2, జూన్ 2017, శుక్రవారం

విశ్వములో జీవితం -10



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
 

కాలం మారుతున్నదా ?

కాలం మారుతున్నది, తెలివిగల వారు ఎక్కువగా కనబడు తున్నారు, అసలు తెలివి లేని వారెవరో తెలియుట లేదు, ఎవరిని కదిలించిన అందరు సలహా లిచ్చే వారే.

మౌన ముని అని ప్రచారం పొందిన ఒక స్వామీజీ ఒక ఉరి కొచ్చాడు అతని అందరితో చేతులు ఊపుతూ, కాగితము మీద వ్రాసి మరీ ఇస్తున్నాడు, ఆ ప్రకారముగా నడుచుకో మంటున్నాడు.
శిష్యుడు వచ్చి పందెం కాసాను " మిమ్మల్ని మాట్లాస్తానని" పలికాడు.          
దానికి ఆయన సమాధానం -
“ఓడిపోయావు!” అన్నాడు.

శిష్యుడు నేను ఎందుకు బ్రతికున్నానో  తెలుసా , మీరు నోరు విప్పి మాట్లాడుట  వళ్ళ .....      
బహు మానం గెలవటం వళ్ళ ......

అదే  రాష్టం లో కరువొచ్చింది అప్పడు శిష్యులతో గురువు చెప్పాడు, ఈ మూడు నెలలు మనం దేశాటన చేసి వద్దాం అన్నాడు. శిష్యులందరు కలసి భిక్షాటనకు బయలు దేరారు. అప్పుడే ఒకతను మీరు భిక్ష తిచ్చేదాకా కరువు ఆగుతుందా అని అడిగాడు.
అందరితో పాటు మేము బాధ పడకుండా, మరెవ్వరు బాధపడ కుండా ఉండేందుకే యజ్ఞాలు చేసేందుకు ప్రయాణ మవుతున్నాము ప్రక్క రాష్టాలకు,  స్వామీజీ మాటలకూ నోరు ఎత్త లేక పోయారు
ఇది కలి మాయ అని గొణుక్కున్నారు.   
       
“కర్త, కర్మ, క్రియ’లకు ఏదైనా మంచి ఉదాహరణ చెప్పండి?” అనడిగాడు గురువు శిష్యులతో.
 దానికి ఒక గడుగ్గాయి శిష్యుడు ఇలా చెప్పాడు సమాధానం:

“మీరు పాఠం సరిగా చెప్పడం లేదు.“ - ఇందులో “మీరు” కర్త.
“చెప్పకపోవడం” మా ‘ఖర్మ.’
సరైన గురువు మరొకర్ని వెతుక్కోవడం అనేది మేం చేసుకోవలసిన క్రియ.”

స్వామీజీ తో శిష్యుడు ఇప్పుడు పులి వస్తే మీరు ఏమి చేస్తారు? అని అడిగాడు. మీకు నమ్మకం కలగాలంటే ఏమి చేయాలి? అని అడిగాడు గురువు . 
ఆ పులి నోట్లో మీరు తల పెట్టాలి అన్నాడు.
పులి ఎక్కడ నుండి పట్టుకొస్తావు ? అని అడిగాడు గురువు.   
ఇప్పుడే సర్కస్ నుండి పులి తెస్తాను ? అని అన్నాడు, 
చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను
సమాధానము చెప్పండి ? 
పులి నోట్లో తలపెడితే ఏమైనా అయితే ఎలా ? 
 
చెప్పఁద విను మనెను 
నేను ఏమి అయినను నీవు మాత్రం గురువు కాలేవు అన్నాడు.
గురువుగారిని పరీక్ష పెట్టేందు ప్రయత్నం చేయకు, నీలో ఉన్నది నలుగురికి భోదించుము. ఆశకు పోయి ఉన్న విద్యను దుర్వినియోగము చేసావనుకో సర్వ నాశనమై పోతావు అన్నాడు.          
ఒక్క మాట ఆటో ఇటో అయినా మన బతుకు ప్రస్నార్ధకముగా మారుతుంది అన్నాడు గురువు .
శిష్యుడు గురువు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరాడు.
ఇది కలియుగం "స్వామీజీలకు లోటులేదు, భక్తులకు స్వామీజీలే తోడు".  


29, మే 2017, సోమవారం

విశ్వములో జీవితం -9***

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -9

దేవుడున్నాడా లేడా?

 ఇద్దరు మనుషులు దేవుడున్నాడా లేడా అని వాదించు కుంటున్నారు అప్పుడే మూడో వ్యక్తి వచ్చి మీ సమస్య ను క్షణం లో తిరుస్తాను అన్నాడు. మరి చెప్పేవే అన్నాడు. నాకు తైలం పడందే, లాభం లేనిదే ఏవిషయము బయటకు చెప్పొద్దన్నారు మాగురువుగారు అన్నాడు.

నీకు లాభం వచ్చే సలహా ఇవ్వలేము కానీ ఇంద తైలం అంటూ చేతిలో పెట్టారు. వెంటనే తైలం లో ఉన్నాడు దేవుడు అంటూ వెళ్లి,పోయాడు. అంటే అతని మాటలకు  అవాక్కయ్యారు.

చేసేది లేక వాళ్లిద్దరూ దగ్గర ఉన్న గుడికి వెళ్లి పూజారిని ప్రశ్నిద్దాం అనుకున్నారు, వెళ్లారు పూజారిని అడిగారు. నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాను ముందు అవి తీసుకురండి అన్నాడు. సరె అని అవి తీసుకు వచ్చి ఇచ్చారు వెంటనే దేవునికి నైవేద్యం పెట్టి తీర్ధం ఇచ్చి కొబ్బరిచిప్ప చేతిలో పెట్టి ఇక వేళ్ళ మన్నాడు. మేము అడిగిన దానికి సమాధానము చెప్పలేదు ఎందుకు అన్నాడు. 

ముందు ప్రాసాదం తినండి అన్నాడు, తిన్నారు.

ఇప్పుడు చెపుతున్న వినండి దేవుడు మీ డబ్బులతో ప్రసాదం కొనిపిచ్చి సగమే మీకు పెట్టాడు కదా అవును, అవును
మిగతా సగం లో దేవుడున్నాడు ఎందుకంటే అది అందరి కీ సమానంగా ప్రసాదాన్ని పంచుతాను అందరు దేవుని ప్రసాదం పెట్టాడు అను కుంటారు. మీలో దేవుడు ఉన్నాడు కదా ఇంత దూరం రాగలిగారు, దేవుడ్ని చూడగలిగారు  అన్నాడు పూజారి. 

పూజారి చెప్పిన మాటలు అర్ధం గాక బుర్రగోక్కున్నారు.

నడుస్తూ మరలా వాదించు కున్నారు అప్పుడే వారికీ ఓతాగుబోతు ఎదురయ్యాడు. త్రాగుబోతులు నిజం చెపుతారు అతన్ని అడుగుదామా అని అతని దగ్గరకు వెళ్లారు వారు.

బాబులు మీరు అడిగిన దానికి నిజం చెప్పాలంటే నాకు కిక్ తగ్గింది, కిక్ ఎక్కించండి అన్నాడు  అప్పుడు నిజం చెపుతాను .
వెంటనే దగ్గర ఉన్న షొప్ వద్దకు పోయి అతనికి కిక్ ఎక్కించారు.
    
కోట్లు ఖర్చు పెట్టి గొప్పగా పెళ్ళీళ్ళు చేస్తారు ఎందుకో చెప్పండి అన్నాడు.
అది వారి తాహతు తగ్గ వారని తలంచి పెళ్లి ఘనంగా చేస్తే నలుగురు మెచ్చు కుంటారని భావిస్తారు.
ఎలా సంపా ఇంచారో అనవసరం ఒక్క రోజులో కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఎంతో మంది బాగు పడ్డట్టేగదా .
అంటే (నగల షాప్ వారు, వస్త్రాలు షాపువారు, వంట వారు, కళ్యాణ మండపం వారు ఇంకా ఎన్నో ఎన్నో ) అప్పుడు వీళ్ళందరికీ దేవుడు కనిపిస్తాడు అన్నాడు

నేను అడిగిన దానికి సమాధానము చెప్పలేదు అన్నాడు.

అనవసరముగా నా సమయాన్ని వ్యర్థం చేసారు, నాకు కిక్కు ఎక్కించి నా ఆరోగ్యం పాడు చేశారు కనుక మీమీద కేసు పెడతా పదా పోలీస్ స్టేషన్కు అంటూ ఇద్దర్ని పట్టుకున్నాడు
మీకు దేవుడున్నాడా లేదో ఆ పోలీసులే చెపుతారు.

వదులురా బాబు వదులు మమ్ము బుద్ధి తక్కువై పని చేసుకోకుండా వీధిని పడి సమయాన్ని వ్యర్ధం చేసుకున్నాం

మాకు బుద్దొచ్చింది మమ్మల్ని వదులు మాకు నీలో దేవుడు కనబడు తున్నాడు అంటూ గుంజుకొని చేతులను వదిలించుకొని ఓదేవుడా మమ్ము రక్షించు అంటూ పరుగెత్తారు ఇద్దరు.  

అందమైన కలలు కంటాము అవి ఆచరణకు నోచుకోవు -  మనం చేసిన పుణ్యమే మనల్ని సక్రమ మార్గంలో నడిపిస్తుంది. ఒకరు వేలెత్తి చూపని జీవితాన్ని దేవుడే కల్పిస్తాడు  ఇదే నా నమ్మకం - నమ్మకం మీద జీవిస్తే మన:శాంతి తో ఆరోగ్యంతో దైవధ్యానంలో ఉండగలుగుతారు.                  
                             

విశ్వములో జీవితం -8

ॐ श्री राम - श्री मात्रे नम :
విశ్వములో జీవితం -8
ప్రాంజలి ప్రభ. కల్పన
ఎవరనుకోవాలి, ఏమనుకోవాలి నా మనసును దోచిన వారెవరో, ఆకర్షించిన వారెవరో, ద్వేషించిన వారెవరో తెలుసుకోలేని వయసు నాది, అయినా ఎక్కడో నా మనసు లాగుతున్నది, అది ఎందుకో తెలియుట  లేదు. ఎందరినో ఆకర్షించు తున్నది, ఎన్నో ఎన్నెన్నో మాటలు నేర్చుకోవాలని ఉన్నది, మృదు మధురంగా పలకాలని ఉన్నది. అందానికి  దాసోహం అవ్వాలా, ప్రేమ చూపులకు లొంగి పోవాలా, వయసు ఎదుగు దలకు అవసరమా, అనే ఆలోచనలు యవ్వన వంతులను వెంబడి స్థాయి. 

కధలో కావ్య సుందరి వర్ణనలకు లొంగి పోతామా, ఆవే ఆలోచనలతో నిద్రలో కూడా కలలుగా మారుతాయా ?

ఊహల్లో చిక్కి వాస్తవాన్ని గమనించ లేక పోవుటకు నాకు వయసే కారణమా?

స్వశ్చముగా పరిమళించే మల్లికను చూసినా
  ఆకు పై చలిస్తున్న ఆని ముత్యము చూసినా,
చెంత చేరి సేద తీర్చే స్వాతి ముత్యమును చూసినా, 
తీయని ఓదార్పు తో కనుల చూపులు చూసినా 
మది గదిలో కల్లోలం ఏర్పడుటకు కారణము ఏది, ప్రకృతి పరవసాన్ని ఆస్వాదించి అనుభవించుటకే కదా ఈ వయసు ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఎందుకు ?     

తీయని ఓదార్పు వెచ్చని కన్నీటి బొట్టు, మనసును తొలచి వేస్తుంది.  నా ఆలోచనలు ప్రేమగా మారుతున్నాయి, ప్రేమ అంటే ఏమిటో ఇప్పుడే తెలుస్తున్నది.  

ప్రేమ ఊహ అయితే, ఆ  ఊహకు సాక్షం నీవు 
ప్రేమ తలపు నీవే అయితే,  నా ఊపిరి తలపులు నీవు
ప్రేమ మధుర భావము అయితే, నా భావానికి భాష నీవు 
ప్రేమ కమ్మని కల  అయితే, నా కలకు కల్పన నీవు  
ప్రేమ రాగం అయితే, ఆ రాగాన్ని మీటే స్పందన నీవు  

నీ ఆలోచనలో అంతరంగంలో పెనవేసి, మదికి చల్లని చందన లేపనం అద్దుతున్న ఎవరు నీవు,
పారిజాతల పరిమళంలా నను చుట్టేసి చిత్రంగా నవ్వుతున్న ఎవరు నువ్వు, చూపులకు చిక్కక, నవ్వులు కురిపిస్తూ గాజులు శబ్దం వినిపిస్తూ ముఖం కనబడక ముసుగులో నన్ను ఊరడించి, ఉడికించి, హెచ్చరించి, నన్ను వదిలి పోలేవులే, వయసు ఉడుకు చూపు దామనుకున్నా ఆ సమయము రాలేదని తెలుసుకొని చూసి చూడనట్లుగా పోతున్నావు నీవు,  నన్ను కూడ కదులు అనే భావపు చూపులు చూపావు.          

అప్పుడనుకున్నా దివి నుండి భువికి నాకోసం జాలువారిన చంద్రోదయానివా,నా చేయి వీడని అమృత బంధానివా..నాకల సుందరివా అనుకోవటం టప్ప ఏమి చేయలేను నేను.

ఆకాశములో పక్షి ఎగురుటకు రెక్కలు ఎంత అవసరమో, పురుషునకు విషయ జ్ఞానము, ఓర్పు అంత న్నా ఎక్కువ అవసరము     


విశ్వములో జీవితం -7

om sri raam - sri maatrenama:
విశ్వములో జీవితం -7  
ప్రాంజలి ప్రభ - సమస్య
నా కష్టాన్ని సమస్యలను, ఎన్నడూ ఎవ్వరికి తెలిపను, నేను చేసేది నిజాయితీగా ఉండాలి, ధర్మం తప్పకుండా ఉండాలి అనుకునేవాడిని, అప్పుడే అనుకోని విధముగా నాలో ఉల్లాసం, ఉత్సాహం వస్తుంది, అప్పుడే నాకు తెలియని శక్తి నన్ను నడిపిస్తున్నదని తెలుస్తున్నది. కష్టాలు భగవంతుడు కల్పిస్తాడు. మంచి మాటతో, శక్తి తో కష్టాలు తొలగించుకో మన్నాడు    

నేను మట్టిని నమ్ముకున్నాను, మట్టినుండి ఖనిజాలను తీసి వ్యాపారం చేస్తున్నాను, మట్టి యందు  పంట పండించి అన్నము అందరికి దొరికేలా చేస్తున్నాను, అనుకోని విధముగా నాకు పెరిగిన సంపదను నలుగురికి పంచాను, సంపదున్నా  లేనివాడినై ఇతరుల  హృదయంలో సంతోషం చూడాలని సంపదతో సహకరిస్తున్నాను. అందుకే భగవంతుడు మట్టిని అందించాడు. మానవులు బుద్దితో మట్టిని బంగారము చేసుకో మన్నాడు.         

పిరికితనం అంటే నాకు తెలియదు, ఎటువంటి సంఘటనలను సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉన్నది, సంపద ఉన్నది, దానికి తోడు సాహసాలు చేసే ధైర్యం ఉన్నది. ప్రమాదాలు ఎన్నిఎదురైనా గుండె నిబ్బరముగా, దైర్యంగా ఎదుర్కొనగలను,  సముద్రంలో చిక్కినా వడ్డుకు చేరగలను , అంతరిక్షము లో వదిలినా తిరిగి రాగలను, అందుకే భగవంతుడు ప్రమాదాలు కల్పిస్తా డు ధైర్యంతో ఎదుర్కొనే శక్తి ధైర్యం మానవులకు ఇస్తాడు.           

మనం ఎ0దరినో కలుస్తాం, మ రెందరివో  సలహాలను పాటిస్తాం, మనం చేసే పనిలో పటుత్వం కోసం అందరి సహాయ సహకారం ఆరాధిస్తాం, మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోవటం చేతకావాలి. దేవుడు కల్పించిన అవకాశమును బట్టి నీవు పొందాలను కున్న, వరాలు పొంది దుర్వినియోగం చేయక జీవించ మన్నాడు.           

ప్రేమ ఎక్కడుంటుందో, ఎలాఉంటుందో, ఎవ్వరు చెప్పలేరు, చూపలేరు అప్పుడే భగవంతుని కోరాను ఆపదలలో ఉన్నవాడి వద్దకు నన్ను పంపాడు, వాడిని రక్షించాను, అతని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గమనించాను కల్ముషము లేని ప్రేమతో పలికాడని తెలుసుకున్నాను. అతని కళ్ళవెంబడి నీరు ఆనందబాష్పాలు నన్ను కూడా కన్నీరు తెప్పిచ్చాయి.

సమస్యలను ఎదుర్కొనుటకు ప్రతిఒక్కరు కొంత విద్యను సంపా  దించాలి, అవిద్య వళ్ళ సమస్యలను సులభ మార్గమున తీర్చుకు తెలివి నుపయోగించాలి.  
--((*))--         

28, మే 2017, ఆదివారం

విశ్వములో జీవితం -6

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


విశ్వములో జీవితం -6  
ఆశ -పాశం
జీవితమ్ లో మనం అనేక సంఘటనలు చూస్తాము. అనేక మందిని కలుస్తాము, స్నేహాన్ని పెంచు కుంటాము. మన శరీరాన్ని జాగర్త 
చేసు  కుంటూ జీవిస్తాము.
    
ఒకనికి డబ్బు వయసు ఉన్నదని నలుగురు భార్యలు పెళ్లి చేసుకున్నాడు ముద్దుగా పద్మిణి, రాగిణి, కామిణి మోహిణి అని పిచుకొనేవాడు వారిని ఎంతో ప్రేమగా చూసు కుంటాడు, వయసు ఉడికిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పుడు భార్యలు కూడా చూడటం తగ్గించారు ఎందుకు ?
నాల్గవ భార్య వద్దకు చేరి నేను సుఖ పెట్టలేనుగా కొంత డబ్బు తీసుకోని వెళ్తావా, నాతో జీవితాతం ఉంటావా అని అడిగాడు?     
మీ అందాన్ని చూసాను ఆనాడు, అది ఇప్పుడు నాకు కనబడుట లేదు, నన్ను చూసే కళ్ళే నీకు   కనబడుట లేదు, శరీరము సహకారించుట లేదు, మిగతావారు నీకున్నారు నా బతుకే ఎడారి కాకుండా నీవే మార్గం చూపు అన్నది నాల్గవ భార్య.   


అర్ధం చేసుకొనే తత్త్వం తో చెపుతున్నా, బలవంతంగానో హింసతోగానో ప్రేమ పొందటం సాధ్యం కాదు,
నీ  ఆలోచనలకు నేను అడ్డురాను, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు. నీమాట గౌరవించటం తప్ప  ఏమి చేయవలనో నీవే చెప్పు అన్నది . 

మూడవ భార్య వద్దకు పోయి నేను నీకోసం ఎంతో ఖర్చు చేసాను, నీవు కోరిందల్లా కొని పెట్టాను, ఈ వయసులో నాకు తోడుగా ఉండి సేవలు చేస్తావా అని అడిగాడు. ధనం మీకు ఉన్నది, ఎవరు సేవలు చేయమన్నా చేస్తారు నేనే చేయాలా?
నీ సంపద చూసి నేను నీదగ్గర చేరాను అది క్రమేపి కరిగి పోతున్నది. నాకు న్యాయం చేసే భాద్యత నీ మీదే ఉన్నది, నీవు ఆటో ఇటో అయినా వనుకో నా బ్రతుకు ప్రస్నార్ధకం అవుతుంది, ముందు అది తేల్చండి ఆ తర్వాత మీకు సేవలు చేస్తానో చేయనో తెలుపుతాను అన్నది. ఆశ ఎన్నటికీ హితవు కాదు శాంతి ఎప్పటికి చేటు కాదు, నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

రెండవ భార్య వద్దకు పోయి  ఇదే విధముగా అడిగాడు, బంధు
వుల ప్రోత్సాహముతో నాకు వేరే మార్గము లేక నీతో కలిసాను, ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అన్నది. నా సహాయము ఎప్పుడు నీకు ఉంటుంది అన్నాడు.

మొదటి భా
ర్య వద్దకు పోయి నీకు అన్యాయం చేసాను నన్ను క్షమించ గలవా అన్నాడు. నేను ఎప్పుడు నీకు దాసిని, నన్ను క్షమాపణ అడగకండి, నేను నీ సుఖం కోసమే సర్వస్వం అర్పించాను, నాలో ప్రేమ లేదని వేరొకరిని ఆశ్రయించిన నోరెత్తకుండా నీకు సేవలు చేసే ధర్మ పత్ని నండి, నీమాట ఎప్పటికీ జవదాటను నీ అనారోగ్యమే నా ఆరోగ్యము  మీతోపాటు నరకమునకు రమ్మన్నా వస్తాను అన్నది.                            
       
ధనముందని ఆశ పడ్డ, యవ్వన ముందని స్త్రీలను వివాహమాడిన వయసు పెరిగిన తర్వాత ఆదుకునేది ఒక్క భార్య మాత్రమే.  

మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్లు,  భార్యలు ఎక్కువైతే వత్తిడి ఎక్కువైనట్లు, దిగుడు బావిలో నీటిని నాచు కప్పి వేసినట్లు, నిమ్మ చెట్టు మొదలు తొలగించిన జల సంసర్గమువల్ల పెద్ద చెట్టు అయినట్లు, స్త్రీ వ్యామోహంలో చిక్కిన ఎవరైనా జీవితంలో ఎదగలేనట్లే. ఆశాపాశానికి చిక్కకు అభాసుపాలు కాకు, సిరి ఉన్నదని స్త్రీలను కలిస్తే అనారోగ్యము రాక ఆరోగ్యము ఎలావుంటుంది.   
--((*))--



27, మే 2017, శనివారం

విశ్వములో జీవితం -5

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
విశ్వములో జీవితం -5  భార్యను బట్టి భర్త.

ఏమండి ఎందుకు అంత తొందరగా పరిగెడుతున్నారు, అంత డబ్బు తీసుకోని వెళుతున్నారు, ఎక్కడికి అని అడిగింది భార్య . నీకు ఎన్నో సార్లు చెప్పాను వెళ్ళేటప్పుడు అడగవద్దని అని బయటకు నడిచాడు.
అప్పుడే గురువు ఎదురయ్యాడు, నమస్కారం గురువుగారు అన్నాడు. నేను మందుల షాపు వద్దకు పోతున్నాను, ఆరోగ్యంగా ఉ
న్నావుగా ఎవరికీ మందులు , నాకే సార్ మన:శాంతి కోసం మందు తెద్దామని పోతున్నాను అన్నాడు.

గురువుగారు నీవు అమాయకుడిలా ఉన్నావు, ఇలా కూర్చో నేను చెప్పేవి విను అన్నాడు.

మనలో ఇష్టాన్ని మన: స్పూర్తిగా మనల్ని నమ్మైనవారికి చెప్పుకుంటే, అవతలవాని మనస్సు అర్ధం చేసుకో గలుగుతావు, 
నీ మనసు ప్రశాంతముగా ఉంటుంది  .
ప్రేమగా అక్కున చేర్చుకో కలిగితే ఇరువురి మద్య అనురాగం రెట్టింపు అవుతుంది.
కష్ట నష్టాలల్లో నేను నున్నానని తోడును గౌరవించు కోగలిగితే, మనస్సు ఉల్లాసంగా
ఉత్సాహంగా మారుతుంది.
భాగస్వామితో మాటలు పంచు కుంటూ, భాద్యత
ను  పంచుకుంటూ, ఎవరు గొప్పా అని ఆలోచించ కుండా, తప్పులను బలహీనతలను భూతద్దంలో చూడక ఒకరికొకరు క్షమాపణలతో మనస్సు కలత  చెందకుండా ఆరోగ్యమైన నవ్వులమధ్య సాగి పోవటమే నిజమైన జీవితం అన్నారు. 

అర్ధం లోని పరమార్ధాన్ని గ్రహించ కలిగితే నిత్యమూ శాంతిమయం
పోరు బాటలో నడవద్దు, మౌనంగా శాంతి బాటలో నడిస్తే ఆరోగ్య దాయకం

గూటీకి చేరిన భర్తను శాంతి వచనాలతో పలకరించి సంతోష పెట్టాలి
భార్య .
వాద ప్రతివాదానలకు దిగినా క్షణావేశానికి లోను కాకుండా మంచో చెడో  గమనించి ఓర్పతో ఓదార్పు చూపటమే మానవుల లక్షణం అని గమనించాలి.

టీచర్ గారు ఇంటి కొచ్చేంగానే భార్య మంచిగా గౌరవించక, "నాకేం క్లాస్ చెప్పనక్కర్లేదు ' లోపలకు దయచేయండి అంటే ఎట్లావుంటుంది?
ఇంజనీర్ ఎండలో దగ్గరగా ఉండి కార్మికులద్వారా పనిచేయించి ఇంటికి వస్తే భార్య "ఎందుకండీ ఆ ప్లాన్లు అన్నీ నామీద ప్రయోగిస్తారా " అంటే ఎలా ఉంటుంది ?
జడ్జిగారు కోర్టులో లాయర్ల మాటలు విని తీర్పు చెప్పి ఇంటికి వచ్చి  భార్యను
ముద్దుకు పలకరిస్తే వాయిదా అని మీ మాటలు మీకే చెపితే ఎలా ఉంటుంది ?
డాక్టరుగారు రోగులను రక్షించి ఇంటికి వస్తే భార్య మీ రోగం ఎలా కుదర్చాలో నాకు బాగా తెలుసు అంటే ఎలా ఉంటుంది?                                                       
పైలెట్ ఉద్యోగ
ము  ఆయిన తర్వాత ఇంటికి చేరగానే భార్య మీరు ఎగిరే విమానంలో పనిచేసినా నాముందు ఎగరకండి అంటే ఎలా ఉంటుంది?
న్యాయవాది కోర్టులో వాదించి ఇంటికి చేరగానే భార్య భగవద్ గీత పట్టుకొచ్చి అంతా నిజమే చెపుతా అబద్దం చెప్పను అని చెప్పించి లోపలకు రమ్మంటే ఎలా ఉంటుంది?   
నటుడు చిత్రంలో నటించి ఇంటికి చేరగా భార్య మీరు అక్కడ నటించండి నావద్ద మాత్రం నటించకండి అన్నప్పుడు ఎలా ఉంటుంది?.  
సాఫ్ట్ వేర్ ఉద్యోగము నుండి ఇంటికి చేరగా భార్య వైరస్ బుద్దులు నావద్ద చూపకండి నేను అస్సలే యాంటీ వైరస్ను అంటే ఎలా ఉంటుంది?
పూజారి గుడిలో పూజచేసి ఇంటికి చేరగా భార్య దక్షణ ఇంతేనా, ప్రసాదమింతేనా అంటే ఎలా ఉంటుంది ?
రాజకీయనాయకుడు ఉపన్యసించి ఇంటికి చేరగా భార్య మీ ఉపన్యాసం నాకు చెప్పకండి ప్రజలు నమ్ముతారేమోగాని నేను నమ్మను అంటే ఎలావుంటుంది?
పై నుదహరించిన భార్యలు, ఇంకా ఎందరో  భర్తలను ఆటపట్టించుటకు ఛలోక్తిగా మాట్లాడిన మనసు నొచ్చుకోకుండా భర్తలు భరించటం లో ఉంటుంది శాంతి. .
భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త ఒకరి కొకరు అర్ధం చేసుకొని జీవించాలి గాని పంతాలు పట్టింపులు ఎప్పుడు పనికిరావు.   
గురువుగారు మీరు చెప్పిన విషయాలు నాకు బాగా తెలిసినాయి,
ఇంటికి వెళ్లి నాతప్పు తెలుసుకొని ప్రేమను నా శ్రీమతికి పంచి ఆమె ప్రేమను పొంది మన:శాంతిగా బతుకుతాను.
గురువుగారు " తధాస్తు " 

--((*))__   
 

విశ్వములో జీవితం- 4***

 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: Exploring the Science of "Sleeping Hot" 
విశ్వములో జీవితం- 4
నిద్ర 
మనకు ఆరోగ్యాన్ని పెంచేది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేది ఏమిటో తెలుసా ?
ఆలోచనలు ప్రక్కకు నెట్టి, కోరికలను కూడా మరచు నట్లు చేసేది సుఖ నిద్ర. 
   
నిద్రకు అనుకూలమైన పరిస్థితులు మనమే కలగచేసుకోవాలి, వెన్నెలలో, చల్లటి గాలిలో అరుగు దొరికితే హాయిగా నిద్రపోవచ్చు. నిద్రపోతున్నప్పుడు చెమట పడుతున్నది, కలవరింతలు వస్తాయి, గురక వస్తున్నది ఇవి ఎందుకొస్తాయి ఒక్కసారి ఆలోచిద్దాం.

ముందుగా మనం నిద్రపోయే ప్రదేశము శుభ్రముగా ఉంచుకోవాలి, దుప్పటి దులుపుకొని సరిగా మంచముపై పరచుకొని,  తలక్రింద సరిఅయిన దిండు పెట్టుకోవాలి       
1/20 వ మందంతో ఉన్న మిలియన్ల కొద్దీ ఫైబర్స్తో, కాస్పర్ దిండు మీరు నిద్రించే విధంగా అనుగుణంగా రూపొందించబడింది. మీ జిజ్ఞాసను ఆలోచనను మరచు నట్లు చేస్తుంది. 

జంట ఉన్నప్పుడు ఒకరకంగా నిద్ర ఉంటుంది, జంట ఉన్నప్పుడు మెలి కలయికతో సుఖ నిద్ర ఉంటుంది.  జంట లేనప్పుడు మరోరకంగా నిద్ర ఉంటుంది. ఆలోచనతో ఎదో కొరత ఉన్నట్లు భావిస్తారు, ఎదో మనసులో వెళితే ఉంటుంది, ఎదో చూద్దాము అని వేచి ఉండి కళ్లకు శ్రమ వచ్చేదాకా వేచి ఉంది నిద్రపోతారు. 
పడుకునేముందు కడుపు నిండా నీరు త్రా గండి, లేదా పాలు త్రాగి పడుకున్నట్లైతే ఇంకా మంచిది. దూది పరుపు దిండు శ్రేయస్కరమైనది. ఆధునిక పరికరములు ప్రక్కన పెట్టుకొని నిద్రకు అంత మంచిది కాదు (సెల్ల్, ఎలక్ట్రిక్ పరికరములు దగ్గర్లో ఉంచకూడదు)           

ఎలక్ట్రిక్ లైటింగ్, టెలివిజన్, ఇంటర్నెట్ మరియు కెఫిన్ వంటివి అన్నింటిని విలాసవంతులకు ముందు రోజులు పోలిస్తే నిద్రపోయే సమయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, మూడ్ డిజార్డర్స్ మరియు ఇతర ఆధునిక రోగాల పెరుగుదలకు ఈ విధమైన నిద్ర లేమి కొన్నిసార్లు బాధ్యత వహిస్తుంది.

మనం నిద్ర పోతున్నప్పుడు మనకు ఏమి తెలియదు, కొందరు ఒంటి కన్నుతో నిద్రపోతారు (భల్లూకం లాగా) మరికొందరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు, (చేపలాగా) కొందరు లేచిన తర్వాత ప్రక్క వారిని నిద్రపోకుండా చేస్తారు. కొందరికి నిద్రలో స్వర్గ సుఖాలు అనుభవించినట్లు, మరికొందరికి నరకములో ప్రవేశించినట్లు కలు వస్తాయి. అది మానసిక వత్తిడి అని నా భావము. 

జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ 'నేను', 'నాది' అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తుంది. ఇది అంతా సుఖ నిద్రలో జరుగు తుంది. 

కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడు వంచనలకు, మార్పులు చెందుటకు కారణ మగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణ మగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి. సాత్విక గుణం తో మానవులు ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని ఉండదు, ఆలోచనకు తావు ఉండదు. సుఖమును పంచే తనువుకు విశ్రాంతి కలుగుతుంది.      
   --((*))--