17, ఆగస్టు 2018, శుక్రవారం

హాస్య ప్రభ

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఇద్దరు వ్యక్తులు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్నారు 
ఒకడు : ఖాళి పరుసు ఉన్నప్పుడు నీవెం చేస్తావు  
రెండవవాడు : కోరికలు లేని బాటసారికి పర్సుతో పనిలేదు
ఒకడు : గడియారం తిరుగుతూ నిన్ను చూసి నవ్వితే 
రెండవవాడు : హృదయస్పందన ఉన్నవాడికి గడియారంద్తో పనిలేదు 
ఒకడు : నీకు బంగారం దొరికితే ఎం చేస్తావు  
రెండవవాడు : నుదిటి రాత ఎలా ఉంటె అల ప్రేవర్తిస్తా 
 నీతో నేను మాట్లాడలేను వస్తా 
వస్తా అనకు వెల్లోస్తా అను 
ఆ ...   ఆ ...  

--((**))--

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

"చిరు " రోడ్డు మీద వెళుతుంటే ....ఒక రాయి కనిపించింది!! 
దాని మీద ఏదో రాసి వుంది!! 
ఏమిటా అని "చిరు " వొంగొని చూసాడు!! 
" ఈ రాయి ని వెనక్కి తిప్పి చూడు ... 
జీవితం లో నువ్వు ఏమవుతావు నీకు తెలుస్తుంది" అని రాసి వుంది!! 
మన "చిరు " గారు వెంటనె కస్టపడి రాయి ని తిరగేసారు!! 
"హిహిహిహ్...పెళ్లి అయ్యాకా, 
నువ్వు కూడా ఇలాగే వెర్రి మాటలు నమ్ముతావ్.... 
జాగర్త బ్రదరూ!!" అని రాసి వుంది!!
ఇంకా ముందుకు పోయాడు
ఒక స్త్రీ  ఎదురుపడి రేపురా అని కాగితంపై వ్రాసి ఇచ్చింది  
 గుర్తుంచుకో రేపు అని అన్నది
రేపా ....  రేపు  .... ఆ .... ఆ .....    
 --((**))--

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

నాకు "రోజా" అంటె చాలా ఇష్టం!! 
"రోజా" ని నా జీవితం లో మర్చి పోలేను!!! 
"రోజా" ని నేను అభిమానిస్తాను... 
ప్రేమిస్తాను.. 
గౌరవిస్తాను .... 
సంవత్సరం లో ...పగలు...రాత్రి తలచుకుంటూనె వుంటాను!! 
నన్ను ఎవరు వద్దు అన్నా , నేను "రోజా" ని తలవందే ఉండలేను!! 
చాలా మంది , నా శ్రీమతి తో చెప్పారు..."మీ ఆయనకీ ఇదేం పిచ్చి అని" 
మా ఆవిడ నవ్వి వూరు కుంది !! 
గతజన్మలో నేనే రోజా 
ఈ జన్మలో మరవలేక అట్లా వాగుతున్నాడు  
"రోజా...రోజా...రోజా...  అని 
అంటే మీ పేర రోజా కదా 
అని ఎవరన్నారు ..... 

ఆ ....   ఆ...   
--((**))--

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

"ముసలయ్య, ముసలమ్మా .... 
ఇంట్లొ కాచిన నెయ్యి తో మిఠాయిలూ , 
చెట్టు కి పండిన మామిడి పళ్లు, 
ఇంట్లొ కలిపిన పులిహోర , దద్దోజనం తీసుకుని .. 
పట్నం లో ఇంగ్లీష్ మీడిఅమ్ లో చదూ తున్న మనవడిని చూడటానికి వెళ్లారు!! 
"ఎవర్రా వీళ్లు" అని అడిగారు ఫ్రెండ్స్!! 
"దే ఆర్ మై సర్వెంట్స్ ఫ్రం మై విల్లెజ్!!" ఇంగ్లీష్ లో అన్నాడు మనవడు !! 
"ముసలయ్య " కంట్లో నీళ్లు సుడులు తిరిగాయి!! 
"ముసలమ్మా" అడిగింది.... 
ఏందయ్యా .....ఎన్దుకూ కంట తడిపెడుతున్నావ్??...ఏమైనా అన్నాడా మనవడు??" అని. 
"ఎం లేదే ముసలి !!.....మనవడు అంత చక్కగా ఇంగిలీసు మాట్లాడుతుంటే ....సంతోషం ఆపుకొలెకపొనానె!!" అన్నాడు "ముసలయ్య"

--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

మొన్న ఒక ఆవిడని చూసాను.... 
లాప్టాప్ బ్యాగు, లంచ్ బాక్సు, కొన్ని నవల్సూ..ఒక ఫ్లాస్కు ...ఒక కాఫీ మగ్... 
తీసుకుని వెళుతున్నారు !! 
ఇల్లు మారుతున్నారా??? అని అడిగాను!! 
''హరి పిచ్చి మోఖమా!!" అన్నట్లు నా కేసి చూసి.... 
లేదంకుల్!!.....ఆఫీసు కి వెళుతున్నాను!!" అంది!!
--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

"నాన్నా హైదరాబాద్ వెళతా ....సిసమా డైరక్టర్ ని అవుతా!!" అన్నాడు "కొడుకు  " 
"అద్దం లో నీ ఫేస్ ఎప్పుడన్నా చూసుకున్నావా ??" అన్నాడు " తండ్రి " 
ముందు  యూ ట్యూబు సినిమాలో తీయటం నేర్చుకో అన్నాడు తండ్రి !! 
"ఊ(!...సరే...సరే....విమానం లో పోతావా....రైల్లో పోతావా?" అడిగాడు " తండ్రి "
అయితే ముందు ఒక కెమెరా కోనండి, ఆ తరువాత ఎక్కడకు పోయి సినిమాలు తీసు చూపిస్తా  అన్నాడు కొడుకు  
అయితే కెమెరా కొనేదాకా ఇక్కడే ఉంది చక్కగా చదువుకో తరువాత ఆలోచిద్దాం ఏడు టీన్ద్రి 
అంతేనా ...... అంతే .....

--((**))--


నేటి  హాస్యం  
రచయత  మల్లాప్రగడ   రామకృష్ణ   

"ఆదివారం నాడు మీరు 5  గురికి మందు పోయిస్తే .. 
.మీరు ఒక వారం రోజుల్లో లక్షాధికారి అవుతారు...ఇది ముమ్మాటికీ నిజం!!" 
ఈ మెస్సేజ్ "శ్రీ రామ వైన్స్" నుండి వచ్చింది!! 
అవును ఇది ముమ్మాటికీ నిజమని నిరూపణ అయ్యింది!! 
""అత్యాశా రావ్" ... 5  గురికి  5  ఆదివారాలు బీరు పోయించాడు!! 
సరిగ్గా 5  రోజుల్లో లక్షాధికారి అయిపోయాడు!!..... 
కోటీశ్వరుడు కాస్తా ...   ....  

--((**))--

నేటి  హాస్యం  
రచయత  మల్లాప్రగడ   రామకృష్ణ   

"తను కూర్చున్న కొమ్మని, తానె నరుక్కోవడం" అంటె ఏంటో చెప్పండి !" అడిగింది టీచర్. 
"ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం!!" అన్నాడు "రమా నాథ్" 
-((**))--


నేటి హాస్యం :ప్రాంజలి ప్రభ.కం 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ  

"ఈ అద్దo ఎంత??" అడిగింది " ఇల్లాలు " 
"1000 రూపాయ్లు!!" అన్నాడు షాపువాడు! 
"అంతే దీనిలో ఏముంది స్పెషల్ ??" అడిగింది " ఇల్లాలు" 
"మీరు దీన్ని 100 అంతస్తుల మెడ మీంచి పడేసినా.... 
99 వ అంతస్తు వరకు విరగదు, మరి" అన్నాడు షాపు వాడు!! 
"వావ్!!...ఐతే ప్యాక్ చెయ్యండి!!" అంది " ఇల్లాలు"
ఇంటికొచ్చాక భర్తకు ఇదే చెప్పింది 
భర్త ఒకటే నవ్వు ....  ఎందుకో మరి అంటూ ఇల్లాలు తలగోక్కున్నది 
ఆ....  ఆ..  

--((**))--


నేటి హాస్యం :ప్రాంజలి ప్రభ.కం 
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ  

ఒక షాపుకు బామ్మ గారిని తీసికెళ్ళాడు మానవుడు 
బాబు అప్పడాలా కర్ర ఉందా అని అడిగింది 
"ఎంటి బాబూ!!...ఈ అప్పడాల కర్రలు ఇంత సన్నం గా ఉంది. 
ముందు ఒక బుడిపె ఉండి మధ్య ఇంత లావుగా ఉండేది. 
"ఇప్పుడు ఇవి, అప్పడాలు వత్త డానికి "మాత్రమె" వుపయోగిస్తున్నారండి , మరి!!'' అన్నాడు షాప్ వాడు
 ఇది మరీ రోలు పిడి లాగుందిరా మనవడా 
బామ్మ కాలం మారింది అసలు అప్పడాల కర్రే ఎవ్వరు ఉపయోగించుట లేదు
మారీ ఎం ఉపయోగిస్తున్నారు రా 
అప్పడాలనేవి తెలియని మనుష్యులుగా తయారవుతున్నారు. 
 పాపడ్స్ అంటున్నారు 
నేను మాత్రం మారను, అపపడాలా కర్ర లావుది వెతికి పెట్టు అట్లాగే బామ్మా కో షాపుకు పోదాం పా 
ఆ ..... అంటే .... ఆ..   
    --((**))--


నేటి హాస్యం ప్రాంజలి ప్రభ.కం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

"ఈ రోజు నాకు అస్సలు వొంట్లో బాగోలేదు!" అంది "భార్య " 
"అయ్యో!! ...అవునా....నేను ఈ రోజు నిన్ను బయటకి తీసుకుని వెళ్లి డిన్నర్ చేద్దామనుకున్నానే!!" అన్నాడు "భర్త " 
"హిహిహి.....ఏదో సరదాకి జోక్ చేసాను...నాకు బాగానే వుంది " అంది "భార్య " 
"హహహ...నెనూ జస్ట్ జోక్ చేశా.....లేచి వంట వండు, మరి!!" అన్నాడు " భర్త "
మీ మాటలు ఎప్పుడు నమ్మను కాబట్టి ఇప్పుడు నమ్మటానికి 
నీ వేషాలు ఎప్పుడు నిజమైనావి కాబట్టి, ఇప్పుడు సంతోష పడటానికి 
ఆ...     ఆ.. 
--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అది నిన్నటి మాట!! 
ఎవరూ లేని వాడికి దేముడే దిక్కు.... 
ఇప్పటి మాట... 
ఎవరూ లేని వారికి ... 
గూగుల్ దిక్కు.!!
--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

స్కూల్ పిల్లలను టీచర్ అడుగు తున్నది 
"రేపటి పౌరులు...." 
టీచర్: మైక్రోసాఫ్ట్ లో ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి.. 
రాము:ఎమెస్ వర్డ్ 
సీత: ఎమెస్ ఎక్సెల్ 
రాణి: ఎమెస్ పవర్ పాఇంట్..... 
రంగా :...ఎమెస్ ధోని!!
టీచర్ : ధోని అన్నావేమిటిరా 
ఏమో నాకు తెలియదు టి.విలో విన్నా అన్నా 
ఆ.... 
--((**))--



నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

తాత మనవుడు మాటలాడు కుంటున్నారు
నాకు ...ఒక పుస్తకం రాయాలంటే.... 
కనీస పక్షం ఒక ఏడాది పడుతుంది!!" అన్నారు 'తాత " గారు!!
కళ్ళజోడు లేకుండా ఎన్ని రోజుల్లో వ్రాయగలవు తాతయ్య 
ఉంటేనే సరిగా కనబడదు, ఇక లేక పొతే ఎల్తగురా 
"ఎందుకు అంత బాధ , ...తాతయ్యా!! 
బజారు లో రాసిన పుస్తకాలు భొల్డు అమ్ముతున్నారు గా" అన్నాడు "మానవుడు "
--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అది నిన్నటి మాట!! 
ఎవరూ లేని వాడికి దేముడే దిక్కు.... 
ఇప్పటి మాట... 
ఎవరూ లేని వారికి ... 
గూగుల్ దిక్కు.!!

--((**))--

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

స్కూల్ పిల్లలను టీచర్ అడుగు తున్నది 
"ఎరా!?? " చిట్టు " .... 
ఆన్సర్ షీట్లో సమాధానాలు ఏమీ రాయకుండా , వొట్టి తెల్ల కాగితం ఇచ్చావెమ్!??" అడిగింది టీచరు! 
"మీరే కదా టీచర్, మొన్న .... 
పేజీలు పేజీలు వ్రాస్తే పెద్దోడివి అయిపోయావా!!???" అని కొప్పడ్డారుగా, మరి
."నాకే సమాధానం చేబుతునావురా... 
అందుకే టీచర్ తెల్ల కాగితం ఇచ్ఛా అన్నాడు వినయంగా 
నన్నరవకండి ఏదన్న వ్రాసి మార్కులు మీరే వేయండి అన్నాడు 
ఆ.... ఆ... 

--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఒకే .. 
ఓకె.. 
ఆ(....ఆ( 
అలాగే... 
బై... 
ఆ(?.. 
ఓకే.. 
..ఓకే.. 
స.........రే... 
అరె!!...సరే అన్నాను గా... 
ఆ( ఆ( 
బై.. 
పెట్టేస్తున్నాను... 
ఇంక ఆపుతావా ?? 
బై ..బై..బై

మల్లి సెల్ మ్రోగింది 
ఈ సెల్లు కనుగొన్న వారు ఎవరోకాని 
ఎంతటి చెవులు, చూసి కళ్ళు దెబ్బతింటున్నాయి 
ఆ.... ఆ..... 
--((**))--



నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ప్రపంచం లో 2 పనులు చాలా కష్టమైనవి!! 
1.మన మాటల తో వేరొకరిని మన దారిలోకి తీసుకుని రావడం 
2.ఇంకొకరి డబ్బులు , మన జేబు లోకి తెచ్చుకోవడం!!

మొదటి పని లో విజయం సాధిస్తే....వాళ్లని "టీచర్" అంటారు!! 
రెండవ పని లో విజయం సాధించిన వాళ్ళని "వ్యాపారస్తుడు" అంటారు!!!

పై రెండింటిలో విజయం సాధించిన వాళ్లని. ఏమంటారో మిరే చెప్పండి ...

ఆ..... ఆ ................
--((**))--



నేటి హాస్యం

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఈ రోజుల్లో తల్లిదండ్రుల టెన్షన్ ఒకటే !!

అబ్బయి ఎం డౌన్ లోడ్ చేస్తాడో !!!!

అమ్మాయి ఎం అప్ లోడ్ చేస్తుందో!!!

పిల్లలు ఎం కంప్యూటర్ మాయలో చిక్కారో

వద్దురా బాబు టెన్షన్ బై టెన్షన్

పగ వాడికి కూడా వద్దు ఈ టెన్షన్!!!



--((**))--

10, ఆగస్టు 2018, శుక్రవారం

SMALL STORIES - (PRANJALI PRABHA.COM)

నేటి చిన్న కత -Pranjali Prabha.com -9
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఓకే ఊరిలో ఓకే బ్రాహ్మణుడు ఉండే వాడు, నిత్యమూ వేదపారాయణం చేసేవాడు, ప్రజలందరికి ధర్మ సూక్ష్మములు తెలియ పరిచేవాడు. ఒక శిష్యుని వెంట పెట్టుకొని వారానికి ౨ రోజులు ప్రక్క గ్రామాలకు తిరిగేవాడు. ఏ గ్రామానికి పోయిన సన్మానాలు ఒప్పుకోడు, ఎటువంటి దానాలు తీసుకోడు. ఒకనాడు ప్రయాణంలో శిష్యునికి ఆహారం సర్దలేకపోయాడు, ఇంతచదువుకున్న ఒకని తిండి పెట్ట లేక పోయానని చాలా బాధ పడ్డాడు. 
ఆ గ్రామంలో ఒకని ఇంట శుభకార్యము జరుగుతున్నది. అక్కడి వెళ్లితే, శిష్యుని భోజనం దొరుకు తుందని ఆశించాడు. గురువుగారిని ఆహ్వానించారు, నా శిష్యుని ఆకలి తీర్చండి దాని నిమిత్తం నాలుగు వాక్యాలు హితబోధ చేసి నేను వెళతాను అన్నారు గురువు గారు. మీరు కూడా మమ్ము ఆశీర్వదించండి. ఆ పరమాత్ముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి.

శ్లో === హత మశ్రోత్రియే దానం హతం సైన్య మనాయకమ్ | 
హతా రూపవతీ వన్ధ్యా| హతో యజ్నస్త్వ దక్షిణః ||

భావము === వేదము తెలియని వానికిచ్చిన దానము, నాయకుడు లేని సైన్యము, గోద్రాలైన రూపవతి, దక్షణ లేని యజ్ఞము ఇవి ఎందుకును కొరగావు

మీరు చెప్పినట్లుగా దానము పుచ్చుకోండి అన్నారు ఆశుభకార్యం చేసెవారు. నా కచ్చే దానం వేదం పాఠశాల నిర్వాహణకు ఇవ్వండి. పోనీ యజ్ఞము నిర్వహించి దక్షణ పుచ్చుకోండి అన్నారు ఆ పెద్దలు ఆ పరమాత్ముని భారం వేసి యజ్ఞమును నిర్వహించి, నా ఉదర పోషణకు కావలసినది స్వకరించి మిగతావి దానము ఇచ్చుటకు అనుమతి కోరుచున్నాను అన్నాడు. 
మోయి మాటే మాకు వేదవాక్కు అన్నారు. యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించగా వర్షం కుండపోతగా కురవగా ప్రతి ఒక్కరు సంతసించారు. 

--((**))--


ప్రాంజలి ప్రభ - చిన్న కధ (8) 

ఎదరొ మహానుభావుల అందరికి వందనములు . ఈనాడు 7 2 వ స్వా తంత్ర దినోస్చవము మనం జరుపు కుంటున్నాము. మనం గత చరిత్రను క్లుప్తముగా తెలుసు కుందాము.   భారత ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామము 1857   సిపాయిల తిరుగుబాటు ప్రారంభ మైనది. తరువాత వందేమాతర ఉద్యమాన్ని బాల గంగాధర్ తిలక్ న్యాయకత్వముతో ప్రజలందరినీ ఒకేమార్గంలో నడిపించారు. 1 9 0 6 లో దాదాబాయి నౌ రోజ్ ఆధ్వర్యంలో కాంగ్రస్ మహాసభలు జరిపి ఉద్యమాన్ని దారిలో తేవటానికి ప్రయత్నించారు. 1 9 2 0 మహమద్ ఆలి నాయకత్వములో మహాత్మ గాంధి సహకారముతో బ్రహ్మాండ మైన ఉద్యమాన్ని నడిపించారు. 
1 9 2 9  జవహర్లాల్ నెహ్రు నాయకత్వంతో మరి కొందరి నాయకులతో కలసి భారత దేశ ప్రజలందరినీ ఉద్యమ కారులుగా తాయారు చేసారు. అల్లూరి సితారారాజు బ్రిటిష వారికి ఎదురు తిరిగాడు.  గాంధీ గారు దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహం, విదేశ వస్తువుల్ని బహిష్కరించుట, రాట్నం వడుకుతూ, కొల్లాయి గుడ్డ ధరించి ఉద్యమ దారుడిగా మారాడు, వీరితో సుబాష్ చంద్రబోష్, బిబిన్ చంద్రపాల్, గోపాల కృష్ణా గోఖులే, లాలా లజపతిరాయ్, రాజ గోపాల చారి. ఇంకా ఎందఱో మరెందారో త్యగాఫలితముగా ఏర్పడింది ఈ దేశం. పిల్లలు రేపటి పౌరులుమీరే, ప్రపంచ దేశాలలో ప్రధాన దేశం  గా అభివృద్ధి పదంలో, విద్యా, విజ్ఞాన, పారిశ్రామిక దేశంగా మారటానికి విస్వ ప్రయత్నం జరుగుతుది. అగ్రరాజ్యాలతో పోటితో ముందుకు పోతున్నది.
ప్రతిఒక్కరిని కలుపుకొని సాగుదాం 
తల్లి తండ్రుల మాటలను విందాం 
గురువు పెద్దల బోధలు ఆచరిద్దాం 
దేశానికి మనవంతు సహకరిద్దాం 
  జైహిందు - జైహిందు - జైహిందు                                  



ధీర ధీర విశాల సంపద దిగ్దిగంతము లందు నన్ 
సారమై పరివారమై యొప్పును సారవంతులు మెచ్చగన్ 
ఊరికూరికి యున్నతస్థితి వుజ్వలంబై యొప్పెడిన్
భారతీసతి భాగ్య సంపద భవ్య మిట్లని తోచెడిన్ 

అర్తఃము;-- ధీ శక్తి లోనూ సంపదలోనూ ప్రపంచ మంతా మెచ్చు కొను నట్టుగా వుంటుంది,ప్రతి వూరు ప్రగతి సాధించి ఉజ్వలంగా వెలిగి పోతుంది.ఇలాగ భారత దేశభవిష్యత్తు ఉంటుందని,వుండాలని నేను ఆశిస్తున్నాను .మనము కూడా అలానే ఆశిద్దాము.

సారవివేక వర్తనల సన్నుతి కెక్కిన వారిలోపల౦ 
జేరినయంత మూఢులకు జేపడ దానడ యెట్టులన్న గా 
సారములోన హంసముల సంగతి నుండెడి కొంగ పిట్ట కే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా!

భావము:--నిజమగు యుక్తాయుక్త విచక్షణ గల నడతలచే, పొగడబడిన వారిలో కలిసిన మాత్రము చేత మూర్ఖులకు ఆ ప్రవర్తన అలవడదు. యెట్లన్న మడుగులోనున్న హంసలతో కలిసియున్నంత మాత్రమున కొంగలకు వాటి ప్రవర్తన అలవడదు కదా! 
ఆలాగున.హంసలతో కలిసి యున్నంత మాత్రమున కొంగలకు వాటి నడతలు రావు. అట్లే యోగ్యులైన వారితో కలిసివున్నంత మాత్రమున మూర్ఖులకా పేరు ప్రతిష్టలు రావు.

--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ -6 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు, తనకు తెలిసిన విద్యను సహాయము చేస్తాడుకాని ఎటువంటి  
సహాయము కోరాడు, తీసుకోడు. ఏమన్నా ఆ పరమాత్ముడే నాకు సహాయము చేస్తాడని నమ్మకంతో 
జీవితం గడుపుతున్నాడు.  
ఒక దేవాలయములో మాట్లాడుతూ, నేను ఒకటే చెపుతున్నాను, భార్య భర్తలుగా మారినవారు ఒనరిగా నిద్రపోరాదు, విడివిడిగా నిద్రపోరాదు అట్లు చేసిన అనుమానం బీజం పోసిన వారవుతారు, బ్రహ్మచారులు మరెవరైనా బహిష్టు స్త్రీలతో మాట్లాడరాదు, అట్లు మాట్లాడినా మానసిక క్షోభకు గురి అవుతారు అన్నాడు, పెళ్ళికి శుభకార్యాలకు పిలిచినప్పుడు పోవాలి, యజ్ఞమునకు, చావుకు పిలవకుండా పోవాలి అని చెప్పాడు. 
అంతా విన్న భక్తులు మీమాటలు ఇప్పటి వారికి కొత్తవి కాదు ఆయన ఇంకా కొత్త విషయాలు చెప్పండి అన్నారు. అయినా ఈ శ్లోకం వినండి అంటూ బోధించాడు పండితుడు.    
     
శ్లో === నైకః స్వప్స్యా చ్చున్యగేహే శయానం నా ప్రభోధయేట్ | 
నోదక్య యా భిభా శేత యజ్ఞం గాచ్చేన్న చాహృతః || 

భావము === ఒంటరిగా యింటిలో ఒక్కడు నిద్రించ రాదు. నిద్రించు వానిని లేపరాదు. బహిష్టు స్త్రీలతో మాట్లాడరాదు. యజ్ఞమునకు పిలువక బోయినను వెళ్ళవలెను.

అక్కడ ఉన్న ఒక వ్యక్తి మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి ఇప్పుడు అందరు ఆంగ్ల  మాధ్యమంలో చదువుతున్నారు, వారు మన తెలుగును చులకన చేస్తున్నారు, మీరు ఏమనుకోకండి అన్నాడు. నేను ఏమి అనుకోలేదు మనభాష బతకాలనే చెపుతున్నాను, ఒక్క డన్నా  బాగు పడతాడన్నదే  నా ఆశ 
ఈ పండ్లు తీసుకోండి - ఇక్కడ ఉన్న భక్తులు ఎప్పుడో నా ఆకలి తీర్చినారు - ఇక నాప్రయాణము సాగించాలి - వస్తాబాబు 
--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ -5) 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
  
ఒక స్వామి నిరాశతో నది ఒడ్డుకు వెళ్లి, నీటి యందు తన ప్రతి బింబమును చూస్తూ ఉన్నాడు అప్పడే ఒక వృద్ధుడు వచ్చి స్వామి ఏమయినది నీటిలో ప్రతిబింబమును చూచుట తప్పు కాదా అని తెల్పాడు, తప్పు అని తెలుసు ఆత్మహత్య చేసుకోవాలని నా మొఖం చూసుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అంత బాధ పడుతున్నావు, కష్టమే మొచ్చింది అని అడిగాడు.

ఎంచెప్పాలి తాతగారు టి.వి., ఫేస్ బుక్కులు, ట్విట్టర్లు, వాట్సప్ లు వచ్చాక ప్రతి ఒక్కరు జ్ఞానబోధ చేస్తున్నారు, మా అవసరం లేకుండా పోయింది. ఇంతకూ మీరెవరు అన్నాడు స్వామి. 

నాపేరు ఆత్మ బంధువు, "స్వామీజీలు ఎమన్నా తక్కువ తిన్నారా, ఆత్మారాముని మరచి మధ్యన పుట్టుకొచ్చిన బాబాల వెంట బడుతున్నారు, డబ్బుకోసం జ్ఞాన్నాన్ని అమ్ము కుంటున్నారు", ఒక దేవుణ్ణే పూజించకుండా అనేక దేవుళ్ళని పూజిస్తున్నారు, దేనిలో ఎవరు ఏది చెపితే దానిని  నమ్ము తున్నారు, నీలో జ్ఞానం ఉన్న బోధ చేసే తెలివి ఉన్నా అహం, ఈర్ష్య, పెరిగింది. దాన్ని మార్చకోలేక పోతున్నావు ఈ శ్లోకంఒక్క సారి విను నీకె అర్ధం అవుతుంది అన్నాడు ఆత్మ బంధువు.                     

శ్లో === న లంఘయే ద్వత్సతశ్రీం నా ప్రదావేచ్చ వర్షతి | 
           నా చోదకే నిరిక్షేట స్వం రూప మితి ధారణా || 

భావము === లేగదూడను గట్టిన త్రాడును దాటరాదు. వానకురుస్తుండగా పరుగేత్తరాదు .  నీటి యందు తన ప్రతి బింబమును చుసుకోనరాదు . ఇది అన్నియు తప్పక జ్ఞాపక ముంచు కొనవలెను.

ఆత్మబంధువు నమో నమ:  అన్నాడు నేను లేగదూడను కట్టిన త్రాడును దాటాను, డబ్బు కోసమ్ వాన కురుస్తున్న పరుగెత్తాను, నన్ను క్షమించు ఆత్మ బంధువు అని కళ్ళు మూసుకున్నాడు. అంతే   వచ్చిన తాతగారు అంతర్ధాన మయ్యారు. నా తప్పు తెలిసింది ఎన్ని అవాంతరాలు వచ్చిన ఎన్ని ఆధునిక యంత్రములు వచ్చిన, మేధస్సుతో చెప్పే ఆత్మ జ్ఞానమునకు మించినది లేదు. నమో నమో ఆత్మబంధువు , నమో నమో అని దేవాలయము చేరాడు, డబ్బును ఆశించక బోధ  చేయుటకు. 

--((**))--



ప్రాంజలి ప్రభ (చిన్న కధ-4) . 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ  

పిల్లల మనస్ తత్త్వం అర్ధం చేసుకోవటం చాలా కష్టం, మనం ఒక పని చేయ మంటే మరో పని చేస్తారు, అటు చూడదంటే ఆటే చూస్తారు. వారిని పెంచారంలో తల్లి  బాధ్యత ఎక్కువ. తల్లి అరిస్తే తండ్రి ముద్దు చేస్తాడు, తండ్రి అరిస్తే తల్లి ఓదార్చి చక్కదిద్దుతుంది ఇదే కలియుగ మాయ,

 ఒక నాడు బాబు అగ్గి పిలల్లతో ఆడుతూ 5 పుల్లలు కలిపి వెలిగించి ఊదాడు నిప్పు పక్క గుడ్డలపై మండింది, ఒక్కసారిగా మండింది.  తల్లి అరవగా "హనుమంతుడు లంకను కాల్చినప్పుడు ఎవ్వరు అరవలేదు నన్నెందుకు అరుస్తావు అన్నాడు". రావణడు దుర్మార్గుడు రాజధాని లంకను తగలబెట్టాడు, అప్పుడే తండ్రి వచ్చి తప్పు చేసావు ఓట్రించటం ఎందుకు అన్నాడు. తల్లి మీదకన్నా తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఆ బాబుకు, " తప్పు చేసాను క్షమించు నాన్న ఇంకెప్పుడు అలా చేయను ".  చూడు బాబు అగ్ని హోత్రుని మనం పూజించాలి, కూడుకు, కాటికి ఉపయోగించేది, ఆరోగ్యానికి మోక్షమార్గానికి ఉపయోగ పడేది. నేను చెప్పే మాటలు జాగర్తగా విను అని ఈ శ్లోకం చదివి వినిపించాడు.                       

శ్లో === నాగ్నిం ముఖే నొపధమే న్నగ్నాం నేక్షేత చ స్త్రీ యమ్ | 
నమేధ్యం ప్రక్షిపే డ గ్నౌ నా చ పాదౌ ప్రతాపయేట్ || 

భావము
 === నిప్పును నోటితో ఉదరాదు. దిగంబర స్త్రీని చూడరాదు. అపరిశుభ్ర వస్తువును అగ్నిలో పడవేయరాదు. పాదములను నిప్పు పై ఉంచి కాచుకోనరాదు.
--((**))--


ప్రాంజలి ప్రభ (చిన్న కధ -౩)
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

ఆశ్రమంలో గురువుగారు శిష్యులకు ధర్మ భోధ చేస్తున్నారు, అక్కడకు ఒక స్త్రీ వచ్చి నమస్కరించి మాబాబు నేను ఎంత  చెప్పినా నామాట వినుటలేదు, మీరు మార్చే ఉపాయం చెప్పండి అని అడిగింది. అమ్మా రేపు వచ్చి కలవు, మీ సమస్యకు పరిష్కారం నేను చెప్పగలను అన్నాడు, అదే విధముగా రోజు రావడం, ఇదే మాట  వినడం అలవాటు అయినది. ఒక రోజు గురువు గారు ఆ స్త్రీని, ఆ బాబుని పిలిచి, "అమ్మ మాట వినాలి అదే నీకు ఆరోగ్యదాయకం అన్నాడు", అట్లాగే గురువుగారు అన్నాడు బాబు, కాని ఆ స్త్రీకి కోపం వచ్చింది ఈ మాట చెప్పటానికి ఇన్ని సార్లు తిప్పించాలా అన్నది. చూడమ్మా నేను కూడా మీ పిల్లవాని అలవాట్లు ఉన్న వాడ్ని " మట్టి గడ్డలు నలిపె వాడ్ని, గడ్డి పరకలు తెంపేవాడ్ని, గోళ్ళు కోరికే వాడ్ని, నిందలు చెప్పువాడ్ని, శుభ్రత, పరిశుద్దత లేనివాడ్ని"           
అవి మార్చు కోవటానికి నాకు ఇంత సమయం పట్టింది. కుండలోని మజ్జిగను ఎక్కువ సేపు చిలికితె    గాని వెన్న పుట్టదు, తేనెటీగలు ఎక్కువసేపు కష్టపడితేగాని తేన తుట్టె రాదు,  ఓర్పుతో మంచి మాటలు చేపితె కాని బుద్ధి మారదు, అతి ప్రేమ చూపిన, భయం తో మార్చాలని ప్రయత్నించిన పిల్లల మారారు, వారిది కల్లాకపటం లేని మనసు వారి ముందు మీ ప్రవర్తన మార్చుకుంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అంటూ ఈ శ్లోకం తెలియపరిచారు           

శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః |
సవినాశం వ్రాజత్యాషు సూచకో శుచిరేవ చ ||

భావము === మట్టి గడ్డలు నలిపెవాడు , గడ్డి పరకలు తెంపేవాడు, గోళ్ళు కోరికే వాడు, నిందలు చెప్పువాడు, శుభ్రత, పరిశుద్దత లేనివాడు శీఘ్రమ్గా నశించి పోవుదురు.

--((**))--

ప్రాంజలి ప్రభ (చిన్న కధ- 2)

ఒక ఊరిలో ఒక మనిషి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని సుష్టిగా భోజనం చేసి తిన్నది అరగకా క్రింద పడి దొర్లు తున్నాడు. ఆసమయాన ఆ దేశపు రాజు చూసి ఏమిటండి మీరు చేసే పని అడిగారు. యోగములో ముఖ్యమైనది, ఆరోగ్యానికి మేలైనది అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను అన్నాడు. మరి యితడు రోగం తో మూలుగు తున్నా పట్టించుకో రెందుకు అని అడిగాడు, రోగం ఉపవాసం ఉంటె కొంతవరకు ఉపశమనం, నేలమీద పడీ దొర్లితే మరికొంత ఉపశమనం అన్నాడు. ఈ మనషి మాటలు అర్ధం కాక అక్కడ ఉన్న సెలయేరు వద్దకు వెళ్ళాడు. అక్కడ అందరూ వివస్త్రలుగా స్నానం చేస్తున్నారు ఇదెక్కడ సోధ్యము. ఒక్క సారి ఆలోచించాడు "స్నానం చేయుటవలన అని గ్రహించాడు"  ఈ విధముగా ఉండుట మంచిది కాదు అని భావించి వెంటనే రాజు శాసనంగా ఈ పద్యము వ్రాసి చాటింపు వేసాడు.          

శ్లో === నా స్నాన మా చారు ద్భుక్తా నాతురోన మహానిశి | 
నవాసోర్వి జనాజశ్రం ణా విజ్ఞాతే జలాశయే ||

భావము === భోజనము చేసిన తర్వాతను, రోగ గ్రస్తుడైనపుదును అర్ధరాత్రి వేళయందు నగ్నంగాను తెలియని మడుగు లోనూ, స్నానము చేయుట మంచిది కాదు.

--((**))-- 

ప్రాంజలి ప్రభ ( చిన్న కధ)  
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక ఊరిలోఒక రాజుకున్నాడు అతడు పరమ దుర్మార్గుడు, వారికి భయపడి ఆందరూ సేవలు చేస్తున్నారు, ఆ రాజ్యంలో ఈ విధముగా ఉన్నప్పుడు ఒక ముని వచ్చాడు అతడు రాజు వద్దకు పోయి నేను మీకు వస్త్రము ఇస్తున్నాను ఇది కట్టు కుంటే మీరు స్వర్గాన్ని చూడ గలుగుతారు అన్నాడు, రాజు అసలే మూర్ఖుడు అట్లా జరగక పోతే మీ తల తీసేస్తాను జాగర్త అన్నాడు. 
వెంటనే బట్టలు విప్పేసాడు రాజు మీరు తెచ్చింది మీరే కట్టండి అన్నాడు. రాజు చుట్టు తిరిగి
చేతులు కదిలించి ఇక పూర్తి ఆయనది అన్నాడు.
 అంతే అక్కడున్న వారందు కళ్ళు మూసుకున్నారు. 
ఏమిటి వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు ఎందుకు మీరు సర్గంలో ఉన్నట్లు తెలిసి ఈ ర్శ్యతో  కళ్ళు మూసుకున్నారు. 
వెంటనే కళ్ళు తెరవండి అన్నాడు రాజు.  
అందరూ ఏడవటం మొదలు పెట్టారు ఏమైంది ఏడుస్తున్నారు.
 మీరు స్వర్గంలో సుఖంగా ఉన్నారని ఏడుస్తున్నారు.
ఏడవకండి ఆపండి అన్నాడు, అక్కడే ఉండి నవ్వు తున్నారు         
అక్కడవున్న ఒక శునకము రాజు మీదకు దూకింది అంతే సర్గం చేరాడు.                     
అందుకే పెద్దలు చెప్పారు భయపడి ఏ పని చేసిన ఫలితము ఉండదు, ధైర్యముగా ఉండి నిజం నిర్భయముగా చెప్పినప్పుడే జీవితము సమంగా జరిగిపోతుంది.    
ఈ రాజు దొంగలద్వారా వాటా పొంది, ధర్మాలు చేయక, ఎంతమందో స్త్రీలను హింసించాడు  అతను చేసిన పాపములు శునకము రూపములో వచ్చి బలిచేసుకున్నది. 
   
మన పూర్వికులు మనకు తెలియపరిచారు అని వచ్చిన సన్యాసి ఈ విధముగా తెలియపరిచాడు 
 శ్లో = వైరిణం నోపసేవేత సహాయం చైవ వైరిణః | 
ఆధార్మికం తస్కరం చ పరస్యైవ చ యోషితమ్ || 

భావము === శత్రువును, వారికి సహాయపడువానిని, ధర్మము చేయని వారిని, దొంగలను, పరస్త్రీ లను, సేవింప రాదు.


--((**))--

8, ఆగస్టు 2018, బుధవారం



వాజ్ పేయి కి అశ్రు నివాళి! 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఊపిరిపోసి పార్టీకి కొత్త శక్తి తెచ్చావు 
- ప్రజాసేవ కోసం నిరంతరము తపించావు

గరళం మింగి అమృతం ప్రజలకు పంచావు 
- రాజకీయము రక్షించుటకు కృషి చేసావు    

సమస్యల వలయాన్ని ధర్మంతో జయించావు 
- ప్రధాని,రచయితగా నిస్వార్ధ పరుడవు 

ఐక్యరాజ సమితిలో వాగ్ధాటిని చూపావు  
- ప్రజల నమ్మకాన్ని న్యాయంగా నిలబెట్టావు  

పార్టీ సభ్యులను ఏకం చేసే చతురుడవు 
- రాబోయే కాలము అంతా మాదేనని చాటావు

 నీవు ఎవరిని నొప్పించని నాయకుడవు 
-రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన ధీరుడవు 

 రాజకీయములో బ్రహచారైన భీష్ముడవు 
- భరత జాతి గర్వించే మహా నాయకుడవు 

మూడుసార్లు ప్రధాని ఐన అజాతశత్రువు
- ప్రజల హృదయాలలో ఉన్న ఆత్మబంధువు 

జీవికి మరణం తప్పదు 
మరణానికి పుట్టుక తప్పదు    
ధర్మం, సత్యం, న్యాయానికి చావు ఉండదు 
ఇది వేణుగోపాల రాజకీయ లీల సుమా   
--((**))--


అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   

కన్ను రెప్ప వాల్చ నంటుంది నిన్ను చూస్తే 
- మనసు ఉరకలు ఏస్తుంది ఎందుకో 

హృదయం దడ దడ లాడు నిన్ను చుస్తే 
- మంచులా కరిగి పొమ్మంటుంది ఎందుకో 

మాట పాటగా మారుతుంది నిన్ను చూస్తే
- సెలయేరులా మారమంటుంది ఎందుకో 

ప్రేమ శిక్ష నాకు ఎందుకు నిన్ను చూస్తే
- కళ్లెంలేని గుర్రంలా పరుగు ఎందుకో  

నాలో మెఱుపు తీగ విధ్యుత్ నిన్ను చూస్తే
- చినుకు పూల సంబరం నాలో ఎందుకో

చిరునవ్వు గల తలపు నిన్ను చూస్తే 
- అధరామృతం అందివ్వ మంది ఎందుకో

పెదవి సొంగ కారుస్తుంది నిన్ను చూస్తే  
 - తేట నీరు అందుకో  అంటుంది ఎందుకో 

 బొడ్డు చీర నిల్వ నంటుంది నిన్ను చూస్తే
- తనువు ఎదో కావాలంటుంది ఎందుకో

వయసు వయసు పంచుకో
సిగ్గు విడిచి తృప్తి అందుకో 
నిత్యం ధర్మ బుద్ధి నిలుపుకో
ఇది వేణుగోపాల ప్రేమ సుమా

--((**))--    


Image may contain: 1 person

అధిక్షేప ప్రేమ లీల 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

హృదయంలో దాగి ఉన్నాడు గుర్తు పట్టనట్లు భేటీ  
- పరువంలో ఉండి ఉన్నాడు చూసి చూడనట్లు కోటీ  

పాషాణంగా ఉన్న మనస్సును మార్చ లేనట్లు పోటీ   
- నవ పారిజాతం గా  నీవు నాకు దక్కనట్లు శాటీ  

ముసుగులో ఉంచి నాకు తెస్తున్నావు ఇక్కట్లు ఘోటీ 
- నవ్వుని పంచ లేక పడుతున్న అగచాట్లు చీటీ  

ఇత్తడి పుత్తడి అయినా  బుద్ధి మారనట్లు ధాటీ 
- ప్రకృతి పరంగా నిత్యం ఆనందించటం పరిపాటీ   

మణీకిరణ కోటీ
గంధ కుచశాటీ
లేదు ఎప్పుడు పోటీ 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--


అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

మధుతోటి చెలిమి మీరా మనసాయే
- మగువ తోటి జాలి జోల పాటలాయే    

తెలివి తోటి విద్యయే సంపాదనాయే 
- బలిమి తోటి నీ బుద్ధియే స్వార్దమాయే

ఆశయం తోటి శక్తి ప్రభావిత మాయే 
- కోపం తోటి పలు మాటలు ద్వందాలాయే

పగటి తోటి రేయి శాశ్విత చెలిమాయే 
- ప్రేమ తోటి పరిణయం శాశ్విత మాయే

పరువం తోటి వయసు ఉరకలాయే
- వినయం తోటి ప్రేమ ప్రభావితమాయే   

సమయం తోటి బ్రతుకే  ప్రధానమాయే 
- విరహం తోటి తరుణం సుఖాల మాయే    

కంటి తోటి లవణ నీరు తోడు ఆయే
- కళ్ళ తోటి చూపులు దయ చిహ్నమాయే 

తల్లి తోటి తండ్రి ప్రాణంకి  ప్రాణమాయే
- దైవం తోటి ధర్మం సత్యం జీవితమాయే 


కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన 
గుండెల్లో గుండె కలిపి చూసిన
ప్రకృతి  వింతనాటకములో పావులమాయే 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

--((**))--     



స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
అధిక్షేప ప్రేమ లీల  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ప్రతి నిముషం వ్యర్ధం చేయక జీవిద్దాం 
- ప్రతిదీ సద్విని యోగంతో  బ్రతికేద్దాం  

జగమంతా పచ్చదనాలతో నింపెద్దాం
- నేలనంతా హరిత వనంగా మారుద్దాం  

ఆరోగ్యమే మహాబాగ్యంగా ప్రవర్తిద్దాం 
- మన దేశ సంపదను వృద్ధికి తెద్దాం 

"శ్వాస, ధ్యాస ఇచ్చే ప్రకృతిని ప్రేమిద్దాం "
- హింస మాని అహింసా సూత్రాన్ని పాటిద్దాం 

దేశ ధర్మాన్ని అనుకరిస్తూ జీవిద్దాం  
- శాంతి నిచ్చే ఆరాధ్య దేవుణ్ణి ప్రార్దిద్దాం 

తెలిసింది చెప్పి మంచి మార్గం నడుద్దాం   
- కృషితో దుర్భిక్షం లేకుండా ప్రయత్నిద్దాం 

నిగ్రహ శక్తిని పెంచేవి మాట్లాడుదాం 
- సత్యం, ధర్మం, న్యాయం గా జీవిద్దాం

భారాత మాత సాక్షిగా ప్రమాణం చేద్దాం   
- అందరమూ ప్రగతికి చేయుత నిద్దాం  

దేశం నాకేమిచ్చింది 
తల్లి తండ్రులు నాకేమిచ్చారు
అనక దేశానికి, పెద్దలకు 
నీ సహాయం ఎదో చెప్పు   
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--


అధిక్షేప పేమ లీల 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

మన మస్తిష్కం లో శక్తి దాగి ఉందిలే
- మన జాతికి ప్రగతికి కావాలిలే 

 అవనిలో సాధ్యము కానిది లోదులే 
- అద్భుతములు సృష్టించేది మనుష్యులే

మన తెలివెప్పుడు సహాయడునులే 
- మమతన్నది మనుగడ భందువులే

శక్తి అభ్యదయానికి అడ్డు రాదులే 
- ప్రకృతి వ్రాసేటి  తెల్ల కాగితములే  

 సూర్య శక్తికి అడ్డు ఏదియు లేదులే  
- ఆనంద స్వప్నాలు మన ఊపిరిలే 

మన ఆలోచనలే అమృత వాక్కులే
- స్వప్నాలు కావ్యాల  ప్రేమ తీపి గుర్తులే 

కాలక్షేపం కవి వ్రాత చమత్కారాలే  
- మనసంతా సంతృప్తి ఆకలి సెగలే  

అధరామృతమే జీవానికి నాందిలే
అమ్మానాన్న పాదసేవే జీవితములే   

అవునన్నది కాదులే 
కాదన్నది అవునులే 
ఆత్మ యోగి వేదములే 
ఇది వేణు  గోపాల ప్రేమలీల   
 --((**))--


"భారత దేశ ప్రజలందరికి " స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా 
ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు - తెలియపరుస్తున్నది 
   
అధిక్షేప ప్రేమ లీల
రచయత:మల్లాప్రగడ రామకృష్ణ 

దేశమంటే మట్టి కాదోయ్ - అక్షర మాలాయే  
- అక్షర మాలే వేదాంతమాయ్ - నీ వేలుగాయే 

మనుష్యుల వెలుగు మయమ్ - జీవన మాయే
- దేశ నవాభ్యుదయమ్ - ఉద్యోగ భద్రతాయే        

స్త్రీ పురుష లోకమ్ - కష్ట సుఖ జీవులాయే  
- నిరంతరం పుట్టే జీవమ్ - కష్టతరం లాయే

ఆరోగ్యం మందులాయ్ - మన:శాంతి కరువాయే
- ఉమ్మడి కుటుంబాల్ - ప్రస్నార్ధకము లాయే 
    
రాజకీయ నాయకుల్ - స్వలాభ ప్రజ లాయే     
- సామాన్య ప్రజానీకమ్ - ఆశకు  బద్ధు లాయే
  
కీర్తి, ధనం కోసమ్ - దీక్ష కర్తవ్యం లేదాయే
- అనుభవ జ్ఞానమ్ - అగమ్య గోచరమాయే

మేధస్సుకు అంతర్ జ్వాలమ్ - మరో జ్ఞాణ మాయే       
- అనారోగ్య మాయా జాలమ్ - ఆకర్షణ మాయే 

జీవితమ్ - శక్తి సామర్ధ్యాలకు ప్రశ్నలాయే 
- అమ్మ ప్రేమ, నాన్న ప్రత్సాహమ్ - ప్రపంచమాయే   

మారుతున్న కాలం తో మారాలోయ్ 
మనవాభ్యదయం బతికించాలోయ్
కలసి దేశానికి సహకరించాలోయ్  
ఇది వేణు గోపాల్ ప్రేమ సుమా
--((**))--



PRANJALI PABHA.COM
అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

శుద్ధమైన మనసుకు నిద్దురేలా 
- మానవత్వానికి మచ్చ చూపు లీలా

ఇష్టమైన రోజుకు కష్టాలు ఏలా
- కష్టమైనప్పుడు శాంతి లేని లీలా   

హనుమ ధర్మ వాక్కు అద్భుత లీలా
- రామ నామ మహిమ జీవిత లీలా    

ఇంద్రియాలపై మాయ మహిమ లీలా
- కర్మ, జ్ఞాణ, అంతర్గత మోక్ష లీలా    

పరమాత్మ యోగ సాధనల లీలా
- అనుష్టానముతో అనుబంధ లీలా  

శ్రీ హరి యోగవేదాంత ప్రేమ లీలా 
- శరణాగతి పొందిన మోక్ష లీలా
  
జిహ్వతో సంసారి మనస్సుపై లీలా 
- స్త్రీ ఓర్పుతో గుణాతీతా బంధ లీలా 

తల్లి, తండ్రి, గురువుల బోధ లీలా 
- తరుణ నియోగ దేహ శక్తి లీలా

సృష్టి స్థితి లయకారుని లీలా 
సరస్వతి, లక్ష్మి, పార్వతి లీలా 
పాప పుణ్యాలతో ప్రజా లీలా 
ఇది వేణుగోపాల ప్రేమ లీల 
--((**))--



అధిక్షేప ప్రేమ లీల 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

గిరిగీచుక కూర్చొణ బోకు,  సరిలేదనుకోకు  
- మర్యాద లేదనీ, మర్చిపోయి ప్రవర్తించుటెందుకు  

నా కెవరు సరి రారన్నట్లు, పదమాలికేందుకు
- మదం పెంచెడి, అహంకారపు మాటలెందుకు
     
తృప్తి నిచ్చేడి హృదయాన్ని, నీవు పంచలే వెందుకు   
- కరుణతో జనుల సహాయం తీసుకొన వెందుకు    

సద్వినియోగం చేసుకోక నీ బాధ పంచుటెందుకు 
- తరుణమ్మను వ్యర్ధము చేసి బ్రతుకుట ఎందుకు 

సమభావంతో ఉండక నీ దౌర్జన్యం చూపుటెందుకు 
- సానుభూతి తెల్పక దర్పపు పలుకులు ఎందుకు  

సృష్టి రచన గూర్చి అడిగే హక్కు, నీకు ఎందుకు   
- నిరుపేదను తూలనాడుట అవసరమా నీకు 

సరసంబుగా బాసలాడి మోసగించుట ఎందుకు
- మతి నుంచక అతిగా గొప్పలు చెప్పుట ఎందుకు  

ప్రాప్తమైన దాని తోడ తృప్తిగా బ్రతక వెందుకు 
- తల్లి, తండ్రి, గురువు, సేవించక తిరుగు డెందుకు

చెవిటి వాని ముందు శంఖం ఊదటం 
మొండి వానికి హిత బోధ చేయటం
కరి తొండాన్ని ఊపద్దనటం 
కుక్క తోక వంకరతీయుట వ్యర్థం 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--
   

అధిక్షేప ప్రేమ లీల
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

లేత లేత మొగ్గలం,  చదువుతున్న బాలలం 
- తీపి తీపి ఆశలం, ఆశయం ఉన్న బాలలం     

వీధి వీధి ప్రియులం, ప్రేమతో ఉన్న బాలలం 
- దేశ వాస బిడ్డలం, ధైర్యంతో ఉన్న బాలలం

గురు మాట బద్ధులం, ధ్యేయంతో ఉన్న బాలలం
- తల్లి తండ్రి సేవలం, బాధ్యత ఉన్న బాలలం 

ఘుమ ఘుమ పువ్వులం, గుభాలిస్తున్న బాలలం
- మండే వెల్గు దివ్వెలం, ఓర్పుతో ఉన్న బాలలం       

దేశ సేవ పాత్రులం, నేర్పుతో ఉన్న బాలలం 
- భక్తి యుక్తి జీవులం, స్నేహంతో ఉన్న బాలలం

మంచి చెడు పావులం, ప్రాణంతో ఉన్న బాలలం 
- పుణ్య్ పాప పోరులం, కర్మతో ఉన్న బాలలం 
   
అమ్మ ప్రేమ వాసులం, శుభ్రంగా ఉన్న బాలలం 
- నాన్న కోర్క తీరులం, ధర్మంగా ఉన్న బాలలం 
   
వేద గుణ వైద్యులం, భాష్యంగా ఉన్న బాలలం 
- భవ్య దివ్య వెల్గులం, శాంతంగా ఉన్న బాలలం 
  
తల్లి తండ్రి ధర్మ వాక్కు 
గురువు సత్య వాక్కు
బాలలకు న్యాయవాక్కు 
బాల వాక్కు బ్రహ్మ వాక్కు
ఇదే వేణు గోపాల ప్రేమ సుమా 

-((**))--


అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

నా మాటల మర్మం నీవు అర్ధం చేసుకోవా
- మనసు కలవ టానికి ప్రయత్నించవా

నీలో కమ్మిన మాయ తొలగించు కోలేవా     
- నావంతు సహాయం చేయుటకు ఒప్పుకోవా  

నీలో ఈ పట్టుదల ఎందుకో చెప్పలేవా  
- బిడియం వదలి కలువుటకు రాలేవా

నాకు ఓకే నవ్వు చూపి మాయ మవుతావా
- నా దరి చేరి సుఖం పొందుట కొప్పుకోవా

 లతలతో మైమరిపించుటకు రాలేవా 
- అధరామృతాన్ని అందించి అందుకోలేవా  

  నీవు సుఖించి జీవ నాడిగా మారలేవా
-  నా ప్రేమకోసం కట్టుబాటు దాటి రాలేవా

ప్రేమ అందించి నాలో శక్తిని పెంచలేవా 
- నీ ప్రాణానికి నా ప్రాణమని గ్రహించావా

నా ఊహల పట్టపు రాణిగా ఉండలేవా
- నాగుండె మంటను చల్లార్చుటకు రాలేవా 
  
తాడు తెగే దాకా లాగ కూడదు   
ప్రేమ ముదిరేదాకా ఉండకూడదు
ప్రేమ పండేదాకా ఓర్పు ఉండాలి 
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

 --((**))--
Drawings

అధిక్షేప ప్రేమ లీల - ప్రాంజలి  ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

నాకున్నది నీకు, నీకున్నది నాకు లేదోయి  
లేనిదాని గూర్చి ఆలోచించుట ఎందుకోయి 

నామాట నీమాట ఒకే రకంగా ఉండదోయి
సర్దుకుపోయే గుణం 'నీనా' మనలో ఉందోయి 

నీ కోరిక నా కోరికా ఏ నాడు కల్వదోయి    
ఆరోగ్యం పంచుకొనే బుద్ధి ఉంటే చాలునోయి 

వయసు కోరికలు తిర్చలేక ఉన్నఓయి
క్షణ ఓర్పు వహించా వంటే అంతా సుఖమోయి  

మాటి మాటికీ కోపం మన మధ్య ఎందుకోయి
బలహీనత భయం తో వచ్చే లక్షణ మోయి    

మంచి చెడును గూర్చి ఎందుకు చెర్చించవోయి  
మంచి భావనతో ఉంటె దుర్భుద్ధి ఉండదోయి 

జాగర్త గూర్చి నీ వెందుకు ఆలోచించ వోయి
ఆకలి తీర్చటం తప్ప ఏమీ చేయ లేమోయి

అర్హత లేని ఆశలతో ఉంటా వెందుకోయి
జీవితం ఆశయంగా జాగర్త పడ తానోయి

మూడుముళ్ల పెళ్లి గౌరవించు 
మూడునాళ్ళ ముచ్చట కాదు 
జీవించినన్నాళ్లు అది నీకు తోడు
ఇది వేణు గోపాల ప్రేమ సుమా 
--((**))--    

7, ఆగస్టు 2018, మంగళవారం

హాస్య ప్రభ

నేటి హాస్యం - ప్రాంజలి ప్రభ.com  
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

ఒకావిడ పక్కింటి పిన్ని గారిని పేష్టు కోసం పోయింది 
మేము పేష్టు వాడటం మానేసాం 
మరేం వాడుతున్నారు 
అదిగో కనిపించలా 
అవి పిడకలు కదా పిన్నిగారు
అవునండి వాటిని పొయి క్రింద వెలిగించితే  
ఎంచక్కా వంటవుతుంది. 
బూడిదతో పళ్ళు తోముకుంటే రత్నాలు అవుతాయ్ 
పిడకలు ఇస్తారా 
ఖర్చవుతుందమ్మ వెళ్లిరా అంది మొఖం మీదే 
పేష్టు కన్నానా 
సూపర్  మార్కట్ కు పోయి అడుగు 
అంతేనా అంతే .......
ఆ....       ఆ.... తారగా వస్తే ఫినాయిల్ తాగే లోకం  
ఆ...    ఆ..  వూ లేదు వెళ్లి రామ్మా ...

--((**))--

నేటి హాస్యం   - Pranjali pabha .com  
రచయత :  మల్లాప్రగడ రామకృష్ణ 

మేము సబ్బుని ప్రవేశ పెడుతున్నాము
రుద్దుకుంటే మరోసారి రుద్దుకోవాలని పిస్తుంది 
సబ్బు అరిగిందని పిస్తే మరో సబ్బు ఫ్రీ 
అందుకే ఒక సబ్బు రేటులో రెండు ఇస్తున్నాము 
చర్మ వ్యాధిని తొలగించే సబ్బు
ఆసబ్బు మీరు  వాడే సబ్బు అనుకోవచ్చా ?   
అబ్బా ఏమిటి నీ సొద ఆపరా చెప్పొచ్చు కదా ఏసబ్బో 
ఆశ దోస అప్పడం .......  ఆ....    ఆ .......      

         --((**))--


నేటి హాస్యం  
రచయత :  మల్లాప్రగడ రామకృష్ణ 

ఇద్దరు వ్యక్తులు కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నారు 
బిత్తర్ : నీకు చాట్ చేయటం వచ్చా 
అల్ బిత్తర్ : నాకు రాదు పానీ పూరీ వచ్చు 
బిత్తర్ : అదికాదురా: పోనీ లైక్ చేయటం వచ్చా 
అల్ బిత్తర్ : ఎవరిని బడితే లైక్ చేస్తే మా ఆవిడ ఉరుకుంటుందా 
బిత్తర్ : అదికాదురా: పోనీ షేర్ చేయటం వచ్చా 
అల్ బిత్తర్ : డబ్బులు లేక గదరా నీతో షేర్  చేసుకొని తింటున్నా  
బిత్తర్ : అదికాదురా: పోనీ కామెంట్సు  
అల్ బిత్తర్ : కామ్ ఉండే యాంట్సు తో నాకేం పనిరా 
బిత్తర్ : నేనే ఒకరికి టోకరి వేస్తా 
అల్ బిత్తర్ :  నాకు టోకరివేద్దామనుకున్నావా ఏంటి 
బిత్తర్ : ఏమిలేదు ఏమి లేదు 
అల్ బిత్తర్ : ముందు భోజనంకు పదా 
బిత్తర్ : ఇప్పడిదాకా నన్ను తిన్నావుగా నీకు ఇంకా ఆకలా 
అల్ బిత్తర్ :ఆకలి తీర్చి, నీవు అడిగినవన్నీ చెపుతా 
చెపుతావా .... ఆఆ  చెపుతా - సరే చెప్పు ... ఆకలి 
ఆ...    ఆ..  అనుకున్నారు ఇద్దరు 
--((**))--  

  

నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

తండ్రి : ఎగ్జామ్స్ ఎలావ్రాశావ్ 
కొడుకు: బ్రహ్మ౦డంగా వ్రాసాను
తండ్రి: సారె నీవు ఆడుకో, ప్రోగ్రెస్ కార్డు వచ్చాక చూపు 
కొడుకు: అట్లాగే నాన్న
తండ్రి : ప్రోగ్రెస్ కార్డు చూపవేమిరా ?
కొడుకు : డాక్టరుగారు మీరు ఆందోళన చెందే విషయం చెప్పదన్నారు గా నాన్న
తండ్రి: నాగుండె గట్టిదే చెప్పు ఎన్ని మార్కులు 
కొడుకు :   హండ్రెడ్ కు హండ్రెడ్ 
తండ్రి : హా అంటూ గుండె పట్టుకున్నాడు 
తల్లి :     ఏంచెప్పావురా మీనానదుకు అంట పెద్ద గా అరిచాడు      
కొడుకు:  హండ్రెడ్ కు హండ్రెడ్ రాలా పడే వచ్చాయని చెప్పుదామని అనుకున్న 
              నాన్నే సారిఆ వినలా 
తల్లి : ఏమండి ఎలా ఉంది మీకు, ముందు డాక్టర్కు ఫోన్ చేయర్రా 
కొడుకు: చేస్తానమ్మా ....     
            తొందరగా చేయరా కొడకా అన్నాడు తండ్రి 
             ఆ తొందరా ...  ఆ తొందరా ...   
కొడుకు : నెంబర్ చెప్పఁకుండా తొందర అంతే ఎట్లా 
               ఎట్లా పదండి హాస్పటల్కు ప్రక్కనేగా 

               ఆ ... ఆ.  కదిలారు 
--((**))--


నేటి హాస్యం - 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

సూర్యాకాంతం నీకు పండగకి చీర కొనమంటావ, చుడీదార్ కొనమంటావా,
 ప్రేమతో అడిగాడు భర్త పర్వతాలు. 
ఏది కొన్న నాకు ఒకే, ఉతికే వాడివి నీవే కదా, నీకు ఏది అనుకూలమైతే  అదే కొను.

నీవు నాకు చాయిస్ ఇస్తావనుకోలేదు 
ఇవ్వకపోతే ఏది కొందామను కున్నావు 
అసలు కొనద్దు ఇప్పుడెందుకు ఖర్చు అంటావనుకున్నా 
అయితే నాకు రెంటు కావాలి కొను 
ఆ.....         ఆ.. అంతే ...  

--((**))--


నేటి హాస్యం 
రచయత: మల్లాప్రగడ రామ కృష్ణ 

రోజులు మారుతున్నాయి.... 
నడిచి వెళ్లే వారు కానరావడం లేదు 

కాలం కూడా మారి పోయింది...!!!! 
నిలకడగా కాపురం చేసే వారు కనబడుట లేదు  

మనుషులు వెర్రొళ్లు అవుతున్నారు!!
ధనం కోసం అందరూ కష్టపడుతున్నారు 
ఖర్చు చేసి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు.  

 ఫోన్ లు "స్మార్ట్" అవుతున్నాయి!!
టి. వి. లు సినిమా థియటర్లుగా మారుతున్నాయి. 

సంసారం ప్లాష్టిక్ బొమ్మలతో సరిపెట్టుకోవడం లేదు
సంతోషిద్దాం .....  అవునా ... అవునూ ..

ఏమిటో ఈ మార్పు ఎవరికోసం .... 
అనాగరిత, అసభ్యత, కాలుష్యం పెరిగి పోతుంది 
అవునా ... ఔనూ .. 
కాస్సేపు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడే పడి పోతామ్

అవునా ..  అవునా అంటానికి కూడా నోరు రాదు నడువు ...
    ఆ...    ఆ...  

--((**))--


ఓం రి రామ్ - శ్రీమాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:
South indian family painting...........
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 
(రచయత :  మల్లాప్రగడ రామ కృష్ణ )

Carolien Smit

"అవమానమ్ " గాడు తన భార్య తో రొడ్డు మీద వెళుతుండగా... 
తన ఫ్రెండ్ " అనుమానం "కనిపించాడు !! 
వాడిని పోలీసులు పట్టుకుని తీసుకుని వెళుతున్నారు!! 
"అరె! ఏమైందిరా....ఎం చేసావ్??" అని అడిగాడు "అనుమానం " 
"అదే !!...నా భార్య తో గొడవయ్యిన్ది ....శూట్ చేసేసా!!" అన్నాడు "అవమానం " 
"అవునా ...శిక్ష వేసారా??" అడిగాడు "అనుమానం" 
"ఆ...ఓ 5 వారాలు...." అన్నాడు "అవమానం " 
అంతే...వెనుకా ముందు చూసుకొకుండా మన "అనుమానం " గాడు పోలీసోళ్ల వద్ద వున్న గన్ తీసుకుని.. 
"ఢామ్...ఢామ్.." అని తన భార్య ని శూట్ చేసి.... 
"పదండి నాకు కూడా ఓ 5  వారాలు శిక్ష వెయ్యండి !!" అన్నాడు ఆవేశం గా !! 
"ఎడిశావ్ లే !పిచ్చి సన్నాసి !!..అందుకే చెప్పేది పూర్తిగా వినాలి...... 
..మీ ఫ్రెండ్ కి 5  వారాల తరువాత ...ఉరి తీయమని శిక్ష ఖరారు చేసారు!!" అన్నారు పోలీసోళ్ళు!!
ఆ ... ఉరా ...      ఆ ఉరే  
నా కొంప ముంచావురా అవమానం 
నేనేం ముంచలా నీ ఆవేశమే ...... 
ఆ...  ఆ.. ఊ లేదు నడూ ....
--((**))--    

Catherine La Rose: ✿ Paul NILADRI ✿


నేటి హాస్యం - ప్రాంజలి ప్రభ 

ఒక నడి వయస్సులో ఉన్నవాడ్ని , స్కూల్ పిల్లలు  పరుగెత్తి,.. పట్టుకుని ,... 
స్కూల్ కి ఈడ్చుకుని తీసుకెళుతున్నారు!! 
ఇదంతా ఒక పెద్దాయన చూసాడు !! 
స్కూల్ పిల్లలని గదమా ఇంచాడు!! 
"తప్పు పిల్లలూ .....మీరు ఆయన్ని అలా బలవంతం గా స్కూల్ కి లాకెళ్లకూడదు..... 
ఆయనది చదువుకునే వయస్సు కాదు....వదిలేయండి పాపం " అన్నాడు . 
పిల్లలన్దరూ ఏక కంఠం తో .... 
"ఆయన మా టీచర్.!!!..... 
రొజూ పాఠాలు చెప్పకుండా, ఏదో సొంత పని మీద పొతూ ఉంటాడు....అందుకే ఇలా!!!!" అన్నారు మీ ధైర్యం మీకు విజయం - మీ పట్టుదలే ఉపాధ్యాయునిలో మార్పు !!
మేము చేసిన మంచి పనేనా 
అది మీరు చదువుకోవాలనే ఆశే చెపుతున్నది కదా 
అవునా సార్ -- అవునూ .....   
--((**))--



నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ -12 )

"మీరు చేసిన నెరాలూ, ఘొరాలూ, ఋజువయ్యాయి ... 

రేపు మిమ్మల్ని ఉరికంబం ఎక్కిస్తున్నాము!!" అన్నారు జడ్జి గారు!! 
చివరి కోరిక ఏమైనా ఉన్నదా 
రేపు కదండీ నాకు ఉరి అయితే ఈరోజు పార్టీమీటింగు అవకాశం ఇవ్వండి
ఒక్క పూటలో ఎం చేయగలుగుతారు మీరు  
మీరు మారవచ్చు, నేను పారిపోవచ్చు, అన్నాడు నాయకుడు
అవునా ..... ఔను .....  ఆ.....  ఆ.......
జడ్జిగారు కట్టుదిట్టం చేయమని ఆజ్ఞ ఇచ్చివెళ్లారు 

   --((**))--

Tumblr Ears buds Pegatina
నేటి హాస్యం ప్రాంజలి ప్రభ - 11 ) 

ఏమిటో ఈ పిల్లలు ఎప్పటికి మారుతారో 

  
"మమ్మీ "..... గుడ్నైట్ !! 
"గుడ్ నైట్....చిన్నా! !!!" 
"డాడీ" ....గుడ్ నైట్ !! 
"గుడ్ నైట్....చిన్నా! !!!" 
...... 
"మీరు మారరు!!!! 
నన్ను దోమలు కుట్టి చంపేస్తున్నాయి! 
"గుడ్ నైట్ " ఎక్కడ వుంది అని అడుగుతున్నా!!
గుడ్ నైట్ అని అంటారుగాని గుడ్ నైట్ ఎక్కడుందో చెప్పరు


--((**))-- 



నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ - 10

"సార్!....ఈ రోజు మేము ఒక లారి ని పట్టుకున్నాము... 
దొంగతనం గా విస్కీ బాటిల్స్ తీసుకుని వుళుతున్నారు!!....అన్నాడు ,కొత్తగా చేరిన కానిస్టేబుల్!! 
"గుడ్!!! వేరి గుడ్.....అలాగే... 
సోడాలు, పొటాటో చిప్సు తీసుకుని వెళ్ళుతున్న లారీ ని కూడా పట్టుకో!!" అన్నాడు ఆరితేరిన "ఇన్స్పెక్టర్!!
నా ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారా, తిడుతున్నారా తెలియుటలేదు 
కొన్ని విషయాలు గొప్పగా చెప్పుకుంటే ఫలితము ఉండదు తెలుసా 

ఆ..    అంతేనా ...  ఆ అంతే ....      

--((**))--

నేటి హాస్యం (prnjai prabha.com -9)

నాకోసం నువ్వేందుకేడుస్తున్నావో 
నాకస్సలర్దం కావట్లేదు
.......నిజం., నీకు అర్ధం కాదు  

నువు సరిగానే పోల్చుకున్నావా, 
లేక పొరపాటుపడ్డావా.....???
.......నిజం.,సరిగా పోల్చుకున్నాను  

అసలింతకీ నీకు తెలుసోలేదో... 
నా పేరు.................
ఎందుకు తెలియదు 
అయ్యోమయ్యం జగన్నాధం 
భగవంతుడా పేరుతెలుసుకుంది 
ఎప్పుడు నేను ఏమి చేయాలి అన్నాడు 
ఈ తాళి నా మెళ్ళో కట్టండి 
మీ దారి మీరు వెళ్ళండి 
నా కభ్యంతరం లేదు 
నేనే ఎందుకు కట్టాలి  
నేను వేశ్యను మొదటిసారి
 అనుభవించింది మీరే కాబట్టి 
రుజువు ఏమిటి 
ఇది చూసి చెప్పండి అవును అంటూ 
తాళి కట్టాడు ఎందుకు?  
--((**))--

నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ -8 )
దారిన పోతున్న ఒక అమ్మాయిని చూసి 
అబ్బాయి సంభాషణ 

"మీరు చాలా అందం గా వుంటారు".. 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు చాలా తెలివైన వారు .... 
"త్యాన్క్స్ అండీ!!" అంది  
"మీరు నిజం రాజకుమారి లాగా వుంటారు!!!" 
"త్యాన్క్స్ అండీ!!" ...ఇంతకీ మీరెమ్చెస్తూ వుంటారు? అంది  
"జోక్స్ వెస్తూ వుంటానండి!!" అన్నాడు 

ఐతే మీరు చాలా బాగున్నారు 
"త్యాన్క్స్ అండీ!!"
ఐతే యున్నావు నాకు చాలా బాగుంది 
"త్యాన్క్స్ అండీ!!"
మీరు నాకోసం ఏమైనా ఖర్చు పెడతారు 
"త్యాన్క్స్ అండీ!!"
అయితే షాప్పింగ్ కు వెళదాం 
నో "త్యాన్క్స్ అండీ!!"
మీతో జోక్సు వేయనండి వస్తా ...... వస్తా ........
 ఛీ యీ మొగోళ్లంతా ఇంతే ........   

 --((**))--


ప్రాంజలి ప్రభ (నేటి హాస్యం-7 )

బయట గుమ్మం నుండి రోడ్డు వంక చుస్తున్నారు 
 భార్యాభర్తలు చల్లఁగాలికోసం 

"ఛీ ,ఛీ .....పొయ్యేకాలం కాక పొతే ...అటు చూడండి ,,.. 
ఒక అబ్బాయి..ఇంకో అబ్బాయి కి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్నాడు, 
ఖర్మ ! పాడు బుద్ధులు!!" అంది "భార్య భర్తతో " 
"కాదె....పాపం!!.... 
ఆ అబ్బాయి, ఎదురు ఇంట్లొ అబ్బాయి ని .... 
ఎదో కావాలని అడుగుతున్నాడె!!" అన్నాడు భర్త భార్యతో .
చూడండి మీరేమయినా చెప్పండి మగపిల్లల బుద్ధులు మారుతున్నాయి 
ఆ కనిపించేది అబ్బాయి త్రాసులో ఉన్న అమ్మాయి అండీ
అవునా నాకు తెలియదే 
మొగబుద్ధి పోనిచ్చారు లోపలకు పదండి.    
--((**))--


నేటి హాస్యం (ప్రాంజలి ప్రభ -6 )


ఓ పల్లెటూరి వ్యక్తి పనిమీద హైదరాబాద్ వెళ్ళాడు. తీరా అక్కడికెళ్ళాక అతనికి సిన్మా యాక్టర్ల ఇళ్ళు చూడాలనిపించి ఫిలిం నగర్ వెళ్ళాడు. 
అక్కడ ఒకతన్ని పిలిచి "బాబూ...! ఎం. టి. ఆర్  ఇల్లెక్కడ...?" అనడిగాడు. 
"ఏ. ఎన్. ఆర్.  ఇంటిప్రక్కన..." అని చెప్పేసి వెళ్ళిపోయాడతను. 
మళ్ళీ ఇంకొక అతన్ని ఆపి "ఏవండీ...! "ఏ. ఎన్. ఆర్. ఇల్లెక్కడ...?" అనడిగాడు. 
"ఆ మాత్రం తెలీదా...! ఎం. టి. ఆర్  ఇంటి ప్రక్కనే... అతనూ వెళ్ళిపోయాడు. 
పల్లెటూరి వాడికి చిర్రెత్తుకొచ్చింది. ఎవడూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదని మరోక అతన్ని ఆపి "సారూ...! ఎం. టి. ఆర్ ఇల్లు, ఏ. ఎన్. ఆర్. ఇల్లు ఎక్కడో కాస్త వివరంగా చెబుతారా..." అన్నాడు తెలివిగా. 

"భలే వాడివే! ఇందులో వివరించాడనికేముంది? 

వాళ్ళిద్దరి ఇళ్ళూ ప్రక్క ప్రక్కనే" అనేసి అతనూ వెళ్ళిపోయాడు. పల్లెటూరాయన ఇంకెవర్ని అడగలేదు. అలా నడుచుకుంటూ వెళుతున్నాడు 
అప్పుడే ఒకడు వచ్చి వాళ్ళిద్దరి స్వర్గంలో ఉన్నారు అక్కడ వాళ్ళ ఇల్లు అక్కడకు చేరు 
ఆ .....  ఆ ....   స్వర్గమా అదెక్కడా అన్నాడు 
ఆ..  వచ్చి నవాడు తలకాయ పట్టుకొని, జుట్టుపీక్కోని, బట్టలు చింపుకొని నవ్వుతున్నాడు   
పల్లెటూరు వాడని ఆడు కుంటారా అంటూ నడిచాడు 

--((**))--

ప్రాంజలి ప్రభ (నేటి హాస్యం -5 ) 

చిన్నపిల్లోన్ని చేసి చితక బాదు తున్నారు!! 
జనం అన్దరూ చుట్టు మూగారు!! 
ఒకా ఆయన ధైర్యం చేసి అడిగాడు .... 
'ఎందుకండీ , పాపం అతన్ని అలా చితక్కొడుతున్నారు??" 
"వీడి ధైర్యం చూడండి!!... 
మా ఇంటికే వచ్చి .."దీప....దీపా.." అని మా అమ్మాయిని పిలుస్తున్నాడు... 
ఇలాంటి వాడిని అమాయకుడనుకోవాలా,  మగధీరుడను కోవాలా మీరేచెప్పండి  
 అన్నాడు ఆ కొడుతున్నాయన!! 
"ఎరా నిజమేనా ఆ పెద్దాయన చెబుతోంది??" అని అడిగారు చుట్టు చేరిన వాళ్లు!! 
"నిజమే" అంటూ తల ఊపాడు 
"ఇదెం పిచ్చి రా నీకు....ఇలాంటి బుద్ధులు కూడానా నీకు?" అని చుట్టు చేరిన వాళ్లు తిట్టారు!! 
"అది కాదండి...నేను...నేను..నేను.... 
దీపావళి శుభాకాంక్షలు....అని చెబుదామనే లోపు .. 
"దీపా" అని అనగానే .... 
ఒకటే ఉతుకుడు మొదలెట్టారండి !!" అని చెప్పాడు ,పాపం అమాయకం గా ...
అక్కడున్నా వారిలో ఒకడు అప్పుడే టపాలు పేలాయి 
ఆటంబాంబులు పేలుతాయేమో జాగర్త అన్నాడు 
అందులో ఒకడు వచ్చి ఈ ఆటంబాంబా, లేదా ఈ బాంబా 
అంటూ యాక్షన్ చేసి చూపాడు   

అందరూ ఒకటే నవ్వు  .............. 

Photo
ప్రాంజలి ప్రభ (నేటి హాస్యం -4 ) 

  
బ్రహ్మ చారి వస్తూనే 
ఏవండోయ్....ఏ విషయానికి ఆ విషయమే చెప్పుకోవాలి!! 
మీరు హాల్లో వున్నప్పుడు.... 
మీ శ్రీ మతి ని పేరంటానికి పిలవడానికి , వచ్చిన వాళ్ళతో ... 
అదే పని గా బాతాకానీ పేరు తో "సుత్తి ' కొడుతూ వున్నప్పుడు 

"ఏమండోయ్! ఓ సారి ఇలా వస్తారా " అన్న పిలుపు ... 

లోపలనుండి మీ శ్రీ మతి గారు పిలిచారూ...అంటె.. 
అక్షన్తులు పడ్డట్లేగా 
నీకు పెళ్లైతే తెలుస్తుంది ముద్దులో మొట్టికాయలో  
ఆ అంటూ లేచాడు బ్రహ్మచారి 

 --((**))--


ప్రాంజలి ప్రభ (నేటి హాస్యం -3 ) 


 ఏమోయ్ సుబ్బారావు మొగవ్వాళ్ళవి, ఆడవాల్లవి 
రెండు సమస్యలు చెప్పు 

మగవాళ్ళకి జీవితం లో పెద్ద సమస్యలు రెండే రెండు !! 

"ఒరేయ్....అప్పుడె బట్ట తల వచ్చేస్తోంది!!" 
"డైట్ ఎంత కంట్రొల్ చేసినా...పొట్ట వచ్చేస్తోందిరా, బాబూ!!" 
అని వాపోతారు నిజము కదా 
అవునవును అంటూ నవ్వాడు ..... ...   

మరి ఆడవాళ్ళైతే 

ఆడవాళ్ళకి జీవితం లో పెద్ద సమస్యలు రెండే రెండు !! 
"చర్మం ముడతలు పడుతున్నట్టుగా వున్నా యవ్వనంలా ఉండాలంటారు  
"ఏమండీ...నేనెలా కనిపిస్తున్నాను??...ముసలి వాలకం రాలేదు కదా??!"
మరి అడిగి కవ్విస్తారు 
అవునురా అవును అంటూ నవ్వుకున్నారు ఇద్దరూ   

--((**))--


ప్రాంజలి ప్రభ  (నేటి హాస్యం -2)  

ఏమండి అస్తమానము మీరు తాగాలా  
ఇంట్లో కూడానా
అవునే  
"ఇదేమిటీ????.... 
అద్దం ముందు కూర్చుని తాగుతున్నారు ...హవ్వ!! 
అదేదో బార్ లో తగలడెవారుగా?... 
ఇప్పుడు ఇలా మొదలెట్టారా??" అడిగింది 
"నీ లివరు పాడైపొతొన్దీ... 
కాస్త చూసుకుని తాగు...లేక పొతే డేంజర్ " అని డాక్టర్ గారు చెప్పాడే ,మరి !!" 
అన్నాడు 
ఆ  ....   ..   ఆ ...  ...  
ఉన్నా సుఖం లేదు 
ఏమంటున్నావు 
తిట్టుకుంటున్నాను 
ఎవరినే నిన్నే 
ఊళ్ళోవార్ని తిడితే ఊరుకుంటారా
నిన్నెవర్ణ అంటే నాతో  చెప్పు 
వారిని చెడుగు డాడుకుంటా
ని ప్రగల్బాలు నాకెందుకు తెలవదు 
ఎం తెలుసో చెప్పు 

తాగి పక్కింటికి పోయి 
ఒసేయ్ పెళ్ళామా రావే అన్నావు 
అన్నాను  
అంటే మొగడని చూడకుండా 
కారం కొట్టి రోకలబండ పెట్టి బాదాఁటమేనా  
సిగ్గు రాలేదు ఆ ఆడోళ్లకి 
ఎం చావాలి ఈ మొగిడిన మార్చడానికి  
ఎం చస్తావా చావ్ అంటూ కింద పడ్డాడు
ఆ....   ఆ ....          

--((**))-- 


ప్రాంజలి ప్రభ (నేటి హాస్యం -1 )
   నావు వస్తే నవ్వండి - నవ్వకపోతే తిట్టకండి  

ఎరా సుబ్బారావు బాగున్నావా?
నిక్షేపంగా ఉంటె ఏమిటి ఆ ప్రశ్న ? 
బాగున్నావుగా, నీకేం ప్రాబ్లమ్ లేవుగా ? 
ఏమిటిరా నీకు అనుమానమా ఆ...   ఆ...  అన్నాడు 
ఛీ  ఛీ   ఛీ అదికాదురా నా ఆలోచనా 
నేను 'ఎం' త్రాగలా నీకు నిజాలు చెప్పటానికి 
అన్ని అబద్దాలే చెపుతాను జాగర్త   
అయితే వెళ్ళొస్తా నిన్నడిగా ఫలితమ్ ఉండదు 
ఓమ్మో వీడ్ని మోసం చేయటం కష్టం
ఆంటూ జారుకున్నాడు పుల్లారావు.
    
అప్పుడే సుబ్బారావు పెళ్ళాం లోపలకు 
అడుగు పెట్టింది 
బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఇంటికి వచ్చింది!! 
"నేను ఎలా వున్నానో చెప్పండి.... 
రొడ్డు మీద అందరు నన్ను చూడ్డమె!!" అంది సిగ్గు పడుతూ!! 
"నిన్ను చూసె ధైర్యం ఎవడి కుందే నాకు తప్ప!!" అన్నాడు భర్త 
"ఈయన గారి స్టేట్మెంట్ లో ఏదో తేడా ఉందే...." అని అనుకుంటుండగా.... 
"ఇప్పుడె వస్తానుండు!!" అను సర్రున స్కూటర్ వేసుకుని వెళ్లి పోయాడు 
 సుబ్బారావువ్ 
ఎవ్వరినైనా మాటలాతో ఓడించవచ్చు కానీ భార్యకు ఎదురు చెప్పలెరుందుకు?   
ఆ .... ఆ ....  అవును ...... 
__((**))--