉన్నాయి తాతగారు. 
మొత్తం అర్ధం కానవసరం లేదు, విన్నది ఏమిటో చెప్పు చాలు అన్నాడు తాతగారు. 

తాతగారు నిజం నిదానంగా అర్ధమౌతుందని, అబద్దం వేగంగా ఆకర్షణతో అర్ధమవుతుందని తెలుస్తున్నది. 

చాలు అంతవరకు మిగాతా విషయాలు తర్వాత తెలుసుకుందానివిలే అంటూ లేచాడు తాత గారు.                       

--((**))--

తాతామానవుడి చిన్న కధలు -12 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

తాతా నాయకుడంటే ఎవరు తెలియపరుస్తావా అని అడిగాడు మనవుడు

ఒక మంచి పని చేయాలన్న, మంచి మనిషిని గుర్తించాలన్న నలుగురు కలిస్తే మంచిది, నలుగురిలో ఉన్న మేధావి చెప్పిన మాటలను అనుకరిస్తే జీవితము, జీవిత సాఫల్యానికి ఒక్క మాటతో సరిపోదు సిరి సంపదలు, వనరులు, ప్రకృతి సహకారములు, అధికారుల ఓదార్పులు, అధికారులవల్ల, చదివిన విద్యవల్ల పొందే ఉద్యోగాలు. 

ప్రతి పనిలో పోటీ ఉంటుంది. పోటీ పటిష్టం కావాలంటే మనం నమ్ముకున్న వాని వళ్ళ మనకు ప్రయోజనం ఉంటుందని వాణ్ని అందలం లెక్కించుటకు కృషి చేయాలి, ఇది కూడా నలుగురిలో ఒకరిని ఎన్నుకోవటం సహజం. అతడు ధనమున్న వాడైతే ఇంకా మంచిది, గుణం మంచిదైతే ఇంకా మంచిది, కరుణ రసం చూపిస్తే ఇంకా మంచిది. ఇటువంటి వాడు మనిషిని మనిషిగా గుర్తించి, అడిగిన మాటకు సహాయము చేసి సహకరించి, తెలపవలసిన విషయాన్ని తేటతెల్లముగా తెలిపి, రెండు నాలుకలా పాములా ఉండక, చెప్పింది చేస్తూ, చెయ్యాల్సినది ప్రభుత్వముద్వార చేయిస్తూ, పరులసొమ్ము నష్టము చేయకుండా, ప్రభుత్వ సొమ్ము బొక్కకుండా, ఉచిత ప్రజా సేవ చేస్తూ నిరంతరమూ ప్రజల హృదయాల్లో ఉండేవాడే నిజమైన నాయకుడు.   

తాత  అటువంటి నాయకుడు ఉన్నాడా, ఒకనాడు గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామ రావు గారు,  ఇంకా ఎందరో ఉన్నారు మనవడా .
తాత ఇప్పుడున్నవారెవరైనా ఉన్నారా లేకే ఉన్నారు నీకు విద్య నేర్పిన గురువు ఒక నాయకుడు, నిన్ను పోషించే తండ్రి మరో నాయకుడు, అందరికన్నా ముఖ్యమైన నాయకురాలు తల్లి.   వీరేకాక దేశాన్ని ఏలే ప్రధాణమంత్రి,   రాష్ట్రాన్ని ఏలే  ముఖ్యమంత్రి, మరి ఇంకా ఎందరో నాయకులున్నారు     
     
శ్లో === దాతృత్వం ప్రియ వక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞాతా | 
అభ్యాసేన నలభ్యన్తే చత్వారః సహజగుణాః || 

భావము === దానగుణం మంచిగా మాట్లాడటం దైర్యము ఉచితానుచితములు తెలిసియుండుట  ఈ నాలుగు గుణములు పుట్టుకతో రావలేనే గాని చూచి నేర్చుకోనేవి కావు అట్టి వారే నిజమైన నాయకులు .

           
--((**))--

Pranjali Prabha.com 
తాత మనవుడు చిన్న కధలు -10
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత "ధర్మం" అంటే ఏమిటి అని అడిగాడు మనవుడు, తాత ఏమి ఆలోచిస్తున్నావు, మన ఇంటికొచ్చే "బిజ్జగాడు ధర్మం చెయ్యండి" అని అరుస్తాడు  దానికి దీనికి భేదం ఏమిటి అని అడిగాడు. 
దానికర్ధం తెలుసుకోవాలంటే నీ వయసు, నా వయసు సరిపోదు, భగవాన్ భోధించిన భగవద్ గీత పూర్తిగా అర్ధం చేసుకున్నవారికి "ధర్మం" విలువ తెలుస్తుంది.  అయినా నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియపరుస్తా విని ఆచరిస్తే అదే మానవ లోకానికి ధర్మం. 
అట్లాగే తాతా తెలియపరచండి అన్నాడు మనవుడు. 
1 . "తనకు కీడు కలుగునప్పుడు దైవమును నిందించుట తప్పు", ఎందువల్ల జరిగింది, దానికి కారణము ఎవరు, నావల్ల ఎమన్నా జరిగిందా, నా కుటుంబము వారు ఎమన్నా చేసారా అని 5  నిముషాలు ఆలోచించగలిగితే మనస్సు స్థిరపడి ఏవిధంగా ప్రవర్తించాలి, ఏ ధర్మాన్ని అనుసరించాలి అనేది తెలుస్తుంది. అట్లాగే మంచి జరిగి నప్పుడు ఇది నా కష్టార్జితము, నా కుటుంబ శ్రమ ఫలితము అని భావించ కూడదు, ఇది దేవుని మహత్యమని భావించుట ధర్మం 
ముఖ్యంగా చెప్పిన పని చెప్పినట్లు చేయుట ధర్మం, ఎందుకు, ఏమిటి, దీని వళ్ళ ఎవరికి ఉపయోగం అని ప్రశ్నలు వేసి చేసినా అది ధర్మం కాదు. నేను చెప్పేది ఒక్కటే మంచి చెడ్డలు కావడి లోని కుండల వలె సమానమని ఎంచి దైవ నిందకు పాల్పడ కుండుట, ప్రేమించి ప్రేమ పొందుటే నిజమైన ధర్మం.       
లోకం లో డబ్బులేనివాడు దు:ఖిస్తాడు,వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు, వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు. వీళ్లందరి కంటే ధర్మం తప్పిన వాడు ఇంకా ఎక్కువ దుఃఖిస్తాడు. దుఃఖము లేకుండా ఉండాలంటే దేవుడు శాసించాడు, నేను చేస్తున్నాను అని భావించి నట్లైతే ధర్మం తప్పని మానవునిగా జీవించ గలుగుతాడు. 
లోకంలో కొందరు పరిస్థితుల ప్రభావము, సంపాదన వేరొక మార్గము లేక, కుటుంబ పోషణకు బిక్షాటన చేయుట అనాదిగా వస్తున్నది, చులకన చేయవద్దు, మీ సంపాదనలో కొంత దానం చేయుట తప్పు కాదు. ఇది కూడా ఒకవిధముగా ధర్మమే. 
మనవుడా ధర్మ విశేషాలు రేపు కూడా కొన్ని తెలుసుకుందాం 
ఇంతకీ నీకేమైనా అర్ధమయిందా, తాత నాకు అర్ధమైంది ఒక్కటే అదే ఎక్కువ విని, తక్కువ మాట్లాడి, ప్రేమించి ప్రేమ పొందటమే ధర్మం కదా తాతా 
అవునురా మనవుడా అదే ధర్మం.                   

--((**))--


తాత మనవుడి చిన్న కధలు -9 Pranjali pabha.com  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  
  
తాత త్రాగాడు ఏ వయసులో త్రాగితే మంచిదో చెపుతావా అన్నాడు మనవుడు. త్రాగుడు,సిగరెట్ కు బానిస కాకూడదు ఏ వయసులో కూడా .ఒక  కధ చెపుతా విను. ఒక కుటుంబంలో త్రాగుడు వళ్ళ ఏమైనదో వినుము అని చెప్పటం మొదలు పెట్టాడు.         

అమ్మ అరుంధతి గారు! మరోసారి ఆలోచించండి.
మీకు వృద్దాప్యము,అనారోగ్యము,ఆర్దిక సమస్యలు. మీ ఆయన చాలా మంచివారు. ఈ పరిస్తితులలో విడాకులు సమంజసం కాదని నా అభిప్రాయము. అన్నాడు లాయరు 

లాయర్ గారూ! నిజంగా మా ఆయన దేముడేనండీ! ఆయన లేనిదే నాకు  రోజు గడవదు.
నా అంతట నేనేమీ చేసుకోలేని నిస్సహాయురాల్ని. ఆయనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం, జాలి.  

మరింకేమిటమ్మా ?

ఆయన బాగా త్రాగి వచ్చి నా మనసును తీవ్రాతి తీవ్రంగా గాయ పరుస్తున్నాడు. ఎప్పుడు మేల్కుంటాడో తెలీదు. నా యుక్తవయసు నుండి నా విషయాలు చిలువలు పలువలుగా తెలుసుకుని, అనేక కట్టు కధలు వండి వార్చుకుని, అభూత కల్పనల కన్నా గోప్ప పాత్రలు
సృష్టించుకుని నాకు సంబందం లేని పాత్రలకు నాతో ముడి పెట్టి ప్రశ్నల పరంపరలతో నా మనసును కకలా వికలం చేస్తున్నారు. 

ఆ ఓక్క క్షణం నెమ్మదిగా మట్లాడితే?
అవును.
నెమ్మదిగా మాట్లాడితే ఇంత అవమానకర విషయాన్ని సహించేవంటే నువ్వు తప్పు చేసేవనీ, గట్టిగా మాట్లాడితే చింత చచ్చినా పులుపు చావలేదని నిలదీస్తారు!!!
ఇదండీ అందుకే నేను విడాకులు ఇప్పించండి లేదా త్రాగుడు నిషేధించండి అని కోరుతున్నది .  
చూడమ్మా : నీ అభ్యర్ధన విన్నాము ప్రభుత్వం వారికి త్రాగుడు నిషిధించమని సలహా ఇస్తాం, నీభర్తకు మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాము, మిమ్మల్ని హింసించినట్లు తెలిపితే, తక్షణం అరెష్టు చేసి కోర్టులో ప్రెవేశపెట్టాలి, అప్పడు తగిన శిక్ష విధించటం జరుగుతుంది అని జడ్జి తీర్పు ఇచ్చాడు.         
అక్కడే ఉన్న భర్త జేబులో తెచ్చుకున్న బాటిల్ త్రాగి జడ్జి గారు ఏ కేసులో లంచం తీసుకున్నారో అన్ని చెప్పటం మొదలు పెట్టాడు అంతే తక్షణం అరెష్టు చేసి జైల్లో పెట్టారు. 
ఇదే కలియుగ త్రాగుడు మహిమరా అని ముగించాడు తాత.         

--((**))--


తాత మనవడి చిన్న కధలు -8 Pranjali Prabha.com 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

తాతయ్య వంట మనిషి వచ్చింది ఎమన్నా అడగాలా అని అడిగాడు మనవడు, నేను అడిగేదే ముందిరా మీనాన్నకు, మీ అమ్మకు, నచ్చాలి ముందు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళు అన్నాడు. 
  
అంతలో అమ్మ, అమ్మొమ్మ ఎదురొస్తున్నారు, అమ్మ వంట మనిషి వచ్చింది. 
నీ వాళకం చూస్తే ఇక్కడ వంట చేసేటట్లు లేవు అన్నారు వారు, అసలు అట్ల పిండి ఎంత కలపాలి, ఎలావెయ్యాలి, ఏ అట్టు బాగా చేయగలవు, నీకు వచ్చో కాదో మేము తెలుసుకోవాలి వాటి పేర్లు చెప్పగలవా అని అడిగింది అమ్మ. 

ఏవమ్మో నేను 5 స్టార్ హోటల్ ల్లో పనిచేసాను, నేను అట్ల పేర్లు చెబుతాను, మీకు ఏది ఇష్టమో   మీరే చెప్పండి అంటూ చెప్పటం మొదలు పెట్టింది.            

మినపట్టు, పెసరట్టు, రవ్వట్టు , ఉల్లి పేపర్ అట్టు, మసాల అట్టు, అల్లం, మిర్చి, ఉల్లి అట్టు, కొబ్బరి అట్టు, గోధుమ అట్టు, అటుకుల అట్టు, సగ్గుబియ్యం అట్టు, బియ్యపు పిండి అట్లు, పుల్లట్టు ఉప్మా అట్టు, రాగి అట్టు, చీజ్ పాలక్ అట్టు. అంటూ చెప్పింది.

ఇంకా స్వీట్ ఏమీ చేయటం వచ్చో  చెపుతా వినండి అమ్మగారు అంటూ మొదలు పెట్టింది 

అరిసెలు, బూరెలు, కొబ్బరి బూరెలు, పచ్చి బూరెలు, తైదు బూరెలు, మైదాపిండితో పాల బూరెలు, సజ్జ బూరెలు, గోధుమ బూరెలు, చలిమిడి, కొబ్బరి పూర్ణాలు, గోధుమ పిండితో పూర్ణాలు, పూత రేకులు, జొన్న బూరెలు, బూంది లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, మినప ముద్దలు, సున్నుండలు, బాదుషా, మడత కాజా, తీపి కాజాలు, మైసుర్ పాకు, జాంగ్రి, పూస మిఠాయి, కోవా , కజ్జి కాయలు,తీపి గవ్వలు, జీడిపప్పు పాకం, శనగపప్పు పాకం, వేరుశనగపప్పు ముద్దలు, మరమరాల ముద్దలు, డ్రైఫ్రూట్స్ హల్వా, నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద), కోవా కజ్జికాయ, మిల్క్ మైసూర్‌ పాక్, కాజు క్యారెట్, బటర్ బర్ఫీ, కిస్‌మిస్ కలాకండ్, బూంది మిఠాయి, పాపిడి, చాంద్ బిస్కట్స్ , ఖర్జూరం స్వీట్, సేమ్యాతో అరిసెలు, కొబ్బరి ఖర్జూరం, బాదంపాకము, బాంబే హల్వా 
వీటిల్లో మీకు ఇష్టమైనది ఎదో చెప్పండి అన్నది  ఆయాసంతో .

ఆ మాటలకు అమ్మ పడి పోయింది,  అమ్మొమ్మ మాత్రం ఇంకా అడిగింది పొడులు చెయ్యటం వచ్చా అన్నది. అమ్మొమ్మ ఇక చాలు ఆమెకు అన్ని వచ్చు నీవేం అడగవద్దు అక్కడ తాతాయ్య పిలుస్తున్నాడు అనగానే అయ్యో రామా మంచి నీళ్లు అడిగి చాలాసేపైంది అంటూ కదిలింది.   నీవు వంటగది గది  చూపరా అంటూ తల్లి లేచి నెమ్మదిగా లోపలి వీళ్లింది.

మనిషిని నమ్మాలి, ఒక మెతుకు పట్టి అన్నం ఉడికిందో లేదో చెప్పగలగాలి, మోసపోతే అనుభవం వచ్చిందని సరుకు పోవాలి  తాతయ్య నవ్వు తూ పలికాడు.    


--((**))--


తాత మానవుడి చిన్న కధలు -7
రచయత: మల్లాప్రగడ రామ కృష్ణ : 

తాతగారు కధ చెప్పటం ప్రారంభించారు తామరపూవు వికసించింది అమృతాన్ని త్రాగటానికి తుమ్మెద చేరింది, ఆశ తగ్గక ఇంక త్రాగాలి అంటూ అక్కడే ఉండి పోయింది. కానీ సాయంత్రం అయిపోయి, తామరపూవు ముడుచుకొపోయే లోపల తప్పించుకోలేక పొరపాటున ఆ పూవులో ఇరుక్కొపోయింది. ఆ తుమ్మెద గత్యంతరం లేక రాత్రియంతా ఉండి త్వరగా ఉదయించవయ్యా సూర్య భగవానా అని ప్రార్ధించి కదలలేక ఉండి ఆలోచిస్తుండగా ఒక ఏనుగు వచ్చి తొండముతో చెట్టుమొత్తము పీకి నేలకు కొట్టింది తుమ్మెద చనిపోయింది. 

తాత మీరు చెప్పిన కధ చాలా బాగున్నది కాని ఇప్పటి వారికి అర్ధమయ్యేవిధముగా ఇదే కధ మరో విధముగా చెప్పండి అని అడిగాడు. తాత  కొద్దీ సేపు ఆలోచించి ఈవిధముగా చెప్పటం మొదలు పెట్టాడు. గుడ్డుని పొదిగి నప్పుడే పిల్ల బయటకు వస్తుంది, గుడ్డుని పగలు గొడితే రాదు అని   తెలుసుకోవాలి అట్లాగే మనశక్తికి  కావలసిన ఆహారము తినాలి మించి తిన్నా జీర్ణం చేసుకొనే శక్తి ఉండదు అత్యాశకు పోయిన తుమ్మెదగా మారుతుంది అన్నాడు తాతగారు. 
మనవడు మరొక్కసారి మారోవిధముగా చెప్పండి తాతగారు అన్నాడు మరలా చెప్పటం మొదలు పెట్టాడు.    
చూడు మనవడా చెప్పింది వినటం ఆచరిచటం ముందు నేర్చుకో ముందు నేను ఆడిన ప్రశ్నకు సమాధానము నీవే చెప్పు సూర్య ప్రతాపానికి కమలం తప్ప మరొకటి వికసించేది ఉంది అది ఏమిటో ముందు నీవు చెప్పు అని అడిగాడు. తాత నాకు తెలియుటలేదు మీరేచెప్పండి అన్నాడు మనవుడు. నీవు యువకుడవు ఆలోచించు సమాధానము రేపటి కధలో చెపుతా అంటూ లేచాడు                   
అంతే మనవుడు తలగోక్కోవటం మొదలు పెట్టాడు ..... గోక్కోకు జుట్టు ఊడి బట్టతల వస్తే 
పెళ్లవ్వటం కష్టం రా బాబు ఆ.....   ఆ.... అంటూ నవ్వు కున్నారు ఇద్దరు. మీకెవరకన్నా తెలిస్తే  చెప్పండి మా తాతగారు నా మెదడు తినేస్తారు ...   .. 
--((**))--

తాత మనవడి (చిన్న కధలు-  5
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతయ్య మనవడ్ని ప్రక్కన కూర్చోపెట్టుకొని చిన్న ఆద్యాత్మిక ఉపన్యాసం చెప్పటం మొదలి పెట్టాడు.    
సమస్త జీవరాసిలోనూ పరమాత్మను దర్శించగల శక్తి  మానవునకే ఉన్నది.   "ఒక చేతి వ్రేళ్ళు ఒకటిగా ఉండవు " అయినా విశ్వమంతా సౌందర్యమయంగా కనబడుతుంది ప్రతి ఒక్కరికి. దూరమునుండి కొండ చుస్తే నున్నగా కనబడుతుంది దగ్గరకు వెళ్ళితేగాని దాని విశ్వ రూపం తెలియదు.  ప్రతి మానవుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ధర్మిక శక్తి సాధించు కోగలిగితే ప్రపంచంలోని స్థితిగతులన్నీ మారుతాయి. " ఒకడికున్నదని ఏడిస్తే ఒక కన్ను పోతుంది - తనకు లేదని ఏడిస్తే రెండో కన్ను పోతుంది " గుడ్డి వాడిగా మారితే ఫలితము ఎమన్నా ఉన్నదా .  కలతలు కార్పణ్యాలు ప్రబలిన చోటే శాంతి స్థాపన చేయుట మన కర్తవ్యము అని భావించి ముందుకు సాగాలి.  ఘర్షణకు తావు లేకుండా, ద్వేషం దారి ఇవ్వకుండా,  అసూయ ఆవకాశమివ్వకుండా, పూర్తిగా మనో నిబ్బర శక్తితో ప్రతిఒక్కరిని శక్తి వంచన లేకుండా ఆదుకుంటూ జీవితం సాగించాలి.   "చెడు  వినకు, చెడు అనకు, చెడు కనకు."   "ఒకడిని చూస్తే పెట్టబుద్ధి - ఉంకొకడిని చూస్తే మెట్టబుద్ధి" అయినా  ఆదర్శమైన ప్రేమ సర్వత్ర వ్యాపించి ఉన్నది, అయినా  అసూయా ద్వేషాలకతీతంగా మానవులుగా ఆ పరమాత్ముని ప్రార్ధిస్తూ కర్తవ్యదీక్షతో కంకణ బద్దులుగా మారి మనుష్యుల్లో ఉన్న పరమాత్ముని గమనిస్తూ  ప్రవర్తించే వాడే నిజమైన మానవుడు.
తాత నేను నిజమైన మానవుడ్ని కానా అన్నాడు మానవుడు,. ఎందుకు కావు వయసుని బట్టి ప్రవర్తనే 
మన:శాంతి కలిగించే విధముగా ఉంటె చాలు ఈ కలియుగంలో. 
అలాగే తాతయ్య ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉంటా. సరేరా బాబు ఉంటా ... ఆ ఉంటా 
ఆ.. ఉంటా అని వెళ్లి పోతావే. 
తాతయ్య మీరే చెప్పారు ఒకనాడు అవునంటే కాదని, కాదంటే అవునని వస్తా ...  కాదు కాదు వీళ్ళొస్తా ... అంటూ బయలు దేరాడు మనవుడు         


--((**))--


తాత మనవుడి -చిన్న కధలు -4 
తాత నాకు ఏదైనా కధ చెప్పు అని అడిగాడు మనవడు సరే చెపుతా విను అని మొదలు పెట్టాడు " కొందరు చెపితే వినరు, గిల్లెతే ఏడుస్తారు" తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళని వాదిస్తారు, మోసపోయిన గర్వంతో ఒట్రిస్తారు అని చెప్పటం మొదలు పెట్టాడు తాత కధను .      
అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని. “మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ. 

“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు. 

“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ. 

వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు. 

తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా. వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా. 

"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా. 

బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు. 

మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది. 

“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా. “అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు. 
తర్వాత ఏమైంది తాత ఏముంది భార్యను ఏమి అనలేక ఊరిలోకి మోసగాడని పట్టి బందిఖానాలో  
పెట్టిచ్చాడు అంతే .....    అంతేనా .....  ఆ ..  ఆ   

--((**))--

తాత మనవుడి - చిన్న కధలు -3 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తాత నాకు ఒక కధ చెప్పు అని అడిగాడు మనవుడు. అప్పుడు తాత "తినే ప్రాప్తి ఉంటె వడ్డించేవాడు మనవాడవుతాడు అన్నాడు" అవును తాత దేవుడి మీద నమ్మకం ఉంటె ఎంతటి  రోగమైన క్షణంలో పోతుంది అన్నాడు మనవుడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా తాత అవునురా మనవుడా ఒక్కోసారి దేవుడే నీవుకష్ట పడకుండా నిదగ్గరే వచ్చి నీకు సేవ చేస్తాడు నీవు చేసిన పుణ్యాన్ని బట్టి అన్నాడు. ఏదన్న ఉదాహరణ చెప్పు తాత నందు మనవుడు. 

సరే సెహెపుతా విను అని చెప్పటం మొదలు పెట్టాడు తాత.              
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేక ఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం టేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది. 

ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు. "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు. 

భగవత్ ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు. అని చెప్పాడు తాత కధ ముగిస్తూ 

--((**))--


తాత మనవుడి చిన్న కధ -2
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతగారు ఏమిటి మీ కంట నీరు కారుతున్నది అని అడిగాడు మనవడు. ఏమిలేదురా బాబు " ఒక కంట  సున్నం మరో కంట వెన్న"  ఉందిరా అవి కరిగి నీకు అట్లా కనిపిస్తున్నది. సున్నంకు వెన్నకు  తేడా ఏమిటి తాతయ్య,  ఏమిలేదురా బాబు మీ అమ్మమ్మ వెన్న రా మీ నాన్న సున్నం రా అంతే తేడా, రెండు తెల్లగానే ఉంటాయి కదా తాతగారు ఉంటాయి "ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక ఉండు" రుచులు వేరుకదా అట్లాగే ఇవి కూడా వేరు.       

బాబు " ఒక కన్ను కన్నూ కాదు - ఒక కొడుకు కొడుకూ కాదు - ఒక చెట్టు తోపూ కాదు" తెలుసుకో "   ఒక చెట్టు కాయలు ఒకటిగా ఉండవు " నా కొడుకులు కూతుర్లు వాళ్ళ బుద్దులు వేరు అందుకే వారిని ఏమీ అడగను, వారి నుండి ఏమి ఆశించను, నాకు ఓపిక ఉన్నంతవరకు నాపని నేను చేసు కుంటాను, చేయలేని పని ఉంటె మీ అమ్మమ్మను సహాయము అడుగుతా. ఒకరికొకరు సహాయము చేసుకుంటేనే కుటుంబము. పెద్దల మాటలు పిల్లలువింటే ఆ ఇల్లు స్వర్గాన్ని మించి ఉంటుంది        
అది నిజమా తాతయ్య అని అడిగాడు మనవడు అది నువ్వే చెప్పాలి, నేను పెద్దయ్యాక చెపుతాలే తాతయ్య, బలే మాటలు నేర్చా వురా ...       ఆ  ...      ఆ ..  


--((**))--


తాత మనవుడి - (చిన్న కధలు) -1
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాతగారు రోజూ ఎదో చెపుతుంటారు, అర్ధం అయిందని తలకాయ ఊపితే కానీ ఆపరు. ఒకరోజు లేవటమే దంత ధావనం కోసం వెతకటం మొదలు పెట్టాడు, "ఒంటి కంటే జంట మేలన్నారు పెద్దలు" అంటే ఏమిటి తాత అని మనవడు అడిగాడు, అమ్మొమ్మ ప్రక్కన ఉంటె ఇన్ని  తిప్పలు ఉండవురా అన్నాడు, పిలవమంటారా అని అడిగాడు, వద్దులే నాకు జంట దొరికిందిగా అన్నాడు. అదేంటి తాత జంట అంటావు అమ్మొమ్మ రానిదే,  అదేరా నా కళ్ళజోడు కనిపించిందిగా, ఎంచక్కగా వేపపుల్ల వెతుక్కొని ముఖం కడుకుంటా అన్నాడు తాతయ్య. తాతయ్య ఈ వయసులో కూడా కష్ట పడాలా అని అడిగాడు " ఒకడి పాటు - పది మంది సాపాటు " రా బాబు . అర్ధం కాలేదు తాతయ్య అన్నాడు మనవుడు. "సంపాదించేవారు ఒక్కరైతే తినే వాళ్ళు పది మంది" .                

పెద్డయ్యాక నేను నీకు సహాయం చేస్తా అప్పుడు తొమ్మిది మందే అవుతారు కదా తాతా, నీ బుద్ధి నీ తండ్రికి ఉంటె నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు కదా. "ఔను - కాదు అనే మాటలెంత చిన్నవో వాటిని అనటం అంత కష్టం " ఇదేరా ప్రేమ - ఈ ప్రేమే మనందరినీ బ్రతికిస్తుంది. "ఔననటానికీ, కాదనటానికీ అత్తకు అధికారం గానీ కోడలికేం వుంటుంది? " ఒకరికి ఒకరు తోడైతేనే జీవితం ఎవ్వరు ఏమి  చేయలరు కాలం తోపాటు నడవటమే ఇది మనం చేసుకున్న అదృష్టం అని సర్డుకు పోవటమే అని చెప్పాడు తాత.    
సరే తాత నేను నీళ్లు తీసుకు వస్తా , తీసుకురా ఇక్కడే కడుకుంటా అన్నాడు తాతయ్య . 

రేపు ఇంకో చిన్న కదా తెలుసుకుందాం 

--((**))--

18, ఆగస్టు 2018, శనివారం



తాత మానవుడి చిన్న కధలు -10 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
తాత మాట గొప్పతనము ఏమిటి అని అడిగాడు మానవుడు 

మాత నుండి వచ్చింది మాట, మొదటి మాట అమ్మా అమ్మా అని ఏడవటం అది క్రమేపి ప్రేమ ప్రేమ అని తలచటం తదుపరి రామ కృష్ణ అని ప్రార్ధించడం అన్నాడు తాతగారు. 
అర్ధం కాలేదు వివరించండి అన్నాడు మనవుడు. 

చెట్టు సారం పండులో ఉన్నట్లు మనిషి శక్తి సారం మాటాలో ఉంటుంది. మాటలో దయ కలిగిస్తే
హాయి, కోపం చూపిస్తే తిట్టు, జ్ఞానంతో బోధిస్తే ప్రవచనం. పసిడి హారాలు, పన్నీటి జలాలు, సొగసులు, శరీర సౌష్టవాలు ఇవి ఏమి కావు ఆభరణాలు కావు, కేవలము మాట ఒక్కటే ఆభరణం అది గుర్తుంచుకో. జారి పడ్డా లేవచ్చు, మాట తప్పితే మనిషిగా గుర్తింపు కోల్పోతావు. నీవు నోటి ద్వారా ఏమి తిన్నావని అడగరు, నీ పెదాలనుండి ఏ మాట వచ్చిందా అని అడుగుతారు ఇదే కలియుగం. 
ఒక వ్యాపారస్తుడు ఒక ఊరిలోకి పోయి ఈ ఊరు మంచిదా అని అడిగాడు, వెంటనే అక్కడ ఉన్నవారు, నీ నోటి మాట మంచిదైతే ఇక్కడంతా మంచివారే తేడా వస్తే ఇక్కడుండే దుర్మార్గులు మరెక్కడా ఉండరు అన్నారు వారు. మనిషికి మాటే ధైర్యాన్ని నింపుతుంది భయాన్ని తొలగిస్తుంది. లంకలో హనుమంతుని భీకర నాదానికే భయబ్రాంతులయ్యారు రాక్షసులు " రాక్షసులలో యుద్దము చేయాలన్న కోరికకన్నా చచ్చి పోదుమన్న హెచ్చు భీతి కలిగింది" అట్లాగే రాముని కలసి నప్పుడు మాటచాతుర్యముతో సుగ్రీవుని వద్దకు తీసుకెళ్ళి మైత్రి కలిపాడు, లంకలో ఉన్న సీతకు 
ధైర్యం చెప్పి రామునికి తెలియ పరచి ఓదార్చాడు, రామునికి రావణ సోదరుడగు విభీషునునితో  స్నేహం కలుపుకుంటే ఉపయోగం అని తెలిపి, అతని సహాయము  దుర్మార్గుడైన రావణుని సంహారించుటకు ఒక ఆధారము అని తెలిపాడు. అందుకే అన్నారు పెద్దలు మాట తీరు మంచిగా ఉంటె నాయకులు ఏమి చేయకపోయినా నమ్మించగలిగిన శక్తి మాటకు మాత్రమే ఉన్నది ఇదే లోక రీతి.    చివరిగా ఒకటే చెప్పేది రెండు నాలుకల ధోరణితో మాట్లాడే వారుంటారు, పైన చెప్పెది ఒకటి చేసేది మరొకటి. మాటలతో కౌగలించు కుంటారు బలహీనతలను గమనించి ఉన్నదనటా దోచుకు పోతారు ఇదే మాటలో ఉన్న మహత్యం. 
ఇంతకీ మీది రాముని వాక్కా, హరిచంద్రుని వాక్కా అని అడిగాడు మనవుడు. 
నీవే ఆలో చించు నా వాక్కు ఎవరిదో అన్నాడు తాతయ్య. 

--((**))--        

చిన్న కధ -Panjali Prabha.com 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఓకే ఊరిలో సుబ్బారాయుడు ఒకడు ఉన్నాడు, అతడు గొప్పలు చెప్పఁటంలో ప్రసిద్ధి, ఒక రోజు పిల్లందరి మద్య కూర్చొని కధలు పిల్లలకు చెపుతున్నాడు. సముద్రం నీళ్లు ఎవరైన త్రాగుతారా? అని అడిగాడు.  త్రాగుతాయి అన్నారు పిల్లలు, ముందు మీరు ఇవి త్రాగండి అన్నారు పిల్లలు గ్లాసు నీళ్లు ఉంచి, ఓసి ఇవేగా త్రాగుతా చూడండి అంటూ నోట్లో పోసుకున్నాడు అంతే ఒక్కసారి బోళ్ళుమని కక్కాడు సుబ్బారాయుడు ఎవరు ఉప్పు కల్పిన నీరు పెట్టింది అన్నాడు కోపంగా. వెంటనే పిల్లలు మీరు తిమింగళంగా మారండి అప్పుడు సముద్రం నీరు త్రాగవచ్చు అంటూ నవ్వు కుంటూ వెళ్లారు పిల్లలు.  కారణం లేకుండా నవ్వుతున్నారు మీరు అన్నాడు. మీరు చెప్పే గొప్పలకు కారణం కూడా ఉండాలా అన్నారు పిల్లలు వెళుతూ. అప్పుడే సుబ్బారావు భార్య బయటకు వస్తూ, పిల్లల దగ్గర చులకనై పోతారు, పిట్టల దగ్గర చులకనై పోతారు ఎం బతుకండి అన్నది. అప్పుడే సంస్కృతం బుక్కు ఒకటి ఉంటె చదివాడు, దుర్మార్గులను, మూర్ఖులను ఎవ్వరు మార్చలేరు అని పెద్దగా చదివాడు. అబ్బా ఆపండి చదువు మీరు ఆకోవకు చెందిన వారైతే ఇపాటి కళ్ళ, ఆ  ఇపాటికల్లా మిమ్ము వదిలేసి వేరొకడితో లేచిపొయ్యేదాన్ని అన్నది భార్య. అయితే నన్ను మంచివాడిగా గుర్తించావుగా అన్నాడు.  ఆ మంచి వాడివే గోరంతది కొండత చేసి మాట్లాడుతావు అది అవసరమా ? విను ముందు తర్వాత మాట్లాడ వచ్చు అన్నది భార్య. 

   నీలాంటి వాడు ఒకడు నడిరోడ్డులో రెడ్ లైట్ పడ్డ ఆగక పో బొయ్యాడు, ఒకతను గట్టిగా ఆపి అట్లా పోకండి క్రమ శిక్షణ తప్పి ప్రవర్తించకండి అన్నాడు. పోలీసులకు నేను భయపడను, అసలు మృత్యువుకే భయపడను అన్నాడు. వారిద్దరికీ భయపడ నవసరము లేదు. మా పిల్లలు చూస్తే చెడిపోతారని మా భయం అంతే అంటూ ఈ శ్లోకం చెప్పాడు ఆ పెద్ద మనిషి తెలుసా అంటూ చదివిన్పించింది ఆ ఇల్లాలు.                                  

నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము 
శ్లో === బాలసఖత్వ మకారణ హాస్యం | స్త్రిషువివాద మసజ్జన సేవా |
గార్ధభయాన మసంస్కృత వాణీ | షట్సు నరో లఘుతా ముపయాతి||

భావము === చిన్న వారితో స్నేహము, కారణము లేని నవ్వు, స్త్రీమూలక వివాదము, దుర్మార్గుల సేవ, గాడిదనెక్కి తిరుగుట, సంస్కృత భాషను చదువకుమ్దుట అను నీ ఆరింటిచే పురుషుడు చులకనై పోవును.
--((**))--

17, ఆగస్టు 2018, శుక్రవారం

అధిక్షేప ప్రేమ లీల-3


ఆదిక్షేప ప్రేమ లీల  - ప్రాంజలి ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి శుభాకాంక్షలు 

సన్న నవ్వుల కోరిక కన్నా, కావలిసిందేమిటి జంటకి 
- నిత్య పువ్వుల వాసన కన్నా, పరిమళమేమిటి జంటకి

సత్య వాక్కుల బోధల కన్నా, మాటలు ఇంకేమిటి జంటకి   
- ఉన్న దానితో సంతృప్తి కన్నా, ఆశ ఎక్కువేమిటి జంటకి 

ఆశయముతో బ్రతుకు కన్నా, బాధ కష్టమేమిటి జంటకి   
- మనసు దాటని మాట కన్నా, ఓపిక తీర్పేమిటి జంటకి  

నీడలా ఉండుట తృప్తి కన్నా, పొందేటి సేవేమిటి జంటకి   
- ఇంటిలో ప్రేమ పంచుట కన్నా, వేడుకలు ఏమిటి జంటకి  

ఒక రొకరు నమ్ముటం కన్నా, బ్రతుకు మార్పేమిటి జంటకి 
- ఉన్నది దానం చేయుట కన్నా, పొందు పాశమేమిటి జంటకి  

చెలిమి ఊయల పాట కన్నా, గుణ స్వర మేమిటి జంటకి 
- చిలిపి కోర్కల మాట  కన్నా,  మనో రాగమేమిటి జంటకి 

తల్లి తండ్రుల ప్రేమలు కన్నా,  కావలసిన దేమిటి జంటకి    
- దైవ సన్నిధి పూజలు కన్నా, మనో  తృప్తి ఏమిటి జంటకి

పసిడి వెలుగు బాట కన్నా, వెన్నెల పొందేమిటి జంటకి
- మనసు వాంఛ తీర్చుటకన్నా, ధనం పని ఏమిటి జంటకి   

లోకవ్యవహారము, భయము ,సిగ్గు,
 దాక్షిణ్యము, ధర్మసీలత 
ఈ యైదును లేనివారితో స్నేహము కూడదు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--

అధిక్షేప పేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో  
- నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో 

తొలి ముద్దు పెదవియందు చూశా, మొదటి రాత్రిలో  
- నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో 

యుగ యుగాల ఆశను చూశా, జగతి లీళలో   
- కలికి వెన్నెల సఖిని  చూశా, ప్రకృతి వడిలో  

అలుక తీర్చే ఆకలిని చూశా, శ్రీమతి వడిలో 
- గుండె వీణియ తడిని చూశా, ఆత్రుత మదిలో 

కలి బలిమి గర్వమును చూశా, నాయక వేటలో 
- యేటి గట్టున సొగసును చూశా, యవ్వన ఆశలో 

మెరుపుతో మేఘం పన్నీరు చూశా, శ్రావణ మాసంలో    
- ఆశతో పుడమి ఆత్రుత చూశా, తెలుగు భాషలో 

విత్తు విచ్చి విజ్ఞాన తేజం చూశా, సామాన్య శాస్త్రంలో 
- పెంపకంలో అమ్మ ప్రేమను చూశా, జీవన గమ్యంలో  

మల్లె పూల సువాసనను చూశా, శృంగార లీలలో  
- దిగులు పడు యవ్వనాన్ని చూశా, మగువ మత్తులో 

జాబిల్లి ఆశా, భానుప్రతాపం చూశా
ప్రకృతి ఆశా, కాల మహిమ చూశా      
ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం చూశా 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))- 





ఆదిక్షేప ప్రేమ లీల-
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఎప్పుడో ఇంకెప్పుడో మనం ఏకమయ్యే దెప్పుడో 
ఎందుకో మరెందుకో మనం ఒక్కటయ్యే దెప్పుడో 

ఒప్పుకో ఊపందుకో మనం సరిఅయ్యే దెప్పుడో 
చెప్పుకో చెలిమికో మనం చేరువయ్యే దెప్పుడో

తప్పుకో తప్పించుకో మనం దగ్గిరయ్యే దెప్పుడో 
అందుకో అందమంతా మనం వరుసయ్యే దెప్పుడో 

ప్రేమతో ప్రేమించటం మనం సొంతమయ్యే దెప్పుడో
గుణంతో సేవించటం  మనం పెళ్లి ఆయ్యే దెప్పుడో

ప్రేమను బతికించుకో 
పెళ్లి బంధాన్ని పెంచుకో   
జీవితాన్ని సార్ధకం చేసుకో     
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

 --((**))--




అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
  
నవ్వి నవ్విస్తూ ఉంటె నవ్వుల పాలు కావు
- ఏడ్చి ఏడిపిస్తే మాత్రం చులకనై పోతావు

నవ్వు ముదిరితే  పిచ్చి వాడవై పోతావు
- తీరా ఏడిస్తే పిరికి వాడవై పోతావు

మర్యాదగా ఉంటె నాయకుడవై పోతావు 
- అమర్యాదగా ఉంటె మూర్ఖుడవై పోతావు 

స్వార్ధం పెరిగితే ఆశ పరుడవుతావు
- నిస్వార్ధమే బ్రతుకుదారి వాడ వైతావు 

జ్ఞానం బోధిస్తే గర్విష్టిగా మారిపోతావు          
- జ్ఞానాన్ని దాచుకుంటే పిసినారివైతావు

నిర్లక్ష్యంతో కళ్ళున్నా గుడ్డివాడవౌతావు  
- మాటలు మీరితే వగురు బోతవుతావు 

చెడు వాదిస్తే మొండి వాని వనిపిస్తావు
- మౌనం పాటిస్తే అమాయకుడవవుతావు  

 ప్రేమను పంచితే ప్రేమికుడవవుతావు 
- దేవుణ్ణి ప్రార్ధిస్తే శాంతిని పొందగలవు 

మనసుంటే మార్గాలు అనేకం 
ధనమంటే బంధాలు అనేకం
వయసుంటే కోరికలు అనేకం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--