21, నవంబర్ 2021, ఆదివారం

శ్లోకాల తాత్పర్యాలు :- -----

సేకరణ : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 


అ ,ఆ

ఆరోగ్య మానృణ్య మావిప్రవాసః 

సంప్రత్యయా వృత్తి రభీతివాసః 

సద్బిర్మనుషై: సహా సంప్రయోగః 

షడ్జీవ లోకేషు సుఖాని రాజన్ 


తా:--చక్కని ఆరోగ్యము, కలిమి  కలిగి యుండుట, స్వగృహనివాసము, నిరాపదయైన

సద్వృత్తి జీవనము, నిర్భయత్వము, సత్సాంగత్యము,  ఈ ఆరున్నూ ఓ రాజా!మానవ జీవితమున పరమ సుఖకరమైనవని పెద్దలు చెప్పుచున్నారు


అద్వేష్టా నిర్మమః  శాంతః   సత్యవాదీ, జితేంద్రియః 

నిర్మత్సరో  నిష్కపట: స్వవృత్తా  బ్రాహ్మణో భవేత్ 

తా:-- బ్రాహ్మణుడు   ద్వేషరహితుడు, మమకారం లేనివాడు, శాంతుడు, సత్యవాది, జితేంద్రయుడు, మాత్సర్యరహితుడు, నిష్కపటి, స్వవృత్తి తత్పరుడు అయివుండాలి.


అన్నదానాత్పరం దానం      విద్యాదాన మతః పరం 

అన్నేన క్షణికా తృప్తి:          యావజ్జీవంచ విద్యయా


అర్థము:--అన్నదానం గొప్పదే కానీ విద్యా దానం అంతకంటే గొప్పది. అన్నదానం వలన క్షణికమైన తృప్తి కలుగును. విద్యా దానము వలన అజ్ఞాన మనే చీకటి విడి పోయి జీవితమతయు సుఖ శాంతులు లభిస్తాయి కదా!


అమృతం చైవ మృత్యుశ్చ  ద్వయం దేహే  ప్రతిష్ఠితం 

మృత్యు రాపద్యతే  మోహాత్  సత్యే నాపద్యతే మృతం


అమృతము, మృత్యువు -- ఈ రెండూ దేహమునందే ఉంచబడి యున్నాయి.మోహము, 

లేక కోరిక వలన మృత్యువును, సత్యదర్శనము వలన అమృతమును మానవులు పొందగలుగుతున్నారు.


అనేక సంశయో చ్చేది : పరోక్షార్థ స్య దర్శనం 

సర్వస్య లోచనం శాస్త్రం ; యస్య న   స్త్యంధ  యవసః  !


అర్థము: సంశయము లన్నీ తొలగించునది, చూడని విషయములను 

ఎన్నింటినో స్పస్టముగా తెలుపునట్టిదియును, లోకమునకంతకూ కన్ను వంటిది శాస్త్ర జ్ఞానము. అట్టిది ఎవనికి లేదో వాడే నిజముగా గుడ్డి వాడు.

అవిద్యా నాపి భూపాలో జ్ఞాన వృద్ధో ప సేవయా 

పరం శ్రియః మవాప్నోతి జలాసన్న తరుర్యధా 


అర్థము:-- రాజు స్వయముగా విద్వాంసుడు కాకున్ననూ తన కొలువులోని విద్వాంసుల నిరంతర సాన్నిహిత్యం చేత కొంత పండితుడై  కీర్తిని పొందుచున్నాడు. ఎలాగైతే చెరువు దగ్గర వున్న వృక్షాలు ఆ చెరువు నీటిని గ్రహించి ఏపుగా పెరుగుతున్నాయో అలాగ. మంచివారితో 

నిరంతరమూ కలిసి వున్నట్లయితే మనకు కూడా మంచితనం కొంత అబ్బుతుందని కవి భావము.


 ఆతురే నియమో నాస్తి బాలే వృద్ధే తథైవ చ

సదాచార రతే చైవ హ్యేష ధర్మ స్సనాతనః


భావము:-రోగి,బాలురు, వృద్ధులు, సదాచారి ...వీరికి నియమములు అక్కరలేదు. ఇది సనాతన ధర్మము.


ఆస్థా స్వాస్థ్యే యది స్యాతాం మేధయా కింప్రయోజనం

తే ఉభే యది స్యాతాం  మేధయా కింప్రయోజనం


ఆసక్తి, ఆరోగ్యము యివి రెండూ వున్నచో ఎక్కువ తెలివితేట లక్కరలేదు. అవి రెండూ లేనట్లయితే తెలివితేటలు ఎంతవున్నా    ప్రయోజనము లేదు. అనగా ఆసక్తివుండి,ఆరోగ్యము వుండి పట్టుదలతో ప్రయత్నించిన చో ఎట్టి కార్యమైననూ నెరవేర్చగలరని భావము.


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం 
త్రి సంధ్యం యః పఠె న్నిత్యం సర్వ పాపై: ప్రముచ్యతే 

తా :-- ఇది గాయత్రీ బీజ సంయుత మైన రామాయణము.దీనిని త్రిసంధ్యల లో ఎవరు పఠింతురో వారికి సర్వపాపములు నశించును.

ఏకోపి గుణవాన్ పుత్రః నిర్గు ణేన శ తైరపి 

ఏక చంద్ర ప్రకా శేన నక్షత్రై: కిం ప్రయోజనం?   


అర్థము:-- గుణవంతుడైన కొడుకు ఒక్కడైనా చాలు,గుణహీనులైన నూర్గురు పుత్రులెందుకు?ఒక్క ప్రకాశించే చంద్రుడు చాలడా,అన్ని నక్షత్రాలున్నా ఏమీ ప్రయోజనం లేదు కదా!ఏకోపి గుణవాన్ పుత్రః  నిర్గు ణేన శ తైరపి 

ఏక చంద్ర ప్రకా శేన   నక్షత్రై: కిం ప్రయోజనం?   


అర్థము:-- గుణవంతుడైన కొడుకు ఒక్కడైనా చాలు,గుణహీనులైన నూర్గురు పుత్రులెందుకు?ఒక్క ప్రకాశించే చంద్రుడు చాలడా,అన్ని నక్షత్రాలున్నా ఏమీ ప్రయోజనం లేదు కదా!
క కర్తవ్య మేవ కర్తవ్యం ప్రానై: కంఠ గతైరపి 

అకర్తవ్యం నకర్తవ్యం ప్రానై:కంఠ గతైరపి.


తా:--కంఠములో ప్రాణ మున్నంత వరకు కర్తవ్యాన్ని పాలించాలి,కర్తవ్యము కానిదానిని చేయరాదు.


కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం 

మహత్ పౌలస్త్య వధ మిత్యేవ చకార చరిత వ్రతః -


రామాయణమునకు, రాముని చరితము,సీతా చరితము,రావణ వధ,అని మూడు పేర్లు.రాముని వలె,సీతవలె ప్రవర్తింప వలెను.రావణుని వలె ప్రవర్తింప రాదు.అన్నది నీతి.అందులకే శత్రువైన మారీచుడు శ్రీరాముడిని గురించి యిట్లు మెచ్చు కొనెను. రాముడు రూపుదాల్చిన ధర్మము,సత్పురుషుడు,సాధు సత్య పరాక్రముడు.దేవతలకు ఇంద్రుని వలె యితడు లోకైక ప్రభువు.--వాల్మీకి రామాయణం


కాష్ఠాదగ్ని ర్జాయతే మథ్యమానాత్

భూమిస్తొయం ఖన్యమానా దదాతి

సొత్సోహానాం నా స్త్యసాధ్యం నరాణాం

మార్గా రబ్దా: సర్వయత్నా: ఫలంతి

      తా:--మథించిన చో కర్రల నుండి అగ్ని పుట్టుచున్నది, త్రవ్వినచో భూమి జలము నిచ్చు చున్నది,యత్నశీలురైన మనుష్యుల ప్రయత్నము లన్నియు ఫలించక మానవు


కిం కులేన విశాలేన : విద్యా హీనస్య దేహిన:

అకులీనోపి శాస్త్రజ్ఞో దైవతై: రపి పూజ్యతే.


అర్థము:విద్య లేనివాడు ఎంత గొప్ప కులములో పుట్టిన వాడైన నేమి?

కులహీనుడైన  శాస్త్రజ్ఞుడు  దేవతలకు కూడా పూజనీయుడ వుతున్నాడు.క్రోధో వైవస్వతో రాజా  ఆశా వైతరణీ నదీ

విద్యా కామదుఘా దేను:  సంతుష్టి: నందనం వనం


అర్థము:--కోపము యమునితో సమాన మైనది. ఆశ వైతరణీ నది వంటిది (దాటలేనటువంటిది). విద్య అన్ని కోరికలనూ తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది..


క్షమయా దమయా ప్రేమ్నా సూనృతే నార్జవేనచ 

వశీకుర్యాత్ జగత్సర్వమ్ వినయేన చ సేవయా


   తా:-- క్షమా, ఇంద్రియనిగ్రహము, ప్రేమ, సత్యవచనములు, ఋజువర్తనము, వినయము, సేవ - వీటి చేతనే సమస్త లోకమును వశీభూత మొనర్చుకొనుము।


ప 


ప్రథమ వయసి పీతం తోయ మల్పం స్మరంతః 

శిరసి నిహతి భారా నారికేళా నరాణాం 

సలిల మమృత కల్పం దద్యురా జీవితాంతం 

నహి కృత ముపకారం సాధవో విస్మరంతి


అర్థము:--కొబ్బరి చెట్లు మనము కొద్ది  నీళ్ళు పోసి పెంచినా పెద్దదై బరువైన కాయల్ని మోస్తూ జీవిత పర్యంతమూ మనుషులకు తీయని నీటిని యిస్తుంది. కదా! అటులనే సాధుపురుషులు తమకు చేసిన చిన్న వుపకారమును కూడా మరువక ప్రత్యుపకార పరులై వుంటారు.


చ 


చితా చింతా ద్వయోర్మధ్యే     చింతా నామ గరీయసి 

చితా దహతి నిర్జీవం             చింతా ప్రాణయుతం వపు:


అర్థము:-- చితి, చింత ఈ రెండింటి లో చింత యే  యధికమైనది. చితి మరణించిన దేహాన్ని కాలుస్తుంది. కానీ  చింత జీవించి వున్న శరీరాన్నే దహించి వేస్తుంది. చింత  తోనే చిక్కి సగ మయ్యాడు అని మన వాళ్ళు అంటుంటారు కదా!


త థ ద  


దయా సర్వ భూతేషు క్షాంతి రనసూయయా శుచి రనాయాసో 

మాంగల్యం అకార్పణ్యమ్   అస్పృహా చేత్యస్టా ఆత్మ గుణా: 


  అర్థము:సర్వ భూత దయ, ఓరిమి అసూయ లేకుండుట 

శుచిత్వము అనాయాసము కల్యాణము లోభము లేకుండుట 

ఆశ లేమి :ఈ  ఎనిమిదీ ఆత్మ గుణములు అంటే దైవీ గుణము లన్నమాట


దాతృత్వ ప్రియ వక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా 

అభ్యాసేన న లభ్యంతే చత్వారస్స హజ గుణాః  


అర్థము:-- దానము చేసే గుణము,ప్రియముగా మృదువుగా మాట్లాడుట, ధైర్యగుణము, వుచితజ్ఞత అంటే యిది సరియైనది యిది కాదు అను తెలిసుకోను జ్ఞానము ఈ నాలుగు గుణాలు నేర్చుకుంటే వచ్చేవి కావు అవి సహజంగా పుట్టుకతోనే వస్తాయి


దుర్జనః పరిహర్తవ్యో విద్యాలంకృతోపి సన్ ।

మణినాభూషితో సర్పః కిమసౌ న భయంకరః ।।


దుర్జనుడిని, అంటే చెడ్డ వాడిని, ఎంత విద్యావంతుడైనప్పటికీ వదిలివేయ వ

లెను. మణితో అలంకరింపబడిన సర్పము భయంకరమైనదే కదా!!

న 

నాస్తి విద్యాసమం  చక్షు:   నాస్తి సత్యసమం తప:
నాస్తి రాగసమం దు:ఖం   నాస్తి త్యాగసమం సుఖం
.
అర్థం:విద్యనూ పోలిన కళ్ళు, సత్యమును పోలిన తపము, 
మాత్సర్యము వంటి దు:ఖ కరము ,త్యాగమును పోలిన సుఖమును లేవు.

న భూషత్యలంకారో  న రాజ్యం న చ పౌరుషం 
న విద్యా న ధనం తాదృక్  యాదృక్ సౌజన్య భూషణం 

అర్థము:-- రాజ్యము,పౌరుషము, విద్య,సంపదలు ఇవేవీ జనులకు "సౌజన్యము" వంటి ఉత్తమ   అలంకారములు కాజాలవు. సౌజన్యమొక్కటే భూషణ మని భావము.


నిషేవతే ప్రశస్తాని నిందితాని నసేవతే
అనాస్తికః శ్రద్ధదాన యే తత్పండిత లక్షణం 

తా:--మంచి కార్యాలను ఆచరించడం,నిందింపదగిన పనులను చేయకపోవడం, నాస్తికుడు కాకుండా వుండడం, పెద్దలయందు, వేదములందు శ్రద్ధకలిగి యుండడం,అనునవి పండిత లక్షణములు.(విదురనీతి)

చ, జ 

జవోహిసప్తే: పరమం విభూషణం 
త్రపాంగ నాయా:  కృశతా తపస్వినః 
ద్విజస్య విద్వై వ మునేరపి  క్షమా
పరాక్రమః సస్త్ర బలోప జీవినామ్ 

తా:--గుఱ్ఱమునకు వేగమును, స్త్రీలకు లజ్జయు, తపస్వులకు కా ర్శ్యమును,  బ్రాహ్మణునకు విద్యయు, మునికి క్షమాగుణమును, క్షత్రియునకు పరాక్రమమును అలంకారములు.  
ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ప్రయత్నించ కండి. మీరే మారండి. 
కాళ్ళ కి యెమీ గుచ్చుకోకుండా వుండాలంటే మనమే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాము గానీ దారంతా తివాచీ పరుస్తామా? ఆలోచించండి.


ప 

పిబంతి నద్యః స్వయమేవ నాంభ:
ఖాదంతి న  స్వాదు ఫలాని వృక్షా: 
పయోధరో  స్సస్య మదంతి నైవః 
పరోపకారాయ సతాం విభూతయః 

అర్థము:--నదులు తమ జలమును తాము త్రాగవు. చెట్లు తమ యందు ఫలించిన  పళ్ళను తామే తినవు.మేఘములు తాము  వర్షించుట చే పండిన పంటను అవి తినుట లేదు. ధర్మాత్ము లయిన సత్పురుషులు తమ సంపదను పరోపకారమునకై ఉపయోగింతురు.

భ 

భక్తానా మనురక్తానాం  ఆశ్రి తానాం చ రక్షితా
దయావాన్ సర్వభూతేషు పరత్ర సుఖమేధతే.

భక్తులను, అనురక్తులను,  ఆశ్రితులను రక్షించువాడు , సర్వభూతములందున్నూ దయగలవాడు పరలోకసుఖములను తప్పక పొందుచున్నాడు.


మూర్ఖో నహి దదాత్యర్థమ్ నరో దారిద్ర్య శంకయా 
ప్రాజ్ఞాస్తు వితరత్యర్థమ్ నరో దారిద్ర్య శంకయా 

అర్థము :--- దానము చేస్తే దరిద్రుడ నవుతాననే భయం తో మూర్ఖుడు దానం చేయడు. దానం చేయక పొతే మరు జన్మ లో దరిద్రుడనై   పుడతానేమో నన్న భయంతో బుద్ధిమంతుడు దానం చేస్తాడు.


య 

యత్ర పుత్రో గురో పూజాం: దేవానాంచ తతపితు హు 
పత్నీ చ భర్తృ: కురుతే : తత్రా లక్ష్మీ భయం కుతః 

అర్థము: ఏ ఇంట పుత్రులు తల్లి తండ్రులను,గురువులను,దేవతలను 
పూజిస్తుంటారో భార్య భర్తను గౌర విస్తూ ఉంటుందో అక్కడ దారిద్య్రం  ఉండదు


ర 


రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః 
రాజా సర్వలోకస్య దేవానాం మఘువానిచ 

రాముడు రూపుదాల్చిన ధర్మము,సత్పురుషుడు,సాధు సత్య పరాక్రముడు.దేవతలకు ఇంద్రుని వలె యితడు లోకైక ప్రభువు.--వాల్మీకి రామాయణం.

రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా:  పాపే పాపహరాః సదా                  
రాజాన మనువర్త౦తే    యథా రాజా తథా ప్రజా

పరిపాలకులు ధర్మమార్గమున నున్నచో, ప్రజలూ ధర్మముగా నడుచుకుంటారు. పాలకులు పాపిష్ఠు లైనచో ప్రజలూ దుర్మార్గులై వుంటారు. పాలకులను బట్టియే ప్రజలు నడుచుకుంటారు. "యథా రాజా తథా ప్రజా"అను నానుడి అందువల్లనే పుట్టినది.


లోభశ్చే  అ గుణేన  కిం  పిశు నతా యద్యస్తి కిం  పాత కై :
సత్యం చే త్తప సా చ కిం  శుచి మనో  యద్యస్తి   తీర్  తేన కిం కిం 
సౌజన్యం  యది కిం  బలే  న  మహిమా  యద్యస్తి  కిం మండ  నై :
సద్విద్యా  యది  కిం ధనై  రప యశో  యద్యస్తి  కిం మృత్యు నా 

అర్థము: లోభమును  మించిన  చెడు గుణము ను, చాడీలు  చెప్పుట కంటే 
పాపమును , సత్య  వ్రతమున  కన్న  తపస్సు ను,  మంచి మనస్సు కన్న 
తీర్థ ప్రయోజనమును,  సౌజన్యమును  మించిన  బలమును , కీర్తిని  మించిన 
అలంకారమును,  విద్య  కంటే   హెచ్చైన  ధనమును,  అపకీర్తి  కంటే  చావును  లేవు.

 

వయోర్నాపి సంస్కారో న శృతం  న చ 

కారణాని ద్విజత్యస్య  వృత్తమే తస్య కారణం 


అర్థము:-- పుట్టుక కానీ,సంస్కారము కానీ,పాండిత్యము కానీ,సంతతి కానీ ద్విజత్వము (బ్రాహ్మణత్వము)నకు కారణములు కావు. నడవడి యొక్కటే దానికి కారణము. నడవడి మంచిది కానట్టయితే బ్రాహ్మణుడు కూడా శూద్ర   సమానుడే.వృశ్చికస్య విషం పుచ్చం : మక్షికస్య విషం శిరః 

తక్షకస్య విషం దంస్ట్రౌ :సర్వాంగం దుర్జనే విషం.


అర్థము: తేలునకు కొండి నందును, కందిరీగకు తలయండదును,

పాముకు కోరలందును విష ముండును. కానీ దుర్మార్గునికి నిలువేల్లను విష ముండును


వృశ్చికస్య విషం పుచ్చం      మక్షికస్య విషం శిరః 

తక్షకస్య విషం దంష్ట్రాం          సర్వాంగం దుర్జనే విషం 


అర్థము:--తేలుకు తోకయందును ,ఈగకు శిరస్సు  నందును, పాముకు కోరల యందును విషము వుండును  . కానీ దుర్జనులకు  సర్వాంగముల    యందు విషము  వుండును. కావున దుర్జనులతో జాగ్రత్తగా వుండ  వలయును.వారు తేనే పూసిన  కత్తి  లాంటి వారు.


విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరా దేవతా 

విద్యా రాజసు పూజ్యతే నహి దానం విద్యహీనః పశు:


అర్థము:--- విద్యయే  మనుషులకు శ్రేష్ఠ మైన రూపము,రహస్యముగా దాచిన ధనము, భాగమును,కీర్తిని, సుఖాన్ని కలుగ జేయునది. గురువు లందరికీ పూజ్య మైనది,దేశాంతరగమనమున బంధువు వలే రక్షించునది,ఉత్తమ మైనది,విద్య ఒక దేవత, అన్ని కోరికలనూ తీర్చునది. ప్రభువుల చే పూజింప బడునది విద్యకు సాటి అయిన ధనము ఈ భూమిలో యింకొకటి లేదు విద్య లేని వాడు వింత  పశువు.


*యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధో2 పరిగ్రహః 

నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలతా ! 


వాక్సంయమము, ద్రవ్యమును కూడబెట్టకుండుట, లౌకిక పదార్ధములను ఆశింపకుండుట, కోరికలను వీడుట, నిత్యము ఏకాంత వాసము చేయుట,।।। ఇవి యన్నియు యోగమునకు ప్రథమద్వారములు।

విద్యా మదో ధనమద స్త్రుతీయో భిజనో మదః

మదా యేతే వలస్తానా మేత యేవ సతాందమాం


అర్థము:--దుష్టులగు వారికి చదువు,డబ్బు,వంశము మరింత అహంకారాన్ని పెంచుతాయి. ఇవే సజ్జనులకు అణుకువను, నిగ్రహాన్ని కలిగిస్తాయి.

శర్వరీ దీపకః చంద్రః      ప్రభాతే దేపకో రవి:
త్రైలోక్య దీపకో ధర్మః     సుపుత్రః కులదీపకః 

అర్థము:--రాత్రి కి చంద్రుడు వెలుగు నిస్తాడు,పగలుకు సూర్యుడు వెలుగు, మూడులోకాలకూ ధర్మమే వెలుగు నిస్తుంది  మంచి పుత్రుడు వారి కులానికే మణి  దీపం వంటి వాడు.

స్వార్జితము సుఖము నిడు పూ    
ర్వార్జిత విత్తంబు కొంతవరకు సుఖంబౌ 
నార్జింప   పరుడెవండో 
వర్జింపక తినెడు వాడు వ్యర్థుడు కృష్ణా !

     తా:----తాను స్వయముగా కష్టపడి సంపాదించిన ధనము ఉత్తమమైనది మనసుకు హాయిని కలిగించును, పితరులు సంపాదించి పెట్టిన ధనము కొంతవరకు పరవాలేదు,పరాయివాడెవడో సంపాదించిన ధనమును విడిచి పెట్టకుండా అనుభవించెడువాడు వ్యర్థుడు కృష్ణా !కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి