26, డిసెంబర్ 2016, సోమవారం

Inernet Magazine for the month of 12/2016/48

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 సర్వేజనా సుఖినోభవంతు 


*ప్రకృతినీ అదుపులో ఉంచే  శ్రీ  వేంకటేశ్వరా-12

గళసీమను మూడు రేఖలు కలిగి ఉండి  
రూపు రేఖలు అపు రూపం కలిగి ఉండి 
జ్ఞాన వాపికలో స్నానము చేసి ఉండి 
శేష పాన్పు పై ఉన్న భర్తను పూజించే 

తేలిక కన్నులు చూపులు కలిగి ఉండి 
ఉన్నతం అవుతున్న వక్షస్థల ముండి 
ముంజేతి కంకణాల తో కడియాలుండి 
సౌభాగ్య లక్ష్మి సుశీల భర్తను పూజించే 

రూప లావన్యాల చేత మోహితుడై ఉండి 
నిండు వన్నెల కప్పబడిన పాన్పు ఉండి
సమీర పవనాలు మనసు తాకుతూ ఉండి 
శ్రీదేవిని పరవశంతో చేరే శ్రీ వేంకటేశ్వరా

ప్రేమతో ఆలపించే వారి ప్రేమను తీర్చి 
భాదతో ఆలపించే వారి భాదను తీర్చి 
సమయాను సారంగా మనుష్య బుద్ధిని మార్చి
ప్రకృతినీ అదుపులో ఉంచే  శ్రీ  వేంకటేశ్వరా  
  
--((*))--
*ధనం 

ప్రపంచం లో జన జీవనాన్ని 
ప్రభంజనంలా చుట్టు ముట్టే
ఇంధనమే .. ధనం

నలుపని, తెలుపని, కలుపని 
పలురకాల ..... ధనం 

వాణిజ్యంబున, వస్తు మార్పిడిన 
నిత్యావసరాల ...... ధనం 

భువిలో మూలం ధనం
సిరి  కలిగి  ఉన్న  శుభం  
సిరి సంపాదనలున్న సుఖం    

ధనమే మైత్రిని    తెచ్చున్ 
ధనమే వైరమున్    తెచ్చున్ 
ధనమే సభలను ఘనత కూర్చున్

ధనం వళ్ళ వ్యామోహం 
ధనం వళ్ళ వ్యసనం
ధనాశకు పొతే హానికరం

ధన  లక్ష్య  దానం  
ధన లక్ష్యం  భోగం
ధన దాపరికం విరుద్ధం 

అర్ధం లో ఉంది పరమార్ధం 
ధనార్జనలో ఉంటె అనర్ధం 
క్షణం క్షణం జ్ఞానం 
కణం కణం ధనం 

ఆశకు పోకు  ఓ  మనిషి  
ఎంత ధనం ఉన్న ఆకలికి 
తినేది లవణ  అన్నమే 
ధనం తినలేము - 
ధనమేరా ఈ జగత్తుకు మూలం 
ఆకలిని తీర్చేది ధనమేరా  
--((*))--

*అందం ఆనందం 

నాలో అందాలు ఇన్ని ఉన్నాయా 
హుందాగా నిలుచున్నా కానరావు   
నీడ అంత  అందముగా ఉన్నదా

కమలాల మధ్య జలములో 
కదులుతూ కమలమన్నట్లుగా ఉన్నదా 
ఉషోదయానికి  విచ్చే పువ్వులాగా
ముఖారవిందం విప్పరిందా 

భూమిని తవ్వితే జల మూరినట్లుగా 
అందాన్ని చూస్తే నోరు ఊరును కదా
 కన్నె సొగసుల అందాలకు 
దాసోహం కానీ వారు లేరుకదా 
వ్యామోహం చెందని వారు లేరు కదా 

ప్రకృతి వరాన్ని అందుకొని 
ప్రపంచాన్నే లొంగ దీసుకొనే 
శక్తి అందానికి ఉంది కదా 
అందం కొందరికి ఆనందం 
మరి కొందరికి అనర్ధం తెస్తుంది కదా 
లేత సొగసుల అందం ఒక రకం 
మధ్య వయసు అందం మరో రకం 
వృద్ధాప్యం లో పంచుకున్న బంధం
ఆదరణ చూపిన బంధం 
నిజమైన అందం ఆనందం 
--((*))--   
Image may contain: bird, sky, outdoor, nature and water
*బ్రతికించుదాం జ్ఞానమార్గం 

నింగికి అందం మేఘం 
మేఘం సంబరం జన జీవం 

నింగికి నాదం బ్రహ్మ వరం 
మానవ జీవం వర్షాల మయం

నింగిలో భాగం సూర్య బింబం 
ప్రపంచానికే వెలుగుల దీపం 
మానవాళికి అదే ఉషోదయం 

నింగికి నళిని మారో అందం
తారలు శశి రాకతో పరమానందం
  
నిశిధంలో కనిపించే ప్రకృతి అందం 
మానవాళికి వెన్నెల సౌరభాలు పులకితం 

చీకటి పరిపూర్ణ ఆనంద పరవశం 
క్రియాశీలక చైతన్యానికి ఇది ఒక వరం 
వరం తో పొందుతాం విరామం      
విరామంలో పొందుతాం ఉత్తేజం 
ఉత్తేజమే అందరికి శ్రేయస్కరం 

రేయిలో జరుగు కిరాతకులు సమ్మేళనం 
దౌర్జన్యాలా  పోరాటాలకు  ఆలయం 
పగలు జాగృతి రేయి చీకటి సామ్రాజ్యం 
అంధకారామ్ ఓటమి వైరస్యాలకు కారాదు స్థావరం  

తిమిరాన్ని పారద్రోలే విధి నిర్ణయం ఆనందం 
వెలుగుల ఆశా దీపం కనిపించని సుఖం 

నలుపు తెలుపుల మేలి కలయక వలయం 
మనస్థత్వాల ఆకర్షణ చీకటి ప్రపంచం 
అంధకార విరామమే అందరికి కాల చక్రం 
నూతన శక్తికి ఉత్సాహా ఉత్థతేజ బలం 
చీకటియే సృష్టి వెలుగుకు జీవన మార్గం      

చీకటిని ఆహ్వానిద్దాం
రమ్యానుభవం పొందుదాం 
అనుభవాల మమేక మైకం రమణీయం   

ఆత్మ దీపం వెలిగించుదాం 
తమస్సును తరిమి వేద్దాం 
బ్రతికించుదాం జ్ఞానమార్గం 

"తమసోమా జ్యోతిర్గమయా "
అన్నది హిందూమత ప్రబోధం 
--((*))--
Image may contain: text


*మేలుకొలుపు (ఛందస్సు ) 

ప్రణమిల్లుతున్నా ప్రకృతికి
సుప్రబాతమన్నా అందరికి 
సమభావమన్నా  ఆహ్లాదమె
నవతా వెలుగే  జాగృతికి  

నింగిలోని వెలుగు - పసిడి బంగారం
వెన్నెలంత తెలుపు - నలుపు కమ్మేనే
సంతసంతొ మెరుపు - నిశిధి సంబారం
మేలుకో ఉదయము - పక్షుల శబ్దాలే    

వెన్నెలద్దుకున్న ప్రభాత పరిచయం 
రంగులద్దుతున్న సరాగ పరిణయం  
రెక్కవిచ్చుకున్న గులాబి పరిమళం 
ఊపిరే సుకున్న  ఉషోద కిరణ మే 

ఆశల నావలో పయనించాలని
ప్రేమల బాటలో ఉదయించాలని
రేతిరి  చీకటీ మాయమోవ్వాలని 
నవ్వుల వెలుగు  కిరణస్పర్శలని 

--((*))--