ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
రాధాబాయ్.
అది
ఒక చిన్న గ్రామం, నగరానికి దూరముగా ఉన్నది, సూర్యుడు ఉదయిస్తున్నాడు,
పల్లెవాసులు మేల్కొంటున్నారు, కాలకృత్యాలు తీసుకొని నిత్య విధులకు
ఉపక్రమించుటకు ప్రయత్నం చేస్తున్నారు, పేపేరు కోసం ఎదురు చూస్తున్నారు,
ఇక్కడే రెండు ఎకరాల విస్తీర్ణంలో పూలచెట్ల మధ్య చుట్టు కొబ్బరి చెట్లు ఉన్న
ప్రాంతము నందు ఒక ఆశ్రమము కాదు, అది స్త్రీ బాధిత రక్షణ హనుమాన్ నిలయం,
దీనిని
నిర్వహిస్తున్నది రాధాబాయ్ గారు, ఈమెకు పెద్ద వయసు
ఉంటుందనుకున్నారో పప్పులో కాలేసినట్లే కేవలము 40 వత్సరములు ఎప్పుడు పచ్చటి
వస్త్రములు ధరిస్తూ స్త్రీ రక్షణా కేంద్రముగా భాద్యతలు వహిస్తున్నది.
అప్పుడే టివి, రేడియో, పత్రికా, విలేఖరులు వచ్చారు మీరు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పటు చేయడంలో అంతరార్ధం ఏమిటి ?
మీలో
స్త్రీలు ఎవరు లేరా వారే చెప్పగలరు దీనికి సమాధానము, నేను చేసే పనుల్లో
తప్పులుంటే నాకు తెలియపరచండి లేదా నేను స్త్రీలకు ఏమిచేయాలో మీరు తెలియ
పరచండి అని అడిగింది వచ్చిన విలేఖరులను రాధాబాయ్.
అందులో వచ్చిన ఒకరు మేము అడిగిన వాటికి సమాధానములు చెప్పకపోతే మేము వ్రాసే వ్రాతలకు భాధ్యతలు మీరే అన్నాడు.
ఎవరో ఆమాట అన్నది అతన్ని ముందుకు రమ్మన మనండి , ప్రశ్నలు అడగమనండి
మీరు ఆడవారిని ఆదరించినట్లు నటిస్తున్నారని నాకు అనుమానం అది నిజమేనా?
మీ
అమ్మగారు, మీ చెల్లి అక్క గాని ఇక్కడ చేర్చండి పూర్తిగా ఉచిత వసతి,
భోజనము, విద్యలు నేర్చుకొనుటకు అవకాశము కల్పిస్తాను, పంపించండి వారే మీకు
సమాధానము చెప్పగలరు. ఎవరైనా సరే అభ్యంతరము లేదు
మీరు చందాల రూపములో తీసుకుంటున్నారు అని తెలిసింది అది నిజమేనా.
మీకు ఆధారాలు ఎమన్నా ఉంటె చూపి అడగండి, ఆధారాలు లేకుండా ప్రశ్నలు వేయకండి.
ఆధారాలు మాదగ్గరున్నాయి రేపు సమాధానములు మీరే చెప్పు కోవాలి తెలుసా.
చూడండి
నేను సత్యం, ధర్మం, న్యాయం మా ఆయుధాలు "విద్య, వ్యాయామము, ఉచిత భోజనము,
వసతి, చేతికి పనికల్పించటం మరియు నిత్యము వేద పండితులచే ధర్మ బోధలు "
చివరగా స్త్రీలకు మీరు చెప్పేదేమిటి ఏదైనా చెప్పండి
నేను ఒకటే చెప్పేది స్త్రీలకు
ఓ వనితలారా ఓ వనిత లారా, తెన్ను తప్పి పోబోకు, నిన్ను నువ్వు కోల్పోకు, నీకున్న ధర్మాన్ని ఆచరించుటలో కష్ట నష్టాలను తెలిపుకొని బ్రతుకుదాం, నలుగురికి సహాయ పడుతూ సాగుదాం
ఆగకుండా
కదిలిపోతూ, సాగి పోదాం, స్త్రీ శక్తి నిరూపిద్దాం, అడ్డులన్నీ దాటుకుంటూ,
ఎదురుదెబ్బలు తగిలితే, బెదిరింపులు కలిగితే, ఆగిపోకుండా సాగుదాం
భయంతో ఆగిపోకు, న్యాయ పయనాన్ని ఆపబోకు, ఎదురు నిలిచే వారిని చూసి అదిరిపోకు, బెదిరించిన
బెదిరిపోకు, నీవు నమ్మిన సిద్ధాంతాన్ని అనుకరించి సాగిపోదాం … సాగిపోదాం ..
ఎంతదూరం సాగినా, ఎన్ని మలుపులు తిరిగినా, అలసిపోకు, సొలసిపోకు, అలసిపోయి
సొలసిపోయి, జీవితాన్ని అర్పించి నష్ట బోకు, ధైర్యమే ఆయుధముగా సాగిపోదాం సాగిపోదాం ఓ వనిత లారా ... .
ధైర్యం విడవకు,
పిరికి దానిగా మారకు, నీకెవరూ దిక్కులేరని, నీకెవరూ తోడు రారని,
నెన్నెవ్వరూ గుర్తించ లేదని, మన్ననంటూ నీకు లేదని, రోదించకు, బాధపడుకు,
బాధపడుతూ-నీ ప్రజ్జను
వేధించకు, కష్టాలకు లొంగకు, కలతలకు అందకు,
నష్టాలకు కుంగకు, నైజాన్ని వీడకు, పెద్దలను గురువులను ప్రేమిస్తూ సాగిపోదాం
…వనితలారా , సాగిపోదాం … వనితలారా
ప్రతికూల
పరిస్థితులను, చెండాడుతూ, చీల్చుకుంటూ, సాగిపో వనితా సాగిపో వనితా, నీకు
ఆదర్శ్యం ఉదయభాను కిరణాలుగా చీకటిని తరిమి వెలుగును నింపే పద్దతిలో
జీవించుదాం .. సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా
భారత్ మాతాకి జై, నన్ను కన్న తల్లి తండ్రులకు జై, విద్య నేర్పిన గురువులకు జై, పంచ భూతములకు జై, రక్తమంతా వక్కటే, దేశాన్ని సస్యస్యామలంగా మార్చటమే మాధ్యేయం, మా సత్ సంకల్పానికి అందరి సహకారం అవసరం, కలసి మెలసి బ్రతుకుదాం, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా, సాగిపోదాం …వనితలారా , సాగిపోదాం … వనితలారా
అంటూ పాట పాడింది రాధాబాయ్
అక్కడకు వచ్చిన విలేకర్లు అందరు ఆపకుండా చప్పట్లు కొట్టారు
చప్పట్లు కొట్టడం కాదు మీవంతు సహాయంగా ఏమి ఇవ్వగలరో చెప్పండి అన్నది.
అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
మేము మీ ఖ్యాతిని, తెలివిని, మీరు చేసున్న కృషిని ప్రపంచ ప్రజలకు తెలియ పర్చాలను కున్నాము
అన్నారు.
నేను ఒకటే చెపుతాను అన్నం తింటేనే ఆకలి తీరుతుంది, అన్నాన్ని చుస్తే ఆకలి తీరుతుందా ?
అట్లాగే నాకు ఎవరి ప్రచారము అవసరము లేదు, మా సహాయము పొందినవారు చెప్పే వాక్యాలే మాకు ప్రచారాలు అన్నది.
అయితే ఇంట పెద్ద ఆశ్రమం కట్టడానికి ఎవరి సహాయము డబ్బు తీసుకున్నారో తెలుపుతారా అని అడిగాడు.
మీరు
ఇక్కడకు రావడానికి నెంబరు షిప్ రుసుము కట్టారు కదా అదే మాకు పెట్టుబడి,
నిత్యావసర వస్తువులు శుభ్రపరచి ప్యాకెట్లద్వారా తక్కువధరకు ఇవ్వడం, పేదలకు
వస్త్రములు తక్కువధరకు అందచేయడం మా ఉద్దేశ్యం.
నేను సహజముగా కోటీశ్వరు రాలను, ఇంతమంది సాహాయ్యము తో ఇంకా సంపాదించ గలిగాను ప్రభుత్వానికి తగు విధముగా టాక్సు కడుతున్నాను.
నానినాదం
" సువాసన పువ్వువై ఆకర్షించి పరిమళాలను పంచు
వెలుతురు దీపమై హృదయాంతర వేదన తొలగించు
దుర్మార్గాన్ని ధైర్యంతో ఎదుర్కొని ధర్మాన్ని రక్షించు
దేవుణ్ణి, గురువు,పెద్దల్ని, ప్రేమించి జీవితం సాగించు "
మీ భర్త, మీపాప విషయాలు గురించి చెపుతారా.
ముందు
మీ కందరికీ భోజనాలు ఏర్పాటు చేసాను, భోజనము చేసిన తరువాత కొన్ని విషయాలు
తెలుసు కోగలరు, మీకందరికీ ధన్యవాదములు తెలియపరుస్తూ
ఇప్పటికి ముగిస్తున్నాను, మరల మధ్యాన్నం 3 గంటలకు మంచి విషయాలు తెలుసు
కుందాము అని చెప్పి లోపలకు వెళ్ళింది రాధాబాయ్.
విలేఖరు లందురూ ఒకచోట చేరిన వారితో రాధాబాయ్ చెప్పటం మొదలు పెట్టింది.
మీరు
సమయ పాలన చేసే వారని నాకు తెలుసు, మావారి పేరు మాధవ్ పోలీస్ ఆఫీసర్,
ఒకరోజు డ్యూటీ లో ఎదో ఫోన్ రావటం వల్ల అక్కడికి వెళ్లారు, అక్కడ ఒక
అమ్మాయిని దారునంగా బలాత్క రించి చంపేశారు, వారితో పోరాడటం వల్ల కొంత
మంది చనిపోయి కొందరు పారి పోయారు, దుర్మార్గుల కుట్రకు నా భర్త
కూతురు బలై పోయారు, మావారి చివరి కోరిక స్త్రీలకు ధైర్యము కల్పించే
ఆశ్రమమును స్థాపించి ధైర్యవంతులుగా మార్చే శక్తి మనం ఆరాధించే ఆంజనేయుడే
మనకు రక్షణగా ఉంటాడు, నాకు మన పాపకు బ్రహ్మ వ్రాసిన కాలము వచ్చింది, నీ
ధైర్యమే నీ కుబలం, నీ ఊపిరి నీకు శక్తి అంటూ నేలకు ఒదిగారు, కళ్ళవెంబడి
నీరు కారుస్తూ అందరికి నమస్కారము చేసినది, విషాద గాధ విని అందరూ అలా ఉండి
పోయారు .
--(()))--