26, డిసెంబర్ 2023, మంగళవారం

ఓం నమః శివాయ 


సకామ్యమ్మే జీవమ్ము వినయపు దీక్షా సతిపతే

ప్రకాశమ్మే  ధ్యానమ్ము సహనపు రక్షాగతి మతే

వికాసమ్మే విన్యాస వినయపు శిక్షా సమ గతే

సకాలం మే దీనాతి బతుకుకు విద్యా పశుపతే              1


మాతా బొజ్జసకామ జన్మ భవమై మానంద పాపమ్ముగా

ప్రీతీ నొంద ఫలమ్ము గాను జలపీయూష పుత్రుండుగా

ప్రాతత్ భావముగాను తెల్ప జఠరాగ్నే బంధ దాహమ్ముగా

ఏతత్ భూమిన నేనుపుట్టె సహనమ్మే జూప విశ్వేశ్వరా 2


పసితనమందునే పలుకుదుఃఖపు పీడన సుబ్రతలేక వేదనే

శశికళచూపకే భయము నెంచియు సీఘ్రము బంధన మౌట కాలమే

పశువులమాదిరేకదిలె ఇంద్రియ పాశములేకయు బాధ తత్త్వమే

కసువులమధ్య పెర్గితిని నిత్యము కామ్యము తెల్పుము   నాకు యీశ్వరా   3

...


నా మీదే నీ మాయా ప్రభవము సహాయమ్ము సహనమే

 ఏమైనా యీ చర్యా భవహర సయోధ్యమ్ము సమయమే

 నా మాటా యీపూటా విధిపర యనేకమ్ము ప్రణయమే

 నీ మాటే నా స్ఫూర్తీ మనసుగట నీ భక్తి పశుపతీ..4


ఉరుములుగాను మెర్పులగు ఊయలవానలు సాగుటే గతీ

తరుముకు వచ్చు తప్పులగు తామస మాటల యాటలై విదీ

పరుగున మాయ చొచ్చుటయు పామర బుద్ధికి సేవలే సుధీ

మరుగున పడ్డ మాటలివి మానస మంతయు భక్తి యీ శ్వరా...5


నీ పాదమ్మె మదీ యభావ మగుటే నీద్యాస సంపూర్తి యే

నీ పాదార్చకునే వినమ్ర మనసే నీన్యాయ మార్గమ్ము యే

నీ ప్రాభవ్యముగా ను నిత్య జపమే నీ సేవ భాగ్యమ్ముయే

యీప్రాధాన్యతయే సహాయ మదిగా నే విశ్వ విశ్వేశ్వరా..6


దుర్మిల వృత్తము స స స స స స సస...9,13,21


కనునాదము తెల్పెద గామనతో గణ నాదము నిత్యము భక్తిగనే

వినుమా మదిమాయల చిక్కులుగా విజయమ్ము గనే సహ శిక్షణనే

నిను కొల్చెద సత్యము నెమ్మికతో సహనమ్ముగనే విధినీడగనే

తణువే తపమై స్థితి తాహతుగా సరితీరుగ నీయర యీశ్వరుడై..7


చేతన జీవనమ్మగుట చింతల మాటున చేష్టలయ్యెనన్

దాతగ నుండలేకయు విధానము తెల్యక తప్పుచేయుచున్

త్రాతవు నేవె యన్నమది వ్రాయగ లేకయు వేదనమ్ముగన్

దాతవు రక్షగా మనసు దారిని జూపుము విశ్వ యీశ్వరా.8


సజ్జన మైత్రి సాధువగు శాంతికి శిష్టుల సత్య వాక్కులై

మజ్జిగ మాదిరే మనసు మంత్రము చల్ల న సత్కరింత్రులై

బొజ్జకు లాలనైను మది భోక్తగ నీడవు యేకమౌనులే సజ్జల భావమై సహన సత్యము భక్తి మహేశ యీశ్వరా...9


ఓం నమః శివాయ...3


యతి.. 7


స్వరూపా నాయుష్యే స్వయముగనే నీ ప్రార్ధనగతే

నిరీక్షా ప్రోత్చాహాన్ని సకల శక్తీ యిచ్చిన మతే

పరీక్షా సంకల్పా ఫలమగు భ క్తీ హృద్యము స్థితే 

సరాగమ్మే స్వేచ్చా సమర యు క్తీయే పశుపతీ...10


ఎవ్వరు లేరు లేరనుత యేలను యెoచుట నీదు ధైర్యమే

సవ్వడి వేచియున్నను యశస్సుసహాయము నీదు శక్తిగా

యవ్వనిచే జనించువిధి యైక్యము చూపుట నీదు భూక్తియే

నవ్వని యేడ్వనీ గతిగ నాటక రంగము యీశ్వరా..11


గమనంమై విధిగాసహాయ గతి భవ్యమ్మై కృతఘ్నా రవీ

సమయంమై బహు దివ్య తత్త్వమగు సంతృప్తీ హిమఘ్నా రవీ

తమకంమోహము బాపి నిస్సతయు తీర్చేభాగ్య మేలే రవీ

మము కాపాడుట సేవ దిక్కగుట మార్తాండైన మృత్యుం. జయా..12


తెల్పెను బ్రహ్మ రాతగను శిక్షణ కష్టము తొల్గిపోవగన్ 

మల్పులు డబ్బునుండిమది మంగళమేయగు దాహ తృప్తిగన్ 

వేల్పులు తీర్పుగా తెలప విద్యలు నిత్యము సత్యమే యగున్

గాల్పులు హృద్యమేయగుట గాయపుగమ్యము నాదు యీశ్వరా..13


దీనుల వెంట రక్షణయు దివ్య సహాయము చేయు దైవమై 

మానస బుద్ధి మార్చగల మంగళ దూతగ నిత్య మానమై 

ఆనతి నీదు శక్తి దయ యాకలి తీర్చెడి సత్య మార్గమై 

కానగలేని జీవమగు కామ్యము నేర్పుము మాకు యీశ్వరా..14


ప్రతి మలుపే విధానమగు ప్రేమ ఉషస్సుయె దివ్య మార్గమై 

ప్రతి హృదయం సహాయమగ ప్రేమ మనస్సుగ తోడు నిత్యమై

ప్రతి ఉదయం సమానమగు ప్రీతి వయస్సుగ నీడ సత్యమై

ప్రతి పయనమ్ము బంధము ప్రాభవ మేనగు సత్య మీశ్వరా...15


చంపకమాల:

********* 

రయమునసేవ జేసితిని ,రాకయు పోకయు సవ్య మార్గమున్ 

భయమునుతోడు నీడగను, బంధము బాధలుతీర్చ టేగతిన్ 

మయ పలుకే మనోమయము మానని లక్ష్యము ధర్మమూర్తిపై

దయవిడి మానసమ్ముననె,దారిని జూపుము విశ్వ నాధగన్....16


ఓం నమః శివాయ..4


యతి..7

ఇ పుణ్యా దేహమ్మే యిణకుల పరా సేవల శివా

ప్ర పూజ్యా స్నేహమ్మే ప్రమధ గణమై ప్రేమగ హరా

ఉ పాయా పాశ మ్మై పుడమి చరణాలే గతి విభో

స పూజ్యా సౌందర్యో సుగుణ గిరిజా శంకర భవా     17


తే. గీ.సురవర కరి చర్మాంబర పురధర హర

సిరి వరాధి పతి గిరిజా వినయ ధీర

మొరలను వినుమా కేదార మోహన పర

మురిపము నినుగొలుతు శివా ముందరగను         18


శా..అన్నప్రాశగణాధివిఘ్న పతిగా  యానంద భాగ్యమ్ముగన్ 

కన్నా పాశముగా మనస్సు కలిపే యాయన్న పూర్ణమ్ముగన్ 

మూన్నాళ్ళా సహనమ్ముగాను తెలిపే ముక్కోటి  వేదమ్ముగన్ 

అన్నాయీశ్వర లీల మేను వెలుగై యైశ్వర్య సంతృప్తిగా 19


ఉ.మౌనపు ముంగురుల్ చెదరి మాదిరి ఎఱ్ఱన కళ్ళు భీతిగన్ 

ధ్యానము నందు కుంకుమలు దారిగ జారగ తీక్షనమ్ముగన్ 

మానస చూపులే శివుడు మంగళ పార్వతి దివ్య రూపమున్ 

ప్రాణమదీయ భావమగు పార్వతి శంకర దివ్య నాట్యమున్...20


ఉ.ఏమని చెప్పెదా మనసు యెంతయు హాయిగ తూలిపోవగన్

ఆమని పిల్పులే జయముగా మది తీరును సాగి పోవగన్

కాముని నీడలో బతుకు గా కదిలేను లె సంతసమ్ముగన్

ప్రేమమనస్సుతో కలసి ప్రీతిగ పార్వతి విశ్వ నాదగన్.21


శ్రీ శివ సంస్తుతి

మనోజ్ఞ


మనసు సహాయము సర్వ మంత్రపు విద్య సదాశివా

మనువుల లక్ష్యము విశ్వమేయగు సురార్చితా

తనువుల తత్త్వము సామ దానము భవ్య శివా

చినుకుల వర్షము మాయ చిత్తముగా శివా        22


(నజజభర యతి..1౦)


మకుట మహిమ విద్యామాత్ర శంభో జయమ్మున్

పక పక పక సాధ్యా ప్రతి యీశ్వర్ సుఖమ్మున్

చెక చెక చెక సాగే చిరు హాసన్ సమమ్మున్ 

సకల హృదయ విశ్వాసమ్మహేశున్ గిరీశున్     23


(ననమయయ..యతి..9)


ఓం నమః శివాయ.5.


దయా హద్యం మేలే తలపు పలుకే దివ్య మగుటే

క్రియా నేస్తమ్మే లే క్రియలు దుడుకే భవ్య మొకటే

ప్రియా భావమ్మే లే ప్రియము చిలికే సవ్య మొకటే

భయా దేహమ్మలే భజన పరమేశా సుఖము యే     24


సీస పద్యమాల.. శివతత్వం 


ద్వేషమూ లేదులే తేజమూ కాదులే  - అనురాగమూ లేదు ఆత్మ ఒకటి 

లోభమూ లేదులే లోలత్వమేనులే - మోహమూ లేదులే మోక్ష మొకటి


మదముయూ లేదులే మాత్సర్య మూ లేదు - ధర్మమూ లేదులే దారి ఒకటి

అర్థమూ లేదులే కామమూ లేదులే - మోక్షమూ లేదులే మేను ఒకటి


పుణ్యమూ లేదులే పూజ్యమూ కాదులే - పాపమూ లేదులే పఠము ఒకటి 

సుఖమూ లేదులే సుబ్రతా లేదులే - దుఃఖమూ లేదులే దునుయ మొకటి


మంత్రమూ లేదులే మాయనూ లేదులే - తీర్థమూ లేదులే తీట ఒకటి 

వేదములూ లేవు వేకువయూ లేదు - యజ్ఞములూ లేవు యతులు ఒకటి


భోజనమే కాను బోధకునే కాను  - తినతగినది కాను చిత్ర మొకటి 

యేపదార్థము కాను యేదితినను నేను - మృత్యువునూకాను మునగ నొకటి


సందేహమూ కాను. సంసయమును కాను - జాతి భేదము లేదు జాగు ఒకటి 

తండ్రియూ లేడులే .తల్లియూ లేదులే - జన్మయూ లేదులే  జ్ఞాన మొకటి


బంధువూ లేడులే బాధ్యతా లేదులే - మిత్రుడూ లేడులే యింతి ఒకటి 

గురువూ లేడులే గుర్తుయూ లేదులే - శిష్యుడూ లేడులే శిక్ష ఒకటి


 నిర్వికల్పుడనులే నిర్వాహకముగనే - నిర్మాణ కారక నిజము ఒకటి 

సర్వత్ర వ్యాపించ సంఘమ్ము నందునే - ఇంద్రియములతోను ఇచ్ఛ ఒకటి


సిరులుగా లేవులే స్థిరముయూ కాదులే - శిక్షణా లేదులే శీఘ్ర మొకటి 

సంబంధముయులేదు సద్భావమ్ముయులేదు - బంధమూ లేదులే భక్తి యొకటి


తే. గీ.నిత్యమూ చిదానందపు శివుడు గాను - రూపుడైన గతియు కాను రూపిగాను 

నిత్య నిర్వాణషట్కము నియమ మేను - లింగరూపమోక్షమునిచ్చు నిజము ఒకటి     25,26

* * *


విస్మయ భావమే గనుట,వీధి సహాయము వర్గమాయలే!

భస్మము చేయ బుద్ధిగను బాధ్యత చూపుట కొంత వింత మం

దస్మిత లక్ష్యమే యగుట, దాసులమేయన, రక్ష చేయుటే 

రస్మయమైన ఆశలగు,రాజిలు గొప్పలుగాను యీశ్వరా  .27


శైవగణాదిభక్తవర, శాంతిని గూర్చెడి పార్వతీపతీ 

భావజ పూజ్యమే యగుట,బాంధవ బంధము సేయు భక్తిగా

తావకభాగ్యదర్శనసుధామధురమ్మగు ధర్మ చింతనే 

పావన మార్గమే యగుట ప్రార్ధన నిత్యము విశ్వ నాదగన్.28


నమశ్శివాయ..6


మంచి చెడుల గూర్చి నాల్గు మాటలే నమశ్శివాయ 

కంచి చేరు మాట లొద్దు కధలే నమశ్శివాయ

తుంచి వేరు చేయ బుద్ది తప్పులే నమశ్శివాయ

దంచి జాలి చూపు టేల నెప్పులే నమశ్శివాయ         29


మార గలర ధాత్రి జనులు మంచిగాన మశ్శివాయ

గార వించు స్త్రీలు కూడ ఘనతగా నమశ్శివాయ

భార మేదొ బెట్టి తుంచు బ్రహ్మగా నమశ్శివాయ

 చేర కోకిల్లమ్మ పాట విందుగా నమశ్శివాయ            30


మధుర మైన స్వరమ తోడ మొప్పగా నమశ్శివాయ

విధిగ సేవ చేయ నీడ విందుగా నమశ్శివాయ

మదిన ప్రియము మనకు గుర్చుముందుగా నమశ్శివాయ

బదుల దిశగ నడవ గలర చిందుగా నమశ్శివాయ     31


భయము వాపు దీవ నిచ్చు బంధమే నమశ్శివాయ

జయము నీకు కలుగు గాక జంత్రమే నమశ్శివాయ

నయమయినది మార్గ మందు వేగమే నమశ్శివాయ

బ్రియము మనకు గూర్చు గాత విశ్వమే నమశ్శివాయ  32


ఉ..భారము నెంచకాలమిది బాధ్యత నుంచని పోరు గొప్ప నా

హారము లేని పేదలకు హాయిని జూపక సర్వ శక్తి యో

దారము జూపకుండగను దారిని మార్చియు శబ్ద        యుక్తి మోం

కారము జూపు భక్తిగను కార్యము లన్నియు జేయు యీశ్వరా    33


కలలను తీర్చువేళయిది కాలము నందున సేవ చేసెదా

కలతల మాయతీయగల కమ్మని వాక్కుల భావసంపదా

కలమున జాలువారెగద కావ్యముగావిల సిల్లు వర్ణనా

కలుపుల మొక్కతీయువిధి కల్పనలన్నియు సిద్ధియీశ్వరా    34


మ.కనులున్నా నిను జూడలేము విధిగా కన్నీటిలో మున్గినన్

మనసారా నిను కొల్వలేము తిధిగా మాకష్టముల్ హెచ్చినన్

కనుమా కాలము కష్టనష్టమగు కామత్వమ్ము యే యీశ్వరీ 

పెనురోగమ్ములుబాధ పెంచె జనులన్ వీక్షింపవే యీశ్వరా.35


శుభ శుభోదయం మనమౌను సుఖము కోర

అభయ యుక్తియు సర్వము యాశ్రయమ్ము

సభలు తీరుమారు జయము సాధ్య మౌను 

ప్రభల గీతభావముగాను ప్రతిభ భవుడు 


అక్షర సత్యమున్ మదీయ భావమున్ ననేక రీతులన్

శిక్షణ బుద్ధిగన్ సకాల శీఘ్రమున్ జయంబు రీతిగన్

రక్షణ చేయవేళగన్ నిరాజ్యమున్ విశాల భావమున్

కక్షలు లేని రీతిగన్ నికామ్యమున్ సహాయ మీశ్వరా


త్రికాలజ్ఞానమే త్రివిక్ర తీరుగా త్రినేత్ర జూపులే

వికాస సత్య భావమేను విశ్వమందు వర్ణ తీరుగా

ప్రకాశ లక్ష్యమే ప్రపంచ ప్రా భవమ్ముగాను తృప్తియే

సకాల గొల్పు రీతిలోన సహాయ మే సుధీ యీశ్వరా


కలమ్ము వ్రాతలేలు నిత్యకాల నిర్ణయమ్ము కావ్యమున్

ప్రలోభ భావమే మదీయ ప్రాభవమ్ముగాను తెల్పగన్

జలమ్ము గాలితీరు యంబరమ్ముగాను ప్రథ్విలీలగన్

బలమ్ము శక్తి యుక్తి రక్తి బంధమే పరాత్ప రాశివా


సమమ్ము వృద్ధి చెందు లీల సార్థకమ్ము గాను లక్ష్యముల్

సమర్ధ లొక్కటైనవేళ దాపునేస కాల సర్పముల్

సుమమ్ము మొంద జేసెవీధి సు ష్టపరంపరమ్ము హేతువుల్

రమత్వ కోతలై, నిజంబు  రాజుకున్న చిక్కులే శివా


జీవితం క్షణమ్ము స్వర్ణమున్  జపమ్ము యేలగన్ దుఃఖమున్ 

జీవసత్యమౌను కాలమున్ జయమ్ము నష్టమున్ వ్యర్థమున్

భావ భాగ్యమేను సేవలే భయమ్ము  నీడగన్ తోడుగన్

సేవలక్ష్యమే గతీమతీ విశాల ధ్యానమే యీశ్వరా


జయన్తి కోరిసేవలే నిజంబుగా జయమ్ము నిచ్చుటన్

నయంబు తోడ వెల్గుచున్న నారతంబు కాతువే ల్పుగన్

ప్రియంబుగా కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్ జూడున్

జయంబు గొల్తు రీతిలో ప్రశస్తిగా నొసంగు యీశ్వరా


 శ్రీ నివాస సేవలన్ని శీఘ్ర మున్ నె జేయ శక్తి నీదిగా

ప్రాణమున్ మనస్సు నిత్య ప్రాకృతీ వినీల యుక్తి నీదిగా

దానమున్ మనమ్ము సత్యధామమున్ యశోకుయుక్తి నీదిగా

మానమున్ సహాయ నిత్యమార్గమున్ చిదంబరాసదాశివా


అన్నమన్న రీతి బట్టియే యాదరమ్ముగాను యాత్రమున్

కన్నవారి పేరు యూరునే కానకుండగాను తిర్గుతన్

 విన్నమాటలన్ని నమ్ముటే గీతభావ మేల బుద్దిగన్

సన్నుతింతు సేవలన్నియు శీ ఘ్ర లక్ష్యమౌను యీశ్వరా

20, డిసెంబర్ 2023, బుధవారం

 01..దత్తపది.. కల కల కల కల 


కల నిజమాయే విధిగా

కళలే తీర్చు కలకళలు కాంచిరి జనులే

కలవర పడనీకు మనసు

కలతలు తొలుగుట నిజమగు కాలము నందే


02..దత్తపది.. చెప్పు, చేట, చీపురు, పేడ

ఉత్పలమాల (అన్యార్ధము)


చెప్పు డు మాటలే మనకు చేష్టలు గా కదిలేను యేలగన్ 

ఒప్పెడి చేట చెవ్వులగు వోపిక యేనుగు ఊపు లీలగన్ 

చిప్పల చెత్తయాకులగు చీపురుయూడ్చియు శుభ్రపర్చగన్

కుప్పల పేడ యెర్వగుట యున్నత పోషణ పంటకే యగున్


03.. దత్తపది... కక్ష, పక్ష, రక్ష, శిక్ష


కక్షలు లేనిజీవితము కాలము యేగతి దైవమాయగా

పక్షముదుఃఖ సౌక్యమగు పాలన పద్ధతి నిర్ణయమ్ముగా

రక్షణ భాగ్యమే ప్రకృతి రాసుల పంచుట ప్రేమసాక్షిగా

శిక్షణ సర్వవేళలగు శీఘ్రము నేర్పు ట నిత్యసత్యమే


04..దత్తపది.. దారము.. హారము.. భారము.. కారము.. విషయం.. స్వచ్ఛ


దండ పూలలో దారము, దాగి యుండు

భామ కంఠమ్ము హారము భగ మెరుపులు

కావ్య సంభారముగనుట కాల తలపు

మనసు మమకారము తెలుప మనుగడయగు


05..దత్తపది..చనుము-కనుము-వినుము-కొనుము


తే. గీ. చనుము రాజనీతి కడకు శాంతి తోడ

కనుము కళలు కాలము దివ్య కాంతినంత

వినుము ధర్మబోధలమాట వినయముగను

సాయము తీసుకొనుము నిత్య సాధనయగు