20, సెప్టెంబర్ 2022, మంగళవారం


(01)ఆ:: ఫలము కోరు వారు ఫలదీ కరుణ చెందు
             జీవి కలయి కేను జీవితమ్ము
            మాతృ హృదయ మందు మృత్యువు తోపోరు
            ప్రాంజలి యిది గుణము ప్రభల గీత 

(02)ఆ..న్యాయ నిర్ణయమ్ము నమ్మకాన్ని నిలుపు
     రాజ్య మంత సుఖము రక్ష వలన
     నీతి నిలుపు మార్గ నిత్య బ్రతుకు 
     ప్రాంజలి యిది గుణము ప్రభల గీత

(03) ఆ..జ్ఞాన మివ్వుమమ్మ జ్ఞప్తినీ కలిగించు
      బిక్ష యనుట ఇదియు భీడు నందు
      ధర్మ రక్ష చేయ ధరణి యందు బ్రతికే
      ప్రాంజలి యిది గుణము ప్రభలు గీత

(04).ఆ...అంటి పెట్టు కొనుట ఆత్రము ఏలను
       అదియు ఇదియు ఏది అర్థమవదు
       ఆశ పాశ మేళ ఆది నుండి బ్రతికే
      ప్రాంజలి యిది గుణము ప్రభలగీత

(05)..ఇదియు నేను కాదు ఈశ్వర లీలయే
       బేధ భావ మనకు బీద యనకు
       తెలుసు కున్న దేది తెల్పు శక్తి యనకు
       ప్రాంజలి యిది గుణము ప్రభలు గీత

(06) ఇంద్రియాల లీల ఈశ్వర కళలేను
      సహజ సిద్ది పొందు సమయ శుద్ధి
      స్ఫూర్తి కలిగి ఓర్పు సూత్ర మగుటె
      ప్రాంజలి యిది గుణము ప్రభలు గీత

(07)ఆ:: సిగ్గు మొగ్గ లేసె సీత కోకచిలుక 
          పూల బంతు లందు పురులు విప్పె 
          అలక బాల మనసు అట చిందు 
          ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత 

(08)ఆ:: దేశ,ధర్మ,మిదియు, దినముమాట లగుట 
           భిన్న మనసు సృష్టి భీతి ఇదియు 
          పెద్ద కష్ట మున్న పెనవేయు బుద్ధియే 
           ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(09)ఆ::సుప్రభాత సేవ సుఖము నిచ్చునదియే                   
          జాము లేచి వంట జాత రొద్దు  
          ప్రసవ వేద నవుట ప్రతిభను జూపుట 
          ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(10)ఆ::వ్యక్తి తత్వ మతియు వ్యసనమ్ము గానులే 
            జీవ గమ్య మదియు శీఘ్ర బుద్ధి 
            దేహ కాంతి యదియు ధీన చూపు 
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(11)ఆ:: గుంపులోన సొంపు గుల్లచేసెడి బుద్ది  
             ధనము వల్ల ఆశ దారి చెప్పు  
             ఫలిత మేది అయిన ఫలము అనుభవము 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(12)ఆ::అలల కళలు చూపు అలక సముద్రమే 
            సూర్య తాప తీర్చు సూత్ర ధారి 
            చంద్ర కళల వళ్ళ చల్లగా కదిలేను
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(13)ఆ::మనసు నిర్మలమగు మాధుర్య మందాకా 
            మోహ మంత తీర్చు మహిళ మందు 
            విలువ యున్న చోట విధిమేలు చేయుటే 
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(14)ఆ:: కలుపు మొక్క పీకు కలిసొచ్చును పొలాన్కి   
             మూఢ నమ్మకమ్ము ముప్పు తెచ్చు 
             ప్రేమలొ అనుమాన పెనుభూతహృదయమౌ
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(15)ఆ:: ఓడి గెలుచు వాని ఓర్పుతో ధైర్యము  
             క్షణము రెప్ప మాటు క్షమయు చూపు 
             చెదరని మనసేను చేయూత నిచ్చుటే 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(16)ఆ:: సఖ్యత చెలిమి కళ సమయ సందర్భాన      
             మౌఖ్య వేద మంత మౌన మందు 
             నీతికి నియమాలు నిన్నునన్నును మార్చు 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(17)ఆ:: స్థానబలము పెంచు సాక్షిగా స్త్రీశక్తి 
             విద్య వళ్ళ ఖ్యాతి వినయ స్త్రీలు 
             దేహ సార్ద కతయు దివ్యతేజముస్త్రీయె     
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(18)ఆ:: చీకటితొలగించి చేష్టలతోను స్త్రీ 
            పూల పరిమళంబు స్ఫూర్తినిచ్చు 
            హృదయవాంఛ తీర్చి హృదయమైనది స్త్రీయె 
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(19)ఆ:: కవి మనసులోన కావ్యఉషస్సుఏ  
             నిజము చేతు లెత్తె నింగి నెల 
            చేదు తీపి బ్రతుకు చెప్పనలవికాదు 
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత 

(20)ఆ:: గంగ ఒడ్డు చేరి గంగమ్మను తలచే 
            తృణము భక్తి తోను తృప్తి యడిగె
            స్వేశ్చ బుద్ధి యిదియు శీఘ్రము గమనించు
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత     

(21)ఆ:: సరళమైన ఊహ సమయ తీర్పుయగుట 
             జగతి నిద్ర వేళ జాగృతి విధి 
             సర్వసంపద కళ సంజీవని ప్రతిభ 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(22)ఆ:: కడుపు సల్లగుండ కనికరం చూపారు 
             కూడ బెట్టు ధనము కూడు రాదు   
             ఇంత ముంద దొరక ఈజన్మ సార్ధకం 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత   
 
(23)ఆ:: వాక్కు అదుపు ఉన్న వనరును ప్రేమయే 
             ఆశ అదుపు చేయు అలుపు తగ్గు 
             మనిషి మౌన ముంటే మనసుకు శాంతియే 
              ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(24)ఆ:: అసలు అంట కుండ ఆపేక్షఆసక్తి   
             ఆకలి కొరకు విధి ఆయుధమ్ము     
             వలపు చిందు మహిళ ఒంటరి పోరుఏ 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(25)ఆ::  ఎంత మంది యున్న ఏడ్పులు వెంటాడు       
              అయినవాళ్ళు నాకు అడ్డు పడుట  
              సత్య పలుకు వళ్ళ సమరమే జరిగెను 
              ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(26)ఆ:: కళకు చిక్కి నేను కౌగిలించానులే   
             బాకులు దిగినాక బాధ లేదు 
             ప్రేమ లెక్క వలదు ప్రియని సుఖముఏను 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(27)ఆ:: సరళి మార్చు కొనుట సమయపలుకుగాను
             ఇక్కడవిషయాలు ఇచ్ఛ ననుట 
             తృప్తి నిచ్చు నిజము తృణమైన సుఖముయే
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(28)ఆ:: చేత కాని వాడు చెట్టు ఎక్కి అరచు   
             శౌర్య మున్న వాడు శక్తి చూపు   
             మెతుకు కోసమేను మీనవే షాలుగా      
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత
    
(29)ఆ:: తీపి ఉప్పు తినక తికమక ఏలనూ
             సుఖము లేక భాద శుబ్ర మేళ      
             సామ దాన బేధ స్వాద తపస్సుఏ 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత
 
(30)ఆ:: ఆధు నికము నిన్ను అలలాపరుగు పెట్టు 
             వేళ తిండి కరువు వేదనగుట         
             తరుము కొచ్చు ప్రకృతి తీక్ష తపస్సుఏ 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(31)ఆ:: కష్ట పడట నిజము కాని దైన నరకం    
             ఘర్షణయు తపస్సు ఘడియ ఘడియ 
             ఆత్మ తృప్తి పరచు ఆకర్ష విస్తృతి 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(32)ఆ:: తినక నున్న తీవ్ర తీక్షణ తాపమే 
            మౌనము ఉపవాస ముఖ్య మేళ 
            రోగ తగ్గు ముఖము పూర్తిగా జరుగదు  
            ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(33)ఆ:: కనుల యందు జరుగు గవ్వకల్ప తపస్సు   
             తెలియని అలవాటు తెల్పు చుండు 
             ఊత పదము మాట ఊరుతెలిపి గోల 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత 
    
(34)ఆ::  మీకు ఉన్న దాన్ని మీరు పంచు తపస్సు
              దీప దాత గాను దినము యందు 
              నిర్మల ప్ర దాత  నియమమై బ్రతుకుటే 
               ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(35) ఆ.. మనిషి అంత రాత్మ మనుగడ ప్రశ్నయే
              పరిధి గాను చేయు పరిమళంబు
               వ్గరువు లైనవారి గుణములీలగా 
               ప్రాంజలి యిది గుణము ప్రభల గీత

(36)ఆ:: మెడను చుట్టు కొనెడి మోసపరిచేబుద్ది   
             మ్రొక్క లెన్ని ఉన్న మోక్షమవదు 
             మనసు పట్టుదలయు మంచి మార్గమునెంచు 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత


(37)ఆ:: ఒకరి పెరుగుదలకు ఓర్పు సహాయము 
             సాధ్యమైన నిత్య సమయమ్ము తృప్తియే 
             స్వార్ధ బుద్ది వదలి సాధువలెను నుండ 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత 
 
(38)ఆ:: తెలుగువారి తెలివితనముయే మణిమయం     
             కనుల మించ గుండె కామ్య మగుట
             వొట్టి మాట   లనుట ఓటి కుండ బ్రతుకు 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత

(39)ఆ:: దేహ గతియు మతియు దేశ భక్తి గనులే 
             ప్రేమ యున్న మనిషి  ప్రీతి చెందు 
             బుద్ధి శక్తితోను  పుడమిని  నమ్ముటే 
             ప్రాంజలి ఇది గుణము ప్రభలు గీత


(40)ఆ:: పుణ్య పాప మనిషి పురము లో బ్రతికేను 
            మాన నీయ మనసు మంద బుద్ధి
            భవిత నెంచ లేని భజన పరుల నీడ
           ప్రాంజలి యిది గుణము ప్రభలు గీత

(41)ఆ:: ఆగలేను నేను ఆత్మ దొరుకుదాకా 
             అణిగిమణిగి ఆత్మ అండ గాను  
             ఇవ్వలేను నేను ఇష్టమైనది ప్రేమ
             ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 
  
(42)ఆ:: చెట్టు లాగనీడ  చేష్టలేవియునాకు       
             పాడలేను నేను ప్రార్ధ నైన  
            గాలి మురళి లాగ గానమివ్వను లేను 
            ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 

(43)ఆ:: వీచలేను నేను వీనులవిందుగా  
            చల్లగాలి వలెను చల్లపర్చనులేను   
            శాంతి ఇవ్వ లేను సాక్షిగామనలేను  
           ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 
 
(44)ఆ:: చీమలాగ నేను చెలికి దాచనులేను 
            ఇవ్వలేను నేను ఇప్పుడిపుడు 
           తేనెటీగలాగ తేనె పంచను లేను
          ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 
  
(45)ఆ:: ఈయలేను నేను ఈప్సితముగనులే 
          పూలలాగ నేను పూజ కవను 
           రాళ్ళ దెబ్బ తిన్న రాటు తే లనులేను   
          ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 

(46)ఆ:: తాండవమ్ము నిధియు తంత్రపు నిశ్శబ్దం
           ఇక్కడిక్కడేను ఇచ్ఛ తెలుపు   
          పదము విసురులన్ని పడకచే మారులే    
           ప్రాంజలి కళ మనిషి ప్రభలు గీత

(47)ఆ:: మంద స్మిత వదన మగువను కాంచగ
          మనసు తేలి పోవు మమత పొందు
          మాట కలప మంచు మదికోరు చుండుటే 
          ప్రాంజలి కళ మనిషి ప్రభలు గీత

(48)ఆ:: నవ్వు వలన వెలుగు నమ్మక మాటలు  
         మనసు లోని బాధ మాయ మగును
         సుఖము వెలిగి పోవు శుభ్రత కలిగించు 
         ప్రాంజలి కళ మనిషి ప్రభలు గీత    

(49)ఆ:: భావకుణ్ణి కాదు భవ్యచరితతెల్ప 
       లోక భావనాల లహరి ఇదియు 
       ఆస్థిపాస్తు లకల ఆరాట భావాలే 
       ప్రాంజలి కళ మనిషి ప్రభలు గీత 

(50)ఆ:: గెలుపు ఓటమున్న గీతవదలనులే 
        దాస్య లజ్జ నీతి ధరణి యందు    
        లేనిచోట నాకు నేనుగాను తపస్సు 
       ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత
        
(51)ఆ:: మనిషి చెలిమి చేయు మనుగడకొరకునే  
       మంచి చెడు గమనము మనసు కొరకు 
        చెడ్డ వాడి లాగ చేష్టలు చూపడూ  
        ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత

(52)ఆ:: చెరువు నీటిలోన చేపలు కళలుగా  
       తరువు నీడలోన తరుణ సుఖము 
      సూర్య పొద్దు లోన సమయ పరవశాలు
      ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత  

(53)ఆ:: మనసు మలిన పరచి మాయ తోను బ్రతుకు 
      కర్మ కాచు కొనుచు కలుపు మాట 
      పదిలమని మెలిగిన పట్టుబడును బుద్ధి 
       ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత  
 
(54)ఆ:: అక్షరాల గురువు హంసవాహన తల్లి  
      దీక్షగానుగొల్చి దీరుగల్గును విద్య
      మోక్షవిద్య మాకు ముక్తి దాయిని తల్లి
      ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత
 
(55)ఆ:: మంత్ర శక్తి అయిన మనుగడ స్వేశ్చకే  
      యాత్రలన్ని జేయు యాశ ఏల   
      ఆత్ర మేను సూత్ర ధారిగా పాత్రుడై 
      ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత
   
(56)ఆ:: వృత్తి ధర్మ మేను వ్యధను మార్చగలుగు 
      శక్తి గర్వ మగుట శాపమవును   
      తీపి గుర్తులన్ని తెప్పవలెనుసాగు 
      ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత

(57)ఆ:: చెయ్యి జార నీకు చేష్ట మారుట యేల
      తెలుసు ననుట ఏల తెల్ల మొఖము
      మాట జారితేను మనసువిరిగిపోవు 
      ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 

(57)ఆ.ప్రేమ పారు నెపుడు ప్రీతి తోడ మనసు
మూర్ఖ వాని మాట మ్రోత తోడ
మంచి చెడు చెలిమియు మానప్రాణము తోడ
ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత 

(57) నీదు ఇష్ట మైన పేరు మార్చుట ఏల
గొప్ప వ్యక్తి పేరు గోల ఏల 
నందమూరి పేరు నాశన భయ మేళ
ప్రాంజలి అభినయమ్ము ప్రభలు గీత 

(57) ఆ..ఒంటరిగను ఉంటె ఓర్పు ఆలోచన
మోక్ష భావ బ్రాంతి మోహ మవదు 
నలుగురు కలసుంటె నాలుకను అదుపు
ప్రాంజలి గుణ కధలు prabhalu🌹గీత 

(57) ఆ..ఇదియు పిచ్చి లాగ ఈశ్వరి సృష్టి యనుచు
కొత్త వింత యగుట కొంప ముంచు
విచ్చల విడి చూపు నిగ్రహం ప్రశ్నయే
ప్రాంజలి కళ అనియు ప్రభలు గీత ❤️

22-09-2022

(57) ఆ..ఊహ నిజము కాదు ఊసరవెల్లి వలెను
దొరక నిచ్చు బుద్ది దొడ్డి 😂దారి
లోక మంత యిదియె తోలు బొమ్మగను లే
ప్రాంజలి కళ మనిషి ప్రభలు గీత

(57) ఆ..ఒంటరిగను ఉంటె ఓర్పు ఆలోచన
మోక్ష భావ బ్రాంతి మోహ మవదు
నలుగురు కలసుంటె నాలుకను అదుపు
ప్రాంజలి గుణ కధలు ప్రభలు 🌹గీత

(57) ఆ..ఇదియు పిచ్చి లాగ ఈశ్వరి సృష్టి యనుచు
కొత్త వింత యగుట కొంప ముంచు
విచ్చల విడి చూపు నిగ్రహం ప్రశ్నయే
ప్రాంజలి కళ అనియు ప్రభలు గీత ❤️

(57) ఆ..భార్య మాట వినక బంధమంత యిగురు
భర్త మాట ❤️ స్థితియు  బాధ తెచ్చు
భార్య భర్త లగుట బ్రహ్మ తెల్పే కధ
ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత

(57) ఆ..జగతి బ్రాంతి యనుట జాగృతి కొరకులే
నీది యన్న దేది నీది కాదు
ధర్మ శాంతి జరుగు ధరణి లోన కళలు
ప్రాంజలి కధ గుణము ప్రభలు గీత

(57) ఆ..కావ్య మన్న దేది కానిదగుట ఏల
బ్రహ్మ తెలిపె బ్రతుకు బాధ ఏల
ప్రేమ వల్ల జగతి ప్రియసి ప్రియుని కధ
ప్రాంజలి యిది గుణము ప్రభలు గీత

(57) ఆ..వేడి నాడి చూడు వేగమై కదులుటే
మడమ తిప్పి చూడు మాయ గుండు
పిరికి వాని మదిన పీక్కు తినుట ఏల
ప్రాంజలి యిది గుణము ప్రభులు గీత

(57) ఆ..పాళి నేడు లేదు పాట కధసరళి
లేదు గ్రాహ్య బుద్ది లేత మనసు
సెల్లు చేత బట్టి చెత్త కబురు లాయె
ప్రాంజలి కళ గుణము ప్రభలు గీత

ఆ:: ఉండి కురుస్తోందిప్రేమ ఉత్తమమ్ము  
      పండి కాయలు రాలేను ప్రేమతోను   
      వర్ష మల్లె వచ్చి తడిపి వ్యాధి మార్చు 
       ప్రాంజలి మహిమేను ప్రభలు గీత

ఆ:: గణము మంచి మనసు గమ్య చెలిమి 
      విద్య నేర్చు కున్న వినయ చెలిమి 
      జాతి ధనము పంచు జాతరేగ చెలిమి    
      ప్రాంజలి మహిమేను ప్రభలు గీత

ఆ:: గచ్చునేరాలె పువ్వులు గమ్యమేమి 
      నొచ్చుకొంటూను పత్రాలు నొప్పి ఏమి 
      పుచ్చు కు0టూను ప్రేమకు స్ఫూర్తి ఏది 
       ప్రాంజలి మహిమేను ప్రభలు గీత 

ఆ:: నీది యన్నదేది నేడు రేపును కాదు 
       నిన్ను నమ్ము వారు నేడు లేరు 
       నమ్మలేని బ్రతుకు నటనగా సాగదు   
        ప్రాంజలి కల గుణము ప్రభలు గీత 

నేటి అటవెలది "వికసించి , వీక్షించే పూలు " పద్యాలు    

ఆ:: సొగసు చూడ తరము సొంపులై తిరిగేను 
       గాలి తగల గానె గాళము గంధము     
       జాజుల పరిమళము జామురాత్రి సుఖము 
        ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత

ఆ:: జడల లోన పూలు జాజిమల్లెలుగాను 
      పూల పరిమళాలు సూత్రమగుట    
      మల్లె పులా దండ మరువమ్ము చెలిమియే 
      ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత

ఆ:: కళ్ళు చలవ చేయు కాగడా మల్లెలు 
       పురుషులు సతమతము పురులు విప్పు 
       నరులకు మతి తెలియు నయనాల పువ్వులు
       ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత

ఆ:: పొత్తు కలపె స్త్రీలు పోరుపూ బంతులై 
       నిత్య పూలవల్ల నిగ్రహమగు
       మొలక నవ్వు తోడ మురిపించు మల్లికై 
       ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 
  
ఆ:: సృష్టిలోన పూలు సృజనాత్మకమగు 
      పుడమి ఇష్ట పడని పూలు అరుదు     
      పూల నవ్వు లన్ని పూసెగంధపు స్త్రీలు    
      ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 

ఆ:: కీచుగొంతు తెల్పి హెచ్చరిక యనుచు 
      పెదవి పంటి తోను నొక్కిపెట్టి
      కనుబొమల్ని తిప్పి కోడెత్రాచు బుసలు 
      ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 
 
ఆ:: దూర దృష్టి లేని దుర్రాజకీయాలు
      మసకబార్చుభవిత మావిగ్రప్పి
      జాతిహితముకోరు జననేతలెక్కడా
      ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 
 
ఆ:: అమ్మ మాట వినియు ఆత్రుత గజిబిజి 
       ముసుగు తీయకుండ ముద్దు పలుకు  
       చేయ పనియు విజయ పదగుంఫనమ్మేను
       ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 
 
ఆ:: వినయ విద్య వళ్ళ విజ్ఞానము పెరుగు 
      ఆశ పాశ మున్న జ్ఞాన మవదు     
      పఠన పతన మగుట ప్రగతికి ప్రశ్నఏ   
      ప్రాంజలి బ్రతుకుకళ ప్రభలు గీత 


మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి