4, ఆగస్టు 2017, శుక్రవారం

శ్రీ కృష్ణ లీలలు -2

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ
బాల కృష్ణుడు తల్లి ని గూర్చి ఈవిధముగా చెప్పుట

అమ్మా నన్ను చూస్తే
నీ కేమనిపిస్తుందమ్మా
నీ మాటను దాటే ఏమైనా చేస్తే
నీకు శిక్షించే హక్కు ఉన్నదమ్మా

మనసు  మల్లెపూల తోట
పలుకు తేనెలూరు ఊట
మమత బ్రతికించే బాట
అమృతం పంచె ఆమ్మవు కదమ్మా  
 
బిడ్డకోసం శ్రమించే మాత
అన్నార్తులకు ఎప్పుడు దాత
జీవితానికి దారిచూపే నేత
మనుష్యులకు శాంతి దూత అమ్మా

పనియందు ఎప్పుడూ చూపు ఓర్పు
అది తెస్తుంది మనలో కొంత మార్పు
సమస్యలనుండి తొలగించుటలో నేర్పు
ప్రతి ఒక్కరికి శిరోధార్యం అమ్మ తీర్పే
 
ప్రాంజలి ప్రభ 
ఉరుములు మెరుపులు ఒకవైపు
ఉధృతమైన గాలితో వాణ మరోవైపు
రేపల్లె ప్రాణులు భయ బ్రాంతికి చేరువు
శ్రీకృష్ణుడు అభయమిచ్చి రక్షించే

బాలకృష్ణడు బొటన వ్రేలుతో గోవర్ధన గిరి నెత్తే
బృందావన వాసులందరూచేరి సంత సించే
ఇంద్రుడు కృష్ణునకు మోకరిల్లే శరణుపొందే
స్వామీ నన్నుక్షమించు నీకు నీవే సాటి

మడుగులో కాలీయ సర్పం విర్ర వీగే
గోకులవాస్తవ్యులు వద్దన్నా అందుదిగే
సర్పభంధం వీడి శిరస్సుపై నృత్యము చేసే
నారాయణుడేనని తలచి శరణువేడి వెడలే

సాక్షాత్తు బ్రహ్మ గోవులను బాలురను దాచే
కృష్ణుడే ఒకసంవత్సరము వారివలే తిరిగే
బ్రహ్మా కూడా కృష్ణుని మాయలకు తలఒగ్గే
కంసుడు బలరాములను మృత్యువుకోసం పిలిచే

మధురలో పరమాత్ముని అడుగుకే శోభపెరుగే
ధర్మానికి న్యాయం జరుగునని ప్రజలు భావించే
కృష్ణుని చేతి గ్రుద్దుకే  కంసుడు మరణించే
దైవాన్ని నమ్ముకున్న వారికి శుభం కలిగే   
 --((*))--
  
       

ప్రాంజలి ప్రభ
రెండు మనసుల్ని ఒక టి చేసేది
రెండు వర్గాలను ఒకటిగా కల్పేది
రెండు దేశాల్ని ఒకటిగా మార్చేది
ఇద్దరి మనుష్యులను కలిపేదే స్నేహం

కృతజ్ఞతకు మించినది స్నేహం
స్నేహానికి మించినది కృతజ్ఞత
స్నేహం వలన సహ్రుద్బావ వాతావరణం
ఒకరిపై ఒకరికి ఏర్పడు ఆహ్లాదభరితం

జీవన సౌందర్యాన్ని విపులీకరిస్తూ
ప్రాకృతి వైపరీత్యాన్ని తెలియపరుస్తూ
పంచభూతాలను బట్టి అనుకరిస్తూ
అనుబంధం ప్రేమబంధంగా మార్చేది స్నేహం

స్నేహితుని సమాగమనం సహజ సిద్ధం
కోరికలేని ముల్లును చేరితే యుద్ధం
స్నేహం అనుమానమా మారితే నరకం  
ప్రేమను ఇచ్చి పుచ్చుకుంటే సుఘంధమ్
  
ఒకరి కొక్కరు తోడైతే కొండత ధైర్యం
విజ్ఞానం పంచుకుంటే మనసు ప్రశాంతం
స్నేహానికి కులమతాలకడ్డురాని ప్రపంచం
బంధం వదిలిన ఆస్తిపోయినా వీడనిది స్నేహం 

కృష్ణ కుచేలుని స్నేహం సుస్థిరం
గుప్పెడు అటుకళులకు మోక్షం
సకల ఉపచార గౌరవ పర్వం
స్నేహానికి జీవితాలే సంతర్పణం  
 --((*))--

రాధ కృష్ణునికోసం వేచి ఉంటూ భావం తెలిపే

మహాద్భుతముగా గాలితో
కలసి కనబడకుండా గగుర్పాటు చేయుట ఎందుకు
ఎండలో నావెంట పయనించి
నీడగా నన్ను అనుకరించి అంతలో మాయమౌతావెందుకు

సంద్రపు కెరటం పొంగులా
ఎగసిపడుతూ నావెంట వచ్చి చల్లగా జారుకున్నావెందుకు
అడవిలో కారుచిచ్చులా
నా వెంట పడుతూ చిరుజల్లుకే చల్లబడి పోయా వెందుకు  

నింగి లోన నక్షత్రము లా
నను చూస్తూ, నావెంట వస్తూ, ఇంతలో నాకన్ను దాటావెందుకు
నింగిలోని మేఘము లా
కదులుతూ చిరునవ్వు చూపిస్తూ గాలికే ననుదాటి వెల్లావెందుకు

రాధా నన్ను వెదుకుట ఎలా
నిరంతరమూ నీ మదిలోనే వెలసి ఉన్నాను కదా వేదికు టెందుకు
రాధా నా ప్రాణము అంతయు
నీప్రేమ చుట్టూ తిరుగుటయే ఈ కృష్ణలీలను తెలుసుకో లేవెందుకు

శ్రీ కృష్ణుని చరితము వినుము
ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము
రంగ రంగ వైభవముగా
దేవకీ వసుదేవులకు పెళ్లి చేసి, స్వయాన సారధి వహించగా, ఆకాశవాణి దేవకీ వసుదేవులకు, పుట్టే అష్టమ గర్భము నీ మృత్యువని తెలిపే.
కంసునికి కంటి కునుకు రాదు, ఎవరు ఏమిచెప్పినా బోధపడదు, చేసిన పాపము అనుభవింపక తప్పదు, మృత్యువుని జయించే మార్గాలను వెతకక తప్పదు అని భావించి దేవకీ వసుదేవులకు కారాగారమునందు సకల సదుపాయాలూ కల్పించి పుట్టిన బిడ్డను నాకు అందించాలని హెచ్చరించి. తగిన రక్షక భటులను ఏర్పాటు చేసి చీమ చిటుక్కుమన్న తెలుపమని తెలిపి అజాగర్తగా ఉన్న వారెవరైనా సరే  వారికి మరణదండనమని తెలిపి వెనుతిరిగెను.

కాల గర్భాన సంవత్సరములు దొర్లిపోవు చుండెను. వసుదేవుడు పుట్టిన బిడ్డను కంసునికివ్వడం దేవకీ విలపించటం జరుగుతున్నది, ఆబిడ్డను పైకి ఎగరవేసి కత్తికి బలివ్వడం జరుగుతున్నది, ఈ విధముగా 7 (ఏడుగురిని మగపిల్లలను సంహరించెను).

అష్టమ గర్భము ఇప్పుడా అని అతృతతో కంసుడు ఉండెను, భయముతో రక్షకభటులను హెశ్చరించెను,

శ్రీ కృష్ణుని చరితము వినుము
ఆ దేవదేవుని కొలిచి మోక్షము పొందుము