4, ఆగస్టు 2017, శుక్రవారం

: శ్రీకృష్ణ లీలలు -1


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:శ్రీ కృష్ణాయనమ:


ప్రాంజలి ప్రభ (రాధ కృష్ణ లీల -1) 
"గోవిందా" గోవిందా

ఊహల ఊయల సడిలో
ఆకలి ఆరాట మదిలో
తియ్యని తలపుల తడిలో
నీరూపే నా మదిలో నిలిచింది 

లతలా అల్లుకోవాలని
పరిమళాలందించాలని
విరిసిన పువ్వగా ఉండాలని
నీ తలుపు నన్ను పులుస్తున్నది

కురిసేను విరిజల్లులు
మెరిసెను హరివిల్లు సౌరభములు
నాట్యమాడెను మయూరములు
నామది ఆనందంతో ఉన్నది
 

మదిలో నిండే మధుర భావాలు
పెదాలు పలికే మధుర గీతాలు
నాలో చెరగని నీ ప్రతి రూపాలు
అడుగుల సవ్వడికే పరవసిస్తున్న ముకుందా

నీ మధుర పావన తలపులు
ఈ రాధను వరించే కళలు
అందుకో పూల మకరందాలు
ఆదుకో ఆరాధించి
న  వారిని గోవిందా

--((*))--

ప్రాంజలి ప్రభ 
భక్తులు శ్రీకృష్ణుని ఈవిధంగా ప్రార్ధించుతున్నారు 

అంతర్మధనానికి అర్ధం ఏమిటో 
ఆంత రంగాల భావ మేమిటో
అనురాగ బంధాల భేదమేమిటో 
మాకు తెలపవయ్యా కృష్ణయ్యా 

కాలమార్పుకు అవసర మేమిటో
కాపురానికి కాంచనానికి ప్రమఏమిటో
కాని దవుతుంది, అవ్వాల్సింది కాదేమిటో 
మాకు తెలపవయ్యా బాల కృష్ణయ్యా 

అకాల వర్షాలకు కారణాలేమిటో 
ఆత్మలకు తృప్తి కలుగుట లేదేమిటో
ఆకలి మనిషికి తగ్గకున్నదేమిటో 
మాకు తెలపవయ్యా ముద్దులకృష్ణయ్యా 

గాలిలో మాటలు తరలి వస్తున్నాయేమిటో 
గాఁపు లేకుండా ప్రార్ధించినా కరుణించవేమిటో 
గిరి గీసినా దాటివచ్చి మనిషి ప్రశ్న లేమిటో       
మాకు తెలపవయ్యా గోపాల కృష్ణయ్యా 

చిత్తశుద్ధి కల్పించి నిగ్రహాన్ని ఇవ్వవేమిటో 
చింతలు తొలగించి ఐక్యత్వజ్ఞానమివ్వమేమిటో
చిరునవ్వులతో జితేంద్రియత్వము కల్పించవేమిటో 
మాలో తప్పులు తెలపవయ్యా మువ్వగోపాలయ్యా 

ఇంద్రియసుఖములందలి ఆసక్తిని విడువలేకున్నావేమిటో 
కర్మల యందలి అభిమానము వదలి లేకున్నావేమిటో 
సమస్త వాసనలను, సుఖాలను మరువలేకున్నావేమిటో 
మాతప్పులు మన్నించి నీలో ఐక్యం చేసుకో కృష్ణయ్యా    


ప్రాంజలి ప్రభ

కన్నెల మనసు సుతారం
రంజిల్లును నిత్య సుకుమారం
రంగు బంగారం, రసరమ్య సౌభాగ్యంతో
రమా రమ మనసు నర్పించే శ్రీకృష్ణకు

తాంబూల పెదాల ఎరుపు దనంతో
వంటిమీద పుత్తడిపూత మెరుపుతో 
వెన్నెల వెలుగులో కళ్ళ చూపులతో
కవ్వించి నవ్వించి సంతోషం పంచె శ్రీకృష్ణకు   

ఆనందపు మాటలన్ మిపుల నందపు టాటాలన్
బాటలాన్ ముద మందంచుచు సుఖంబులన్
సందియము ఏమి లేక సర్వంబు అర్పించుటకున్
పోటీపడి ప్రియంబు కల్పించే కన్యలు బాలకృష్ణకు

లలిమనోహర రూప విలాస హావా భావములచే
యతిశయాను భవవిద్యా గోచర పరమార్ధముచే
గాత్ర కంపన గద్గదా లాపవిధులవయ్యారములచే  
కన్యలందరు నింపారు గాచి ప్రేమను పంచె శ్రీకృష్ణకు 

__((*))--    
ప్రాంజలి ప్రభ  

చిరు  నగవుల  చిన్మయ రూపం
చింతలు తొలగించే విశ్వరూపం 
చంచలాన్ని తొలగించే రూపం 
చిరస్మరణీయులకు దివ్య రూపం 

ఆత్మీయుల ఆదుకొనే ఆదర్శ రూపం   
అంధకారాన్ని తొలగిన్చే రత్న రూపం 
అక్షయ పాత్ర నందించిన రూపం 
అన్నార్తులను ఆదుకొనే రూపం 

ఉజ్వల భవషత్తును చూపే రూపం 
ఉత్తేజాన్ని శాంతపరిచే రూపం 
ఉన్మత్త, అప్రమత్తలను మార్చేరూపం
ఉషోదయ వెలుగును పంచె రూపం 

దృఢసంకల్పాన్ని పెంచే రూపం 
దుష్టత్వాన్ని అరికట్టే రూపం 
దుర్మార్గులను సంహరించే రూపం 
దు:ఖాలను దరి చేర నీయని రూపం  

పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపం
అపరిమితానంద హాయిగొలిపే రూపం
ఆత్మా పరమాత్మా యందె లగ్న పరిచే రూపం
అఖిలాండకోటికి ఆనందం పంచే శ్రీ కృష్ణ రూపం

ప్రాంజలి ప్రభ

అమ్మా యశోదమ్మా
అల్లరి తట్టుకోలేకున్నామమ్మా
ఆలూమగలమధ్య తగువులమ్మా
ఆ అంటే ఆ అంటూ పరుగెడుతాడమ్మా

పాలు, పెరుగు, వెన్న, ఉంచడమ్మా
పాఠాలు నేర్పి మాయ మౌతాడమ్మా
పాదాలు పట్టుకుందామన్న చిక్కడమ్మా
పాదారసాన్ని అయినా పట్టుకోగలమామ్మా
కానీ కృష్ణుడి ఆగడాలు ఆపలేకున్నామమ్మా

అల్ల్లరి చేసినా అలుపనేది ఎరుగని వాడమ్మా 
ఆడపడుచులతో ఆటలాడుతాడమ్మా
ఆశలు చూపి అంతలో కనబడడమ్మా
అల్లరి పిల్లలతో చేరి ఆడుతాడమ్మా

తామరాకుమీద నీటి బిందువుల ఉంటాడమ్మా
వజ్రంలా మెరిసే కళ్ళతో మాయను చేస్తాడమ్మా
మన్ను తింటున్నాడు ఒక్కసారి గమనించమ్మా
బాల కృష్ణ నోరు తెరిచి చూస్తే తెలుస్తుందమ్మా

అమ్మ చూడమ్మా వాళ్ళ మాటలు నమ్మకమ్మా
సమస్త సుఖాలకు కారణం పుణ్యం కదమ్మా          
పాపం చేసిన వారికి దుఃఖం వాస్తుంది కాదమ్మా    
నా నోరుని చూడమ్మా ఏమి తప్పు చేయలేదమ్మా

కృష్ణుని నోటిలో సమస్తలోకాలు చూసింది యశోదమ్మా 
ఆనంద పారవశ్యంతో మునిగి పరమాత్మను చూసిదమ్మా 

ముద్దుగారే యశోదముంగిట ముత్యము
ప్రార్ధించిన వారికి మన:శాంతి నిత్యము
ఓర్పుతో ప్రార్ధిస్తూ చేయాలి పత్యము
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము

ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు
శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు
వాక్చాతుర్యంతో మనస్సును  ఆకర్షించు
శ్రీకృష్ణుని పలుకులు ఎప్పుడు సత్యము