5, జనవరి 2017, గురువారం

మనోహరి

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

మనోహరి (చందస్సు ) 
UUUU-IIUU-UIIU (కొత్తవృత్తము )

మందారం లా విరబూసే నా  తనువూ  
సిందూరం లా తనువంతా ఓ మెరుపూ
నీ చూపే  నా మనసంతా ఓ కుదుపే 
సిగ్గాయే  నా కలలో నీ స్పర్శ లతా    

సింగారం లా మరుగొల్పే నీ మనసే   
నాంచారీ లా ఉసిగొల్పే నీ సొగసే 
బంగారీ  లా మెరుపుల్తో  నీ తనువే 
వయ్యారి లా నడకల్తో  నీ నడుమే 

ఉద్వేగం చెందుట శృంగారం వలనా 
రాద్ధాంతం చేయుట ప్రేమావల్లె కదా 
సందేహం తీర్చుట సంతోషం వలనా 
 ఉద్దేశ్యం  మంచిది చెల్మి వల్లె కదా

ఊహల్లో ఊపుల వయ్యారం చెసే   
రాగాలు పువ్వుల ముద్దూలే చెసే 
అద్దంలా నవ్వితె నవ్వుల్తో  చెసే  
ఈజన్మే మాధవు సొంతంలా చెసే 

--((*))--