(ఛందస్సు ) సంక్రాంతి -- ర ర ర ర
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే
నీటినీ చల్లెనే - ముగ్గులే పెట్టెనే
రంగులే దిద్దేనే - పువ్వులే చల్లెనే
ఓర్పుతో సంతసం - నిత్యధర్మాలునే
కాలమే మార్చెనే - కావ్యమే చెప్పెనే ఈశ్వరా
రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముయే
నిమ్ము ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ మయే
తమ్మి నీమోము కెం - దమ్మి నీ రూపయే
చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండుయే
కమ్ముకొచ్చేటిదే - కర్తవ్యం దీక్షగా ఈశ్వరా
కళ్ళలో వెల్తురూ - కాంతిలో సౌఖ్యమై
చీకటే మెట్టుగా - గుట్టుగా భావమై
పద్యమే వేదమై - భావమే నాదమై
అందమే సొంతమై - శ్రీమతీ సౌక్యమై
ధైర్యమే జ్ఞానమై - మౌనమై మోక్షమై ఈశ్వరా
తామసం తగ్గెనే - తన్మయం చెందెనే
సుందరం కాంతలో - నోములే పండెనే
మన్మధా అంబరం - ప్రుద్విలో ప్రేరణే
చీకటే తీరెనే - వెల్తురే పంచెనే
సంబరం లక్షణం - సంతసం సంభవం ఈశ్వరా
పున్నమీ వెన్నెలే - వేకువే మంజులం
మోహనం నిర్మలం - రామనీ రూపమే
ప్రుద్విలో సంగ్రహం - నింగితో సంభవం
దివ్యమై సవ్యమై - మాధవో మాధవం
సాధనం శోధనం - సాహసం సంగమం ఈశ్వరా
___(()))____
కవితా సాక్షి ... 1...17..08..2021
కాలానికి అతీతమై ప్రేమగా
పలికి నలిగి చూస్తూనే ఉన్నా
మొహమ్ము అతీతమై మనసుగా
వెలుగులకు కరిగి పోతున్నా
సహనాని కిది అతీతమ్ముగా
దీపము వెలిగై చూస్తూనేఉన్నా
హృదయాని కిది అతీతమ్ముగా
నిలిచి మదిలోన చేరుతున్నా
ప్రాణానికి అతీతమైనదిగా
తకిలిగా తిరిగి వెంటేవున్నా
స్నేహానికి అతీతమైనదిగా
ఆకలి నేను తీర్చుతూనే ఉన్నా
మౌనానికి అతీతమైనదిగా
అరచి కఱచి ప్రేమగా ఉన్నా
వేదానికి అతీతమైనదిగా
చదువు తెలుపు ఆశగా ఉన్నా
యుగయుగాల నుండియే ప్రేమగా
తరాల భ్రమలను తొలుస్తున్నా
కలి కాలం నిజమైన ప్రేమగా
సాక్షిగా బతికి బతికిస్తున్నా
--(())--
ఓం శ్రీ మాత్రే నమః...ఓం నమః శివాయ
ప్రాంజలి ప్రభ ... జీవితంలా ..17..08..2021
ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకో
తెల్పి తెలప లేనట్టి జీవితంలా
కధా కధలుగా కదులు టెందుకో
చిత్ర విచిత్రమైనట్టి జీవితంలా
మనల్ని నడిపించేవాడు తెల్సు కో
తల్లి తండ్రి గురువుల జీవితంలా
చెడు మరచి మంచిని తెలుసుకో
శివుడాజ్ఞతో కదిలే జీవితంలా
బందాలలోని సంబంధం తెలుసుకో
స్నేహం, ప్రేమ వంటి పేర్ల జీవితంలా
జన్మ ఋణబంధమ్మును తెలుసుకో
త్యాగ బుద్ధితో ఆనంద జీవితంలా
వివాహ బంధంతో ఏకం తెలుసుకో
సుఖదుఃఖం కలయిక జీవితంలా
బంధంతోను బంధుత్వాలు తెలుసుకో
బరువు భాద్యతలతో జీవితంలా
స్నేహంలోని సంబంధాలు తెలుసుకో
మిత్ర బంధంతో మనసు జీవితంలా
కాలగర్భంలో కలిని తెలుసుకో
పూర్వ జన్మ ఋణబంధ జీవితంలా
వాడి మాటలలో మర్మం తెలుసుకో
నిజ నిర్ధారణ తో అనుకరించు
పొడి తడి ముడి దడి తెలుసుకో
అర్ధం పరమార్ధాన్ని అనుకరించు
వేడిదో చల్లనిదేదో తెలుసుకో
బుధ్ధి కసలతను అనుసరించి
దాడి సక్రమం, అక్రమం, తెలుసుకో
నిశ్చలంగా శాంతిని అనుసరించి
ఓం శ్రీ మాత్రే నమః...ఓం నమఃశివాయ
0
ఘర్షణ ... సంఘర్షణ ..3 ప్రాంజలి ప్రభ...17--08--2021
నీ కంటిలో నలత వేలుగు నైనాను
నీ మాటలో మమత మాధవ నైనాను
నీ ఆటలో అలుపు ఆశగ నైనాను
నీ వేటలో అలుక ఆకలి నైనాను ...........9
మినిగురు పురుగులు మెరియును క్షణం
వనితల నయనములు మెరియు క్షణం
కలతలు తొలగును వెలిగియు క్షణం
మనిషితొ ధనము నిలవదు ఎ క్షణం .... 10
ఉబలాటం, మెరుపూ క్షణ కాలం
కలలాటం, కులుకూ క్షణ కాలం
మదిలాటం తనువూ క్షణ కాలం
మహిలాటం బరువు క్షణ కాలం ...... .. 11
ప్రపంచాన్ని చదవాలను కున్నా - ఊహల పరిధిలో ఉన్నా
మనోనీతి తెలపాలని కున్నా - ఊయల తరువులో ఉన్నా
మనస్సే ఒక తపస్సని ఉన్నా - ఊపిరి వరదలో ఉన్నా
శిరోభార మవకుండగ అన్నా - ఊరు మనగడలో ఉన్నా .... 12
మన సిచ్చిన మనసు తట్టే రాగాలను ఆలకించు
అనుబంధపు తనువు పెట్టే మొహాలను సంస్కరించు
బలవంతపు భ్రమలు పెట్టే వేషాలను బ్రతికించు
పరిబ్రమించు సెగలు పెట్టే మోసాలను ఊరడించు .... 13
చింతన చేయుచు బ్రతికే మనిషి క్షణ సుఖంకోసం
కాలము నమ్మక వెతికే మనిషి క్షణ మనో వాదం
ప్రేమయు పంచక మరిచే మనిషి క్షణ పెనూ భూతం
సౌఖ్యము పొందియు కలిసే మనిషి క్షణ లతా మయం .... 14
0
ప్రాంజలి ప్రభ....4...నేటి కవిత
గొప్పవాళ్ళు నిర్ణయాన్ని నమ్మడం నిజం
వాళ్ళను అనుకరణ చాలా కష్టం
ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారం
గుర్తింపు ఉన్నా చూసేది మంచి గుణం
మనమెంత మంచికులంలో పుట్టినా
అందరూ చూసేది మంచితనముయే
మన దేశ మందు గొప్ప మతమైనా
అందరూ చూసేది మానవత్వమ్ముయే
ధనముంటే ధనవంతు డౌతాడులె
అదే దానం చేస్తే భగవంతుడగు
మంచిగున్న మానవుడవుతాడులె
నిజః తెలిపితే భగవంతుడగు
0
ప్రతిభ హృదయంలొ కదిలెడి భావ చినుకు
మతిని చేరి రంజిల్లుటే
గతిని నిర్దేశించిన జీవి కాలమందు
శృతికి సాహిత్య వెల్లువే
ప్రగతిశీల ప్రభాత మే పగలు రేయి
జగతి ఏలు తెలుగు లీల
యుగము లెన్ని మారిన కధ లేలు చుండు
ఆగదు తెలుగు సాహిత్యం
యువత మారండి మార్చండి యుగము నందు
జయము ఆధునిక ఆచరణ
మాయ గూడత్వాన్ని తొలచి మహిమ చూపి
భయము మనసు చేర్చకు
మనిషి నీళ్ళలో మునిగేను మగువ కొరకు
మనిషి చిత్రమైనది ప్రేమ
మనిషి చవటైన మేధావి పలుకు గట్టి
మనిషితో కలిసె మనసు
సిరులు జూసియు పలుకుల సరుకు మారు
పరులతోడపగను పెంచు
కరుణ మేరకధలు చేరు కలలు లాగ
మార్పు లెపుడు కదలిరావు
0
పిన్న వయసులో పెరు గును ప్రేమలు గను
కన్న మనసును మరవరు
చిన్న మలుపులు తోమారి చింత తీర్చి
మన్నన కలలు తీర్చునే
యుక్త వయసులో ప్రేమలు రగులు చుండు
శక్తి వరుసైన ప్రేమతో
వ్యక్తిగత మును తెలిపియూ వలపు లిచ్చి
యుక్తి పెంచును ప్రేమలే
యవ్వనంలో నా ప్రేమ హాయి గొలుపు
నవ్వు లకు లొంగి చెడకుమా
యవ్వనపు లీల కొత్తగా అడుగు వేయు
నువ్వు నేనుఅనిపించునే
వృద్ధులు వికలాంగుల ప్రేమ విధిగ వుండు
వృద్ధులను నిరాశ వలదు
వృధ్ధి కియె పెద్దల సలహా వలన మేలు
వృధ్ధ సంపదే రక్షగా
0
కాల మాయయే మనలోని కధలు కెలికె
కాల పాపమే మిగిలేను
కాల క్రమేణా పెరుగుతూ గళము తెలిపె
కాల బంధమే మిగిలేను
వేరు బలమును గమనించి వలయ వలదు
మారు తరువుని ప్రేమించు
వేరు చిన్నదే ఫలములు వచ్చు చేరు
మారు మలుపుని బతికించు
మాయ ఏమిటి అంటే ను మనసు మెరుగు
ఛాయ పడకున్న చాలును
రాయి నైనాను బతుకులో రవ్వ నిచ్చు
మాయ లేనట్టి ఓర్పుగా
రేయి మెల్లమెల్లగ సాగె రేడు లేక
రాయి కలుగు వెలుగు చేరె
మాయమవునురోగము లన్ని మందు పడగ
కాయమేమారి పోవును
మాయలోననే మునగకే మనసు నుంచు
కాయము సుఖము లను పొందు
జయము మనదే జీవిగా జాత రవ్వు
భయము వదిలి బతుకుకై
0
97... కంసాసారీ - య/మ/ల IUU UU UI
7 ఉష్ణిక్కు 66
++
వినంగా రావే యిందు - కనంగా లేవే ముందు
మనంగా నీదే శక్తి - యనంతా నీవే ముక్తి
++
ముదమ్మే లేదే యా బు - ద్బుదమ్మా నాజీవమ్ము
పదాలం గొల్తున్ రమ్ము - సదా నీపేరే సొమ్ము
++
మురారీ రావా నన్ను - గరాలం బ్రోవం జెన్ను
స్థిరమ్మీ నావేడ్కోలు - భరించన్ నీవీడ్కోలు
++
98....కాహీ - స/త/ల IIUU UII
7 ఉష్ణిక్కు 100
++
సమభావా తీతము - సమవేదం పాఠము
సమరాగం తీరము - సామవైనం మోహము
మన దైవమ్మే హరి - మనపూజల్పై గుఱి
మన రాగమ్మే సిరి - మాన ఆహారం వరి
మన కాతండే తరి = మన జీవాబ్ధిన్ దరి
మన భావాలే మరి - మన వేదాలే గుఱి
నవసేవాతత్వము - నవ మార్గమ్మే ఇది
నవభావాతత్మము - నవ తత్వమ్మే ఇది
విన రావా మాకత - కన రావా మావెత
మన రావా మాజత - యినవంశోద్ధారక
++
మన కారోగ్యమ్మును - మన కైశ్వర్యమ్మును
మన కానందమ్మును - వనజాక్షుండే యిడు
మన సాంఘీకమ్మును - మన ధైర్యమ్మే ఇది
మనసామాన్యమును - మన కాలమ్మే ఇది
*****
99...ఉలపా - భ/న/గ UIII IIU గుణాలతో వ్రాసే చక్కటి పద్యకవిత
7 ఉష్ణిక్కు 63
++
యీఋతువు విరులే - యీఋతువు మరులే
యీఋతువు లతలే - యీఋతువు జతలే
యీ కలము కధలే ... యీ కధల వెతలే
యీ వెతల మెరుపే.. యీ మెరుపు కలలే
++
భారతము మనదే - గీరతము మనదే
భారతము చదువోయ్ - గీరతము వలదోయ్
దారుణము తలపే .. భారముయు మనదే
కారణము వలపే - భాధ్యతయు మనదే
++
యీధరకు వర మా - మాధవుని వరమా
బాధలకు బల మా - శ్రీధరుని గళమా
ప్రాణమును బలమా ... పోషణకు విలువే
కాలమునకు సబబే .. మానమునకు మలుపే
++
******
100... కాహీ - స/త/ల IIUU UII... అనే గుణాలు అంత్యానుప్రాస లో వ్రాస్తా చాలా బాగుంటుంది
7 ఉష్ణిక్కు 100 8 వ పదం యతి ప్రాస యతి ..
++
మన దైవమ్మే హరి - ఘన రూపమ్మే గుఱి
మన కాతండే తరి - మన జీవాబ్ధిన్ దరి
మన ల్లక్ష్మమ్మే గురి .. మనదేహమ్మే హరి
మనదాహమ్మే సిరి .. మనకాలమ్మే దరి
విన రావా మాకత - కన రావా మావెత
మన రావా మాజత - యినవంశోద్ధారక
సమయమ్మే మాకత .. వినయమ్మే మాజత
విషయమ్మే మావెత .. వివరమ్మే నాయక
++
మన కారోగ్యమ్మును - మన కైశ్వర్యమ్మును
మన కానందమ్మును - వనజాక్షుండే యిడు
మనతత్వార్ధమ్మును .. మానధర్మార్ధమ్మును
మనమానాభ్యు మ్మును ... మన ప్రేమాభ్యమ్మును
--(())--