సమ్మోహనాలు ... ప్రశ్న 1301 ... 1310
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సరిగమ సంగీతము
సంగీతం పాఠము
పాఠము జీవిత సంగీత మే ఈశ్వరా
సంగీత స్వరాలు
స్వరాలే మధురాలు
మధురాలు మనసునే దోచేను ఈశ్వరా
యువతకే ఉల్లాసం
ఉల్లాస ప్రభావం
ప్రభావం సంగీత స్వరాలే ఈశ్వరా
సంగీత కచేరీ
కచేరీ విహారీ
విహారి మనసుకునేర్పు లహరీ ఈశ్వరా
కొందరి జీవితాలు
జీవ సంగీతాలు
సంగీత వృత్తియే జీవమ్ముఁ ఈశ్వరా
లింగ భేదము లేదు
లేదు మతమును లేదు
లేదు సంగీత స్వరము మనషె ఈశ్వరా
కాలానుగుణంగా
గుణ ప్రభావంగా
ప్రభావ సంగీత సాహితియే ఈశ్వరా
అపారమగు సంగీత
సంగీత సమర్దత
సమర్ధత కీర్తి ప్రతిష్టలే ఈశ్వరా
అత్యధికోత్సాహము
ఉత్సాహ యవ్వనము
యవ్వన దూకుడులు,గెంతులే ఈశ్వరా
రమణీయ గీతమ్ము
గీత ఆనందమ్ము
ఆనంద సర్వ సంగీతమే ఈశ్వరా
సమ్మోహనాలు ... ప్రశ్న 1291 ... 1300
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రేమలేక రాశా
రాసి నా ఓ ఆశా
ఆశా పాశము కు చిక్కాలే ఈశ్వరా
అమితమైన ప్రేమ
ప్రేమ సుఖము దుఃఖమ
దుఃఖము తప్పదు జీవితములో ఈశ్వరా
ధనము కీర్తి ప్రతిష్ట
ప్రతిష్ఠ మనకు నిష్ట
నిష్ట మనిషిగా సంతృప్తియే ఈశ్వరా
మనసులో భోగమ్ము
భోగమ్ము తరుణమ్ము
తరుణమ్ము ప్రేమ లేఖ తోనె ఈశ్వరా
ఇంద్రియములు మనస్సు
మనస్సు కళ తపస్సు
తపస్సు సౌఖ్యమ్ము కొరకుకళలు ఈశ్వరా
నేడు ప్రేమలేఖలు
లేఖతొ పరిచయాలు
పరిచయం ఇరు మనసులను కలిపె మోహనా
లోకము ప్రేమమయము
ప్రేమలొ అనురాగము
అనురాగముతో ఇంద్రియసుఖము ఈశ్వరా
లేఖనే రాసితిని
రాసియే ఆగితిని
ఆగియు ప్రేమ పంచుటకు లేఖ ఈశ్వరా
కరుణ చూపు ప్రేమా
ప్రేమ తోనె యుగమా
యుగము అంత జీవిత ప్రేమే ఈశ్వరా
ఉషోదయ వెలుగులే
వెలుగుతొ ప్రేమలే
ప్రేమ జీవితాన నిత్య లేఖ ఈశ్వరా
--(())--
సమ్మోహనాలు ... ప్రశ్న 1281 ... 1290
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రశ్నలో ఉన్నాది
ఉన్నాది జవాబది
జవాబులో ఉంది తన్మయమే ఈశ్వరా
ప్రశ్నించ కే నీవు
నీవు బాధపతావు
బాధలు పెట్టుట ఎంత నిజమొ ఈశ్వరా
జ్ఞాన సముపార్జనే
ఆర్జన ప్రశ్నగునే
ప్రశ్న లే మనిషిని మార్చును లే ఈశ్వరా
మనసు ప్రశ్నలవల
వలయె పొంగేటి అల
అల ప్రశ్నిస్తూనేవుంటుందే ఈశ్వరా
మంచి చెడ్డ చూడక
చూడక ప్రశ్న అలక
అలక తీర్చుటకు ప్రశ్నలు వచ్చు ఈశ్వరా
గురువు శిష్యుల మధ్య
మధ్య ప్రశ్నల పద్య
పద్యములకు గురువే జవాబే ఈశ్వరా
ప్రశ్న తో మోహమ్ము
మోహమ్ము దేహమ్ము
దేహము ప్రశ్నల చుట్టూ తిరుగు ఈశ్వరా
కృష్ణార్జునులలో
అర్జున అడుగుటలో
అడుగుట ప్రశ్నగా కృష్ణ తెలుపు ఈశ్వరా
జిజ్ఞాస ఉండాలి
ఉంటె ప్రశ్నల గాలి
గాలి కమ్ముకున్నట్ల ప్రశ్నలే ఈశ్వరా
ప్రశ్నించేది కలలు
కలలు వల్లా వెతలు
వెతలు లేని జీవితం వ్యర్ధము ఈశ్వరా
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి