14, డిసెంబర్ 2016, బుధవారం

ప్రేమరాగం (ఛందస్సు )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు  

IIU UU -IIU IUU (juutala )
ప్రేమరాగం (ఛందస్సు )

నవరాగాలే - మనసంతా చేరే 
మదిలో వేడీ -  తనువంతా కాగే 
కురులే విచ్చే - లాతలంతా కొప్పే 
మరులే గొల్పే - వయసంతా కమ్మే 

కలవా లంటే - కలువేల రాదే 
పిలవాలంటే -  చనువేది లేదే
అరవాలంటే -   కరిచేది కాదే
మెరవాలంటే - చినుకేది లేదే

మనువాడాలే - మదిలో భయాలే 
అను భావాలై - మనసంత పొంగే 
తనువే ఇచ్చా - తరుణం సరాగా
లతొసంగీతం - కదిలే వసంతం 

చిరునవ్వుల్తో - మనసైన వాడ్ని
వలలో కైనా - పడె టట్టు చేయూ 
కల దక్కాకా - మనప్రేమ లన్నీ
కురుపించాలే - మరుగొల్పువేళా

తలవాల్చకే - తలవంపు తేకే
మనవాళ్ళకే - మనసంత కష్టం 
మనసైన వాడ్ని - మనువాడి ప్రేమా 
అను సంధానం - బ్రతుకంత ఇస్చే
--((*))--  
           
trupta తప్త - 

పాదమునకు 20 మాత్రలు ఈ కల్పానా వృత్తములో. మొదటి భాగములో రెండు పంచమాత్రలు కాని ఒక దశమాత్ర. రెండవ భాగములో రెండు పంచమాత్రలు. క్రింద నా ఉదాహరణములు - 

తప్త - స/భ/త/త/గ 
13 అతిజగతి 2356 

IIU UII UUI UUI U -13

మనసే అల్లిన వేదాంగ భావాలు గా 
వయసే విప్పిన పుష్పా0గ కోర్కేలు గా 
తనువే ఎప్పుడు సాహిత్య సంగీత గా 
ప్రేమయే ఇప్పుడు సద్బావ సంతోషగా 

వినుటే వింతలు - చూడాలి అర్దాలుగా 
మలుపే మాయలు - మందిర భాష్యాలుగా 
పరువే ప్రేమల  - సంసార సంతోషి గా 
మగువే సేవల - శృంగార వేషాలు గా 

కలలో కమ్మని -చిత్రాలు చూసేను గా 
చలిలో కౌగిలిలో - జక్కగా  వెచ్చ గా  
కురులే విచ్చెను - కళ్ళల్లొ  గమ్మత్తు గా 
మరులే కొల్పెను - పంతాలు విద్దూరంగా  

కదిలెన్ నా మదిలో - గమ్మగా గీతికల్
మెదిలెన్ నా కలలో - వేగమే రమ్మురా 
కరముల్ నీ వలలో - చిక్కెనే మత్తుకే 
వెలిగించన్ దివెలన్ - వేగమే రమ్మురా
  
--((*))--