13, ఆగస్టు 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - 7 స్వాతంత్త్ర్య దినోత్సవం (15-08-2015)

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - 7
స్వాతంత్త్ర్య దినోత్సవం  

సర్వేజనాసుఖినోభవంతు 

దాస్య సృంఖలాల నుంచి - కాంతి పథం వైపు పయనించిన రోజు 
పరపీడన పాలన నుంచి - ప్రజాసామ్యం ఉదయించిన రోజు
 అమరవీరుల త్యాగఫలం నుంచి - ఉద్భవించిన రోజు 
అహింసాయుధముగా ఎంచి - గాంధి మహాత్ముడు సాధించిన రోజు 

విదేశీ వస్తు భాహిష్కరణ - సహాయనిరాకరణ 
ఉప్పు సత్యాగ్రహం వలణ - క్విట్ ఇండియా ఉద్యమాల వలణ 
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు- ఆనందం వచ్చిన రోజు 
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం -రేపరేపలాడిన రోజు 

మూడు రంగుల జండ - ముచ్చటగా ఎగిరింది 
కాషాయం - ఎల్లరలో త్యాగాన్ని నింపుతుంది 
తెలుపు - ఎల్లరులో ప్రేమను నింపుతుంది 
ఆకుపచ్చ - ఎల్లరలో మానవత్వం నింపుతుంది 
అశోక చక్రం - ధర్మానికి సౌర్యానికి నిలయమైనది 
అవినీతిపరులను ఎదిరిద్దాం - స్వేచ్చ సమాజాన్ని ఏర్పరుచుకుందాం
స్వతంత్రానికి అర్ధం చాటుదాం - 
కలసికట్టుగా భారతమాతను గౌరవించుదాం 

                                      

1INDEPENDENCE DAY  (స్వాతంత్ర దినోత్సవం)

మన దేశానికి ఉన్న ఘనమైన చరిత్ర ఆధ్యాత్మిక సంపద  "వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, రామాయణము, మహాభారతము వెలసి ఉన్న ఈ దేశం " శివాజి, రాణాప్రతాప్, పల్నాటి బ్రహ్మనాయుడు, అక్బర్   పరిపాలించిన దేశం, బుద్దుని భొదలు, ఏ సు ప్రబువు  ఆశయాలు, అనేక మతాలను ఆదరిస్తున్న దేశం, ఆది శంకరాచార్యులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రాఘవేంద్రస్వామి,  వంటి  వారి ఆద్యాత్మిక వారసత్వం పొందిన దేశం, భాస్కరుడు, వరాహమిహురుడు వంటి గొప్ప శాస్త్ర వేక్తల  ఆవిష్కరణలు. భారత దేశాన్ని ఆధునీకరణ  చేయుటకు, ఎందఱో మహానుభావుల కృషి ఫలితముగా దేశం అభివృద్ధి చెందింది.
ఇంకా అభి వృద్ధి చెందాల్సిన పరిస్తితి ఉన్నది

స్వాతంత్ర్య దినోత్సవం--మన దేశానికీ పరుల పాలన/ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆగష్టు పదిహేను (August 15) భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు పదిహేనున భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది.దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.

ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మా గాంధీ.. 
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము , అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న గాంధీజీని స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్మరించుకుందాం.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...!

                                               


దేశ  స్వాతంత్ర వేడుకలను (ఆగష్టు -15 - 2014)  డిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసి ప్రజల నుద్దేసించి, ప్రధాని, రాష్ట్రపతి సందేశాలు అందిస్తారు. అదేవిధముగా హైదరాబాదులో, గోల్కొడ కోటపై   తెలంగాణ   గవర్నమెంటు జాతీయ పతాకము ఎగుర వేసి ముఖ్య మంత్రి .గవర్నర్ ప్రజలకు సందేశాలు ఇవ్వటం హర్షణీయం.

కులమతాల కతీతముగా అన్ని ప్రాంతాలలో, ముచ్చడైన మువ్వన్నెల జండాను ఎగరవేసి వందన సమర్పణ చేయుదురు. నేను భారత దేశాన్ని ప్రమిస్తున్నాను అంటూ పలు పట్టణాలలో జండాలు పట్టు  కొని ఊరెగడం, వింత వేషాలు వేసి జండాను అవమాన పరుస్తున్నారు కొందరు, కొందరు జండాలు ఎగురవేసి  పిల్లలకు పెద్దలకు స్వీట్సు పంచుకుంటూ సరదాగా కాలం కడుపుతారు.

ఎందఱో మహానుభావుల త్యాగ ఫలితముగా భారతదేశము  ఆవిర్భవిమ్చిమ్ది.

ఈ దేశాన్ని మనం పరిమళాలు వెదజల్లే పుష్పంలాగా, అమృతం పంచె  ఫలములాగా, ప్రతిఒక్కరి మనసు ప్రశాంతముగా ఉండేందుకు, దేశ సౌభాగ్యానికి ప్రతిఒక్కరు చేయవలసిన కొన్ని పనులు  ఇందు ఉదహరిస్తున్నాను.  దేశ పురోభివృద్ధికి అందరు పాటు పడాలనేది నా ఆకాంక్ష

ఒక్కక్క కుటుంబములో ఇద్దరు, ముగ్గురు పనిచేస్తూ, ధన సంపాదన పెంచుకుంటూ విలాస వంతమైన జీవితము గడుపుతున్నారు. ఆ విలాసాలు తగ్గిమ్చి కొంత ధనమును, నిరుపేదలను ,అనాధలను, ఆదు కున్నప్పుడే నిజమైన దేశ భక్తులు.

విద్య అనేది ప్రస్తుతము కొనుక్కొనే పద్దతిలో ఉన్నది. దీనికి ధనవంతుల  బిడ్డలను మత్రమే చదివిమ్చగలుగుతున్నారు, బీదవారు రెక్కలు ముక్కలు చేసుకొని, కష్ట పడ్డా  తమ బిడ్డలకు అన్నము పెట్టలేక పోతున్నారు, ఇక పిల్లలను ఎలా చదివిమ్చగలుగుతారు,

కొందరు విద్యావంతులు గ్రామాలకు  పోయి చదువులేని విద్యార్ధులను సేకరించి, వారికి ఉచిత విద్యను కల్పించి, వారి కల్లల్లో తలుక్కు మనే ఆనందాన్ని చూసే విధముగా చేసినవారే నిజమైన దేశ భక్తులు.

మన ఆరో గ్యానికి కాపాడుకోవటానికి పౌష్టిక ఆహారం ,వ్యాయామం, వ్యాధి గ్రస్తులమైతే తగిన మందులు వాడి రోగ విముక్తులవుతాము .

మనదీశంలో కోన్ని గ్రామాలల్లో ఇప్పటికి వేద్యానికి నోచుకోలేక వ్యాధి గ్రస్తులై మరణిస్తున్నారు. ఎ రోగము వచ్చిన లంఖనమే మందని మంచం మీదె ఉండి  పోతున్నారు.

కొందరు వైద్యులు కలసి కొన్ని గ్రామాలు దత్తత  తీసుకొని ప్రజలకు ఆరోగ్య పరిక్షలు చేసి వారికి తగిన మందులు ఇచ్చి సహాయ పడినవారే  నిజమైన దేశ భక్తులు.

మన ఇంటిని సుబ్రముగా ఉంచుకోనుటే కాదు, మన ప్రక్కవారి ఇంటిని కూడా  సుబ్రముగా ఉంచుటకు సహకరించాలి, మన వీధి పరిసుబ్రత మన అందరి ఆరోగ్యానికి మూలకారణం. దుర్ఘంధం మీద ఎంత అత్తరు చల్లిన వాసన పోనట్లు, దుర్ఘంధమనేది లేకుండా, దోమల బారి పడకుండా జాగర్త పడినవారు నిజమైన దేశ భక్తులు  

రెడ్ క్రాస్ వ్యవస్థ చాలా అద్వాన్నముగా ఉన్నది. వీరు కేవలము బ్లడ్ బ్యాంకులు గా ఉన్నాయి, దేశ ప్రజలకు అవసరానికి ఆదుకొనే విధముగా  పరిధిని పెంచాలి , కేవలము నెంబర్ షిప్ లు చేర్చుకొని సభ్యులను పెంచుతున్నారు కాని వారిని అన్ని విధాల ఉపయోగిమ్చుకున్నప్పుడే నిజమైన దేశ భక్తులవుతారు.
 

రక్షక భటులు చాల ఓర్పుగా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయుటకు తీవ్ర కష్ట పడుతున్నారు, దొపిడిలు, దొంగతనాలు పెరుగుతున్నాయి, వాహనాలు వేగముగా నడుపుతున్నా పట్టిమ్చుకోవటములేదు,  లంచాలను ఆశించక ధర్మమార్గమున దేశానికి సేవ చేస్తారని  నాకు చాల నమ్మకమున్నది, దేశాన్ని పూర్తిగా రక్షించే భాద్యతలు రక్షక భటులపై ఉన్నది
భారతదేశ ప్రతిపౌరుడు "నేను నాదేశం కోసం పనిచేస్తున్నాను, నాదేశం సమృద్ధిగా ఉండాలి, సేవాతత్పరత, అంకితభావం, క్రమశిక్షణ, అలవరుచుకోవాలి.
ప్రతిఒక్కరు మనం పుట్టిన  మట్టిని సృసిమ్చి నమస్కరించి, మన కన్న తల్లి ఆశీర్వాదముతొ దేశసేవ  చేయాలన్నది నాభావన.
అందుకే అన్నారు కవులు "జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్పదని .
ఇకమత్యమే మహాబలం అనే సూక్తి ప్రకారము కుటుంబమంతా శంఘీభావమ్తొ, ఒకే సంకల్పంతో ఉన్న కుటుంబాన్ని ఎవ్వరు వేరుచేయలేరు, అదేవిధముగా ప్రతిఒక్కరు కలసుకొని అధర్మాన్ని ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టండి .దేవతలు ఏక మనస్సు కలవారగుట వల్లన హవిస్సులు పొందగలుగు తున్నారు,  అందుకే మానవులు వివిధ దేవతలను పూజిమ్చిన దేవతలందరూ ఒకే మనసు  కల్గి ఉండుట వలన అందరిని ఆదుకొన గలుగుతున్నారు. ఈ రోజు తిరుమల తిరుపతి పై సూర్య భగవానుడు చుట్టు వృత్తాకారముగను లోపల అనేక రంగులు కనిపించటం సుభసూచనమ్
"భారత మాత హృదయ సామ్రాజ్యాన్ని గెలుచుకోనేమ్దుకు  పోరాటం జరుపుతున్న వీర సైనికులం మనం, మనకు శక్తి ఉన్నంతవరకు ప్రజాసేవచేయుటయే ప్రధాన కర్తవ్యం అని ప్రతిఒక్కరు ప్రమాణము చేయాలని నా ఆకాంక్ష.                  





జాతీయ పతాకము ఎగురవేసి వందనం సమర్పించుదాం    
భరతమాత ముద్దు  బిడ్డలుగా జాతి గౌరవం కాపాడుదాం
కుల మతాలకు  అతీతంగా  కలసి   మెలసి బ్రతుకుదాం
దేశంకోసం త్యాగంచేసిన వారిని గుర్తు చేసుకొని జీవిన్చుదాం            


 గాలిలో, నీటిలో, ఉండే కాలుష్యాన్ని తోలగిమ్చుదాం
ఆకలికి అలమటించే అనాధులను  ఆదు  కుందాం
ప్రతిఒక్కరము  దెశపురోభివృద్ధికి సహకరించుదాం 
అందరం నవ్వుతూ అందరిని  నవ్విస్తూ బ్రతికేద్దాం

భూమి పాదాలను నమస్కరించి భూమిని సాగు చేద్దాం
అందరి హృదయాలలో తృప్తిగా  ఆనందాన్ని నింపెద్దాం
య్యజ్ఞాలను చేసి మేఘాల ద్వారావర్షాలను కురిపిద్దాం
పాలబుగ్గల పసిపాలను నవ్వులతో,కేరింతలతో ఆడిద్దాం

జ్ఞాన సముద్రాన్ని నలుగురికి పంచేద్దాం
ప్రకృతి ఆనందాన్ని అందరకీ  పంచేద్దాం
అణచివేతపై ఓర్పుతో సమాధానం చెప్పేద్దాం
పిడికలుబిగించి దేశం కోసం నడుంకట్టి జీవిద్దాం

ఇంటర్నెట్ వెబ్ లో దేశం గురించి  తెలుసుకుందాం
మెల్సుగా, చాటగా, ప్రజల సమస్యలను పరిష్కరిద్దాం
పేస్ బుక్ లో సంగీతస్వరాల విని ఆనందిమ్చుదాం
టచ్ స్క్రీ న్ ద్వారా పిల్లలకు ఆటలుఆడించి సంతోష పెడదాం

7, ఆగస్టు 2015, శుక్రవారం

Pranjali Prabha-5 భావ కవిత్వం-2

ఓం శ్రీరాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ -5



సర్వేజనా సుఖినోభవంతు
భావ కవిత్వం-2
జన్మదిన (10-08-1957) శుభాకాంక్షలు పంపిన వారందరికి హ్రుదయపూర్వక అభినందనలు
మీ అందరి అభిమానంతో నాలో నూతనొత్తెజం
మీ కందరికీ హ్రుదయ పూర్వక  అభినందనం
నాలో నిండే ఉషోదయ ఉషస్సుల అశిర్వాదబలం
పెద్దలను  గురువులు అర్ధించుతున్న జ్ఞానం పంచమని    


కవికుమారకులారా - కదలి రండయ్యా 

కన్నుల పండువై  - కనుపించే యుగమయ్యా
తొలకరి మనందరి లక్ష్మి -  తొంగి చుచిందయ్యా
తొల్లింటి పాపము  - తొలగి పోయిందయ్యా


వేద పఠణములోన  - కలదురా తీపి

మన మానసములోన - కలదురా తేట
ప్రేమ పలుకులోన - కలుగునురా తృప్తి
 స్నేహ  సేవలోన - ఉండునురా సంతృప్తి  


1. ఆ నవ్వుతో ఏటో వెళ్లి పోయింది నా వయసు 
ఆ చూపుతో ఏటో వెళ్లి పోయింది నా మనసు 
ఆ నడకతో నన్ను కలవర పెట్టు  నీ సొగసు
ఆ చేతితో పావడా తిప్పటం చూసి పడే నలుసు    


ప్రాంజలి ప్రభ 
తళుకు బెళుకు తన్మయ నవతరుణి 
తరుణోపాయం తెల్పే  విధు  షీమణి 
తేట తెలుగు లా  వెలుగుల  జవ్వణి
తేనపలుకు తెమ్మెరలా సాగే తరంగిణి



2. ఆరుబయట అందాలు ఆరబోస్తుంటివి ఎలా చెప్మా..!

ఒయ్యారాలను వలకబోస్తూ చేనుగట్టు కూర్చుంటే ఎలా చెప్మా..!

కొనసీమ కొబ్బరి చెట్ల అందాలన్ని నీలొఉంటే ఎలా చెప్మా..!

ఆకర్షించే చూపులతొ నన్ను తికమిక పెడితే ఎలా చెప్మా..!


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgucM3WR7PieRH4HMg2_IYBEWl7kbfJW6v0w4defGtrkDww7QnPFTrTX3S6rCfU5mclzNblI0Ha8i8znATvKyWTZjD3QLyQqQMO05-xBqeFRYs4PQs3lAmZrn4XEzAVIiFAy-q7UdCGd3tb/s1600/1.png


శంకరాభరణం బ్లాగ్ వారు పంపిన చిత్రానికి నాభావ కవిత్వం



3. భయ మెరుగని భవ్య దివ్య భవుడు

భవ భంధ బగ భగలు లేని భద్రుడు
భాండము లేక కేసరినెదిరించిన భర్గుడు
భద్రదారువు వలే  శార్దూల రక్ష భానుడు



4. శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం 
 


సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం 
 


ఆజానుబాహుమ్ అరవింద దళాయ తాక్షం 
 

రామం నిశాచర వినాశ కరం నమామి... 



5. చెరువు లెండె - చేలములు కరువాయె 

వాననిండు కుండె - ఎండలు మంది పోయె 
చెట్లు ఎండకు మండె - నీడకు కరువాయె 
మనుగడ లేకుండె - ఓం శ్రీ రామ కాపాడవయ్య

 

 6. సరస సల్లాపముతో సరసుని సముదాయించే 
సరళ శ్రావ్య స్వర్ణ ప్రియని తనువుతో సంతృప్తిపరిచే 
సంతసముతో సంతుష్టినియై సవ్యసాచికి మనసుపంచే
 సమాన సమిష్టిగా తలపుల రంగులకల ఫలించే 


దొబూచి లాటలు సంసారంలో ఉంటె ఆ త్రిల్లే వేరు 
దొంగ ముద్దులిస్తు ఉడికించి చల్లపరిచే కిక్కే వేరు 
దొండకాయగున్నా, దొండపండులాగున్నా రుచీ వేరు
దంపతులెటులున్న అరచు కొని సర్దుకోవటం వేరు      



మనకు అక్కరలేని విషయాల గురించి అలోచించి భాదచెందవద్దు 
చదువుకున్నవారు కూడా చెప్పలేరని వాదించ వద్దు 
 దేవునిలీల గురించి  ప్రశ్నలు వేయొద్దు
ధర్మమార్గమునే  నడుచు కోవటం మనకు హద్దు
 
మనసనేది  ఉన్నదా  - ఉండినా ఎక్కడున్నాదో తెలియదు
ప్రేమ అనేది ఉన్నదా - ప్రేమకు కొలమానం ఎమిటో తెలియదు 
హృదయ మనేది ఉన్నదా  - ఉండినా రక్త జలాలమద్య ఎలాఉందో తెలియదు
బుడ్డి అసలు ఉందా - ఆ బుద్దు ఎప్పుడు ఎలామరుతుందో ఎవరికీ తెలియదు 

ఈ విషయం ఎలా చెప్పాలి - విషయం ఎలా తెలియాలి 
నిజం తెలియాలి - గుట్టు తెలిసుకోవాలి 
లొసుగు విప్పాలి - సద్దు చేయాలి 
ప్రేమ పండించాలి - సుఖాన్ని ఇవ్వాలి 

మనకు అసలు సమస్య ఎలా వివరించాలో తెలియదు 
ఎప్పుడు మొదలు పెట్టాలో అసలే  తెలియదు 
ఎప్పుడు అపా లో అంతకన్నా తెలియదు 
ఆ మద్యలో ఏంచేయాలో తెలియదు 

చిత్రం మహా అద్భుతం - సేకరణ అమోఘం 

విశ్వమ్ విశ్వాన్తరాళలో వెలిసిన ఒక అద్భుతం 
విశ్వనాద సత్యనారాయణకు అదేకల్ప వృక్షం 
ఆనందపారవశ్యం తో వర్ణన చేసే  రామాయణం
అదే ఈనాటి కి చెక్కు చెదరని మాహ వృక్షం 
  
తెలుసుకోవాల్సింది ఏముంది నీ అన్వేషణలో 
ఎజన్మభందం అని తెలుసుకోవు ఈ లోంకంలో  
గమ్యానికి అంతు తెలుసుకోలేవు ఎవిషయం లో 
ఎన్నిమాటలు మార్చిన అర్ధం కాని పదాలు ఎన్నో    

నా గమ్యం నీవె అంటూ ఓ మంద హాసం 
నన్ను మరువకు అంటూ ఓ మౌన హాసం 
నిన్నుచూసి చూడకుండ ఓ చిరు దరహాసం
నీలొ నాలో ఎప్పుడు పల్లవించాలి సా హాసం    



అన్నీ ఉన్నప్పుడు మన వైఖిరి తెలుస్తుంది -
 ఎమీలేనప్పుడు మన ఓర్పు కనిపిస్తుంది 



ఈ పాట  నాకు ఎంతోఇష్టం .. మీకుఇష్టమని భావిస్తా 
ఒక్కసారి ఈ పాట విని సంతోషిమ్చగలరని ఆశిస్తున్నాను

మూగనోము చిత్రంలోని ఒక అందమైన పాట
చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
 
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
 
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
 
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
 
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..
నీలోని ఆశలన్నీ నా కోసమే..
నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
 
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
 
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..
లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా
లాలలా... ఊ హూ హు.

https://youtu.be/oiN8f-LaHng
Ee Vela Naalo Enduko || Mooga Nomu Telugu Hit Song - ANR , Jamuna (HD)
Subscribe For More Telugu Movies: http://goo.gl/V65dIk Subscribe For More Tamil Movies: http://goo.g...


 నాకు చిత్రములు, కవితలు, గీతాలు, మెయిల్ కు  పంపినవారికి పేరు పేరున కృతజ్నతలు చెప్పుకుంటున్నాను (మంచిని నలుగురికి పంచాలని ఒక ఆశయంతో సేకరిస్తున్నాను )


6, ఆగస్టు 2015, గురువారం

Pranjali Prabha - 4 (కృష్ణ నీ చరణమ్ములే నాకు దిక్కు)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- 4
సర్వేజనా సుఖినోభవంతు

 
కృష్ణా నీ చరణమ్ములే  నాకు దిక్కు

1. మల్లె పువ్వును నేను, మంచి గంధ వాసన లందిస్తాను
గులాబి పువ్వును నేను, కస్తూరి  వాసన లందిస్తాను
పారిజాతాన్ని నేను,  నీ పాదాలకు సెవగా ఉంటాను
నామాటలు వినవా కృష్ణా,  నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

ఉపవాస వ్రతములు, నీకోసం చేయలేను
ఒక్క దీపారాధనమైన,    నీకోసం చేయలేను 
స్నాన సంద్యా, నియతి జరుపలేను
నామాటలు వినవా కృష్ణా నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

నీ జ్ఞానులను,  గనుగొని మ్రోక్కలేను
దాసులను,  గనుగొని వేడలేను
కృష్ణా,  నీ సన్నిధికి నే చేరలేను
కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను. 

జన్మములెత్తి, ఎత్తి, విసికి పోయాను
ఈ జన్మతో, సరి చేయవలెను
నే మరువనేప్పుడు, నీనామ జపమున్
కృష్ణ నీ చరణమ్ముల వద్ద రాలిపోతాను. 

దుర్మార్గులను దండన చేస్తావు నీవు 
సన్మార్గులకు మోక్షం ప్రాసాదిస్తావు నీవు 
రాధకోర్కను తీర్చి తృప్తి పరిచావు నీవు 
అందుకే నిన్ను వదలక నీ చరణమ్ముల వద్దే ఉన్నాను. 

" కమలనయన బ్రోవరా .....కరిరాజవరద
వర యాదవ పురవాస: కృష్ణ విను
కరమదుగా నా కన్నుల గాంచెద
కోరి కొలుతు నాదు కొర్కలుదీర్పగ
సారసాక్షి నీ సంనిదిజేరితి .........
కమలనయన బ్రోవరా .....కరిరాజవరద "
--((ఓం శ్రీ రాం))--

--((*))--

ఈ మధురగీతాన్ని ఆలకించండి

యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలొ
పిలువగనే తేనెల్లొ పూదారి ఎన్నెల్లొ గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
ప్రాప్తమనుకొ ఈ క్షణమె బ్రతుకులాగా
పండెననుకొ ఈ బ్రతుకె మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదె ప్రేమ
హృదయంల తననైన మరిచేదె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలొ చలిమంటై రగిలేదె ప్రేమ
చిగురించె ఋతువల్లె విరబూసె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
యమునా తీరం సంధ్యా రాగం
mve : Anand
రచన: వేటూరి
సంగీతం: రాధక్రిష్ణన్
గాయకులు: హరిహరన్, చిత్ర

Watch Nuvvena Naa Nuvvena Song From Anand Movie. Anand is a Telugu movie, directed by Sekhar Kammula. Starring Raja, Kamalinee Mukherjee, Satya Krishnan, Ani...

 


ఆడపిల్ల కష్టం లేని రోజు ఏదని
 వంటకు కట్టెపోయి తప్పదెందు కని
దేశంఇంకా వెనుక పడుతుందేమోనని 
నాకళ్ళు చెమ్మగిల్లు చున్నవి



 
ఏమిది నీదు లీల ఆకొన ఈ కోన కలిపినావు
వన్య మృగాలకు మార్గం చూపిన వాడవు
ప్రక్రుతి వనరులు పొందటానికి మార్గదర్సకుడవు
ఆనద పారవస్యాన్ని  తలపించే చిత్రం గీసావు   
మీరు గీసినచిత్రము బాగుంది 

వర్ధమానులను ప్రోస్చహించాలని ఇందు పొందు పరిచాను R.K.S. thoughts. వారు పంపినారు   
తులసీ మండపం ఉండే పద్ధతి
పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని వారు అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి.
మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.
తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, 
కుంకుమ బొట్లు పెట్టాలి.
ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు 
పటా పంచలవుతాయి.












3, ఆగస్టు 2015, సోమవారం

Pranjali Pabha -3 (- భావ కవిత్వం)


ఓం శ్రీరాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి  ప్రభ -3


సర్వేజనా సుఖినోభవంతు
భావ కవిత్వం

1అరణ్యంలో చిక్కిన అబలకు ఆశ్రయం దొరికితే  ఆనంద మొసంగు 
ఎడారిలో చిక్కిన యువతికి  నీరు దొరికితే సంతోషం నొసంగు 
కడలిలో చిక్కిన వనితకు దుంగ దొరికితే ప్రాణం మోసంగు
 అట్లే ఆకలిగొన్న బాలికకు ఈగ పడిన పాలు హితమోసంగు 


2కుక్క అరుపుతో పిక్క బడుతుందేమోనని గోడదూకె ఒక మనిషి
అమిత వేగంతో నిద్రపోతున్న వారిపే గోడ దూకి పడే ఒక లారి
పులివేషంలో మనిషిచూసి పులి అనుకోని గోడ దూకె ఒక పోకిరి
కామంతో ఒకడు వెశ్యకొంపకు చేరే పొలీసును చూసి గొడ దూకెన్

3. సూర్య కరుణా కిరణ రక్షణ కై వృక్షముల్ సదా
చంద్ర కరుణా చల్లని వెన్నలకే విహంగముల్ సదా
లోక రక్షణా దుష్ట శిక్షణ కై హైందవుల్ సదా
అట్లే హరి కరుణా కటాక్షముల సకల జనుల్  సదా

4. శ్రీమతితో చేరి శృతి  కలిపి సంతోష పరిచే *  
*జనినీ జనకుల పాద సేవచేసి విశ్రాంతి పరిచే*  
*పిల్లలకు విద్యనేర్పి ఉన్నతవిద్యకు సహకరించే *  
*గురుచణమ్ములు మరువక కొలిచి సంతృప్తి పరిచే*
*అందుకే నా దృష్టిలో గురువు నిజమైన సంసారి *

5. కామాంధునకు సతిని ఇచ్చిన పతి , సతి చావుకు కారకుడు కాదా*
*గర్బినిని నాటువైద్యుని వద్దకు తీసుకువెల్లిన పతి సతి చావుకు కారకుడు కాదా*
*పతె దైవముగా భావించ సతిని హింసించిన పతి, సతి చావుకు కారకుడు కాదా*
* అట్లే " సతిచావుకు కారకుండు శంకరుఢుగదా " *

6. త్రాగి ఇంట్లో వారని తిట్టినా డబ్బుకోసం మెచ్చు కొనుచుండ
వైద్యుడు డబ్బుకోసం రోగం తగ్గకుండా చేసిన మెచ్చు చుండ
పొలీసులు లంచం పుచ్చుకున్నప్రజలు నిజాయి పరులను చుండ
అందుకే "మోసము జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడ"


7. మాటలతో మనసును లొంగదీసి మోసం చేసే
మచ్చలేని మనిషి కుడా ఒక్కోసారి మోసపోయే
మోసం ఉన్నచోట తప్పులు దరిదాపులో కనబడవే
మోసము జేయువారలకె పుణ్యము కలుగు చుండే


8జ్వరముతో లంకణం చేసే వ్యక్తికి ఎ రుచి తెలియదాయె
తపనతో ఉన్న వ్యక్తి కి యేది తిన్న రుచిగా ఉండ దాయె
ఆకలి లేనివానికి రుచికరమైన భోజనం పెట్టిన తినలేడాయె
ఆకలిఉన్నవాడికి పాయసమున నుప్పుకలుపబడ తీయనాయె


9. అన్నము పెట్టిన తండ్రిని దీవించి ఆత్మారామున్ని శాంతపరిచే
మనస్సును వేదించిన మన్మధుని తరిమి సతిని సుక పరిచే
సూర్యుడు రాగానే కనుమరిగేన నళిని మరచి సుఖంగా జీవించే
అందుకే అన్నారు "తండులేవారు గలరండు ధరణి యందు


10. మనసు చెడిన వాడు - గన్నేరు కాయను తినును
వయసు ముదిరిన వాడు - మాటల కాలం తినును
ప్రేమ ముదిరిన వాడు - అనుమానంతో మనసు తినును
ఆకలి గొన్న " బ్రాహ్మణుండు కాకి పలలము దిను "

11. వనముల్ ఎక్కు వైతే వర్షములు పడున్ మృగాలు బ్రతుకున్
వనముల విస్తారణలో నిత్యవసర వస్తువుల్ సమస్తం దొరుకున్
కొండల కోణల వనముల్లో దివ్యోషదముల్ దొరుకు ప్రాన్తముల్
" వనమే మానవజాతి యున్నతికి సర్వశ్రేష్ఠమూలం బగున్ "


12నటన సూత్రధారి నల్లనయ్య కపట నిద్ర పోతున్నావేమయ్య
వచ్చిన వారితో మాట్లాడక నీవు మౌనంలో ఉన్నావేమయ్య
కృష్ణ ఇరువురికి సంధి కలిపి ఆదరించేవాడవు నీవే గదయ్య
విజయుడు వినమ్రతతో విన్నవించే విజయం చేకూర్చవయ్య


13. రుద్రాక్షను తలపించు తాను కానీ నేను కాను
మురికిని వదిలిన్చుతాను సబ్బును కాను
తడిసిన నురుగుగా మారుతాను కడలిని కాను
మరి నేను కురులు రక్షించే కుంకుడి కాయను


14. షణ సుఖము కోసం సాగు ప్రణయం
సంసార సుఖంకోసం సాగు విరహం
రోగమున్న వదలదు తన్మయత్వం
వేశ్య వలన బ్రతుకు వెలుగు లీను"

15. తనువులో ముళ్ళు, మనసులో కుళ్ళు
ఎంగిలాకు బతుకుళ్ళు, ఉండేది కల్ముషలోగిళ్ళు
రోగాలతో వళ్ళు, మరణశయ్యపై చేరేవాళ్ళు
ధనంకోసం రక్త దానమ్ము చేయట రాక్షసమ్ము

sameera.muv@gmail.com,sameera.86@gmail.com,sameera.86,meera12.





1, ఆగస్టు 2015, శనివారం

Pranjali Prabha-2 (Friend Ship Day) (DOSTI) *

 ఓం శ్రీ రాం   శ్రీ మాత్రే నమ: శ్రీ కృష్ణాయనమ: 
ప్రాంజలి ప్రభ -
 సర్వేజనా సుఖినోభవంతు 
నెటి ప్రత్యేకత ప్రాంజలి స్నేహం
సహ్రుద్బావముతొ అందిస్తున్న స్నేహ సమాచారం 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
        ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...     
                                                                       

 స్నేహం 

విశ్వము నందు  విశేష  విశిష్ట  మైనది  మన  భారత  దేశం,  మన  భారతీయు లందరు  ప్రతి  ఒక్కరికి విజ్ఞానమును అందించే వారు, మరియు అందరికి  సహాయ  పడేవాళ్ళు , అన్ని  విదాల అందరికి  సహకరించే నిజమైన  స్నేహితులు. జీవిత మంత  ఆనంద శాంతి సుఖాలును పొందే దేశం.

"శైశవేభ్యస్త విద్యానాం, యోవనె విషయైషిణామ్ "
వార్ధకే ముని వృత్తినాం, యోగేనామ్తే తనుత్యుజామ్ "

బాల్యదశలో గురువుల వద్ద వేదాది, సత్య విద్యలు అభ్యసించాలి, గురువే మొదటి స్నేహితుడు, యోవనదశయందు విద్యనేర్చుకొని, చక్కని  ఉద్యోగము సంపాదించుకొని, గృహస్తునిగా మారి, ధర్మం తప్పక కౌమాది సుఖములు భోగించే, సత్ - సంతానం  బడయి వలెయును,  ఉద్యోగము, భార్య నిజమైన స్నేహితులు ఏది తక్కువైనా జీవితము నరకమగును.


కౌమార దశలొ సంతృప్తి పడి  పిల్లలకు వివాహాది శుభకార్యములు చేసి సుఖగా జీవించుటే (ఇందులో మనసే నిజమైన స్నేహితుడు) వృద్ధాప్యంలో మోక్షమార్గం కొరకు దేవుణ్ణి ప్రార్ధించ వలెను, ఇప్పుడే దేవుడే నిజమైన స్నేహితుడు.

స్నేహం అందించే ప్రేమ, అప్యాయతనురాగాలు, ఓదార్పు, ధైర్యం, మనుష్యులను సజీవంగా  ఉంచ గలుగు తుంది.
స్నేహం "అనేది ఉదయించు చున్న సూర్యుడిలా వెలుగును" , "చీకటిలొ వెన్నెలను" , మనస్సు శాంత పరిచే చల్లగాలిని అందించేది.
 

స్నేహానికి " కుల- మతాలూ, ధనికులు - పేదవారు, స్త్రీ - పురుషులు " అనే భెధము ఉండదు.
ఆపదలో ఆదుకున్నవాడు, మిత్రుడిలో తప్పును వేలు ఎత్తి చూపెవాడు  నిజమైన స్నేహితుడు.
 

ఏకాంతములో తప్పును సరిదిద్దుకోమని చెప్పి, పది మంది ముందు పొగడేవాడే స్నేహితుడు.
స్నేహితుల  యందు ప్రేమ ఉన్నంతకాలము  వారి మద్య అమృతము వుంటుంది, ప్రేమ చెడిన విష తుల్యముగా మారుతుంది
 

స్నేహితులమద్య కొన్ని శక్తులు విదదీయుటకు ప్రయత్నిం చెస్తాయి, అటువంటి పరిస్తితులలో నిజాలు తెలుసుకొని స్నేహాన్ని విడువకుండా ముందుకు సాగి పోవాలి.

రామాయణంలో సీతా దేవి కోరకు రామ లక్ష్మణులు  వెతుకుతూ రుష్యమూక పర్వతము వద్దకు చెరారు, అప్పుడు సుగ్రీవుని మంత్రి గాఉన్న హనుమంతుడు రామ లక్ష్మణులు వద్దకు వచ్చివివరములు అడుగగా "హనుమ"  అన్న పలుకులతో  పరవశించి పోయాడు
సకల వ్యాకరణములు  తెలిసిన వాడు హనుమంతుడు, అప్పుడే స్నేహధర్మాన్ని అనుకరించి రామలక్ష్మణులను తన భుజములపై కూర్చొపెట్టుకొని కొండపై ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకెల్లి, వారిద్దిమద్య అగ్ని సాక్షిగా స్నేహము కుదిర్చిన మహాను భావుడు, సుగ్రీవుడు తన స్నేహ హస్తము అందించి సీత జాడను కనుగొని, సీత రాముని వద్దకు చేరేదాక స్నేహధర్మాని చాటుకున్నాడు.

భాగవతంలో శ్రీ కృష్ణుని బాల్యమిత్రుదైన సుదాముడు (కుచేలుడు) వచ్చినట్లు వినగానే వేగముగా పోయి సాదరముగా ఆహ్ఫానించి, స్వయముగా భార్యలు నీరు పోయగా పాదములు కడిగాడు, నాకోసం ఏమి తెచ్చావు అని అడుగుతూ ఉత్తరీయము కొంగులో ఉన్న గుప్పెడు అటుకులను నోటిలో వేసుకొన్నాడు, కుచేలుడు వచ్చిన పని మరచి  ఇంటికి  వెళ్ళగా అక్కడ ఆనందంతో పెద్ద భవనములో ఉన్న భార్య పిల్లలను చూసి సంతోషించాడు కుచేలుడు, అందుకే " స్నేహితుని అవసరాలు తెలుసుకొని సహాయము చేసినవాడే నిజమైన స్నేహితుడు " 


భాగవతంలో బలి చక్రవర్తి వామనుడు అర్ధించి నట్లు మూడడుగులు   ఇచ్చుటకు నిర్ణయిమ్చాడు, బలిచక్రవర్తి గురువు వచ్చినవాడు  రాక్షస సంహారి హరి అని తలంచి ఒక స్నేహితుడిగా, గురువుగా అవసరమైనప్పుడు అభద్ధమాడవచ్చు అని తెలియ పరిచాడు, మూడ డుగులు దానము చేసి పాతాళానికి తొక్కబడిన ఇప్పడికి పూజ  లందు  కొంటున్నాడు, గురువుగారి అపకీర్తి అలాగే నిలబడి పోయినది.
 

స్నేహాన్ని  తెలియపరుస్తూ కొన్ని అంత్య   భావ  కవితలు ఇందు పొందు పరుస్తున్నాను, అవి కూడా చదివి మీ అభిప్రాయాలు నాకు తెలుపగలరు
                                                     image not displayed

కదిలే  కాలంలో   మనసుకు  చేరువయ్యేది  స్నేహం
బ్రమల్ని తొలగింఛి బ్రతుకు అర్ధాన్నిచూపేది స్నేహం
క్షణ క్షణ మార్పులకు అత్మీయతను పంచేది స్నేహం

ప్రేమలను పంచి భాధలను తొలగించే మందే స్నేహం

లేమిలో,   కలిమిలో తోడై ఉండేది  స్నేహం
ధనిక   పేదలని  విభజన  లేనిది  స్నేహం
కలమతాలకు సంభందము లేనిది స్నేహం
  మనష్యుల మద్య  ప్రేమ నిజమైన  స్నేహం  


మనసులోని భావాలను చెప్పుకోవటానికి కన్నిరుతో స్నేహం
రాపిడికి పుట్టె అగ్నికి మనస్సు చల్లపరిచే మంచుకు స్నేహం
కిరణాల తాకిడికి  ప్రతి  ఒక్కరిలో   ఏర్పడే   నీడతొ  స్నేహం 
పొద్దు తిరిగెడి పువ్వులకు  ఆదిత్య  భగవానునితో   స్నేహం

కను  రెప్పలకు  నిద్రా  దేవితో   స్నేహం
నాసికారంద్రాలు వాయువుతో   స్నేహం 
ఉదరం జలంతో  ఉన్న  అగ్నితో స్నేహం
మర్మావయం మలమూత్రాలతొ స్నేహం 

సముద్ర జలం  కదులుతూ  తీరం వడ్డుతో  స్నేహం
సముద్ర కెరటాలకు పడవలో ఉన్న  తెరతో  స్నేహం
సముద్ర జలచరాలు గంగాపుత్రుల వలలతో  స్నేహం
సముద్ర ప్రయాణీకులకు ఉండాలి దిక్సూచితొ స్నేహం

మనసును  ఊరడించే   మల్లె పూలతొ  స్నేహం
మనసు ఉల్లాస పరిచే కోయిల గానంతో స్నేహం
మానవత్వం  నిలిపే  మణి  హారంతో    స్నేహం
  మూర్ఖుని   మెప్పించ  టానికి మౌనమే స్నేహం 


 బాల్యం నుండి వృద్దాప్యం వరకు ఉండేది స్నేహం 

 కుల, మతాల అతీ తంగా ఉండే అనుభందం స్నేహం 
మనసు కలత చెందిన విడిపోనిది నిజమైన స్నేహం  
  కట్టే కాలే వరకు చెరగనిది  మా మద్య స్నేహం 
image not displayed

గగనంలో ఉన్న మేఘాలతో మెరుపు తీగలు స్నేహం 
ఊహలతొ ఉన్న మనుష్యులకు అశల దివిటీలతొ స్నేహం            
మయూర కేళీ నృత్యం మేఘాల చిరుజల్లులతో స్నేహం 
 ఊర పిచ్చుకలకు చల్లని వసంతంతో మరువలేని స్నేహం 

కమలం మరువలేదు కిరణం తో స్నేహం 
తుమ్మెద మరువలేదు కమలంతో స్నేహం 
ఇంజన్ మరువలేదు ఆయిల్ తో స్నేహం 
మనసు మరువలేదు ముద్దులతో స్నేహం 

మాట్లాడే మాటకు నిజమనేది స్నేహం 
కులస్త్రీకి తగిన సిగ్గే నిజమైన స్నేహం 
రిజిస్ట్రేషన్ కు సంతకేమే నిజమైన స్నేహం 
దాపరికం లేనిది నిజమైన స్నేహం 

దుర్జనులతో స్నేహం ప్రాత: కాలపు  నీడ   
సజ్జనులతో స్నేహం సాయంకాలపు  నీడ
వణ్యమృగాలతో స్నేహం భయనపు  నీడ
స్త్రీలతోస్నేహం చేయాలంటె గుండెలో దడ







పేగు భంధం కన్నా మించినది స్నేహం 
నిగురుకప్పిన నిప్పులా ఉంటుంది స్నేహం 
క్రమశిక్షన పేరుతొ శిక్ష  వేసుకుంటుంది స్నేహం
కళ్ళముందు వెళ్ళమన వెల్లలేనిది స్నేహం 

 మధురం మాట్లాడుతూ దుమారం లేపదు స్నేహం

ఓదార్పు, ధైర్యం, మమకారం పంచేది స్నేహం 
స్నేహమేరా జీవితమ్, స్నేహమేరా సాస్వితం  
వెలుగు చుట్టూ ఉండే నీడల ఉండేది స్నేహం 

అవహేళన చేస్తూ పాదాల కంటిన మట్టి రేణువులతో స్నేహం
అపజయం వచ్చిన విజయం పొందేదాకా వదలదు స్నేహం
అక్షయపాత్రను పంచేది కాదు మనస్సును శాంతపరిచేది స్నేహం 
కరుణ రసం ఇంచుగా నాపై చిలకరించమని దేవినితో స్నేహం

ఏడు కొండలకు, శ్రీ వెంకటేశ్వర స్వామికి అవినాభావమె స్నేహం
శ్రీ వెంకటేశ్వరస్వామి, మానవుల కురులను తీసుకొని  ప్రేమ పంచె స్నేహం
శ్రీ వెంకటేశ్వరస్వామికి,  బ్రహ్మా దేవేడు బ్రహ్మోస్చవాలు జరిపే స్నేహం
మానవులు, సకల దేవతలు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించే స్నేహం 
   
చిన్నరాజ్యానికి ఉంటుంది అగ్రరాజ్యం తో స్నేహం
గుమాస్తాకు   ఉంటుంది   ఆఫీసర్   తో  స్నేహం
బీదవారికి  ఉంటుంది  ధనవంతుడు తో స్నేహం
రైతుకు  ఉంటుంది  పంట  భూమి  తో   స్నేహం

చెప్పాలను కుంటే చెప్పే నాలుకతో స్నేహం
వినాలను కుంటే  వినె  చెవులతో  స్నేహం
చేయాలను కుంటే చేసే  చేతులతో స్నేహం
నడవాలను కుంటే  పాద  రక్షలతో స్నేహం 




శ్రీ రాముడు సీత జాడ తెలుపుతానన్న సుగ్రీవునితొ స్నేహం
శ్రీరాముడు సీత జాడ  తెలిపిన  హనుమంతుని  తొ స్నేహం
శ్రీరాముడు లంకగుట్టు తెలుపగలడని విభీషనునితొ స్నేహం
శ్రీరాముడు రావణుని సంహరించుటకు ఆదిత్యునితో స్నేహం 

అపురూప  మైన  భందాన్ని  అవలీలగా  తుంచేది స్నేహం
ప్రశాంతతను కూల్చెసి ప్రమాదకరముగా మార్చేది స్నేహం
మాయాజాలాన్ని సృష్టించి అనుమానాన్ని పెంచేది స్నేహం
మనిషి మంచితనాన్ని ఆసరాగా  చులకన  చేసేది  స్నేహం 
 

ఫ్రెండ్షిప్ డే సందర్భముగా అందరికి మా శుభాకాంక్షలు     


శ్రీమతిగారు ఈరోజు T .V. చూసావా 
బంగారం తగ్గింది కొందాం వస్తావా 
శ్రీవారు మరి మీరు ఈరోజు T .V  చూసారా 
ఉల్లి ధర పెరిగింది  ఇంకా పెరుగుందట తెలుసుకోవా 
బంగారం దాచుకోనేది - ఉల్లి కోసం దోచుకుంటారేమో బావా
 నేను వెళ్తున్న ఉల్లి కొనటానికి  అదార్ కార్డు కావలిటి బావా 
అది ఎవరన్న దోచికేల్తారని లాకర్లో పెట్ట, తెచ్చేదాకా కూడు లేదు బావా 
ఉల్లి రేటు పెరిగి నన్ను వంటవాడ్నిచేసింది  ఇదేమి లోకం ?
తెచ్చారా మీరు కూడా  నాతోరండి క్యులోనున్చోవాలి ... ఆ
 ఉల్లి కోసం 
ఉల్లి చేసిన మేలు చేయదు తల్లి
ఉల్లి కారం కలిపి తినిచూడు కిల్లి
ఉల్లి తినాలనిపిస్తుంది మల్లి మల్లి
ఉల్లి కోసం చేయకు ఇపుడు లొల్లి

ఉల్లి తరిగితే కారు తుంది కన్నీరు
ఉల్లి కొనాలంటే వస్తున్నాయి కన్నీరు
ఉల్లి లేని సాంబారు  ఉత్తుత్తి  న్నీరు
ఉల్లి తెస్తే పన్నీరు లేకపోతె  ఇక కన్నీరు  

ఉల్లి రేటుకు వాడని హోటళ్ళు
ఉల్లి ఎక్కువ కమ్మే  లోగిళ్ళు 
ఉల్లి కొనాలంటే సంసారికి కన్నీళ్ళు
ఉల్లి అమ్మేచోట అంతటా  కుళ్ళు

ఉల్లి కొంటున్నారు ఉన్నవారు రేటు ఎక్కువైన
ఉల్లి ముక్కలు లేని అట్టు తింటారు ఎక్కువైన
ఉల్లి ధరపెరిగితే ప్రభుత్వాలు పడును ఎప్పుడైన 
ఉల్లి ప్రభుత్వమా కళ్ళుతెరిచి అమ్మాలి తక్కువకైన  

ఉల్లి రక్షించు వేసవి వడ దెబ్బ
ఉల్లి కాంక్షించ వద్దు నీ  వబ్బ
ఉల్లి  వాడని తిండి తినా లబ్బ    
ఉల్లి కోసం పిల్లాడులా లొల్లి చేయకబ్బ 

ఉల్లి చేసిన మేలు  తల్లి కూడా చేయదు అనా\టి సామెత - 
ఉల్లి ధర పెరిగితే ప్రభుత్వాలు పడతాయి  ఇనాటి సామెత