1, ఏప్రిల్ 2019, సోమవారం

ఒక్కసారి చదవండి - 40
ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది -
మీ ఓటు సద్వినియోగం చెయ్యండి - 
డబ్బులకు అమ్ముడు బోయి అన్యాయం చేయకండి -   

1 . అమరావతి రాజధాని గురించి, అభివృద్ధి చేస్తాను అన్నవారికి  వారికి       ఓటువెయ్యాలో నిర్ణయిన్చుకొండి 
1 . అమరావతి పేరు ఉదహరించని,  ఓటువెయ్యాలో నిర్ణ యిన్చుకొండి      
    
2.  అభివృద్ధిని ఆశించి ఓటు  వేస్తారా 
2 .  ఒక్క సారి మాకు అవకాశం ఇవ్వమన్నవారికి ఓటు వేస్తారా                                                         

3.  ప్రత్యేక హోదా కొరకు కాంగ్రెస్ కూ సహకరించటం సామార్దిసారా 
3 . విభజనకు కారకులైన వారిని మద్దతిచ్చే వారికి ఓటు వేస్తారా       
                     
4 . రైతు ఋణం ఉపశమన పథకం  అమలు పరుస్తున్న వారికీ ఓటు వేస్తారా 
 4 . రైతు ఋణం ఉపశమన పథకం   అమలు పరుస్తామన్న వారికి ఓటు వేస్తారా  
         
5 . ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, స్కాలర్ షిప్పులు ఇస్తున్నవారికి ఓటు వేస్తారా                        
5 . అరిచి చెప్పే అబద్దాన్ని నమ్ముతారో చేస్తున్న వారిని నమ్ముతారో మీ విచక్షణకే                                              
      వదిలి వేస్తున్నాను 

6.   డ్వాక్రారుణామాఫీ, పసుపు కుంకుమ పథకం క్రింద సహాయము ఎంతవరకు 
      పొందారో సమంజసమో అలోచించి ఓటు వెయ్యండి   
6 .   వడ్డీ లేని ఋణం ఇస్తాను అన్నవారికి ఓటు వేస్తారో నిర్ణయించుకోండి 

7 . ముఖ్యమంత్రి సహాయనిధి నుండి, అభయ హస్తం నుండి పొందిన వారు 
      నిజమను తెలుసుకొని ఓటు వేస్తారా   
7 . నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మీరు అడిగినంత 
     ఇవ్వగలను అన్న వారికి ఓటు వేస్తారా   

8 . ఉపాధి హామీ ఇచ్చి, నెలసరి ఎమౌంటు ఇస్తున్న వారికి ఓటు వెయ్యాలో       వెయ్యాలో మీరే నిర్ణయిన్చుకొండి       
8 .  నెలసరి ఎమౌంటు ఇప్పుడిస్తున్న దానికన్నా పెంచుతాను అన్న వారికి ఓటు       వెయ్యాలో మీరే నిర్ణయిన్చుకొండి  

9 .  జన్మ భూమి కార్యక్రమం నిర్వహించి పరిశుభ్రత, నీరు చెట్టు కార్యక్రమాలు,  మినిరల్ వాటర్ తక్కువకు ఇవ్వటం సిమెంటు రోడ్డు వేసిన వారికి ఓటు        వేస్తారో మీరే నిర్ణయిన్చుకొండి. 
9 .  విధాన సభలో చర్చించలేనివారు అన్ని చేస్తాము మమ్ము గెలిపిస్తే అన్నవారికి       వారికి ఓటు వేస్తారో మీరే నిర్ణయిన్చుకొండి. 

10 . భవిషత్తు దృష్టిలో ఉంచుకొని నగరాన్ని అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారో        మీరే నిర్ణయించుకోండి. 
10 . నేర చరిత్ర ఉన్న వారు చేస్తాము అన్న వారికి  ఓటు వేస్తారో మీరే        నిర్ణయించుకోండి.    

--((**))--

ప్రాంజలి ప్రభ (కధ ) - ౩9  

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
ప్రాణ దాతలు కధ

 ఏమిటోయ్ పొద్దున్నే ఆకుకూర పట్టుకొచ్చావ్, అలా కూర్చొని వాగే బదులు కాస్త మీ భార్యకు సహకరిస్తే మీ సొమ్మేపోదు అన్న మాటలకు అంత రుసరుస పలుకులతో మాట్లాడుట మంచిది కాదే  అన్నాడు భర్త.

మాటలకేం చక్కగా మాట్లాడుతారు,  నా మాటలకు మాత్రం సమాధానము రాదు. ఏమిటే అట్లా మాట్లాడుతావు నీవు ఏదంటే అదే చేస్తున్నాగా, సరే మీరు ఇప్పుడు ఏమిచేయ వద్దులే అంతా  నేను చేసు కుంటాలే, అప్పుడే కోపం వచ్చిందా ఏమిటి, కోపం కాదండి మీచేత పనిచేయిన్చటం మంచిది కాదు కదండీ, అన్ని నీవే అంటావు అంతా మీ ఆడోళ్లకే చెందుతుంది.  ఏమాటైనా నవ్వుతూ ఆకుకూర తీసుకొని లోపలకు వెళ్ళింది.

అవునే మనపిల్లలు కనిపించుట లేదే, అయ్యే రామ మీకు చెప్పలేదా, స్కూలు పిల్లలతో చెన్నై టూర్ కు వెళ్లారు, ఎదో చేతి ఖర్చు కావాలంటే ఇచ్చాను.

అవునే రాత్రి  నిద్రలో పిల్లలొచ్చి అడిగారు నేను ఒప్పు కున్నాను కూడా.
ఈ వయసులో అంత  మతి మరు పేంటీ, ఏమోనే పిల్లలను స్కూల్లో దించే అలవాటుగా అడిగా అంతే.
మనం ఈ కార్తీకమాసంలో విజయవాడ వెళ్లి కృష్ణలో స్నాన మాచరించి, దుర్గమ్మను కొలిచి అక్కడే ఉన్న మాగురువు గారు శర్మ గారింటికి వెళ్లి వద్దామా, పిల్లలు ఎటుతిరిగి చెన్నై కి వెళ్లారుకదా అని అడిగాడు భర్త శంకరం భార్య పార్వతితో.
నీమాట ఎప్పుడు కాదన్నానండి అని నవ్వుతూ పలికింది. అవునే నామాట ఎప్పుడూ కాదనవు, సరేలే ఒక మూడు రోజులు సరిపడే బట్టలు సర్దు నేను బస్సు టిక్కెట్లు తెస్తాను, ఈ రోజు రాత్రికె వెల్దాము,
అట్లాగేనండి అన్నీ సర్దుతా
తెల్లవారుజామునే విజయవాడ లో ఉన్న శర్మగారి ఇంటికి చేరారు.
శర్మ గారి కుటుంబం సాదరంగా ఆహ్వానించింది, అయన భార్య సరస్వతి, పిల్లలు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు, చేతికి టవల్ అందించారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని ఉభయ పక్షాల క్షేమ సమాచారాలు తెలుసు కున్నాక కృష్ణ స్నానం దైవదర్శనం అంటూ  మేము శర్మ గారి భార్య పిల్లలతో బయలు దేరాము.    

మేము ఘాట్ దగ్గర స్నానం చేసి పైకి వచ్చాము గుడికి పోదామని, అప్పుడే శర్మగారి పిల్లవాడు గబగబా నీటిలోకి దూకాడు నీటిలో కొట్టుకు పోతున్న పిల్లవాన్ని కాపాడాడు, నేలమీద పడు కోపెట్టి పొట్ట వత్తాడు, నోటి నుండి నీరు కారుతూ కదిలాడు, ఆపిల్లవాని తల్లి తండ్రులు ఆ ఆమ్మ వారు నీలో ప్రవేశించి కాపాడింది బాబు, ఈ బాబు వాని తల్లి తండ్రులు చాలా పుణ్యాత్ములు అంటూ దీవించి వెళ్లారు.
అప్పుడే ఒక్కసారి తనపిల్లలు చేసే పనులు  గుర్తు తెచ్చు కుంది పార్వతి. నా పుత్రుడు మోటార్ సైకిల్ తో  ముసలావిడకు  డాషిచ్చి,    అయ్యో పాపం అనక పోగా,  అడ్డు వచ్చిందని తిట్టి మరీవచ్చాడు,    పోలీసులకు డబ్బులిచ్చి కేసులేకుండా చేసాడు.    

నా పుత్రిక ఎమన్నా తక్కువ తిన్నదా ఇంటి ముందుకు బిచ్చగాలొస్తే వారిపై కుక్కను తరిమి సంబర పడేది.  పనివాళ్లను కూడా నీటికి వచ్చినట్లు తిట్టేది. 
మచ్చుకైనా గౌరవ భావము లేదు నా బిడ్డలకు. అనుకున్నది. 

అమ్మవారి దర్సనం చేసుకొని శర్మ గారి ఇంటికి చేరాము.
అప్పుడే శర్మ గారి తండ్రి గారికి సేవలు చేస్తున్నారు, ఆయన వయసు 70 దాకా ఉండవచ్చు, పిల్లలు తాతా బాగున్నావా పలకరింపులు ఆయన ఓపికతో కధలు చెపుతున్నాడు 

శరణ కోరినవారికి అనేక మార్గాలు చూపిస్తాడు ఆ పరమాత్ముడు, అన్నింటికీ మూలం బుద్ధి, ఇది సక్రమముగా నడుస్తున్నప్పుడు, మానవుని  ప్రతిభ, ప్రజ్ఞ, నలుదిశలా పరిమళిస్తుంది. రాగ ద్వేషా లు, మానవుని ప్రధమ శత్రువులు వాటిని మానవులు త్యజించాలి.  కానీ కొందరు ఎవరో ఒకరికి భయపడి బంధాలు తెంచుకుంటున్నారు, వయసు మీరిన తల్లి తండ్రులను దూరంగా ఉంచు తున్నారు. ఎందుకు అలా ప్రవర్తిస్తారో నాకు తెలియుట లేదు, వారు పెద్దవారు కారా వారి పిల్లలు వారిని అట్లా చూస్తారని అనుకోరు ఎందుకు , ఇది అంతా కలియుగ మహిమ అనుకుంటున్నాను అని భాదతో శర్మ గారి తండ్రి గారు భాదతో పలికారు.  అవును శంకరం గారు మీ నాన్నగారు బాగున్నారా, వారు నాకు ప్రాణ దాత ఎలాగంటే మీనాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళము, ఒకనాడు క్యామ్పుకు ఇద్దరం కలసి వెళ్ళాము, అక్కడ వాతావారణం నాకు పడ  లేదు, అంతా వర్క్ మీనాన్న చేసాడు అప్పుడే నాకు ఎదో పురుగు కుట్టింది,జ్వరం కూడా వచ్చింది వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు, నాకు సేవలు చేసాడు అటువంటి ప్రాణదాతకు నేను రుణపడి ఉన్నాను 
మీఇంటికి వచ్చి కలవాలని అనుకుంటున్నాను అన్నాడు.      
వింటుంటే పార్వతి మనసు కరిగి పోయింది. నేను ఉద్యో గం మానేసి మావ గారికి, అత్తయ్య గారికి సేవలు అందిస్తాను. 

అప్పుడే నెమ్మదిగా భర్త దగ్గరికి చేరి ఏమండి మీ తల్లితండ్రులను   వృద్ధాశ్రమం నుండి తీసుకొస్తే ఎంత బాగుంటుంది.

అవునే నేను చాలా తప్పు చేసాను,   ప్రాణ దాతలను నిర్లక్ష్యం చేసాను, అన్న  లు  వంత  పలికారని నేనుకూడా వెనకాడాను, వారికి సేవ చేయకుండా వృద్ధాశ్రమం లో ఉంచాను, నెలకు కొంత డబ్బు పంపుతున్నాను కానీ వారి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడు శర్మ గారి కుటుంబం చూసాకా నేను తల్లి తండ్రులకు  సేవ  చేద్దా మనిపిస్తున్నది.
అవునండి నాకు అదే అనిపిస్తున్నది        

వృద్దశ్రమంలోకి పార్వతీ శంకరులు పిల్లలతో లోపలకు ప్రవేశించారు. అక్కడ  ఉన్న తల్లి తండ్రుల పాదాలను కన్నీళ్లతో కడిగాడు, "సాగరంలో నీటి బుడగ మరల సాగరంలో కలసి పోవటమే మోక్షమని తెలుసుకున్నాము" తల్లి తండ్రులకు సేవచేయుటయే మానవజన్మ పరమార్ధమని తెలుసుకున్నాను. 
 మావయ్య గారు అత్తయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను రండి, మీకు సేవలు  చేయుటకు మేము సిద్ధముగా ఉన్నాము, రండి తాత గారు, అమ్మొమ్మగారు అని పిలుస్తూ పిల్లలు కన్నీళ్లతో అభిషేకించారు.     


--((**))--        

ప్రాంజలి ప్రభ (కధ ) - ౩ 8  
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
నేను అన్నానని అనుకోవద్దు మీదగ్గర ఉంటే కనీసం ధైర్యంగా ఉండటం కూడా ఉండటం కూడా నేర్చుకోలేడు అన్నాడు

ఏంచేద్దాం కాలమే నిర్ణయింస్తుంది, తండ్రిగా బాధ్యత వహించక అప్పుడు కదా, అది నిజమే అనుకో అయినా ఒక కధ చెపుతా విను        

"ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు. ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.... “ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”. ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.... ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం.... ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను.

చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”

“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు....

ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి... ..."

కధ బాగుంది అరదః మైందా, ఎందుకు అర్ధం కాలేదు, ఆ నీళ్లల్లో తోసింది కన్న తండ్రే అని తెలుస్తున్నది.

నేను చేయమని చెప్పను కొడుకుకి ధైర్యం వస్తే ఏదైనా సాధిస్తాడు అని తెలుస్తున్నది.

నాకొడుకుకు ఎందుకు ధైర్యము లేదు ఇటు రా చూపిస్తా అంటూ మార్కెట్ లోకి వెళ్ళాడు. అందరూ ఎటు పడితే  అటు పరిగెడుతున్నారు అక్కడ ఎం జరుగుతున్నదో ఇద్దరూ దూరంగా నుంచొని చూస్తున్నారు.   
   
ఆ  మార్కెట్లో అనేక షాపులు ఉన్నాయి, ఒక వైపు కూరకాయల షాపులు, ఆకు కూర షాపులు, మరో వైపు పండ్ల షాపులు ఉన్నాయి అక్కడ ఒక మూల ఒక మందుల షాపు ఉన్నది,  అక్కడే గొడవ మొదలైనది. ఒక 16 ఏళ్ళ పడుచుపిల్ల ఒక చీటీ మందులు కొన్నది, తన దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు ఇచ్చింది, చిల్లర లేదు మందుల అక్కడ  పెట్టి పోమ్మా పొద్దున్నే బారం అని  గోనుకుంటున్నాడు,  ఆమె అతన్ని బ్రతిమాలాడు తున్నది,   ఎంత బతిమ లాడినా వప్పు కోవటం లేదు అప్పుడే రామకృష్ణ అక్కడకు చేరి చిల్లర ఇమ్మన్నాడు, ఇవ్వము నీ వెవరవయ్యా నన్ను  అడగ టానికి నీ దారి నీవు చూసుకో అని అరిచాడు, అప్పుడే సరిగా మాట్లాడం నేర్చుకో, నేనొక భారతీయ పౌరుడుగా అడిగే హక్కు ఉన్నది , ముందు చిల్లర తీసి ఆమెకు ఇవ్వు , ఏమిటి బాబు నీకు ఆ అమ్మాయికి ఏమిటి సంభంధం నీ దారి నీవు పోక. ఏమిటి మాటా మారుస్తున్నావు, పేలుతున్నావు అని గట్టిగా అడిగాడు అప్పుడే  పది మంది చుట్టూ మూగారు. 

షాపు వాని తరుఫున కొందరు, రామకృష్ణ తరుఫున కొందరు అక్కడకు  చేరారు, నోటికి వచ్చి నట్లు తలాతోకా లేని సలహాలు ఇస్తున్నారు, అక్కడకు  ఒక టి.వి కి సంభ దించిన వారు వచ్చి ఇది అంతా షూట్ చూస్తున్నారు,  వాళ్లల్లో ఒకతను వచ్చి షాపు వాన్ని  అడిగాడు మీరు మందులు కొనటానికి వచ్చిన వారితో ఏమన్నారు, వారు ఏమన్నారు అంతా  ప్రజలకు వివరించండి అన్నాడు, మాకు ప్రత్యేకంగా ప్రభుత్వమువారు చిల్లర అందించుట లేదు, మేము కుడా బ్యాంకు లైన్ లో  నుంచొని నోట్ల చిల్లర  మార్చుకొని వస్తున్నాము, ఇదిగో చూడండి మాదగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, చాలా మందికి చిల్ల ఇచ్చాము, ఇప్పుడు చిల్లరలేదు అదే విషయం ఆమెకు చెప్పను,   ఇంకా  500, 1000  రూపాయల నోట్లు ఉన్నాయి, ఇవి చెల్లవు నేను ఎట్లా ఇచ్చేది ఆమెకు అన్నాడు. అట్లైతే  ఎట్లాగయ్యా అన్నాడు టి.వి వారు ,  చిల్లర ఇవ్వండి నేను మందులు ఇస్తానని అన్నాడు షాపువాడు,  అక్కడ చేరినవారు ఏ.టి.యం. పనిచేయకుండా ప్రభుత్వము వారు మనల్ని ఇరకాటం పెడుతున్నారు, చిన్న నోట్లు అందించ కుండా పెద్ద నోట్లు రద్దు చేశారు , మాగోడు ఎవరు పట్టించు కుంటారు, యిప్పటికి 5 రోజులు లయ్యింది , మా పరిస్థితి గమనించే వారు లేరు, అప్పుడే పోలీసువారు వచ్చారు వారు గట్టిగా   నోరు చేసుకుంటూ ట్రాఫిక్ ను ఇబ్బందిలో పడేస్తున్నారు తొలగండి తొలగండి అని అరుస్తున్నారు,  అందరూ వెళ్లారు రామకృష్ణ, ఆ వచ్చి న   స్త్రీ ఉన్నారు, అక్కడకు చక్రధర్ తో పాటు శ్రీధర్ కూడా వచ్చారు, ఈ గొడవంతా మన కెందుకురా  మనదారి  పోదాము పదా అన్నారు,  ఆగండి  శ్రీధర్ గారు, మీరు నాకు 300 రూపాయలు ఇస్తున్నారు ఇవ్వండి అన్నాడు, ఆ చూపులకు నోరు పెదపకుండా జేబులో నుంచి నోట్లు ఇచ్చాడు, అవి తీసుకోని మీరు వెళ్ళండి,  నేను వెనుకవస్తాను అన్నాడు,

అప్పుడే వీడు ఈ జన్మలో మారడు చూసావా వాడి ప్రవర్తన నన్ను అడగ కుండా జబర్దస్తీగా మిమ్మల్ని అడిగి తీసుకున్నాడు, మావాడిని క్షమించండి, ఇదుగోనండీ ఈ మూడు వందలు తీసుకోండి చేతిలోపెట్టి ,   పోదాం పదా శ్రీధర్ అని వాళ్ళు కదిలారు. మరి  కూరలు తీసుకోవా అన్నాడు శ్రీధర్,  నా కొడుకు చేసిన గొడవ చూశాక నాకు ఆకలి  చచ్చిపొయింది  పోదాం పదా ,పెరటిలో ఉన్న తోటకూర తో ఈరోజు సరిపెట్టు కుంటా అన్నాడు చక్రధర్, మరి కాఫీ అన్న త్రాగుదామా అన్నాడు, ఏమి వద్దు ఇప్పుడు కాఫీ షాపు వారు 100 రూపాయల చిల్లర లేదంటాడు, అప్పుడు మానపరిస్థితి ఒక్కసారి ఆలోచించుకో అన్నాడు, ఆమ్మో ఆ పప్పు రుబ్బలేను నేను అన్నాడు నవ్వుతూ, అందుకే ఇక పోదామా, పోదాం పదా అని కదిలారు అక్కడ    నుండి. 
       
మందుల షాపు వానికి పైకము ఇచ్చి మందులు ఆమెకు ఇచ్చి  పంపించాడు, , నెమ్మదిగా ఇంటి ముఖం పట్టాడు రామకృష్ణ

ఏమేవ్ ఏమేవ్ వినబడిందా అని కేక వేసాడు చక్రధర్, అత్తయ్యగారు మామయ్యగారు పిలుస్తున్నారు వెళ్ళండి అన్నది పెద్ద కోడలు సుశీల.

వినబడిందమ్మా వెళ్ళలిగదా వెళ్తా ముందు నీవు తిరగమోత మాడకుండా , పాలు పొంగా కుండా చూడు అంటూ బయటకు నడిచింది.

రావద్ద ఏమిటి అంత పెద్దగా అరిచింది ఒక మనిషి రావాలా వద్దా అంటూ చెంబ్బుతో నీళ్ళుఇచ్చింది. ఓక్కరవ్ ఆ పంపుదాకా వచ్చి కడుకుంటే మీ సొమ్మే పోయింది అట్లా అరవటం దేనికి ఎనర్జీ వేష్టు చేసుకోవటం దేనికి అన్నది.

నీకేం నీవు చెపుతావ్ ఇంట్లోకూర్చొని, ఒక్కసారి వీధిలోకి వస్తే తెలుస్తుంది, మీ అబ్బాయి చేసిన ఘనకార్యం అన్నాడు.

మీరు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు నాకు ముందే తెలుసు, మీరు కూర తారని కొడుకుతో కుంటారని ఊహించా, అందుకే పెరటిలో తోటకూర కోసి పప్పు చేసి, సాంబారు పెట్టా  అన్నది.

అవునే నీవు నన్ను  అర్ధం చేసుకున్నట్లు పిల్లలు నన్ను అర్ధం చేసుకోవటం లేదు ఎందుకంటావు, ఆ చిలక  ప్రశ్న అడిగి చెపుతా .... అంటూ లోపలకు నడిచింది.

ఏమిటి అత్తయ్యగారు   మామయ్యగారు ఎమన్నా అన్నారా, ఇది మాకు రోజు ఉన్నది.

చూడమ్మా మనకు ఒక స్వతంత్రము ఉన్నది ఈ మగవారితో ఎట్లా మాట్లాడినా కష్టముగా ఉన్నది అవునండి అత్తయ్యగారు మీ అబ్బాయి కూడా అంతే పిలవంగానే పోకపోతే పిచ్చి కోపం వస్తుంది, సర్దుకు పోక తప్పదు గదా అత్తయ్యగారు. నిజమే కోడలా పిల్లా.

ఇలా వంట చేస్తూ మెగవారి జాడ్యాలను నా అనుభవాలను కలిపి చెపుతా విను.

* మనం ఎప్పుడైనా షాపింగ్ వెల్దామంటే ఏడుపు మొహం పెడతారు, ఎదో మనం  సొమ్మును ఖర్చు చేయిస్తున్నట్లు ఊహిస్తారు, కనీసం ఆనందంగా వెంట నడుస్తూ కూడా ఉండారు.
* మగ వాళ్లకి ఎక్కడకన్నా వెళ్లాలని ఇష్ట మైనదనుకో వెంటనే రెడీ అవ్వమని చెపుతారు, ఓ ఆరగంట  ఆయినదో లేదో "ఇంకా ఎంతసేపు అని విసుక్కోవటం మొదలు పెడతారు, ఇంకా ఈ ఆడవారికి చీర సింగారించు కోవటానికి ఒక గంట సమయము ఇచ్చిన సరిపోదు అంటారు.
* మనం ఏదన్నా టివి సీరియల్ చూస్తున్నా మనుకో, దగ్గరగా వచ్చి ఆ సిరియాల్ చూసి మరెందుకు ఏడుస్తారు, అంటూ రిమోట్ లాకుంటారు ఎంతసేపు న్యూస్, స్పోర్ట్స్, లేదా అర్ధం కాని ఇంగ్లీషు సినిమా ను మార్చి మార్చి చూస్తారు, మనల్ని కూడా చూడమని విసిగించి చం పుతారు.

* మనకు మనస్సు బాగాలేనప్పుడు దగ్గరగా వచ్చి, ప్రేమగా ఒక మాట చెప్పఁటమూ,  తీసుకోవటం చస్తే చేయరు, ఇంకా తిండి తినలేదు ఎదో ఆలోచిస్తారు అనీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతారు.
* ఒక మంచి మాట చెప్పరు పొద్దస్తమానం, ఆకురా అలా చేస్తే బాగుండును కదా, ఆ ప చ్చడి ఎండుమిరపకాయలతో చేస్తే బాగుండేది కదా అని నవ్వు తూ  సతాయిస్తారు. వారు ఇది చేయమని చెప్పరు చేసినదానిని మాత్రం వంక పెడతారు..
* రొమాంటిక్ కధలు చెప్పడం, భార్యను ముద్దుచేయడం కాదనీ  అది భార్యకు లొంగి పోవటమని ఊహిస్తారు, మనం దగ్గర చేరామనుకో   చులకనగా చూస్తారు .
* పురుష అహంకారం  క్వింటాల్లో ఉంటుంది,  చేసిన తప్పు ఒప్పుకోరు, ఒక కోరిక పట్టు పట్టారనుకో నిద్ర పోరు నిద్రపోనీయరు.
* పూలు చీరలు కొనటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు .
ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం ప్రాంజలి ప్రభ -  కన్నవారి కలలు 

ప్రాంజలి ప్రభకు పంపినవారు-౩7
  
సర్వేజన్న సుఖోనోభావంతు 
రాఘవరావు ఒక ప్రవాస భారతీయుడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అమెరికాలో స్థిరపడిన తెలుగు వాడు. చాలా మంది తెలుగు వాళ్ళలానే తనూ హెచ్-1 వీసా ద్వారా అమెరికా వచ్చి, ఆ తరువాత పెళ్ళి చేసుకుని, ఆ తరువాత గ్రీన్ కార్డ్ సంపాదించి, అమెరికాలో తెలుగు వారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న క్యాలిఫోర్నియా రాష్ట్రంలో, భార్యా సమేతంగా సెటిల్ అయ్యాడు. 

రాఘవరావుకి ఇండియాలో గడిపిన రోజుల గురించి, ముఖ్యంగా తన చదువు గురించి, ఉన్న గుర్తులు ఇవి. వీధిలో ఉన్న పిల్లలతో గోళీలు, క్రికెట్టు లాంటి ఆటలు ఆడుకోవడం. సాయంత్రం వీలైతే ఒక గంట చదవడం. ఎవరైనా చుట్టాలొస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళడం, పరీక్షలకు రెండు రోజుల ముందు కాస్త సీరియస్‌గా చదవడం, మార్కులు సరిగ్గా రానప్పుడు నాన్న చేతిలో దెబ్బలు తినడం.

రాఘవరావు వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత దగ్గర ఉన్న టౌన్‌లో ఇంటర్‌మీడియేట్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణుడు కావడం వల్ల హైదరాబాద్‌లోని గవర్నమెంట్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ చదువుకుని, తరువాత కొన్ని రోజులు ఇండియాలో ఉద్యోగం వెలగబెట్టి, ఆ తరువాత అమెరికా చేరుకున్నాడు.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, అప్పటితో పోలిస్తే ఇప్పటి పిల్లల పెంపకం, ముఖ్యంగా ప్రవాస భారతీయుల పిల్లల పెంపకం, ఎంతలా మారిపోయిందో అన్న విషయాన్ని ఎత్తి చూపడానికి.

ఒక శనివారం, ఫ్రెండ్ సుధాకర్ పిలిచాడని, రాఘవరావు తన భార్య రాధతో సహా అతనింటికి చేరుకున్నాడు. సుధాకర్ రాఘవరావు కంటే వయసులో పెద్ద. అతనికి 5, 7 ఏళ్ళ వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇంటికి చేరి కాలింగ్ బెల్ కొట్టగానే సుధాకర్ భార్య స్మిత తలుపు తెరిచింది. “రండి,రండి. మీ కోసమే ఎదురు చూస్తున్నాం. లంచ్ కూడా సిద్ధం,” అని ప్రకటించింది నోరారా నవ్వుతూ.

“మరే, క్యాలిఫోర్నియాకి మూవ్ ఆయాక ఇదే మొదటి సారి మీ ఇంటికి రావడం,” సోఫాలో కూర్చుంటూ అంది రాధ.

“ఇంతకి మా వాడు ఎక్కడ?” అడిగాడు రాఘవరావు భార్య పక్కనే ఆసీనుడవుతూ.

“ఆయన ఇప్పుడే బయటకి వెళ్ళారు, కాసేపట్లో వచ్చేస్తారు,” చెప్పింది స్మిత.

“అదేంటి? మేము వస్తునట్టు వాడికి తెలీదా?” కాస్త నొచ్చుకున్నాడు రాఘవరావు.

“మీరు అపార్థం చేసుకోకండి. ఆయన అర్చక్‌ని కుమ్మోన్ క్లాసులో దింపడానికి వెళ్ళారు. క్లాస్ కాగానే వచ్చేస్తారు,” వివరణ ఇచ్చుకుంది స్మిత.

ఒక్క క్షణం ఆవిడ వాడిన పదాలు అర్థం కాలేదు రాఘవరావుకి. తరువాత వెలిగింది అతనికి, అర్చక్ సుధాకర్ స్మితల ఏడేళ్ళ అబ్బాయి. వినూత్నంగా ఉండాలని సుధాకర్ దంపతులు తమ కొడుకుకి ఆ పేరు పెట్టుకున్నారు.

“ఈ కుమ్మోన్ ఏంటండి?” సంభాషణలో తను కూడా పాలు పంచుకుంది రాధ.

“లెక్ఖలు నేర్పిస్తారు,” చెప్పింది స్మిత.

“అంటే అర్చక్ వెళ్ళే స్కూల్‌లో ఆ సబ్జెక్ట్ లేదా?” అయోమయంగా అడిగింది రాధ.

కిసుక్కున నవ్వింది స్మిత. “మీరు మరీ చోద్యం రాధా గారూ, వాళ్ళ స్కూల్‌లో కూడా చెప్తారు. ఐతే కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరం. కుమ్మోన్ వాళ్ళైతే అడ్వాన్సుడ్ మ్యాత్ ఒక లెవెల్‌లో కుమ్మేస్తారు, అందుకే అనుకుంటా కుమ్మోన్ అని పేరు. పైగా మేమొకరమే కాదు, వాడి స్కూల్‌లో ఉన్న మిగతా ఇండియన్ పిల్లలు అంతా కూడా కుమ్మోన్‌కి వెళ్తారు,” కాస్త గర్వంగా చెప్పింది స్మిత.

“కానీ మీ అబ్బాయి వెళ్ళే స్కూల్ బే ఏరియాలోనే పేరు పొందిన స్కూల్ అట కద? ఎక్స్‌ట్రా కోచింగ్ అవసరమా?” అంత తొందరగా ఆ టాపిక్ వదల దల్చుకోలేదు రాధ.

“ఇక్కడ సమస్య అది కాదండి, మిగతా ఇండియన్ పిల్లలు వెళ్తూంటే మనం పంపకపోతే వెనక పడిపోతాం. ఈ కాంపిటీషన్ తట్టుకోలేం,” అంది స్మిత.

“మీ వాడికి ఏడేళ్ళే కద. అప్పుడే కాంపిటీషన్ ఏంటండి? ఈ వయసులో నేనేం చదువుకున్ననో కూడా నాకు గుర్తు లేదు,” ఉండబట్టలేక అన్నాడు రాఘవరావు.

“మన కాలం వేరు రాఘవరావు గారూ, ఇప్పుడు లోకమంతా మారిపోయింది. ఈ కాలంలో తప్పదు. అయినా నా చిన్నప్పుడు నాకెన్నో కోరికలు ఉండేవి. అప్పట్లో కాస్త స్థోమత లేక, కాస్త అవకాశాలు లేక నా కలలను సాకారం చేసుకోలేక పోయాను. నా పిల్లలకు మాత్రం అలాంటి పరిస్థితి రానివ్వను. ఐనా మీకు పిల్లలు పుట్టాక తెలిసొస్తుంది లెండి,” నవ్వుతూ అంది స్మిత.

అంతలో, అర్చక్‌తో పాటు ఇంట్లోకి ప్రవేశించాడు సుధాకర్. “ఏరా రాఘవ్ ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు రాధ గారు?” అంటూ.

“బాగున్నాంరా, ఇప్పుడే మీ వాడి క్లాస్ గురించే మాట్లాడుకుంటున్నాం,” సుధాకర్‌తో కరచాలనం చేస్తూ అన్నాడు రాఘవరావు.

“అంకుల్‌కి చేత వెన్న ముద్ద పద్యం చెప్పి వినిపించమ్మా,” ఆర్డర్ వేసింది స్మిత. ఇంకో సారి అడిగించుకోకుండా, టక టక పద్యం చదివేశాడు అర్చక్.

“భలే చదివావు. దీని అర్థం తెలుసా?” అడిగాడు రాఘవరావు. అర్చక్ బిక్కమొహం వేశాడు.

“వాడికి తెలుగు సరిగ్గా మాట్లాడ్డమే రాదురా, ఇంక అర్థమేం చెప్తాడు,” నవ్వాడు సుధాకర్.

“వాడి వయసు తెలుగు పిల్లలు అందరూ చెరో పదేసి పద్యాలు అప్ప చెప్తారు రాఘవ రావు గారు. వీడు వెనక పడిపోకూడదు, పైగా మన సంస్కృతి తెలియాలి, అని మేము కూడా నేర్పిస్తున్నాం. అర్థం తరువాత తెలుసుకుంటాడు లెండి,” చెప్పింది స్మిత. రాఘవరావు అప్రయత్నంగా బుర్ర గోక్కున్నాడు.

అప్పటిదాక తన రూంలో ఉన్నట్టుంది, అప్పుడే బయటకి వచ్చింది అర్చక్ చెల్లెలు కుహూ. వెరైటీగా ఉండాలని తనకి ఆ పేరు పెట్టారట, ఒకసారి సుధాకరే చెప్పాడు రాఘవరావుకి.

“ఇంకా తయారు కాలేదా! స్విమ్మింగ్ క్లాస్‌కి టైం అయ్యింది, పద పద,” ఖంగారు పడ్డాడు సుధాకర్.

“ఏంటి, నువ్వు మళ్ళీ బయటకి వెళ్తున్నావా?” ఆందోళనగా అన్నాడు రాఘవరావు.

“లేదురా, ఈ సారి స్మిత వంతు. నేను ఇంట్లోనే ఉండిపోతా,” చెప్పాడు సుధాకర్.

స్మిత, “పద కుహూ, నిన్ను తయారు చేస్తాను,” అంది.

“ఊహూ, నేను రాను,” మారాం చేసింది కుహూ.

“కుహూ, చెప్తే వినాలి.”

“ఊహూ, నేను ఇంట్లోనే ఆడుకుంటాను.”

“అక్కడ నీ ఫ్రెండ్స్ అంతా వస్తారమ్మ. నువ్వే మిస్ అవుతావు,” నచ్చ చెప్తూ అంది స్మిత.

“ఆ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఆహా ఓహో అనే పేర్లు ఉన్నాయా?” ఆసక్తిగా అడిగంది రాధ.

“అబ్బే! అవేం పేర్లండి? కుహూ అంటే కోయిల కూత. కాబట్టి ఈ పేరులో ఎంతో భావుకత్వం ఉంది,” ఎక్స్‌ప్లెయిన్ చేసింది స్మిత.

కాసేపట్లో స్మిత కుహూని తీసుకుని నిష్క్రమించింది. సుధాకర్, రాఘవరావు కబుర్లలో పడ్డారు. రాధ దిక్కులు చూస్తూ కూర్చుంది. అర్చక్ ఏదో తింటున్నాడు.

కాసేపయ్యాక అసహనంగా గడియారం వైపు చూశాడు సుధాకర్.

“ఏమయ్యిందిరా?” ప్రశ్నించాడు రాఘవరావు.

“స్మిత ఇంకా రాలేదేంటా అని. తను రాగానే నేను అర్చక్‌ని తీసుకుని కరాటే క్లాస్‌కి వెళ్ళాలి.”

“మళ్ళీ బయటకి వెళ్తావా, ఐనా నువ్వు కరాటే నేర్చుకుంటే, వాడెందుకు మధ్యలో?”

“హ హ హ. కరాటే నేర్చుకునేది వాడే. నాది కేవలం డ్రైవర్ ఉద్యోగం. వాడికి కరాటే ఎందుకు నేర్పిస్తున్నామంటే…”

“మిగతా పిల్లలు అంతా నేర్చుకుంటున్నారు. మీ వాడు వెనక పడిపోకూడదని,” ముక్త కంఠంతో సమాధానం ఇచ్చారు రాఘవరావు, రాధ.

“కరెక్ట్! మీరు బాగా క్యాచ్ చేశారు. అదిగో స్మిత వచ్చింది. నేను బయలుదేరుతున్నా,” హడావుడిగా అర్చక్‌ని తీసుకుని బయట పడ్డాడు సుధాకర్.

కాసేపయ్యాక సుధాకర్ అర్చక్‌తో తిరిగి రాగానే, స్మిత కుహూని తీసుకుని పియానో క్లాస్‌కి వెళ్ళిపోయింది. అలా సాయంత్రం అయ్యేప్పటికి, అర్చక్,కుహూ, చెరి ఆరు క్లాసులకి వెళ్ళొచ్చారు.

దాదాపు సాయంత్రం ఏడయ్యాక, ఫైనల్‌గా సుధాకర్ స్మిత, ఇంట్లోనే సెటిల్ అయ్యారు.

“ఏరా! ఇంక క్లాసులేమీ లేవా?” నీరసంగా అడిగాడు రాఘవరావు.

“ఈ రోజుకింతేరా, నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం అర్చక్ గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఇంకో క్లాస్ ఎక్కువవుతుంది,” సమాధానమిచ్చాడు సుధాకర్.

“ఇక మేం వెళ్ళొస్తాంరా,” లేచి నిలబడ్డాడు రాఘవరావు.

“అప్పుడే వెళ్ళిపోతారా! ఏంటో అసలు మీతో సరిగ్గా మాట్లాడినట్టే లేదు,” బాధ పడ్డాడు సుధాకర్.

“మరే, ఎప్పుడన్నా మీ పిల్లలకి ఏ క్లాసులు లేని రోజు, ఇంకోసారి వస్తాంలే,” అన్నాడు రాఘవరావు.

“ఆ రోజు రావాలంటే, నువ్వింకో పదిహేనేళ్ళు వెయిట్ చెయ్యాలిరా,” బిగ్గరగా నవ్వాడు సుధాకర్. స్మిత కూడా అతనితో జత కలిపింది.

వింజమూరు వెంకట అప్పరవుగారికి ధన్యవాదములు

--((**))--

ప్రాంజలి ప్రభకు పంపినవారు-౩6   

కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!! 
"పొద్దున్నే ఈ వెధవ ట్యూషన్ కనిపెట్టినవాడిని చంపెయ్యాలి!", అని ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను. అప్పుడు నా వయస్సు ఆరేడేళ్ళు వుంటాయ్ అనుకుంటా. ఇంటి పక్కనే, మా స్కూలు పంతులమ్మ ఒకావిడ పాఠాలు చెప్పేవారు. చాలా మంచావిడ. కాకపొతే కొంచెం ఆలస్యం ఐనా, మార్కులు తక్కువ వచ్చినా చంపేస్తారు. పొద్దున్నే అమ్మ ఎలాగో తన్ని నిద్ర లేపి పంపిస్తుంది, మళ్ళీ తన్నులు  అంటేనే కొంచెం బాధ. అది కూడా అమ్మాయిల ముందు! ఛీ.. ఛీ.. పరువు పోతుంది. 'ఏదో చిన్నపిల్లోడు, ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు?', అని వదిలెయ్యొచ్చుగా! బాగా తంతారు, దానికి తోడు మిగతా పిల్ల రాక్షసులు పొద్దున్నే తగలెడతారు. వాళ్ళతో పోలిక ఒకటి. బతుకు నరకం అయిపోయింది. తొందరగా పెద్దోళ్ళం అయిపోతే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది. 'ఇలా వారం అంతా గడిచిపోతుంది. పొద్దున్నే లేవటం, ట్యూషన్ కి వెళ్ళటం! అక్కడినుండి రాగానే స్కూలు! ఛీ! వెధవ బ్రతుకు ఎన్నాళ్ళు చదవాలో ఏంటో!', అనుకుంటుంటే వారాంతం వచ్చేది. వుండేది ఒక్క రోజు, కనీసం ఆ రోజు ఆడుకుందాం అంటే వచ్చే వారం నుంచి ఆ వేళ కూడా ట్యూషన్ పెడుతున్నారు. అర్థవార్షిక పరీక్షలు వస్తున్నాయి కదా! లాభం లేదు ఏదో ఒకటి చేసి ఆ వేళ ట్యూషన్ ఎగ్గొట్టాలి అని నిర్ణయించుకున్నా! పైగా ఆ వేళ లవుకాంత్ (నా స్నేహితుడు, వాళ్ళ అమ్మానాన్నల్ది ప్రేమపెళ్ళి గుర్తుగా వాడికి ఆ పేరు పెట్టారు) వాళ్ళతో మ్యాచ్ (కోతికొమ్మచ్చి) ఉంది. పోయినవారం మమ్మల్ని ఓడించి పెద్ద పోసు కొట్టాడు, వెధవ. ఈ వారం వాళ్ళకి చుక్కలు చూపించాలి అనుకున్నానే! ఇప్పుడేమో ఈ ట్యూషన్. ఆ విషయం వాడికి చెప్తే భయపడి, తప్పించుకోవటానికి ఇలా చెప్తున్నాను అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే వారం అంతా అయిపోయింది. వస్తుంది వస్తుంది అనుకుంటున్న ఆదివారం రానే వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ వేళ పొద్దున్నే ట్యూషన్. "హిప్ హిప్ హుర్రే!", అనుకుంటూ ఎగిరి గంతేసాను. మొత్తానికి ట్యూషన్ మానటానికి అనవసరంగా అబద్దాలు చెప్పక్కర్లేదు అనుకుంటూ ఆనందంగా ఉదయాన్నే లేచి ట్యూషన్ కి బయల్దేరాను. 
ట్యూషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం సరిపోయింది. చదువు-సంద్యా లేకుండా అలా అలా సమయం గడిపేశాను. మొత్తానికి ట్యూషన్ అయిపోయింది. ఇంక సంచి బుజాలకెత్తుకొని పరిగెత్తి పరిగెత్తి ఇంటికొచ్చాను. ఏదో రెండు మెతుకులు మెక్కి మ్యాచ్ ఆడటానికి పరిగెత్తాను. ఆడాం.. మళ్ళీ ఓడాం . ఉసూరుమంటూ ఇంటికి వస్తే నా ఖర్మ కొద్దీ రోజూ ఆలస్యంగా వచ్చే నాన్నగారు ఆ వేళ తొందరగా వచ్చారు. "ఎక్కడికి వెళ్ళావు రా ఇంట్లో చెప్పకుండా? నీకు అసలు భయం లేకుండా పోతుంది", అంటూ అప్పుడే కొట్టేసిన సరుకు చెట్టు పుల్లతో ఒళ్ళంతా వాయగొట్టారు. అసలే మ్యాచ్ ఓడిపోయి వస్తే ఇంట్లో కూడా వళ్ళు హూనం అయిపోయింది. అదే మొదటిసారి నాన్నగారు నన్ను కొట్టడం!! ఆ రోజంతా దెబ్బలు బాగా నొప్పిపెట్టాయి. ఇంకా జన్మలో మళ్ళీ కోతికొమ్మచ్చి ఆడకూడదు అని తీర్మానం చేసుకున్నా. 
మళ్ళీ వారం అంతా స్కూలు, ఇల్లు, ట్యూషన్, చదువులతో సరిపోయింది. అన్నట్టు చెప్పడం మరిచాను మళ్ళీ ఆదివారం కోతికొమ్మచ్చి మ్యాచ్ ఆడాం. గెలిచాం కూడా. ఈ సారి నాన్నగారికి దొరకలేదు లేండి!! 

కృతజ్ఞతలు:-బ్లాగ్ తెలుగువారమండీ(దీలిప్.)
--((**))--


ప్రాంజలి ప్రభ " ఓట్ల రాజకీయం"
ఒక చిన్న కధ ౩5  

విమర్శలు, ప్రతి విమర్శలు ఓట్లకోసం నాయకులు ఉపన్యాసాలు పెచ్చు పెరుగుతాయి. మనకందరికి ఓర్పు ఉన్నది. త్యాగాలు చేసేవారు, అభివృధ్ధి పరిచేవారు ఎవరో తెలుసుకొని ఓట్లు వేయండి

కులాలు కూడు పెట్టవు, కష్టపడితే నే ఫలితం ఉంటుందని దైవమే తెలియ పరిచాడు. క్షణిక సుఖానికి లొంగి ఓట్లు వేయటం అవసరమా, నిజాయితీగా నమ్మిన వానికి ఓటు వేయటమో నిర్ణయం చేసుకొనే శక్తి మనకన్నది. ఓటు విలువ గుర్తించి ఓటు వేయండి.

ఈ ఒక్కసారి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. కరంటు తీగ పట్టు కోమంటే పట్టు కుంటారా, విషం త్రాగ మంటే త్రాగుతారా. మానవ జన్మకు ఆలోచించే జ్ణానాన్ని దైవం కల్పించింది. కనుక ఎవరికి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి చెందునో తెలుసుకొని ఓటు వేయండి

కొందరి మాటలు ప్రజలను భయ భ్రాంతులు చేస్తున్నాయి, వాటిలో నిజా నిజాలు తెలుసుకొని ఓట్లు వేయుటకు ముందుకు రండి.

అడిగిన వెంటనే మన సమస్యకు పరిష్కారం చెప్పి, రాజకీయ పరంగా ఆదు కుంటారు అని తెలుసుకొని వారికే ఓటు వేసి గెలిపించండి

కొందరు పార్టీ కొమ్ము కాసి ప్రచారం చేస్తారు, ఎదుటి వారిని దూషిస్తే ఓట్లు పడతాయని తిట్ల పురాణం చేపట్టారు, అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసు కోవాలి, టాక్స్ ఎగొట్టేందుకు, చేసిన తప్పులు బయఁట పడకుండా ఉండేందుకు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. మమ్మల్ని గెలిపిస్తే స్వర్గాన్ని చూపిస్తామంటారు. నేను ఒకటే చెప్పేది ఓటును దుర్వినియోగం చేయక ఓటు వెయ్యండి, మన ఓటు వేరొకరు వేయకుండా ముందుగా వచ్చి ఓటు వెయ్యండి.             


*నోట్ల మార్పిడి-తెచ్చిన తంటా (పాత  కధ ) 34 
రచాయ: మల్లాప్రగడ రామకృష్ణ 

ఏమండి టి.వీ.  చూసారా,, ఏముంది దానిలో అసభ్యకరమైన నృత్యాలు, అర్ధం కాని పాటలు ,  నాయకుల వాదోప వాదాలు, దెయ్యపు కథలు, అర్ధరాత్రి హత్యలు, ప్రభుత్వము వారు ప్రజలకొరకు ఇవి చేస్తున్నారు ఇన్ని కోట్లు ఖర్చు, అది చేస్తున్నందుకు అన్ని కోట్లు ఖర్చులు అని వినటం, లేదా ప్రేమికులు హత్యలు, చూసిన సినిమా చూడటం తప్ప ఏమున్నదే దానిలో.


మీ కదే తెలుసు 500 రూపాయల నోట్లు, 1000  రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారు తెలుసా

అయినా మన దగ్గర ఏమున్నాయి, ఏదన్న అవసరం అనుకునే  ఏ .టి  ఎం  కు పోయి డబ్బులు తెచ్చుకుంటున్నాము కదా
.
ఈ రోజు ముందు ఈ ముడుపులో దాచిన నోట్లు మన డిపాజిట్ లో వేసి రండి.

మన కవసరమయితే ఎట్లాగే, పనికిరాని నోట్లు ఇంట్లో పెట్టుకుంటే ఎం లాభం ముందు  బ్యాన్కు లో వేసి రండి అన్నది శ్రీమతి సుభద్ర.

సరేనే ఆగొడుగు, కళ్ళజోడు, ఆ కర్ర, ఇటు ఇవ్వు నెమ్మదిగా పోయి నీ      ఎకౌంట్లో జమా చేసి   వస్తాను, నాకు ఆలస్యమైనదని గాబరా పడకు, అక్కడ ఎంత మంది ఉన్నారో తెలియదుకదా అన్నాడు అర్జున్ రావు .

మీరు ఆఁలా అంటారని నాకు తెలుసు ఇదిగో ఈ సెల్లు దగ్గర పెట్టుకోండి, అక్కడ ఆలస్యమైతే నాకు ఫోన్ చేయండి.

నెమ్మదిగా బ్యాన్కువద్దకు చేరాడు అర్జున్ రావుగారు, అక్కడ ఒక పెద్ద క్యూ ఉన్నది దాని దాటుకుంటూ లోపలకు పో బోయాడు, అక్కడ వున్నవారు ఒక్కసారి దాడి చేసి నట్లు ముసలి వారని కూడా గమనించకుండా మేము పొద్దున్న వచ్చాము, మీరు ఇప్పుడొచ్చి ముందుకు పోతారా అని ఒకటే అరుపులు గత్యంతరం లేక లైన్లో నుంచొని ఉన్నాడు, పైన ఎండగా ఉన్నదని గొడుగు తీస్తే పక్కవాడు పొడుచు కుంటున్నాదని పోట్లాడాడు, కనీసము మంచి నీళ్లు కూడా ఏర్పాడు చేయలేదు బ్యాన్కువారు, అతి కష్టం మీద మూడు గంటలు నుంచొని బ్యాన్కు లో డిపాజిట్ చేసి వచ్చాడు అర్జున్ రావు.

ఏమండి ఉప్పు లేదు కొనుక్కు రండి అని ఇంట్లో ఉన్న చిల్లరంతా సేకరించి ఎక్కువరేటుతో ఉప్పు ప్యాకెట్టు కొనుక్కొని తెచ్చాడు.

ఏమండి మందులు అయిపోయినాయి ఏ.టి.ఎం వద్దకు పోయి డబ్బులు తెండి అన్నది సుభద్ర.

ఎం తెచ్చేది వాగులో మట్టి తేవచ్చు అసలు ఏ.ట్.ఎం.లో డబ్బులు పెడితేనే కదా, మరి ఎట్లాగండి నాకు చాలా కష్టముగా ఉన్నది, ప్రాణం పోయేటట్లు ఉన్నది.

నీవు భాద పడకు మందులు షాపు వాన్నీ బాకీ అడుగుతాను అని వెళ్ళాడు మందుల షాపువద్దకు

ఏమండి పెద్ద వారు, మీరు అప్పు అడగటం ఏమిటి,  ఎం చెప్పమంటావు బాబు ప్రభుత్వం వారు నోట్లు రద్దు చేసారు, ఏ.ట్.ఎం లో డబ్బు లేకుండా చేశారు, నీకు తెలుసు కదా అందుకని వచ్చాను అని నెమ్మదిగా చెప్పాడు. అదిగో ఆబోర్డు చూడండి దాని బట్టి మీరు ప్రవర్తించండి అని చెప్పగా  అటు చూడగా దానిపై 'అప్పు రేపు' అని ఉన్నది.

అప్పుడే అర్జునరావు స్నేహితుడు సుబ్బారావు కని పించాడు, వీరిద్దరి మాటలు విని వెంటనే ఆఁ చీటీలో ఉన్న మందులు ఒక్కొక్కటి చొప్పున, అన్నీ ఎంతవు తుందో చెప్పు నేను ఇస్తాను అని తీసి కొంత పైకము ఇచ్చాడు సుబ్బారావు.

ఒక పూటకు మాత్రలు తీసుకోని అర్జున్ రావు సుబ్బారావుతో మీరు చాలా తెలివి గలవారను కుంటా ముందు జాగర్తగా 100  రూపాయలు నోట్లు ఉంచుకొని ఉనట్లున్నారు.

మీరు అమాయకులు లాగున్నారు, భాద పడుతున్నారుగా, అవును సుబ్బారావ్ నీ దగ్గర డబ్బులెట్లా వచ్చాయి, ఏమీ లేదు అర్జున్ రావుగారు నాకు ఒక మెసేజ్ వచ్చింది మీ డబ్బుకు 100  నోట్లు ఇవ్వ బడును, కొంత కమిషన్లతో అని ఉన్నది.  మంచిదని అక్కడకు పోయాను వారి కమిషన్ ఇచ్చి నోట్లు తెచ్చుకున్నాను.

మరి మీరు బ్యాన్కులో వేయలేదా ఎందుకు వేస్తామండి, అక్కడకు  పోయి ప్రాణ్ కార్డు చూపి మరి వెయ్యాలి మా కెందు కండి అంత కష్టం అని నిర్మొహ మాటంగా చెప్పాడు, అర్జున్ రావు ఏంచేయాలో తోచక రెండో పూటకు మందులెట్లా అని ఆలోచిస్తూ సుబ్బారావును అప్పు అడుగు దామని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా నాకు కొంత డబ్బు కావాలి అప్పుగా మాత్రమే అన్నాడు

అయ్యో మీరు అట్లా అడగాలండి ఒక్క మూడు రోజులు లాగండి ఏ.ట్.ఎం లు పని చే స్తాయి డబ్బు తీసుకోని ఇస్తాను ఇంతకీ మీకు ఎంత కావాలి అన్నాడు.

ఇపుడు ఎంత ఇవ్వగలవో చెప్పు అన్నాడు అర్జున్ రావు సుబ్బారావుతో అంత కోపము వద్దు అర్జన్ రావు ఇప్పుడు నేను ఇవ్వనంటే మన స్నేహం చెడి పోతుందని అనవద్దు, నీ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేను, మా హెడ్ ను కనుక్కొని రేపు చెప్పగలను సరే నీ మాటకు నేను ఏమి చెప్పగలను నీకు ఒక నమస్కారము తప్పా.

          అప్పుడే   తెలిసింది బ్యాంకులో డబ్బు తీసుకొనుటకు వీలు కల్పించారు  విషయం తెలుసుకొని అతికష్టం మీద ఇంటి దగ్గరగా ఉన్న s.b.h   బ్యాన్క్ లో లైన్ లో నుంచొని వెళ్లగా మాదగ్గర మీ ఎకౌంట్ లేదు, మీ చెక్కు ఇక్కడ మార్చుటకు కుదరలేదు అన్నారు , చేసేది లేక మరలా  SBH ఎకౌంట్ ఉన్న చోటునే వెళ్లి లైన్లో నుంచొనగా, 20, 2000 రూపాయల నోట్లతో బయటకు రాగలిగాడు అర్జునరావు.

మొత్తం మీద మందులు కొనుక్కొని ఇంటికి చేరాడు, అప్పుడే సు బ్బారావు వచ్చి ఇదిగో నీవు అడిగావు కదా డబ్బులు తెచ్చా 3 రూపాయల వడ్డీ అవుతుంది నీకు ఇష్టమైతే తీసుకో అన్నాడు . వెంటనే అర్జున్ రావు ఇప్పుడు అవసరము లేదు, అవసరమయితే నీ దగ్గరకే వస్తా అని చెప్పి పంపించాడు .

 ఇదేమి లోకమో బలహీనులను   బలవంతులు   దోచుకుంటారు, బలవంతులను తెలివిగలవాళ్ళు దోచు కుంటారు, తెలివి గలవాళ్ళు ఆశకు పోయి ఉన్నది పోగొట్టు కుంటారు, మధ్య తెలివిగలవాడు ప్రభుత్వాన్ని దోచుకుంటారు, టాక్స్ కట్టకుండా తిరిగినా ఏమి చేయ లేరు, ఇతరదేశాల పారిపోయినా ఏమిచేయలేరు, నోట్లు మారుస్తున్నారు ఐ .టి  కట్టని వారిని  ఎవరు పట్టు కుంటారు, ఏది ఏమైనా కొత్తనోట్లు రావటం సూచకం, ప్రజలు భాద పడకుండా ఏ.టి.ఎం. లో  కూడా డబ్బు పెట్టుట ఇంకా శుభసూచకం.

--((**))--

చిన్న కధ (32 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏమిట్రా ప్రవీణ్ రోజు మాదిరిగా ఈ రోజు ఉషారు లేవేమిటిరా 
లేకే ఎప్పటి లాగానే ఉన్నాను గా 
కాదు ఎదో నీలో మార్పు ఉన్నది  
నాలో మార్పు వచ్చిందని ఎలా కనుక్కొన్నావ్ 
అదేరా స్నేహం అంటే
ఆర్నెల్లు నీతో సహవాసం చేసానుగా నీ లక్షణాలు నాకు తెలియదా 
ఎందుకోరా ఈరోజు నామనసు ఏటో లాగుతున్నది 
పెళ్లి చూపులకేమన్నా పొయ్యావా ఏమిటి
నా మొహానికి అదికూడానా 
మరి ఏమిటిరా 
అదేరా మన ఇంటి సందు చివరా ఉన్న ఇంట్లో 
ఆ ఉన్నఇంట్లో   
ఒక అమ్మాయి నవ్వుతుంటే చూసానురా 
ఆ ఇంట్లో దూరావా "ఎయిడ్స్" వేరే తెచ్చుకోవక్కర్లా
నీ కెట్లా తెలుసురా
అదో పెద్ద కధలే
ముందు నీ విషయం చెప్పు 
గులాబీ అందం చూసావా 
చూసాను 
మల్లె పువ్వు అందం చూసావా 
చూసాను 
పువ్వుకు అందం కన్నా సువాసన బాగుంటే ప్రతి ఒక్కరి మనస్సు పులకరిస్తుంది 
అదేరా నేను చెప్పా బొయ్యేది

పదహారేళ్ళ పడచు నవ్వింది 
ఆ నవ్వితే 
ఆనవ్వుకు మనస్సు చలించింది రా
ఆ ఆమ్మాయి ప్రేమతో నవ్విందను కుంటున్నావా
మరింకేమిటిరా 
ఆ రకం అనుకోవచ్చుగా 
అలాంటిది కాదురా        
ఆ నవ్వులో అర్ధం నీకు తెలియదురా 
అబ్బో నీకేం తెలుసో చెప్పు " నవ్వింది

 మల్లెపూవంటి
ఆ పూబోణీ నవ్వింది
గులాబీ అందాన్ని మించి
సన్నజాజి సుమగంధం మించి
నందనవనంలోని పువ్వులను మించి
తొలకరి చిరు చినుకుల ఆహ్లాదాన్ని మించి
కొండపైనుండి జాలువారే జలపాతాన్ని మించి
నిండు పున్నమి చంద్రిక విరిసే వెన్నెలను మించి
నీలి మబ్బులు చీల్చుకుని మెరిసే మెరుపుని మించి  
ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల సోయగాన్ని మించి 
మనసును మురిపించి మైమరపించేలా నవ్వింది." ఇంతకీ నీవేమనుకుంటున్నావు 

చదువు మానేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా 
అబ్బో అంతదాకా వచ్చిందా 
దాని నిజరూపం ఏమిటో తెలుసా 
నా కవసరం లేదు 
మరి నీకు ఇంకేం కావాలి 
ఆ నవ్వు ఒక్కటి చాలు ఈ హృదయంలో పదిలంగా దాచు కుంటా
కొందరి బలహీనత మరికొందరికి ఆయుధం 
ఇలాంటి వారిని కాలమే మార్చాలి 
--((**))--

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి