29, ఆగస్టు 2017, మంగళవారం

విద్యా వాణి


 ఓం
ప్రాంజలి ప్రభ

శ్రీ మహాగణాధిపతయే నమ:
నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము 
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా

కృష్ణా నీవే నా తల్లివి, తండ్రివి, హితుడవు, నీడవలే వెన్నంటి ఉండే. వాడివి. గురువు, 
దైవం, అయిన వాడవు నా ప్రభువు నాకు ఆధారుడవు, నీవే అని నిజంగా నమ్మాను.1. శ్లో: వాగీశాద్యా: సుమనస: సర్వార్ధానా ముపక్రమే !
     యం నత్వా కృతకృత్యాస్స్యు: తం నమామి గజాననం!!

తా: బ్రహ్మ మొదలైన దేవతలు ఏ దేవునికి మొదట నమస్కరించి, తమతమ పనులయందు కార్యసిద్ధికలవారై నారో అట్టి మహిమకల విఘేనశ్వరునికి నేను మొట్టమొదట నమ
 స్కరించెదను.

2. క// ధరణీ దిశ ప్రసారిత ;

గురుకర నికరంబు లుడిచికొని దీర్ఘనిరం ;//

తరగతి ఖిన్నుడ పోలెను;

హరిదశ్వుడు విశ్రమించె నస్తాద్రిదరిన్దీర్ఘనిరం తరగతిన్= ఎడతెగని నడక చేత //
ఖిన్నము =భేదము నొందినది //

ఖిన్నుడ పోలెను= అలసెనో అనునట్లు//

కరము =కిరణము ,చెయివిరామము లేని సుదీర్ఘ గతిచేత అలిసెనో యనునట్లు ; సూర్యుడు భూమిపై చాపిన స్వీయ కిరణములనే చేతులను 

అస్తగిరిగుహ లోకి ముడుచుకొని విశ్రమించాడు .


అందమైన ఉత్ప్రేక్షలంకారము3. యదాచిత్తం తథావాచ: యథా వాచ: తథా క్రియా:!
చిత్తే వాచి క్రియా యాం చ మహతాం ఏక రూపతా!!

మనస్సులో ఉన్న భావాన్ని చెపుతారు, వారు చెప్పినట్లు చేసి చూపుతారు, అనగా " మనస్సు, మాట, పని," ఈ  మూ డింటి యందును సమాన భావమును చూపునాదే త్రికరణ శుద్ధి అంటారు. (ప్రతిఒక్కరు అదేవిధముగా ఉండుటకు ప్రయత్నిమ్చాలి ) అట్టి వారినే మహాత్ములంటారు. లోకశ్రేయస్సే ధ్యేయంగా ఉంటారు.

4. నాస్తి విద్యాసమం చక్షు: నాస్తి సత్య సమం తప:!
నాస్తి రాగసమం దు:ఖం, నాస్తి త్యాగసమం సుఖం!!

విద్యతో సమానమైన నేత్రము లేదు, ఇట్లే సత్య వాక్కుతో సమానమైన తపస్సు కాని, భౌతిక ప్రేమతో సమానమైన దుఃఖము కాని, కర్మఫలత్యాగముతో సమానమైన సుఖఃముకాని లేదు.    


5. విభూషణం శీలసమంచ నాణ్యత్

సంతోష తుల్యధనమస్తి నాణ్యత్


భావం : మానవులకు ఉత్తమ శీలంతో సమానమైన మరో ఆభారణం 

కాని, సంతోషంతో సమానమయిన మరొక ధనము కాని జగత్తులో 

లేదు. 

6. యోవనం ధనసంపత్తి: పభుత్వమవివేకితా !


ఏకై కమప్యనర్ధాయ, కిముయత్ర చతుష్టయం!!
భావం: మానవుడు కన్నుమిన్ను గానని నడియవ్వనములో 

నుండుట, అప్పుడు ధనసంపదకల్గుట, అట్టి సంపద సమయంలో 

ఉన్నతో ద్యోగం లబించుట, ఈ మూడింటికి తోడుగా అట్టివానికి 

అవివేకం అ బ్బును అనే ఈ నాలుగు సన్నివేశాలలో మానవునకు ఏ 

ఒక్కటి ఉన్ననూ అది అతనినిఅనర్ధములలో  పడవేయును, పైని చెప్పిన నాల్గును కలసి ఉన్నవాడు 

మూర్ఖాటి మూర్ఖుడై పతితుడై పోవును.  


ప్రాంజలి ప్రభ: 8 (శ్లోకం) 


వికృతం, నైవ గచ్ఛంతి, సంగదోషేణ సాధన:!

అవేష్టితం మహాసర్పే: చందనం న విషాయతే !!


తా:: సత్పురుషులు (సజ్జనులు) చెడ్డ వస్తువలులతో తమకు 

సంబంధం ఉన్నాను ఆ వస్తువుల చెడ్డ తనం మంచి వారిలో ఏవిధమైన  
మార్పు ను లేక వికారములు కలిగించ జాలదు. ఎట్లనగా 

మంచిగంధపు చెట్టును విషముగల సర్పములు చుట్టుకొని ఉండును. 

ఐనను వాటి విషము ఆ గంధపు చెట్టుకు ఎట్టి  మార్పును కలిగించ 

లేదు. 
తెలుగు భాష దినోత్సవము సందర్భముగా అందిరికి శుభాకాంక్షలు 

"తెలుగులో మాట్లాడండి - తెలుగును బ్రతికించండి "

ప్రాంజలి ప్రభ- 9 
సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ బ్రుయాత్ సత్య మ ప్రియం!

ప్రియం చ నా వృతం బ్రుయాత్ ఏషధర్మ స్సనాతప:!!
తా: సత్యమునే పలుకవలెను.  ఆ సత్యము వినువానికి ప్రియముగా 

ఉండవలెను. అప్రియమైన సత్యమునుగాని, ప్రియంగా వున్న 

అసత్యమునుగాని పలుక రాదు. ఇది సనాతనమైన, అనగా ఎప్పుడూ 

మార్పు చెందని ధర్మము అని మనుస్మృతి చెప్పుచున్నది.


--((*))--

తెలుగు భాష దినోత్సవము సందర్భముగా అందిరికి శుభాకాంక్షలు 

"తెలుగులో మాట్లాడండి - తెలుగును బ్రతికించండి "

ప్రాంజలి ప్రభ- 10 

మన: ప్రసాదస్సౌమ్యత్వమో నమాత్మ వినిగ్రహ:1

భావ సంశుద్ది రిత్యేతత్ తప: మానస ముధ్యతే !!మనస్సును ప్రసన్నముగా ఉంచుట, శాంత స్వభావము కలిగి 

ఉండుట, మౌనము అనగా మనన శీలుడై యుండుట, మనోనిగ్రహము, 

శుద్ధమైన భావము కలిగి యుండుట అనే ఇవి మనస్సు చేత 

చేయతగిన తపస్సు అనబడును.  

--((*))--

ప్రాంజలి ప్రభ- 11 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ !
స్వాధ్యాయాభ్యాససం చై  వ వాజ్మయం తప ఉచ్యతే!!

తా: మానవుడు మాట్లాడు మాట వినువారికి దు:ఖమును కాని, క్షోభనుకాని కలిగించ కుండా ఉండ వలెను. ఇంకనూ ఆ మాట సత్యమయినది గాను, ప్రియమైనది గాను, హితమైనదిగాను ఉండ వలెను, ఇట్లే వేదాధ్యయనము యొక్క అభ్యాసమును అనే ఇవి వాచికమైన అనగా వాక్కుచే చేయ దగిన తపస్సు అని చెప్పబడుచున్నది.