15, ఆగస్టు 2014, శుక్రవారం

. Pranjali Prabha - Divotional story -(SITA RAMA KALYANAM)

       
   ప్రాంజలి  ప్రభ 
    సర్వే సుఖినోభవంతు 
   
సీతారామ కల్యాణం (వాల్మీకి విరచి రామాయణం)
        (మల్లాప్రగడ రామకృష్ణ అంత్య ప్రాస భావ సీతారామ కల్యాణం)

ప్రతి ఒక్కరు అర్ధం చేసుకొనుటకు తేట తెలుగులో అంత్య ప్రాస  పదాలు  గల  వ్యాక్యాలు  వ్రాయటము  జరిగినది.  దీనికి మూలమ్ ఆదికవివాల్మికి వ్రాసిన రామాయణము ఆధారముగా వ్రాయటము జరిగినది. ఈ రామాయణము కేవలము నా ఊహల్లొ, నామదిలో  మెదిలిన ఆలోచనలు ఆధారముగా వ్రాయట మైనది ఇందులో తప్పులున్న క్షమించ గలరు , ఎందఱో మహానుభావులు, రచయతులు , కవులు  భారత మాట ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున నా వందనములు.

         రావణుని శక్తి ఋషులపై  పడింది, నారాయణ జపం చేయకుండా ప్రజలను హింసించడం మొదలైనది.
       
       1. దేవతలు ఋషులు  రావణ  చేష్టలకు   అనుభవించారు నరకం
        విష్ణుమూర్తి వద్దకు వెళ్లి దేవతలు,ఋషులు కోరారు పరిష్కారం
        రావణునకు పుణ్యం తగ్గి   పాపం  పెరిగేదాక   ఉండాలి సహనం
        అందరూ  రామాయణం  చదవడం  మనశ్శామ్తికి   శ్రేయస్కరం
.
        2.నారదుడు సంచారము చేస్తూ వాల్మీకిని కలిసాడు అరణ్యం
        వాల్మీకి   నారదుడిని  కోరే తెలపండి  శ్రేష్టుడి కధా వివరం
        లోకంలో ధర్మజ్నుడు,  కృతజ్ఞుడు గురించి  తెలిపెద సత్యం
        నారద మహాముని వాల్మీకికి తెలిపే రామాయణ మహత్యం

        3.సరయూ నది సమీపమున ఉన్నది కోసలమను పెద్ద దేశం
.        అందులో   సమృద్ధి   వనరులు  గల   అయోధ్యా   పట్టణం
        మను  మహారాజు   దానిని  స్వయముగా  చేసే   నిర్మాణం
        నారద మహాముని  వివరించే  అయోధ్యా  పట్టన  విషయం

        4,దశరధ    మహారాజు   అయోధ్యా    నగరాధీశo
        సమస్త     ఉపయోగకర  వస్తువుల    సంగ్రహం
        తేజోవంతమైన పాలన పురప్రముఖలకు ప్రియం
        దశరధునిపరిపాలన ప్రజలు అంటారు అమోఘం

        5.నాస్తికుడనే  వాడు కనిపించడు,  నగర మంతా భక్తి మయం
        కాముకులు, క్రూరులు, లేని ప్రాంతంగా ప్రజలు సుఖమయం
         దరిద్రుడు, విద్యలేనివాడు, కనిపించని  పరిపాలనా మయం
        దశరధమహారాజు పరిపాలన  ప్రజలకు సుఖసంతోషమయం
       
        6. భ్రాహ్మాణులు  పతిరోజు   వేదాద్యయన   పారాయణం
         క్షత్రియులు ధైర్య   సాహసాలతో   చేస్తారు  వీర ధర్మం
         వైశ్శులు ధర్మమార్గమున చేస్తున్నారు ధనసంపాదనం
        శూద్రులు భ్రాహ్మాణ,  వైశ్య,  క్షేత్రియులకు సేవాతత్పరం
  
        7.అల్లుడుగా విచండ మహర్షి యొక్క కుమారం
        ఋష్య  సృమ్గుడు  వదిలెను   బ్రహ్మ    చర్యం
         స్త్రీలపై బ్రమలు పెట్టుకొని చేరే అయోద్యానగరం
        దశరధుడుకుమార్తెశాంతను ఇచ్చిచేసే వివాహం
  
       8. కామ,  క్రోద,  లోభ, మద, మాచ్చర్యములపై   ఉండాలి  నిగ్రహం
        ఆశ్రమధర్మమ్ భంగం కలుగనీయకుండ నెరవేర్చుకోవాలి అభీష్టం
        సత్కర్మలు     చేసినందు   వల్ల  అరిషడ్వర్గాలను  జయించగలం
        సేవకులపై, స్త్రీలపై,   దురహంకారం  చేసితే  కలుగును అగౌరవం
.
        9.రాజ్యంలో     ప్రజ   లందరూ  సుఖ  శాంతుల  మయం
        శివ భక్తులు  వారి నిత్యపారాయణం పంత్యాక్షరి  మంత్రం
        విష్ణు భక్తులు నిత్య  పారాయణం   నారాయణ   మంత్రం
        రాజవంశంలోఅందరు పుత్రులుకొరకు చేస్తున్నారు యజ్ఞం
.    .
        10పుత్రుల   కొరకు దశరధ మహారాజు చేసే అశ్వమేధ యాగం
        సంవత్చర కాలంలో అన్ని రాజ్యాలు తిరిగి వచ్చే యజ్ఞాస్వం
         సామంత   రాజులు    పండితులు   చేరిరి    యజ్ఞ    శాలం
        దేవతలకు ఆవిర్భాహం కోసం చేసారు యజ్ఞ హోమగుండం
.    .
        దశరధ మహారాజు భార్యా (కౌసల్య) సమేతంగా చేసే యజ్ఞం
        జాగరణతో,   నిష్టతో,  మొదటి రోజు  చేసే  జంతు  హోమం
        రెండవరోజు నుక్త్వమ, మూడవ రోజు ననిరాత్రి చేసే హోమం
        అశ్వ మేధ  యాగం ఋషులు పండితులు చేసే  సమ్పూ ర్ణం
.

        11. పుత్రులకొరకు దశరధుడు ప్రారంభిమ్చే పుత్రకామేష్టి యాగం
        యధర్వన, వేద మంత్రాలతో చేసే బ్రహ్మాండ మైన  హోమం
        దేవత    లందరు  వచ్చి   గ్రహించారు   యజ్ఞ    హవిర్భాగం
        దేవతలు, ఋషులు, పుత్రసంతానం  కలగాలని  ఆశీర్వాదం 
.        .
        12. రాక్షసులు   చేసే  ఘోరాలకు  ప్రజలందరిలో కలిగే  భయానకం
        దేవతలు, ఋషులు, కోరే నారాయణుని పాహిమాం పాహిమాం
        శేష శయ్యపై  చిరు  నవ్వుతో   నారాయణుడు   లక్ష్మీ  సమేతం
        నారాయణ      స్వరూపమ్       విశ్వ    మంతా     ఆవిర్భావం
.
        13. సమస్త ప్రాణుల  స్థితి   జ్ఞాన  వైరాగ్యమునకు హేతుం
        రూప ద్వందములు    లేని సమస్తమునకు  పరమేకం
        మీరందరూ ఆత్మజ్ఞాన హృదయంతో ప్రార్ధించుట భావ్యం
        సంయమనం పాటించండి నేను చేస్తాను రాక్ష సంహారం
      
        14. సమస్త   సమస్య   భందన   ఛేదం
        హృదయాన మొహభందన నిరోధం
        సర్వ భంధ విముక్తితో కలిగే మోక్షం
        లోకమంతా  శివ నారాయణ తత్త్వం
.    .
        15. భావ,    అభావాలు   లేని   యోగ  మయం
        నిత్యమూ యోగులచే ధ్యానించే వందేరామం
        విశ్వమంతా  వాంఛించే భక్తితో ప్రార్ధణామయం
        శివ నారాయణలను ఆరాధించెను భూలోకం

        16/ హే భగవాన్,   ఓ పరమాత్మా  గుర్తిమ్చ   వేమి   మా  కష్టం
        ఎమీఎరుగని స్త్రీలపై, అమాయకులపై రాక్షసుల అఘాఇత్య0
        రాక్షస చర్యలకు మేమందరం  మూకమ్మడిగా  ఆత్మ త్యాగం
        ఈ ధరనిపై కష్టాలు మేము భరంచ లేమని ప్రజల ఆర్తనాదం

        17. పృధ్విపై పెరిగే వటవృక్షంలా నాటుకు పోయిన రాక్షసుల కృరత్వ0
        దరహాసం అనేది   ప్రజలు   నోచు  కో  లేని   భయానక   జీవిత0
        రాక్షస  మాయతొ,  కామందులు,  మూర్ఖులు  విలయ తాండవం
        శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ మునులుదీక్షతొ చేస్తున్నారుయజ్ఞం

        18. శ్వేతాంబరదారి పాహిమాం పాహిమాం
        పీతామ్బరదారి   రక్షమాం    రక్షమాం
        దిగంబరదారి      ప్రణామం   ప్రణామం
        రాక్షసులచేతిలోచిక్కి అవుతున్నాంనిర్జీవ0

.        19. ప్రార్ధనలతో చెప్పుకుంటున్నారు బ్రతకలేము ఈ దర్భర జీవితం
        పరమాత్మ   వచ్చి   రక్షిస్తాడని    ప్రజలందరి   ఆత్మా విశ్వాసం
        దేశం సర్వతోముఖముగా ఉండాలని చేస్తున్నారు హోమం
        మమ్ము సృష్టించిన పరమాత్మునిపై పెడుతున్నాము భారం

        20. సమస్త    శాస్త్ర    సమ్మిళిత    మైన     వేదాంత     మయం
        సకలప్రాణుల రక్షణకు విష్ణువు కోసల్యా గర్బం చేరే సంకల్పం
        సమస్త   ప్రాణుల    హ్రుదయానందం  లో   ఆనంద మయం
        దేవతలు, ఋషులు,  మునులు,  అనుభవించారు ఆనందం

        యజ్ఞగుండం నుండి విశాల దేహుడు ఆవిర్భావం
        హస్తములందు తేజరిల్లు పూర్ణ  కుంభ  పాయసం
        భార్యలతో త్రాగిమ్చుము కలుగును పుత్రసంతానం
        యజ్నపురుషుడు అందిచే దశరధునికి పూర్ణకుంభం

        పూర్ణకుంభం నుండి కౌసల్యకు పంచే పాయసం అర్ధ భాగం
        సుమిత్రకు ఒసమ్గె  పాయసం  అర్ధ   భాగంలో  అర్ధ భాగం
        మిగిలిన  అర్ధ భాగంలో  కైకకు పంచే పాయసం అర్ధ భాగం
        మరల   పంచే   సుమిత్రకు  మిగిలిన  మొత్తం  పాయసం
                                                 


                            శ్రీ రాముని జననం   

         దశరధుని వాంచా ఫలసిద్దికోరకు విష్ణువు ప్రవేసించే కౌసల్యా గర్భ0
         దేవతా  స్త్రీల   యందు   దేవతల  అంశలు  ప్రవేసిమ్చుటకు  సిద్దం
         కొందరు భల్లూకములుగా,   మరి   కొందరు  వానరులుగా   జననం
        ఇంద్రుని అంశతో   వాలి,   సూర్యుని   అంశతో   సుగ్రీవుడు   జననం
      
        కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు ఉండే పునర్వసు నక్షత్రం
        కర్కాటక లగ్నమునందు గ్రహములన్నియు ఉండే ఉచ్చస్తానం
        దివ్య మంగళ విగ్రహుడైన, సుందరుడైన కుమారుడు   జననం
         కైకకు పుత్ర జననం  మరియు సుమిత్రకు  పుత్రులు   జననం

.        సర్వ దేవతలు కురిపించిరి పుష్ప    వర్షం
         గందర్వులు   చేసారు   అద్భుత     గానం
         అప్సరసలు  చే సా రు అద్భుత     నృత్యం
         ఋషులు లేక్కకట్టారు కుమారుల జాతకం
  
         పుత్రులకు చేసే బ్రహ్మ ఋషులు నామకరణం
         కౌసల్యా   సుతుడైన     జేష్టునకు   శ్రీ రామం
          కైకేయ      గారాల      సుతునకు     భరతం
         సుమిత్రా  పుత్రులకు   లక్ష్మణం,   శత్రుఘ్నం
                                              


      
                            హనుమంతుని జననం                                                 
        అంజనా గర్భమునందు శివ తేజస్సుతో  పుత్ర జననం
        వానర రాజు  ముద్దుగా  పిలుచు కొనెను  ఆంజనేయం
       వాయుపుత్రుడు సూర్యుని పండుఅని తినుటకుచేరే గగనం
        ఇంద్రుని వజ్రాయుధం తగిలి భూమిపై  పడె సజీవ శరీరం

        వాయు   దేవుడు   స్తంభిమ్చే పవనం
        ఋషులు    దేవత  లందరు  ప్రత్యక్షం
        త్రిమూర్తులు బ్రతికించే వాయునందనం
        అనేకవరాలతో ఇచ్చే అందరు ఆశీర్వాదం
  
        లోక  రక్షకుడు శ్రీ మహా విష్ణువు శ్రీరాముడుగా అవతారం
        ధర్మ   భోధ శాస్త్రములలో  రామాయణం కావ్యం అగ్రగణ్యం
        వేదములతొ సమానమైన రామాయణం ప్రజలకు మర్గదర్శ0
        నారదుని ఉప  దేశాను  సారం రామాయణం  వాల్మీకి  కృతం
.
        రాజ  కుమారులను   అల్లారు   ముద్దుగా పెంపకం
         శ్రీరాముడనగా ప్రతి ఒక్కరికి అమిత ప్రేమ మయం
         అన్నదమ్ములు కలసి ఆడుకుంటే అందరికి ఆనందం
        దశరధ మహారాజుకు  శ్రీ రాముడంటే ప్రాణానికి ప్రాణం

        రాజ కుమారులు  ప్రతి దినం వేదముల యొక్క స్వాద్యనం
        తల్లి  తండ్రులపై ప్రేమ, అందరి హృదయాలలో సుస్తిరస్థానం
        కుమారులు ప్రతిరోజూ విలువిద్య, సకల శాస్త్రముల అభ్యాసం
        పది సంవస్చరములలొ  సకల  విద్యలలో  పొందే నైపుణ్యం
..
        అయోధ్యలో ప్రతిఒక్కరు పాటలుగా పాడుచున్నారు రామనామం

        ఉన్న   నామములో   కెల్ల   ఉన్నత        మైనది   రామనామం
        వరుస ఎవ్వరు విన్న   వాడి   చెడని        నామం   రామనామం
        ఏజాతివారికైనా ఎమ్గిలిలేని ఎదలో నిల్చిఉన్న నామం రామనామం
        కలియుగంలో కన్నవారికి కనువిందు చేసే కమనీయ నామం రామనామం

        వానకు తడవని, ఎండకు కరగని, చలికి చలించని నామం  రామ నామం
        ఎపుట్ట చూసిన ఎగట్టు చూసిన చెదలు   పట్టని   నామం    రామనామం
        ఇహము   పరము సర్వ సుఖములు   ఇచ్చు    నామం     రామనామం
        నమ్మిన    వారికి   కొంగు   బంగారమై   ఉన్న    నామం    రామ నామం

        కోరినవారికి కోరికలు తీర్చి సంతోషము పంచే నామం రామనామం
        రామ భక్తులకు   మోక్షము   ప్రసాదించే   జపనామం రామనామం
        గాలిలో తేలి   గగనము  నందు   మారుమ్రోగే నామం రామనామం
        అక్షర జ్ఞానము లేని ఆది మానవులను ఆదుకొన్ననామం రామనామం
  
        చిందులు      వేసే చిలకపలుకుల   నామం   రామ  నామం
        చింతలు    తీర్చి చిరునవ్వులనవ్విమ్చే నామం రామనామం
        నిగ్రహశక్తి, ధైర్యమును ప్రజలకు కల్పించే నామం రామనామం
        రామభక్త హనుమంతుని నిత్యము పలికే నామం రామనామం

                                                                                                                  

  వసిష్ఠ మహర్షి దశరధ కుమారులకు కొన్ని సూక్తులు తెలియపరిచారు
 

          1. శిష్యుడు : భూమిని సృష్టించుటకు పూర్వము ఎవరున్నారు ?
గరువు : పంచ భూతములు ఈశ్వరుడు.

2. శిష్యుడు : భూమిని జీవ రాసిని ఎవరు సృష్టించారు ?
గరువు : ఈశ్వరుడు.

3. శిష్యుడు : సృష్టిని ఎవ్వరు వృద్ది పరుస్తారు ?
గరువు : బ్రహ్మ దేవుడు.

4. శిష్యుడు : బ్రహ్మ దేవుడు ఎవరు ?
గరువు : ఆది పరా శక్తి
   
5. శిష్యుడు : సృష్టిని పాలిమ్చేదెవరు ?
గరువు : శ్రీ మహా విష్ణువు

6. శిష్యుడు : విష్ణువు ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి

7. శిష్యుడు : సృష్టిని లయము, ధ్వంసం చేసేదెవరు ?
గరువు : ఈశ్వర శక్తి
   
8. శిష్యుడు : బ్రహ్మిణి ఎవరు ?
గరువు : బ్రహ్మదేవుని శక్తి

9. శిష్యుడు : లక్ష్మీ దేవి ఎవరు ?
గరువు : విష్ణువు యొక్క శక్తి

10.శిష్యుడు : పార్వతి ఎవరు ?
గరువు : ఈశ్వర శక్తి

11. శిష్యుడు: సంసార సాగరాన్ని తరిమ్పచేసేదెవరు?
గురువు: ఈశ్వరుదు
   
12. శిష్యుడు: భంధం అంటే ఏమిటి ?
గురువు: విషయాను రక్తి .
   
13. శిష్యుడు: ముక్తి అంటే ఏమిటి ?
గురువు: విషయం వళ్ళ విరక్తి చెంది ఈశ్వరునిలో లీనము కావడం.
   
14. శిష్యుడు: ఘోరమైన నరకము ఏది ?
గురువు: మానవ శరీరమ్ .
   
15. శిష్యుడు: స్వర్గం ఎక్కడ ఉన్నది ?
గురువు: ఆశలు అంతరిస్తే ఈ భూమె స్వర్గం.
   
16. శిష్యుడు: సంసార భంధం ఎట్లా తొలగి పోతుంది ?
గురువు: ఆత్మ జ్ఞానము వలన.
   
17. శిష్యుడు: ఏమి చేస్తే ముక్తి లభిస్తుంది ?
గురువు: తత్వజ్ఞానము వలన .
   
18. శిష్యుడు: నరకమునకు కారణమేది ?
గురువు: ఆశ, తృప్తి లేక పోవడం.
   
19. శిష్యుడు: స్వర్గ ప్ర్రాప్తికి కారణ మేమి ?
గురువు: అహింస, దాన గుణం, గౌరవించే లక్షణం.
   
20. శిష్యుడు: మనిషికి శత్రువు ఎవరు ?
గురువు: అతని ఇంద్రియాలు
   
21. శిష్యుడు: మనిషికి మిత్రు డెవరు ?
గురువు: వశీక్రుతములైన ఇంద్రియాలు
   
22. శిష్యుడు: దరిద్రు డెవరు ?
గురువు: పరమ లోభి ఐనవాడు
   
23. శిష్యుడు: ఇశ్వర్య వంతు డెవడు ?
గురువు: ఎప్పుదూ సంతృప్తిగా ఉండేవాడు
   
24. శిష్యుడు: జీవన్ మృత్యు డెవడు ?
గురువు: ప్రయత్నమే చేయని పురుషుడు.
   
25. శిష్యుడు: మాయ అంటే ఏమిటి ?
గురువు: అతి ప్రేమ
   
26. శిష్యుడు: మహా అందు డెవడు ?
గురువు: కామాతురుడు.
   
27. శిష్యుడు: మ్రుత్యు వంటే ఏమిటి ?
గురువు: అపకీర్తి.
   
28. శిష్యుడు: చిరకాలము ఉండే రోగం ?
గురువు: సంసారం .
   
29. శిష్యుడు:రోగమునకు మందేమిటి ?
గురువు: నిర్లపుడై ఉండటం, దయానం చేయడం
   
30. శిష్యుడు:ప్రధాన తీర్ధమేది ?
గురువు: పవిత్రమైన మనస్సు
   
31. శిష్యుడు: త్యాజ్య మేది?
గురువు: అర్ధము- దురాశ
   
32. శిష్యుడు: వినదగినదేది ?
గురువు: గురు సంనిధిలో వేదాంత భోధ
   
33. శిష్యుడు: బ్రహ్మ ప్రాప్తికి ఉపాయమేమి ?
గురువు: సత్ సాంగత్యం, స్త్రీ సహకారం
   
34. శిష్యుడు: సాధువు ఎవడు ?
గురువు: మోహము, అనురాగము లేనివాడు
   
35. శిష్యుడు: జీవునికి జ్వరమేది ?
గురువు: చింత, అనుమానం
   
36. శిష్యుడు: మూర్ఖు డనేవాడేవడు ?
గురువు: అవివేకి, ఆశావాది
   
37. శిష్యుడు: నాస్తికుడనె వాడేవడు ?
గురువు: ఈశ్వరుని సకితి తెలియనివాడు
   
38. శిష్యుడు: నిగ్రహ శక్తి నిచ్చేవాడు ?
గురువు: ఈశ్వరామ్శ గలవాడు

39. శిష్యుడు: పండితు డనే వాడేవడు?
గురువు: మహా జ్ఞాని
   
40. శిష్యుడు: ధార్మికుడు డనే వాడేవడు?
గురువు:యదార్ధ పండితుడు
   
41. శిష్యుడు: ఎవరి సాంగత్యం చెయకూడదు ?
గురువు: మూర్ఖునితో, పాపితో, దుర్మార్గుడితో, వేశ్యతో

42. శిష్యుడు: ఎవరు పశువు ?
గురువు: పాపి

43. శిష్యుడు: లోకులకు తెలియనిది ఏది?
గురువు: స్త్రీ వయస్సు, స్త్రీ చరిత్ర

44. శిష్యుడు: సంకెల, భంధం ఏది?
గురువు: స్త్రీ ప్రేమ

45. శిష్యుడు: భుద్ధిమంతుడెవడు?
గురువు: స్త్రీ కి వశము కానివాడు

46. శిష్యుడు: ఉత్తమ వ్రతమేది ?
గురువు: సత్పాత్ర దానం

47. శిష్యుడు: ధన్యుడైనవాడెవడుు?
గురువు: పరోపకారి

48. శిష్యుడు: కర్తవ్యం ఏమిటి ?
గురువు: మొహం లేదా పాపం

49. శిష్యుడు: పూజనీయుడైనవాడెవడు?
గురువు: తత్వజ్ఞానిఐన వ్యక్తి

50. శిష్యుడు: సుఖవంటి వాడెవడు ?
గురువు: చిమ్తలేనివాడు

51. శిష్యుడు: దుఖితిడెవడు ?
గురువు: వియానురక్తి కలవాడు

52. శిష్యుడు: జద్విజేత ఎవరు ?
గురువు: మనస్సును జఇమ్చినవాడు

53. శిష్యుడు: లాభమంటేఏమిటి ?                                                                                                                   గురువు: బ్రహ్మజ్ఞాన ప్రాప్తి

54. శిష్యుడు: విద్య అంటే ఏమిటి ?                                                                                                                        గురువు: బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది

55. శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు: భగవంతుని పట్ల భక్తీ

56. శిష్యుడు: కనిష్టుడు ఎవరు ?
గురువు: యాచిమ్చువాడు

57. శిష్యుడు: జైష్టుడు ఎవరు ?
గురువు: ఎవ్వరిని యాచిమ్చనివాడు

58. శిష్యుడు: జన్మించిన వారెవరు?
గురువు: మరలా జన్మలేనివారు

59. శిష్యుడు: చని పొఇనవారెవరు ?
గురువు: తిరిగి చనిపోవలసిన అవసరం

60. శిష్యుడు: విశ్వాసము కలవారెవరు?
గురువు: తత్వజ్ఞాని

61. శిష్యుడు: అసలైన మిత్రుడు ఎవరు ?
గురువు: ఆపత్కాలములో సహాయము చేసినవాడు

62. శిష్యుడు: దేనివలన భయ పడాలి?
గురువు: లోక అపవాదు వలన

63. శిష్యుడు: చిరస్తాఇ ఏది ?
గురువు: కాలం

64. శిష్యుడు: దినదినము కరిగి పోఎదిఎది ?
గురువు: వయస్సు

65. శిష్యుడు: దానం చేసినకొద్ది పెరిగేది ఏది?
గురువు: పుణ్యం

66. శిష్యుడు: భయము వచ్చినప్పుడేమి చేయాలి ?
గురువు: ఈశ్వరుడిని ప్రార్ధించాలి

67. శిష్యుడు: ఏది దాన యోగ్యమైనది ?
గురువు: అభయ ప్రదానము

68. శిష్యుడు: మనో వినాశనము అంటే ఏమిటి ?
గురువు: మోక్షము

69. శిష్యుడు: ద:ఖమునకు మూలమేది ?
గురువు: మాయ

70. శిష్యుడు: ఏమిచేస్తే దు:ఖము కలుగదు ?
గురువు: ధర్మమము ఉపాసన

71. శిష్యుడు: విశ్వసిమ్ప దగిన వారెవరు?
గురువు: స్త్రీ (భార్య)

72. శిష్యుడు: తల్లి తండ్రు లెవరు ?
గురువు: పెంచి పోషించేవారు

73. శిష్యుడు: భార్య ఎవరు ?
గురువు: సుఖ పెట్టి సుఖపడెది

74. శిష్యుడు: చంచలమైనది ఏది ?
గురువు: మనస్సు, యవ్వనము, ఆయువు, ధనము

75. శిష్యుడు: ఎ పని మంచిది ?
గురువు: దేవుని ప్రార్ధిమ్చటమ్

76. శిష్యుడు: చేయ్యకూడని కార్యమేది ?
గురువు: పాప కార్యము

77. శిష్యుడు: దేనికోసం ప్రయత్నం చెయకూడదు ?
గురువు: సంసారం

78. శిష్యుడు: దేనిని ప్రేమించాలి ?
గురువు: ప్రకృతిని

79. శిష్యుడు: మిత్రులు-శత్రువులు ఐనవారెవరు
గురువు: పుత్రులు, పుత్రికలు

80. శిష్యుడు: దేనివడ్డ కలతలు వస్తాయి ?
గురువు: దానం వద్ద

81    వినయం ఎట్లా ఏర్పడుతుంది?
    గురువులను విద్య వంతులను, సేవిమ్చాడంవల్ల వినయం అలవడుతుంది

82    ఆత్మ సంపాదనం అంటే ఏమిటి?
    పెద్దల సహవాసం చేసి సంపాదించుకొన్న విజ్ఞానంచేత తనను సంపాదించుకోవాలి. వినయం,
    విజ్ఞానం ఈ రెండూ లేనివాడు తనను తానూ కోల్ఫోఇనట్లే. ఈరెండూ ఉన్నవాడు తనను తానూ చక్క
    బరచుకొన్న వాడవుతాడు, ఆత్మ సంపాదనం అంటే ఇదే.

83    రాజ్యపాలనకు అవసరమైనవి ఏవి?
    అమాత్యులు, మిత్రులు,ధనాగారం,రాష్ట్రం,దుర్గం, సైన్యం ఈ ఆరింటిని వక్రుతులని పేరు.    రాజ్యపాలను కావలసినవి ఇవే.

84    మంత్రులంటే ఎవరు?
    ఏది చేయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాన్ని బాగా తెలుసుకో గలికిన వాళ్ళే నిజమైన    మంత్రులు.

85    మంత్రిగా ఎవరిని తీసుకొవాలి?
    శాస్త్రజ్ఞానం ఉన్న, ఎ ప్రలోభానికీ లొమ్గనివాణ్ణి మంత్రిగా చేసుకోవాలి, ధనం, స్త్రీ మెదలైనవాటిని    ఎరచూపి రహస్యముగా పరీక్షిమ్చడమ్ అలాంటి పరిక్షలలో పరిసుద్ధుడుగా తెలినవాడు    "ఉపధాశుద్ధుడు"

86    రహస్యం ఎట్లా బయటబడుతుమ్ది?
    ముగ్గురు కలిస్తే వాళ్ళు ఒకేమాట మీద ఉంటారనేదె నమ్మజాలని విషయం. ఆలాంటప్పుడు    ఇద్దరుచేసిన మంతనాలు మూదొవాడికి తెలిస్తే దాగుతాయా?

87    రాజ్య తంత్రం అంటే ఏమిటి?
    లేనిదాన్ని సంపాదించడం, సంపాదిమ్చినదాన్ని రక్షించుకోవడం దాన్ని వృద్ధి పోమ్దిమ్చుకోవడం,    తగిన రీతిలొ వినియోగించడం. ఈ నాలుగే రాజ్యతంత్రం (రాజ్య వ్యవహారం) అంటారు.

88    అన్ని పనులకు మూలమ్ ఏమిటి?
    అన్ని పనులకీ మూలమ్ మంత్రం (మంచి ఆలోచన)

90    ఎవరితో విరోధం పెట్టుకో కూడదు ?
    బలంగా ఉన్నవాడు తనకంటే తక్కువ బలం ఉన్న వాడితో విరోధం పెట్టు కోవాలి, తనకంటే    ఎక్కువ బలం ఉన్న వాడితో గాని, సమునితొ గాని విరోధం పెట్టుకోకూడదు.

    91    ఆత్మ రక్షణ అంటే ఏమిటి?
    శత్రువులతో విరోధం వల్ల అనగా శత్రువులు విరోధం చూపు తున్నప్పుడు ఆత్మ రక్షణ చేసికోవాలి    లేదా శత్రువులతో విరోధంకంటే ఆత్మ రక్షణకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

92    శక్తి లేనివాడు ఏమిచేయాలి?
    బలవంతుని ఆశ్ర ఇమ్చాలి, దుర్బలున్ని ఆశ్రయిస్తే కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లే.

93    ఇంద్రియాలకు లోమ్గినవాడెమవుతాడు?
    ఇంద్రియాలకు లొంగి పోఇనవాడు చతురంగబలం ఉన్న నశిస్తాడు. గజ-తురగ-రాధా-పదాతు లానే చతురంగాబలం ఆనాడు,
    వాయుసేనా, జలసేనా, యుద్ధసకట, సైనికులనేవి ఈనాడు చతురంగబలం.

94    శిష్యుడు:దండ నీతి అంటే ఏమిటి?
    దండం అనగా అపరాదుల్ని శిక్షిమ్చడమ్, రాజ్య్యాన్ని పాలించాడం. శత్రువు దండ నీతికిలోమ్గుతాడు.    దండంలో పరుషంగా ఉంటే అమ్దరికీ ద్వేష పాత్రుడు అవుతాడు.

95    శిష్యుడు:పురుష ప్రయత్నం అంటే ఏమిటి?
    దైవం పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది. అనగా పురుష ప్రయత్నం చేస్తే దైవం కూడా దానంతట అదే తోడ్పడుతుంది.
   
96    అనుకున్నవి జరుగక పోవడం కారణం?
    దైవదోషం చేతా, మానవ దోషంచేతా పనులు జరుగవు.

97    లోకం ఎవరిని గౌరవించదు?
    గురువు: ఎంత చదువు వడైనా శక్తి లేని వాణ్ణి లోకం గౌరవించదు.

98    అర్ధం - అనర్ధం అంటే ఏమిటే?
    స్త్రీ రిద్వారా వచ్చిన అర్ధం (ధనం) దానికి విపరీతమ్గా 'అనర్ధం' (అపకార హేతువు) అవుతుంది.

99    ఎవరిని నమ్మ కూడదు ?
    చడీలు చెప్పే వారిని నమ్మకూడదు. చాడీలు చెప్పే వారిని భార్య పుత్రులు కుడా విడిచి పెడతారు.

100    ముసలి తనం అంటే ఏమిటి ?
    పురుషుడికి మైధునం ముసలితనం (దౌర్బల్య హేతువు), స్త్రీకి మైధునం లేకపోవడం ముసలితనం.

101. సంతోషం ఎట్లా వస్తుంది?.
       అసంతుష్టుడైన వ్యక్తీ ఎవరినీ సంతుష్టుని చెయ్యలేడు. సంతుష్టుడైన వ్యక్తీ అందరిని సంతోషపరుచగలడు

102. అనర్ధాలకు మూలమేది ?
       అన్ని అనర్ధాలకు మూలము ఆలస్యమే అందువలన ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా ఆలస్యాన్ని       పరిత్యజిమ్చాలి.

103. పరీక్ష అనగానేమి?
       ఈ ప్రపంచమునందు ధర్మాధర్మములకు పరీక్షాస్థలము. అందువలన సావధాన చిత్తులై, ధర్మాధర్మ పరీక్ష       చేసి పనులను చేయాలి.

104. సహవాసమంటే (స్నేహం) ఏమిటి?
  .    సజ్జన స్నేహం స్వర్గం, దుర్జన స్నేహం నరకం.

105. హింస అంటే ఏమిటి?
       ఎవరినీ ఎప్పుడూ హింసించకూడదు. మంచి ఉద్దేస్యమితొ కాని చెడు ఉద్దేస్యముతో కాని ఎ ప్రాణిని ఎ  సమయములో హింసించ కూడదు.

106. మొక్షమునకు మార్గాము లేవి?
        ఆత్మజ్ఞానము, సత్పాత్రదానం,సంతోషముగా ఉండటమే మొక్షమునకు మార్గాము

107. చింతన అంటే ఏమిటి?
       చింతన శీలము (ఆత్మవిమర్శన) అమరత్వము పొందడానికి మార్గం.అధర్మ చింతనయే మృత్యువుకు       మార్గం    

108. శత్రువు ఎవరు?
       చేడుమార్గాములో నడిచే మనస్సు.

109. విద్య సముపార్జన అంటే ఏమిటి ?
       తేనటీగ పూల సౌందర్యము సుగంధములు చెడకుండా తేనెను మాత్రం ఎట్లా గ్రహిసుమ్దో, అట్లాగే నీవు       కూడా పాపములు అంటకుండా విద్య సముపార్జన చేయాలి.

110. జయమంటే ఏమిటి ?
       యుద్ధములో లక్షమందిని జఇమ్చిన వాడు నిజమైన విజేత కాడు,తనను తానూ జ ఇమ్చిన వాడె       నిజమైన విజేత, అదే నిజమైన  జయం.
                                              
        నిస్పృహ    చెందవలసిన   పనిలేదు శక్తిని  పెంచుకోండి
        అంతర్గత    శక్తిని  గ్రహించి   ధైర్యముతో    పైకి   లేవండి
        సంకల్పానికి   నడుంకట్టి సాధించడానికి సంకల్పిమ్చండి
        భాద్యత మొత్తాన్ని సృష్టి కర్తవల్ల జరిగిందని మరువకండి
.
        వ్యక్తిత్వ వికాసం ప్రతిఒక్కరు పెంచుకోండి
        లైమ్గిక కోరిక  మనసు లోకి రానీయకండి
        భయం  వదలి   నిర్భయముగా  బ్రతకండి
        అహంకారం అణువంతకుడా రానీయకండి

        బుద్ధిని  వికసిమ్ప చేసే విద్య  నభ్య  సిమ్చండి
        మానసిక శక్తిని పెంచే యోగాసనాలు చేయండి
        భవిషత్ గురించి ఎటువంటి ఆశలు పెట్టుకోకండి
        జగతిలో మిమ్మల్ని  గుర్తించే వారిగా   ఎదగండి
.
        యువకులార     గురువు     వద్ద     విద్యలు    నేర్చు కొండి
        మీ భుజ  బలంతో   పాటు  భుద్ది బలం   కూడ   పెంచు కోండి
        వేదాంత   సారాన్ని  అర్ధం చేసు  కోవ టానికి ప్రయత్నించండి
        దినచర్యలో పెద్దలను,గురువులను గౌరవించటం మరువకండి

        వల్లమాలిన    మంచితనం      ప్రవర్తిమ్చ్  కండి
        ఎప్పుడూ  కష్టాలను     ధైర్య ముగా  ఎదుర్కొండి
        ప్రతి  పనిని నమ్మకంతో  చేయగలనని చెప్పండి
        రాజవంశానికి చెందిన ఆచారాలను మరువకండి

        మచ్చలేని   పవిత్రమైన     రాజ్యముగా   పాలించండి
        అజ్ఞానులకు వెలుగును చూపి జ్ఞానులుగా మార్చండి
        అసమర్ధత,   సోమరితనం  నిజమైన పిరికితనమండి
        ప్రజల   అవసరాలు      తెలుసుకొని   సహకరించండి

        బ్రహ్మ  చర్యమును    నిర్లక్షము     చేయ  కండి
.       ప్రేమ, కారుణ్యం,శాంతి, సంతోషములు పంచండి
.       ప్రజలకు  నిజాఇతి     చిత్త సుద్ధి   కల్పిం   చండి
.       ఆత్మ    విశ్వాసంతో   ధర్మ పరిపాలన  చేయండి
                                             
.        విశ్వామిత్రుడు   అయోధ్యకు   వచ్చె  యాగ  రక్షణకు
         యాగ రక్షణకు శ్రీ రాముని  కోరి  దశరధుడు  పంపెను వర్తమానం
      
        మహ తెజో  వంతుడు   విశ్వామిత్రుడు    అయోధ్యకు ఆగమనం
        పరమ ఉదార స్వభావుడు దశరధుడు విశ్వామిత్రునకు సన్మానం
.       రాజర్షులు   మమ్ము  అనుగ్రహించండి,   తెలపండి మీ  మనోరధం
        నా మనస్సు వెధిస్తూ ఉన్నది కోరిక తీరుస్తారా లేదా అని సంశయం

        మహారాజ నేను సిద్ధినికోరి ప్రారంభించాను మహాయజ్ఞం
        రాక్షసులు    యజ్ఞమునకు   కలిగిస్తున్నారు   ఆటంకం
        వారిని  ఎదుర్కొని   కోప   తాపలతో  చేసే యజ్ఞం వ్యర్ధం
.       వారిని  చంపే   తపశక్తి   ఉన్న చేయను వారితో యుద్ధం

        రాజ యాగ రక్షణకు శ్రీ రామూడ్ని పంపి చేయండి సహాయం
        విశ్వామిత్ర కోరిక  విన్న  దశరధ మహారాజు చెందే విస్మయం
        యాగ రక్షణకు    నేనే   స్వయముగా    వస్తానని   విన్నపం
         దశరధ మాటలయందు తొనికిసలాడుతుంది పుత్రవాత్సల్యం
  
        విశ్వామిత్రుడు కోపముతో రఘు వంశీయులకు తగదు ప్రతిజ్ఞాభంగం
        వసిష్ఠ మహర్షి దశరధుని పిలిచి శాంతింప చేయండి విశ్వామిత్ర కోపం
        ధైర్యవంతులు కుమారుని విశ్వామిత్రుడుతో పంపుట అనేది మీ ధర్మం
        భార్యలను పిల్లలను సంప్రదించి విశ్వామిత్ర కోరిక తీర్చుట శ్రేయస్కరం
.
        సర్వసాస్త్రములు తెలిసిన  వారితో కుమారుని  పంపుట  కెందుకు భయం
        గురువర్య వయస్సులో చిన్నవాడు రాముడ్నిపంపటమా అనేదే సందేహం
        విశ్వామిత్రుని శక్తి నాకు తెలుసు రాజగురువుగా చేస్తున్నాను హితోపదేశం
        శ్రీ రామునితో   లక్ష్మణుని   కుడా    పంపుటకు   దశరధుడు  అంగీ  కారం

        తల్లి  తండ్రుల  మాటప్రకారం  రాజర్శితో వెళ్ళుట సిద్ధం
        రామ లక్ష్మనులు గురువులకు పెద్దలకు చేసే వందనం
        తల్లులకు ప్రజలకు  తెలిపే  చేయగలం  కార్యస్సఫలం
        మీ అందరి  దీవెనలు  కావాలి   మాకు  ఈ సమయం

        గోభ్రాహ్మణుల   హితము   కొరకు  మేము  సిద్ధం
        దేశ రక్షణకు ఎంతటి  త్యాగాన   కైన   వెనుకాడం
        మహాత్ముల  ఆదేశం   పాటిమ్చటమెమా కర్తవ్యం
        గురువర్యులు చెప్పిన విదముగా నడుచుకుంటాం

        ప్రభాత   సమయమున  రామ   లక్ష్మణులు  ప్రయాణం
        ప్రయాణంలో  భోధించే  రాజకుమారులకు  ఆత్మప్రభోధం
        రామ నీ జన్మ వళ్ళ అజ్ఞానులకు కలుగును జ్ఞానోదయం
.       సర్వులకు ఆదర్సప్రాయులుగా జీవిమ్చుటే మానవధర్మం
                                                   

                        

   తెల్లవారుజామున    దైవకార్యములు  నెరవేర్చుట ధర్మం
        మన:   సంకల్పంతో  ఎంతటి పనిఐనచేసి పొందాలి జయం
        నిత్య పారాయణం  వళ్ళ కలుగును మనస్సు శాంతి మయం
        నిగ్రహ  శక్తితో ప్రతిఒక్కరు నిత్యమూ చేయాలి వేదాద్యయనం

        ప్రయత్నం వళ్ళ   జరుగుతుంది    మానవ    జన్మ సౌఖ్యం
        అప్రయత్నం  వళ్ళ  సుఖ సౌలభయ్యం   జీవితమ్  దుర్లభం
        సుఖ   దు:ఖాలు  మానవులకు  ఏర్పడుట దైవ   సంకల్పం
        పాపరహితుడుగా ప్రక్రుతి అనుసరించి చేసే జీవనమ్ ముఖ్యం

        స్త్రీ పురుషుల   మద్య  ఆకర్షణ   శక్తి   అమోఘం
        అర్ధం పర్ధం లేని మాటలతో కాలంగడపడం వ్యర్ధం
        స్త్రీని   అర్ధం    చేసుకొని  మాట్లాడటం  చాల కష్టం
        స్త్రీ పురుషులు   ఎక   మవటం దేవుని సంకల్పం
.
        మనుష్యుల మద్య   ఆత్మీయతా    భంధాలను విస్తరించడం
        మనుష్యుల్లొఉన్న పశుప్రవ్రుత్తి లేకుండా చేయాలి ప్రభావితం
        ఐస్వర్యాన్ని చూసి మనసు అసూయ   పడకుండా చూడటం
        సత్పురుషులను  సేవించి  శాంతిని  పొందే  జ్ఞానం పొందడం

        రామలక్ష్మణులకు బల అతిబల అనే మంత్రములు ఉపదేశం
        ఎంత పని చేసిన శ్రమ, రోగము ఉండదు ఈ మంత్ర ప్రభావం
        అడిగినదానికి వెంటనే స్పురణకు వచ్చి చెప్పగలరు సమాధానం
        సౌభాగ్యం,    దాక్షిణ్యం,    తెలివితో    కూడిన    బుద్ధి  నిర్ణయం

        సత్య,  సౌహార్ద్ర,   దయ,   క్షమ,    మృదుత్వం
        ధీరత్వ, వీరత్వ,.    ఘం భీర్య,      శాస్త్రవిజ్ఞానం
        పరాక్రమ, నిర్భయత్వ, శాంతి, తితిక్ష, వినయం
        ఉపరతి     సంయమనం,     నీతిజ్ఞత,   త్యాగం

        తెజో ప్రీతి,   మర్యాద,   రక్షణ,  ఏకపత్నీ వ్రతం
        ప్రజారంజకత్వ,  బ్రాహ్మణ   భక్తి,    మైత్రిభావం
        మాత్రు పితృభక్తి, గురుభక్తి, సరణాగత వత్చలం
        భ్రాత్రుప్రేమ, సరళత్వం, వ్యావహారిక కుశలత్వం
.
        ప్రతిజ్ఞాపాలనం,       పవిత్రత,      సాదు    రక్షణం
        దుష్టదళనత్వం,       నిర్వైరత్వం,     ధర్మజ్నుత్వం
        లోకప్రియత్వం, బహూజ్ఞత్వమ్,ధర్మపరాయణత్వం
        పరదోషాన్వేషణ రాహిత్యం, సకల సద్గుణాలు రామం

        పుణ్య   ఫలము     కావాలని     ఆశిమ్తురు
        పుణ్యకార్యములు    చేయుటకు పూనుకోరు
        పాప   ఫలము    నాకు  అక్కర  లేదందురు
        పాప కార్యములు చేయుటకు పూనుకొందురు
.
        అజ్ఞానము అవి వేకముతో
        అవివేకము అభి మానముతో
        అభిమానము     క్రోధముతో
        క్రోధము కర్మతో కర్మ జన్మతో

.        జన్మ ద:ఖముతో కూడుకున్నవి.

        వేదముల యందు ఓంకారం
        సూర్య చంద్రులయందు ప్రకాశం
        భూమి యందలి సుఘంధం
         అగ్ని యందలి ఉష్ణం

        ఆకాశము నందలి శబ్ధగుణం
        జలము నందలి తీయదనం
        నరుల యందలి అహంకారం
         సర్వభూతముల యందలి  ప్రాణం

        స్త్రీ పురుషుల యందు కామం
        సద్వినియోగం  ఐతే స్వర్గం
        దుర్వినియోగం ఐతే నరకం
        ప్రకృతిలో సమస్యలు పరిష్కారం



రామచంద్రా తాటకి గురించి ముందుగా నీకు తెలిపెద ఒక రాక్షసి , స్త్రీలలలొ కూడా దుర్మర్గులుంటారు, వారి మీద జాలి ఉంచి    ఉపెక్షించ      కూడదు , వారి వలన దేశం నాశనమై పోతుంది, కనుక స్త్రీల మీద కుడా  అవసరాను బట్టిఅస్త్రాలుఉపయోగించాలి.                           
నా యజ్ఞ వాటికను నాశనము చేస్తున్నది   
 
        ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు మలద - కురాళ ప్రాంతం
        సుకేతుడనె యక్షుడు పాలిస్తున్నాడు ఈ విశాల రాజ్యం
        బ్రహ్మను గూర్చి బ్రహ్మాండమైన తపస్సు చేసి పొమ్దె వరం
        వర ప్రభావముతో వేయి ఏనుగుల బలముగల పుత్రిక జననం

        తాటకి అను పేరు పెట్టి సుమ్దనకు ఇచ్చి చేసే వివాహం
        వారికి మారీచ సుబాహులు కలిగే పుత్ర సంతానం
         పుత్రులతోకలసి మునులపై చేస్తున్నారు అఘాఇత్య0
        చిక్కిన జీవులను చంపి తినడం వీరి నిత్య కృత్యం

        ఒకనాడు అగస్య మహాముని ఆశ్రములొ చేరి చేసే తాండవం
        అగస్య మహామునిని చంపుటకు చేసే రాక్షస కుతంత్రం
         అగస్యుడు తాటకి పై కోపించి విక్రుతముగామారమని పెట్టె శాపం
        తాటకి కురూపిగా మనుష్యుల మాంసం తింటూ కలిగించే భయం

        రాక్షసి భయంతో ప్రజలందరు వెడలి పోయిరి  దూరదేశం
        తాటకి ఋషులు యజ్ఞం చేయకుండా కలిగిస్తుంది ఆటంకం
         ప్రజలను పీడిమ్చెవారు స్త్రీ ఐన సంహరించడం ప్రభువు ధర్మం
        గురువాక్కు బ్రహ్మ వాక్కుగా రాజ ధర్మంతో చేసే యుద్ధం

        విశ్వామిత్రుడు శాస్రొక్తముగ ప్రారంభించే యజ్ఞం
        రాముడు ఒక్క భాణము తో చేసే తాటక సంహారం
         మారిచునిపై వాయువాస్త్రం వేసి చేసే భహిష్కారం
        ఆగ్నేయాస్త్రం వేసి సుభాహుని చంపి ఉండే యజ్ఞక్షేత్రం

        రామ గురువుగా ఉండి నాకు తెలిసిన విద్యలు నేర్పడం
        మీ తండ్రిగారు చెప్పినట్లుగా అయోధ్యకు చేర్చడం
         మీలో ఉన్న ధర్మ సందేహాలకు సమాధానాలివ్వడం
        పంచ భూతాల సాక్షిగా ధర్మం తప్పవని చేసే వాగ్దానం

        రామ వాయువుని నిగ్రహిమ్చుట కొంతవరకు సాద్యం
        శరీరమునకు ఇంద్రియములను క్షోభపరుచుట సాద్యం
        ఎవ్వరికైనా మనస్సును నిగ్రహించుట చాలా అసాద్యం
        చంచల మనస్సుగలవానికి జ్ఞాన భోధ చేయుట అసాద్యం

            విచారముతో చేసేపని  జయిమ్చుట  నశక్యం
.        అన్యమనస్సుతో ఉన్నవానికి నిజం చెప్పుట నశక్యం
         సూర్య చంద్రుల కాల గమనం మార్చుట నశక్యం
        అగ్నిని గుప్పేట, ప్రళయం సృష్టిమ్చుట నశక్యం

        అగ్ని యొక్క రూపమ్ రక్తమయం
        తేజస్సు యొక్క రూపమ్ క్షీర మయం
         జలము యొక్క రూపమ్ కలుషిత మయం
        మంచు యొక్క రూపమ్ పుష్ప మయం

        మససాక్షిని బట్టి నడుచు కోవడం మానవ ధర్మం
        గురువులు పెద్దలుచేప్పినది పాటించడం కుల ధర్మం
         చేతన్యముతో తెలుసుకొనేది ప్రక్రుతి నిజమైన ధర్మం
        ఎదుటివారి మనసు ఎరిగి మాట్లాడుట కుటుంబ ధర్మం

        రామ చంద్రా నీ మూలముగా ఈ సిద్ధాశ్రమం పావనం
        నీసహాయముతో యాగం నిర్విఘ్నముగా సమ్పూర్ణ0
         రామలక్ష్మణుల పరాక్రమును చూసి మునులకు ఆనందం
        నీకు వెన్నతో పెట్టిన విద్య వినయ విధేయతలు చూపఠం
                                              

       
కుశిక రాజ్య చరిత్ర గురిచి రాముడుతో విశ్వామిత్రుడు తెలిపే

        బ్రహ్మ దేవునికి మానసిక పుత్రుడు జన్మించే కుశిక చేసే నామదేయం
         దృడవ్రతుడు, ధర్మజ్ఞుడు, సౌర్య సంపన్నుడు, పరిపాలించే ఈ దేశం
         శోభయా మానముగా, శస్య స్యామలముగా పాలించిన ప్రాంతం
        మహారాజు మహకులీన ఐన విదర్భ రాజపుత్రిని చేసుకొనే వివాహం

        చతుర్విధ పురుషార్ధముల యందు నీమముతోచేసే సంసారం
        రాజదంపతులకు కలిగిరి నలుగురు పుత్ర సంతానం
         సకల విద్యలు నేర్చుకొని పాటించిరి ఆశ్రమ ధర్మం
        ధార్మికులై, సత్య సంధులై పాటించిరి క్షత్రియ ధర్మం

        రాజ్యమును నాలుగు భాగములు చేసి కుమారులకు చేసేసొంతం
        పరిపాలన ధర్మ దీక్షతతొ, ప్రజలకు కలిగించాలి సంతోషం
             కుసాంబుడు కౌశిమ్బి, కుశనాభుదు మహోదయం అనే నగరం
        అదుర్తరజకుడు ధర్మారణ్యం, వసువు గిరి వజ్రం అనే నగరం

        ఇదు కొండల నడుమ మాగదీ నది అద్బుత ప్రవాహం
        నలుదిక్కులా విస్తరించెను ప్రాసామ్తత కల్పించే సౌదర్యం
         రాజకుమారులు అమ్దిమ్చిరి ప్రజలకు ఆనందమైన జీవితం
        కుమారులు సద్గుణ సంపన్నులై పాలిమ్చిరి రాజ్యం

        కుశనాభునకు నూరుగురు పుత్రికా సంతానం
        తండ్రి పుత్రికలకు చేసే హిత భోధ కహమే దానం
         క్షమే యజ్ఞం, క్షమే యశస్సు, క్షమే సత్యం
         పుత్రికలు తెలుసుకొనే క్షమే సమస్త ధర్మాలకు మూల0

        నూరుగురు కన్యలు చేసిరి వన విహారం
        వాయుదేవుడు వారిని చేసి మోహ పరవశం
         మిమ్మల్నందరిని నేను చేసుకుంటాను వివాహం
         మాన వత్వం పోయి కలుగుతుంది దైవత్వం

        వాయుదేవ మా అందరిలో నివు అమ్తర్లీనం
        మా హృదయాన్ని అనుకరించి చేసేది ధర్మం
         మా తల్లి తండ్రులకు గారాల ముద్దు బిడ్డలం
        మాతండ్రి ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారితోనే వివాహం
.
        వాయు దేవా మేము కన్యలం లేదు మాకు స్వాతంత్ర్యం
         మాకు సుఖములు పెంచే తల్లితండ్రులు మాకు దైవం
         తండ్రి ఆజ్ఞను మీరి మేము మీతొ వచ్చుట కాదు న్యాయం
        వంశ ధర్మాన్ని అనుస రించి ప్రవర్తించుట మా కర్తవ్యం

        నీటి చుక్క రాలితే పట్టుకోవటం కష్టం
        నోటిమాట దాటితే తీసుకోవడం కష్టం
.        ప్రకృతిని వ్యతరేకిచి బ్రతకటం కష్టం
        తల్లితండ్రులను ధిక్కరించి జీవించుట దుర్లబం

        వాయు దేవా మా తండ్రిని సంప్రదించి చేసుకోండి వివాహం
        దేవతాముర్తులని మీ మీద మాకు ఇంకా ఉంది గౌరవం
        ఓర్మి గలవారికి ఎప్పుడు కలుగును సుఖ సౌఖ్యం
        వాయు దేవుడు కన్యలకు కురూపిగా మారాలని పెట్టె శాపం

        శాప కారణం గా కన్యలు పొందే వికృతాకారం
        తల్లి తండ్రులకు తెలిసే వాయు దేవుని అహం
        నిరుత్చాహ పడుతున్న పుత్రికలకు పెంచే ఉత్చాహం
        మేము చేసిన ఏనాటి పాపమే, కాలంతో మారును మీరూప0

 జాలియను మహర్షికి సోమదయ అను ఆమె పరిచర్యలుచేసే కొంతకాలం
        పరిచర్యలును మెచ్చి పుత్ర సంతానము కల్గునని ఇచ్చే వరం
        పుత్రుదు కలిగే వానికి బ్రహ్మ దత్తుడు అనిపెట్టె నామ దేయం
   నూరుగురు కన్యలను వీరికి ఇచ్చి శాపం విషయం చెప్పి చేసేవివాహం

        బ్రహ్మ దత్తుడు వమ్శోద్ధారకుని కొరకు చేసే పుత్ర కామేష్టి యాగం
        పుత్రికజననం, సత్యవతి భర్తతో సశరీరమ్తొ పొందే స్వర్గం
        పుత్రుడు జననం 'గాధి ' అనేవారు నాతండ్రిగారు నాది కుశవంశం
    రామ దేహసంభంధమైన వంశ విషయం చెప్పితిని నాది బ్రహ్మవంశం 

                                                                     

అహల్య గౌతముల కధ తెలిపేద రామ
.
        బ్రహ్మ భార్యను మెప్పించడానికి " స్త్రీ " ని సృష్టిమ్చే బ్రహ్మ లోకం
        నవ యవ్వనంతో అందమైన పువ్వులా కనిపించే ఆ క్షణం
        బ్రహ్మ సరస్వతి కలసి ఆమెకు అహల్య అను పేరు నిర్దారణం
        బ్రహ్మ దేవునికి పుత్రికను చూసి మతి బ్రమిమ్చే ఆ సమయం

        బ్రహ్మ లోకమంతా సంతోషాల నిలయం
        ఋషులు వేదాంత గోష్టి చర్చ సంకల్పం
        సంగీత సాహిత్య0 వేల్లువిరిసే వైభవం
        రమణీయ ప్రక్రుతితో వెలసిల్లె సుందర సౌధం

        అకాశము నందు చందురుని అచ్చపు తెల్లని కాంతి విస్తారం
        మల్లియల సువాసన గాలితో కలసి మనస్సుకు ప్రశాంతం
        సరస్వతి దేవి బ్రహ్మను కోరే అమ్మాఇకి చేయాలి పరిణయ0
        మృదు మధుర సంభాషణలకు ఏర్పాటు చేద్దాం స్వయం వరం

        ఎదిగిన కూతురు తల్లి తండ్రుల మాటలకు పొందే పరవశం
        అమర లోకాధీసుని మనస్సున గ్రహించి పొందే సంతోషం
        చిత్తమునందు కించిత్తు స్వర్గాధి పతి ఊహ కలిగే ఉత్చాహం
        ఋషులు దేవతలు వివాహము చేసుకోవాలని ఆగమనం

        దేవతలు ఋషులు స్త్రీ సౌందర్యము చూసి ముగ్దు లయ్యారు
   
        తెల్లని చంద్రుని వలే దివ్య ముఖం
        సుస్వర    శంఖం       సుద్ధ కంఠం
        కమల     పత్రాలాంటి     నయనం
        దానిమ్మ     గింజల          దంతం

        ఆమె  శృంగార  ముగ్ద  మొహన        రూపం
        ఎవరికైనా చూసిన వెంటనే  ఏర్పడు  కామం
        అందరి హృదయాలలో ఉండే ప్రేమ  మయం
        ఈమెనె వివాహం చేసుకోవాలని తాపత్రయం
.
        సుందర వధువు చూపు సురపతే ఖాయం
        సురపతి      మనసంతా   అహల్యా రూపం
        ఊహా మనస్సులో  జరిగే వారికి   కల్యాణం
        సతి   పతులుగా   మారి  పొందే  సంతసం

        బ్రహ్మ   దేవుడు   సంకల్పించే  స్వయంవరం
        రాజ   కుమారులు,  తాపసులు    ఆగమనం
        అందరిని సాదరంగా అఫ్యానిమ్చే బ్రహ్మ లోకం
        ముందుగా భూప్రదక్షణం చేసిన వారికే స్త్రీ వశం

        గౌతమ   మహాముని   చేరి వివాహ సమయం
        మాతా   గోమాత     నీకు   ఇదే నా   వందనం
        ఈనుచూన్న   గోమాతచుట్టూ   చేసే ప్రదక్షణం
         గౌతముడు గెలిఛి అహల్యను పొందే పరిణయం

        తలచిన    వలపు     నీరు   కారే     ఆ క్షణం
        ప్రేమ గెలవక పోవటం పూర్వ కర్మ ఫలితం
        సురపతి ఓటమి  మనసుకు    భాధాకరం
        ముదుసలి  గోతమునితో  చేసే సంసారం

        గోతముడు దివ్యాశ్రమం నిర్మించి అందు చేసే యజ్ఞం
        శిష్యులకు   నిత్యం   భోదిమ్చు   వీదాంత   విషయం
        అతిదులుగా       వచ్చిన     వారికి    చేసే  ఉపచారం
        అహల్య కొదువనిమ్త రానీక గోతమునకు పంచే సుఖం

        ప్రేమను  విభుమ్డునకు పంచే  నిత్యం
        మన్మధ రూపంతో కలిగించే సంతోషం
        గౌతముడు అందించే యవ్వన సుఖం
         గౌతమునకు ఏర్పడే పుత్రికా జననం

         గౌతముడు   బ్రహ్మ  దేవుని   గూర్చె చేసే జపం
.        దేవేమ్ద్రునకు తన  పదవి పోవునేమోననే భయం
         గౌతముని   తపస్సు భగ్నం చేయాలని నిర్ణయం
        అహల్యను పాతివత్యం భగ్నం చేయాలని కుతంత్రం

        గౌతమ మహర్షి లేనిసమయం అహల్య ఒంటరిగాఉన్న సమయం
        గౌతమముని వేషమున ఇంద్రుడు వచ్చి అహల్యను కోరే సంగమం
         వచ్చినవాడు దేవెంద్రుడని గ్రహించి అహల్య మక్కువతో అమ్గీకార0
        ఇంద్రుని కోరిక తిరే, అహల్యకు చిరకాల వామ్త్చతో కలిగే సంతోషం

యగ్నిహొత్రమువలె ఉన్నగౌతమమహర్షినిచూసిఇంద్రునకుకలిగే భయం
 ఇమ్ద్రుడు చేసిన దుష్క్రుత్యం దివ్య శక్తితో గ్రహించి వచ్చే తెలియని కోపం
   చేయరాని పని చేసినావు నీవు విఫలుడవుకమ్ము అని పెట్ట శాపం
 ఒసీ దుష్టురాల వాయు భక్షనంతో నేలపై బూడిదైఉండే అనిపెట్టె శాపం

   శ్రీరాముని స్పర్స తో యధారూపమ్ రాగలదని శాప ఉపాశమనం
మహర్షి తపస్సు వ్యర్ధమైనదనితెలిసి మరలా పస్సు చేయాలని నిర్ణయం
దేవేంద్రుడు సిగ్గుతో ఉండగా మెషణము వృషణాలు అమెర్చేదేవ తాగణం
ఇమ్ద్రునివల్ల గోతముని తప్పస్సు భగ్నంకాగసఫలం పొందే దేవతాకార్యం

 ఆనాడు సర్వ సుఖలతో వెలసిల్లిన గోతముని ఆశ్రమ ప్రాంతం
 అదిగో ఆశిల ఆనటి నుండి ఈనాటివరకు చేస్తుంది రామ జపం
  చేసిన తప్పు తెలుసుకొని భాద పడుతున్నది పశ్చాతాపం
 రామ నీపాద స్పర్సకోరకు తపిస్తూ, విలపిస్తూ జపిస్తుంది నీ నామం

  రామచంద్రుని పాద స్పర్సతో అహల్యకు కలిగే శాప విమోచనం
  రామ దర్శన భాగ్యం వళ్ళ ఆశ్రమ ప్రాంతమంత వచ్చే పూర్వ వైభవం
   రామచంద్రుడు అహల్యా గోతములకు చేసే పాదాభి వందనం
   అమ్దరియందు వినయ విదేయత కలిగి ఉమ్డుటే పరమధర్మం

    రామ అహల్య కధ గురించి నా భిప్రాయం
    నూనెలొ మలినం ఉండవచ్చు వెలుగులో ఉండదు మలినం
   ఆశ్రమలొ ఉండవచ్చుమలినం విద్యకు ఉండ కూడదు మలినం
   చెంద్రుడిలో మచ్చలు ఉండవచ్చు వెన్నెలలో ఉండ కూడదు మలినం
   సూర్యకిరాణాలు వేడిగా ఉండవచ్చు నీడకు ఉండదు మలినం

    ఘనుడుగాని, భుపతిగాని తప్పించుకోలేరు కాల నిర్ణయం
   శివ కెశవులుగాని, కాలయముడుగని తప్పిమ్చలేరు విధి చక్రం
    యవ్వన కోరికలు సహజం నిగ్రహసక్తితో పోమ్దాలి నిత్యం
   తెలిసి చేసిన తెలియక చేసిన నేరానికి శిక్ష పోమ్దేదారు యమలోకం 


రక్త మాంసములతొ నిండిన ఈ శరీరముపై ఎందుకు మమకారం
కర్మ ఫలాన్ని అనుభ వించ కుండ  ఎందుకు దైవ  ధూ ష ణం
ధర్మాన్ని విస్మరించి స్వదర్మ నిర్వాహనములో అమ్దరూ ఉండటం     
అజ్ఞానంతో విచక్షణ జ్ఞానాన్ని మరచి కొందరు దైవాన్ని నిందించడం

రామ లక్ష్మణులతో విశ్వామిత్ర చేరే మిదులానగరం
జనక మహారాజు స్వయముగా వచ్చి ఇచ్చే ఆతిద్యం
ఓ కౌసికా నీ గుణాలు,నీ తపస్సు ,  నప్రమేయం
ధన్యుడనైతిని రామ లక్ష్మణులతో ఇక్కడకు రావడం

సూర్యాస్తమయమ్ అవుతున్నది సాయం సంధ్యాది కర్మలు ప్రారంభం
జనక మహారాజు విన్నవించే మీకు సకల సదుపాయాలూ చేయగలం  
ఈభవణమ్నందు విశ్రాంతి తీసుకొండి మాకు సెలవిచ్చిన మరలా వచ్చేదం
మహారాజు మర్యాదలు చూసి విశ్వామిత్రునకు రామ లక్ష్మణులకు సంతోషం

రాజకుమారులారా  రాత్రి కలుగ లేదుకదా నిద్రా భంగం
స్నాన మాచారిమ్చ్ పూర్తి చేసిరి సంధ్య వందనం 
బ్రాహ్మణులు వేదాలు వుత్చరణ, మంగళ వాద్య శబ్దం
రామ లక్ష్మణులు తీసుకోనిరి పానీయమ్ పలహారం

జనక మహారాజు పురోహిత సమేతుడై ఆగమనం
మ్రోగిమ్చిరి శంఖ నినాదములు, నవధ్వనుల శబ్దం
గందాక్షతులతో సతానందుడితో వచ్చిరి  పరివార్యం
జనకుడు మహాముని తమకు నిరంతరం స్వాగతం

మునివార్య తమ ఆజ్ఞ ఏమిటో సెలవిస్తే చేస్తాము సిద్ధం  
స్వామీ వినాలని ఉంది మీ ఆశ్రమ సంభాషణల భాగ్యం
రామ లక్ష్మణులు మీకు సహాయము చేసిన ఘనకార్యం
తెలిపే కధఅంతా యాగ రక్షణకు చేసిన రాక్షస సంహారం

పిల్లల శక్తి సామర్ద్యములు తెలుసుకొని పొందే సంతోషం
గమనించే పిల్లల ముఖపద్మములపై బ్రహ్మతేజస్సు ప్రభావం
అహల్య శాప విమోచన మాట విని పొందే అత్యంత ఉత్చాహం
విశ్వామిత్రుడు పలికే జనకా ముందు సాగించు కార్యం

ఋషివరణ్య  నేను పుత్రసంతానం కోసం చేసే ఒక యజ్ఞం
యజ్ఞారంభమున భూమి దున్నగా లభించే శిశు పవిత్రం
పృథ్వి లో పుట్టుట వలన"  సీత "అని చేసే నామకరణం
సీత యుక్త వయస్సుతో మాకు కల్పించే సంతోషం

జనకా మీ ఇంట ఉన్న శివ ధనుస్సు చూడాలని వచ్చాం
దాని మహత్యం తెలుసుకోవాలని రాజపుత్రులను తెచ్చాం
సీత కళ్యాణం అని ఇక్కడకు వచ్చినతర్వాత తెలుసుకున్నాం
అన్నారు శివ దనుర్భంగం చేసిన వారికే " సీత "' లభ్యం

అరి ఆరని తాటాకులతో చలువ పమ్దిళ్ళతో నిండిన నగరం
లేత ఆకుపచ్చ రెమ్మలతో కళకళ లాడే  తోరణాల మయం
మల్లెపూలు,చెమతిపూలు, విరజాజి పూలు మాలల మయం
తాటాకు విసినికర్రలు, చిన్న పెద్ద అమ్దరూ ఆనంద మయం

జనక మహారాజు విశ్వామిత్రునితో, రామలక్ష్మనులతో చేసే ప్రసంగం
పెద్ద పెట్టెలో ఉమ్చిన శివ ధనుస్సు నాతొ రండి మీకు చూపెడదాం
ముక్కు పచ్చలారని సీత ఈ ధనస్సును వేలితో కదిపిచూపె ప్రతాపం
ఈ ధనస్సును ఎవరు ఎక్కు పెడితే  వారికి  "  సీతతొ " పరిణయం        

నిమిచేక్రవర్తికి పరమేశ్వరుడు ఈ ధనుస్సు ఇచ్చి హెచ్చరించే తగు భద్రం
పూర్వము దక్ష యజ్ఞ ధ్వంససమయమున కలిగే ఈ ధనుస్సు అవసరం   
ఈ ధనుస్సు మా వమ్శీయుల వద్ద ఉండి  పోమ్దుతుమ్ది నిత్య  నైవేద్యం
శివ ధనుర్బంగం చేసిన వారికి సీత నిచ్చి పెళ్లి చేయాలని దైవ  సంకల్పం
.


పెళ్లి అని సీతారామల మనసులోకి ప్రవేశిస్తే వారి ఆలోచనలు ఊహలు ఎలా ఉంటాయో సీతా రామ కళ్యాణ సందర్బముగా 
ఇందు ఉదహరిస్తున్నాను.(ఇవి నా ఆత్య ప్రాస భావాలు మాత్రమె         
     

     నా జీవితములో కల నిజ సౌందర్య మైనది
     ఎన్నాళ్ళ కైనా, ఎన్నేల్లకైన మనసే మారనిది
     తొలిచూపులొ మనసు ప్రభవించి కలవ మన్నది
     ముందు హుద్యాల కళా కండ అందించాలని ఉంది
   

   మంచుకంటే చల్లగా ఉన్న హృదయం వేడెక్కింది
    తలవని తలంపుగా ఒక్క లలితగీతమ్ వినబడింది
    బ్రతుకులో జోడు ముడిపడే సమయం ఐనది
    కలగా మేనుకు చందన పూత పరిమళ మైనది
  

   తప: ఫలముతో పున్నమిలో పంచుకొనే పంట
    వద్దు  కావాలి కావాలి అని మురిపిమ్చు కొనే ఆట   
    పండువెన్నెలలో కోరికలను పంచుకొనే తొలి పంట
    మధురాతి మధురస్మృతులను పంచుకొనే పెళ్ళంట
  

   నిన్ను చూసిన తొలి క్షణం అంకురించే  ప్రణయ భావం
   ఒకరి నొకరు చూసుకొన్న క్షణం ఆత్మాను సందానం    
   మనస్సులో ఎన్నో ఊహలు అపోహలు వచ్చుట నిజం
   కలసి మెలసి తిరిగితే ఏర్పడును అనుభూతి తరంగం
  

    నీ వదనం లో చివురించిన లజ్జ దరహాసం
    నీవు విరిసిన తెల్లటి నందివర్ధన కుసుమం
    నీవు సిగ్గుతెరలతో వాలు చూపుల వదనం
    నీ ముగ్దత్వం వళ్ళ హృదయములో పరవశం
 

    నన్ను ఉద్ధరించుటకు దివినుండి భువికి వచ్చావు
    నీవు జన్మ జన్మల భంధముగా  సక్షాత్కారిమ్చావు
    నా హృదయం క్షీరసాగరమ్ అవటానికి కారణం నీవు
    నా గుండెలో పొంగు పంచుకోటానికి కారకుడవు
నీవు 
  
  మనసులో చెలరేగు అపురూప భావాలను పంచుకుందాం
    హ్రుదయసీమలతొ హత్తుకొని పరవశంతో ఆనందిమ్చుదాం
    తోడు నీడగా,
ప్రాణాతి ప్రాణం గా కలసిమెలసి జీవిద్దా0
    గారాబంతో అను రాగంతో ఆడుతూ పాడుతూ ఉందాం
 

   నీటి తరగలన్న, మంచు పొగలన్న, ఎంతో  ఇష్టం    
    అరవింద  నయనాలలో నా రూపమ్ ఉంటే ఇష్టం
    కనురెప్పలు ఎత్తిచూసి చూడనట్లు ఉంటే ఇష్టం
    ఆలింగన బలం లో చిక్కి బ్రతకాలని మరీ ఇష్టం 


     నిన్ను కాసేపు ముద్దిచ్చి నవ్వించాలని ఉంది
    మట్టెల సన్నని మోతతో ఉడికించాలని ఉంది
    గాజులతో సమ్గీతస్వరము వినిపించాలని ఉంది 
    వదలకుండా మత్తుగా శయనించాలని ఉంది
 

      ఉషోదయపు ఎర్రని బింబం నీ ముఖారవిందం
      అరుణకిరణాలకు నీ మొము పుత్తడి మెరుపందం
      చెమ్పల మీద కెంపు రంగొచ్చి
ముద్ద మందారం
  సిరోజాలలో ఉన్న మల్లెపూల సౌరభానికి
ఆహ్లాదం                                        

      కంటికింపుగా కనువిందు చేసిన వేళ
     తరలి వచ్చి తపము పండించిన వేళ
     కమ్ముకున్న మబ్బు తెర తొలగించిన వేళ
     తరుణి దయతో కరుణించి తరించిన వేళ

     నును సిగ్గు దొమ్తరుల దొరసానివి నీవు
      ఓరకంట చూపుతో మనసు  దోచినావు
      అభ్యంతరాల ముసుగులో దాగివున్నావు 
      తనివి తీరగ చూసిన మరవ లేకున్నాను

     లేత రెమ్మల మాటున మొగ్గావు నీవు
     కళ్ళు తెరచి చూసి పరిమలిస్తున్నావు
     రెమ్మ నుండి వీడి ఎరుగనిదేశం చేరావు 
     నాకొరకు విరహముతొ విధిగా ఉన్నావు

     నాకళ్ళను చూస్తె నీ వంటికి చలువపూత చల్లదనం 
      నా  మేనును చూస్తె చందన  సుగంధ  పరిమళం
      నా వయస్సు చూస్తె నీకు మరువలేని  సుఘమ్ధం
      నా రూపు దివ్యలోక సుఖాలనమిమ్చే యవ్వనఘమ్ధం

     సాహిత్య రత్న రాశిని తెచ్చిన మల్లికవు
      జన్మసమ్స్కారముతొ ఓర్పుగల దానవు
      మాటలలోను, నడకలలోను స్వర్ణరేఖవు
      నవరత్నాల మేళవింపు కాంతి గలదానావు

       నీ రూపమును నా మదిలో ఉంచిన సృష్టి కర్తకు వందనం
      నిద్రాహారాలు మాని  నీ గురించి  కలిగిన తన్మయత్వం
      నేనొక్కదానినే పుత్తడి బొమ్మ అని బ్రామ్తికలిగిమ్చే సౌరభం
      నీవు నా అంతరంగం దోచి అందుకో మధుర అధరామృతం 

      నీకు నామీద నవ  నవోన్మెష రక్తి
      చెప్పకనే తెలుస్తుంది నీలొ యుక్తి
      నిన్ను కలవాలని నాలో కలిగిన ఆశక్తి
      నీ వదనం వెలుగులు చిమ్ముతుంటే రక్తి

     నిన్ను చూస్తె ఒళ్లంతా స్వేదంతో నిండి పోతుంది
      దాహం తీరక నా నాలుక పిడచ కట్టుకు పోతుంది       
      సిరోజాలువేడెక్కి తపన తగ్గే మార్గం చెప్పమంటుంది 
      అదేమి చిత్రమో,అదే
మి ఆరాధనొ తెలియ నంటుంది 

       నా అనురాగాల ముద్దుల శాంతి దేవత 
     పారి జాతమ్ము ప్రేమ జీవన విభాత 
     భవ్య లోక సుఖా లందిమ్చే దివ్యలత
     నా  సుఖ  సౌక్యాలందిమ్చే  ప్రదాత

     పువ్వుల మేఘమా నా భాద తెలుపు  
     నా కన్నీల్లను తుడిచి పొమ్మని తెలుపు
     తన్మయత్వంతో ఉన్నాను రమ్మని తెలుపు
     తపన తగ్గించి దప్పిక తీర్చుకొని పొమ్మని తెలుపు

                                       

      ప్రచండ గ్రీష్మ తాపాన్ని ఉపశమిమ్ప చెస్తావు
     కరుణతో  పుడమి  తల్లిని  పులరింప చేస్తావు 
     మెరుపువల్లె మెరిసి నామనసు రంజిల్లపరుస్తావు
     గుండెలో ఉన్న దడను తగ్గించి సంతోశాపరుస్తావు

     రాత్రి నిద్రపట్టక చంద్రునితో నీ గురించి ముచ్చటిస్తా 
      నవమి నాటి వెన్నెలను ముందుగా నీకు పంపిస్తా
      మాన నీయమైన గుణం అర్ధం చేసుకొని ప్రవర్తిస్తా
      కన్నుల్లొఉండే కారుణ్య రేఖతో పులకితున్ని చేస్తా

      నా సృష్టి దైవ నిర్ణయం
      నా జీవిత కరుణా మయం
      నా ప్రేమ అనురాగ మయం
      నా హృదయ్యం చైతన్య భరితం

      సంవత్చరానికి ఒక్కసారి వచ్చే వసంతానివి కావు 
      ఒక్క రోజు సువాసన అందించే గులాబివి కావు
      ఒక్క క్షణం నింగిలో మెరిసే మెరుపువు కావు
      నా ఊహలు సఫలం చేసే సౌమ్దర్యవు నీవు

      నెల కొకసారి వచ్చే పున్నమి జాబిల్లివి కావు
      వెలుగును కమ్మే నల్లని మేఘానివి  కావు
      శబ్దాలు చెస్తూ సమయాన్ని తెలియపరచవు
      రంజిమ్పచేసి రసడోలికలో ముంచేదానావు నీవు
      

      తెరలు తెరలుగా పైరు గాలి వీచినట్లు రమ్మనకు  
      సొగసుచూడమని పరదాలు తొలగించి రమ్మనకు
      ప్రకృతిలో అందచందాలతో ఆటలకు నన్నురమ్మనకు
      రమ్మని పిలిచి ఆనవ్వు దొమ్తరలతో నన్ను వేదిమ్చకు

     తొలి మబ్బు తెరచాటు చెమ్దమామవు
      గగన పధ  విహార విహంగ  పతుడవు
      చీకటినితరిమే వెలుగును చూసి తప్పుకుంటావు  
      అందరికి చల్లదనము వెన్నెలను పంచుతావు
            

. 
రాజులందరు ఉన్నారు ఉచితాసనం, స్వయం వర సభ ప్రారంభం
జనకుడు వినయంగా సభలో ఉన్న రాజులతో చేయండి ప్రయత్నం 
ఈశివధనస్సును ఎక్కుపెట్టిన వారికి  మా పుత్రికతో వివాహం
కొందరు రాజులు ధనుస్సుకుడా ఎట్టా లేక పొందారు విఫలం

రాముడు కండలు తిరిగిన ఆజానుబాహుడు
యవ్వన ప్రారంభములో ఉన్న యువకుడు
విశ్వామిత్రుని అడుగుజాడలో ఉన్న సిద్ధుడు
అందర్నీ ఆకర్షిమ్చుతున్న  మేఘశ్యాముడు

రాముడు అందములో అశ్వనీ దేవతగా ఉన్నాడు
రాముడు పరా క్రమంలో  సింహములా ఉన్నాడు
రాముడు సూర్యుని మించిన కాంతి కలిగినవాడు
రాముడు శివధనుస్సు ఎక్కు పెట్టాలనుకున్నవాడు

కదలకు భూమాత  రాముడు చేయ బోతున్నాడు శివ  ధనుర్భంగం
ఆది శేషా భూమిని కదలకుండా పట్టుకో రామునికి కలుగునుజయం
కూర్మావతారమా భూమిని, ఆదిశేషుని కదలకుండా చేయు భందనం
వరాహమా, ఇరావతమా కదలక ఉండండి రాముని నెరవేరును మనోఫలకం

అంటున్నారు మీసాలు కుడా రాణి వాడు ఏమి చేస్తాడు ప్రయత్నం
ఇంతవరకు ఎవ్వరూ, లంకేశ్వరుడు ఎత్తలేనిది ఇతనికి ఎలా సాద్యం  
కొందరు లెతమొగ్గ తుమ్చడం అనుకుంటున్నాడు శివ ధనుర్భంగం 
జనకమహారాజుకి,  సీతాదేవికి రాముడు శివ  ధనుర్భంగం నమ్మకం

విశ్వామిత్రునికి వందనం చేసి ధనస్సును ఒక చేతితో పట్టి ఆసమయం
రాజులు విశ్వామిత్రుడు, జనకమహారాజు, సీతా దేవి  పొందే విస్మయం
రాముడు నారి సంద్ధిమ్చుటకు, ధనుస్సు వంచుటకు చేసే ప్రయత్నం 
ధనుస్సు మధ్యకు విరిగి పెద్ద పిడుగు పడ్డదన్నట్టు  కలిగే  శబ్దం

ఘాల్లు ఘల్లు మని విల్లు విరిగింది
సీత గుండె గగుర్పాటు    తొలగింది
వచ్చినమహారాజుల మనస్సు చెదిరింది       
జనక మహారాజు చిరకాల కోరిక తీరింది

విశ్వామిత్రుని సాధన సంకల్పం నెరవేరింది
మిదులానగర పుడమి పరవశం చెందింది
గంగా జల ప్రవాహం పరవళ్ళు   త్రొక్కింది
అగ్ని పర్వతంలో జావా పెల్లుబికింది

క్రౌంచ పక్షులు శ్రవనా నంద గానం చేసినవి   
నెమల్లు  ఆనందంతో  పురివిప్పి  ఆడినవి
కోఇలలు మధురశ్వరముతొ పాటలు పాడినవి
వికసించిన పూలపై తుమ్మెదలు ముద్దాడుతున్నవి

కరతలములు మ్రోగే, కురిసే కనక వర్షం
దేవతలు సంతోషంతో కురిపించే పుష్పవర్షం
సీతా దేవికి కలిగే మనసంతా పులికిమ్తల హర్షం
జనక మహారాజుకు కలిగే ఎనలేని సంతోషం

శ్రీ రాముని పరాక్రమము ప్రత్యక్షమైనది యత్యద్భుతం
పుష్పహారము చేత ధరించి శ్రీరాముని మేడలో వేసెను ఆక్షణం
పండితులు శ్రీ సీతా రాములను దీవిమ్చె కలగాలి శుభం
ప్రాణ సమానురాలైన సీతను రామునిక్కిచి చేస్తాను వివాహం

రాజభవనం అంతా వ్యాపించే ప్రచండ మారుతం
కాలిమువ్వలతో, చేతిగాజులతో చేసే  జుమ్కారం
తపేట,  భాజా భజమ్త్రీల సన్నాయి   నాదం
కరతలములతో సంతోషములతో ఆనమ్ద దాయకం

విశ్వామిత్రుడు తెలిపే కన్యాదాత జనక మహారాజ 
దశరధ మహారాజుకుదూతల ద్వారా పంపుము సందేశం  
కల్యాణం జరిగే ముందు గురుశిష్యుల మద్య ఉండే సంభంధం
రామ లక్ష్మణులకు, జనక మహారాజుకు తెలిపే    


.                                                                    

  
జనక మహారాజు దశరధ మహారాజుకు సీతా రాముల వివాహము జరుపుటకు నిశ్చ ఇమ్చినామని లగ్న పత్రిక తెలియ పరుస్తూ దూత ద్వారా తెలియ పరిచాడు.

     రామ నామం చేయండి
    ఆస్వాదించండి
    ఆస్వాదించి ఆనందించండి
    ఆనందించి తరించండి

  కన్యా దాత జనక మహారాజు దూతల ద్వారా దశరధునికి పంపే సందేశం
   ఓ మహారాజ మీ రాజ్యము యోక్కయునగ్ని హోత్ర సహేతంగా అడిగే కుశలం
   నా కుమార్తెను వీర్య శుల్కముగా ప్రకటించగా శ్రీ రాముడి పొందే విజయం  
   విశ్వామిత్ర వెంట వచ్చిన రాముడు నే పెట్టిన పరీక్షలొ  పొందే విజయం

    నా కుమార్తెను నీ కుమారునికి ఇచ్చి వివాహము చేయుటకు అనుమతికి ఆహ్వానం
    నీకుమారునిఆనందం కోసం పురోహితాది సకలపరివారముతో వచ్చి జరిపించాలి శుభకార్యం
    విశ్వామిత్రుని యనుజ్ఞ గైకొని, శతానందుని యనుజ్ఞ గైకొని మీ రాక కొరకు నిరీక్షన
    వసిష్ఠ, వామ, దేవాది ఋషులు తో కలసి దశరధ మహారాజ చేయుదము కుశల సంభాషణం

    సకల పరివారముతో ఒక క్రమ పద్ధతిలో చేరే మిదులా నగరం
    దశరధ్ మహారాజు పరివారాన్ని చేర్చ విడిది గృహం
    కౌసల్యా, సుమిత్ర, కైకెఇ కి రామున్ని చూసి కలిగే ఆనందం
    వశిష్ట మహర్షి సంప్రదించి తేలి శుభ ముహూర్తం   

    ఓ జనక మహారాజా మీరు దానంచేయుమహాత్ములు మీ గౌరవమే మా గౌరవం
    మేము ప్రతిగ్రహీతులమ్ దాతల హృదయం ఆనందింప చేయుటయే మా ధర్మం
    కన్యాదాత మనస్సును కిమ్చుకైన భాధకల్గిమ్చక మగపెళ్లివారు ఉంటారుసహనం
    దశరధ మహారాజు యొక్క మాటలు విని జనకమహారాజుకు కలిగే ఆశ్చర్యం

   దానము లలో కెల్లా ఉత్తమ మైనది కన్య దానం
    దాతకును ప్రతి గ్రహీతకును కల్గించును పుణ్యం
    పురుషార్ధ సిద్ధిని కల్గిమ్చ్ వివాహము స్వధర్మం
    కన్యా దానం వళ్ళ ఉభయులకు కల్గు శ్రేయస్కరం

    ఎవరి కొరకు వేచి యుండనవసరం లేదు ఇది మా గృహం
    మీ కు కావలసినవి తెలియ పరిస్తే క్షణంలో చేస్తాం
    స్నానానికి సుగంధ పరిమళాళ తో ఉన్న జలం ఏర్పాటు చేస్తాం
    సత్కరించి ఇష్టాన్న భోజనం ఏర్పాటు చేసి ఇచ్చే తామ్బూల0 
                                          



   మామిడి చిగుళ్ళు తోరణాలతో అరటి చెట్లతో
           ఏర్పాటు చేసారుకళ్యాణ మండపం           
బంగారు  ఆసనములు, పూర్ణకుమ్భాలతో
     పుత్తడి పళ్ళెములుమ్చిరి  దూతగణం
మూకుళ్ళు, సమిధలు, ఆవు నెయ్యి మెదలైన
వాటితో అగ్నిహోత్రమునకుచేసారు సిద్ధం     
సుఘంధ ద్రవ్యాలు, పేలాలు, నక్షతలు, ఉండిన
     బంగారుపాత్రలు ఉంచారు కళ్యాణ మండపం
                                   
ప్రజల ఆనందానికి అవధులు లేవు            
 

ప్రతి హృదయంలో పరమాత్మ స్తిర నివాసం
ప్రతి ఒక్కరి హృదయం ఒక  ఆనంద నిలయం
ప్రతి ఒక్కరిలొ ఉండే పరమాత్మ పేరు సచ్చిదానందం
ప్రతి పనిలో  సంతృప్తి పడితే పొందేది జీవితానందం
 

బ్రతికినంతకాలం ఇతరులకు సహాయముచేసి పొందాలి ఆనందం
చంకలో బిడ్డను ఉంచుకొని వెతికే అమాయకపు తల్లి ఆనందం
ఇంద్రియాల సుఖం, మనస్సుకు సంతోషం కలిగే ప్రక్రుతి ఆనందం
గాడాందకారంలో పండు వెన్నెలను కురిపించే చెంద్రుని ఆనందం
 

నువ్వు నేను మనం అనుకుంటేనే ఆనందం
నాకు నేనే నాది కష్టార్జితం అంటే లేదు ఆనందం
ధనం కూడపెడితెరాదు పంచితే వస్తుంది ఆనందం
అమ్దరూ సహపంతిభోజనం చేస్తే ఉంటుంది ఆనందం
 

ప్రత్యాషకిరణాలతొ తుషార బిందువుల ఆనందం
పున్నమి వెన్నెల జల్లు హృదయానికి ఆనందం
చలికివణుకుతున్న వానికి అగ్నిని చూస్తె ఆనందం      
వర్షం పడుతున్నప్పుడు క్షత్రంతో తిరుగుట ఆనందం 

వయస్సుకు తగ్గ వారితో ఆడే ఆటలో ఉంటుంది ఆనందం
మనస్సుకు సంతోషం కలిగిన మాటలు వింటే ఆనందం
పిల్లలు అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తుంటే ఆనందం
దాహం వెసినప్పుడు అమృతం త్రాగితే మరి ఎంతో ఆనందం

మనో మాలిన్య్యం తొలగి బుద్ధి ప్రకాశవమ్తమైతే ఆనందం  
ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో చేసే పనిలో ఉంటుంది ఆనందం
గమ్యం లేనివానికి గమ్యం చూపితె అంతులేని ఆనందం
ఎక్కడోకాదు దేవుడు నీలొ నాలో ఉన్నాడు అంటే  ఆనందం



తల్లి, తండ్రి, గురువు గ్రహిమ్చుము ప్రత్యక్ష దైవం
వేదాద్యయము నందు ఇవ్వాలి ముందు ప్రాధాన్యం 
పితృదేవతలకు చేయు కర్మలకు ఇవ్వాలి ప్రాదాన్యం
అభ్యుదయ మార్గములో నడుస్తూ చేయాలి సంసారం

వివాహమనేది గ్రుహస్తాశ్రమమునకు అమ్కురార్పణం
వివాహ ప్రక్రియతో ఏర్పడుతుంది దాపత్య భంధం
జీవసృష్టి వృద్ధిపొందటానికి దాంపత్య భందమే మార్గం
జగతిలో జన్మ లన్నిటిలో మానవ జన్మ ఉత్తమం   
                                      


   వివాహ ప్రక్రియలు

సమావర్తనము, కన్యావరణము, కన్యాదానం
వివాహ హోమం, అగ్నిప్రిచర్య, పాణిగ్రహణం
లాజ హోమం, సప్త పది , నక్షత్ర  దర్సనం
అప్పగింతలు, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం

మణి కంకణములు, పమ్చలచాఅపు, గొడుగు
చెప్పుల జత ఉత్తరీయమ్, దండం
నలుగుపిమ్ది, అంజనం, అనులేపనం టపాగా
దీక్షావస్త్రాలు, పట్టు వస్త్రాలు, పావుకోళ్ళు

భాషా భ్యాసం నేర్పేది అమ్మతత్వం
మాద్యమం పిత్రార్జితం
బ్రాత్రు విత్తంచ అధమం
స్త్రీ విత్తం అధమాధమం

కనులు మిరమిట్లు గొలుపు బంగారు చాయా రూపం
సర్వావయవ సౌందర్య  రాశి ఐన అపరంజి భావం
ధర్మ మార్గమున సర్వదా నీడవలె  ఉండే కిరణం
రూప యవ్వన సుగుణాల రాశి అని చెప్పుట ఉత్తమం

రాజ గృహిణి కోరికల కన్నా ప్రజల సుఖాలే ముఖ్యం
రాజ్యం సంరక్షిమ్చుటకు నేతల త్యాగం ముఖ్యం
ప్రజల సంస్కృతిని నేతల గౌరవం కాపాడుట ముఖ్యం
క్రమశిక్షణతో, ధర్మ రక్షణతో పాలించుట అతి ముఖ్యం

వివాహవేడుకలు ఆచారప్రకరముగా జరుపుట అవసరం      
రెండు కుటుంబాలు భందువులతో కలసి చేసే సంబరం
బ్రాహ్మణులు, గురువులు, పెద్దలు దీవెనలు పోమ్దేవరం
సన్నాఇమెళాళలొ "తాళి కట్టి " ఏర్పడే మూడుముళ్ళ భంధం

కన్నతల్లి మోసేది కొంతకాలం, గురువు విద్యనేర్పేది కొంతకాలం 
సూర్య చంద్ర గమనాన్ని బట్టి  ప్రకృతిలో  జీవిమ్చాలి కలకాలం
భార్తననుసరిమ్చి పెద్దలకు సెవచెస్తూ సుఖంగాఉండు జీవిత కాలం
భూమికి భారం కాకుండా, బాకి లేకుండ ఉండాలి అంతిమ  కాలం

సీతతో పానిగ్రహ మోనరిమ్చుట నీకు శుభం
భార్యయే నీ కీర్తి ప్రతిష్టలకు మూల కారణం
భార్య పాతివ్రత్యమే భర్తకు ఆయురారోగ్య భాగ్యం
శ్రీరాముడు ధరాపూర్వకముగా సీతకన్యకను పొందే దానం


శ్రీ రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిలను చేసే పాణిగ్రహం
భరతునకు మామ్దవీను, సత్రుఘ్ననునకు శుతకీరితి చేసే పాణిగ్రహం
నూతన వధూవరులు అగ్నిహోత్రమునకు చేసే ప్రదక్షణం
లాంచన ప్రాయముగా వెడుకొలు చేసి ప్రతిఒక్కరు సంతోషం 
                                         
జీలకర్ర బెల్లముతో కలిపిన ముద్దను ఒకరిరి తలపై
         ఒకరు చేతితో అదిమి పేటి ఉంచడం
వేదకల్పము తెలిసిన పెద్దలు పరస్పర జీవ శక్తులు
         ఆకర్షణకు స్ప్రుసిమ్చటం
పుత్తడి పల్లెములలో ఉన్న ముత్యములు,తలబ్రాలు
         మంత్రాలతో సిరస్సులపై పోసుకోవడం
గుప్పెడుతో అక్షతలు తీసుకోని నూతన వధూవరులను
         ఋషులు,పెద్దలు అందరు అశీర్వదించటం

దేవదుందుభులు మారుమోగే మాంగల్యం కట్టే సమయం   
అప్సరసలు నాట్యమాడిరి గంధర్వులు గానము చేసిరి ఆసమయం
పుస్పవర్షము కరతలముల ధ్వనుల మద్య కురిసే ఆ సమయం   
ప్రతిఒక్కరు అక్షతలు చల్లి సీతారాములను దీవిమ్చారు ఆసమయం
 

                                                        

 భార్గవుడు కోపముతో చేత ఒక ధనుస్సు ధరించి చేరే రాజ భవనం
భార్గావుని సామ్తపరుచుటకు జనక మహారాజు చేసే ప్రయత్నం
దశరధమహారాజుకూడా ప్రాధేయ పూర్వ కముగా చేసే వచనం
విశ్వామిత్రుడు, వసిష్టుడు, భార్గావునికి తెలిపే ఉండాలి శాంతం

రామ ఈ వైష్ణవధనస్సును సంధించు తెలుస్తుంది నీ ప్రతాపం
విశ్వామిత్ర సలహాప్రకారముగా అందుకొని చేసే ప్రయోగం
తనశక్తిని  తెలుసుకొని పరశురాముడు వహించే మౌనం
రామునికి అందరికి నమస్కరించి చేరే మహేంద్రగిరి పర్వతం


                         
                          ఓం శాంతి:  శాంతి: శాంతి:
                       సర్వం శ్రీ సీత రామార్పనమస్తు      
                      

13, ఆగస్టు 2014, బుధవారం

169. Romantic Comedy story 72 (Premiste Pellavutunda?)

                                                                            


ప్రేమిస్తే పెళ్లవుతుందా ?

గోపాలం M.B.A. చదివి  బ్యాంక్  ఉద్యోగము సంపాదించాడు.  ఎన్నో మంచి సంభందాలు వచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఒక చిన్న కోరిక ఉన్నది. ఆకోరిక సఫలీక్రుతమ్ చేసుకోవటానకి పడ్డ పాట్లే నా కధకు ఆధారాలు. జరిగిన సంఘటన ఆధారముగా వ్రాయుచున్నాను. గోపాల్ మరి అంత  పోట్టివాడు కాడు,  మరి అంత  పొడుగు వాడు  కాడు,  ఎర్రగా ఆంగ్లేయుడులా  ఉండడు , మరీ నల్లగా నీగ్రొలాగా ఉండడు  మధ్యరకంగా ఉంటాడు,  అంత  లావుగా బీమ సేనుడు లాగా  ఉండడు, మరీ అంత  సన్నగా బకాసురుడులాగా ఉండడు చూసెటప్పటి కల్ల ఆకర్షిమ్చేవాడిలా ఉంటాడు,  ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు, పళ్ళు మాత్రం తెల్లగా ఉంటాయి. జీన్సు ప్యాంటు, టి  షర్టు వేసుకొని కల్లజోడు  పెట్టుకొని క్రాఫ్ మద్య పాపిడిగా  దువ్వి కొంత పొడర్ సెంటు కొట్టుకొని పగటి వేషకాడికి తక్కువ యువకుడి కన్నా ఎక్కువ గా మేకప్ కొట్టుకొని రోజు పార్కులవద్ద, ఉమెన్సు కాలేజి గేటువద్ద ఉండి  స్త్రీలను గమనిస్తూ ఉండేవాడు.

గోపాలం కళ్ళకు డిగ్రి చదువుతున్న పద్మిని అందగత్తెగా అనిపించింది. దానికి నవ్వుతు నవ్విస్తూ నలుగురితో చనువుగా ఉంటుంది. అందరు ఆమెను  బ్లాక్ అండ్ వైట్  అని ఏడిపిస్తారు. మొఖం తెల్లగా ఉన్న,కేశములు నల్లన, పద్మాల్లాంటి  కళ్ళు, వయసుకు తగ్గ వళ్ళు, నడకను చూస్తె 60 ఏళ్ళు  దాటిన ముసలోడు కూడా  వెంబడించే విధముగా ఉంటుంది. అందరిని చూసి చూడ నట్లుగా ఒరకంటితో చూస్తు కవ్విస్తుంది.

ఎవరు ఎన్ని జోకులు వేసుకున్న తనకు చదువే ముఖ్యమని భావించి తలవంచుకొని మరీ నెమ్మదిగా ఉంటుంది.
       . 
ఒక రోజు గోపాలం పద్మిని ఇంటికి వెళ్ళే సమయం చూసి  వెనుక వెంబడించి తను వ్రాసుకున్న ప్రేమ లేఖను అందించాడు. దాన్ని  తీసుకొని నింపాదిగా మడిచి రాకెట్ చేసి గాలిలోకి విసిరింది,  అది కాలవలో పడింది, ఒకనవ్వు నవ్వి మల్లా  వెనుతిరిగి చూడ కుండా  గబా గబా ఇంటిలోకి వెళ్ళింది. గోపాలం చేసేది లేక వెనుతిరిగి రూమ్కు చేరాడు. అప్పటికే రూమ్లో సుబ్బారావు తన స్నేహితుడు ఉన్నాడు,  అప్పుడే వచ్చావేమిటిరా నీ ప్రేమ ఎంత దాకా వచ్చింది. అని వెకిలిగా అడిగాడు.

నా అదృష్టం బాగుంది నడిరోడ్డులో నన్ను తిట్ట కుండా, చెప్పు తీసి కొట్ట కుండా ఇచ్చిన లెటర్ను రాకెట్ చేసి విసిరింది, అది ప్రేమిమ్చినట్లా, ప్రేమించ నట్లా,   నేను అర్ధం చేసుకోలేక పోతున్నాను. ఇప్పుడే కదా ప్రేమలో పడింది. నీవు పిలిచెంగానే ఇస్ క్రీమ్ కోసం ఆశ పడుతుందా ఏమిటి. కాస్త ఓపిక పట్టు ముందు ముందు నీకె తెలుసుతుంది ప్రేమలో ఎంత మజా ఉందొ అన్నాడు నవ్వుతూ.

మరైతే ఇప్పుడు ఎంచేద్దామను కున్నావు గోపాలాన్ని అడిగాడు సుబ్బారావు.  ఒక సిగరెట్టు దమ్ము పీల్సిస్తె మంచి అలొచనలు వస్తాయని నీవె చెప్పావుగా ఒక సిగరెట్టు ఇవ్వు అన్నాడు, నీకు అలవాటు లేదు, ఎందుకు అలవాటు చేసుకుంటావు అలవాటు లేనివాడు బ్రాహ్మనార్దానికి  పోయి కింద మీద పడ్డాడుట, నేను ఏదైనా సలహా నిస్తాను కూలుగా ఈ మంచినీరు త్రాగు టి  తెస్తాను అన్నడు సుబ్బారావు. ఈరొజుకు నీమాట వింటానులే కానీ అన్నా గోపాలం

గోపాలం; నేను సీనియర్  నీకు కొన్ని సలహాలు ఇస్తాను,  అవి తుచ తప్పకుండా పాటిస్తే,  నీ ప్రీమను జయిం చటం  నీవంతు అన్నాడు. ఆఇతే  పెళ్లి చేసుకోవడం నా వంతు కాదా నవ్వుతూ అన్నడు, గోపాల  'మహాశయా ' నీ గోప లీలలు నా వద్ద చూపకు, పెళ్లి నీవె చేసుకో నా సలహాలు పాటించమని మాత్రమే చెపుతున్నాను. అని కొన్ని సలహాలు చెప్పాడు సుబ్బారావు గోపాలం కు.

అలవాటు ప్రకారముగా ఉమెన్సు కాలెజీ వదిలే సమయాన చేరాడు గోపాలం, అక్కడే పద్మిని స్నేహితురాలు రాగిణి ఒక అబ్బాయితొ కోపంగా,  ఏమిటిరా నీవు నన్ను ప్రేమించావా, నన్ను పెళ్లి చేసు కుంటావా , ఏముందిరా నీదగ్గర, డబ్బుందా,  చదు వుందా, ఉద్యోగ  ముందా,  దేనిని చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది కోపంగా, నేను మొగవాడ్ని నేను ఘాడంగా నిన్ను ప్రేమిస్తున్నాను అది చాలదా అన్నాడు, అంతలో వెరే విద్యార్ధి వచ్చి ఎం పోరి నీవు మావాడ్ని ప్రేమించావా అంటూ మీదకు వచ్చాడు, అపుడే రాగిణి తన తెలివితో కాలు ఎత్తి మర్మావయవము మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టింది అంతే ఇద్దరు అరుచుకుంటూ వెళ్లి పోయారు.

రాగిణి ఎందుకె అంట్లా రెచ్చి పోయావు, కరాటి ఎప్పుడు నేర్చుకున్నావు, లోపల బ్రా లేకుండా అంత లూజు షర్టు వేసుకొని, టైట్ ప్యాంటు వేసుకుంటే ఎ మొగాడి కన్న పిచ్చెక్కుతుంది, కాస్త డ్రస్ మార్చుకో నీవు చీర కట్టుకొని తిరుగుతున్నావు, ఎవరైన వెంట  పడ్డారా, చూడు  నా చుట్టూ ఎంత మంది  ప్రేమిస్తున్నాము అని వెంబడి పడుతున్నారు అన్నాది. నీ ప్రక్కన తిరగాలంటే నాకు భయ మేస్తున్నది,   భయమెందుకు మనం ధైర్యముగా ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు అన్నాది.

ఏమోనమ్మ నా దారి నేను పోతున్నాను నీ ప్రేమల్లో నన్ను లాగకు అంటూ అటో ఎక్కింది.

ఒక రోజు పద్మిని ఏరంగు చీర కట్టు కుందో, ఎ జాకేటు వేసుకుందో,  అదే రంగు ప్యాంటు, షార్ట్, వేసుకొని ఎదురుగా బయలు దేరాడు గోపాలం,  చేతిలో బోకే పట్టుకొని చేతికి ఇవ్వ  బోతున్నప్పుడు,  తప్పు కొండి  తప్పు కోండి  సైకిలు కు  బ్రేకుల్లేవు అంటూ రెండు కాళ్ళ మద్య సైకీలును గ్రుద్దాడు  అంతే  అమ్మా అంటూ మూలిగాడు , చేతిలో బోకే  ఎగిరి అవతల పడింది, పద్మిని మాత్రం అది  చూసి నవ్వు కుంటూ ముందుకు జరిగింది,  సైకిల్ నడిపిన కుర్రవాడు సారి అంకుల్ అంటూ చెప్పి మరీ వెల్లాడు,  ఎవ్వరిని ఏమనలేక క్రింద భాదతో నెమ్మదిగా  రూమ్కి చేరాడు.

మరొక రోజు పద్మిని బస్ స్టాపులో ఉండటం చూసి బైక్  మీద కూర్చొమని సైగలు చేసాడు, చూడనట్లుగా నుంచొని   ఉన్నది, ప్రక్కనే ఉన్న మరో చిలక ఎక్కి ఎక్కమన్నవుగా పొనీ అన్నది, బస్సు రావటం బస్సులో పద్మిని ఎక్కి వెళ్ళటం బస్సుతో పాటు బైకు నడపటం మొదలపెట్టాడు గోపాల్, కిటికిలోనుండి గోపాల్ అవస్త అంతా  చూస్తు నవ్వుతున్నది, వెనుక నున్న అమ్మాయి ఎం పోనిచ్చటం స్పీడ్ పొనీయ్ నా బాయ్ ఫ్రెండ్  వెళ్ళిపోతాడు అంటూ పిర్రను గిల్లిమ్ది.కెవ్వుమని కాక పెట్టాడు, ఆ అరుపు చూసి పద్మిని బస్సు  నుండి ఒక నవ్వు నవ్వింది, అంతే  ఆ నవ్వుతో బై క్ బాలెన్సు తప్పి  ప్రక్కనే ఉన్న ఒక స్తంభానికి కొట్టి, ధబీమని పడ్డారు  ఇద్దరు, యిద్దరికి  చేతులకు, కాళ్ళకు దెబ్బలు బాగా తగిలాయి, క్రింద పడ్డ అమ్మాయి ఆడపిల్లను ప్రక్కన పెట్టుకొని నడపటం చేతకాని వాడివి ఎం మొగాడివయ్యా అంటూ దులుపుకుంటూ ముందుకు నడిచింది, బైక్ ను రిపేర్ కు ఇచ్చి రూమ్కు  దెబ్బలతో చేరాడు గోపాల్.

గోపాల్ అవస్తను చూసి సుబ్బారావుకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు, పొనీ ఆమ్మాయిని మరచిపో,  వేరే  అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పా లంటే మనసోప్పుట లేదు, ఎందు కంటే ప్రేమ విషయాలు నేర్పాడు, రెండు రోజులు కష్ట పడ్డావు మూడో  రోజు కూడా  నీ ప్రయత్నం చేయ్ అన్నాడు.

నా ప్రేమను జయించే  దాక ఈ గోపాలం వీడడు,  ఏది ఒక సిగరెట్టు ఇవ్వు ఒక దమ్ము లాగితే మంచి ఆలోచన వస్తుంది, నేను సిగరెట్టు నీకు ఇస్తే నాకు లేకుండా అంతా నివే తాగుతావు , ఉండు నీకు నిమ్మకాయ రసం తెస్తా అదే నీకు మంచి మందు, నీకున్నా పైత్యము తగ్గి అంతా మనస్సు ప్రశాంతముగా ఉంటుంది, అ దెబ్బలకు మందులు వ్రాసుకొని హాయిగా పడుకో అంటూ చెప్పి వెళ్లి పోయాడు సుబ్బారావు.

పద్మిని డిగ్రి పరిక్షలు పూర్తి అయిన సందర్బముగా స్నేహితురాలు రాగిణి తో  కలసి కామత్ హోటల్ కు వచ్చింది. పగలు నక్షత్రాలు కనిపిస్తాఐ, చల్లని వాతావరణంలో ప్రేత్యేక గదిలో కూర్చొని ఉన్నారు  టేబుల్ పై ఉన్న టిఫిన్ లిస్టు చదివి ఆర్డర్ ఇచ్చింది రాగిణి.

రాగిణి కి మాత్రము మొగవాల్లను చూస్తె కొంటె వేషాలువేయాలని ఉన్నాది. ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నాడు గోపాలం.

గోపాలం నీటుగా సఫారి వేసుకొని  ఉండటం గమనించారు  పద్మిని, రాగిణి.లు.

పద్మిని నీవు ఏమనుకోవద్దు ఒక ఆట ఆడించాలని  నీ వుడ్ బి  ని, ఒక పట్టు పట్టాలని,  కోపం తెచ్చుకోకు అన్నది రంగంలో దిగింది.

హోటల్ లోపల చీకటిగ ఉన్నది , సప్లైర్ నెమ్మదిగా టిఫెన్ తెస్తున్నాడు, ఆ సమయాన రాగిణి అతనికి అడ్డంగా కాలు పెట్టింది, వెంటనే సప్లైర్ బాలన్స్ తప్పి ముందుకు పడపోతుంటే  గోపాల్ అతని ఆపగా చేతిలోవి టిఫిన్ ప్లేటులు  క్రిందకు జారినవి.

వెంటనే పద్మిని వద్దకు వచ్చి మీరు ఆడవారు మనుష్యులను గౌరవించే విదానాన్ని ఇదేనా, రాగిణి గారు మీరు కూడా  మగవారు అందరు మూర్ఖులుగా భావించటం తప్పు,  ప్రేమనేది బయటకు కనిపించదు, కాని హృదయాలు స్పందన  అని మరవకండి.  ప్రేమ అనేది ఇరువురి మద్య తెలియకుండా పుడుతుంది. జీవితాన్తమ్ కష్ట సుఖాలు పంచు కుంటు  బ్రతకాలి, ప్రేమించిన వారికీ తల్లి తండ్రులు ఎప్పుడు సహకరించుట తక్కువ, ఏది ఏమైనా పద్మిని గారు నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను, నాప్రేమను మీరు పొందాలని మీలొ నామీద ప్రేమ ఉన్నాదని నేను భావిస్తున్నాను,  కనుక  మీరు తప్పకుండా రేపు సాయంత్రం పార్కుకు రాగలరు, రాగిణి గారు మీరు కుడా మొగవారిని తక్కువ అంచనా  వేయకండి, మొగవారు  లేందే ఆడవారు  ఉండరని,  ఆడవారు లేందే మగవారు  ఉండరని, ఇరువురిని సృష్టించిన దేవుడు ప్రకృతిలో బ్రతకాలని తెలియపరిచాడు.

నెమ్మదిగా బయటకు నడిచాడు గోపాలం,  తప్పు తెలుసుకొని  రాగిణి, పద్మిని,  బయటకు వచ్చి ఆటో ఎక్కారు.
   .       .                   .    .                      
 సుబ్బారావు సిగరెట్టు దమ్ము మీద దమ్ము పీలుస్తు ఉన్నాడు, అపుడే లోపలకు అన్య మనస్సుతో ప్రవేశించాడు గోపాలం.  ఏమైంది అంత నీరసంగా ఉన్నావు అని అడిగాడు, ఎమీ కాలా నేను నిదానంగా ప్రేమ విషయం చెప్పాలనుకున్నా, కాని, కొంత కోపం ప్రకటించి మరీ చెప్పాను,  దానికి పద్మిని ఏమైనా భాదపడిన్దా  అని అనుమానముగా ఉన్నది, నా ప్రేమ ఫలిస్తుమ్దంటావా అని ఆడిగాడు.

అప్పుడే పద్మిని నుండి ఫోన్ వచ్చింది.

దూరంగా  పోయి మాట్లాడాడు, క్షమాపణ అప్పుడే చెపుదామనుకున్నా కాని చెప్పలేకపోయాను, రాగిణి చేసింది తప్పే, దాని తరుఫున నేను మీకు క్షమాపణ చెపుతున్నా, నా  ప్రేమను మీకు వ్యక్తం చేయాలని చాలా సార్లు ప్రయత్నించాను, కుదరలేదు, నా మనసులో ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాలని ఉన్నది, అన్యధా భావించకుండా మీరు నేడే టాన్కబండ్ వద్ద ఉన్న సీతారాముల విగ్రహాలవద్ద  మీకోసం  ఎదురు చూస్తు  ఉంటాను,  మీరు వస్తారు కదూ అన్నది

గోపాల్ ఒక్కసారిగా ఎగిరి గంతేసి సుబ్బారావును గట్టిగా పట్టుకొని ఒక్క ఊపు ఊపాడు, అంతే  గిర గిర తిరిగి క్రింద పడ్డాడు సుబ్బారావు,  తొందర పడకు ఇల్లు అలుక గానే పండుగ కాదు, నీవు కలిశాకా ఏమ్చేపుతుందో,  నీకెమన్నా చెప్పిందా, లేదు మరి అంత తొందరెందుకు

ప్రేమ అంటే అంత తేలిక కాదు ఆది అర్ధం చేసుకో అన్నాడు

గోపాలం నీలాగా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని కూడా అన్నది, మరి ఏమైందో కానీ నన్ను మరచి పొమ్మని చెప్పి వేరేవారిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లి పోయింది, ఆమెను మరువలేక, మరొకరిని పెళ్లి చేసుకోలేక ఇప్పటిదాకా ఉన్నాను. కాని నిన్ననే నేను ప్రేమించిన వ్యక్తిని చూసను, ఒక బాబుతో ఉన్నది. నన్ను పలకరించింది మంచిగా,. భర్త యాక్సిడెంట్ లో మర నిన్చాడుట ఆనాటి నుండి ఆర్ధిక పరిస్తితి తల్ల  క్రిందల అయిందట నన్ను కలుస్తాను అని మరల చెప్పి వెళ్ళింది. ఈరొజు నుండి నేను నీకు దూర మవవచ్చు, నేను ప్రేమించిన ఆమెనే పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అది నీకు చెపుదామని నీ ప్రేమ విజయము పొందాలని కోరుతున్నాను, నీ పెళ్ళికి నాకు  శుభలేఖ పంపితే నేను రాగలను, పెల్లయిన దానినే చేసు కుందామని అనుకున్నావా,  ఆ దేవుడు  నా ప్రేమను ఇలా మార్చాడు అందుకనే ఆమెను ఆదరించాలని అనుకున్నాను. నీ ఈ  నిర్ణయము బావున్నది, నీకు ఎ అవసరమున్నా నీ స్నేహితుడున్నాడని మరువకు కాకితో కబురంపిన వెంటనే వస్తాను. మీరు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి నేను సంతకాలు పెడతాను. మన స్నేహం మారదు , మనం తరుచుగా కలుసుకుందాం  అన్నాడు గోపాల్. 

గోపాల్ బయలు దేరి ట్యాంక్ బండ్ మీద  ఉన్న శ్రీ సీతారముల విగ్రహాల్వద్దకు చేరాడు, అప్పటికే వచ్చింది పద్మిని
మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటాను  అన్నాది పద్మిని,  కోరికలు గుర్రాలుకావచ్చు కానీ కదను తొక్కనివ్వకూడదు, అసలు నాలో ఏమున్నదని ప్రేమించానని గట్టిగా చెప్పారు మీరు,  కనీసమ్ కైపెక్కే విధముగాను ఉండను, కవ్వింపులు చేయను, ఆధునిక దుస్తులు ధరించాను, కేవలము ఆకు పచ్చ పరికిణి, పాల నురుగు లాంటి ఓని, రెండు జడలతో అప్పుడపుడు పూలు పెట్టుకొని ఉంటానేమో, అందులో నేను తెల్లని పిల్ల అని అందరు అంటారు.
                                                


పద్మిని నీవే కావాలి,   మన్మధుని మైమరిపించే నీ ఒంపు సొంపులు కావాలి, అధరాల  యొక్క అమృతాన్ని పొందాలని నీ మనసులొ చోటు కావాలి,  అందుకే నేను నిన్ను ప్రేమించాను.

అయితే నేను చెప్పేవి అన్ని ఆచరిస్తావా అని అడిగింది. నీకొసమ్ ప్రాణాలు ఇమ్మన్న ఇస్తాను అని గట్టిగ చెప్పాడు గోపాల్.

మనస్సులు ప్రేమ భావనతో కలసి పోవాలి, ఇద్దరు సమానమని తలవాలి, ప్రేమతో భావాలు పంచుకోవాలి, భౌతిక సుఖాలు సాస్వితము కాదు, జీవితామ్తము ఒకరికోరు సహాయము చేసుకుంటూ బ్రతకాలి,  ప్రతి పలుకులో, చేష్టలలో, ఊహల్లొ, ఆనందం ఒకరికొకరు పొందాలి అన్నాది,  మనిద్దరమూ ఒకే శ్వాస, ఒకే దిస, ఒకే ద్యాసా, ఒకే మాట, ఒకే గమ్యం , ఒకే శయ్య, ప్రేమ రసస్వాదమును పొందటమే నిజమైన జీవితమని నేను అనుకుంటున్నాను. అందుకే నీవు  జీవితాన్తము సుఖపెడతాను, కష్ట పెట్టను అని నా చేతిలో ప్రమాణము చేయాలి, అన్నది. నీవు చెప్పినట్లుగా నేను ప్రమాణము చేయు చున్నాను అన్నాడు గోపాల్

దీనికి సమ్మతమైతే మీ తల్లి తండ్రులు, ఇటు మా తల్లి  తండ్రులు ఒప్పుకుంటే మనము దేవుని గుడిలో అతి అక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుందాము,  ఇదే నా అభిప్రాయము,  కాని " నేను ఒక పెళ్లి కొడుకును  చూడాలి,  ఆతను నాకు నచ్చలేదని చెప్పాలి,  ఆ తరువాతే మన అలోచనలు అమలు చేయటానికి మా ఇంటిలో నేను నీ  గురించి చెపుతాను, నీవు నా గురించి మీ ఇంటిలో చెప్పవచ్చు అన్నది.            

ఇన్తకీ నీవుచూడ బొయె ఆ పెళ్లికొడుకు  ఎవ్వరో తెలుసుకోవచ్చా అన్నాడు గోపాల్.

ఎవరా అని అడుగుతున్నావు ఇంకెవరు ఈ ఫోటోలో ఉన్నవారు అంటూ చూపించింది  అంతే  చూసి కళ్ళు తిరిగి క్రింద పడ్డాడు గోపాల్

ఆ ఫోటో ఎవ్వరిదో  మీకు తెలిసి  పోయి  ఉంటుంది కదు వేరే చెప్పనక్కరలేదు మన కధ  హీరొ. .

1, ఆగస్టు 2014, శుక్రవారం

167. Devotional Story 71 ( Om Srinivasayanama:)

శ్రీ రాం .. ఓం శ్రీ రాం ... ఓం శ్రీ.రాం                                                  ప్రాంజలి ప్రభ 

ఎందఱో మహానుభావులు శ్రీ శ్రీనివాసుని ప్రార్ధించి ఆయురారోగ్య ఐశ్వర్యములు పొంది, దేవుని కృపకు పాత్రులు అయినట్లు మనకు తెలుస్తున్నది, నాలో మెదిలిన భావాలను అక్షర రూపములొ స్వామివారిని కీర్తిస్తు ఇందు పొందు పరుస్తున్నాను, దీనిని చదివినవారు ప్రతి ఒక్కరు ఆ స్వామివారి కృపకు పాత్రులగుదురు,  ఆస్వామివారు నా మనసున ప్రవేసించి తెలుపగా నేను వ్రాయుట జరిగింది. మీరు చదివి ఇతరులను చదవమని ప్రోచహిమ్చిన మనస్సాంతి,  ఆరోగ్యము బాగుండగలదని, ఐశ్వర్యము పొందగలరని, ఆ స్వామివారి పై  నమ్మకముతో నేను చెప్పు చున్నాను.  మొక్కులను తీసుకొని మనకు ఆనందం పంచే శ్రీ శ్రీనివాసుడు ( శ్రీ వేంకటేశ్వరస్వామి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా )
  
నా ప్ర్రార్ధనలు ఆలకించు శ్రీ శ్రీనివాస

1. జయవిజయలను తప్పించుకొని నిన్ను చేరాలను కున్నాను
    నిన్ను, అమ్మని,  ప్రార్ధించి మీ పాదాలు పట్టాలను కున్నాను
    వైఖున్టంలో ఉండి నిను ప్రార్దిమ్చుతూ ఉండాలను కున్నాను
    అందరికి తండ్రివి నీవు, నాకు మాత్రం నీవు శ్రీ శ్రీనివాసుడవు   

2. నా  అంతరంగం నవనీతానికి ప్రతి రూపంగా   నీపై  ఉంటుంది
    నామనసు పుణ్య భావాల మందిరమై అలరారుతూ ఉంటుంది
    నాకు ఆపదలలోఉన్న వారిని ఆదుకోవాలని తపన  ఉంటుంది
    కర్మభంధములను నుండి శ్రీ శ్రీనివాస నీగుడి లొ ఉండాలని ఉంది



3. బృగు  మహర్షి  పాదాలను  పట్టి  గర్వము అనిచావు
 లక్ష్మిదేవికోసంలక్ష్మీలక్ష్మీఅనివిలపించావు                                                                                              
    అలసిపోయి వల్మీకంలో ఉండి ఆవుపాలు త్రాగినావు
    నేను నిత్య నైవేద్యములతో కొలిచే శ్రీ శ్రీనివాసుడవునీవు
                                                                                  
 4. నాకు సమయస్పూర్తి  లేక  కొందరికి బందీ  నయనాను
    కాలచక్రం తెలుసు కోలేక కొందరి చేతులో నలిగి పోయాను       
    నా మనసు సూర్య- చంద్రులుగా  తిరిగి నలిగి పోయాను
    అయినా శ్రీ శ్రీనివాస  నీ  మీద భక్తిని వదల లేకున్నాను

5. నా కను పాపలో ఉన్నావు, నిన్ను నే చూడ లేకున్నాను
    కొండలపైన ఉన్న సీమలో ఉన్నావు నే నెక్క లేకున్నాను
    నారాతను నిన్ను సే వించెవిధముగా మార్చమంటున్నాను
    మేఘంలా వచ్చిశ్రీ శ్రీనివాసా నిన్ను సుబ్రపరచాలనుకున్నాను  

6. భూమి ఆకాశం మధ్య నేనునలిగి పోయే మనిషిని నేను
    సముద్రపు వడ్డున పడి  గిల గిల లాడిన చాపను నేను
    చీకటి వెలుగులలో నీ రూపాన్ని చూడాలను కున్నాను
    నా మనసు అర్ధం చేసుకో శ్రీ శ్రీనివాస నే మ్రోక్కుచున్నాను  

7. కళ్ళు మూసి తెరిచే లోపు మాయను తొలగించు
    నాలుకపై లలాజల ముండే వరకు నన్ను రక్షించు
    పాదాలతో భూమిని తట్టుచున్నాను నన్నుక్షమించు
    నా శిరస్సుతో నీ పాదాలకు మ్రోక్కుచున్నాను శ్రీ శ్రీనివాస

8. ప్రతి రేయి  కలలు  కంటాను,  నీ ఏడు కొండలు ఎక్కి రావాలని
    ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తున్నాను, నిలబడి దీవిస్తున్నావని
    ప్రతి నిమిషం నిన్నే తలుస్తున్నాను,  కష్టాలు  కడ  తెరుస్తావని  
    ప్రతి రాత్రి  తపిస్తున్నాను శ్రీనివాస,  నీ పాదాలను పూజిమ్చాలని

9. జ్ఞానమనే నలుసంత కాటుక పెట్టి అజ్ణానాన్ని తొలగిమ్చు వాడవు
    ప్రతి హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడవు 
    హృదయ క్షేత్రములో ఆద్యాత్మిక బీజాలను దృడ పరిచిన వాడవు
    జీవితరధాన్ని దైవమార్గంలో నడిపించి మోక్షాన్ని అందించే శ్రీ శ్రీనివాసుడవు
                                                                  
10. అర్ధిస్తూ, అలమిటిస్తూ,  జ్ఞాణ బిక్షను  కోరుతున్నా
     విలపిస్తూ, అన్వేషిస్తూ, ధర్మ   భిక్షను కోరుతున్నా
     భవ భందాలను వదల  లేక నిన్నే వేడుకుంటున్నా
     సతీ సమేతముగా నిష్టతో కీర్తిస్తున్నాము శ్రీ శ్రీనివాస

11. లోక మొక రంగస్థలి,  మేము నిన్ను తలచి చలించే దాసులం
     మనసు ఒక చక్రస్థలి, మేము  భగవంతుని కృపకు పాత్రులం
     మమతలుగల లోగిలి, మేము పాదాలను పూజిమ్చె పుష్పాలం
     నిన్ను మోసేది బాహుబలి, శ్రీశ్రీనివాస నీ దర్శనమే మాకు మోక్షం

12. భగవత్ సంకల్పమునకు అనుకూలముగా జీవించడం
     భగవంతునికి  ప్రతికూల  మైన  దానిని  విసర్జిమ్చడం
     సంసారంలో సుఖశామ్తులు దేవుని కల్పనఅని భావించడం 
    మంచి-చెడుల మద్య నలిగి పోతున్నాము  శ్రీ  శ్రీనివాస

13. ప్రతి చినుకు తేనే, ప్రతిరోజూ పండుగ  నిన్ను ప్రార్దిమ్చుతుంటే
      ప్రతి మాట సత్యం, ప్రతి పనిలో నిన్నే సహాయమ కోరు తుంటే
      ప్రతి పుష్పం నీ పాదాలకు, ప్రశాంతత నీ పాద ధూలి పెట్టుకుంటే
      నిన్నుప్రార్ధించే శక్తి మాకుకల్పించమని శ్రీ శ్రీనివాస వేడుకుంటున్నా

14. శీతోష్ట్నములు,   జయాపజయాలు  అనుభవిస్తున్నాను
      సుఖ దు:ఖాలు మానవులకు సహజమని భావిస్తున్నాను   
      కర్మాను  సారముగా  వచ్చే ఫలితాను అనుభవిస్తున్నాను
      ఇంద్రియ నిగ్రహము కొరకు శ్రీ శ్రీనివాస నిన్ను కోలుస్తున్నాను

15. త్యాగము ద్వారా అమృత తత్త్వం లభించును
      అహంకారం వదులట వళ్ళ ప్రేమ తత్త్వం లభించును
      భగవంతుని  తత్వాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు తున్నాను
      జన్మ జన్మల భందముగా  ప్రార్దిమ్చుతున్నాను శ్రీ శ్రీనివాస

16. భాహ్య విషయాలకు మేము చింతించుట లేదు
      అంతర్యములోని విషయాలను పట్టిమ్చుకోనుటలేదు
      సమస్త చింతను తొలగించే దైవ ప్రార్ధన మాకుమారదు
      చిన్మత్ర స్వరూపు డైన శ్రీ శ్రీనివాస నీమీద భక్తి మారదు

17. చిత్తముతో చింతించు వాడు ముక్తిని పొందు తాడు
      మనసుతో  ప్రార్దిమ్చువాడు మోక్షమును పొందుతాడు
      దాన ధర్మములు చేయువాడు స్వర్గమును చేరుతాడు
      మరణసయ్యపై  శ్రీ శ్రీనివాస అన్నా మరుజన్మలేకుండు వాడు

18. జ్ఞాణమనే అగ్ని,  అజ్ఞాన మాలిన్యమును  దగ్ధము చేయును
      జ్ఞాణ జ్యోతి  అజ్నానాన్ధకారమును పటా  పంచలు చేయును
      జ్ఞానాన్ని   పెంచే నీ నామ స్మరణ మనస్సాంతి  కలిగించును
      ఆత్మజ్ఞానం కోసం నిన్నె ప్రార్దిమ్చుతున్నాను శ్రీ శ్రీనివాస

19. భగవన్నామంతో  దివ్యాను భూతి  పొందవచ్చు
      భక్తి అనే ఆయుధముతో పరమాత్మను చేరవచ్చు
      నావ లేకుండా సంసార సముద్రాన్ని దాటవచ్చు
      భక్తి అనే బీజం వృక్షమై సుఘంధం వేదజల్లవచ్చు
                                       
20.  కన్న బిడ్డ వెనుక కన్న తల్లి నడవ కుండునా
       భార్య ప్రేమ వెనుక భర్త ప్రేమ ఉండ కుండునా
       భక్తుడి వెనుక పరమాత్ముడుండ  కుండునా
       శ్రీ శ్రీనివాస నిన్నే ప్రార్దిమ్చుతున్నా  భక్తుడుగా 

21. గాంచితి కనక సుంద రాంగున్ని గాంచితి
      స్వప్నా ను  భూతి తెలుపుతూ   వ్రాసితి
      కల వాని కన్న కళ గల వానిని  గాంచితి
      విశ్వ రంగమున శ్రీ శ్రీనివాసుని దర్సిమ్చితి

22. పాములా    పర  ఇంట   నిద్రించ  లేకున్నాను
      చాపలా   ఆకలి  లేకున్నా  ఆశకు  పోకున్నాను
      తేనటీగల  ద్రవ్యాన్ని  సేకరించి పంచు తున్నాను
      శ్రీ  శ్రీనివాస మమ్ము కాపాడమని వేడుకుంటున్నాను


 

23. నీ కొండలు నడిచి నీ రూపం చూడాలని ఉన్నది
      నీ కధలు వింటుంటే మనసు శాంతమవుతుంది
      నీ దృశ్యం నా మనసుని నిర్దేహమయం చేస్తుంది
      శ్రీ శ్రీనివాస నీ రూపం  నా మాయను  తొలగిస్తుంది

24. హృదయ భవనమున  పరమాత్మ భావనయే
      సంసార సుఖ శామ్తులు  దేవుని   కల్పనయే
      దంపతులకు సంతానం  కర్మ పరి పక్వతయే
      శ్రీ శ్రీనివాస నాతప్పులు రక్షించి మన్నించు వాడవే

25. గోవిందా, గోవిందా ప్రార్ధన నా  నామస్మరణ
      వరదా, దయావరా, మా మీద చూపు కరుణ
      ప్రాణులను రక్షించు  అవతారం  నారాయణ
      శ్రీ శ్రీనివాస నీ పాదాలను పూజించుటయే శరణ్యం

26. ఏలిక నీవయ్య,   మా కూడిక నీ  తొనయ్యా
      మాతో పలుక వేమయ్య, ప్రార్ధనను ఆలకిన్చవయ్యా
     మమ్మేలు కోవయ్య, మా తప్పులు మన్నిమ్చవయ్యా
     శ్రీ శ్రీనివాస మా మీద కరుణ చూపె భాస్కరుడవయ్యా

27. అఖిల దేహాలలో అంతర్యామి వై వున్నావు
      బాహ్యాభ్యంతరము వెలుగును విరజిమ్మినావు
      భూదేవి మొరవిని భూభారమును ధ్వంసము చేసినావు
    శ్రీ శ్రీనివాస నీయందే మనసులగ్నానికి మాకు సహకరించావు

 28. చిరునవ్వుతో వికసిత  పద్మసౌన్దర్యము మోము గలవాడవు
      సమస్త దేవతా మూర్తులచే ,  మహర్షులచే వందనీయుడవు
      పరాత్పరుడవు,  వరదుడవు,  లక్ష్మి- పద్మావతీ వల్లభుడవు
      శ్రీ శ్రీనివస అని ప్రార్దిమ్చితే కరుణ చూపె కరుణా మయుడవు

29. మేము సంసార  సాగరమున  మగ్న  మైన వారము
      ద్వన్దములనే  వాయువుచే చెదరగొట్ట బడినవారము
      భార్యా, బిడ్డలనే భందమును  తెన్చు కోలేని వారము
      శ్రీ  శ్రీనివాస నీవె  దిక్కని  వేడు కుంటున్న  వారము

30. అనన్య భక్తితో నీయందె మనస్సును కలిగి ఉన్నవారము
      అనన్య భావముతో యోగమునందు నిమగ్న మైన వారము
      సర్వ ప్రాణులకు ఆత్మ స్వరూపమని నిన్నే ప్రార్ధించు వారము
      విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానము అర్ధిస్తున్నాము శ్రీ శ్రీనివాస

31. జగత్తు నందు   ప్రాణులను   పుట్టించు   వాడవు   నీవె
      జగత్తునందు ప్రాణులను నాశనము చేయు వాడవునీవె
      సమస్థ  ప్రాణులకు జీవశక్తి, భక్తి కలిగించు వాడవు నీవె
      ప్రతి వస్తువు నీలొఉన్నది, నే  ప్రార్దిమ్చుతున్నా శ్రీ శ్రీనివస

32. తేజో వంతులలో తేజస్సు అందిమ్చిన వాడవు
      ప్రజ్ఞా వంతులలలో ప్రజ్ఞను  పెంచిన    వాడవు
      సమస్త   భూతములకు   అధి   నాయకుడవు
      ప్రకృతిని అనుకరించి నడిపించేవాడవు శ్రీ శ్రీనివస

 


33. త్రిగుణాలకు   నీవు    అతీతుడవు
      సర్వెంద్రియాలు నీమెద పనిచేయవు
      భక్తికి లొంగి సహయము చేసేవాడవు
      శ్రీ శ్రీనివాస బుద్ధిలేని వారిని మార్చేవాడవు

34. ఆకాశమున మేఘాన్ని, శబ్దాన్ని కల్పిమ్చే వాడవు
      స్త్రీలకు, పురుషులకు,   పౌరుషము  పెంచే వాడవు
      సమస్త గ్రహాలను, భూతాలను అదుపులొఉంచెవాడవు
      శ్రీ శ్రీనివాస తాపసులలో తపస్సును ప్రోశ్చహిమ్చేవాడవు

35. శుభ కర్మలను ఆచరిస్తూ సుఖ సంపదను కోరుతున్నాను
      శారీరక  మానసిక  సన్తాపములకు  గురి  అవుతున్నాను
      ఐహిక సుఖాలపై ఆశక్తి వీడి  జ్ఞానము పొందు ఇచ్చగలవాడను
      అజ్నానులము మేము శ్రీ శ్రీనివాస జ్ఞానాన్ని కోరుతున్నాము 

36. మోహమనే  కెరటాలకు  చిక్కి ఉన్నాము
      సతి అనేడి సుడిలో పడి లేవలేకున్నాము
      బిడ్డలు,  ప్రేమను  వదలలేక  ఉన్నాము
      శ్రీ శ్రీనివాస మాయ నుండి  తప్పించుము
                                                                       
37. గాలి  తీవ్రముగా  ఉన్నప్పుడు కళ్ళు  తెరచి   చూడ   లేకున్నాను
     కోరికలు హోరుగాలిలా తగిలనపుడు మనసు నిలుపలేకున్నాను 
     మూడు  ముడులు  వేసిన నేరానికి సుడి  గాలికి చిక్కు కున్నాను
     శ్రీ శ్రీనివాస గాలి ద్వారా  భక్తి  అనే  నావను  నడిపి  ప్రార్ధిస్తున్నాను

38. నీ  యందు  భక్తి  లేని వారిని  నేను  రక్షించ లేను
     మనస్సుతో  త్రునీకరించిన   వారిని నేను తలవను
     నీ కధలు  లేని  గ్రంధములను  నేను  చదువలేను
     హేలోకనాధ, శ్రీ శ్రీనివాస  నీ సేవకు నేను పాత్రుడను

39. నాలుకతో శ్రీ శ్రీనివాస నామమమును కీర్తిస్తాను
      చిత్తముతో ఏడుకొండలు ఎక్కి  వేడు కుంటాను
      హస్తములతో నిత్యము నీకు  అర్చనలు చేస్తాను
      నీలాలు అర్పించి, శ్రీ శ్రీనివాస మొక్కు తీరుస్తాను

40. చెవులతో  శ్రీ శ్రీనివస  భక్తి గీతాలు  ఆలకిస్తాను
     నేత్రాలతో నీ దివ్యమంగళ  రూపాన్ని తిలకిస్తాను
     మోకాళ్ళతో ఆలయముచేరి నీ పాదాలకు పూజిస్తాను
     నా తలరాతను మార్చి నీమీదద్యాస ఉంచు శ్రీ శ్రీనివాస      

41. నీ వైభవము ముందు  భూమి ఒక రేణువో
     నీ వెలుగు ముందు అగ్ని ఒక మిణుగురు పురుగో
     నీ శ్వాస ముందు వాయువు సన్నని నిట్టుర్పు వంటిదో
     శ్రీ శ్రీనివాస మేము దాసాను దాసులం అవుతున్నాము

42. నేత్రముల యందు  ఆనంద  భాస్పాలు  రాలు తున్నవి నాకు
     శిరము వంచి, అంజలి ఘటిస్తూ, స్వరము మూగ ఐనది నాకు
     ధ్యానమనే సుధా రసమును పానము  చేయు  చుంటిని నేను
     శ్రీ శ్రీనివాస నీ పాదములు కొలుచుకు మాకు అనుగ్ర హింపుము

43. ఏడూ కొండల వాడ వేంకట రమణ, కరుణ సముద్రా,
     శ్రీ పతీ, కంసారీ,  గజేంద్రుని బ్రోచిన  దేవా,  మాధవా,
     హే జగత్రయ గురో, హే పుండరీకాక్షా,  హే గొపీ నాధా,
     శ్రీ శ్రీనివాస నన్ను రక్షించుము, నిన్ను తప్ప అన్య మెరుగను

44. మనస్సును హృదయము నందే స్తిరముగా నిలిపితిని
      సర్వేద్రియములను నిగ్రహించు కొని ప్రార్దిమ్చితిని
     ఏకాగ్రతతో నిన్నే కీర్తిస్తూ నీ  చెంతకు  చేరితిని
     శ్రీ శ్రీనివాస ద్యానమార్గమున ఆరాధించు చుంటిని

45. సర్వజ్ఞుడవు, సనాతనుడవు, అందర్నీ శాసించు వాడవు
      అణువుకంటే సూక్షమైన వాడవు, అందర్నీ పోషించు వాడవు
      అచింత్య రూపుడవు, సూర్యునివలె నిత్యము ప్రకాశించు వాడవు
      అజ్నానామ్ధకారమును పారద్రోలమని వేడుకొంటిని  శ్రీ శ్రీనివాస
                                                                              
46 మాలో  ఉన్న  అసుర  ప్రకృతిని   తగ్గించి,   దైవ  శక్తిని  పెంచే వాడవు
    ఆశ్చర్య కరమైన, నీలమైనటువంటి,ఆకర్షించే  కేశములు కలవాడవు
    ఉంగరములవలె వంకరులు తిరిగిన కేశములతొ మేహాన్నిపెంచేవాడవు
    స్త్రీలు, పురుషులు కురులు తీసుకొని, అందర్నీ  కాపాడే శ్రీశ్రీనివాసుడవు

47.   పురుషులకన్న ఉత్తముడవు, శబ్ధ, జ్ఞాన, సంపన్నుడవు
       అశుభాలను తొలగించి అందరికి శుభాలు కల్పించే వాడవు
       ఆపేక్ష కలవారికి మంగళాన్ని కలిగించే కలియుగ దేవుడవు
       ప్రతి ప్రాణిని  సక్రమ మార్గమున నడిపించే శ్రీ శ్రీనివాసుడవు

48.  అవసరానికి   ఉపాయము  నందించే  నేతగా ఉండే వాడవు
       ప్రకృతి  విపత్తు  నుండి   జీవులను  రక్షించే   పురుషుడవు
       భక్తుడైన ప్రహ్లాదుడి భయమును తొలగించిన నరశింహుడవు
       అస్థిరమైన మనస్సుగల ప్రాణులను కాపాడే శ్రీ శ్రీనివాసుడవు

49.  విద్య, వాసన, కర్మ, రుచి, అనేవి తెలియన వానికి నీవే రక్షః                
      మాయ మాటలకు చిక్కి, మనసు చలించిన వానికినీవే రక్షః
      ముక్తులను ఆనంద పరిచి, వారిని కటాక్షిమ్చుటకు నీవే రక్షః
      మా గుణములను క్రమంలో ఉంచుటకు శ్రీ శ్రీనివాస నీవే రక్షః      

50. కలియుగంలో ధర్మమునకు హాని కలిగుతున్నది, రక్షణకు నీవే రక్షః
     దుష్టులను,దుర్మార్గులను, మోసకార్లను, రూపుమాపుటకు నీవే రక్షః
    సత్పురుషులను, పతివ్రతలను, భక్తులను పరిరక్షించుటకు నీవే రక్షః
    తిరుమలపై అవతరించి మాతప్పులను మన్నించే శ్రీ శ్రీనివాస నీవే రక్షః

51.    ఆది అంతములు లేని నిత్య యవ్వన వంతుడవు
        గర్భాన్ని ఆవిర్భావింప తల్లి బిడ్డను కాపాడే వాడవు
       బ్రహ్మచే సృజిమ్పపడిన ప్రజాపతులకన్న ఉత్క్రుష్టుడవు
       బ్రహ్మా రుద్రాదులతో సేవించ బడు శ్రీ శ్రీనివాసుడవు

52.    తనకు తానుగా అవతారము ఎత్తిన వాడవు
        సౌశీల్యాది గుణములను ప్రకటిమ్చినవాడవు
        సర్వమండలం మద్య నివసించే పరాత్పరుడవు
        మమ్ము కాపాడే హస్తములుగల శ్రీ శ్రీనివాసుడవు

 

 53. ఎదిగే ఎదమీద ఆచ్చాదనలేక దిక్కులేని వారిని కాపాడావు
       ఎంగిలి మేతుకులులకు కుక్కల్లాగా పోట్లాడేవారిని కాపాడావు
    పసికందులతో, చలిలోఇల్లులేక చెట్టు క్రింద చేరినవారిని కాపాడావు  
    అందరి హృదయాలకు అర్ధం చేసుకొని శ్రీ శ్రీనివాసా కాపాడే వాడవు

54.  భూలోకంలో  పాపపుణ్యాల భారాన్ని మోస్తున్న వాడవు
      కాలాన్ని నిరంతరం కదిలే ప్రవాహంలా సృష్టించిన వాడవు
     సుఖ దు:ఖాలతో జీవులు బ్రతకాలని సాక్షిగా నిలిచినా వాడవు
     ఆశ నిరాశల మద్య ఊగిసలాడుతున్నా కాపాడే  శ్రీ శ్రీనివాసుడవు
 
                                                                           
55. కోకిల గొంతుల్లో మధుర స్వరాలు వినిపుస్తున్నాయి
     తులసీ దళాలు పరిమళాలు విరజిమ్ము  తున్నాయి
     మకరందాలు గ్రోలు బ్రమరాలు నాదాలు చెస్తున్నాయి   
     ఆనంద డోలికలో ఉన్నా శ్రీ శ్రీనివాస మమ్ము రక్షిమ్చుతున్నావు

56. ప్రకృతి అలంకార శోభితుడవై శ్రీ శ్రీనివాసుని ఊరెగిమ్చువేళ
     శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రజలకు దర్శన మిచ్చు వేళ
     నీనామంతో భక్తులు పారవశ్యంతో జడి వానలో నాట్య మాడిన వేళ
   దూర ప్రాంతమునుండి వచ్చాము శ్రీ శ్రీనివాస మామీద దయచూపు వేళ

57. సర్వ శోభిత తెల్గునాడు అందరికి  ప్రశాంత చిత్తము కల్పిమ్చుము
    సర్వదా సుఖశాన్తులిచ్చి, మా మనస్సు ప్రశాంతముగా ఉంచుము 
    సర్వ మంగళ రూపుడవై, సర్వ లోకాలను నీ ఆజ్ఞచే  పాలించుము
    సర్వ కళలచె బ్రతికే  వారము శ్రీ శ్రీనివాస మమ్ము  కాపాడము

58. అనుగ్రహ విషయములో దృడముగా ఉండే వాడవు
     సమస్త  ప్రాణుల చేత గ్రహిమ్చః పడుచున్న వాడవు
     ఎందరు అనుభవించిన తగ్గని ధనము కల వాడవు
     కోరిన వారిని ఉద్దరించడానికి ఉన్న శ్రీ శ్రీనివాసుడవు

59. అనిష్ట  నివారణ  ద్వారా  సాధువులను   ఉజ్జీవింప  చేసే  వాడవు
    కర్మ సంభంధం లేకుండా జన్మను శ్వీకరించి ప్రజలను కాపాడే వాడవు
    ప్రతి జన్మలోను ప్రతి ఒక్కరికి భోగ, మోక్ష,  ఫలము నిచ్చు వాడవు
    మా కష్టాలను కడ తేర్చే సమర్దుడవు, ఆదుకొనే శ్రీ  శ్రీనివాసుడవు

60. మెదడుంటే  సరిపోదు శరీరానికి హృదయం ఉండాలన్నావు
    వర్ణాలుంటే సరిపోదు పూలకు పరిమళాలు ఉండా లన్నావు
    పరిమాణం ఉంటె సరిపోదు పండ్లకు మాధుర్యం ఉండా లన్నావు
    నీకొండకు వస్తే సరిపోదు శ్రీ శ్రీనివాస నీమీద భక్తి ఉండా లన్నావు

61. ధర్మార్ధ కామములందు నాకు కోరిక లేదు
    కర్మాను సారము జీవితమును నడుపుట తప్పదు
    పురుషార్ధములద్వార దేహమును రక్షిమ్చుకొనటలేదు
    చింతలను త్యజించా శీ శ్రీనివాస నీ నామోచ్చారణ మారదు

 

62. ఉపనిషద్వాక్యములచే పూజిమ్పబడు  మంత్రము
    సంసారము  నుండి తరింప చేయు మంత్రము
    అజ్ఞాన సంచితమును అంతమొందించు మంత్రము
    జన్మను కడతేర్చు మాత్రమును అగు శ్రీ శ్రీనివాస మంత్రము

63. భక్తుల యొక్క ఆపదలనే సర్పాలను తప్పిమ్చువాడవు
    త్రిలోకములకు రక్షణ నొసంగు మణి  వంటి వాడవు
    సౌందర్యమును, శక్తిని అందించు శరణాగత వత్చలుడవు
    శరణాగతుడైన గజేంద్రుని కాపాడటానికి వచ్చిన శ్రీ శ్రీనివాసుడవు   
                                                                  
64. కేవలము  సంకల్పము చేతనే కోరిన  పనులు  చేసే వాడవు
    ఈలోకంలో ఎవరివల్ల గ్రహింప శక్యము కాని వేంకటేశ్వరుడవు
    నిత్య సూరులకు ఎల్లప్పుడు కావలసిన శక్తిని  ఇచ్చువాడవు
    సువర్ణమువలె ప్రకాశిస్తూ మమ్ము కాపాడే శ్రీ  శ్రీనివాసుడవు

65. బ్రహ్మాదులకు వారాలు కోరిన ఫలములు నిచ్చు వాడవు
    అభయము నిచ్చి వారలను ఆధీనములొ ఉంచుకొన్న వాడవు
    నిధి పై ఎంత ప్రీతొ అంతే  ప్రీతితో అన్దరినీ  కాపాడే  వాడవు
    హెచ్చుతగ్గులు లేకుండా సమానముగా చూసె శ్రీశ్రీనివాసుడవు

66. పృధ్విపై సమస్త కార్య వర్గమును సృష్టించి లభించు వాడవు
    వేదాలు మెదడులో ఉంచుకొని ఆజ్ఞలు జారీ చేయువాడవు
    శ్రీ ఆంజనేయస్వామికి చతుర్బుజుడుగా దర్శన మిమ్చినవాడవు
    ఉపాసకులకు కడుపు నింపే అమృతమునుపంచే శ్రీశ్రీనివాసుడవు

67. శారీరక రోగం పోవటానికి ఔషధం అన్నావు
    భవరోగం పోవటానికి మంత్రోపదేశం అన్నావు   
    సకలపాపాలు పోవటానికి నామజపం అన్నావు
    ఏకాగ్రతతో ప్రార్దిస్తే శ్రీ శ్రీనివసుడుగా దర్సనమిస్తానన్నావు

68. తిరుమలలో నా మనసంతా మధు మాసంలా వికసించింది
    నా తనువు అనువనువు నిన్నే స్మరిస్తూ నీదర్శనమ్ కోరుతుంది
    నాకురులు, కానుకలు సమర్పించి నా కోరికలు తెలపాలున్నది
    శ్రీ శ్రీనివాస నీ చూపులు నాపై నిరంతరం ఉంచమని కోరాలున్నది

69. ఆకలి పెను భూతమై పేదవాడ్ని భాద పెట్టిన, ఆకలి తీరుస్తావు
    కసాయిగా, కర్కసముగా అమాయకులను హింసిస్తున్న ఊరుకోవు
    కురులు, కానుకలు అర్పిమ్చినవారిని ధనాది ధనికులను చేస్తున్నావు
   మనసు పరిశుద్ధమై ఏకాగ్రతతో ప్రార్దిస్తే  శ్రీ  శ్రీనివాసుడుగా కనిపిస్తావు

70. కోరి ఎలునట్టి   మా కులదైవమా
   మా పాపాలను తొలగించే పురుషోత్తమా
   మాకు నిశ్చల భక్తి కలిగించే  బ్రహ్మతత్వమా
   శ్రీ శ్రీనివాస మా ఆశ అనే ఆకలిని తొల గించుమా

71. హరివాసం చేసే వరకు ఉపవాసం చేస్తా
    సంగీత సాధనతో కీర్తిస్తూ నీ కొండకు చేరుతా
    పదివేల శేషుల పడగల తిరుమలకు వస్తా
    శ్రీ శ్రీనివస ఆనంద నిలయాన్ని దర్సనం చేస్తా

72. ప్రియ  లాభామునకు పొంగి పోయే వాడను కాను
    అప్రియములు ఎదురైనప్పుడు క్రుంగి పోయే వాడను కాను   
    స్త్రిరమైన బుద్ధితో,  మొహ వివసు డైన వాడను
    భోగముల నుండి కాపాడే శ్రీ శ్రీనివాసుడవని ప్రార్ధిస్తున్నాను

 



73. సంశయము, బ్రమ లేకుండా  సర్వము  జ్ఞానము  కలవాడవు
     ఇతర సహాయమును ఆపేక్షక గొప్ప తేజస్సుతో నుండువాడవు
     దివ్య  శరీరమునకు  తగిన దివ్యాభరణ సంపదలు  కలవాడవు
     అతి మనోహరమైన, గంభీర స్వభావము  గల శ్రీ శ్రీనివాసుడవు

74. విరోదులచే ఎంత మాత్రము సహింప జాలిని వాడవు
     సమస్త దుర్జనులను ఈదేహముతో శాసించు వాడవు
     గురువులకు గురువు, విద్యలకు  పరమాచార్యుడవు
    శ్రీ శ్రీనివాస సజ్జనులందరికి సత్య వ్రతుడవై ఉన్నావు

75. విరోధము లేక  సమస్తము  అను  కూలముగా   ఇచ్చు వాడవు
     సంసారము నుండి విముక్తి  కలిగించే ఔషధము  నిచ్చు  వాడవు
    పరవిద్యను లభించిన వారికీ తేనెవలె మిక్కిలి ఇష్టంగా ఉండే  వాడవు 
    జ్ఞాన,బల,ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు కల్పించే శ్రీ శ్రీనివాసుడవు

76. గమ్యం ఎరుగని, గాలికి తిరిగే గాలి పటాన్ని నేను
     నీవు నా కళ్ళ ముందు ఉన్నా చూడేలేనివాన్ని నేను
    నీటి పలకపై భక్తి  కీర్తనలు గోటితో వ్రాసిన కవిని నేను
    ఒదార్పులేక, భాధలు తెలుపలేక, వేడుకుంటున్నాను శ్రీ శ్రీనివస

77. గొంగలి పురుగును సీతాకొక చులుకగా మారుస్తున్నావు
    సున్నపు  రాయిని పాల  రాయిగా  మారుస్తున్నావు
    భూమిలొ బొగ్గును, రాయిని, వజ్రంగా మారుస్తున్నావు
    శ్రీ శ్రీనివాస నీవె మానవుల భుద్ధిని మారుస్తున్నవాడవు

78. తల్లివై బిడ్డల అందరి వృద్దిని కోరిన వాడవు
    జయ శీలమైన వాక్కును ఎప్పుడు పలికేవాడవు  
    ఎమీ కోరని వారికి తనే ధనముగా ఉండే వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె పలు మార్లు మాకు సహాయపడినవాడవు

79. సంసారములో తనుకూడ మునిగి భక్తులకు రక్షకుడవు
     జ్ఞాన శక్తి లచే విశ్వమంతా వ్యాపించి ఉన్న వాడవు
    గుణదోషములు చూడక విశ్వమంతను సృజిమ్చినవడవు
    శ్రీ శ్రీనివాస భక్తులు కోరు దూత కృత్యములను చేయువాడవు

80 . యోగి తాపసులకంటే శ్రేష్టుడవు
       సకామ కర్మలు ఆదరించు వారి కంటే శ్రేష్టుడవు
      సిద్ధిని సాధకులకు ఇచ్చు వాడవు
      శ్రీ శ్రీనివాస యోగ సాధకులను రక్షిమ్చువాడవు

81. బిడ్డ ఆకలి తల్లికి కనిపించదు, మనసుకు తెలుస్తుంది
    పద్మావతి తల్లుల భాదను తెలుసుకొని ఆదుకుంటుంది
    పద్మావతిని వేడుకుంటే మనసు  ప్రశాంత మవుతుంది
    శ్రీ శ్రీనివాస నీవె సతిని చేరి మాభాదలను తొలగిస్తావని ఆశ  ఉన్నది

82. భక్తుల   మీద   ప్రీతి    తగ్గ  కుండు    వాడవు
     సమస్త లోకములను ఉదరము నందు కలవాడవు
     మాయచే జీవులను భందించి  క్రీడించే  వాడవు
    శ్రీశ్రీనివాస నీవె లక్ష్మిని క్రీడించి ఆనందపరిచేవాడవు

83. తన మాటను జవ దాటని వారిని సృష్టించే వాడవు
     హద్దు మీరిన వానిని భయంకరముగా శిక్షిమ్చెవాడవు
    యాగమున హవిర్భాగాములను  స్వీకరిమ్చె  వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె సమస్త విఘ్నములను తొలగిమ్చేవాడవు

84. శోకము, మోహము, ఆకలి  నుండి  రక్షించే  వాడవు
     వాయువును సక్రమముగా విచునట్లు చేయు వాడవు
    అసు రాదులను త్వర త్వరగా శోషింప చేయువాడవు
    శ్రీ శ్రీనివాస నీవె మా వ్యాదులనుండి రక్షించే వాడవు

85. ఈ లోకంలో    ధర్మాన్ని   రక్షించే   వాడవు
     తేజస్సు గల   శిఖరము    ఉన్న    వాడవు
    తాపము తీరునట్లు కాంతిని వర్షించు వాడవు
    శ్రీ శ్రీనివాస నీవె భూభారమును భరించు వాడవు

86. సమస్త లోకాలకు జలమును అందించు వాడవు
      భోగమును, మోక్షమును కోరునట్లు చేయు వాడవు
     సమస్త ప్రాణుల హృదయాలను దోచుకొను సమర్దుడవు
     శ్రీ శ్రీనివాస నీవె యుగాంతము నుండి  కాపాడే వాడవు

87. వేదజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికం అన్నావు
     సమస్త గోప్య  విషయాలకును   శిరోభూషణము  అని అన్నావు
    సాదన  చేయుటకు  మిక్కిలి సుగము,  శాశ్వితము,  అన్నావు
    శ్రీ  శ్రీనివాస నీవె  ప్రత్యక్ష   ఫలదాయకము  అందించే   వాడవు

88. ధర్మమార్గామునందు  విశ్వాసము లేని వారు నిన్ను చేరలేరన్నావు
     మృత్యు  రూపమున సంసార చక్రమున  పరిబ్రమ చెందుతారన్నావు
     జగతంత్తయును  జలముతో మంచు  వలె పరిపూర్ణ  మైనదన్నావు
     శ్రీ శ్రీనివాస నీవె భూతములను సృష్టించి ఒక  ఆట ఆడించే వాడవు           

89. వ్యర్ధము లైన ఆశలను ప్రాణులకు కల్పించి ఆడిస్తున్నావు
     విపరీతమైన జ్ఞానమిచ్చి, అజ్నానులుగా మారుస్తున్నావు
     వయసులో ఉన్న వారికి మొహవేశంలోకి  పడే స్తున్నావు
    శ్రీ శ్రీనివాస నిన్నే నిశ్చలమైన మనస్సుతో భజింతురన్నావు

90. సమస్థ జగత్తును హృదయంలో ధరించు వాడవు   
     అందరికి కర్మ ఫలమును ఇచ్చువాడవు 
     ఋక్సానం యజుర్వేదములను అందించు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె ఓంకారం ను సృష్టిమ్చినవాడవు

 

91. అందరివి  శుభా  శుభములను గమనించు వాడవు
      పరమ గతి  ఐన  పరం   ధాముడవు,  పవిత్రుడవు
      ప్రత్యుపకారము    పొందక  హిత మోనర్చు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె ఉత్పత్తి ప్రళయములు కల్పించువాడవు 

92. దేవతలను  పూజించె  వారు దేవ లోకమును  చేరుతారన్నావు
      పితరులను సేవించేవారు  పితృ   లోకమును  వెల్లుదురన్నావు
      భూత,ప్రేతాలను అర్చిమ్చేవారు అదే రూపాలు పొందుదురన్నావు
      శ్రీ శ్రీనివాస నిన్నే ఆరాధించువారికి పునర్జన్మ అనేది ఉండదన్నావు

 

93. సకల  భూతాల   యందు  సమభావం  కల్పించే  వాడవు
      నీకు ప్రియుడు  లేదా అప్రియుడు అనేవారుఉండరన్నావు
      భక్తితో భజిమ్చే వారి హృదయంలో స్తిరంగా ఉంటానన్నావు
      శ్రీ శ్రీనివాస నీ హృదయంలో భక్తులకు చోటు కల్పిస్తున్నావు

94. బ్రాహ్మణులు నిన్ను శరణు  పొందితే పరమపదమును చేరుతరన్నావు
      స్త్రీలు, వైశ్యలు ,శూద్రులు , అందరు శరణు పొందితే  మోక్షమిస్తాన్నావు
      సుఖ రహితము, క్షణభంగురమైన ఈ శరీరముకొరకు భాద  వద్దన్నావు
      శ్రీ శ్రీనివాస నీయందే మనస్సులగ్నము చేసేవారిని భక్తులన్నావు        

95. నిర్దోష   మైన  మార్గమును   ప్రదర్శించు   వాడవు
      భక్తులుఉండే చోటుకే పోయి సేవలు చేయు వాడవు
      అపకారులను కూడా  క్షమించే గుణము కలవాడవు  
      శ్రీ శ్రీనివాస నీవె అమితమైన ధనము ఇచ్చే వాడవు

96. జ్ఞానుల యొక్క  తత్వ  జ్ఞానమును పెంచే వాడవు
      గోప్య విషయ రక్షణమున మౌనము అందించు వాడవు
      శిక్షించు వారిలో దమన శక్తిని అందించు వాడవు
      శ్రీ శ్రీనివాస నీవె మాలో భక్తి,ద్వేషం కల్పించి నడిపిస్తావు

97. ఉత్తమములగు వైష్ణవ ధర్మము లన్నియు ఎరిగిన వాడవు
      తనకు తనే సూక్ష్మ స్వరూపముగా సాక్షాత్కరిమ్చు వాడవు
      అపక రించు  వారి మనస్సు కూడా హరించు వాడవు
     శ్రీ శ్రీనివాస నీవె మొహినీ రూపములొ అమృతం పంచినవాడవు

98. భక్తుల అహంకారము, మమకారములను తొలగించు వాడవు
     కపిల వర్ణములో తత్వ ప్రవచనము చేయు ఆచార్యుడవు
     చత్ర, చామ రాది, సక లాంగములతో విరాజిల్లు వాడవు
     శ్రీ శ్రీనివాస నీవె మాపై దయను వర్షించు నేత్రములు కలవాడవు

99. కొంచమైన అహంకారము లేక శాంతముగా ఉండు వాడవు
     తనయందు భక్తిని ఉంచిన వారికి అష్టామ్గములు ఇచ్చువాడవు
     మహాలక్ష్మిని యదేచ్చగా విహరించు వక్ష స్థలము కలవాడవు
     శ్రీ శ్రీనివాస నీవె అందరి ఆత్మలను తనవిగా కలవాడవు  

100. ప్రకృతికి,  ఆత్మకు,పంచభూతాలకు హితమైన వాడవు
        స్తోత్రము చేయువారి మనోరధమును పూరించువాడవు
        మిత్ర, బంధు, దూత, సారధి సమస్తము తానైన వాడవు
        శ్రీ శ్రీనివాస అందరి కన్నాపరిశుద్ధ మగు కీర్తి గలవాడవు

101. భక్తులకు అనేక  రూపాల్లొ  దర్శన మిచ్చు వాడవు
        తారతమ్య  చూడని పరిశుద్ధ స్వభావం కలవాడవు
        నీవిచ్చిన పురుషార్ధములను నీవె రక్షించు వాడవు
        శ్రీ శ్రీనివాస నీవె మంత్ర విద్యలను రచించిన వాడవు

102. బ్రహ్మాదుల అపరాధములను క్షమించు వాడవు
        భోగ, మోక్ష, అపేక్ష కలవారికి  మంగళ కరుడవు
        ప్రేమసంపదను అలివేలుమంగకు ఇచ్చిన వాడవు
        శ్రీ శ్రీనివాస ఎరూపంలోఉన్నా లక్ష్మిని భార్యగా పొందావు

 

103. భక్తులను బుజ్జగించి, ఏడిపించి రక్షించే వాడవు
        అపరిమితమైన  బలమును  ధరించిన  వాడవు
        లోకములను నాశనము చేయు శక్తి కలవాడవు
        శ్రీ శ్రీనివాస నీవే సత్యమైన వ్యాపారము కలవాడవు       

104. అందరి యందు దాక్షిన్యము కలవాడవు
        జ్యోతి చక్రము ప్రవర్తింప చేయు  వాడవు
        ప్రవృత్తి,నివృత్తి, ధర్మములకు అద్యక్షుడవు
        శ్రీ శ్రీనివాస నీవె నక్షత్ర రూపము ధరించు వాడవు  

105. దురభి మానమును, మోహమును మేము త్వజిమ్చినాము
       ఆసక్తి అనుదోషమును జయించి  శక్తితో ప్రార్ధించుతున్నాము
       ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలి వేడుకుంటున్నాము
       శ్రీ శ్రీనివాస శాశ్వితమైన మోక్షము కొరకు వేడుకుంటున్నాము 

106. వాయువు వాసన ఒక చోట నుండి మరియొక చోటునకు చేరినట్లు
        జీవాత్మ ఒక శరీరమును త్వజిమ్చి మరొక  శరీరమును  చేరినట్లు
       సూర్య- చంద్రులు, అగ్ని, తేజస్సుతో  మానవులను సృష్టిచి  నట్లు
       శ్రీ శ్రీనివాస నీవె సర్వ ప్రాణుల ఆహారమును జీర్ణము చేసి రక్షించినట్లు

107. తత్వజ్ఞాన ప్రాప్తికై ద్యాన యోగాము నందు ద్రుడ స్తితిలో ఉన్నాము
        అగ్ని హోత్రాది ఉత్తమ కర్మాచరణముతో కీర్తనాలు పాడుతున్నాము
        స్వ ధర్మా  చరణము నందలి కష్టములను ఓర్చు కొను  చున్నాము
        శ్రీ శ్రీనివాస నీవె నిత్యమూ శాంతి సౌభాగ్యాలు ఇస్తావని నమ్మకము

108. మేము మనో వాక్కాయములద్వార ఎవ్వరికికష్టములు కల్గిమ్చము
        ప్రతి ఒక్కరిని యదార్ధమైన,  ప్రియమైన మాటలతో తృప్తి పరిచేదము
        మాకు అపకారముచేయువారికి మేము ఉపకారములు చేస్తున్నాము
        కార్యచరణము నందు  కర్తుత్వభిమానమును  త్వజించు  చున్నాము
        చిత్తచాంచల్యములేకుండ కుటుంబ సమేతముగా వేడుకుంటున్నాము
        అన్య ప్రాణులఎడ కృప చూపుతూ,  ఎవ్వరిని నిందింపకసేవిస్తున్నాము
        ఇంద్రియ విషయ సంయోగములొ ఉన్నాము, కానిఆసక్తి లేకున్నాము
        శ్రీ శ్రీనివస నిన్నే కాలము, ననుసరించి, అతి నిష్టతో ప్రార్ధించుతున్నాము
                       


ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తండ్రి ఐన  వేంకటేశ్వరుని , తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు

పైన ఉదహరించిన  మొత్తము జిరాక్స్ తీసి 3,5,7,11,21,108   భక్తులకు పంచిన ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కరుణించి కటాక్షిమ్చునని నా నమ్మకము లేదా మొత్తము ఒక్క పేజి తీసి మీ అత్యంత సన్నిహితునకు  ఇచ్చి  రోజు  చదవమని చెప్పగలరు   ఆ దేవుని ఆశిస్సులు అందరు పొందగలరు.

     
                ఓం శాంతి:  శాంతి: శాంతి:
                       సర్వం శ్రీ శ్రీనివాసార్పనమస్తు